Showing posts with label ఆంజనేయ. Show all posts
Showing posts with label ఆంజనేయ. Show all posts

Tuesday 16 May 2017

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం - 42 ( శ్రీ హను మంతేశ్వరం)

శ్రీ రామ చంద్రుని పట్టాషేకం తర్వాత ఆంజనేయుడు రామాజ్న తీసుకొనిగం ధ మాదన పర్వతం చేరి శ్రీ రామ మంత్ర జపం లో జీవిస్తూ ,చరి తార్ధుడు అవుతున్నాడు .రామ రావణ యుద్ధం లో తాను చాలా మంది రాక్షసులను సంహరించానని ,దాని వల్ల మహా పాతకం సంక్ర మించిందని ,దాన్ని పోగొట్టు కోవా టానికి శివున్ని సందర్శించాలని కోరిక కలిగింది . ,దాని వల్లే మనశ్శాంతి లభిస్తుందని భావించాడు .సీతా రాములకు మనస్సు లోనే నమస్కారం చేసి ,వెంటనే ఆకాశ మార్గం లో కైలాసం చేరాడు .

అక్కడ నందీశ్వరుడు అడ్డు పడి హనుమా !నీ ఆలోచన మంచిదే .కాని బ్రహ్మ హత్యా పాతకం తో శివ దర్శనం దుర్లభం .పాపాలను పోగొట్టు కొని శివ దర్శనం చెయ్యి .నర్మదా నది అఘ విదారిణి .అక్కడ కొన్ని రోజు లుండి స్నానం తో పవిత్రుడవు కమ్ము .శివుని గూర్చి తపస్సు చేస్తూ ఆయన అనుగ్రహం పొందు .అని హితవు చెప్పాడు .

ఆంజనేయుడు ఆ మాటలు విని నర్మదా నది చేరి ,దాని దక్షిణ ప్రాంతం లో ఉన్నసోమ నాద దేవాలయానికి దగ్గర లో . ప్రశాంత వాతావరణం లో ఉంటూ ,స్నానం చేస్తూ శివ ధ్యానం తో తీవ్ర తపస్సు చేశాడు .ప్రాణ వాణ్ని ,పంచాక్షరిని ఏకాగ్ర చిత్తం తోజపించాడు .మనసు ను స్వాధీనం చేసుకొన్నాడు .

పార్వతీ మనోహరుడు మెచ్చి ప్రత్యక్షమయాడు .హనుమా !నీకు పాపం అన్టు తుందా ?పాపం ఎప్పుడో పోయింది .ఎప్పుడు నువ్వు పవిత్రుడవే అన్నాడు .వెంటనే మారుతి లేచి నిలబడి నమస్కరించి పార వశ్యం తో స్తుతి చేసి ప్రీతీ కల్గించాడు .శివుడు హను మతో నీకు పాపాలు లేకున్నా ,మానవులు ఇలా ఉండాలి అని మార్గం చూపించావు .నీ తప ధ్యానాలకు చాలా సంతృప్తి చెందాను .నువ్వు సర్వ దేవాత్మకుడవు .నీ నామాన్ని స్మరిస్తూ ,జపిస్తూ,నిన్నుచూస్తూ ,అందరు సర్వదా శుభాలను పొందుతారు .హనుమ ,అంజనీ సుత ,వాయు పుత్రా ,మహా బాలా ,పింగాక్ష ,లక్ష్మణ ప్రాణ దాతా ,సీతా శోక నివర్తకా అని స్తుతిస్తూ అదృశ్య మై నాడు . వాయు సూనుడు తానూ తపస్సు చేసిన చోట అన్ని కోర్కెలు తీర్చే శివ లింగాన్ని ప్రత్ష్టించాడు ..ఒక పుష్కరిణి ఏర్పాటు చేశాడు .హను మంత వనం నిర్మించాడు .దానిలో అన్ని రకాల చెట్లు ,అన్ని రకాల పూల తీగెలు ,బహువిధ ఫల ములనిచ్చే వివిధ రకాల పండ్ల చెట్లు ఏర్పరచాడు .జింకలు ,గోరు వంకలు ,చిలకలు ,నెమళ్ళు ,కోకిలలు మొదలైన పక్షి జాతు లన్ని వచ్చి చేరాయి .నందన వనాన్ని మించిన సౌందర్యం తో ఆ వనం శోభిస్తోంది .అక్కడ ప్రశాంతత రాజ్యం చేస్తుంది .తపస్సు కు మిక్కిలి అనుకూలం గా ఉంది .ప్రకృతి శోభ కళ్ళకు ఆనందాన్ని చేకూరుస్తోంది .ఇదే హను మంతేశ్వరం .ఇక్కడ శివుడిని దర్శిస్తే సకల పాప హారం సకల మనో భీష్ట సిద్ధి కలుగు తాయి అని పరాశర మహర్షి మైత్రేయ మహర్షి వివ రించి చెప్పాడు . 

Tuesday 1 December 2015

హనుమాన్ చాలీసా

ఉత్తరభారతదేశంలోక్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పుbరాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు. ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు.జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది.చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైనతులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మరేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగాఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.పాదుషా :- తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట !
తులసీదాస్ :- అవును ప్రభూ !
ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు !
రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?
పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా?
తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు.
పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.
తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.
పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి.
తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం ! పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, 'తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రునిస్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!' అన్నాడు.
అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమంకొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మచరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు.ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వహిస్తాము' అని వాగ్దానం చేశారు. అప్పట్నుండి ఇప్పటివరకు 'హనుమాన్ చాలీసా' కామదేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక 'హనుమాన్ చాలీసా'. దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతిఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించినఅఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది......
జై శ్రీ రాం

మహాభారతంలో హనుమంతుడు


మహాభారతంలో హనుమంతుడు

రామాయణంలో హనుమంతుని పాత్ర గురించి అందరికీ బాగా తెలుసు. కానీ మహాభారతంలో హనుమంతుడి పాత్ర గురించి కొందరికే తెలిసివుండొచ్చు. హనుమంతుడు రెండుసార్లు, మహాభారతంలో కూడా కనిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

హనుమాన్ చిరంజీవి. అందుచేత హనుమాన్ మహాభారతంలోనూ కనిపిస్తాడు. హనుమంతుడిని భీముడికి సోదరుడిగా చెపుతారు. ఇద్దరూ వాయుదేవుని కుమారులే.. మహాభారతంలో హనుమంతుడు మొదటిసారి పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు భీముడిని కలుస్తాడు

రెండవసారి హనుమాన్ కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడి రథాన్ని రక్షిస్తూ, రథం మీద ఉన్న జెండాలో ఉంటాడు.

మొదటిసారి హనుమంతుడు పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు భీముడిని కలుస్తాడు. వనవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది భీముడిని సౌగంధిక పువ్వులు కావాలని కోరుతుంది. భీముడు పువ్వుల కోసం బయలుదేరాడు. అతను వెళుతున్న మార్గంలో ఒక పెద్ద కోతి విశ్రాంతి తీసుకుంటూ అడ్డంగా పడుకుని ఉన్నది. భీముడు ముందుకు వెళ్ళటానికి కోతిని అడ్డు తొలగమని మరియు మార్గం సుగమం చేయమని కోరాడు.

కానీ ఆ కోతి, తానూ చాలా ముసలివాడినని, తోకను కూడా తొలగించలేని శక్తిహీనుడినని, అందువలన భీముడినే అడ్డు తొలగించుకొని వెళ్ళమని ప్రాధేయపడింది. అందువలన భీముడు ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా కోతి తోకను పక్కకు పెట్టి వెళ్ళాలి.

భీముడు కోతిపట్ల చులకనగా చూశాడు మరియు తన గదతో తోకను పక్కకు పెట్టటానికి ప్రయత్నించాడు. కానీ తోకను ఒక అంగుళం కూడా కదిలించలేకపోయాడు. భీముడు చాలా ప్రయత్నించిన తరువాత, ఈ కోతి సాధారణమైనది కాదని తెలుసుకున్నాడు. అందువలన భీముడు శరణు కోరాడు మరియు క్షమాపణ అడిగాడు. అప్పుడు హనుమంతుడు, తన అసలు రూపంలోవచ్చి భీముడిని ఆశీర్వదించాడు.

అర్జునుడి రథం; మహాభారతంలో, మరొక సంఘటనలో హనుమాన్ రామేశ్వరం వద్ద ఒక సాధారణ కోతి రూపంలో అర్జునుడిని కలుసుకున్నాడు. లంకకు వెళ్ళటానికి రాముడు నిర్మించిన వంతెన చూసి అర్జునుడు ఈ వంతెనను నిర్మించడానికి కోతుల సహాయం తీసుకున్నాడు. ఎందుకు! అని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు అదే తను అయితే ఒక్కడే ఈ వంతెనను బాణాలతో నిర్మించి ఉండేవాడినని అనుకున్నాడు.

హనుమాన్ వెటకారంగా నీ బాణంతో నిర్మించిన వంతెన అయితే సంతృప్తికరంగా ఉండేది కాదని, ఆ వంతెన ఒక వ్యక్తి బరువును మోసి ఉండేది కాదని విమర్శించాడు. అర్జునుడు దీనిని ఒక సవాలుగా తీసుకున్నాడు. అర్జునుడు, తాను నిర్మించిన వంతెన సంతృప్తికరంగా లేదంటే, అప్పుడు తాను అగ్నిలో దూకుతానన్నాడు

దీంతో అర్జునుడు తన బాణాలతో ఒక వంతెన నిర్మించారు. హనుమాన్ దానిపై కాలు మోపగానే ఆ వంతెన కూలిపోయింది. అర్జునుడు నిశ్చేష్టుడయ్యాడు. తన జీవితం అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునిని ముందు ప్రత్యక్షమై ఆ వంతెనను తన దివ్య స్పర్శతో పునర్నిర్మించాడు. అప్పుడు దానిపై పాదం మోపమని హనుమంతుడిని కోరాడు. ఈసారి వంతెన కూలిపోలేదు.

అందువలన, హనుమాన్ అతని అసలు రూపంలో ప్రత్యక్షమై జరగబోయే యుద్ధంలో అర్జునుడికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. అందుకే కురుక్షేత్ర యుద్ధం సంభవించినప్పుడు హనుమంతుడు అర్జునుని రథజెండాపై యుద్ధప్రారంభం నుండి ముగిసేవరకు ఉన్నాడు.

కురుక్షేత్రయుద్ధం చివరి రోజున, కృష్ణుడు, అర్జునుడిని మొదటగా రథాన్ని దిగమని కోరాడు. అర్జునుడు క్రిందికి దిగిన తరువాత, శ్రీ కృష్ణుడు యుద్ధం అంతం వరకు హనుమంతుడు అక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపాడు.

అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్ళాడు. హనుమంతుడు వెళ్లిన వెంటనే రథం అగ్నికి ఆహుతి అయింది. ఇదంతా వీక్షించిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు "ఇప్పటివరకు హనుమంతుడు రక్షించటం వలన ఈ దివ్యమైన ఆయుధాలు ఏమి చేయలేకపోయాయి.

లేనట్లయితే ఎప్పుడో రథం అగ్నికి ఆహుతి అయి వుండేదన్నాడు. కాబట్టి  హనుమంతుడు రామాయణంలో మాత్రమే కాదు కానీ మహాభారతంలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషించాడు.

రామాయణము ప్రాముఖ్యము


శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.

భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉన్నది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణము నృత్య నాటకము బాగా ప్రసిద్ధము.

24,000 శ్లోకము లతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మము ల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.

వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్వములు అంతర్గతముగా నున్న పురాణములు, కథలు, కావ్యములు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నవి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్ధన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.

కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
కావ్యం రామాయణం సీతాయాశ్చచరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యే��

Monday 30 November 2015

శ్రీరామరక్ష - సర్వజగద్రక్ష



శ్రీమద్భగవద్గీత

8 . అక్షర పర బ్రహ్మ యోగము:

ఈ అష్టమ అధ్యయ౦లో అర్జునుడు ఈ విధముగా ప్రశించెను. బ్రహ్మ మన నేది? ఆధ్యాత్మ అనగా ఏమి? అది భూత, అధి దైవములనగా ఏవి? భగవానుడు ఈ విధంగా చెప్పెను. బ్రహ్మ లోక సహితముగా సర్వ లోకములు పునర్జన్మ తో కుడినవే?. కానీ తనను తెలుసు కొని తనను పొందిన వణికి ఇక పునర్జన్మ ఉండదు. ఈ రెండు మార్గములు ఎరిగిన వాడు యోగి ఎవ్వడు మూఢ త నొందడు. కావున అర్జునా! నీవు సర్వదా యోగము నందు సుస్థి రుడ వై యుండుము అని చెప్పెను.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles