Thursday 19 November 2015

కార్తీకపురాణం 18 వ అధ్యాయము

18 వ అధ్యాయము

స త్క ర్మ నుష్టా న ఫల ప్రభావము
" ఓ ముని చంద్రా! మీ దర్శనము వలన ధన్యుడ నైతిని సంశయములు తిరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడ నైతిని. తండ్రి- గురువు-అన్న-దైవము సమస్తము మీరే, నా పూర్వ పుణ్య ఫలితా ము వలెనే కదా మీబోటి పుణ్య పురుషుల సాంగథ్యము తటి స్థిం చేను. లేనిచో నెను మహా పాపినయి మహా రణ్య ములో ఒక మొద్దు బారిన చెట్టు ని యుండగా, తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీ కారణ్యములో తర తరాలుగా చెట్టు రూపమున  వుండవలసినదే  కదా! అట్టి! నేనెక్కడ! మీ దర్శన భాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పూనా ఫల ప్రదయియగు యీ కార్తీక మాస మెక్కడ! నాకు పాపత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించు టెక్కడ? యివి యన్నియును దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన, నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మనవుడెట్లు అను సరించ వలయునో, దాని ఫల మెట్టి దో విశ దీకరింపు"డని ప్రార్ధించెను.
" ఓ ధనలోభా! ణి వాడడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి వుపయోగార్ధ మైనట్టివి కాన, వివరించెదను శ్రద్దగా అలకిన్పుము ప్రతి మనుజుడు ఆ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన శున్యుడగు చున్నాడు. ఈ భేదము శరీరమునాకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్మర్మలు చేయవలెనని, సకల శస్త్రములు ఘోషించు చున్నవి. సత్కర్మ  నాచరించి వాటి ఫలము పరమేశ్వ రార్పిత మనరించిన జ్ఞానము కలుగును. మానవుడే, జాతి వాడో, ఎటువంతి కర్మలు ఆచరించావలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణో దయ స్నానము చేయక, సత్కర్మల నచారించినను వ్యర్ధ మగుఉన్. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించు చుండగాను విషక మాసములో సూర్యుడు మేష రాశిలో ప్రవేశించు చుండగాను, మాఘ మాసములో సూర్యుడు మకర రాశి యందుండ గాను అనగా ణి మూడు మాసముల యంద యిననూ తప్పక నదిలో ప్రాతః కాల స్నానము  చేయవలెను. అతుల స్నానము లాచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంట ప్రాప్తి కలుగును. సూర్య చంద్రా గ్రహణ సమయములండును తదితర పుణ్యదినముల యందు, స్నానము చేయవచ్చును. ప్రాతః  కాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్య సమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మ బ్రష్టుడగును.
కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించ రించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమన తీ ర్ధములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితూగు సుఖమునూ, ధర్మముతో సమానమైన మిత్రుడనూ, శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేదని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంట మునకు పోవుదురు." అని అంగీరసుడు చెప్పగా విని మరల ధన లోభు దితుల ప్రశ్నించెను.
ఓ ముని శ్రేష్టా! చతుర్మా స్య వ్రతమని చెప్పితిరే! ఏ కారణం చేత డని నాచరించ వలెను? ఇది వర కెవ్వ యిన ణి వ్రతమును ఆచరించి యున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి?  విధానమేట్టిది? సవిస్తర౦గా విశదికరింపు'డని కోరెను. అందులకు అంగీ రసుడి టుల చెప్పెను." ఓయీ! వినుము చతుర్మా స్య వ్రతమనగా సతి మహా విష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పల సముద్రమున శేషుని పాన్పు పై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ నలుగు మాసములకే చతుర్మా స్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి' శయన ఏకాదశి' అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి ' అనియు, ఏ వ్రతమునకు, చతుర్మా స్య వ్రాతమనియు పేరు ఈ నలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన,  దన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పుణ్య ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహా విష్ణువు వలన తెలిసి కొంటిని  కాన,  ఆ సంగతులు నీకు తెలియచేయు చున్నాను".
తొల్లి కృత యుగంబున వైకుంట మందు గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత సేవింప బడుచున్న శ్రీ మన్నారాయణుడు లక్షి దేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి అడ్మ నేత్రు౦ డను, చతు ర్బాహు౦ డును, కోటి సూర్య ప్రకాశ మాముండును అగు శ్రీ మన్నారాయ ణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి యుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏవి ఏమియు తెలియ నివాని వలె మంద హాసముతో నిట్లనెను." నారదా! నీవు క్షేమమే గదా! త్రిలోక సంచారి వైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్క ర్మా నుష్టా నములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? ప్రపంచమున నే అరిష్ట ములు లేక యున్నవి కదా? ' అని కుశల ప్రశ్న లడిగెను. అంత నారదుడు శ్రీ హరికీ అది లక్ష్మి కీ నమస్కరించి " ఓ దేవా! ఈ జగంబున ని  వేరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపు మనుటచే విన్నవించు చుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు- మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తు లగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడ దనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు, అవి పూర్తి గాక మునుపే  మధ్యలో మని వేయుచున్నారు. కొందరు సదచారులుగా, మరి కొందరు అహంకార సాహితులుగా, పర నిండా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యత్ముల నొనర్చి  రక్షింపు'మని ప్రార్ధించెను. జగన్నా టక సూత్ర ధారు డ యిన శ్రీ మన్నారాయణుడు కలవార పది లక్ష్మి దేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహ్మణా రూపంతో ఒంటరిగా తిరుగు  చుండెను. ప్రపంచ మంటను తన దయా వ లోకమున వీక్షించి రక్షించు చున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించు చుండెను. పుణ్య నదులు, పుణ్య శ్రమములు తిరుగు చుండెను. ఆ విధముగా తిరుగు చున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని యె గ తాళి చేయు చుండిరి. కొందరు " యీ ముసలి వానితో మనకేమి పని" యని ఊరకు౦డిరి కొందరు గర్విష్టులైరి మరి కొందరు కమార్తులై శ్రీ హరిణి కన్నేతి యైనను చుడకుండిరి. విరందిరిని భక్త వత్స లుడగు శ్రీ హరి గాంచి " విరి నేతలు తరింప జెతునా? " యని అలోచించుచు, ముసలి బ్రాహ్మణా రూపమును విడిచి శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలా ద్యలం కార యుతుడై నిజ రూపమును ధరించి, లక్ష్మి దేవితో డను, భక్తులతో డను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్య మునకు వెడలెను. ఆ వనమందు తపస్తు చేసుకోను చున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరు దెం చిన  సచ్చిదానంద స్వరుపుడగు శ్రీ మన్నారయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి అది దైవములగు నా లక్ష్మి నారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.
శ్లో|| శాంత కారం! భజగా శయనం ! పద్మ నాభం! సురేశం!
విశ్వా కారం! గగన సదృశం ! మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మి కాంతం ! కమల నయనం! యోగి హృద్ద్యాన గమ్యం!
వందే విష్ణు! భవ భయ హారం! సర్వ లోకైక నాథం||

శ్లో|| లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగ దామేశ్వరీం
దాసి భూత సమస్త దేవా వనితాం లోకైక దీపంకురాం
త్వాం త్రైలోక్య  కుటుంబిని౦ శర సిజాం వందే ముకుంద ప్రియం||
ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి
అష్టా ద శా ధ్యాయము- పద్దె నిమిదో రోజు పారాయణము సమాప్తం.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles