Thursday 19 November 2015

కార్తీకపురాణం 23 వ అధ్యాయము

23 వ అధ్యాయము
శ్రీ రంగ క్షేత్రమున పురంజయుడు ముక్క్తి నొందుట
అగస్త్యుడు మరల అత్రి మహర్షి ని గాంచి" ఓ మునిపుంగ వా! విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు" మని యడుగ గా అత్రిమహాముని యిట్లు చెప్పిరి- కు౦భ సంభవా! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలో పేతుడై అగ్ని శేషము, శత్రు శేషము వుండ కూడదని తెలిసి, తన శత్రు రాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను తన యొక్క విష్ణు భక్తీ ప్రభావమువలన గొప్ప పరాక్ర మవంతుడు, పవిత్రుడు, సత్య దీక్షత త్పరుడు, నితాన్న దాత, భక్తి ప్రియవాది, తేజో వంతుడు, వేద వె దా౦గ వేత్త యై యుండను. మరియు అనేక శత్రువులను జయించి దశది శలా తన యఖ౦డ కీర్తిని ప్రసరింప చేసెను. శ త్రువులకు సింహ స్వప్నమై, విష్ణు సేవాధురంధ రు డై, కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడ గెత్తి అరి షడ్వర్గ ములను కుడా జయించిన వాడైయుండెను. ఇన్ని యేల? అతడి ప్పుడు విష్ణు భక్తా గ్రే సరుడు, సదాచార సత్పు రుషులలో వుత్త ము డై రాణించుచుండెను. అయిన ను తనకు తృప్తి లో దు. ఏ దేశమున, యే కాలమున, యే క్షేత్రమున యేవిధ ముగా శ్రీ హరి ని పూజించిన కృతార్దుడ నగుదునా? యని విచారించుచుండ గా ఒకానొక నాడు అశరీర వాణి" పురంజయా! కావేరీ తీరమున శ్రీ రంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠ మని పిలిచెదరు. నీ వచట కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము.
నీ వీ సంసార సాగర మున దాటి మోక్ష ప్రాప్తి నొందుదువు" అని పలికెను. అంతటా పురంజయుడు అ యశిరీర వాణి వాక్యములు విని, రాజ్య భారమును మంత్రులకు అప్పగించి, సపరి వార ముగా బయలుదేరి మార్గ మద్య మున నున్న పుణ్య క్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్య నదులలో స్నాన ము చేయుచు, శ్రీరంగ మును జే రుకొనెను. అక్కడ కావేరీ నది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్నశ్రీ రంగ నాథాలయమున శే షశయ్య పై పవళించియున్న శ్రీ రంగనాథుని గాంచి పరవశ మొంది, చేతులు జోడించి, " దామోద రా! గోవిందా! గోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా!అనంతా! అచ్యుతా! ముకుందా! పురాణపురుషా! హృషి కేశా! ద్రోపది మాన సంరక్ష కా! ధీ న జన భక్త పొ షా ! ప్రహ్లా ద వ ర దా! గరుడ ధ్వజా ! క రి వ ర దా! పాహిమాం! పాహమాం! రక్ష మాం రక్ష మాం! దాసోహం పర మాత్మ దాసోహం"యని విష్ణు సోత్త్ర మును పఠించి, కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గది పిత దుపరి సపరి వారు ముగా అయోధ్య కు బయలు దేరును. పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల, మహిమవలన అతని రాజ్యమందలి జనులంద రూ సిరి సంపదలతో , పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి. అయో ధ్యానగరము దృఢ తర ప్రకార ములు కలిగి తోరణ యంత్ర ద్వార ములు కలిగి మనో హర గృహాగో పురాదులచో చతురంగ సైన్య సంయుత మై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగర మందలి వీరులు యుద్ద నేర్పరు లై, రాజనీ తి గలవారై, వైరి గర్భ నిర్భదకులై, నిరంతరము విజయశిలు రై, అప్రమత్తు లై యుండిరి. ఆ నగర మందలి అంగ నామణులు హంసగ జగామినులూ, పద్మ పత్రా యత లోచ నులూ నై విపుల శో ణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మద్యత్వము; సింహకుచ పినత్వము కలిగి రూపవతులనియు, శీ లవతులనియు, గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి. ఆ నగర మందలి వెల యాండ్రు నృత్య గీత సంగీతాది కళావిశారద లై, ప్రాఢ లై, వ యోగుణ రూప లావణ్య సంపన్న లై, సదా మోహన హసాలంకృత ముఖిశో భి త లై యుండిరి. ఆ పట్ట ణకులాంగ నలు పతిశు శ్రూషా పారాయణలై సద్గు ణాలంకార భూషిత లై చిద్వి లాస హసోల్లాస పులకాంకిత శరీర లై యుండిరి.పురంజయుడు శ్రీ రంగ క్షాత్ర మున కార్తిక మాసవ్రత మాచరించి సతీ సమేతు డై యింటి కి సుఖిముగా జే రేను. పురంజయుని రాక విని పౌర జనాదులు మంగళ వాద్య తుర్య ధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంత: పురమును ప్రవేశ పెట్టిరి. అతడు ధర్మా భి లాషి యై దైవ భక్తి పరాయుణుడై రాజ్యపాలన మొన ర్చుచు, కొంత కాలము గడిపి వృద్దా ప్యము వచ్చుటచే ఐహిక వాంఛ లను వాదులు కొని, తన కుమారునికి రాజ్య భారము వప్పిగించి పట్టాభి షీకూ నిచేసి తను వాన ప్ర స్థా శ్రమ మందు కూడా యే టే టా విధి విధాన ముగ కార్తీక వ్రత మాచరించుచు క మక్ర మముగా శరీర ముడుగుటచే మరణించి వైకుంఠ మునుకు పోయెను. కావున, ఓ యగ స్త్యా! కార్తీక వ్రతము అత్యంత ఫల ప్రద మైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించ వలను. ఈ కథ చదివిన వారికి, చదివినపుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును.
ఇట్లు స్కంద పురాణాoతర్గ త వశిష్ట ప్రోక్త కార్తిక మాహత్య మందలి 
త్ర యోవింశో ద్యాయము - ఇర వైమూడో రోజు పారాయణము సమాప్తము

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles