Showing posts with label చరిత్ర. Show all posts
Showing posts with label చరిత్ర. Show all posts

Friday, 30 December 2016

రమణ మహర్షి !ఎవరి బోధా లేకుండా, తనంత తానే ఆత్మజ్ఞానిగా రూపొందినవారు రమణ మహర్షి. సుఖదుఃఖాలకు అతీతంగా జీవించి, ‘మహర్షి’ పేరును సార్థకం చేసుకున్నారు. ఆయనలో అప్రయత్నంగా కలిగిన ఆత్మవిచారం సహజ నిర్వికల్ప స్థితికి దారితీసింది. అరుణాచలం ఆయనకు ఆధ్యాత్మిక కేంద్రమైంది. అది ఈశ్వరుడి హృదయ స్థానం. ఆ జ్యోతిర్లింగ దివ్యకాంతులు రమణులపై ప్రసరించాయి.
అది 1879 డిసెంబరు 30. తమిళనాడులోని తిరుచుజి గ్రామవాసులైన అలగమ్మ, సుందరమయ్యర్‌ దంపతులకు వేంకటరామన్‌ జన్మించారు. అదే రమణమహర్షి అసలు పేరు. ఆ బాలుడు దిండిగల్‌ బడిలో సాధారణ విద్యార్థి. చదువు అంతగా పట్టుబడకున్నా, ఏకసంథాగ్రాహి కావడం వల్ల అన్నింటా నెగ్గుకొచ్చాడు. మధుర మీనాక్షిని దర్శించి, ఆధ్యాత్మిక అనుభూతి పొందాడు.
చదువుపై అతడి అశ్రద్ధ చూసి అన్న మందలించాడు. ఈ లౌకిక విద్యలన్నీ వ్యర్థమని వేంకటరామన్‌కు స్ఫురించింది. ఇల్లు వదిలి తిరువణ్ణామలై వెళ్లారు. భూగర్భ మందిరంలో ధ్యాన నిమగ్నుడయ్యారు. ఆయనను దర్శించేవారి సంఖ్య పెరిగింది. ఒకరోజు కుమారుణ్ని వెతుక్కుంటూ తల్లి వెళ్లింది. ఆమెకు పెన్సిల్‌తో ఒక సందేశం రాసిచ్చారు... ‘ప్రతి ప్రాణికీ కర్మను అనుసరించి జీవితం ఉంటుంది. అతడు ఎంత ప్రయత్నించినా, జరిగేది జరగక మానదు’ అని!
ఆయనకు ఉపన్యాస ధోరణి లేదు. శిష్యుల సందేహాలకు సూటిగా సమాధానాలిచ్చేవారు. అనేక దేశాల నుంచి పలువురు తమ సందేహాలు తీర్చుకోవడానికి రమణ మహర్షిని ఆశ్రయించేవారు. ఆత్మజ్ఞానం కలిగినవాడే ‘గురువు’ అని ఆయన చెబుతుండేవారు.
‘శ్రీరమణ సద్గురు’ అని శిష్యులు ఆయనను పిలిచేవారు. జిజ్ఞాసువుల ప్రశ్నలకు ఆయన ఇచ్చిన జవాబులు ‘శ్రీరమణ గీత’గా ప్రసిద్ధి చెందాయి. హంఫ్రీస్‌ అనే పాశ్చాత్యుడు ఓ అంతర్జాతీయ మనోవిజ్ఞాన శాస్త్ర పత్రికలో రాసిన వ్యాసం వల్ల, ఆయన ప్రఖ్యాతి అంతటా వ్యాపించింది. సూరినాగమ్మ ‘రమణాశ్రమ లేఖలు’ తెలుగు ప్రజలకు ఆయనను మరింత చేరువ చేశాయి. ‘ఎ సెర్చ్‌ ఇన్‌ సీక్రెట్‌ ఇండియా’ గ్రంథకర్త పాల్‌ బ్రంటన్‌- రమణ మహర్షి వైభవాన్ని స్తుతించారు. మనశ్శాంతి కోసం వెళ్లిన కావ్యకంఠ గణపతి ముని ఆయనలోని మహాపురుషుణ్ని దర్శించారు.
శ్రీరమణుల భూతదయకు అంతు లేదు. పశుపక్ష్యాదులను ఆదరంగా చూసేవారు. కోతులు, ఉడతలు, పిచ్చుకల పట్ల దయాభావం చూపేవారు. జంతుభాష ఆయనకు అర్థమయ్యేది. ఒకరోజున ఓ ముసలి కోతి భుజాన కోతిపిల్ల ఉండటం చూశారు. ‘తాతా! ఎంత కష్టం వచ్చింది నీకు... ఈ వయసులో బిడ్డను పెంచాల్సి వచ్చిందే... జాగ్రత్తగా సాకు... ఇది నీకు పుణ్యమే’ అన్నారు గద్గద స్వరంతో. ఆ కోతిపిల్లకు తల్లి చనిపోయింది. తల్లిలేని పిల్లను పెంచాల్సిన బాధ్యత పెద్ద కోతిదే! ఈ విషయం మహర్షికి తెలుసు. అలాగే ఆయన ఒక గోవుకు లక్ష్మి అని పేరుపెట్టి పెంచారు.
కృష్ణుడు రేపల్లె విడిచి వెళ్లేటప్పుడు గోపికల శోకం, రామాయణ గాథలో ‘తారా విలాపం’ కథాభాగం వింటున్నప్పుడు- అనుభూతితో ఆయనకు కన్నీళ్లు ఆగేవి కావు. అదీ రమణ మహర్షి మనసు! అతి క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాన్ని సైతం అతి సులభ శైలిలో అందరికీ అర్థమయ్యేలా వివరించేవారు.
శ్రీరమణులు ‘ఆత్మవిచారం’, ‘నేనెవరు’ అనే గ్రంథాల్ని రచించారు. ‘భగవంతుడు శాశ్వతుడు. ఎక్కడికీ పోడు!’ అని బోధించారు. ‘నేను ఎప్పటికీ వెళ్లను. ఇక్కడే ఉంటాను’ అని చెప్పేవారు. అరుణాచలంలోని రమణాశ్రమంలో ఆయన ఉన్నారనే దివ్యానుభూతి సందర్శకులకు ఇప్పటికీ కలుగుతుంటుంది. మహర్షి కరుణపూరిత నేత్రాలు వారిపై ప్రేమామృతాన్ని వర్షిస్తుంటాయి. అద్భుత సందేశాలు వారికి ఇంకా వినిపిస్తూనే ఉంటాయి!

డిసెంబర్ 30 "శ్రీ భగవాన్ రమణ మహర్షి" జయంతి

🌻🌹భగవాన్ శ్రీ రమణ మహర్షి🌹🌻

🍀రమణ మహర్షి తత్వం : అద్వైత వేదాంతము

🍀ఉల్లేఖన : మేధస్సులో ఉద్భవించే ఆలోచనల పరంపరలో మొదటి ఆలోచన నేను అనునది.

🍀శ్రీ రమణ మహర్షి (తమిళం : ரமண மஹரிஷி) (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు.బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నాడు.

🍀రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవాడు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు.వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవాడు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గములని కూడా బోధించేవాడు.

🌷కుటుంబ నేపథ్యం🌷

🍀శ్రీ రమణ మహర్షిగా ప్రఖ్యాతి గాంచిన ఈయనకు తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. భగవాన్ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ 'ఆరుద్ర దర్శనం (పునర్వసు నక్షత్రము) ' నాడు జన్మించాడు. శ్రీ భగవాన్ గారి తల్లి తండ్రులు శ్రీమతి అళగమ్మాళ్, శ్రీ సుందరేశం అయ్యర్లు. శ్రీ భగవాన్ గారికి ఇద్దరు సోదరులు (నాగస్వామి, నాగ సుందరం) ఒక సోదరి (అలమేలు). సుందరేశ అయ్యర్ గారు అక్కడ ప్లీడరుగా పని చేసే వాడు.

🌷బాల్యం🌷

🍀పూర్వాశ్రమంలో భగవాన్ అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవాడు. అపారమైన దేహదారుఢ్యం కలిగి ఉండేవాడు. బాల్యంలో చదువు మీద ఆసక్తి చూపించేవాడు కాదు. తిరుచ్చుళిలో సరైన విద్యాసౌకర్యం లేకపోవడం వలన వాళ్ళ చిన్నాన్న వద్దకు (సుబ్బాయ్యర్) వెళ్ళాడు. రమణులు చిన్నతనంలో బాగా నిద్ర పోయేవాడు. ఎలాంటి నిద్ర అంటే ఆయన నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఆయన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా ఆయనకు తెలిసేదికాదు. ఈయన అసలు పేరు వేంకటేశ్వర. ఒకసారి పాఠశాలలో వేంకటేశ్వర అని రాయమంటే వెంకట్రామన్ అని రాయడం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభం అయింది. రమణ గారి తండ్రి చనిపోవడం వాళ్ళ సుబ్బయ్యర్ గారు నాగస్వామి (రమణ గారి అన్నయ్య), రమణ లను మధురై తీసుకుని వెళ్ళిపోయాడు. రామస్వామి అయ్యర్ అనే ఆయన అరుణాచలం వెళ్ళివస్తుండగా రమణులు పలకరించి ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగాడు. ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పగా, ఆమాట విన్న తరువాత ఆయనలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుంచి అల్లరిచేయండం, రుచుల కోసం ప్రాకులాడటం మానేశాడు.

🌷బోధనలు🌷

🍀స్వీయ-శోధన ద్వారా మాత్రమే "జ్ఞాన మార్గము". వీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతములనే కాకుండా, అనేక మత సారములను మార్గాలను తన బోధనలలో బోధించేవారు.

🍀"The state in which the unbroken experience of existence-consciousness is attained by the still mind, alone is samadhi. That still mind which is adorned with the attainment of the limitless Supreme Self, alone is the reality of God.
It is SAHAJ SAMADHI. From here you have samadhan (steadiness) and you remain calm and composed even while you are active. You realize that you are moved by the deeper real Self within. You have no worries, no anxieties, no cares, for you come to realize that there is nothing belonging to you. You know that everything is done by something with which you are in conscious union.
"In samadhi itself there is only perfect peace. Ecstasy comes when the mind revives at the end of samadhi. In devotion the ecstasy comes first.. It is manifested by tears of joy, hair standing on end, and vocal stumbling. When the ego finally dies and the Sahaj is won, these symptoms and the ecstasies cease."

🌷శ్రీ రమణ మహర్షి శిష్యులు🌷

🍀కావ్యకంఠ గణపతిముని

🍀యోగి రామయ్య

🌷భగవాన్ గురించి చలం🌷

🍀భగవాన్ బోధించే వేదాంతమూ, ఆయన 'ప్రిస్క్రిప్షన్లూ' నాకు సమ్మతం కావు. ఆయన గంభీరత్వంలోనూ, లోకం మీద ఆయనకి వున్న సంపూర్ణ నిర్లక్ష్యం మీదా గౌరవం నాకు. ఆయన ఆత్మ సౌందర్యం ఆయన ప్రేమా నేను వొప్పుకుంటాను. నాకు స్త్రీ వుంది. మీకు దేవుడున్నాడు.స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు. స్త్రీ కోసం జీవితాల్ని ధ్వంసం చేసుకున్న వాళ్లని, అంటే కీర్తీ, డబ్బూ కాదు- అంతకన్న శ్రేష్టమైనవి -జీవితం మీద ఆసక్తినీ-శక్తినీ-బతకడంలో ఆనందాన్నీ, (Grip on Life and Joy of Living) పోగొట్టుకున్న వాళ్లని చూస్తే నేను చాలా వెవేకవంతుణ్ణిగా తోస్తాను.

🍀చెలం 1950 లో తిరువణ్ణామలై వెళ్ళిపోయారు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా వున్న 'మహాస్థాన్ ' ఆవరణ ఇంట్లో అద్దెకి ఉన్నారు. ఆ తరువాత అక్కడ ఒక ఇంటిని కొన్నారు. దాని పేరే రమణస్థాన్.ఈ ప్రదేశమంతా యోగులమయం. దొంగయోగులు లేరు. ఏమీలేని బోలుయోగులూ, ఏదో కొంతవరకు సాధించి స్థిమితపడ్డ మహనీయులూ కనపడేవారు చాలా కొంచెం. చాలామంది కనపడరు.భగవాన్ పోగానే తగాదాలు ఆశ్రమంలో! బ్రాహ్మణ, అబ్రాహ్మణ, అరవ, ఆంధ్ర, పరదేశీయులు ఒక జట్టు ఐనారు. లేచిపోతున్నారు.రౌడీలు, పోలీసు కాపలాలు - ఒక్క ఆత్మ మౌనమైన రూపుతో ఇన్నేళ్ళు పరిపాలించిన ఆశ్రమం. కృష్ణుడు పోగానే అర్జునుడు ఏడ్చిన ఏడుపు జ్ఙాపకం వొస్తోంది. ద్వారక ఏమయిందో - ఆనాడు - నిజంగానో, కవి హృదయంలోనో, అట్లావుంది లోకం నాకు!ఇప్పుడు ఆశ్రమం పిశాచం మల్లే, ఒక కలమల్లే వుంది. ఎక్కడివాళ్ళక్కడ లేచిపోయినారు. చాలా వొంటరితనం. మా వాళ్ళు 15 రోజులకిందటే వెళ్ళిపోయినారు. అదో చిత్రమైన వ్యవహారం 'చే ' బొంబాయిలో, 'షౌ ' మద్రాసులో, 'చిత్ర ' పశుమలైలో తక్కినవాళ్ళెక్కడ వున్నారో తెలీదు. ఎప్పుడు వస్తారో రారో తెలీదు. ఎవరైనా నన్ను గుర్తించి పలకరిస్తే చాలునన్నంత దీనావస్థలో! when you were in Thiruvannamalai go for a walk around the hill. The Arunachala hill will gives the power to all the hill itself called (Tejolingam). Shankara charya we sat in the hill and done the mediatation around the hill. if you can for a while into the hill you can catch the power.

Sunday, 18 December 2016

అర్జున విషాదయోగః 1 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)

Mahabharatam

ధృతరాష్ట్ర ఉవాచ : -

ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతా యుయుత్సవః,
మామకాః పాణ్డవాశ్చైవ
కిమకుర్వత సంజయ!

ధృతరాష్ట్రుడిట్లు పలికెను: ఓ సంజయా! నా వారలగు దుర్యోధనాదులను, పాండుపుత్రులగు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమి యగు కురుక్షేత్రమున జేరి యేమిచేసిరి?


సంజయ ఉవాచ :-

దృష్ట్వా తు పాణ్డవానీకం
వ్యూఢం దుర్యోధన స్తదా‌,
ఆచార్యముపసజ్గమ్య
రాజా వచనమబ్రవీత్‌.

ధృతరాష్ట్రునితో సంజయడిట్లు వచించెను :- అపుడు రాజైన దుర్యోధనుడు ప్యూహాకారము గాంచింపబడియున్న పాండవసేనను చూచి, తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు పలికెను.


పశ్యైతాం పాణ్డుపుత్రాణా
మాచార్య మహతీం చమూమ్‌,
వ్యూఢాం ద్రుపదపుత్రేణ
తవ శిష్యేణ ధీమతా.

ఓ గురువర్యా! బుద్ధిశాలియు, మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత ప్యూహాకారముగ రచింపబడియునట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమునుజూడుడు!


అత్రశూరా మహేష్వాసా
భీమార్జున సమా యుధి,
యుయుధానో విరాటశ్చ
ద్రుపదశ్చ మహారథః.

ధృష్ట కేతు శ్చేకితానః
కాశీరాజశ్చ వీర్యవాన్‌,
పురుజిత్కుంతి భోజశ్చ
శైబ్యశ్చ నరపుజ్గవః

యుధామన్యుశ్చ విక్రాంత
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్‌,
సౌభద్రో ద్రౌపదేయాశ్చ
సర్వ ఏవ మహారథాః

ఈ పాండవసేనయందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూర వీరులును పెక్కురు కలరు. వారెవరనిన - యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు. వీరందరును మహారథులే అయియున్నారు.


అస్మాకం తు విశిష్టా యే
తాన్నిబోధ ద్విజోత్తమ,
నాయకా మమ సైన్యస్య
సంజ్ఞార్థం తాన్‌ బ్రవీమి తే.

ఓ బ్రాహ్మణోత్తమా! ఇక మనసైన్యములో ప్రముఖులు, సేనానాయకులు ఎవరు కలరో వారలను జ్ఞాపకము కొరకు మీకు చెప్పుచున్నాను.(వినుడు)


భవాన్‌ భీష్మశ్చ కర్ణశ్చ
కృపశ్చ సమితింజయః,
అశ్వర్థామా వికర్ణశ్చ
సౌమదత్తి స్తథైవ చ

అన్యే చ బహవశ్శూరా
మదర్థే త్యక్తజీవితాః,
నానాశస్త్ర ప్రహరణా
స్సర్వే యుద్ధవిశారదాః.

మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వర్థమ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొరకు తమ తమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, అందరును యుద్ధసమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచట నున్నారు. 

Friday, 16 December 2016

కలి అనగా నేమి .కలియుగంలో ఏమి జరుగుతుంది

కలి అనగా నేమి .కలియుగంలో ఏమి జరుగుతుంది

ఒకసారి పాండవులంతా ( ఆ సమయంలోఅక్కడ ధర్మరాజు లేడు) కలసి కృష్ణుని సమీపించి " కలియుగం అంటే ఏమిటి? కలి యుగంలో ఏమి జరుగబోతుంది " అని అడిగారు.

దానికి శ్రీ కృష్ణుడు " నేను చెప్పను, మీరే తెలుసుకోండి అని " చెప్పి నాలుగు బాణాలు తీసుకుని నాలుగు దిక్కుల్లో వదలి, నలుగురిలో ఒక్కొక్కరు ఒక్కోదిక్కు వెళ్లి,తాను  వదిలిన బాణాలను తెమ్మని చెప్పి పంపించాడు..

     అర్జునుడు తూర్పు దిక్కుగా వెళ్లి, అక్కడ పడిన బాణాన్ని తీస్తుండగా మధురమైన స్వరం ఒకటి వినిపించింది.  చూస్తే ఒక చెట్టుకొమ్మపై కోకిల కూర్చుని మధురాతి మదురంగా గానం చేస్తూంది. కానీ అది తన కాళ్ల క్రింద ఎలుకనొకదాన్ని పట్టుకుని తినడానికి సిద్దంగా ఉండడం కూడా చూసి " ఇదేమి వింత..!" అనుకుని వెనుకకు వచ్చేసాడు...

      భీముడు ఉత్తర దిక్కుగా వెళ్లగా, అక్కడ పడిన బాణం పడే చోట ఐదు బావులు కన్పించాయి. వాటిలో ఒకటి చిన్నదిగా ఉండి పూర్తిగా ఎండిపోయి ఉంది.దానీ చుట్టూ ఉన్న నాలుగు
బావులు పూర్తిగా నిండిపొయి చాలదా అన్నట్లు వాటిలో నీరు భయటకు పొర్లుపోతుంది. ఈ సంఘటన చూసిన భీముడు ఏమీ అర్ధంకాక బాణం తీసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు...

       మూడవ వాడైన నకులుడు పడమట దిశగా వెళ్లి బాణంతో తిరిగి వస్తుండగా దగ్గరలోఒక ఆవు అపుడే జన్మనిచ్చిన దూడను తన నాలుకతో తుడుస్తుండడం చూసాడు. ఆ ఆవు , దూడ శరీరమంతా తుడుస్తూ ఉండగా కొందరు మనుషులు బలవంతంగా అతి కష్టంమీద ఆ ఆవునుండి దూడను వేరుచేయడం జరిగింది. ఈ పెనుగులాటలో దూడ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన చూసిన నకులుడు మనసులో కొంచెం బాధ పడ్డాడు. చేసేదేమీ లేక వెనుకకు వచ్చేసాడు...

       చివరివాడైన సహదేవుడు దక్షిణ దిశగా పోయి బాణం తీస్తుండగా పక్కనున్న కొండపైనుండి పెద్ద బండరాయి ఒకటి రాళ్లను పిండి చేస్తూ, చెట్లను విరచుకుంటూ వేగంగా దొర్లుతూ రావడం చూసాడు. అది అట్లా దొర్లుకుంటూ పెద్ద పెద్ద వృక్షాలను విరిచేస్తూ చివరికి ఒక చిన్న మొక్క దగ్గరకొచ్చి ఆగిపోయంది. సహదేవునికి మర్మం అర్దంకాక తిరిగివచ్చేసాడు...

      నలుగురు కృష్ణుని వద్దకు వచ్చి తాము చూసిన సంఘటనలను వివరించి వాటియందలి అర్దాన్ని తెలుపవలసిందిగా కోరారు...

      అపుడు కృష్ణుడు మందహాసంతో " కలియుగంనందు మానవులు తాము గొప్ప పండితులమని మాకు సాటి ఎవరూ లేరనే అహంకారంతో కోకిలకూత వలే నీతులు చెపుంట్తారు. కానీ చేసేవి మాత్రం నీచమైన పనులు. వీరు జీవితమంతా అజ్ఞనపు చీకటిలో ఉండి పూజకు పనికి రాని పువ్వు వలే బ్రతకాల్సి వస్తుంది. ఇదే అర్జునుడు చూసిన సంఘటనలోని అర్దం."

        " ఇక రెండవది.. కలియుగంనందు చాలా మంది వద్ద పుష్కలంగా ధనం ఉన్నప్పటికీ వ్యర్థపరమైన ఖర్చులు పెడుతుంటారు తప్ప తమ మద్యనే ఉంటూ కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న తోటి మానవులకు పైసా కూడా ఇవ్వరు. వీరు దనంతో సుఖాలను అనుభవిస్తున్నామనుకుంటుంటారు ..కానీ శవాలతో సహవాసం చేస్తుంటారు. ఇదే భీముడు చూసినదాంట్లోఅంతరార్దం."

          " ఇంకా మూడవది... కలియుగంలోతల్లిదండ్రులు (ఆవు తన దూడ పై చూపించిన అతి ప్రేమ వలే )తమ సంతానంపై మితిమీరిన ప్రేమ చూపిస్తుంటారు. నిజానికి ఈ అతి వలనే వారు చెడు త్రోవ లో పోయి జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. వీరివలన సమాజం చైతన్యం కోల్పోతుంది.. నకులుడు చూసిన సంఘటనలో అంతరార్దం."
       " ఇక చివరిగా కలియుగ మానవులు తమ ప్రవర్తన తీరుతెన్నులు సరిగా లేక, జీవిత పరమార్థం, మానవ జన్మ ఆవశ్యకత తెలుసుకోలేక కొండపైనుండి దొర్లి పడిపోయిన బండవలే దారీ తెన్నూ లేక నానా చిక్కుల్లో చిక్కుకుంటూ అశాంతిని అనుభవిస్తుంటారు.ఈ క్రమంలో తోటివారిని కూడా నానా అవస్థలకు గురి చేస్తుంటారు..

 అయితే అలా దొర్లుతూ చివరికి భగవంతుని చెంతకు వచ్చేటప్పటికి అశాంతి అంతా పొేయి పరమ శాంతిని పొందుతుంటాడు. ఇదే సహదేవుడు చూసిన సంఘటనలోని భావం." అని కృష్ణుడు బోదించాడు...

ధర్మరాజు - ‘యుధిష్ఠిరుడు’!

ధర్మరాజు - ‘యుధిష్ఠిరుడు’!

ధర్మరాజుకి యుధిష్టిరుడు అనే బిరుదం ఉంది. అంటే యుద్ధంలో స్థిరంగా నిలబడి పొరాడే వాడు అని అర్ధం. కాని ధర్మరాజు యుద్ధాల్లో వెనుదిరగని వీరుడు అని మనం ఋజువు చేయడం కష్టం.మరైతే ఈ బిరుదు ఆయన విషయంలో ఎలా సార్ధకమవుతుంది?

యుద్ధం అంటే కేవలం శత్రువులతో చేసేది మాత్రమే కాదు. ఆ యుధాలతో చేసేది అంతకన్నా కాదు. ఎవరు శత్రువో తెలియకపొయినా ఏ ఆయుధం దొరకపోయినా మనం మనల్ని జయించడం కోసం చేసే నిత్య జీవల సంగ్రామమే నిజమైన యుద్దం. ఆ యుద్ధంలో ధర్మరాజు నిజంగా వెనుదిరగని వీరుడే. అందుకే ఆయన యుధిష్టిరుడయ్యాడు.

ఆయన జీవన యుధిష్టిరత్వానికి ప్రత్యక్ష నిదర్శనమే ‘యక్ష ప్రశ్నలు’ ఘట్టం. ‘అనువుగాని చోట అధికులమనరాదు’ అని ప్రపంచంలో అన్ని ప్రదేశాలలోను, జీవితంలో అన్ని సందర్భాలలోను మనదేపైచేయి అనుకోకూడదు. వనవాసమ్లో ఉన్న ధర్మరాజుకి, సోదరులకి దాహం అయితే నకులుణ్ణి పిలిచి నీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయేమో తీసుకురమ్మన్నాడు. అతను వెళ్ళి ఒక సరోవరం చూశాడు. అందులొ దిగి నీరు త్రాగబోయాడు. అంతలో ఒక యక్షుడు కొంగరూపంలో వచ్చి అడ్డుకుని తన ప్రశ్నలు సమాధానలు చెబితే గాని నీరు త్రాగడానికి వీలులేదన్నాడు. కొంగను అల్ప జీవిగా భావించిన నకులుడు ఆ ఆదేశాన్ని ధిక్కరించి నీరు త్రాగబోయాడు.

యక్షుని క్రోధానికి గురై మరణించాడు. సహదేవుడు, అర్జునుడు, భిముడు కూడా అదే దారిని త్రొక్కి, అదే అహంకారంతో అదే విధంగా మరణించారు. చివరకు ధర్మరాజు వెళ్ళాడు.

సోదరుల శవాలు గమనించి దుఃఖించాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు గమనించాడు. ‘ఇది అనువు గాని ప్రదేశం, ఇక్కడ అధికులమనరాదు’ అని నిశ్చయించుకొన్నాడు. కొంగలోని దివ్యత్వాన్ని అవగాహన చేసుకొని ప్రశ్నలకు జవాబులివ్వడానికి సిద్ధపడ్డాడు. జవాబులు చెప్తే ఒక్కరినైనా బ్రతికిస్తుందని కచ్చితంగా చెప్పలేం. అయినా ఆపదలందు ధైర్యగుణము అన్నట్లుగా గుండెలు చిక్కబట్టుకుని తన ప్రయత్నం తాను చేశాడు.

మొత్తం వంద ప్రశ్నలకు పైగా ఉన్నా అన్నింటికీ ఓపికగా తన పరిజ్ఞానం మేరకు సమాధానం చెప్పాడు. అవి ఏ పుస్తకంలోనూ సమాధానాలు దొరకని ప్రశ్నలు. వాటికి ఏ కేంద్రంలోను శిక్షణ ఇవ్వరు. అవగాహనే గ్రంథం. అంతరంగమే శిక్షణా కేంద్రం.

భూమికంటే గొప్పది ఏది? - తల్లి.

ఆకాశం కంటె ఉన్నతుడు ఎవరు? - తండ్రి.

జీవితాంతం తోడుండేది ఎవరు? - గుండె ధైర్యం.

ఇవీ ఆ సమాధానాలు. ఆ సమాధానాలకు సంతోషించిన యక్షుడు చివరగా ఒక ప్రశ్న అడిగాదు. దానికి జవాబు చెబితే సోదరులలో ఒకరిని బ్రతికిస్తానన్నాడు. అక్కడికదే అదృష్టం అని అంగీకరించాడు ధర్మరాజు. చివరి ప్రశ్న చాలా ఆశ్చర్యకరమైనది.

అన్నింటికంటే ఆశ్చర్యకరమైనది ఏది? - ‘రోజు ఎంతో మంది మరణిస్తూ ఉంటె చూస్తూ కూడా మనం శాశ్వతం అనుకొని సంపదలు కూడబెట్టుకొంటున్నామే’ ఇదీ అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం అన్నాడు.

ఆశ్చర్యపోయిన యక్షుడు ధర్మరాజును అతి క్లిష్టమైన పరిస్థితిలోకి నెట్టాడు.

ఇంతకీ నీ సోదరులు నలుగురిలో ఎవరిని బ్రతికించమంటావు అన్నాడు.
ఇంతవరకు సమాచాకానికి పరీక్ష. ఇప్పుదు సంస్కారానికి పరీక్ష.
ధర్మరాజు ఒక్కక్షణం ఆలోచించలేదు.

‘నకుల జీవతు మేభ్రాతా’ నా తమ్ముడు నకులుణ్ణి బ్రతికించండి. అన్నాడు

ఇప్పుడాశ్చర్యపోవడం యక్షుని వంతయింది. అదేమిటయ్యా, అమాయక చక్రవర్తి, భయంకరమైన యుద్ధాన్ని పెట్టుకొని పదివేల ఏనుగుల బలం కలిగిన పార్ధుణ్ణి వదిలి నకులుణ్ణి కోరుకుంటున్నావేమిటి? అన్నాడు.

వెంటనే ధర్మరాజు గెలుపు గుర్రాల రాజకీయం తనకు తెలియదనీ, యక్షుడు నలుగురినీ బ్రతికిస్తే తనకు పరమానందమేననీ కానీ ఒక్కరినే కోరుకోమనడం వల్ల నకులుని కోరుకోవలసి వచ్చిందనీ స్థిరంగా చెప్పాడు.

మా నాన్న్గగారికి కుంతి, మాద్రి అని ఇద్దరు భార్యలు. వారిలో మాద్రి చనిపోతూ తన కుమారులిద్దరినీ మా అమ్మ చేతిలో పెట్టి వెళ్ళీపోయింది. కుంతి సంతానంలో పెద్దవాణ్ణి నేను బ్రతికే ఉన్నాను. మా పినతల్లి సంతానంలో పెద్దవాడు నకులుడు. కాబట్టి అతను బ్రతకాలి. ఇంతకు మించి నాకు రాజకీయ సమీకరణాలు తెలియవు.

నకులిణ్ణి నేను బ్రతికించగల్గితే మా తల్లులిద్దరికీ సమానంగా న్యాయం చేసిన వాణ్ణవుతాను. రేపు మా అమ్మ ఏ సందర్భంలో కూడా మా పినతల్లి ముందు తలవంచుకోవలసిన పరిస్థితి రాదు. మా అమ్మ నావల్ల ఈ లోకంలోనైనా ఏలోకంలోనైనా తలయెత్తుకుని బ్రతకాలి గానీ తలదించుకుని బ్రతకకూడదు. అని ధర్మరాజు నిశ్చయంగా చెప్పేసరికి ఆశ్చర్యపడి, ఆనందించి యక్షుడు భీమార్జున నకుల సహదేవులు నలుగురినీ బ్రతికించాడు.


అంటే ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి మన కర్తవ్యం ఏదో మనం చేస్తే ఆపైన దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుందన్నమాట.ఇదీ ధర్మరాజుని యుధిష్టిరుని చేసిన యక్ష ప్రశ్నల ఘట్టం.

*ఈవేళ పరీక్షలో నాలుగు జవాబులు ముందుండగా సరైన జవాబు గుర్తించడానికి ఒత్తిడికి లోనై ఆందోళనకు గురై, విజయం సాధించలేక ఆత్మహత్యలకు సహితం సిద్ధపడుతున్న మన యువతరం యక్ష ప్రశ్నలు చదివితీరాలి. ధర్మరాజు ముందు నాలుగు సమాధానాలు లేవు. నలుగురు తమ్ముళ్ళ శవాలున్నాయి. అయినా తట్టుకుని నిలబడి అన్నింటికీ సమాధానాలు చెప్పి సమాచారంలోను, సదాచారంలోనూ కూడా తనకు సాటిలేరని నిరూపీంచుకున్న జీవన యుధిష్టిరుడు, అదర్శ నాయకుడు ధర్మరాజు.*

అయ్యప్ప జన్మ రహాస్యమ్

నమస్కారం,


 నేను అయ్యప్ప స్వామి గురించి పూర్వం తెచ్చిన ప్రస్తావనకి అనుభంధముగా పూర్వము చెప్పిన విధంగా అయ్యప్ప స్వామి గురించి కొన్ని పరిశీలనగా చూసిన కొన్ని ప్రశ్నాత్మక సందేహాలను మీ ముందు ఉంచుతున్నాను.. ఇది వివాదాస్పదంగా కాకుండా కేవలం సత్యము గూర్చి పరిశీలనాత్మకంగానే చూసి, సందేహాలకు స్పందించవలసిందిగా మనవి . 


1) అయ్యప్ప స్వామి జననంకి ముఖ్య కారణం నుంచి మొదలు పెడదాము,
అయప్ప స్వామి జననానికి ముఖ్య కారణం మహిషి అనే రాక్షసి సంహారం కోసమని హరి హరులకు పుట్టిన సంతానం వలన మాత్రమే మరణం సంభవముగా బ్రహ్మ వరము పొందినది అని అన్నారు.
ఆ మహిషి ఎవరు అనేది కూడా చెప్పారు, మహిషాసురుడు అనే రాక్షసుడుకి చెల్లెలు అని, మహిషాసురుడు మరణానికి దేవతల పైన పగ తీర్చుకోవడం కోసమని తపస్సు చేసి వరము పొందినది అని అంటారు.. అసలు ఇక్కడ ఒక విషయం గమనించాలి అందరూ... మహిషాసురుడుని పార్వతీ దేవి కృత యుగములో సంహరించినది... ఆ మహిషాసురుడు కి చెల్లెలు అయిన మహిషి కూడా కృత యుగం నాటిదే, మరి ఆ మహిషిని సంహరించడానికి అయ్యప్ప కృత యుగములో కోట్ల యేళ్ళు ఆగి, త్రేతా యుగంలో కోట్ల సంవత్సరాలు ఆగి, ద్వాపర యుగంలో లక్షల సంవత్సరాలు ఆగి, కలియుగంలో 3వేల సంవత్సరాలు పైగానే ఆగి ఎందుకు అవతరించి మహిషిని సంహరించాడు?

2) కొంత మంది మహిషి ఆ యుగం నుంచే తపస్సు చేస్తూనే ఉంది అంటారు, అది సాధ్యము కానిది, ఎవరు అయినా తపస్సు ఉచ్చ స్థాయికి చేరుకునప్పుడు దేవతలు తప్పక ప్రత్యక్షం అవుతారు, లేకుంటే  వారి తపస్సు తీవ్రత వలన లోకాలు కంపిస్తాయి, అది జరుగక ముందే దేవతలు వచ్చి వరం ప్రసాదిస్తారు,. అంటే కృత యుగం నాటికే మహిషి వారం పొంది ఉండాలి & అప్పటి నుంచే ఇంద్ర పదవి ఆక్రమించి ఉండాలి... మరి ఎక్కడ? ఏ పురాణ వాగ్మయంలో కానీ సంభంధిత గ్రంధాలలో కానీ మహిషి ఇంద్ర పదవి ఆక్రమించిన ప్రస్తావన ఎందుకు ఎక్కడా లేదు? అంత ఇంద్ర పదవి ఆక్రమిస్తే మరి ఎందుకు ఎందులోనూ ప్రస్తావించలేదు?

3) అసలు మహిషి గురించే ఎక్కడా ఎందుకు లేదు? మహిషి అనే రాక్షసి గురించి కానీ తపస్సు గురించి కానీ వరం గురించి కానీ లేక ఇతర ఏ ఒక్క విషయం అయినా కానీ ఎందుకు ఏ పురాణ గ్రంధంలో ప్రస్తావించలేదు?

4) ఇప్పుడు అయ్యప్ప స్వామి గురించి చూస్తే, అంతటి హరి హర పుత్రుడు అయిన అయ్యప్ప స్వామి జననం గురించి కానీ లేక జీవితం గురించి కానీ ఎందుకు ఎక్కడా ఏ పురానా ఇతిహాసాదులలో ప్రస్తావించలేదు?  కొంత మంది అసలు చదవకా స్కాంద పురాణంలో ఉంది అంటారు, కొంత మంది వరాహ పురాణంలో ఉంది అంటారు.. నేను రెండిటిలోనూ చూశాను.. ఎక్కడా లేదు... చాలా మంది దేవతల గురించి యక్ష కిన్నెర కింపురుషాదుల గురించి చెప్పిన పురాణాలు అంతటి హరి హర పుత్రుడు ఆయప్ప స్వామి గురించి ఎందుకు చెప్పలేక పోయాయి?

5) కొంత మంది అయ్యప్ప స్వామి కలియుగం వాడు అందుకనే ద్వాపర యుగములో వాడైన వేద వ్యాసుడు అయప్ప గురించి పురాణ ప్రస్తావన చేయలేకపోయాడు అనే అవకాశం ఎంత మాత్రం లేదు, ఎందుకంటే కలియుగంలో జరిగే అనేక విషయముల గురించి వ్యాసుల వారు భవిష్యత్ పురాణంలో చెప్పి ఉన్నారు,. మరి అందులో అయినా అంతటి హరి హరులకు పుట్టిన అయప్ప స్వామి గురించి ఎందుకు చెప్పలేదు? పోనీ వ్యాసుల వారు చిరంజీవియే కదా, ఆది శంకరాచార్యుల వారికి దర్శనం ఇచ్చి బ్రహ్మ సూత్ర భాష్యం గూర్చి చర్చించిన ఆయన మరి అయప్ప గురించి ఎందుకు రాయలేకపోయారు ఎందుకు రాయించలేకపోయారు?

6) అసలు అయ్యప్ప స్వామి మోహినీ పుత్రుడు ఎప్పుడు అయ్యాడు? మహా విష్ణువు మోహినీ రూపము కేవలం రెండు సార్లే తీసుకున్నాడు, మొదటిది భస్మాసుర సంహారం, రెండవది క్షీర సాగర మధనం అను రెండు సంధార్భాలలో మాత్రమే తీసుకున్నాడు, అప్పుడు ఎక్కడా శివుడు మోహినిని చూసి మోహించడము కానీ అయప్ప పుట్టుక గురించి కానీ ఎక్కడా లేదే? మరి మోహినీ పుత్రుడు ఎలా అయ్యాడు?

7) అయప్ప స్వామి విగ్రహం పరశురామ ప్రతిష్టితం అన్నారు, అది కూడా సాధ్యము కానిదే, పరశురాముడు కేవలం శివ భక్తుడు, ఆయన శివుడునే పూజిస్తాడు, అంతటి పరశురాముడు ప్రతిష్ట చేస్తే కేవలం శివలింగ ప్రతిష్ట మాత్రమే చేస్తాడు, అందుకే మనము చాలా చోట్ల పరశురామ ప్రతిష్టిత శివలింగము చూస్తాము.. ఇకపోతే శివలింగ ప్రతిష్ట ఎందుకు అంటే, ఒక మనిషిని హతమార్చిన పాపం శివలింగ ప్రతిష్ట ద్వారా పోతుంది, అందుకనే పూర్వం రాజులు అనేక గుడులలో అనేక శివ లింగ ప్రతిష్టలు చేసే వారు.. పరశురాముడు అధర్మముతో ఉన్న క్షత్రియులను సంహరించడం చేత, మనిషిని చంపిన పాపం పోవడానికి శివ లింగ ప్రతిష్టలు చేశాడు,. ఆయన వేరొక దేవుడుని అసలు కొలువరు వేరొక దేవుడు విగ్రహ ప్రతిష్ట చేయరు.. అలా ఆయన అయప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట చేసినట్టుగా కూడా ఎటువంటి ప్రామాణికం లేదు..

8) అయప్ప స్వామి దీక్ష గురించి చూస్తే శనైశ్చరుడుకి వరము ఇచ్చి ఇటువంటి నియమములు పెట్టినట్టు ఉన్నది,. అది కూడా ఎక్కడా ప్రామాణికత లేదు, పైపెచ్చు.. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే.. శనైశ్చరుడు ఆయన ధర్మము ప్రకారము జాతక చక్రములో తాను ఉన్న కాలములో కొన్ని సార్లు చెడు ప్రభావము చూపిస్తాడు కొన్ని సార్లు మంచి చేస్తాడు,. అది ఆయన ధర్మం.. అది కూడా మన మంచి కొరకే ఆయన అలా నిర్వర్తిస్తాడు... కేవలం ఆయన జాతక చక్రంలో ఎవరికి అయితే ఆ కాలములో ఉంటాడో వారి మీద మాత్రమే శని ప్రభావము ఉంటుంది,. మరి అలాంటప్పుడు ఆ జాతక పరిస్తితి  లేని మిగతా అందరినీ కూడా అలానే శని ప్రభావము నుంచి తప్పించే విషంగా బట్టలు కట్టుకోవడం నుంచి ప్రతి నియమం పాటించమని ఎందుకు చెప్పాడు అయ్యప్ప? జాతకము గూర్చి అయప్ప స్వామికి తెలియదా? అసలు పైనవి చూస్తే అయ్యప్ప స్వామి అవతరించడమే ప్రశ్నార్ధకంగా ఉన్నది.

9) నవవిధ భక్తి రీతులలో చిట్ట చివరిది “శరణాగతి” అంటే శరణు వేడడం.. ముందు రీతులు ఏవి కానప్పుడు చిట్ట చివరిది అయిన శరణాగతిని ఆశ్రయిస్తారు.. అసలు అయప్ప స్వామిని భక్తులు ఊరక ముందే శరణం శరణం అని ఎలా అనేస్తున్నారు? ఆ “ శరణం “ అనే పదానికి ఎంత అర్ధం ఉన్నది? ఎప్పుడు పడితే అప్పుడు భగవంతుడుని శరణు వేడుతారా? శరణాగతికి అసలు అర్ధమే మార్చేస్తున్నారే? అసలు ఎందుకు శరణు వెడుతున్నారు పదే పదే? వారి జీవితము మరియు అన్నీ వారి చేతుల్లో ఇక ఏమి లేక దిక్కు తోచక చేసే శరణాగతి స్థితిలో వారు ఎవరైనా ఉన్నారా అసలు?? వేరే ఏ దేవుడుకి ముందుగానే శరణాగతి చేయవలసిందే అనే నియమం వేరే ఏ దేవుడుకి లేనిది ఎందుకు అయ్యప్పకే ఉన్నది? అయప్ప శరణాగతి చేస్తే కానీ పలకడా? అదొక్కటే మార్గమా అయ్యప్ప విషయంలో? అసలు వారి ఉద్ధేశంలో అలా పదే పదే పలికే శరణాగతికి వివరం ఏమిటి?

10) అయ్యప్ప స్వామి పూజ గురించి చూస్తే,. అసలు ఉపనయన సంస్కారము జరగనిదే ఎవరికీ గాయత్రి మంత్రము ఉచ్చరించే స్మరించే అర్హత లేదు, సంకల్పము పలికి పూజలు చేసే అర్హత లేదు.. భగవంతుడుకే తప్పదు ఈ నియమం.. వినాయకుడు అంతటి వాడే ఉపనయనం చేసుకొనక తప్పలేదు.. మరి అయ్యప్ప స్వామి భక్తులు ఏ అర్హత పొంది అలా పూజలు చేసేస్తున్నారు? ఉపనయనము అయినదా? గాయాత్రి మంత్రోపదేశము జరిగినదా ? మరి ఎవరు పడితే వాళ్ళు పూర్తి శాస్త్ర విరుద్ధంగా అలా గాయత్రి పలుకుతూ అయప్ప పూజ ఎలా చేస్తున్నారు? ఏ మంత్రము అయినా ఉపదేశము లేనిదే చదివితే అది పెద్ద దోషము.. మరి శాస్త్ర విరుద్ధంగా అలా ఎలా ఉపదేశం లేకుండా గాయత్రి మంత్రము చదువుతూ, సంకల్పము చెప్పి ఎవరు పడితే వాళ్ళు పూజలు అలా ఎలా చేసేస్తున్నారు?


పైన అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కేవలం భావాత్మకముగా కాక సత్యములేని “మా నమ్మకం మాది” అనే మూఢ నమ్మకముతో కాక ప్రామాణీకముగా సందేహాల నివృత్తి చేయగలరని ప్రార్ధన..

ఇది వివాదాస్పదంగా కాకుండా కేవలం సత్యము గూర్చి పరిశీలనాత్మకంగానే చూసి, సందేహాలకు ప్రామాణికంగా  స్పందించవలసిందిగా మనవి .

శ్రీ రామ చంద్రపరబ్రహ్మణే నమః 🙏🏻🙏🏻
శ్రీ గురుభ్యో నమః 🙏🏻🙏🏻🙏🏻

 Source: internet

Tuesday, 6 December 2016

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అంటే ఏమిటి?

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే (స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి.)

bharathakandam

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:
1) కేతుముల వర్ష 2) హరి వర్ష 3) ఇలవ్రిత వర్ష 4) కురు వర్ష 5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష 7) కింపురుష వర్ష 8 ) భద్రస్వ వర్ష
పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.
ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.
మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.
దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !
మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.
మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?
ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

Friday, 2 December 2016

చరిత్రలో ఈ రోజు/నవంబర్ 6

🔲

1860: అబ్రహం లింకన్ అమెరికా 16వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

1913: దక్షిణాఫ్రికాలో భారతీయ గనికార్మికులతో ప్రదర్శన జరపగా, మహాత్మా గాంధీ అరెస్టయ్యాడు. ఆయనకు 9నెలల జైలుశిక్ష వేశారు.

1923: వారానికి ఐదు రోజులతో రష్యాప్రయోగాత్మక కాలమాన పద్ధతిని ప్రవేశపెట్టింది.

1937 : భారతీయ రాజకీయ నాయకుడు మరియు మాజీ భారత ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా జననం.(చిత్రంలో)

1941: నౌఖాలీ ఊచకోత జరిగిన ప్రాంతాల్లో గాంధీజీ పర్యటించారు.

1943: అండమాన్ నికోబార్ దీవులను జపాన్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌కు అప్పగించింది. ఆయన వాటికి షహీద్, స్వరాజ్య అని నామకరణం చేసాడు

ఝాన్సీ లక్ష్మీబాయి

*🇮🇳🌷నవంబర్ 19 ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా..... 🌷🇮🇳*

🍀ఝాన్సీ లక్ష్మీబాయి (నవంబరు 19, 1828 – జూన్ 17, 1858) (హిందీ- झाँसी की रानी మరాఠీ- झाशीची राणी), మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. మరియు భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డుకొన్న వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. భారత దేశం యొక్క "జాయన్ ఆఫ్ ఆర్క్" లాగా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.

*🌹బాల్య జీవితం🌹*

🍀ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్లా ఆమోదింపబడుతున్నది. దీనికి ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె తరుపు గుమస్తా ఆయనకు రాణీ 26 ఏళ్ళ స్త్రీ అని చెప్పడం జరిగింది.

🍀ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయి లు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక దోరణి మెండుగా కలది. రాణి అసలు పేరు మణికర్ణిక కాగా ఆమె ను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. ఆమె తల్లి రాణి నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది.

🍀ఇలాంటి క్లిష్ట సమయంలో బాజీరావు పీష్వా మోరోపంత్ ను బిఠూర్ కు పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. బాజీరావు కు సంతానం లేకపోవడంతో నానా సాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానా సాహెబ్, అతని పినతండ్రి కుమారుడు రావు సాహెబ్ మనూబాయిని తమ చెల్లెలిగా ఆదరించారు. వీరు ముగ్గురూ కలిసే విద్యలన్నీ నేర్చుకున్నారు. కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వండి విద్యలంటే మనూకు మక్కువ ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ నానా సాహెబ్ వెంట మనూబాయి దుసుకొని పోయేది.

*🌹వివాహం🌹*

🍀లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహమైంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది. 1851లో లక్ష్మీబాయి ఒక కుమారునికి జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు. 1853 లో గంగాధర రావుకు విపరీతమైన అనారోగ్యం సోకింది. వేరే బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని అందరూ సలహ ఇచ్చారు. దాంతో ఆయనకు దూరపు బందువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం ఒక్క రోజు ముందుగానే దత్తత తీసుకున్నారు. 1853, నవంబర్ 21 వ తేదీన గంగాధరరావు మరణించాడు.

*🌹ఆక్రమణ🌹*

🍀వివాహం తరువాత ఆమె పేరు లక్ష్మిబాయిగా మార్చబడింది. సభలో ఆమె తండ్రికున్న ప్రాభల్యం వలన, మిగిలినిన యువతులు, ఎవరైతే జెనన కి నిర్బంధం చేయబడి ఉంటారో, వాళ్ళకంటే ఎక్కువ స్వాతంత్ర్యం ఈమెకు వుండేది.ఆమె సాయుధ దళం, గుర్రపుస్వారీ, విలువిద్యలలో ప్రావీణ్యం సంపాదించింది, అంతే కాకుండా తన స్నేహితురాల్లందరినీ చేర్చుకొని సభలో ఒక సైన్యాన్ని తయారుచేసింది.

🍀1851 లో రాణి లక్ష్మిబాయి తన కుమారుడికి జన్మనిచ్చింది, కాని అతను తన నాలుగు నెలల వయస్సులోనే చనిపోయాడు. తమ కుమారుడు చనిపోయిన తరువాత, ఝాన్సీ యొక్క రాజు మరియు రాణి దామోదర్ రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకొన్నారు. కాని రాజు అయిన ఆమె భర్త తన కుమారుడి మరణం నుంచి తేరుకోలేక, 21 నవంబర్ 1853 లో పగిలిన హృదయముతో చాలా బాధ పడుతూ చనిపోయాడని చెప్పబడింది. వీరు దత్తత తీసుకునే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావల్సి ఉన్నా బ్రిటీష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దామోదర్ రావు రాజా కు రక్త సంబంధం కానందువలన అంటే దత్త సంబంధం కావున, ఈస్ట్ ఇండియా కంపనీ గవర్నర్-జెనరల్ లార్డ్ డెల్ హౌసి, సిద్ధాంతం ప్రకారం రావు సింహాసనాన్ని అధిష్టించే అధికారం లేదని అతనిని నిరాకరించాడు. దాంతో లక్ష్మీ బాయి ఈస్ట్ ఇండియా కంపెనీ కి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ ను సంప్రదించి లండన్ కోర్టులో దావా వేసింది. ఆ లాయరు కేసును చాలా చక్కగా వాదించినా లాభం లేకపోయింది. కేసును కోర్టు కొట్టివేసింది. ఆంగ్లేయులకు రాణి మీద కక్ష కలిగింది. వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 1854 లో రాజు ఋణపడిఉన్న 60 వేల రూపాయలను ఆమెకు లభించే పెన్షన్ నుంచి తీసేసుకున్నారు. ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ పూనింది.

*🌹గొప్ప తిరుగుబాటు🌹*

🍀రాణి ఝాన్సీ ని ఇవ్వకూడదని నిశ్చయించుకొన్నది. ఆమె తన సైన్యాన్ని బలపర్చి మరియు తమకు తాముగా వచ్చిన వాళ్ళను పోగుచేసి ఒక సేనను తయారుచేసింది. మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వబడింది. యుద్ధ వీరులైన గులాం గాస్ ఖాన్, దోస్త్ ఖాన్, ఖుదా బక్ష్, లాల భు బక్షి, మోతీ బాయి, సుందర్-ముందర్, ఖాసి బాయి, దీవాన్ రఘునాథ్ సింగ్, మరియు దీవాన్ జవహర్ సింగ్ రాణి బలగంలో ఉన్నారు.

*🌹1857 స్వాతంత్ర్య పోరాటం🌹*

🍀ఝాన్సీలో ఇవన్నీ జరుగుతున్నపుడు, మే 10,1857లో మీరట్ లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా నిలిచింది. పందులంటే ముసల్మానులకు ద్వేషమని, హిందువులకు ఆవులంటే పవిత్రమైనవని తెలిసినా కాని,వాళ్ళు యుద్ధములో తుపాకి గుండ్లు తగలకుండా వేసుకొనే తొడుగులకు, మరియు వాళ్ళు వాడే తుపాకీలకు పందుల మరియు ఆవుల కొవ్వుని పూసారు. బ్రిటిష్ అధికారులు వాళ్ళను వాటిని వాడవల్సిందిగా బలవంత పరిచి,ఎవరైతే వినలేదో వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టారు. ఆ తిరుగుబాటు సమయంలో చాలా మంది బ్రిటిష్ ప్రజలు, మహిళలు,పిల్లలు సిపాయిల చేతిలో చంప బడిన వాళ్ళలో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా ముగించాలనుకొన్నారు.

🍀ఇంతలో, మే 1857,లో భారత దేశంలో కలవరం ప్రాకడం మొదలైంది, ఉత్తర ఖండంలో మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం మొదలైంది. ఈ క్లిష్ట పరిస్థితులలో,బ్రిటిష్ వాళ్ళు ఇంకెక్కడో వాళ్ళ ధ్యానాన్ని కేంద్రీకరించవలసినదిగా నిర్భందం రావడంతో,ఝాన్సీ ని లక్ష్మిబాయి పరిపాలించవలసిన అవసరం ఏర్పడింది. ఈ సమయంలో ఆమె తన సత్తాని చాలా వేగంగా ప్రదర్శించి ఝాన్సీ యుద్ధానికి సేనలను సమర్థవంతంగా తయారుచేసింది. ఈ తన సమర్థత కారణం వలన లక్ష్మిబాయి మధ్య కాలంలో వచ్చిన సామ్రాట్ల కలవర సమయములో కూడా ఝాన్సిని శాంతియుతంగా ఉంచగలిగింది.

🍀అప్పటి వరకు, బ్రిటిష్ కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు సంశయించిన కాని,జూన్ 8 1857 జోఖన్ బాఘ్ లో బ్రిటిష్ HEIC అధికారుల, వాళ్ళ భార్య, పిల్లల "జన సంహారం"లో ఆమె పాత్ర ఇంకా ఒక వివాదాస్పదము గానే నిలిచిపోయింది.చివరికి మార్చి 23 1858 లో బ్రిటిష్ బలగాలు సర్ హుఘ్ రోజ్ వశములో ఝాన్సీ ని ఆక్రమించుకున్నప్పుడు ఆమె సంశయం తీరిపోయింది. ఆమె యుద్ధ వీరులతో కలిసి లొంగ కూడదని ఆమె నిర్ణయించుకొంది. యుద్ధము సుమారు రెండు వారాలు జరిగింది. ఝాన్సీ నిర్మూలన చాలా భయంకరమైనది. ఝాన్సిలో మహిళా సైన్యం కూడా యుద్ధ సామగ్రిని మరియు తిను భండరములను సిపాయిలకు అందించేవారు. రాణి లక్ష్మిబాయి చాలా చురుకుగా ఉండేది. ఆమె నగర రక్షణను తనే స్వయంగా పరిశీలించేది.

🍀ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్ కి వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసింది. ఝాన్సీ కి స్వేచ్ఛ కలిగించి లక్ష్మిబాయి ని స్వతంత్రుపరురాలు చేయటానికి తిరుగుబాటు దార్ల నాయకుడైన తాత్యా తోపే ఆధ్వర్యములో 20,000 మంది సైన్యం పంపబడింది. మార్చి 31లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర లెక్కకి 1,540 సిపాయిలు మాత్రమే ఉన్నాకాని, "ఏ శిక్షణ లేని వాళ్ళ కంటే" వీళ్ళు చాలా శిక్షణ పొందినవాళ్ళు, మరియు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కావడంతో,బ్రిటిష్ వాళ్ళు ఆక్రమణ మొదలు పెట్టడంతో, ఈ అనుభవం లేని సిపాయిలు పారిపోయారు. లక్ష్మిబాయి బలగాలు బలహీనమవడంతో మూడు రోజుల తరువాత బ్రిటిష్ వాళ్ళు నగర గోడలను చీల్చుకొని నగరాన్ని ఆక్రమించుకోగలిగాయి. ఆమె తన రక్షకులు చుట్టూ ఉండడంతో ఆ రాత్రి గోడ దూకి నగరం నుంచి పారిపోగలిగింది,ఆ రక్షకులలో చాలా మంది తన మహిళా సైన్యం నుండి ఉన్నవారే.

🍀1857లో అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవ కారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్ఛంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణను ఇవ్వనారంభించింది. ఆమె దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉన్న వారంతా ఆమె యుద్ధం చేస్తున్న కారణానికి మద్దతుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారే. సెప్టెంబర్ మరియు అక్టోబర్ 1857 లో ఆమె ప్రక్క రాజ్యాలైన దతియా మరియు ఓర్చా రాజ్యాల నుంచి దాడిని విజయవంతంగా ఎదుర్కొనగలిగింది.

🍀జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ ని ముట్టడించడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. కానీ రాణి మాత్రం మగ వేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున తగిలించుకుని వారి కన్నుగప్పి పారిపోయింది. కల్పి అనే ప్రదేశానికి చేరుకుని తాంతియా తోపే అనే విప్లవ కారుణ్ణి కలుసుకోగలిగింది.

🍀ఆమె, చిన్నవాడు అయిన దామోదర్ రావు, మరియు తన బలగాలతో కల్పి కి పారిపోయి తాత్యా తోపే ఉండే తిరుగుబాటు దారులతో చేరింది. రాణి మరియు తాత్యా తోపే గ్వాలియర్ కు వెళ్లి తమ తిరుగుబాటు బలగాలను ఒకటి చేసి గ్వాలియర్ మహారాజ సైన్యాన్ని ఓడించి తమ బలగాలతో వాళ్ళను పూర్తిగా నశించి పోయేలా చేసారు. తరువాత వాళ్ళు కపటోపాయముతో గ్వాలియర్ కోటను ఆక్రమించుకొన్నారు. కాని,17 జూన్ 1858,లో రెండో రోజు యుద్ధములో రాణి మరణించింది.ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలున్నాయి. ఇప్పటి బ్రిటీష్ రిపోర్టులను బట్టి ఆమె బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని తెలుస్తోంది. టి.ఎ మార్టిన్ రాసిన లేఖ ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది.

🍀తనతో పాటు ఆమెను తీసుకు వెళ్తానన్న తాంతియా తోపే సహాయాన్ని తిరస్కరిస్తూ ఆమె ఒక నిచ్చెన ను తెమ్మని పురమాయించింది. దాని సహాయంతో దగ్గరే ఉన్న గడ్డి వామి పైకి ఎక్కి దాన్ని తగుల బెట్టమని చెప్పింది. ఆమె అనుచరులు అలాగే చేశారు. ఇది ఫూల్ భాగ్ వద్దనున్న గుసైన్ బాగ్ వద్ద జరిగింది. నేను అక్కడికి వెళ్ళి చూశాను.

🍀తర్వాత మూడు రోజులకు బ్రిటీష్ వారు గ్వాలియర్ ను చేజిక్కించుకున్నారు. గ్వాలియర్ యుద్ధం గురించి జనరల్ రోస్ ప్రస్తావిస్తూ విప్లవ కారుల్లోకెల్లా ఆమే అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని కితాబిచ్చాడు. దాని వల్లనే ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది.

*🌹మరణం🌹*

🍀ఆమె 17 జూన్, 1858 లో గ్వాలియర్ తో యుద్ధ సమయములో తన ఎనిమిదొవ యుద్ధ గుర్రంతో మరణించింది, అది గ్వాలియర్లోని ఫూల్ బాఘ్ దగ్గర కోతః-కి-సేరిలో జరిగింది. ఆమె యుద్ధ వీరులకు యుద్ధ బట్టలు తొడిగించి గ్వాలియర్ కోటను రక్షించటానికి యుద్ధానికి తీసుకెళ్ళింది,ఇది ఇప్పుడు ఉత్తర ప్రదేశ్లో ఉండే లక్నోకి పడమరగా 120 మైళ్ళ దూరంలో ఉంది. మూడు రోజుల తరువాత బ్రిటిష్ వాళ్ళు గ్వాలియర్ ను ఆక్రమించుకొన్నారు. గ్వాలియర్ యుద్ధ నివేదిక ప్రకారం, గెనరల్ సర్ హుఘ్ రోస్ ఆమెని "చాలా చెప్పుకోదగిన అందమైనది,తెలివైనది, మరియు పట్టుదల కలది"అని "తిరుగుబాటు నాయకులలో కెల్లా అతి భయంకరమైనది" అని విర్శించారు.

🍀కాని, కొరతగా ఉన్న శవాన్ని గుర్తించి, అది రాణి అని నమ్మించారని " పరాక్రమ" పటాలముగా చెప్పబడే ఆమె గ్వాలియర్ యుద్ధంలో చనిపోలేదని కెప్టన్ రీస్ నమ్మబడి, "[ది] ఝాన్సీ మహారాణి బ్రతికే ఉంది!" అని బహిరంగంగా ప్రకటించాడు.ఆమె ఎక్కడైతే మరణిచిందో అక్కడే అదే రోజు ఆమెకు అంత్

చరిత్రలో ఈ రోజు/నవంబర్ 26

🔲
భారత జాతీయ న్యాయ దినోత్సవం

1949 : స్వతంత్ర భారత రాజ్యాంగంఆమోదించబడింది.

1954 : శ్రీలంకలో ఎల్.టి.టి.ఇ. ఉగ్రవాద సంస్ఠ వ్యవస్థాపకుడు మరియు నాయకుడు, వేలుపిళ్ళై ప్రభాకరన్ జననం (మ.2009).

1956 : తమిళనాడు రాష్ట్రం ఏర్పడింది.

1960 : భారత టెలిఫోన్లు STD సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయి.

1967 : వెస్ట్‌ ఇండీస్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు రిడ్లీ జాకబ్స్ జననం.

1975 : తెలుగు సినిమా ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య మరణం (జ. 9 ఆగష్టు 1910).

2006 : తెలుగు సినిమా నటి జి.వరలక్ష్మి మరణం (జ.1926).

2008 : 2008 ముంబై లో టెర్రరిస్ట్ దాడులుజరిగినవి.ఈ దాడిలో...

"ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్" అధిపతి హేమంత్ కర్కరే మరణం.

ముంబై పోలీసు అడిషనల్ కమీషనర్ అశోక్ కాంమ్టే మరణం.

సీనియర్ పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలస్కర్ మరణం.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles