Showing posts with label పురాణాలు. Show all posts
Showing posts with label పురాణాలు. Show all posts

Tuesday 16 May 2017

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం - 42 ( శ్రీ హను మంతేశ్వరం)

శ్రీ రామ చంద్రుని పట్టాషేకం తర్వాత ఆంజనేయుడు రామాజ్న తీసుకొనిగం ధ మాదన పర్వతం చేరి శ్రీ రామ మంత్ర జపం లో జీవిస్తూ ,చరి తార్ధుడు అవుతున్నాడు .రామ రావణ యుద్ధం లో తాను చాలా మంది రాక్షసులను సంహరించానని ,దాని వల్ల మహా పాతకం సంక్ర మించిందని ,దాన్ని పోగొట్టు కోవా టానికి శివున్ని సందర్శించాలని కోరిక కలిగింది . ,దాని వల్లే మనశ్శాంతి లభిస్తుందని భావించాడు .సీతా రాములకు మనస్సు లోనే నమస్కారం చేసి ,వెంటనే ఆకాశ మార్గం లో కైలాసం చేరాడు .

అక్కడ నందీశ్వరుడు అడ్డు పడి హనుమా !నీ ఆలోచన మంచిదే .కాని బ్రహ్మ హత్యా పాతకం తో శివ దర్శనం దుర్లభం .పాపాలను పోగొట్టు కొని శివ దర్శనం చెయ్యి .నర్మదా నది అఘ విదారిణి .అక్కడ కొన్ని రోజు లుండి స్నానం తో పవిత్రుడవు కమ్ము .శివుని గూర్చి తపస్సు చేస్తూ ఆయన అనుగ్రహం పొందు .అని హితవు చెప్పాడు .

ఆంజనేయుడు ఆ మాటలు విని నర్మదా నది చేరి ,దాని దక్షిణ ప్రాంతం లో ఉన్నసోమ నాద దేవాలయానికి దగ్గర లో . ప్రశాంత వాతావరణం లో ఉంటూ ,స్నానం చేస్తూ శివ ధ్యానం తో తీవ్ర తపస్సు చేశాడు .ప్రాణ వాణ్ని ,పంచాక్షరిని ఏకాగ్ర చిత్తం తోజపించాడు .మనసు ను స్వాధీనం చేసుకొన్నాడు .

పార్వతీ మనోహరుడు మెచ్చి ప్రత్యక్షమయాడు .హనుమా !నీకు పాపం అన్టు తుందా ?పాపం ఎప్పుడో పోయింది .ఎప్పుడు నువ్వు పవిత్రుడవే అన్నాడు .వెంటనే మారుతి లేచి నిలబడి నమస్కరించి పార వశ్యం తో స్తుతి చేసి ప్రీతీ కల్గించాడు .శివుడు హను మతో నీకు పాపాలు లేకున్నా ,మానవులు ఇలా ఉండాలి అని మార్గం చూపించావు .నీ తప ధ్యానాలకు చాలా సంతృప్తి చెందాను .నువ్వు సర్వ దేవాత్మకుడవు .నీ నామాన్ని స్మరిస్తూ ,జపిస్తూ,నిన్నుచూస్తూ ,అందరు సర్వదా శుభాలను పొందుతారు .హనుమ ,అంజనీ సుత ,వాయు పుత్రా ,మహా బాలా ,పింగాక్ష ,లక్ష్మణ ప్రాణ దాతా ,సీతా శోక నివర్తకా అని స్తుతిస్తూ అదృశ్య మై నాడు . వాయు సూనుడు తానూ తపస్సు చేసిన చోట అన్ని కోర్కెలు తీర్చే శివ లింగాన్ని ప్రత్ష్టించాడు ..ఒక పుష్కరిణి ఏర్పాటు చేశాడు .హను మంత వనం నిర్మించాడు .దానిలో అన్ని రకాల చెట్లు ,అన్ని రకాల పూల తీగెలు ,బహువిధ ఫల ములనిచ్చే వివిధ రకాల పండ్ల చెట్లు ఏర్పరచాడు .జింకలు ,గోరు వంకలు ,చిలకలు ,నెమళ్ళు ,కోకిలలు మొదలైన పక్షి జాతు లన్ని వచ్చి చేరాయి .నందన వనాన్ని మించిన సౌందర్యం తో ఆ వనం శోభిస్తోంది .అక్కడ ప్రశాంతత రాజ్యం చేస్తుంది .తపస్సు కు మిక్కిలి అనుకూలం గా ఉంది .ప్రకృతి శోభ కళ్ళకు ఆనందాన్ని చేకూరుస్తోంది .ఇదే హను మంతేశ్వరం .ఇక్కడ శివుడిని దర్శిస్తే సకల పాప హారం సకల మనో భీష్ట సిద్ధి కలుగు తాయి అని పరాశర మహర్షి మైత్రేయ మహర్షి వివ రించి చెప్పాడు . 

Saturday 25 February 2017

స్మృతులు


మొత్తము స్మృతులు పదునెనిమిది(18).
1. మనుస్మృతి, 2. పరాశర స్మృతి, 3. వశిష్ట స్మృతి, 4. శంఖ స్మృతి, 5. లిఖిత స్మృతి, 6. అత్రిస్మృతి, 7. విష్ణు స్మృతి, 8. హరీత స్మృతి, 9. యమ స్మృతి, 10 . అంగీరస స్మృతి, 11. ఉశన స్మృతి, 12. సంవర్తన స్మృతి, 13. బృహస్పతి స్మృతి, 14. కాత్యాయన స్మృతి, 15. దక్ష స్మృతి, 16. వ్యాస స్మృతి, 17. యజ్ఞవల్క్య స్మృతి, 18. శాతాత స్మృతి. వీటన్నిటిలో మనుస్మృతి ముఖమైనది.

వేదాంతములు-ఉపనిషత్తులు:

ఉపనిషత్తులకు మరోకపేరు వేదాంతములు. ఒకప్పుడు మహారుషులు, ఋషి పుత్రులు ఒక్కచోట చేరి ఆత్మ అంటే ఏమిటి? జీవుడంటే ఎవరు? జీవేశ్వరుల సంభందం ఏమిటి? మనం ఎచ్చట నుండి వచ్సితిమి? ఎచ్చటకు పోయెదము? అను ప్రశ్నల గురించి చర్చలు జరుపగా ఫలించిన జవాబులే ఈ ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సంఖ్య 108. ఇందులో 10 ఉపనిషత్తులు మాత్రమే ఆదిశంకరాచార్యుల కాలమున సర్వాంగీకరము పొందినట్లు తెలియుచున్నది. అవి ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకము అను దశోపనిషత్తుల మీదనే ఆచార్యులవారు భాష్యములు రచించినారని తెలియుచున్నది.
శివుని వాహనం నంది గో సంతతి
నంది లేని శివాలయం లేదు
గోక్షిరం లేనిదే శివాభిషేకం కాదు

విభూతి నిర్మాణం ఆవు పేద తోనే చెయ్యాలి
విభూతి తో శివాభిషేకం ఐశ్వర్యప్రదం
విభూతి ధారణ యిచ్చు ఆయువృద్ది
గోవు నుదుట శివుడున్నాడని శాస్త్ర వాక్యం
శివుని వాహనం నంది కైలాసానికి తీసుకుపోతే
యముని వాహనం దున్నపోతు యమలోకానికి తీసుకుపోతుంది.
శివ శివ శంకర హర హర శంకర
శివ శివ శంకర హర హర శంకర
శివ శివ శంకర హర హర శంకర.
నందుడి కోసం వెలసిన శివుడు ( మహానంది క్షేత్ర వైశిష్ట్యం)
.
శివుడు భక్తసులభుడు. భక్తితో కొలిస్తే ఇట్టే ప్రత్యక్షమై కోరిన కోర్కెలు తీరుస్తాడనికదా అందరి విశ్వాసం. అలానే మహానందిలో నందీశ్వరుడికోసం అక్కడ వెలసిన మహాశివుడి వృత్తాంతం ఆ క్షేత్ర ప్రాభవాన్ని వివరిస్తుంది.
ఒకానొక కాలంలో శిలాదమహర్షి తనకు సంతానం లేదని ఎంతో ఖేదం అనుభవించేవాడు. సృష్టిస్థితిలయలకు కారణభూతుడు, ఆధారభూతుడైన కరుణాంబోధి అపార కృపావత్సలుడైన ఆ పరమేశ్వరుడు తప్ప తనను బాధనుంచి విముక్తిచేయువారెవరూ లేరని నిశ్చయించుకొన్నాడు. వెనువెంటనే పరమేశ్వరుని ఉద్దేశించి తపస్సు ఆరంభించాడు. ఎన్నోవేల సంవత్సరాలు సంతానార్థియై పరమేశ్వరుని పట్టు వదలక ధ్యానించాడు.
అట్లా తన్ను గూర్చి తపస్సు ఆచరించే శిలాదుణ్ణి చూచిన కైలాసవాసుడు కరిగిపోయి ‘‘ఏమి నీకోరిక శిలాద!’’ అని ప్రశ్నించగా నీకు తెలియంది నాకు తెలిసింది ఏముంది...స్వామీ, నిన్ను పూజించేవారు నిన్ను మెప్పించే శక్తియుతులైన వారిని నీ ప్రసాదంగా నాకు అనుగ్రహించు. వారసులు లేరనేదుఃఖాన్ని నుంచి నన్ను కాపాడుము అని వేడుకొనే శిలాదుణ్ణి చూచి శివుడు ‘నీకోరిక ఫలించుగాక’ అని అభయం ఇచ్చాడు.
శివుని అభయంతో పరిపూర్ణానందాన్ని కోరుకొంటూ ఆనందంగా కాలం గడపసాగాడు శిలాదమహర్షి. కొన్నాళ్లకు కాలం కరుణించి శివుని వరాన్ని శిలాదుడు అందుకొన్నాడు. తన సంతానంగా పర్వతుడు, నందుడు అనే కుమారులను పొందాడు. వారు దినదినాభివృద్ధి చెందుతున్నప్పుడే శివభక్తిని వారిలో శిలాదుడు నాటించాడు.
నందుడికి ఎల్లప్పుడు శివుని ఎదురుగా ఉండాలన్న అభిలాష కలిగింది. తన తండ్రికి తన కోరికను తెలిపాడు. తండ్రి అనుమతితో శివుని గూర్చి తపస్సు ఆరంభించి ఏన్నో వేల యేండ్లు ఆ తపస్సులోనే మునిగిపోయాడు. ఆ నందుని కఠిన తపస్సుకు అచంచల భక్తివిశ్వాసాలకు మెచ్చుకున్న పార్వతీ ప్రియుడు నందుని ఎదుటకు వచ్చి కోరిక ఏమిటో తెలుపమని అడిగాడు.
రూపు కట్టిన ఆనందమే తన ఎదుట పడగా ‘స్వామీ ఎల్లప్పుడూ ఈ ఆనందమూర్తిని నేను కాంచాలన్న కోరిక మెండుగా ఉన్నది. పైగా నీ పాద ద్వయాన్ని నేను మోసే భాగ్యాన్ని నాకు కల్పించండి ’ అని నందుడు శివుని ముందు మోకరిల్లాడు. శివుడు ‘‘ఓ నందా! నీవే నా వాహనమవుదువుగాక! అంతేగాక నీవు చేసిన ఈ ఘోర తపస్సును పలుకాలాలు జనం అంతా గుర్తుపెట్టుకొనేట్లుగా ఈ తపోభూమిలోనే నేను ఆర్చామూర్తినై వెలుస్తాను. ’’ అని శివుడు అనుగ్రహించాడు.
అది విన్న నంది మహోత్సాహంతో తన తండ్రికి ఈ విషయాన్ని తెలియచేశాడు. అట్లా ఏర్పడిన స్థలమే నేడు మహానందిక్షేత్రంగా భాసిల్లుతోంది. స్వామి నిలిచిన ఆలయానికి శివగణాల్లో ఒకరైన రససిద్ధుడనే యోగిపుంగవుడు విమానగోపురాన్ని కూడా నిర్మించి ఇచ్చాడట. ఆ ఆర్చామూర్తిగా వెలసిన పరమశివుడే మహానందీశ్వరునిగా వెలుగులీనుతున్నాడు. ఇదంతా కృతయుగంనాటి సంగతి.
ఈ కలియుగంలోనూ నంది మండలాన్ని నందన రాజు అనే ఒక పురుషోత్తముడు పాలించేవాడు. ఆ రాజుకు చెందిన ఆవులల్లో ఓ ఆవు రోజు పాలివ్వకుండా ఉంటోందని ఆ ఆవును కాచే గోపకుడు గ్రహించాడు. ఎందుకీ గోవు పాలివ్వడం లేదో నని ఆ ఆవువెంటే తాను జాగ్రత్తగా తిరిగాడోరోజు. ఆ గోవు ఇంటినుంచి వెడలిన వెంటనే చక్కగా వెళ్లి వెళ్లి ఓ పుట్టదగ్గర నుంచుని ఆ పుట్టలోపలికి ధారాపాతంగా తన పొదుగునుంచి పాలను విడుస్తోంది. ఈ సంగతి చూసిన గోపకుడు ఆశ్చర్యానందాలకు లోనయి వెనుతిరిగి ఈ సంగతిని నందన మహారాజుకు ఎరుకపర్చాడు. ఆ రాజు కూడా ఆనందోత్సాహంతో ఆ వింతమేమిటో అక్కడే మహాత్ముడున్నాడో నన్న ఆతురతతో గోపబాలకుని వెంట వెళ్లాడు. వీరంతా వచ్చిన అలకిడి కి గోపు తత్తరపాటుతో పుట్టపై కాలు కదిపి బెదరుతూ పక్కకు వెళ్లిపోయింది. దీనితో రాజు మనసున కలత చెంది తాను తప్పు చేశానని వెనుతిరిగాడు. ఆ రాత్రి మహాశివుడు నందన మహారాజు కలలో కనపడి తాను ఆ పుట్టలోనే ఉన్నానని తనకు అనువైన మందిరాన్ని నిర్మించమని, అర్చనాదికాలు జరిపించమని ఆదేశించాడు. దిగ్గున లేచిన నందనుడు తనకు పట్టిన అదృష్టయోగాన్ని పలుమార్లు స్మరించుకొని తన వారితో ఈ విషయాన్నంతా చెప్పాడు. వారంతా సంతోషిస్తూ ఆ పుట్ట చెంతకు వెళ్లి అక్కడ వెలసిన స్వామివారిని దర్శించుకొని ఆనందించారు. శివాజ్ఞమేరకు నందన రాజు అక్కడ శివాలయాన్ని నిర్మించాడు. అప్పటినుంచి ఆ పుట్టరూపంలోని మహా నందీశ్వరునిగా పేరుగాంచిన పరమేశ్వరునికి అర్చనాదికాలు జరుపుతూనే ఉన్నారు. నేడు కూడా మహానంది క్షేత్రంలో నందీశ్వరుణ్ణి వివిధోపచారాలతోశివభక్తులు సేవిస్తారు.

శివునికి ప్రత్యేకించి శివలింగంగా పూజించడంలో ప్రత్యేకత ఏమిటి?


------------------------------------------------------------------

దీని గురించి శివ పురాణాదులలో, శైవాగమాలలో వివరణ ఉంది. వాటిని మాత్రమే గ్రహించాలి. కొన్ని శివేతర గ్రంథాలలో జొప్పించిన కల్పనలను గ్రహించి, హైందవ ద్వేషులు వాటిని ప్రచారం చేయడం శోచనీయం. అలాంటి అవాకులూ, చెవాకులు వల్ల విదేశీ కుతూహలశీలురు శివలింగం గురించి నీచాభిప్రాయాలని వెలిబుచ్చారు కూడా. కానీ ఆ రోజుల్లో స్వామీ వివేకానంద దానికి గట్టి సమాధానమిచ్చారు. యఙ్ఞంలో యూపస్తంభమే శివ లింగంగా భావించవచ్చు... అని చెప్పడం వారి సమాధానాలలో ఒకటి. మన శాస్త్రాల ప్రకారం శివలింగ తత్త్వమేమిటో శోధిస్తే ఆశ్చర్యకరమైన మహా విఙ్ఞానాంశాలు గోచరిస్తున్నాయి.

లీనం చేసుకునేదే లింగం: చరాచర జగతి ఎవరియందు కలిగి, పెరిగి, తిరిగి లీనమవుతుందో అదే లింగం. ఆ లీనం వల్లనే సృష్టికి శక్తి, ఉనికి, మనుగడ లభిస్తున్నాయి.

ఆ ఈశ్వరుడు ఆకారాది రహితునిగా భావిస్తూ, ఒక సంకేతంగా గ్రహిస్తే.. ఆద్యంతరహితమైన జ్యోతి స్వరూపానికి ప్రతీకయే లింగం. అందుకే జ్యోతిర్లింగం అన్నారు.

మనలోని ఐదు ఙ్ఞానేంద్రియాలూ, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు, జీవుడు.. వెరసి పన్నెండు స్థానాలలో ఒకే ఈశ్వర చైతన్యం ఉన్నది. ఆ ఈశ్వర జ్యోతియే ఆ పన్నెండు చోట్ల ఉన్నదనే ఎరుకయే .. పన్నెండు జ్యోతిర్లింగాలను మనలో దర్శించడం. అప్పుడు మన అణువణువూ శివమయమనే భావన నిలచి `శివోహ ' మనే సత్యాన్ని స్థిర పరచుకోగలం.

యోగపరంగా..దేహంలోని మూలాధారం నుండి, సహస్రారం వరకు ఉన్న సుషుమ్నా నాడిలోని శక్తి ప్రవాహం ఒక కాంతిమయ స్తంభంగా దర్శిస్తే అదే అగ్నిమయమైన శివలింగంగా గ్రహించగలం. ఇదే శ్రీ చక్రంలోని బిందు స్థానం. ఈ బిందువునే పైకి లాగినట్లు ఒక నిలువు గీత (స్తంభాకృతి)గా సాగుతుంది. అదే శివుడు ప్రథమంగా అగ్నిస్తంభాకృతి కలిగిన లింగంగా వ్యక్తమయ్యాడనే పురాణ కథలోని దర్శనం.

ఒక దీపజ్యోతిని వెలిగించితే, అది అన్ని దిక్కుల కాంతిని ప్రసరిస్తున్న లింగాకృతిగానే దర్శనమిస్తుంది. అదే ఆకారాతీతమైన చైతన్య జ్యోతిర్లింగం.


`లోకం లింగాత్మకం ఙ్ఞాత్వా అర్చయేత్ శివలింగకం' అని ఆగమం చెప్పింది. లోకమంతా లింగాత్మకమని తెలిసి శివలింగారాధన చేయాలి ' అని తాత్పర్యం. లింగ గర్భం జగత్సర్వం.. జగమంతా లింగంలోనే ఉంది. 


విచిత్రమేమిటంటే..కొద్ది ఏళ్ళ క్రితం విదేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ సమస్త విశ్వానికి సంబంధించి ఉపగ్రహాల సహాయంతో గ్రహించిన విఙ్ఞానాన్ని అనుసరించి ఒక చిత్రాన్ని ఆవిష్కరించారు. అద్భుతం..అది మన వేద విఙ్ఞానం వర్ణించినట్లు ఒక గోళా(అండా)కృతిలో ఉన్న కాంతిపుంజ మధ్యంలో సమస్త గ్రహ నక్షత్రాదులన్నీ ఇమిడి ఉన్నాయి. ఈ దృశ్యాన్ని యుగాల క్రితం తపశ్శక్తితో గ్రహించి, లింగాకృతిని సంభావించి, విశ్వచైతన్య శక్తితో వ్యక్తి చైతన్యాన్ని అనుసంధానించే ప్రక్రియను లింగార్చనగా, లింగ ధ్యానంగా ఆవిష్కరించిన మన మహర్షుల పాదాలకు నమోవాకాలు.

శివలింగం యొక్క నిజమైన అంతరార్దం :

నిర్గుణ పరతత్వ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒకటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు. ఈ సత్య విషయాలను తెలియజెప్పే తత్వస్వరూపమే "లింగం"

లింగాభిషేకములో పరమార్ధం :

పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం - భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనాలతో దైవాభిషేకం చేయాలి. జలధారాపాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం, లింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం.

ఓం నమో పరమాత్మయే నమః

Thursday 23 February 2017

వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం???

#swetharkaganapathi
ఓం గం గణపతయే నమః’ ” వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైనది మనం మనస్సును పెట్టి స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం.మనం ఎంత పెద్ద విగ్రహం ప్రతిష్టించాము, ఎంత ఆర్భాటాలు చేశామన్నది ముఖ్యం కాదు.మనం ఎంత సేపు స్వామి మీద ధ్యాస పెట్టి నిలకడగా కూర్చున్నామన్నదే ముఖ్యం.
కూర్చుని ఏమి చేయాలి?స్వామికి సంబంధించిన ఒక శ్లోకం, మంత్రం(ఓం వినాయకాయ నమః లాంటి మంత్రాలు ఉంటాయి కదా)కాని లేదా అష్టొత్తరం కాని చదవండి.ఏది రానివారు”ఓం ” అని జపించండి. కేవలం చదవడమే కాదు, చదువుతున్నప్పుడు మనస్సు మొత్తం స్వామి మీద లగ్నం చేయండి. వేరే ఏ పని చేయకండి. మీకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి నైవేధ్యం పెట్టి స్వీకరించండి. చిన్న బెల్లం ముక్క పెట్టినా ఫర్వాలేదు.
ఇలా మీరు చేసి చూడండి. ఒక సంవత్సరకాలంలో మీలో అద్భుతమైన మార్పు కనపడుతుంది. మీరు కనుక రోజు క్రమం తప్పకుండా స్నానం చేసిన తరువాత పైన చెప్పిన విధంగా చేయగలిగితే చాలు మీరే గమనిస్తారు మీలో కలిగిన మార్పు. మీరు నమ్మనంతగా మారతారు. చేసే ప్రతి పని మీద మనసు లగ్నం చేయగలుగుతారు. విద్యార్థులు చదువు మీద ఎప్పుడు లేనంతగా శ్రద్ధ పెడతారు. ఉద్యోగులకు పనిభారం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఏదైన విషయం వినగానే గుర్తుపెట్టుకొనే శక్తి గణపతి ప్రసాదిస్తాడు.
వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం. ఎందుకంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు. అందుకే పూజలో స్వామిని ఉద్దేశించి “స్థిరొ భవ,వరదొ భవ, సుప్రసన్నొ భవ, స్థిరాసనం కురు” అని చదువుతారు. అందుకే గజాననుని ముందు, రోజు కూర్చునే ప్రయత్నం చేయండి. అద్భుతమైన విద్యాబుద్ధులను, జ్ఞానాన్ని పొందండి. మీరు ఎంత పెద్ద విగ్రహం పెట్టి పూజించమన్నది ముఖ్యం కాదు.స్వామి ముందు ఎంతసేపు కూర్చున్నామన్నది ముఖ్యం.
అందరూ రోజు కాసేపు గణపతికి కేటాయించండి. మీలో కలిగే మార్పులను గమనించండి. జీవితంలో అతి త్వరగా పైకి ఎదగండి. దీని అర్దం విద్యార్ధులు చదవడం మానివేసి, మిగితావారు తమ రోజు వారి కార్యక్రమాలు మానివేసి గణపతి ముందు కూర్చొమని మాత్రం కాదు. మీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, ప్రతి విషయం త్వరగా అర్దం అవ్వడానికి ఇది బాగా ఉపకరిస్తుంది కనుక గణపతి ఆరాధనను మీ నిత్యజీవితంలో భాగం చేసుకొండి. ఆసనం(చాప వంటివి)వేసుకోవడం మరవకండి. న్యూస్ పేపర్లు, కాగితాలు లాంటివి ఆసనంగా వేసుకోకూడదు. పిలిస్తే పలికే దైవం గణనాధుడు.
ఓం గం గణపతయే నమః

Tuesday 31 January 2017

నమకం విశిష్టత


నమకం, చమకం 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని "అనువాకం" అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయిదాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.
అనువాకం – 1:
తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.
అనువాకం – 2 :
ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.
అనువాకం – 3:
ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారనంకు కూడా చదువుతారు.
అనువాకం – 4:
ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:
అనువాకం – 5:
ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా - సృషి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.
అనువాకం – 6:
ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.
ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షనకు కూడా చదువుతారు.
అనువాకం – 7:
నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న ర్ద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.
అనువాకం – 8:
ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.
అనువాకం –9:
ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ స్కక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.
అనువాకం – 10:
ఈ అనువాకంలో మల్ల రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపసమించి, పినాకధారియైనా, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.
అనువాకం – 11:
ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్తి దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.

Wednesday 18 January 2017

కృష్ణలీలల రహస్యాలు

శ్రీకృష్ణుడు చిన్నతనంలో సాగించిన లీలలు పిల్లలకు, పెద్దలకు సైతం ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. వాటిని లోతుగా పరిశీలిస్తే- ఆధ్యాత్మిక అర్థాలెన్నో గోచరిస్తాయి. పూతన అనే రక్కసి పసిబాలుడిగా ఉన్న కృష్ణుడి వద్దకు మారువేషంలో వెళ్ళి చంపడానికి ప్రయత్నిస్తుంది. పాలు తాగుతున్నట్లు నటించి, కృష్ణుడు ఆమె ప్రాణాల్ని హరిస్తాడు. ఈ సంఘటన వెనక ఒక సంకేతార్థం ఉంది.
మనిషి అజ్ఞానం విషపూరితమైన పాల వంటిది. భగవంతుడి పాదాలు చేరాలంటే అజ్ఞానం నశించాలి. మానవుడి అజ్ఞానం పూతనలా పరిమాణంలో పెద్దది. ఆ రాక్షసి శరీరం ఎంత పెద్దదంటే, దాన్ని దహించడం అంత తేలిక కాదు. అదేవిధంగా మనిషి అజ్ఞానమూ అంత తేలికగా నశించదు. అది నశించాలంటే కృష్ణుడి దయ కావాలి. పూతన అంత్యక్రియల సందర్భంలో, గంధపు పరిమళం వెలువడుతుంది. అలాగే, కృష్ణుడి దయతోనే మనందరిలోని కాలుష్యాలు, దుర్గుణాలు నశించిపోతాయని అంతరార్థం.
పూతన సంహారం గురించి తెలుసుకున్న కంసుడు, ఆ తరవాత శకటాసురుణ్ని పంపుతాడు. ఆ రాక్షసుడు చక్రం రూపంలో కృష్ణుణ్ని సంహరించడానికి మీదకు దూసుకెళ్తాడు. శ్రీకృష్ణుడు తన శక్తితో ఆ అసురుణ్ని వధిస్తాడు. జనన మరణాల చక్రభ్రమణం ఎప్పటికీ ఆగదు. అలాగే, సంసార చక్రంలో జీవులు బంధితులై ఉంటారు. భగవంతుడి కారుణ్యంతోనే వారికి విముక్తి కలుగుతుంది. శకటాసుర సంహారం వెనకగల రహస్యమది!
తరవాత వెళ్లిన తృణావర్తుడు సుడిగాలిలా కృష్ణుణ్ని చుట్టు ముడతాడు. కానీ, ఆ దానవుడూ ఆయన చేతిలో మరణిస్తాడు. తృణావర్తుడు రజో గుణానికి సంకేతం. క్రోధం అనేది రాక్షస గుణం. అది ఆవరించినప్పుడు ఎవరైనా ఒళ్లు తెలియని కోపంతో వూగిపోతారు. అందరిపైనా ఎగిరిపడతారు.
కృష్ణుడు కాళియుడిపై తాండవం చేశాడు. విషజ్వాలలు కక్కే సమాజ వ్యతిరేక శక్తులకు కాళియుడు సంకేతం. ఆ శక్తులకు వేల పడగలుంటాయి. సమాజంపై అవి విషం విరజిమ్ముతాయి. దైవ వ్యతిరేక శక్తుల వికృతరూపమైన ఆ సర్పాన్ని బాలకృష్ణుడు అణచివేశాడు.
గోపికల ఇళ్లలోకి చొరబడి, కృష్ణుడు వెన్నముద్దలు దొంగిలిస్తాడు. దీని వెనకా వేదాంతపరమైన అర్థం చెబుతారు.ఆత్మకు ప్రతీక వెన్న. ఆత్మ మనకు చెందినది కాదు. వెన్నను శ్రీకృష్ణుడు దొంగిలించాడంటే, తనదైన ఆత్మను తాను తీసుకొంటున్నాడని అర్థం. వెన్న కుండను ఆయన బద్దలు కొట్టాడంటే- మనం ఎంతో విలువ ఇచ్చే దేహానికి చివర్లో ఎటువంటి ప్రయోజనం లేదని చాటడానికే!
పురాణ కథల్లో ఉండే నీతి, ధర్మం- సమాజ అభ్యుదయానికి ఉపకరిస్తాయి. వాటిలోని అంతరార్థాలు ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడతాయి.
ఏ పురాణగాథ అయినా కల్పితమైతే, అంతటి అద్భుతం మరొకటి లేదు. ఒకవేళ అది నిజమే అయితే, అంతకన్నా మహాద్భుతం ఇక ఉండదు!

Tuesday 17 January 2017

హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు వున్నారని అంటారు

హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు వున్నారని అంటారు. ఇంతమంది దేవతలు ఎందుకు?

హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు వున్నారని అంటారు. ఇంతమంది దేవతలు ఎందుకు?
ముక్కోటి దేవతలలో కోటి అనే శబ్దాన్ని సంఖ్యగా భావించవచ్చు లేక సమూహమని కూడా గ్రహించవచ్చు. సమూహమంటే ఒక గ్రూప్ అని అర్థం. మూడు కోట్లు అంటే మూడు వర్గాలు. అందులో సృష్టి అనే వర్గానికి బ్రహ్మ, స్థితి అనే వర్గానికి విష్ణువు, లయము అనే వర్గానికి ఈశ్వరుడు అధిష్ఠాన దేవతలు.

ఇది గాక మూడు కోట్లను సంఖ్యా పరంగా తీసికొంటే అసంఖ్యాకమైన దేవతాగణం మనలను ప్రతి కోణం నుండి నిరంతరం సంరక్షిస్తున్నారనీ చెప్పబడింది. ఒక రాజ్యంలో రకరకాల విభాగాలు వుంటాయి. ఒక్కొక్క విభాగంలో క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకూ వివిధ ఉద్యోగస్థులుంటారు. అలానే సృష్టికర్తగా బ్రహ్మ, అతని అనుగ్రహంతో ప్రజాపతి, అశ్వనీ దేవతలు, విశ్వకర్మ, మొదలగు వారంతా సృష్టిక్రమానికి ఉపయోగపడే దేవతలు. అలాగే స్థితి అనే క్రియలో విష్ణువుతో పాటు ద్వాదశాదిత్యులు, ఇంద్రాది దేవతలు, కుబేరుల వంటి యక్షులు, లయము అనే క్రియకు పరమేశ్వరునితో పాటు ఏకాదశ రుద్రులు, రుద్రగణాలు, యమాది ప్రాణాంతక గణాలుంటారు.

దైవము అంటే దివ్యత్వము కలిగిన వారని అర్థం. అంటే వారికి మనవలె భౌతికంగా కనిపించే రూపాలు వుండవు. వారు దివ్యమైన శక్తి సంపన్నులు. ఆ శక్తుల ద్వారా సృష్టిలోని సమస్తాన్ని రక్షించడమే వారి కర్తవ్యం. సరస్వతీ దేవి వాక్కుకి అధిష్ఠాన దేవతయై వాక్కుని, సమస్త వాఙ్మయాన్ని రక్షిస్తుంది. లక్ష్మీ దేవి సంపదకు, పార్వతీదేవి సౌభాగ్యానికి అధిదేవతలు. కాబట్టి ఇంతమంది దేవతలా అనుకునే బదులు ప్రకృతిలో ఉన్న ఒక్కొక్క విభాగానికీ ఒక్కొక్కరినీ అధిష్ఠాన దేవతలుగా భావించి ఆరాధించడం మే సనాతన ధర్మం యొక్క విశిష్టత.

ఇక మరి కొంతమంది ముప్పైమూడు కోట్ల దేవతలను పూజిస్తారని అసలు ఇంత మంది దేవుళ్ళు ఉండరని దేవుడు ఒక్కడే అని మనకే ఏదో గొప్ప విషయం చెప్పేసినట్టు పాశ్చాత్య మతాల వారు ఫోజులు కొడతారు.
ఆ విషయం మనకి కూడ తెలుసు దేవుడు ఒక్కడే.. ఆయన సర్వాంతర్యామి అని. మరి ఈ ముప్పె ముడు కోట్ల మంది ఎవరు??
సంస్కృతం లో ఒక్కో పదానికి చాల అర్థాలు ఉంటాయి. అవి అక్కడ ఉన్న భావం ని వచ్చే అర్థాన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్ప మనకి తెలిసినదే సరైన అర్థమని భావి పరిగణలోకి తీసుకుంటే అర్థం మారుతుంది. ఆ విషయం తెలియక కోటి అంటే అదేదో సంఖ్య గా బావించి అలా మూర్ఖంగా మాట్లాడతారు అన్యమతస్తులు. కోటి అంటే సమూహం అని రకాలు అని కూడ అర్థం వస్తుంది.
అసలు ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే అక్కడ ముప్పైమూడు మంది అని అర్థం వస్తుంది.
వారెవరంటే..
అశ్వనీ దేవతలు 2
అష్టవసువులు 8
ద్వాదశాదిత్యులు 12
ఏకాదశ రుద్రులు 11 మొత్తం ముప్పైమూడు మంది.

అశ్వనీ దేవతలు ఇద్దరు కాగా,
1.ధరుడు ..
2. ధృవుడు
3.సోముడు
4.అహుడు
5. అనిలుడు
6.అగ్ని 7.
ప్రత్యూషుడు
8.భీష్ముడు అష్ట వసువులుగా చెప్పబడుతున్నారు.

ఇక
1.శంభుడు
2.పినాకి
3 గిరీషుడు
4.స్థాణువు
5. భర్గుడు
6.శివుడు
7సదాశివుడు
8. హరుడు
9.శర్వుడు
10.కపాలి
11.భవుడు
ఏకాదశ రుద్రులుగా పేర్కొనబడ్డారు.
1.ఆర్యముడు
2. మిత్రుడు
3. వరుణుడు
4.అర్కుడు
5.భగుడు
6. ఇంద్రుడు
7. వివస్వంతుడు
8.పూషుడు
9.పర్జన్యుడు
10. త్వష్ట
11. విష్ణువు
12.అజుడు
.. ద్వాదశ ఆదిత్యులుగా చెప్పబడ్డారు. వీళ్లందరూ కలుపుకుని ముప్పై మూడుమంది దేవతలు.

*✍సనాతన హిందూ ధర్మము*

హనుమత్కల్యాణం


                ధర్మ సందేహాలు  సమాధానాలు  

  రామాయణంలో హనుమంతుని  కల్యాణం   విషయం  లేదు  కదా  !
సువర్చలా  వృత్తాంతం   ఎక్కడిది    అని కొందరు
ప్రశ్నిస్తారు  .... సమాధాన మేమిటంటే  ....
హనుమంతుని  చరిత్ర. అంతా  రామాయణంలో
లేదు  కథకు  అవసరమైన. మేరకే  వాల్మీకి
స్వీకరించాడు  అన్నీ  యుగాలలోనూ చిరంజీవిగా
ఉన్న. హనుమంతుని సంపూర్ణ.  చరిత్ర కేవలం
త్రేతాయుగానికి   చెందిన. రామాయణం లో  ఉండే
అవకాశం  లేదు  అలాగే   హనుమంతుడు  బ్రహ్మచారి
అంటారు  ,  ఈ. వివాహం  ఎలా  జరిగిందనేది
మరో   ధర్మసందేహం  బ్రహ్మచర్యం  నాలుగు
రకాలు ,  గాయత్రం   బ్రహ్మం  ప్రజాపత్యం  .
బృహన్  అని  వాటికి   పేర్లు  ,  భార్యతో  నియమ
పూర్వక. జీవితం  గడిపేవారిని  ప్రజాపత్య. బ్రహ్మ --
చారులంటారు  ,  బ్రహ్మచర్య. నియమాలను  సరిగా
అర్ధం చేసుకోగలగాలి  ,   హనుమంతుడు 
భవిష్యద్ర్బహ్మ. ,  ఆయన. బ్రహ్మస్తానం  పొందినవాడు
సువర్చలాదేవి  సరస్వతి స్థానం పొందుతుంది  ,
దేవతల. భార్యలంటే  అర్ధం  వారి  శక్తులే  బ్రహ్మచర్య
నిష్టాగరిష్టునికి  ఉండే  శక్తి  వర్చస్సు  , సువర్చస్సు
ఆమెయే   సువర్చలా  దేవి  .. 
              కళ్యాణ. వైభోగం  
సువర్చలాపతిష్షష్ఠః  అన్నారు  హనుమంతునికి
నవావతారాలు  ఉన్నాయి  ,  వాటిలో  ఆరోది
సువర్చలాంజనేయ. అవతారం  ,  సువర్చలా హనుమత్
ద్వాదశక్షరీ  మంత్రం మ౦త్రశాస్ర్త౦లో  ఉ౦ది.
ధ్వజదత్త , కపిలాది భక్తి  ఉపాసకులకు సువర్చలాహనుమత్ సాక్షాత్కార౦ జరిగి౦ది.దేశ౦ నలుమూలలా  మాత్రమే కాకు౦డా విదేశాలలో కూడా సువర్చలా౦జనేయ విగ్రహాలున్నాయి.  బ౦దరు
పరాసుపేటలో  శివాజీగురువు సమర్ధ రామదాసు
స్వామి 16వ శతాబ్దిలో ప్రతిష్ఠించినది సువర్చలా౦-
జనేయ. ఆలయమే . అనేక హనుమాదాలయాలలో
వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో కల్యాణాలు నిర్వహించడ౦,
సువర్చలా౦జనేయుల ఉత్సవమూర్తులను సిద్ధ౦
చేసుకోవడం  ఆనవాయితీగా వస్తోంది.  హనుమ-
దుపాసకులు ఎ౦దరో  హనుమత్కల్యాణ౦ నిర్వహిస్తూ
ఉ౦టారు.  మార్గశిర శుద్ధ త్రయోదశినాటి హనుమద్ర్వత
సమయంలో సువర్చలా౦జనేయ కలశాలను ఉ౦చి
పూజిస్తారు. సువర్చలా హనుమత్ గాయత్రి మ౦త్ర౦
జపి౦చడ౦ వల్ల వివాహం అయిన వారెందరో ఉన్నారు.
గృహస్ధులైన వారికి సువర్చలా౦జనేయ సేవ సకల
శ్రేయేభివృద్ధులనూ కలిగిస్తుంది. 
మళ్ళీ కలుద్దాం     సెలవు  
హనుమత్కల్యాణం విషయాలు  , 2 వ. భాగములో

సుందరకాండము పారాయణము చేసినవారికి అనుకొన్న పనులు నెరవేరి కార్యసిద్ధి కలుగుతుంది.

శ్రీమద్రామాయణంలో సుందరకాండ ఐదవది. సుందరకాండము పారాయణము చేసినవారికి అనుకొన్న పనులు నెరవేరి కార్యసిద్ధి కలుగుతుంది.

సుందరకాండంలో హనుమంతుడు శతయోజన విస్తీర్ణం గల సముద్రమును ఆధారంలేని ఆకాశమార్గంలో పయనించి, ఆటంకాలను ఎదుర్కొని లంకాపట్టణములో ఒంటరిగా ప్రవేశించాడు. లంకలో అన్నిచోట్ల సీతను అన్వేషించి, అశోకవానములో శింశుపావృక్షమూలమున దీనస్థితిలో ఉన్న సీతను కనుకొన్నాడు.
తల బలప్రాక్రమములను శత్రువులకు తెలియజేయుటకు వనములను, ఉద్యానవనములను, ప్రాసాదములను ధ్వంసం చేసాడు. అక్షకుమారుడులాంటి రాక్షస వీరులను ఎందరినో సంహరించాడు.
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమునకు కట్టుబడి రావణ సభకు వెళ్లాడు. రావణునికి హితము పలికాడు. రాక్షసులు తన తోకకు నిప్పు పెట్టగా ఆ మంటలతో లంకానగరాన్ని దహనం చేసాడు.
స్వామికార్యము, స్వకార్యము నెరవేర్చి కార్యమును సానుకూలము చేసుకొని, తిరిగి సముద్రాన్ని లంఘించి వానరులను కలుసకుకొని సీతావృత్తాంతం చెలియజేసాడు.
హనుమంతుడు తనకు అప్పగించిన పనిని విజయవంతంగా నెరవేర్చుటకు అతడు పడిన శ్రమ, శక్తియుక్తులు కార్యసాధకుడు ఎట్లు ఉండవలెనని సుందరకాండ వలన తెలుస్తున్నది.
కార్యము అనగా మంచిపని. ఒక కార్యము చేయునప్పుడు మధ్యలో ఆటంకాలు వస్తుంటాయి. వాటిని ఓర్పుతోను, నేర్పుతోను, శక్తియుక్తులతోను అధిగమించాలి.
హనుమంతుడు సీతాన్వేషణముకై సముద్రమును వాయు మార్గంలో లఘించుచుండగా మొదట మైనాకుడు సముద్రములోనుంచి పైకి వచ్చి తనపై కొంతసేపు విశ్రాంతి తీసుకొని పొమ్మన్నాడు. తన ఆతిథ్యాన్ని స్వీకరించమని ప్రార్థించాడు.
మైనాకుడు సత్యగున ఆటంకము. కావున కార్య సాధకుడు మధ్యలో ఆగరాదు. రాముని కార్యము నెరవేర్చుటకు వెళుతున్నానని మైనాకుని మృదువుగా స్పృశించి, ప్రియవచనములతో స్వస్థత పరచి ఓర్పుగాను, నేర్పుతోను ఆటంకమును అధికమించి ముందుకు సాగాడు.
కొంతదూరము పోయిన తరువాత, దేవతలు పంపగా వచ్చిన సురస అను నాగాస్త్రీ హనుమంతుని అడ్డం నిలిచింది. హనుమంతుడు ముక్తిక్తితో, ఉపాయముతోను ఆమె నోటి యందు ప్రవేశించి బయటకు వచ్చెను. ఇది రజోగుణ సంబంధిత ఆటంకము. దీనిని ముక్తితో దాటెను.
మరికొంత దూరం ప్రయాణించగా ఛాయా గ్రాహియైన సింహిక అను రాక్షసస్త్రీ హనుమంతుని ఛాయను పట్టుకొని క్రిందికి లాగినది. ఇది తమోగుణ ఆటంకము. హనుమంతుడు సూక్షరూపం ధరించి, సింహికనోటిలో ప్రవేశించి ఆమె అవయవములను తన గోళ్ళతో పెకిలించి హతమార్చాడు.
కార్యసాధకుడు తనకు ఎదురైన సత్త్య, రజస్తమో ఆటంకములను ఓర్పు, నేర్పు, ముక్తి, శక్తిని ఉపయోగించి అధికమించెను.
లంకాపట్టణం చేరిన హనుమంతుడు తన స్వరూపమును చిన్నది చేసికొని సంచరించెను. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించాడు. సురస, సింహికలను అధిగమించునపుడు, లంకాపట్టణంలో సీతాన్వేషణ చేయునపుడు సూక్ష్మరూపాన్ని ధరించాడు. సముద్రము లంఘించునపుడో, అశోకవనమును ధ్వంసము చేయునపుడు, రాక్షసులతో యుద్ధము చేయునపుడు, లంకా దహనము చేయునపుడు శరీరాన్ని పెంచాడు. పరిస్థితులబట్టి ప్రవర్తించాడు.
కార్యము నేరవేరాలనేదే దేశకాల పరిస్థితులను బట్టి కార్యసాధకుడు ప్రవర్తించాలి.
“తతః శరీరం సంక్షిప్య” (సుం. 1-205)
రావణుని అంతః పురంలో వివిధ భంగిమలతో అర్థనగ్నముగాను, నగ్నముగాను ఉన్న సౌందర్యవంతులైన స్త్రీలను చూచాడు. ఎన్నోరకములైన సువాసనలతో కూడిన ఆహార పదార్థములు పరికించాడు. కాని, హనుమంతుని మనస్సు చలింపలేదు. సీతను గురించి ఆలోచన తప్ప వేరే ఆలోచన అతని మనస్సులో లేదు. మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము కలిగిన జితేంద్రియుడు హనుమంతుడు.
కార్యసాధకుని మనస్సు వికారములకు లోనుకారాడు. మనోవికారము లేనప్పుడు, ఏది చూచినను దోషములేదు. ఆ కార్యసాధకుని కార్యం మీదనే దృష్టి ఉంటుంది.
శ్లో||మనోహిహేతుః సర్వేషామిన్ద్రి యాణాం ప్రవర్తెతే
శుభాశుభస్వవ్స్థాసు తచ్చమే సువ్యవస్థంమ్ (సుం. 11-41)
ప్రలోభములకు లొంగరాదు, విషయము లందు చలింపకూడదు.
హనుమంతుడు లంకలో అన్ని ప్రదేశములను సీతకై వెదకి ఆమె కనుపించక పోవుటచే దిగులు చెంది నిరుత్సాహ పడెను. తన శ్రమ వృథా అయినదని దైన్యము నొందెను.
కార్యసాధకునికి దైన్యము పనికిరాదు. నిరుత్సాహము చెందినను, దిగులు చెందినను కార్యము సిద్ధింపదు. కార్యనిర్వాహణకు దిగులు వదలి ధైర్యము వహించాలి. సర్వకార్యములు ఆ నిర్వేదము వలననే సానుకూలమగును.
శ్లో|| అనిర్వేదః శ్రియోమూలమనిర్వేదః పరంసుఖమ్
అనిర్వేదోహిసతతం సర్వార్దేషు ప్రవర్తకః (సుం. 12-10)
శక్తివంతుడైన హనుమంతుడు వెంటనే దైన్యమును విడచి, ధైర్యము తెచ్చుకొని సీత కనిపించునంతవరకు వెదకెదనని ధృడచిత్తుడయ్యెను. మనస్సును దిటవు చేసుకొన్నాడు. బ్రతికి ఉంటేనే ఏదైనా సాధించేది. చచ్చి సాధించేది ఏమున్నది? బ్రతికి ఉంటే సీతమ్మను కనుగొని రామయ్యకు చెప్పవచ్చు. మంచి కార్యములు చేయ వచ్చునని విరక్తిని వదలి సీతాన్వేషణకు ఉపక్రమించాడు.
శ్లో|| వినాశే బహావోదోషా జీవన్ భద్రాణిపశ్యంతి
తస్మాత్ర్వాణాన్ ధరిష్వామి ధ్రువో జీవిత సంగమః (సుం. 13-47)
ఇంతవరకు హనుమంతుడు తన శక్తియుక్తులను ఉపయోగించాడు. పురుషప్రయత్నం ఎంతచేసినా కార్యసాధకుడు దైవసహాయం కూడా కోరాలి. పురుష ప్రయత్నము, దైవానుకూలత ఉన్నప్పుడే కార్యసిద్ధి కలుగుతుంది.
శ్లో|| కచ్చి త్పురుష కారంచదైవంచ ప్రతిపద్యతే (సుం. 36-19)
సీత కనబడునట్లు అనుగ్రహించుమని, హనుమంతుడికిఉ వసు, రుద్ర, ఆదిత్య, అశ్వనీదేవతలను ప్రార్థించాడు. లక్ష్మణ సహితుడైన రాముని, జనకాత్మజ సీతను, యమ, వాయువులను కార్యసిద్ధికోరకు స్మరించి అశోకవనములోనికి ప్రవేశించి దీనముగా ఉన్న సీతాన్వేషణఉ శింశుపావృక్షము మూలమున కూర్చొనియుండుట చూచినాడు. హనుమంతుని ప్రయత్నం, దైవానుకూలత వలెనే తను కనుగొనగలిగినాడు. అంతా దైవ నిర్ణయం వలన జరుగుతుంది.
శ్లో|| వసూన్ రుద్రాం స్తథాదిత్య నశ్వినౌ మరుతోపిచ
నమస్కృత్యా గమిష్యామి రక్షసాం శోకవర్ధన (సు. 13-56)
శ్లో|| నమోస్తు రామాయ స లక్ష్మణామ
దేవ్వైచ తస్త్య జనకాత్మజాయ
నమోస్తు రుద్రేంద్ర యమానితేభ్యో
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః (13-59)
సీతను చూచినా హనుమంతునికి ఈమె సీతయేనా? అను సందేహము వచ్చెను. పండితుడు కావున యుక్తి యుక్తములైన హేతువులతో ఆమె సీతయే అని నిర్థారణ చేసికొనెను. రావణుడు సీతను అపహరించి లంకకు తీసికొని వస్తున్నపుడు సీత కొన్ని ఆభరణములను తన చీరను చింపి ఆ ఉత్తరీయములో మూటగట్టి ఋష్యమూక పర్వతముపై ఉన్న వానరుల మధ్య జారవిదచినది. ఆమె వదలిన ఆభరణములు ఇప్పుడు ఆమె శరీరముపై లేవు.
రాముడు సీతవద్ద ఏ ఆభరణములు ఉన్నాయని చెప్పెనో అవన్నియు సీత శరీరముపై ఉన్నవి.
నగలను మూటగట్టి ఋష్యమూకముపై విడచినది. ఆ ఉత్తరీయము రంగు ఇప్పుడు ఈమె ధరించిన చీర రంగు ఒకటిగానే ఉన్నవి.
ఈమె రూపము రాముని రూపమునకు తగినట్లు ఉన్నది.
రావణుడు ప్రాతఃకాలమున సీతతో మాట్లాడిన విధానము గమనించిన హనుమంతుడు ఈమె సీతయే అని నిర్ణయించుకొనెను.
కార్యసాధకుడు యుక్తాయుక్తముగా, హేతుబద్ధముగా విచారించి తన కార్యము సానుకూలమయ్యేట్లు చూసుకోవాలి. కార్యసాధనకు కోపము, అహంకారము, దురభిమానము పనికి రాదు. ఇవి కలిగియున్నవారి కార్యము నెరవేరదు. తనకేమి తెలియకున్నను తెలిసిన వానివలె నటిస్తే కార్యము చెడుతుంది.
శ్లో|| ఘాత యంతి హి కార్యాణి దూతాః పండితమానినః (సుం. 30-38)
వివేకము కలిగి ఉండాలి. ఓర్పు ఉండాలి. కోపము పనికిరాదు. కోపచేసెదరు. ము వలన విచక్షణా జ్ఞానము కోల్పోయి చేయరాని పనులు చేసెదరు. తన కోపము వానన తనకే కాక తన ఆప్తులకు కూడా ఆపద సంభవిస్తుంది.
శ్లో|| వాచ్యావాచ్యం ప్రకుపితోనవిజానాతి కర్హిచిత్
నాకార్యమస్తి క్రుద్దస్య నావాచ్యం విద్యతే కృచిత్ (సుం.55-6)
రావణుని ఆజ్ఞానుసారము రాక్షస భటులు హనుమంతుని తోకకు నిప్పు అంటించారు. రావణుని మీద కోపముతో హనుమంతుడు లంకాపట్టణము దహనం చేశాడు. కోపంలో సీత లంకలో ఉన్నదన్న విషయాన్ని మరిచాడు. లంకా దహనమైన తరువాత సీత కూడా మంటలలో తగులబడినదేమో అని విచారిస్తాడు. ఆకాశ మార్గంలో సంచరిస్తున్న చారిణుల వలన సీత క్షేమంగా ఉందని తెలిసికొని సంతోషిస్తాడు. కార్య సాధకునికి నిగ్రహం కావాలి. కోపంతో తొందర పడితే కార్యము చెడిపోతుంది.
సీతాన్వేషణము చేసి తిరిగి సముద్రమును లఘించి వానరశ్రేష్ఠుల వద్దకు వచ్చి తను సీతను ఎలా కనుగొనినది వివరంగా చెప్పాడు. ఇంత కార్యము సాధించిననూ హనుమంతునిలో అహంకారము లేదు. ఈ కార్యము నా వలన జరిగినదని చెప్పలేదు. మీ ఆశీస్సుల వలన రాముని దయ వలన సీతను చూడగలిగినానని పలికాడు.
మహాత్ములు తమ శక్తి సామర్థ్యములతో కార్యము నెరవేర్చిననూ గర్వపడరు. అహంకారపూరితులు గారు. దైవసహాయము వలన జరిగినదని భావిస్తారు.
శ్లో|| రాఘవస్య ప్రభావేన భవ తాం చైవ తేజసా
సుగ్రీవస్యచ కార్యార్థం మయా సర్వమనుష్టితమ్ (సు 58-165)
సుందరకాండములో కార్యసిద్ధికి ఏమీ ఉండాలో, ఎట్లా ఉండాలో హనుమంతుని ద్వారా తెలిసికొని, దానిని ఆచరణలో ఉంచిన కార్యసిద్ధి కలుగుతుంది అనే దానిలో అంతరార్థము ఇదే.
కార్యసాధకునికి ఓర్పు, నేర్పు, శక్తియుక్తులు, ధైర్యము వినయము, వివేకము, యుక్తాయుక్త పరిజ్ఞానము ఉండాలి.
దైన్యము, కోపము, అహంకారము, దురభిమానము, గర్వము పనికిరాదు.
కేవలము మన ప్రయత్నముపైనే ఆధారపడక దైవ సహాయం కూడా అర్థించాలి. పురుష ప్రయత్నం దైవానుకూలత రెండూ ఉన్నప్పుడే కార్యసిద్ధి జరుగుతుంది. ఇది హనుమంతుని ద్వారా సుందరకాండములో చెప్పబడి యున్నది. సుందరకాండము పారాయణ చేసి విషయములను అర్థం చేసుకొని నిజజీవితంలో ఆచరిస్తే కార్యసిద్ధి కలుగుతుంది.
భక్తికి, శక్తికి, యుక్తికి హనుమంతుడే ఆదర్శము. అతని స్మరణవలన అన్నీ కార్యములు నిర్విఘ్నముగా నెరవేరుతాయి.
ఆంజనేయుడు మనం మధ్యనే ఉన్నాడు. ఎందరో భక్తులు ఆయనను పూజించి ఆయన సాక్షాత్కారాన్ని పొందగలిగారు. హనుమంతుడు మహాతత్త్వ పండితుడని ఉపనిషత్తుల సారాంశం. రామ మంత్ర రహస్యాన్ని పురాణకాలపు ఋషులందరు ఆంజనేయుని నుంచే గ్రహించారని తెలుస్తోంది. సమస్త పురాణాలలో ఆంజనేయుని ప్రస్తావన ఉంటుంది. నిరంతర రామనామ స్మరణంతో భక్తిలో మునిగిపోయే హనుమంతుడు తన భక్తులకు ఎటువంటి ఆపదలు కలుగనీయడు. కార్య సాధకుడు కాబట్టి తన భక్తుల కార్యములను నిర్విఘ్నంగా ముందుకు సాగెట్లు చూసుకుంటాడు. ఆంజనేయ భక్తులకు అపజయం అనేది లేదు.
శ్లో|| బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా
అజాడ్యం వాక్పటుత్యంచ హనుమ త్మ్సరణాద్భవేత్

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles