Showing posts with label కార్తిక. Show all posts
Showing posts with label కార్తిక. Show all posts

Friday, 2 December 2016

శ్రీ రుద్ర లఘున్యాసము

ఎవరు అయితే మహన్యాస పూర్వక మహ రుద్రాబిషేకం ను మంత్రోచ్చారణ రాని వారు కాని మరియే ఇతర కారణము వలన గాని చేసుకోలేని వారు ఉంటారో వారు ఈ రుద్ర లఘున్యాసముతో అభిషేకము చేసుకోసుకుంటారో వారికి మహన్యాసం చేసిన పుణ్యము వస్తుంది అని పెద్దలు తెలియ చేసి యున్నారు.

శ్రీ రుద్ర లఘున్యాసము

ఓం అథాత్మానగ్‍మ్ శివాత్మానగ్‍మ్ శ్రీ రుద్రరూపం ధ్యాయేత్ ||
శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచ వక్త్రకమ్ |  గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితమ్ ||
నీలగ్రీవం శశాంకాంకం నాగ యఙ్ఞోప వీతినమ్ |  వ్యాఘ్ర చర్మోత్తరీయం చ వరేణ్యమభయ ప్రదమ్ ||
కమండల్-వక్ష సూత్రాణాం ధారిణం శూలపాణినమ్ | జ్వలంతం పింగళజటా శిఖా ముద్ద్యోత ధారిణమ్ ||
వృష స్కంధ సమారూఢమ్ ఉమా దేహార్థ ధారిణమ్ | అమృతేనాప్లుతం శాంతం దివ్యభోగ సమన్వితమ్ ||
దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతమ్ | నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువ-మక్షర-మవ్యయమ్ | సర్వ వ్యాపిన-మీశానం రుద్రం వై విశ్వరూపిణమ్ | ఏవం ధ్యాత్వా ద్విజః సమ్యక్ తతో యజనమారభేత్ ||
అథాతో రుద్ర స్నానార్చనాభిషేక విధిం వ్యా”క్ష్యాస్యామః | ఆదిత ఏవ తీర్థే స్నాత్వా ఉదేత్య శుచిః ప్రయతో బ్రహ్మచారీ శుక్లవాసా దేవాభిముఖః స్థిత్వా ఆత్మని దేవతాః స్థాపయేత్ ||
ప్రజననే బ్రహ్మా తిష్ఠతు | పాదయోర్-విష్ణుస్తిష్ఠతు | హస్తయోర్-హరస్తిష్ఠతు | బాహ్వోరింద్రస్తిష్టతు | జఠరే‌உఅగ్నిస్తిష్ఠతు | హృద’యే శివస్తిష్ఠతు | కంఠే వసవస్తిష్ఠంతు | వక్త్రే సరస్వతీ తిష్ఠతు | నాసికయోర్-వాయుస్తిష్ఠతు | నయనయోశ్-చంద్రాదిత్యౌ తిష్టేతామ్ | కర్ణయోరశ్వినౌ తిష్టేతామ్ | లలాటే రుద్రాస్తిష్ఠంతు | మూర్థ్న్యాదిత్యాస్తిష్ఠంతు | శిరసి మహాదేవస్తిష్ఠతు | శిఖాయాం వామదేవాస్తిష్ఠతు | పృష్ఠే పినాకీ తిష్ఠతు | పురతః శూలీ తిష్ఠతు | పార్శ్యయోః శివాశంకరౌ తిష్ఠేతామ్ | సర్వతో వాయుస్తిష్ఠతు | తతో బహిః సర్వతో‌உగ్నిర్-జ్వాలామాలా-పరివృతస్తిష్ఠతు | సర్వేష్వంగేషు సర్వా దేవతా యథాస్థానం తిష్ఠంతు | మాగ్‍మ్ రక్షంతు |
అగ్నిర్మే’ వాచి శ్రితః | వాగ్ధృద’యే | హృద’యం మయి’ | అహమమృతే” | అమృతం బ్రహ్మ’ణి | వాయుర్మే” ప్రాణే శ్రితః | ప్రాణో హృద’యే | హృద’యం మయి’ | అహమమృతే” | అమృతం బ్రహ్మ’ణి | సూర్యో’ మే చక్షుషి శ్రితః | చక్షుర్-హృద’యే | హృద’యం మయి’ | అహమమృతే” | అమృతం బ్రహ్మ’ణి | చంద్రమా’ మే మన’సి శ్రితః | మనో హృద’యే | హృద’యం మయి’ | అహమమృతే” | అమృతం బ్రహ్మ’ణి | దిశో’ మే శ్రోత్రే” శ్రితాః | శ్రోత్రగ్ం హృద’యే | హృద’యం మయి’ | అహమమృతే” | అమృతం బ్రహ్మ’ణి | ఆపోమే రేతసి శ్రితాః | రేతో హృద’యే | హృద’యం మయి’ | అహమమృతే” | అమృతం బ్రహ్మ’ణి | పృథివీ మే శరీ’రే శ్రితాః | శరీ’రగ్ం హృద’యే | హృద’యం మయి’ | అహమమృతే” | అమృతం బ్రహ్మ’ణి | ఓషధి వనస్పతయో’ మే లోమ’సు శ్రితాః | లోమా’ని హృద’యే | హృద’యం మయి’ | అహమమృతే” | అమృతం బ్రహ్మ’ణి | ఇంద్రో’ మే బలే” శ్రితః | బలగ్ం హృద’యే | హృద’యం మయి’ | అహమమృతే” | అమృతం బ్రహ్మ’ణి | పర్జన్యో’ మే మూర్ద్ని శ్రితః | మూర్ధా హృద’యే | హృద’యం మయి’ | అహమమృతే” | అమృతం బ్రహ్మ’ణి | ఈశా’నో మే మన్యౌ శ్రితః | మన్యుర్-హృద’యే | హృద’యం మయి’ | అహమమృతే” | అమృతం బ్రహ్మ’ణి | ఆత్మా మ’ ఆత్మని’ శ్రితః | ఆత్మా హృద’యే | హృద’యం మయి’ | అహమమృతే” | అమృతం బ్రహ్మ’ణి | పున’ర్మ ఆత్మా పునరాయు రాగా”త్ | పునః’ ప్రాణః పునరాకూ’తమాగా”త్ | వైశ్వానరో రశ్మిభి’ర్-వావృధానః | అంతస్తి’ష్ఠత్వమృత’స్య గోపాః ||
అస్య శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్రస్య, అఘోర ఋషిః, అనుష్టుప్ చందః, సంకర్షణ మూర్తి స్వరూపో యో‌உసావాదిత్యః పరమపురుషః స ఏష రుద్రో దేవతా | నమః శివాయేతి బీజమ్ | శివతరాయేతి శక్తిః | మహాదేవాయేతి కీలకమ్ | శ్రీ సాంబ సదాశివ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||
ఓం అగ్నిహోత్రాత్మనే అంగుష్ఠాభ్యాం నమః | దర్శపూర్ణ మాసాత్మనే తర్జనీభ్యాం నమః | చాతుర్-మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః | నిరూఢ పశుబంధాత్మనే అనామికాభ్యాం నమః | జ్యోతిష్టోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః | సర్వక్రత్వాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః ||
అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః | దర్శపూర్ణ మాసాత్మనే శిరసే స్వాహా | చాతుర్-మాస్యాత్మనే శిఖాయై వషట్ | నిరూఢ పశుబంధాత్మనే కవచాయ హుమ్ | జ్యోతిష్టోమాత్మనే నేత్రత్రయాయ వౌషట్ | సర్వక్రత్వాత్మనే అస్త్రాయఫట్ | భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||
ధ్యానం%  ఆపాతాళ-నభఃస్థలాంత-భువన-బ్రహ్మాండ-మావిస్ఫురత్-  జ్యోతిః స్ఫాటిక-లింగ-మౌళి-విలసత్-పూర్ణేందు-వాంతామృతైః | అస్తోకాప్లుత-మేక-మీశ-మనిశం రుద్రాను-వాకాంజపన్  ధ్యాయే-దీప్సిత-సిద్ధయే ధ్రువపదం విప్రో‌உభిషించే-చ్చివమ్ ||
బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాలాః కపర్దాః కలిత-శశికలా-శ్చండ కోదండ హస్తాః | త్ర్యక్షా రుద్రాక్షమాలాః ప్రకటితవిభవాః శాంభవా మూర్తిభేదాః రుద్రాః శ్రీరుద్రసూక్త-ప్రకటితవిభవా నః ప్రయచ్చంతు సౌఖ్యమ్ ||
ఓం గణానా”మ్ త్వా గణప’తిగ్‍మ్ హవామహే కవిం క’వీనాము’పమశ్ర’వస్తమమ్ | జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్పద ఆ నః’ శృణ్వన్నూతిభి’స్సీద సాద’నమ్ || మహాగణపతయే నమః ||
శం చ’ మే మయ’శ్చ మే ప్రియం చ’ మే‌உనుకామశ్చ’ మే కామ’శ్చ మే సౌమనసశ్చ’ మే భద్రం చ’ మే శ్రేయ’శ్చ మే వస్య’శ్చ మే యశ’శ్చ మే భగ’శ్చ మే ద్రవి’ణం చ మే యంతా చ’ మే ధర్తా చ’ మే క్షేమ’శ్చ మే ధృతి’శ్చ మే విశ్వం’ చ మే మహ’శ్చ మే సంవిచ్చ’ మే ఙ్ఞాత్రం’ చ మే సూశ్చ’ మే ప్రసూశ్చ’ మే సీరం’ చ మే లయశ్చ’ మ ఋతం చ’ మే‌உమృతం’ చ మే‌உయక్ష్మం చ మే‌உనా’మయచ్చ మే జీవాతు’శ్చ మే దీర్ఘాయుత్వం చ’ మే‌உనమిత్రం చ మే‌உభ’యం చ మే సుగం చ’ మే శయ’నం చ మే సూషా చ’ మే సుదినం’ చ మే ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

కార్తీకమాసం శివ-కేశవులకి ఇరువురికి అత్యంత ప్రీతికరమైనది .

Image result for shiva vishnu
కార్తీకమాసం శివ-కేశవులకి ఇరువురికి అత్యంత ప్రీతికరమైనది .ఈ కార్తీక మాసంలో పరమేశ్వర కృపకై శివునికి అభిషేకంచేయడం&మహావిష్ణు ప్రీతికై దీపములు వెలిగించడం రెండూ అత్యంత ముఖ్యమైనవి. ఈ కార్తీక మాసంలోఅందరిచేత ఈ రెండు పుణ్యప్రదమైన కార్యములు చేయించాలనే సంకల్పంతో  ఈరోజు మంగళవారం 29/11/2016 కార్తీక అమావాస్య.కార్తీకమాసంలో చివరి రోజు కావున గాయత్రీవేదపీఠం మరియు సాయినగర్ సాయిబాబా మందిరముల ఆధ్వర్యంలో సాయినగర్ కాలనీ రోడ్ నెం.3 పార్కులో సాయంత్రం 5 గం ల నుండి సహస్ర కలశ అభిషేకం & సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమం ఏర్పాటుచేయటమైనది. అందరూ స్వయంగా అభిషేకం చేసుకునేందుకు మరియు దీపములు వెలిగించేందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.కావున ఈఅవకాశమును వినియోగించుకొని అందరూ పాల్గొని శివుణ్ణి అభిషేకించి పరమేశ్వర కృపను దీపములను వెలిగించడం ద్వారా మహావిష్ణు కృపను పొందవలసింది గా మనవి...
        

Sunday, 27 November 2016

ఈ కార్తీకమాసం⁠అందరివాడు అందరికన్నా ముందువాడు .

అంతరాళపు ఆణువణువూ నా నిండినవాడు .

శివ నీకు ..

కైలాసవాసికి _కర్పూరదీపాలు

వృషవాహునుడుకి _వనభోజనాలు

త్రిపురాంతకునికి _తెల్లారిస్నానాలు

సాంబశివునికి _సంధ్యాదీపాలు

అపమృత్యుహరునికి _కర్పూరదీపాలు

ఉమామహేశ్వరునికి _ఉపవాసదీక్షలు

రుద్రదేవునికి _రుద్రాభిషేకాలు

కామదహునికి _ఈ కార్తీకమాసం .    

Monday, 30 November 2015

కార్తీక సోమవారం


శివునికి పరమపవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ నెలలో సోమవారంనాడు
ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి
విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం
సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక
మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. అందుచేత
కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది.
ఈ వారంలో ముత్తౖదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగళ్య
భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో
శైవభక్తులు నిష్టనియమాలతో శివునిని ఆరాధిస్తారు. సోమవారం
సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మీముహూర్తమున స్నానమాచరించి
"హరహరశంభో" అంటూ శివుణ్ణి స్తుతిస్తే పాపాల నుంచి విముక్తి లభించడంతో
పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ మాసమంతా ఉపవాసముండి శివునిని
కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం.
సోమవారం ఉదయం స్నానాదికార్యక్రమాలను పూర్తి చేసుకుని, పొడిబట్టలు
ధరించి మొదటగా శివాలయానికి వెళ్లి స్వామివారి సన్నిధిలో కార్తీక
దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా శివాలయంలో దీపాన్ని వెలిగించడం వలన
సమస్త దోషాలు నశిస్తాయి. ఉపవాస దీక్షను చేపట్టి ఈ నియమాలను
పాటిస్తూ ఈశ్వరుడిని ఆరాధించడం వలన మోక్షానికి అవసరమైన
అర్హతను పొందడం జరుగుతుంది. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి
శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం ద్వారా నిత్య
సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం.
శివుడిని బిల్వదళాలతో పూజించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని
ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పరమశివుడికి ఇష్టమైన
పాయసాన్ని ఈ రోజున నైవేద్యంగా సమర్పించాలి. ఆ పాయసాన్ని
ప్రసాదంగా స్వీకరించడం వలన కష్టాలు తొలగిపోతాయని స్పష్టం
చేయబడుతోంది.

Thursday, 19 November 2015

కార్తీక సోమవారం ప్రాధాన్యత ఏమిటి?

కార్తీక సోమవారం ప్రాధాన్యత ఏమిటి?
హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది.
ఈ వారంలో ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో శైవభక్తులు నిష్టనియమాలతో శివునిని ఆరాధిస్తారు. సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మీముహూర్తమున స్నానమాచరించి "హరహరశంభో" అంటూ శివుణ్ణి స్తుతిస్తే పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
ఈ మాసమంతా ఉపవాసముండి శివునిని కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం.దీనినే కార్తీక నత్తాలు అంటారు.
సోమవారం ఉదయం స్నానాదికార్యక్రమాలను పూర్తి చేసుకుని, పొడిబట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం ద్వారా నిత్య సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం.

కార్తీక మాసం లో వన భోజనం ఎందుకు చేయాలి?.

కార్తీక మాసం లో వన భోజనం ఎందుకు చేయాలి?.
కార్తీకమాసములో బంధువులు, స్నేహితులతో కలసి చెట్ల నీడ లో (ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన) కలసి భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు. ప్రకృతి తో మన బంధాన్ని గుర్తుచేసుకునే రోజు గా చెప్పవచ్చు. జపాను లో కూడ హనామి (హన - పువ్వు, మిమస్ - చూడటం) పేరుతో మార్చి చివరి వారం లో బంధువులు స్నేహితులతో కలసి ఇదే విధమైన వేడుక చేసుకుంటారు. ఇది జపాను లో విశేషమైన ఆదరణ పొందిన వేడుకలలో ఇది ఒకటి.
కార్తీక మాసంలో వనభోజనం తప్పని సరి. ‘వనం’ అనే పదానికి అరణ్యాన్ని ప్రేమించడమని అర్థమని అమరకోశం చెబు తుంది. కార్తీక మాసంలో వన భోజనానికి ఎందుకు వెళ్లాలి? దీని వెనక ఒక పరమార్థం ఉంది. అరణ్యానికి ఎవడు వెళ్ళాడో వాడు పండడానికి సిద్ధపడ్డాడని గుర్తు. వాన ప్రస్థంలో అందరూ అరణ్యంలోనే గడుపు తారు. అరణ్యంలో ఎవరితోనూ సంబంధం లేకుండా ఒక ఆశ్రమం కట్టుకొని, రాగద్వేషాలు లేకుండా, భగవంతుడిని ధ్యానం చేస్తూ గడుపుతారు. దానికి సాధనే వనభోజనం. అందుకే వనభోజనానికి పవిత్రమైన హృదయంతో వెళ్లాలి. ఏ ప్రకృతిలో ఉపద్రవం ఉందో ఆ ప్రకృతినే ఆశ్రయించి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవాలి. ఆరోగ్యాన్నిచ్చే ఉసిరి చెట్లు, తులసి చెట్లు, మామిడి చెట్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లాలి.
ఉసిరి, తులసిల గురించి మనకు తెలుసు. మరి మామిడి విశిష్టత ఏమిటి?. మామిడి చెట్టుకి సంస్కృతంలో రసాలం అని పేరు. పరమేశ్వరుని పేరు ఉన్న ఏకైక చెట్టు మామిడి చెట్టు. పరమేశ్వరుడే ఈ భూమి మీద చెట్టుగా వస్తే అది మామిడి చెట్టు. అటువంటి మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, తులసి బృందావనం ఇటువంటివన్నీ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్లాలి. సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, మరే ఏ ఇతర వ్రతం గానీ చేయాలి. విష్ణు సహస్రం, శివ సహస్రం, లక్ష్మీ సహస్రం, లలితా సహస్రం- ఇవన్నీ సాయంత్రం దాకా చదవాలి. పొద్దు పొడిచిన తరువాత మహా నైవేద్యం పెట్టి భోజనం చేయాలి.

ఆకాశ దీపం అంటే ఏమిటి? దేవాలయాలలో వెలిగించడం వెనుక అంతరార్ధం ఏమిటి?

ఆకాశ దీపం అంటే ఏమిటి? దేవాలయాలలో వెలిగించడం వెనుక అంతరార్ధం ఏమిటి?
శివ కేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీకమాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి 'ఆకాశ దీపం' వెళ్లాడ దీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజ స్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు.
అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి ... ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి కారణం వుంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు ... ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది. 'దీపావళి' రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.

కార్తీకపురాణం 30 వ అధ్యాయము

30 వ అధ్యాయము
కార్తిక వ్రాత మహిమ్నా ఫల శ్రుతి నైమిశారణ్య ఆశ్రమములో శౌని కాది మహా మునుల కందరకు సుత మహా ముని తెలియ జేసిన విశ్నుమహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయి నోళ్ళ కొని యాడిరి. శౌని కాది మునులకుక్ ఇంకను సంశయములు తిరనందున, సుతుని గాంచి" ఓ ముని తిలకమా! కలియుగ మందు ప్రజలు అరి షడ్వర్గ ములకు దాసులై, అత్యాచార పరులై జీవి౦ చు చు సంసార సాగరము తరింప లేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణో పాయమే దైన కలదా?ధర్మము లన్నిటిలో మోక్ష సాధనా కుప కరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలో నూ ముక్తి నొంసంగు వుత్తమ దైవ మెవరు?మానవుని అవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్య ఫల మిచ్చు కార్య మేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించు చున్న మానవులకు సులభముగా మోక్షము పొంద గలవు పాయమేమి? హరి నమ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశాయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియ జేయు" మని కోరిరి. అంత సుతుడా ప్రశ్న నాలకించి" ఓ మును లారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకోనవలసినవి. కలియుగ మందలి మానవులు మంద బుద్దులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువు లోనర్చిన పుణ్యము, దాన ధర్మ ఫలము చే కూరును. కార్తీక వ్రతము శ్రీ మన్నారాణునకు ప్రీతీ కరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటె ఘనమై నదని శ్రీ హరి వర్ణించి యున్నాడు. ఆ వ్రాత మహిమ వర్ణించుట నాకు శక్తి చాలదు. అంతియే కాదు, సృష్టి కర్త యగు ఆ బ్రహ్మ దేవునికి కూడా శత్య ము గాదు. అయినను సుక్ష్మ ముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించ వలసిన పద్దతులను జెప్పు చున్నాను. శ్రద్దగా అలకింపుడు. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులా రాశి యందున్న ప్పుడు శ్రీ హరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పని సరిగ నది స్నానము చేయ వలెను. దేవాలయానికి వెళ్లి హరి హరదులను పూజింప వలెను. తన కున్న దానితో కొంచమైనా దీప దానం చెయ వలయును .

కార్తీకపురాణం 29 వ అధ్యాయము

29 వ అధ్యాయము
అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి పార యణము అత్రి మహా ముని అగస్త్యు వారితో యీ విషముగా- సుదర్శన చక్రము అంబరీషునక భయ మిచ్చి వు భయులను రక్షించి, భక్త కోతికి దర్శన మిచ్చి అంతర్ధాన మైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నడువ నారంభించెను. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పదముల ఫై బడి దండ ప్రణామము లాచరించి, పదములని కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సు పై జల్లుకొని, " ఓ ముని శ్రేష్టా! నేను సంసార మార్గ మందున్న యొక సామాన్య గృహస్తుడను నా శక్తి కొలది నేను శ్రీ మన్నారయణుని సేవింతును, ద్వాదశి వ్రతము జేసుకోనుచు ప్రజలకు ఎత్తి కీడు రాకుండా ధర్మ వర్తనుడ నై రాజ్య మేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్ని౦పుడు. మీ యెడల నాకు అమితమైన అనురాగ ముండుట చేతనే తమకు ఆతిథ్య మివ్వ వలయునని ఆహ్వానిన్చితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృ తార్దు ని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించనను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడ నైతిని. మీ రక వలన శ్రీ మహా విష్ణువు యొక్క సుధర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకరమును మరువ లేకున్నాను. మహానుభావా! నా మన స్సంతో షమచే మిమ్మెట్లు స్తుతింప వలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవ చేసినను యింకను ఋణ పది యుండును.

కార్తీకపురాణం 28 వ అధ్యాయము

28 వ అధ్యాయము
విష్ణు సుదర్శన చక్ర మహిమ
జనక మహారాజా! వింటి వా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతు డైనను, వెనుక ముందు లాలో చింపక మహాభక్తుని శుద్ధ ని శంకించినాడు కనుక నే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోన వలెను. అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపదుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీ షుని కడ కేగి " అంబరీ షా, ధర్మ పాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నా పైగల అనురాగముతో ద్వాద శి పారాయణ మునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజే సి వ్రత భంగ ము చే యించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టి తిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్ద మైనది. నేను విష్ణువు కడ కేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦ చితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానో దయము చేసినీ వద్ద కేగ మని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి త పశ్శాలి నైనను, యెంత నిష్ట గలవాడ నైనను నీ నిష్కళంక భ క్తి ముంద వియేమియు పనిచెయలేదు. నన్ని విపత్తు నుండి కాపాడు " మని అనేక విధాల ప్రార్ధoచగా, అంబరీ షుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,"ఓ సుదర్శన చక్రమా! నీ కి వే నా మన: పూర్వక వందనములు. ఈ దూర్వా సమహాముని తెలిసియో, తెలియక యో తొందర పాటుగా యీ కష్ట మును కొని తెచ్చుకొనెను. అయిన ను యీత డు బ్రాహ్మణుడు గాన, ఈత నిని చంపవలదు, ఒక వేళ నీ కర్త వ్యమును నిర్వహిం పతలచితి వేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీ మన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీ మన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీ మన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనెక యుద్ద ములలో , అనేక మంది లోక కంటకులను చంపితివిగాని శరణుగోరువారి ని యింత వరకు చంపలేదు. అందువలన నే యీ దుర్వాసుడు ముల్లో కములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురా సురాది భూత కొటులన్నియు ఒక్కటి గా యేక మైన నూ నిన్నేమియు చెయ జాలవు, నీ శక్తి కి యే విధ మైన అడ్డునూలేదు.

కార్తీకపురాణం 27 వ అధ్యాయము

27 వ అధ్యాయము
దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట
మరల అత్రి మహా ముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దుర్వాసుని యెంతో ప్రేమతో జేర దీసి యింకను ఇట్లు చెప్పెను. "ఓ దుర్వాస మని! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆపాది జన్మలు నాకు సంతోషకరమై నవే. నేను అవతారము లె త్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను గాన, అందులకు నే నంగి కరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యిం ట భుజింపక వచ్చినందులకు అతడు చింతా క్రాంతుడై బ్రాహ్మణ పరిఒ వృ తుడై ప్రాయో పవేశ మొనర్ప నెంచినాడు. ఆ కారణమూ వలన విష్ణు చక్రము నిన్ను భాదింప బూనెను. ప్రజా రాక్షనమే రాజా ధర్మముగాని, ప్రజా పీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింప వలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధను ర్బా ణములు ధరించి ముష్క రుడై యుద్ద మునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించా కూడదు. బ్రాహ్మణా యువకుని దండించుట కంటే పాతకము లేదు.

కార్తీకపురాణం 26 వ అధ్యాయము

 26 వ అధ్యాయము
దూర్వాసుడు శ్రీ హరి ని శరణు వేడుట - శ్రీ హరి బోధ
ఈ విధ ముగా అత్రిమహముని అగస్త్యునితో - దుర్వాసుని కో పమువల్ల కలిగిన ప్రమాద మును తెలిపి, మిగిలన వృత్తంత మును ఇట్లు తెలియజే సేను. ఆవిధ ముగా ముక్కోపి యైన దూర్వాసుడు భూలో కము, భువర్లో కము, పాతాళ లోకము, సత్యలో కములకు తిరిగి తిరిగి అన్ని లో కములలో ను తనను రక్షించువారు లేక పోవుటచె వైకుంఠ ముందున మహా విష్ణువు కడకు వెళ్లి " వాసుదేవా! జగన్నాధా! శరణాగత రక్షణ బిరుదాంకి తా! రక్షింపుము. నీ భక్తు డైన అంబరీ షున కు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడా ను గాను. ముక్కో పినై మహాపరాధ ము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడ వు . బ్రాహ్మణుడైన భగు మహర్షి నీ యురము పైత నిన్న ను సహించితివి. అ కాలిగురుతు నెటికి నీ నీ వక్ష స్దలమందున్నది. ప్రశాంత మన స్యుడ వై అత నిని రక్షించినట్లే కో పముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీ హరి! నీ చక్రాయుధ ము నన్ను జమ్పవచ్చుచున్న" దని దూర్వాసుడు శ్రీ మన్నారాయణుని పరి పరి విధ మూలా ప్రార్దించెను. ఆవి ధ ముగా దూర్వాసుడు అహంకార మును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి " దూర్వాసా! నీ మాటలు యదార్ధ ములు. నీ వంటి తపోధ నులు నాకత్యంత ప్రియులు. నీ వు బ్రాహ్మణ రూపమున బుట్టి న రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయ పడ కుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగ ముందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభ వించే యాపాదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును. నీ వ కారణముగా అంబరీ షుని శపించిటివి. నేను శత్రువు కైనను మనో వాక్కయులందు కూడా కీడు తలపెట్టేను. ఈ ప్రపంచ మందుగల ప్రాణి సమూహము నా రూ పముగానే జూతును. అంబరీ షుడు ధర్మయుక్త ముగా ప్రజాపాలన చేయుచుండెను.

కార్తీకపురాణం 25 వ అధ్యాయము

  25 వ అధ్యాయము
దుర్వాసుడు అంబరి షుని శ పించుట
" అంబరి షా! పూర్వజన్మలో కించిత్ పాపవి శే షమువలన నీ కీ యనర్ధము వచ్చినది. నీ బుద్ది చే దీర్ఘ ముగా అలోచించి నీ కెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము " అని పండితులు పలికిరి. అంత అంబరీ షుడు " ఓ పండి తో త్త ములారా! నానిశ్చితాభి ప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాద శీ నిష్ట ను విడ చుట కన్న, విప్రశాపము అధీక మయిన ది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవ మాన పరచుటగాదు. ద్వాద శిని విడ చుటయుగాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్య ఫలము న శింపదు. గాన, జలపాన మొనరించి వూర కుందును" అని వారి యెదుట నె జలపాన ము నోనరించెను. అంబరి షుడు జలపాన మొనరించిన మరు క్షణముచే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చెసుకొని అక్కడ కు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రాకారు డై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ" ఓరీ మదాంధా! నన్ను భో జనానికి రమ్మని, నేను రాక నే నీ వేల భాజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంత టి ధర్మ పరి త్యాగి వి? అతి ధి కి అన్నము పెట్టె దనని ఆశ జూపి పెట్ట కుండా తాను తినిన వాడు మాలభ క్ష కుడ గును. అట్టి అధ ముడు మరు జన్మలో పురుగై పుట్టును. నీవు భోజన మునకు బదులు జలపానము చే సితివి. అది భో జనముతో సమాన మైన దే. నీవు అతిధిని విడి ఛి భుజించి నావు కాన, నీ వు నమ్మక ద్రోహివగుదు వె గాని హరి భక్తుడ వెట్లు కాగలవు ? శ్రీ హరి బ్రాహణావ మాన మును సహిం పడు. మమ్మే యావ మానించుట యనిన శ్రీ హరి నీ అవ మానించుటయే. నీ వంటి హరి నిందా పరుడు మరి యొకడు లేడు. నీ వు మహా భక్తుడ నని అతి గర్వము కలవాడ వై వున్నావు. ఆ గర్వముతో నే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమాన పరచి నిర్ల క్ష్యముగా జలపాన మొన రించితివి. అబరి షా! నీ వెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టి నావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కో పముతో నోటికి వచ్చినట్లు తిట్టెను.

కార్తీకపురాణం 24 వ అధ్యాయము

 24 వ అధ్యాయము
అంబ రిషుని ద్వాదశి వ్రతము
అత్రి మహాముని మరల అగస్త్యునితో " ఓ కుంభ సంభవా! కార్తీక వ్రత ప్రభావము నెంతివి చా రించిన నూ, యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసి నంత వరకు వివరింతును. అలకింపుము. " గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసిన ౦దు వలన ను, సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానా దు లోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీ మన్నారయణుని నిజ తత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్దలతో దన ధర్మములు చేయు వారికీ ని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన స త్కార్య ఫలము యితర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కా గలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధాన మెట్లో చెప్పెదను. వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున, పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా యె కాదశి రోజున వ్రతమూ చేయక శు ష్కో ప వాస ముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాత నే భుజింప వలయును. దీని కొక యితిహాసము కాలదు. దానిని కూడా వివరించెదను. సావదనుడవై అలకింపుము"మని యిట్లు చెప్పు చున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కాలదు. అతడు పరమ భగవ తోత్తముడు ద్వాదశి వ్రాత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయు చుండెడి వాడు. ఒక ద్వాదశి నాడు, ద్వాదశి ఘడియలు స్వల్ప ముగా నుండెను. అందుచే ఆ రోజు పెందల కడనె వ్రతమును ముగించి బ్రాహ్మణా సమారాధన చేయ దలచి సిద్దముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోప స్వభావు డగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణము చేయ వలయు ను గాన, తొందరగా స్నానమున కై రమ్మన మని కోరెను. దుర్వాసుడ ౦దు ల క౦గీ కరించి సమీపమున గల నదికి స్నానమున కై వెడలెను. అంబరీషుడు యెంత సేపు వేచి యున్న నూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటి పోవు చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు నుకొనెను. " ఇంటి కొచ్చిన దుర్వాసుని భోజనము నాకు రమ్మంటిని .

కార్తీకపురాణం 23 వ అధ్యాయము

23 వ అధ్యాయము
శ్రీ రంగ క్షేత్రమున పురంజయుడు ముక్క్తి నొందుట
అగస్త్యుడు మరల అత్రి మహర్షి ని గాంచి" ఓ మునిపుంగ వా! విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు" మని యడుగ గా అత్రిమహాముని యిట్లు చెప్పిరి- కు౦భ సంభవా! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలో పేతుడై అగ్ని శేషము, శత్రు శేషము వుండ కూడదని తెలిసి, తన శత్రు రాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను తన యొక్క విష్ణు భక్తీ ప్రభావమువలన గొప్ప పరాక్ర మవంతుడు, పవిత్రుడు, సత్య దీక్షత త్పరుడు, నితాన్న దాత, భక్తి ప్రియవాది, తేజో వంతుడు, వేద వె దా౦గ వేత్త యై యుండను. మరియు అనేక శత్రువులను జయించి దశది శలా తన యఖ౦డ కీర్తిని ప్రసరింప చేసెను. శ త్రువులకు సింహ స్వప్నమై, విష్ణు సేవాధురంధ రు డై, కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడ గెత్తి అరి షడ్వర్గ ములను కుడా జయించిన వాడైయుండెను. ఇన్ని యేల? అతడి ప్పుడు విష్ణు భక్తా గ్రే సరుడు, సదాచార సత్పు రుషులలో వుత్త ము డై రాణించుచుండెను. అయిన ను తనకు తృప్తి లో దు. ఏ దేశమున, యే కాలమున, యే క్షేత్రమున యేవిధ ముగా శ్రీ హరి ని పూజించిన కృతార్దుడ నగుదునా? యని విచారించుచుండ గా ఒకానొక నాడు అశరీర వాణి" పురంజయా! కావేరీ తీరమున శ్రీ రంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠ మని పిలిచెదరు. నీ వచట కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము.

కార్తీకపురాణం 22 వ అధ్యాయము


22 వ అధ్యాయము
పురం జయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట
మరల అత్రి మహాముని అగస్త్యునిట్లు చెప్పదొడగెను
పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీ మన్నా రాయణుని షోడ శో పచారములతో పూజించి, శ్రీ హరిని గానము చేసి, సాష్టాంగ నమస్కారము చేసి, సూర్యోదయము కాగానే నదికి పోయి, స్నాన మాచరించి తన గృహమున కరిగెను. అట్టి సమయములో విష్ణు భక్తుడ గు ఒక వృద్ద బ్రాహ్మణుడు- మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపెంచి రాజా! విచారింపకుము నువ్వు వెంటనే చెల్లా చెదురై యున్న ని సైన్యము కూడా దిసుకొని, యుద్ద సన్నద్ధుడై శత్రు రాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రు రాజుల సైన్యములు నిలువలె కపోయినవి. అదియును గాక, శ్రీ మన్నా రాయణుడు పురం జయుని విజయానికి అన్ని విధములా సహాయ పడెను. అంతయు శ్రీ మన్నా రాయణుని మహిమయే గదా! ఆ యుద్దములో కా౦ భో జాది భూపాలురు ఓడిపోయి " పురం జయా రక్షింపుము. రక్షింపు" మని కేకలు వేయుచు పారిపోయిరి. పురం జయుడు విజయము పొంది తన రాజ్యము తిరిగి సంపాదించెను. శ్రీ మన్నా రాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రు భయము కలుగు తుందా! విషం త్రాగినాను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా " శ్రీ హరి" అని ప్రార్ధించి త్రాగగా అమృత మైనది గదా! శ్రీ హరి కటాక్షము వలన సూర్య చంద్రులు వున్నంత వరకును దృవుడు చిరంజీవి యే గదా! హరి నామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. ఆ ధర్మము ధర్మముగా మారును. దైవను గ్రహము లేని వారికి ధర్మమే ఆ ధర్మమగును. త్రాడు పామై కరుచును. కార్తీక మసమంతయు నది స్నాన మొనరించి దేవాలయంలో జ్యోతియిన్ వెలిగించి దీపారదానా చేసినచో సర్వ విపత్తులును పటా పంచలగును. అన్ని సౌఖ్యములు సమ కూరును. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రత మాచరించు వారికి యే జాతి వారి కైనా పుణ్యము సమానమే బ్రాహ్మణా జన్మ మెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్య మైనచో శూద్ర కులముతో సమన మగును.

కార్తీకపురాణం 21 వ అధ్యాయము

21 వ అధ్యాయము
పురంజయుడు కార్తీక ప్రభావము నెరు౦గుట
ఈ విధముగా యుద్దమునకు సిద్దమై వచ్చిన పురంజయునకు, కాంభో జాది భూపాలకులకు భయంకరమైన యుద్ద జరిగింది. ఆ యుద్దములో రధికుడు రధికునితోను, అశ్వ సైనికుడు అశ్వ సైనికునితో ను, గజ సైనికుడు గజ సైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, మల్లులు, మల్ల యుద్ద నిపుణులతోను ఖడ్గ, గద, బాణ, పరశువు మొదలగు ఆయుధాలు ధరించి, ఒండొరుల డీ కొనుచు హుంకరించు కొనుచు, సింహ నాదములు చేసి కొనుచు, శూరత్వ వీరత్వ ములను జూపుకోనుచు, భేరీ దుందుభులు వాయించు కొనుచు, శంఖములను పురించు కొనుచు, ఉభయ సైన్యములును విజయ కంక్షులై పోరాడిరి. ఆ రణ భూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొ౦డెములు, తొండలు, తలలు, చేతులు, - హాహా కారములతో దీనా వస్థలో వినిపిస్తున్న ఆ క్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగుల, గుఱ్ఱముల క ళే బరాల దృశ్యములే ఆ మహా యుద్దమును వీరత్వము జూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకు వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానము పై వచ్చిరి. అటువంటి భయంకర మైన యుద్ద ము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభో జాది భూపాలుర సైన్యము చాలా నష్ట మై పోయెను. అయినను, మూడు అక్షౌ హిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసముతో, పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమునన్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గ మున శత్రువుల కంట పడ కుండా తన గృహానికి పారి పోయెను. బలో పేతు లైన శత్రు రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచార ముతో సిగ్గుతో దు:ఖించుచుండెను ఆ సమయములో వశిష్టులు వచ్చి పురంజయుని ఊరడించి "రాజా! మున్నొక సారి నీ వద్ద కు వచ్చితిని.

కార్తీకపురాణం 20 వ అధ్యాయము

20 వ అధ్యాయము
పురంజయుడు దురాచారుడా గుట
జనక మహారాజు, చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో " గురువర్యా! కార్తీక మాస మహాత్మ్యమును యింక ను విన వలయును నెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని వుదాహరణలు వినిపించి నన్ను కృతార్దునిగా జేయు" డనెను. అ మాటలకు వశిష్టుల వారు మంద హాసముతో " ఓ రాజా! కార్తీక మాస మహాత్మ్యము గురించి అగస్త్య మహాముని, అత్రి మునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదరు ఆలకించు" మని అ కథా విధానమును యిట్లు వివరించిరి. పూర్వ మొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి" ఓ అత్రి మహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టి నావు. కార్తీక మహాత్మ్యమును నీకు ఆ ములాగ్రమున తెలియును, కాన దానిని నాకు వివరింపుము" అని కోరెను. అంత "ఓ అత్రి మహామునీ! నీవు విష్ణువు అంశ యందు బుట్టి నావు. కార్తీక మాస మహాత్మ్యము నీకు ఆ మూలాగ్ర ముగా తెలియును, కాన దానిని నాకు వివరింపుము " అని కోరెను. అంత అత్రిమహముని "కుంభ సంభ వా! నీ వడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రితికరముగుటచే నుత్త మమయిన ది. కార్తీక మాసముతో సమాన ముగ మాసము. వేద ముతో సమాన మగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటి యగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమును నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధ న చేసిన ను, లేక దీ పదానము చేసిన ను గలుగు ఫలితము అపార ము. ఇందుకొక యితిహాసము వినుము. త్రే తాయుగా మును పురంజయుడ ను సూర్య వంశ పురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను.

కార్తీకపురాణం 19 వ అధ్యాయము

19 వ అధ్యాయము

చతుర్మా స్య వ్రత ప్రభావ నిరూపణ
ఈ విధముగా నైమిశా రణ్య మందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞాన సిద్దుడను ఒక మహా యోగి " ఓ దీన బాంధవా! వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వి తీయుడవని, సూర్య చంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రా దులచే సర్వదా పూజింప బడు వాడవని, సర్వ౦తర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రు లచే సర్వదా పూజింప బడు వాడవని, నిత్యుదవని, నిరాకారుడ వని సర్వ జనుల చే స్తుతింప బడుచున్న ఓ మాధవా! నికివే మా హృదయ పూర్వక నమస్కారములు సకల ప్రాణి కోటికి ఆధార భూ తుడవగు ఓ నంద నందా! మా స్వాగతమును స్వి కరింపుము. నీ దర్శన బాగ్యమువలన మేము మాఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్ర ములైన వి. ఓ ద యామయా! మే మి సంసార బంద ము నుండి బైట పడలే కుంటి మి, మమ్ముద్ద రింపుము. మాన వు డెన్నిపురాణములు చ ది వినా, యెన్ని శాస్త్రములు విన్న నీ దివ్య దర్శనము బడ యజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవగుడువు. ఓ గజేంద్ర రక్షకా! ఉపేంద్రా! శ్రీధ రా! హృ షికే శా!నన్ను కాపాడుము" అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీ హరి చిరునవ్వు నవ్వి " జ్ఞాన సిద్దా! నీ సోత్ర వచనమునకు నే నెంత యు సంత సించితిని. నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము" అని పలికెను.

కార్తీకపురాణం 18 వ అధ్యాయము

18 వ అధ్యాయము

స త్క ర్మ నుష్టా న ఫల ప్రభావము
" ఓ ముని చంద్రా! మీ దర్శనము వలన ధన్యుడ నైతిని సంశయములు తిరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడ నైతిని. తండ్రి- గురువు-అన్న-దైవము సమస్తము మీరే, నా పూర్వ పుణ్య ఫలితా ము వలెనే కదా మీబోటి పుణ్య పురుషుల సాంగథ్యము తటి స్థిం చేను. లేనిచో నెను మహా పాపినయి మహా రణ్య ములో ఒక మొద్దు బారిన చెట్టు ని యుండగా, తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీ కారణ్యములో తర తరాలుగా చెట్టు రూపమున  వుండవలసినదే  కదా! అట్టి! నేనెక్కడ! మీ దర్శన భాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పూనా ఫల ప్రదయియగు యీ కార్తీక మాస మెక్కడ! నాకు పాపత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించు టెక్కడ? యివి యన్నియును దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన, నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మనవుడెట్లు అను సరించ వలయునో, దాని ఫల మెట్టి దో విశ దీకరింపు"డని ప్రార్ధించెను.
" ఓ ధనలోభా! ణి వాడడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి వుపయోగార్ధ మైనట్టివి కాన, వివరించెదను శ్రద్దగా అలకిన్పుము ప్రతి మనుజుడు ఆ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన శున్యుడగు చున్నాడు. ఈ భేదము శరీరమునాకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్మర్మలు చేయవలెనని, సకల శస్త్రములు ఘోషించు చున్నవి. సత్కర్మ  నాచరించి వాటి ఫలము పరమేశ్వ రార్పిత మనరించిన జ్ఞానము కలుగును. మానవుడే, జాతి వాడో, ఎటువంతి కర్మలు ఆచరించావలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణో దయ స్నానము చేయక, సత్కర్మల నచారించినను వ్యర్ధ మగుఉన్. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించు చుండగాను విషక మాసములో సూర్యుడు మేష రాశిలో ప్రవేశించు చుండగాను, మాఘ మాసములో సూర్యుడు మకర రాశి యందుండ గాను అనగా ణి మూడు మాసముల యంద యిననూ తప్పక నదిలో ప్రాతః కాల స్నానము  చేయవలెను. అతుల స్నానము లాచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంట ప్రాప్తి కలుగును. సూర్య చంద్రా గ్రహణ సమయములండును తదితర పుణ్యదినముల యందు, స్నానము చేయవచ్చును. ప్రాతః  కాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్య సమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మ బ్రష్టుడగును.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles