Thursday 19 November 2015

కార్తీకపురాణం 26 వ అధ్యాయము

 26 వ అధ్యాయము
దూర్వాసుడు శ్రీ హరి ని శరణు వేడుట - శ్రీ హరి బోధ
ఈ విధ ముగా అత్రిమహముని అగస్త్యునితో - దుర్వాసుని కో పమువల్ల కలిగిన ప్రమాద మును తెలిపి, మిగిలన వృత్తంత మును ఇట్లు తెలియజే సేను. ఆవిధ ముగా ముక్కోపి యైన దూర్వాసుడు భూలో కము, భువర్లో కము, పాతాళ లోకము, సత్యలో కములకు తిరిగి తిరిగి అన్ని లో కములలో ను తనను రక్షించువారు లేక పోవుటచె వైకుంఠ ముందున మహా విష్ణువు కడకు వెళ్లి " వాసుదేవా! జగన్నాధా! శరణాగత రక్షణ బిరుదాంకి తా! రక్షింపుము. నీ భక్తు డైన అంబరీ షున కు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడా ను గాను. ముక్కో పినై మహాపరాధ ము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడ వు . బ్రాహ్మణుడైన భగు మహర్షి నీ యురము పైత నిన్న ను సహించితివి. అ కాలిగురుతు నెటికి నీ నీ వక్ష స్దలమందున్నది. ప్రశాంత మన స్యుడ వై అత నిని రక్షించినట్లే కో పముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీ హరి! నీ చక్రాయుధ ము నన్ను జమ్పవచ్చుచున్న" దని దూర్వాసుడు శ్రీ మన్నారాయణుని పరి పరి విధ మూలా ప్రార్దించెను. ఆవి ధ ముగా దూర్వాసుడు అహంకార మును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి " దూర్వాసా! నీ మాటలు యదార్ధ ములు. నీ వంటి తపోధ నులు నాకత్యంత ప్రియులు. నీ వు బ్రాహ్మణ రూపమున బుట్టి న రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయ పడ కుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగ ముందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభ వించే యాపాదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును. నీ వ కారణముగా అంబరీ షుని శపించిటివి. నేను శత్రువు కైనను మనో వాక్కయులందు కూడా కీడు తలపెట్టేను. ఈ ప్రపంచ మందుగల ప్రాణి సమూహము నా రూ పముగానే జూతును. అంబరీ షుడు ధర్మయుక్త ముగా ప్రజాపాలన చేయుచుండెను.
కాని, అటువంటి నాభక్తుని నీవు అనేక విధ ములు దూషించితివి. నీ యెడమ పాద ముతో తన్నితివి. అత ని యింటికి నీవు అతిధి వైవచ్చికుడ, నేను వేళకు రానియెడల ద్వాద శి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీ షున కు చెప్పా వైతివి. అతడు వ్రత భంగ మును కు భయపడి, నీ రాకకై చూచి జలపాన మును మాత్రమే జే సెను. అంత కంటే అతడు అ పరాధ ము యేమి చె సెను! చాతుర్వర్ణ ములవారికి భోజన నిషిద్ద ది న ములందు కూడా జలపానము దాహశాంతికి ని, పవిత్ర త కును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్ర మున నాభక్తు ని దూషించి శపించితివి. అతడు వ్రత భంగ మునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నువ మానించుటకు చేయాలేదె? నీవు మండి పడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచే య జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేను పుడు రాజ హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభ వించుదున ని పలికిన వాడి ని నే నే. అతడు నీ వలన భయము చే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తానూ తెలుసుకోనె స్దితిలో లేదు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీ షుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిర పరా ధి, దయాశాలి, ధర్మత త్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అత నిని నిష్కరణ ముగా శపించితివి. విచారించ వలదు. ఆ శాపమును లో కో పకారమున కై నేనె అనుభ వింతును . అదెటులనిన నీ శాపములో నిది మొదటి జన్మ మత్స్యజన్మ . నే నీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడ ను రాక్ష సుని జంపుటకు మత్స్య రూపమెత్తు దును. మరి కొంత కాలమున కు దేవ దానవులు క్షి ర సాగర మును మదుంచుటకు మందర పర్వత మును కవ్వముగా చే యుదురు. అ పర్వత మును నీ టి లో మునగ కుండ కూర్మ రూపమున నా విపున మోయుదును. వరాహజన్మ మెత్తి హిరణ్యాక్లుని వదంతును. నరసింహ జన్మ మెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గ మునుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గ మును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తి ని పాతాళ లో కమునకు త్రొక్కి వేతును. భూ భార మును తగ్గి౦తున. లో క కంటకు ఢ యిన రావణుని జంపి లో కో పకారము చేయుటకు ర ఘువంశమున రాముడ నై జన్మింతును. పిద ప, యదువంశమున శ్రీ కృష్ణు నిగను, కలియుగ మున బుద్దుడుగను , కలియుగాంత మున విష్ణు చి త్తుఢ ను విప్రునియింట " కల్కి" యన పేరున జన్మించి, అ శ్వారూ డు౦డ నై పరి భ్ర మించుచు బ్రహ్మ దేషుల నందరను ముట్టు బెట్టుదును. నీవు అంబరీ షునకు శాపరు పమున నిచ్చిన పది జన్మలను యీ విధ ముగా పూర్తి చేయుదును. ఇట్లు నా ద శవ తార ములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజే సి వైకుంఠ ప్రాప్తి నో సంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.
ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి 
ష డ్వి౦ శో ధ్యాయము- ఇరవ య్యా రో రోజు పారాయణము సమాప్తము.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles