Thursday 19 November 2015

కార్తీకపురాణం 20 వ అధ్యాయము

20 వ అధ్యాయము
పురంజయుడు దురాచారుడా గుట
జనక మహారాజు, చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో " గురువర్యా! కార్తీక మాస మహాత్మ్యమును యింక ను విన వలయును నెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని వుదాహరణలు వినిపించి నన్ను కృతార్దునిగా జేయు" డనెను. అ మాటలకు వశిష్టుల వారు మంద హాసముతో " ఓ రాజా! కార్తీక మాస మహాత్మ్యము గురించి అగస్త్య మహాముని, అత్రి మునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదరు ఆలకించు" మని అ కథా విధానమును యిట్లు వివరించిరి. పూర్వ మొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి" ఓ అత్రి మహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టి నావు. కార్తీక మహాత్మ్యమును నీకు ఆ ములాగ్రమున తెలియును, కాన దానిని నాకు వివరింపుము" అని కోరెను. అంత "ఓ అత్రి మహామునీ! నీవు విష్ణువు అంశ యందు బుట్టి నావు. కార్తీక మాస మహాత్మ్యము నీకు ఆ మూలాగ్ర ముగా తెలియును, కాన దానిని నాకు వివరింపుము " అని కోరెను. అంత అత్రిమహముని "కుంభ సంభ వా! నీ వడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రితికరముగుటచే నుత్త మమయిన ది. కార్తీక మాసముతో సమాన ముగ మాసము. వేద ముతో సమాన మగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటి యగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమును నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధ న చేసిన ను, లేక దీ పదానము చేసిన ను గలుగు ఫలితము అపార ము. ఇందుకొక యితిహాసము వినుము. త్రే తాయుగా మును పురంజయుడ ను సూర్య వంశ పురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను.
అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టభి షి క్తుడై న్యాయముగా రా జ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యా పదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంత కాలమునకు పురంజయుడు అమిత ధ నాశ చేతును, రాజ్యాధి కార గర్వముచెతను జ్ఞాన హినుడై దుష్ట బుద్ది గలవాడై దయాదాక్షి ణ్యములు లేక దేవ బ్రాహణ మాన్యములు లాగుకొని, పరమలోభి యై, చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్ల గొట్టుకొని వచ్చిన ధనములో సగమువాటా తీ సికోనుచు ప్రజలను భి తావ హులను చేయుచుండెను. ఇటుల కొంత కాలము జరుగగా అతని దౌష్ట్య ములు నలుదిక్కులా వ్యాపించెను. ఈవార్త కాంభో జ రాజును నాయకునిగా చేసుకోని రధ, గజ, తురగ, పదాతి సైన్య బలా న్వితులైర హస్యమార్గ ము వెంట వచ్చి అయోధ్య నగర మును ముట్టడించి, నలు వైపులా శిబిరములు నిర్మించి నగర మును ది గ్భ౦ధముచేసి యుద్ద మునకు సిద్ద పడిరి.
అయో ధ్యా నగరమును ముట్ట డి ౦చిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడా సర్వ సన్నద్దు డై యుండెను. అయిన ను యెదుటి పక్ష ము వారధి కబలాన్వితులుగా నుండుటయి తాను బలహినుడుగా నుండుటయు విచారించి యే మాత్రము భితి చెందక శాస్త్ర సమన్విత మైన రాథ మెక్కి సైన్యాధ పతులను పూరి కొల్పి, చతురంగ బల సమేత మైన సైన్యముతో యుద్ద సన్నద్దు డై - న వారి ని యెదు ర్కొన భేరి మ్రోగించి, సింహనాద ము గావించుచు మేఘములు గర్జించునట్లు హు౦కరించి శత్రు సైన్యములు పైబడెను.
ఇట్లు స్కాంద పురాణాతర్గ త వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి వింశాద్యాయము-
ఇరవ య్యోరోజు పారాయణము సమాప్తము.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles