Showing posts with label మోక్షమార్గం. Show all posts
Showing posts with label మోక్షమార్గం. Show all posts

Friday 13 January 2017

భగవద్గీత అంటే ఏమిటి?

– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్‌మెంట్‌ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?

కాదు. అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’. సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి

☆భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు’ అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ.

☆సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్‌ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్‌ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.

☆ సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.

☆ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.

☆ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్‌నెస్‌ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్‌ చేసే మేజిక్‌. మైండ్‌ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. ‘నేను’ అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు ‘కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను’ అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది. ‘నాకోసం కాదు’ అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.

☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది?

-ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
-కర్తవ్యం గురించి చెబుతుంది.
-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
– ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
-సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
-ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
-ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.
స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
-పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది.
-ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
-కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
-నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.

అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు. వేరే మతగ్రంథం లా అన్య సాంప్రదాయాలను ఆచరించేవారిని చంపమని భగవద్గీత చెప్పదు. నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.

గీత చదువుకో
రాత మార్చుకో

శివునికి అన్నంతో పూజ చేస్తే???

1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారు.

2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.

3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.

4. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.

5. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.

6. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.

7. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది.
🙏🙏🙏🙏🙏

షిర్డీ సాయి ఎవరు?

షిర్డీ సాయి ఎవరు? దేవుడా? గురువా? ఎప్పుడైనా సాయి తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నారా? కేవలం గురువుగా మాత్రమే మార్గదర్శకత్వం చేశారా? అసలు సాయిని ఎందుకు పూజించాలి?.. మొదలైన ప్రశ్నలు గత కొద్దికాలంగా తలెత్తుతూనే ఉన్నాయి. తరచి చూస్తే వీటికి సమాధానాలన్నీ సాయి జీవితం నుంచి మనకు లభిస్తాయి.

సాయి అనే పదం దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ మనకు కనిపిస్తుంది. ఈ పదానికి రక్షకుడు, ఆధ్యాత్మిక గురువు, మత గురువు, రాజు, తండ్రి, భర్త, ప్రేమికుడు.. ఇలా రకరకాల అర్థాలున్నాయి. సాయితత్వం అంటే ప్రేమతత్వం అనే విషయం అందరికీ తెలిసినదే. ప్రపంచంలోని అందరికీ కావాల్సినవాడు కాబట్టే ఆయనకు సాయి అనే పేరు వచ్చి ఉంటుంది.

ఇక మన దేశంలో ఇన్ని కోట్ల మంది పూజించే సాయి.. దేవుడా? లేక ఒక సద్గురువా అనే విషయంలోకి వెళ్లే ముందు.. ఈ రెండు పదాలకు మధ్య ఉన్న తేడాని మనం గమనించాలి. సద్గురువు తన శిష్యులకు జ్ఞానమార్గాన్ని చూపించి వారిని ముందుకు నడిపిస్తాడు. దేవుడే మానవ రూపంలో వచ్చినప్పుడు ఆ వ్యక్తిని అవతారం అంటాం. మానవ అవతారంలో ఉన్న దేవుడికి 16 కళలు ఉంటాయి. వాటి ద్వారా సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తాడు. అంతే కాకుండా మానవావతారంలో ఉన్న దేవుడుకి పంచతత్వాలపై పూర్తి నియంత్రణ కూడా ఉండాలి. సాయిలో ఈ రెండు లక్షణాలు స్పష్టంగా మనకు కనబడతాయి. అందుకే సాయి కొందరికి సద్గురువు. ఇంకొందరికి దేవుడు.

సద్గురువు తాను ఎంపిక చేసుకున్న శిష్యులను తనతో పాటుగా ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ దైవం దగ్గరకు తీసుకువెళ్తాడు. ఈ ప్రక్రియ చాలా సంక్లిష్టమైనది. ఈ సృష్టిలో కొన్ని మాత్రమే సత్యాలుంటాయి. మిగిలిన భావనలన్నీ మనుషులు తామంతట తాము సృష్టించుకున్నవే! సద్గురువు తన శిష్యుల అజ్ఞానాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడా జ్ఞానజ్యోతి శిష్యులను అంతర్ముఖులను చేస్తుంది. వారికి అసలైన ముక్తిమార్గాన్ని ప్రసరింపచేస్తుంది. అయితే ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి మనిషికి కర్మ ఉండాలిగా! ఒక వేళ కర్మ ఉంటే సద్గురువు ఎలా అవుతాడు?.. అనే ప్రశ్న కొందరిలో తలెత్తవచ్చు. సద్గురువులకు పూర్వజన్మల కర్మలేమి ఉండవు. వారు ఒక విధమైన కర్మశూన్యతలో ఉంటారు. ప్రకృతి నియమాల ఆధారంగా చూస్తే.. ఈ సృష్టిలో ఏది శూన్యంతో నిండి ఉండకూడదు. అందువల్ల సద్గురువుల కర్మశూన్యతలోకి వారి చుట్టూ ఉన్న వ్యక్తుల కర్మ ఫలితాలన్నీ ప్రవేశిస్తూ ఉంటాయి. ఇది అసంకల్పితంగా జరిగిపోతుంది. శ్రీసాయి సచ్చరిత్రలో- ఒక గుర్రాన్ని గట్టిగా కొడితే సాయి వీపు మీద చారలు పడినట్లు.. భక్తులకు రోగం వస్తే ఆ బాధ సాయి పడినట్లు కనిపిస్తుంది. అందుకే చాలా మంది భక్తులకు షిర్డీ సాయి సన్నిధిలో అన్ని బాధలు తొలగిపోయినట్లు అనిపిస్తాయి. అందుకే సాయి.. ‘‘నువ్వు వేల మైళ్ల దూరంలో ఉన్నా.. నువ్వు చేస్తున్న పని నాకు తెలుస్తుంది’’ అంటారు.

ఇక సాయి తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న సందర్భాలు లేకపోలేదు. అలౌకిక ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న సందర్భాలలో.. సాయి తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు. అవసరమైనప్పుడు మహిమలు చూపించాడు. కానీ కేవలం మహిమల ద్వారా మాత్రమే తాను దేవుడినని చెప్పి ప్రజలను నమ్మించలేదు. సాయి బోధనలైన జీవకారుణ్యం, సర్వమత సమానత్వం, సామాజిక సౌభ్రాతృత్వం మొదలైనవన్నీ మన ఆధునిక సమాజానికి పనికొచ్చేవే! అందుకే శ్రీసాయి సచ్చరిత్రలోని 25వ అధ్యాయంలో- ‘‘నన్ను నమ్మండి. నేను చనిపోయిన తర్వాత కూడా నా సమాధిలోని ఎముకలు మీకు స్థైర్యాన్ని ఇస్తాయి. నన్ను ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి, నాతో మమేకమైపోతారో వారితో నేను సమాధి నుంచి కూడా మాట్లాడతాను. నన్ను ఎప్పుడూ మీ హృదయంలో ఉంచుకోండి.. మీకు ఎలాంటి ఆపద రానివ్వను..’’ అని అంటారు. అందుకే ఆయన ప్రవచించిన ప్రేమతత్వం ఆయన మరణించిన 98 సంవత్సరాల తర్వాత కూడా ఖండఖండాంతరాల్లోనూ వ్యాప్తి చెందుతోంది. ఈ సమయంలో ఆయన దేవుడా? లేక కేవలం గురువా? అనే విషయంపై చర్చ కన్నా ఆయన చెప్పిన విలువలను పాటించడం మంచిది!
andhra jyothi paper nundi

దేవతానుగ్రహం పొందాలంటే

దేవతానుగ్రహం పొందాలంటే ఒక్కటే మార్గం ఉంది. అది ‘సు’మార్గం. మేలైన మార్గం – మంచిమార్గం.
మన మనస్సును మనం సమర్థించుకునేది మంచి, మేలు అనడానికి లేదు. శాస్త్రాలు నిర్దేశించిన సత్య సదాచార ధర్మమే సుమార్గం. ఆ మార్గాలలో వెళ్ళేవారు దేవతాకృపకు పాత్రులౌతారు. అంతేకాదు ఆమార్గంలో వెళ్ళలేకపోతున్నామని బాధపడుతున్నా, ‘వెళ్ళాలి’ అని సంకల్పించుకున్నా దేవతలు సాయపడతారు.
‘ధర్మం తప్పకూడదు’ అని మనం నిశ్చయించుకుంటే, ఆ నిశ్చయంలో నిజాయితీ ఉంటే చాలు. ఏది ధర్మమో మనస్సుకు స్ఫురింపజేసి, అధర్మం జోలికి పోకుండా, అధర్మాల ప్రభావం మనపై పడకుండా సుమార్గంలో తోడు ఉండి తమవైపు తామే నడిపించుకునే దయ దేవతలకి ఉంటుంది. అందుకే – ధర్మమంటే ఏమిటో మనకి స్పష్టంగా తెలియకపోయినా, ధర్మంలోనే ఉండాలనుకుంటే వేలుపులే వెంట ఉండి నడిపిస్తారు.
‘దేవతలా రక్షణ పశువుల కాపరివలె మనవెంట కనపడుతూ ఉండదు. రక్షించదలచుకున్న వారి బుద్ధిని మంచివైపు ప్రేరేపిస్తారు’ అని ప్రాచీన సుభాషితం.
‘యోగాన్ని క్షేమంగా కాపాడతాను’ అని దేవాధిదేవుడు శ్రీకృష్ణుడు అభయమిచ్చాడు. ‘నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత! గచ్ఛతి’ – మంచి చేసేవాడికి ఎప్పుడూ దుర్గతి ఉండదు. – అని భగవానుని మాట సుమార్గగాములకు కరదీపిక.
‘...మార్గో నేయో నయోనయః’ నడిచే త్రోవ, నడిచే పధ్ధతి, నడిచేవాడు, చేరవలసిన వాడు – అన్నీ ఆ భగవంతుడే అని విష్ణుసహస్రం వక్కాణిస్తోంది.
పరమాత్ముని ఎవరూ వంచించలేరు. ఆత్మవంచకులు పరమాత్మను ఏమార్చలేరు. తమ తప్పును తాము తెలుసుకొని, ఒప్పుకుంటే సగానికి పైగా, తప్పుకి ఫలమైన దుఃఖం నుండి బయటపడవచ్చు. తమ తప్పును ఒప్పుగా భావించి, భ్రమించి సమర్ధించుకునే వానికి సుమార్గాలు మూసుకుపోతాయి.
నిష్కపటమైన భావంతో, పరమేశ్వరుడు గమనిస్తున్నాడనే భావంతో తెలిసిన నీతిమార్గంలో నడవడం ప్రారంభిస్తే, తెలియవలసినవి తెలియజేస్తూ, ‘తెలివి’గా మనలో ప్రకాశిస్తూ ఆ దేవదేవుడే తోడుంటాడు.

అరుణాచలేశ్వరుడు


===============
మనకి" అష్టమూర్తి తత్త్వము" అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు.

అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు,

 సాకారోపాసన(రూపముతో) శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు.

 కంచిలో పృథివీ లింగం,

 జంబుకేశ్వరంలో జలలింగం,

 అరుణాచలంలో అగ్నిలింగం,

 చిదంబరంలో ఆకాశలింగం,

 శ్రీకాళహస్తిలో వాయులింగం,

 కోణార్కలో సూర్యలింగం,

 సీతగుండంలో చంద్రలింగం,

 ఖాట్మండులో యాజమాన లింగం –

 ఈ ఎనిమిది అష్టమూర్తులు.

 ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే.

 కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం.

అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు.

 అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు.

అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది.

 అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది.

ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర.

 అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు.

 అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది.

 కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు.

 అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి.

 అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది.

 అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు.

 అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు.

 అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.

దర్శనాత్ అభ్రశదసి
 జననాత్ కమలాలే
 స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది.

మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు.

కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం.

ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది.

 అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది.

దాని పేరే అరుణాచలం.

 అచలము అంటే కొండ.

 దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది.

ఆకొండ అంతా శివుడే.

 అక్కడ కొండే శివుడు.

 కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు.

 అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు.

 అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి.

గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి.

 ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి  ఉంటుంది.

అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు.

 అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం.

 దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది.

ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి.

 ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి.

 అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది.

 అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి.

ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు.

 అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగస్థానం.

 కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు.

 అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది.

 అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది.

 అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు.

 అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం.

ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు.

ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి.

 అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది.

అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు.

 ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను.

 నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని, చందా ఇవ్వమని అడిగేది.

 ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది.

అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు.

అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది.

తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది.

 రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు.

ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది.

 అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది.

 తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది.

ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు.

 అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు.

 దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది.

 అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది.

అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది.

ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది.

ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది.

 పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది.

 ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు.

 లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు.

శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు.

 అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది.

ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు.

సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము.

స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే.

 అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రమించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు.

 అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ.

అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ.

అష్ట ఐశ్వర్యాలను సిద్దించే లలితా త్రిపుర సుందరి



త్రిపురు సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి, లలిత మరియు రాజరాజేశ్వరి) రూపాలలో ఒక మహా విధ్యలలో ఒక స్వరూపం. సాక్ష్యాత్ ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయస్సు కల పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని పిలుస్తారు.

త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం.

అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో

ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది.

01. స్థూల (భౌతికం): ధ్యాన శ్లోకాలలో వివరించబడినది.

బహిర్యాగంతో పూజించబడుతుంది.

02. సూక్ష్మ (సున్నితం): మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది.

03. పర (మహోన్నతం): అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది. దంబవృక్షములు (కమిడి చెట్లు)వనముందు నివసించునదీ, ముని సముదాయమను కదంబవృక్షములను వికసిపంచేయు (ఆనందిప చేయు ) మేఘమాలయైనది, పర్వతముల కంటే ఎతైన నితంబు కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ, తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరిని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే …

పురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవి ఉపసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేవ్వరీ స్వరూపము అమ్మ!

పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు లలితా మహా త్రిపుర సుందరి దేవిని. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు ! చెరుక గడ, విల్లు, పాశాంకుసాలను ధరించిన రూపంలో ,కుడివైపున సరస్వతి దేవి, ఎడమవైపున లక్ష్మీ దేవి , సేవలు చేస్తు ఉండగా, లలితా దేవి భక్తులను అనుగ్రహిస్తుంది.

దారిద్రయ దుఖాలను తొలగించి, సకల ఐష్వర్య అభిష్టాలను అమ్మవారు సీధ్ధింప చేస్తుంది.

ఈమే శ్రీ విద్యా స్వరూపిణి .సృష్టి,స్తితి , సమ్హార స్వరూపిణి ! కుంకుమ తో నిత్య పూజ చేసె సువాసీనులకు ఈ తల్లీ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

శ్రీచక్ర ఆరధన . కుంకుమ అర్చన ,లలితా అష్టొత్తరముతో అమ్మని పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతు సువాసీనులకి పూజ చెయ్యాలి.

శ్రీ చక్రం లో బిందువు ఒకటిగానే కనిపించిననూ శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము.

* ఇఛ్ఛా శక్తి: వామాదేవి, బ్రహ్మ యొక్క దేవేరి
* జ్ఞాన శక్తి: జ్యేష్ఠాదేవి, విష్ణువు యొక్క దేవేరి
* క్రియా శక్తి: రౌద్రి, శివుడు యొక్క దేవేరి

ఇవన్నీ సాక్ష్యాత్ అంబికా దేవి యొక్క రూపాంతరాలే

లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థము. సృష్టి, స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు.

మోక్ష దాయకాలైన ఏడు క్షేత్రములలో కంచి క్షేత్రం ఒకటి. ఒకసారి వేదవేదాంగపారంగతుడు అయిన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి , కామక్షి దేవిని పూజించాడు.అనేక సంవత్సరములు తపస్సు చేసాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు అతడికి హయగ్రీవ రూపములో ప్రత్యక్షమై ఎమి కొరిక అని అదగగా, మహర్షి ఆయ్నకు నమస్కరించి ‘పామరులైన ఈ మానవులు అందరికి మోక్షాన్ని పొందతానికి సులభమైన మార్గము ఎదైన ఉంటే, దానిని తెలియచెయ్యవల్సిందిగా ,లోక కల్యాణార్ధం విష్ణువు మూర్తిని ప్రార్థన చేసాడు.

దానికి హయగ్రీవుడు ‘మానవులకు భుక్తిని, ముక్తిని, దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి, లలితా పరాశక్తి మాత్రమే’ అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్త్యుడికి వివరముగ తెలియచేసాడు.

అమ్మవారు భండాసురుడు అనే లోకపీడికుడను, పరమకీరతకుదను వధించే ఘట్టంలో దేవతలు అందరు అమ్మని ప్రార్థన చెయ్యగా, వారు చేసిన యాగం నుండి చిదగ్ని సంభుతిగా అమ్మ ఆవిర్భవించింది.

భండాసురుదిని వధించటం కోసమే, సమస్త లోకాలను, దేవజాతులను,ప్రకృతిని, ప్రాణకొటిని, వస్తుజాలాన్ని, మరల సృష్టించటం, సమ్రక్షించుకోవడం కోసమే అమ్మ ఆవిర్భవించింది. ఆ విధముగా ఉద్భవించిన లలితాదేవి శరీరము, ఉదయిస్తున్న వెయ్యి సూర్యుల కాంతి వలే ప్రకాసించింది.

అమ్మవారు సృష్టిలోని సౌందర్యమంతటికి అవధి ! అమ్మకి మించిన సౌందర్యము లేదు. భండాసురుదిని వధించే కార్యం లో , అద్భుతమైన ఆస్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు ‘కరాంగూళి నఖోత్పన్న నారయణ దశాకృతి ‘ అనే నామం ఏర్పడింది.

అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. దేవి భాగవతం, లలితోపాఖ్యానం నిత్యం పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు.

Monday 9 January 2017

త్రికాలవేది అయిన వ్యాసభగవానులవారు అప్పుడేచెప్పారు???


కలియుగంలో జన్మించబోయేవారు   అలసులు, మందబుధ్ధులు, అల్పాయుష్కులు, స్వార్థపరులు , అరిషడ్వర్గాలను జయించలేని అజ్ఞానులుగా నిరూపించబడతారని అష్టాదశపురాణాల్లోనూ చెప్పారు.

కలియుగంలో మనుషుల తత్వాలను కలియుగ ధర్మాన్ని ఆదిశంకరాచార్యులు ఈవిధంగా చెప్పారు.
కలియుగంచాలా ఘోరమైనది.
మానవప్రవర్తన ధర్మశక్యంగా ఉండదు.
పాపపుణ్యవివక్షత ఉండదు.
దురాచారపరులౌతారు.
సత్యభాషణ ఉండదు.
ధనార్జనే పరమావధిగా ఉంటారు.
ఆత్మస్తుతి పరనిందతోనే కాలక్షేపంచేస్తారు.
కుటుంబాలు చీలుతాయి.
హింసరాజ్య మేలుతుంది.
పరస్త్రీ,పరధనం, పటికబెల్లంఅచ్చులా చప్పరించేస్తారు.
ఆత్మదృష్టిలేక దేహతాదాత్మ్యబుధ్ధితో కాలం వెల్లబుచ్చుతారు.
తల్లిదండ్రులు, గురువుల పట్ల భక్తి గౌరవాలులేని భ్రష్టులౌతారు.
స్త్రీలను భోగసాధనంగా భావిస్తారు.
కామతంత్రపరాధీనులై ఉంటారు.
కపటస్నేహం ,కపటప్రేమ నటిస్తారు.
విప్రులు వేదాలు విక్రయిస్తారు.నీచ ధర్మప్రవృత్తి చేపడతారు.
విప్రులు సమాజంలో గౌరవస్థానం కోల్పోతారు.
మనుజులు లోభగ్రస్తులు, ఆశాపాశబంధితులు అవుతారు.
బ్రహ్మానందా న్ని అనుభవించే బ్రహ్మీభూత స్థితినుండి చ్యుతులౌతారు.
జాతిధర్మాన్నికర్మలను విడిచి వర్ణసంకరంచేస్తారు.
అహంకార, మమకార, కామ, క్రోధాలకు వశులై ఆత్మజ్ఞాన శూన్యులై అదియే నాగరికత అనిభ్రాంతి పడతారు.
సమత్వబుధ్ధి నశిస్తుంది.
శీలము నశిస్తుంది.
కలిలో క్షత్రియధర్మం నశిస్తుంది.
గో- బ్రాహ్మణ రక్షణ ఉండదు.
భోగలాలసత్వం పెరుగుతుంది.
క్రయవిక్రయాల్లో కపటత్వం అధికారుల్లో లంచగొండితనం పెచ్చుపెరుగుతాయి.
స్త్రీలలో పాతివ్రత్య ధర్మం నశిస్తుంది.
సంపాదనబట్టి భర్తను గౌరవిస్తారు.
అత్తమామలను ఆదరించరు.
స్త్రీలకు కేశములుండవు రత్నాభరణములపై
మక్కువ ఎక్కువ.
స్త్రీలు స్వేఛ్ఛానువర్తనులుగా ఉంటారు.అధిక సంతానము క్రమేపి సంతానపరిమితి, అంత్యముగా సంతానలేమికి ఇష్టపడతారు.
స్త్రీపురుషులు మద్యమాంసాదులకు బానిసలౌతారు.
దొంగలు పాలకులౌతారు.
ప్రజల ధన మాన ప్రాణాదులకు రక్షణ ఉండదు.
ప్రకృతిపట్ల పూజ్యభావముండదు.
ప్రకృతి ఆకృతి మార్చుకుంటుంది.
ప్రకృతి సహకరించదు.
ప్రకృతి మనుజునిమధ్య సామరస్యంలోపిస్తుంది.
ప్రకృతి విజృంభిస్తుంది.గతితప్పుతుంది.
దానికి సూచనగా...
భూమినిస్సారమౌతుంది.
సుగంధాలు పసనుకోల్పోతాయి.
పువ్వులు వాసనకోల్పోతాయి.
పండ్లలో రసముండదు.
కూరల్లో రుచిఉండదు.
పాలలో జిడ్డు ఉండదు.
సమస్త వస్తువులు తమధర్మాన్ని కోల్పోతాయి.
ఈ సూచనలు పూర్తిగా కనిపించినరోజు కలియుగాంతమూ తప్పదు.  
              .....
ఆదిశంకరాచార్యుల        ధర్మసూక్తము 

మీరూ నేర్చుకోవలసిన ప్రాకృతిక రహస్యం ఇది

శంకరన్ పిళ్ళై ఉద్యోగార్ధం అరేబియా దేశం వెళ్ళాడు. రాజుగారికి క్షవరం చేసే పని దొరికింది.
జీతం మంచిది. శంకరన్ పిళ్ళై తను దాచిన మొత్తానికి బంగారం కొన్నాడు. అది ఒక బత్తాయిపండు సైజులో వుంది. దానిని తన క్షురకపెట్టేలో దాచాడు.
ఒకసారి రాజు క్షవరం చేయించుకుంటూ, అడిగాడు, "మన పాలనలో మనుషులేలాగున్నారు?" అని.
"బాదుషా, మీ పాలనకేం కొరత? ఒక్కోకడి దగ్గరా కనీసం బత్తాయంత బంగారం వుంది" అన్నాడు.
రాజు తన మంత్రికిది చెప్పి, సంతోషపడ్డాడు. "రేపు ఇదే ప్రశ్న శంకరన్ పిళ్ళైను అడిగి చూడండి" అన్నాడు.
ఆ రాత్రి శంకరన్ పిళ్ళై దాచిన బంగారాన్ని దొంగలించడానికి మంత్రి తగిన ఏర్పాట్లు చేశాడు. మర్నాడు శంకరన్ పిళ్ళైను రాజు అదే ప్రశ్న వేశాడు.
శంకరన్ పిళ్ళై ముఖం వేలాడబడింది. "చెప్తే తప్పుగా అనుకోరు కదా బాదుషా! మీ పాలనలో ఎక్కడ చూసినా దొంగతనం, కొల్లగొట్టడం, దారికాయడమే! కనీసం బత్తాయంత బంగారం కూడా దాచుకోలేకపోతున్నారు ప్రజలు" అంటూ బాధపడ్డాడు.
శంకరన్ పిళ్ళై తన పరిస్థితిని ఆధారంగా చేసుకుని, ఒక రాజ్యం స్థితిగతుల్ని లేక్కించినట్టే మీరూ, మిమ్మల్ని దృష్టిలో వుంచుకొని, చుట్టూ వున్న అందరి జీవితాలు నాశనమయ్యాయని తీర్పు చెప్తున్నారు.
ఆర్దికంగా వెనుకబడి వున్న మన దేశం ఊపందుకొని కదంతోక్కుతూ ముందంజ వేయడాన్ని మీరు రెండు చేతులూ జాచి ఆహ్వానించండి. ఈ పరిస్థితికి వ్యతిరేకమైన ఆలోచన కూడా మీ మనసులో రానియకండి.
మీ వసతిని తగ్గించారని, ఎవరినో ఏదో అనడం మానండి. అన్ని అయిపొయాయను కోవద్దు.
మీరు ఎదగడానికి, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. మార్పులకి తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఏ క్షణమూ అలాగే వుండిపోదు, మార్పే జీవితానికందం. మార్పును మనసారా అంగీకరించడానికి తయారవకపోతే జీవితంలో బాధా, వేదనా మిగులుతాయంతే! మీరూ నేర్చుకోవలసిన ప్రాకృతిక రహస్యం ఇది.
------ సద్గురు జగ్గీ వాసుదేవ్ -----
Sent by Ashwin Kumar Dulluri

అసలు శివుని యొక్క ఆత్మలింగం ఎందుకు (గోకర్ణ లో) గణపతి చేతుల మీదుగా భుమిమీద పెట్టబడింది?


భూగోళం పై సృష్టి జరగకముందు మొత్తం భూమిని ఆవరించి ‘సముద్రుడు’ ఉండేవాడు. ఎక్కడా కుడా ఇసుమంతైనా భూభాగం కనిపించేది కాదు. దేవతలు సముద్రుడికి భూగ్రహాన్ని నివాసంగా ఇవ్వడం జరిగింది. అటువంటి సమయంలో దేవలోకంలో ఉన్న బ్రహ్మ సృష్టి జరగాలనీ, అదికూడా మహాశివుని ద్వారా జరగాలనీ, అదికూడా ‘భూమి’ మీద సముద్రుడి చుట్టుకొలతలతో జరగాలనీ ఆశించాడు. ఆవిషయాన్ని తెలుసుకున్న సముద్రుడు తను ఆవరించిన చుట్టుకొలతలో కొంతమేర తగ్గించి అక్కడక్కడ భూమి బయటకు కనిపించే విధంగా తన రూపాన్ని అమర్చుకున్నాడు. అంతట పరమశివుడు మరణము సంభవించనీ, సమానగుణములూ, సత్వగుణములు కలిగిన మానవజాతిని సృస్టించడానికి కావలసిన శక్తి కోసం పాతాళలోకంలో ఒకానొక శుభదినాన్న తపస్సు ప్రారంభిస్తాడు. ఆవిషయాన్ని తెలుసుకున్న బ్రహ్మ సృష్టి అంటే ‘చరాచర’ జగత్తు. అవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటూ ఒకదానిమీద మరొకటి ఆధారపడేలా ఉండాలి కాని సృష్టి అంటే సమాన జగత్తు కాదనీ, 5 భిన్న సముదాయాల సమ్మేళనమే (పంచ భూతాలు) సృష్టి అనీ, శివుని తపస్సు అందుకు భిన్నంగా ఉందనీ “నేనొకటి తలిస్తే శివుడొకటి తలుస్తున్నాడని” అందరిలో (తను కలిసిన వారందరితో) చెబుతాడు. ఆ విషయాన్ని పాతాళలోకంలో తపస్సులో ఉన్న శివునికి తపోభంగం కలిగించి మరీ చెబుతుంది ‘ప్రకృతి’.
ఆ విషయాన్ని తెలుసుకున్న శివుడు ఆవేశంతో అయితే “ఆయన్నే సృష్టి చేసుకోమని” కైలాసం వెళ్ళడానికిగానూ పాతాళలోకం నుండి పైకి వచ్చుటకొరకై చక్రాకార భ్రమణం చేయుచున్న భూమి అడ్డువచ్చుట చూసి “నేను వెళ్ళాలి దారిని వొదులు, అడ్డులే!” అని అరుస్తాడు. అప్పుడు భూమాత వినయంతో “పరమశివా! రాకరాక ఇక్కడికి వచ్చావు. కారణమేదైనా, ఎవరిమీద కొపమున్నా దయచేసి నాకు నీ స్పర్శన భాగ్యం కలిగించి, నన్ను భాదింపకుండా సూక్ష్మరూపధారుడవై నాలో ప్రవేసించి, నా కర్ణముల గుండా కైలాసానికి వెళ్ళవలసింది” అని దీనంగా స్తోత్ర సహితంగా ప్రార్దించింది. ఆస్తోత్రాన్ని విన్న రుద్రుడు శాంతించి అంగుష్టమాత్ర శరీరాన్ని ధరించి భూమాత కర్ణముల గుండా బయటకు వచ్చి ఆనందంతో “నీకు గల మరొక పేరు (భూమికి గల మరొక పేరు) ‘గో’, ఇది నీ కర్ణ ప్రదేశం కనుక ఇకనుండి ఈ సుందర ప్రదేశం “గోకర్ణ” గా ఖ్యాతి పొందుతుంది. ముందు యుగాలలో ఇక్కడ గోకర్ణ ఆకారంలో, “గోకర్ణేశ్వరుడనే మహాబలేశ్వరుడు ఆత్మలింగంగా”స్థాపింపబడతాడు. అశ్వనీదేవతల పై నాకుగల ప్రేమను చాటడంకోసం ఈ పేరులో అంతర్లీనము గా ఉన్న గోకర్ణ (ఆవుచెవి – ఆవు చెవిలో అశ్వనీ దేవతలుంటారు) ఆకారం లోనే గోకర్ణేశ్వరుడు ఉంటాడు. ఈ ప్రాంతం అనేక గోవులకు ఆలవాలమై ఉంటుంది. నేను పాతాళం నుండి బయటకు వెళ్ళునప్పుడు ఈ ప్రదేశం “యోని” లాగా నాకు కనిపించినందున ఈ ప్రాంతాన్నే “రుద్రయోని / విశ్వయోని” అనీ, ప్రళయకాలంలో భూమిపై గల సముద్రుడు ఇక్కడే “సుడి” తిరిగి సృష్టిని తనలో కలిపేసుకుంటాడుగాన దీనికి “వరుణావర్తం” అనీ పేరు వస్తుంది. “గోకర్ణ” నామమును ఇక్కడ ఉండి పొద్దున్న ఉచ్ఛరించిన , గత రాత్రి చేసిన పాపములన్నీ హరించుకుపోవును. అలాగే “గోకర్ణ” నామమును ఇక్కడ ఉండి సాయంత్రం ఉచ్ఛరించిన, పొద్దున్న చేసిన పాపములన్నీ హరించుకుపోవును. ముందు ముందు క్రమంగా ఇక్కడకు మహర్షులూ, దేవతలూ, గంధర్వులూ, యోగులు వచ్చి వారి పాపముల ప్రక్షాళనగావించుకొనెదరు. ఇక్కడికి తీసుకురాబడేవారెవరైనా, ఇక్కడనుండి తీసుకుపోబడేవాడేవడైనా (ఇక్కడ మరణం పొందినవారు) అత్యంత అదృష్టవంతుడని తలంపుము. ఇక్కడే తాంత్రిక విద్యలు పుడతాయి. వాటిని నిరోధించే హనుమంతుడూ ఇక్కడే పుడతాడు. ఈ ప్రాంతం భూమి మీద గల ప్రత్యేక ప్రాంతంగా, భౌతిక సుఖాలకు, ఆధ్యాత్మిక సుఖాలకు కేంద్రంగా మారుతుంది. ఈ ప్రాంతంలో ముందు ముందు “అఘనాశిని మరియు గంగావళి ” (అఘనాశిని = పాపమును నశింపజేసేది, గంగావళి = గంగతో సమానమైనది) అనే పాపాలను సమూలంగా కడిగే ఈ విశ్వం లోనే గల ఏకైక సముద్ర సంగమసహిత రెండు నదులు పారుతాయి. (కాశి లోని గంగానది సముద్రసంగమ ప్రదేశం కాదు). ఎవరైతే ఈ అఘనాశిని మరియు గంగావళి నదులు సముద్రంలో కలిసే చోట స్నానమాచరిస్తారో వారికి పన్నెండు పూర్వ జన్మలలో చేసిన పాపాలూ, అలాగే ప్రస్తుత జన్మలో అప్పటివరుకు చేసిన పాపాలూ “శూన్యమవుతాయి”, ఇక్కడికి మునులూ దేవతలూ సైతం వచ్చి సంధ్యవార్చి స్నానం చేసి వెళ్ళవలసిందే!” అని రుద్రుడు భూమికి వరముని ఇచ్చి కైలాసానికేగుతాడు.

ముక్కోటి ఏకాదశి నాడు చదువ వలసిన మంత్రం


ఎకాదశ్యాం నిరాహారో భూత్వాహా మపరేహని \

              భోక్ష్యామి  పుండరీకాక్ష  \

                   శరణం మే భవాచ్యుతా ||

అనే మంత్రాన్ని చెప్పి దేవునికి
పుష్పాంజలి సమర్పిన్చాలి

లోకం - ధర్మం అంటే ఏమిటి?

‌              భారతీయ తత్వశాస్త్రం ౼ 24
                   (Indian Philosophy)
                       అవైదికదర్శనాలు

      (కొన్ని భౌతిక దర్శనాలు : బౌద్ధ దర్శనం.)
                      బుద్ధ చరిత్ర.
           ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
     

          లోకం - ధర్మం అంటే ఏమిటి?
    

బుద్దుడు ప్రధాన అనుచరుడు ఆనందుడు, భిక్షుల అభ్యర్థన మేరకు, లోకం అంటే ఏమిటి? ధర్మం అంటే ఏమిటి? తెలుసుకోవాలని అనుకున్నాడు.
    ఆనందుడు పై విషయాలపై ధర్మబోధ చేయాలని బుద్దుని కోరాడు. ఆనందుడు అడగడంలో ఏదో ఆంతర్యం ఉంటుందని బుద్దుడు వెంటనే అంగీకరించారు.
     *బుద్దుడు:-* ఆనందా! ఈ లోకం అనేక ధాతువుల కలయిక. అణువుల సమాహారం. అవి కలసి, రూపొంది, పరిమాణం చెంది, పరిమాణంలో మార్పులకు లోనై నశిస్తుంటాయి.
     అన్ని ధర్మాలు, ఇంద్రియాలు, అభిరుచులు, అనుభూతులు, చేతనలు -- అలా పరిమాణం చెందుతూ నశిస్తుంటాయి. ఏవి శాశ్వతంగా ఉండవు. ప్రతి క్షణం పరిణామం చెందవలసిందే. సూక్ష్మంగా చెప్పాలంటే మార్పు చెందుతూ నశించేది 'లోకం' అనుకోవాలి.
     *ఆనంద్:-* మీరు అనేక సందర్భాలలో చెబుతుంటారు. అన్ని ధర్మాలు శూన్యాలే నని. శూన్యం అంటే ఏమిటి గురుదేవా!
     *బుద్దుడు:-* శూన్యం అనడంలో నా అభిప్రాయం వేటికి మనుగడ లేదని. శాశ్వతంగా నిలబడవని.
     *ఆనందుడు:-* అంటే అన్ని ధర్మాలు శూన్యాలేనా?
     *బుద్దుడు:-* నీవు 'శూన్యం' పైన భావన చేయ్యి. ధ్యానంలో 'శూన్యం' బరువు తెలుస్తుంది. 'శూన్యత' విలువ తెలుస్తుంది. జనన మరణాలను దాటిపోవడానికి శూన్యధ్యానం మించిన సాధనం లేదు.
     *ఆనంద్:-* గురుదేవా! ఇప్పుడు ఈ మందిరం ధ్యానులతో నిండి ఉంది. దీనిని పూర్ణం అనవచ్చు కదా!
     *బుద్దుడు:-* నిండి ఉండడం పూర్ణత్వం అయితే శూన్యంతో నిండి ఉండడం కూడా పూర్ణత్వమే.
     వీళ్ళంతా ధ్యానంలో మైమరిచి పోయినారనుకుందాం. వారికి ప్రపంచ ధ్యాసలేదు. కను వారికి తాము శూన్యమే, ఈ మందిరం శూన్యమే, ప్రపంచం శూన్యమే.
     అన్ని ధర్మాలు నశించేవి అనడంలో అన్ని మార్పులు చెందేవి అని అర్థం. చివరికి ఏవి మిగలవు. శూన్యం అంటే ఆత్మ సైతం మిగలని స్థితి. అది శూన్యం అంటే.
     *ఆనంద్:-* కొందరు వైదికవాదులు, అన్యమతస్థులు బుద్దునిది శూన్యవాదం అని ప్రచారం చేస్తున్నాం. జీవనవాదానికి భిన్నమైనది శూన్యవాదం. అస్తిత్వానికి భిన్నమైనది నాస్తికవాదం. కాదంటరా! ధర్మాలు శూన్యం అంటే అందరికీ కోపం వస్తుంది కదా!
     *బుద్దుడు:-* ఈ విషయంలో పండితులే కాదు యావత్ ప్రపంచం నన్ను అపార్థం చేసుకుంటుంది.
     అన్నీ శూన్యం అని నేనెప్పుడూ చెప్పలేదు. జీవితాన్ని త్రోసి రాజనలేదు. అస్తిత్వాన్ని ఆమోదించేవారు నాస్తికత్వాన్ని ఆమోదిస్తారు. పూర్ణత్వాన్ని ఆమోదించే వారే శూన్యాన్ని ఆమోదిస్తారు.
      అస్తిత్వం ఎన్నటికీ శూన్యం కాదు. కాని చివరికి మిగిలేది శూన్యం. అంటే శూన్యతా భావన. ఒక విధంగా చూస్తే అన్నింటి స్వభావంలో శూన్యం ఉన్నట్లు. మరొక విధంగా విశ్లేషిస్తే అన్ని భ్రమలనిపిస్తాయి. భ్రమవాదం లోనికి వెళితే గాని సత్యం గోచరించదు.
      *భిక్షు కాత్యాయన:-* ఏది సవ్యమైన దృష్టి? ఏది అపసవ్య దృష్టి?
    *బుద్దుడు:-* అపసవ్య దృష్టి అంటే ఆస్తిక, నాస్తిక భావనలు ఏర్పరుచుకోవడం. సవ్యదృష్టి అంటే ఆ రెండింటికీ విలువ ఇవ్వక పోవడం. ఆస్తిక, నాస్తిక భావనలకు దృష్టి దోషం ఉంది. వాస్తవం ఎప్పుడూ సిద్ధాంత, రాద్దాంతాలకు అతీతం. సత్యాన్ని గ్రహించిన వారిని జ్ఞానులు, ప్రాజ్ఞులంటారు.
     *ఆనంద్:-* అంటే అర్థం కాలేదు.
     *బుద్దుడు:-* ఉదాహరనకు ఈ ధర్మమందిరం ముందర ఉన్న బోధివృక్షాన్ని తీసుకో అది ఎప్పుడు పుట్టింది?
     *ఆనంద్:-* నాలుగు సంవత్సారాలై ఉంటుంది.
     *బుద్దుడు:-* నాలుగు సంవత్సరాల క్రిందట అక్కడ బోధి వృక్షం ఉన్నట్లా? లేనట్టా?
     *ఆనంద్:-* లేనట్లే.
     *బుద్దుడు:-* అంటే శూన్యం నుండి బోధి వృక్షం ఉద్భవించిందా? కాదు గదా. అలాగే ఏ ధర్మం అయినా శూన్యం నుండే ఉద్భవిస్తుంది. బీజం ఎక్కడో ఉంటుంది. విత్తనం లేకుండా మొక్క మొలకెత్తదు. మహావృక్షంగా పెరగదు. అది పరిణామం. చెట్టు విత్తనానికి పొడిగింపు. వేళ్ళు నేలలో పాతుకునే వరకు. కొమ్మలు, రెమ్మలు పైకి విస్తరించే వరకు అది బీజంలో ఉన్నట్లే. కాదంటే చెట్టు రూపంలో ఉండదు.
     వేళ్లు నేలలో పాతుకున్నాక విత్తనం చనిపోతుందా? లేదు. విత్తనం లేకుండా పోయింది. విత్తనం రూపం మారింది. పరిణామంలో స్థితి మారింది. ఒక స్థితిలో నుండి మరో స్థితిలోకి మారడం.
     అలాగే మరణంతో మనిషి మరణించడు. పరిణామం చెందుతాడు. మృత్యువు వలన నశించేది ఏది ఉండదు. ప్రాయికమైన ధాతువులు వేటికవి విడిపోతాయి. జీవం ముందుకు సాగుతుంది. అయితే జీవానికి జననం లేదు, మరణం లేదు. ఉన్నది ఒకటే పరిణామం.
                           ---- మీ సత్యాన్వేషి

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles