Thursday 19 November 2015

కార్తీకపురాణం 28 వ అధ్యాయము

28 వ అధ్యాయము
విష్ణు సుదర్శన చక్ర మహిమ
జనక మహారాజా! వింటి వా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతు డైనను, వెనుక ముందు లాలో చింపక మహాభక్తుని శుద్ధ ని శంకించినాడు కనుక నే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోన వలెను. అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపదుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీ షుని కడ కేగి " అంబరీ షా, ధర్మ పాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నా పైగల అనురాగముతో ద్వాద శి పారాయణ మునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజే సి వ్రత భంగ ము చే యించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టి తిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్ద మైనది. నేను విష్ణువు కడ కేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦ చితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానో దయము చేసినీ వద్ద కేగ మని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి త పశ్శాలి నైనను, యెంత నిష్ట గలవాడ నైనను నీ నిష్కళంక భ క్తి ముంద వియేమియు పనిచెయలేదు. నన్ని విపత్తు నుండి కాపాడు " మని అనేక విధాల ప్రార్ధoచగా, అంబరీ షుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,"ఓ సుదర్శన చక్రమా! నీ కి వే నా మన: పూర్వక వందనములు. ఈ దూర్వా సమహాముని తెలిసియో, తెలియక యో తొందర పాటుగా యీ కష్ట మును కొని తెచ్చుకొనెను. అయిన ను యీత డు బ్రాహ్మణుడు గాన, ఈత నిని చంపవలదు, ఒక వేళ నీ కర్త వ్యమును నిర్వహిం పతలచితి వేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీ మన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీ మన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీ మన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనెక యుద్ద ములలో , అనేక మంది లోక కంటకులను చంపితివిగాని శరణుగోరువారి ని యింత వరకు చంపలేదు. అందువలన నే యీ దుర్వాసుడు ముల్లో కములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురా సురాది భూత కొటులన్నియు ఒక్కటి గా యేక మైన నూ నిన్నేమియు చెయ జాలవు, నీ శక్తి కి యే విధ మైన అడ్డునూలేదు.
ఈ విషయము లో క మంతటికి తెలియును. అయిన ను ముని పుంగ వునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్దoచుచున్నాను. నీ యుందు ఆ శ్రీ మన్నారాయణుని శక్తి యిమిడి యున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము" అని అనేక విధ ముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రా యుధము అంబరీ షుని ప్రార్ద నలకు శాంతించి" ఓ భక్త గ్రే శ్వరా ! అంబరీ షా! నీ భక్తీ ని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహా పరాక్రమవంతు లైన మధు కైటభులను- దేవతలందరు యెక మైకూడ- చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోక ములో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లో క ములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్ల రకు తెలిసిన విషేయమే, ముక్కో పియగు దుర్వాసుడు నీ పై పగ బూని నీ వ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్ట వలన ని కన్ను లెర్ర జే సి నీ మీద జూపిన రౌద్ర మును నేను తిలకించితిని. నిర పరాధ వగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచ వలెన నితరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మ తేజస్సు గలవాడు. మహాత పశ్శాలి. రుద్ర తే జము భులో క వాసుల నందరను చంపగలదుగాని, శక్తీ లో నా కంటె యెక్కువే మియుగాదు. సృషి కర్త యగు బ్రాహ్మతేజస్సు కంటెను,కైలాసవ తియగు మహేశ్వరు ని తే జశ్శక్తి కంటెను యెక్కువ మైన శ్రీహరి తేజస్సు తో నిండియున్న నాతొ రుద్ర తే జస్సు గల దుర్వాసుడు గాని , క్ష త్రియ తే జస్సుగల నీవు గాని తులతూగరు. నన్నే దు ర్కొన జాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతు డై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్త మము. ఈ నీ తిని ఆచరించు వారాలు యెటువంటి విపత్తుల నుండి అయిన ను తప్పించుకోన గలరు. ఇంత వరకు జరిగిన దంత యు వి స్మరించి, శరణార్ద మై వచ్చిన ఆ దుర్వాసుని గౌర వించి నీ ధర్మ ము నీవు నిర్వరింపు" మని చక్రా యుధ ము పలికెను. అంబరీ షుడా పలుకులాల కించి, " నేను దేవ గో , బ్రాహ్మణాదుల యుందును, స్త్రీ లయందును, గౌరవము గలవాడ ను. నారాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవులేను నియే నా యభి లాష . కాన, శరణు గోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్ని దేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేక మైన నూ నీ శక్తీ కి, తేజస్సు కూ సాటి రావు. నీవు అట్టి తేజో రాశివి మహా విష్ణువు లోక నిందితుల పై, లో క కంటకుల పై, దేవ - గో - బ్రాహ్మణ హింసా పరుల పై నిన్ను ప్రయోగించి, వారిని రక్షించి, తనకుక్షి యుందున్న ప ధాలుగు లోక ములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, ని కి వే నామన: పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రా యుధ పు పాదముల పై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీ షుని లేవదీ సి గాడాలింగన మొనర్చి " అంబరీ షా! నీ నిష్కళంక భక్తి కి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పరింతురో, యెవరు దాన దర్మములతో పుణ్య ఫలమును వృ ద్ది చే సుకొందురో, యెవరో పరులను హింసించక - పరధ నములను ఆశ పడక- పర స్త్రీ లను చెర బెట్టిక - గో హత్య - బ్రాహ్మణహత్య- శిశు హత్యాది మహాపాత క ములు చేయకుందురో అట్టి వారి కష్ట ములు నశించి, యిహ మందున పర మందున సర్వ సాఖ్యములతో తులతూగుధురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీ ద్వాద శి వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్య ఫలము ముందు యీ మునిపుంగ వునిత పశ్శక్తి పని చేయలేదు ." అని చెప్పి అత ని నాశీర్వదించి, అదృశ్యా మమ్యెను.
ఇట్లు స్కాంద పురాణా౦ తర్గ్హత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి
అష్టా మి శో ధ్యాయము - ఇరవ య్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles