Showing posts with label మోక్షమార్గం. Show all posts
Showing posts with label మోక్షమార్గం. Show all posts

Tuesday 17 January 2017

సుందరకాండము పారాయణము చేసినవారికి అనుకొన్న పనులు నెరవేరి కార్యసిద్ధి కలుగుతుంది.

శ్రీమద్రామాయణంలో సుందరకాండ ఐదవది. సుందరకాండము పారాయణము చేసినవారికి అనుకొన్న పనులు నెరవేరి కార్యసిద్ధి కలుగుతుంది.

సుందరకాండంలో హనుమంతుడు శతయోజన విస్తీర్ణం గల సముద్రమును ఆధారంలేని ఆకాశమార్గంలో పయనించి, ఆటంకాలను ఎదుర్కొని లంకాపట్టణములో ఒంటరిగా ప్రవేశించాడు. లంకలో అన్నిచోట్ల సీతను అన్వేషించి, అశోకవానములో శింశుపావృక్షమూలమున దీనస్థితిలో ఉన్న సీతను కనుకొన్నాడు.
తల బలప్రాక్రమములను శత్రువులకు తెలియజేయుటకు వనములను, ఉద్యానవనములను, ప్రాసాదములను ధ్వంసం చేసాడు. అక్షకుమారుడులాంటి రాక్షస వీరులను ఎందరినో సంహరించాడు.
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమునకు కట్టుబడి రావణ సభకు వెళ్లాడు. రావణునికి హితము పలికాడు. రాక్షసులు తన తోకకు నిప్పు పెట్టగా ఆ మంటలతో లంకానగరాన్ని దహనం చేసాడు.
స్వామికార్యము, స్వకార్యము నెరవేర్చి కార్యమును సానుకూలము చేసుకొని, తిరిగి సముద్రాన్ని లంఘించి వానరులను కలుసకుకొని సీతావృత్తాంతం చెలియజేసాడు.
హనుమంతుడు తనకు అప్పగించిన పనిని విజయవంతంగా నెరవేర్చుటకు అతడు పడిన శ్రమ, శక్తియుక్తులు కార్యసాధకుడు ఎట్లు ఉండవలెనని సుందరకాండ వలన తెలుస్తున్నది.
కార్యము అనగా మంచిపని. ఒక కార్యము చేయునప్పుడు మధ్యలో ఆటంకాలు వస్తుంటాయి. వాటిని ఓర్పుతోను, నేర్పుతోను, శక్తియుక్తులతోను అధిగమించాలి.
హనుమంతుడు సీతాన్వేషణముకై సముద్రమును వాయు మార్గంలో లఘించుచుండగా మొదట మైనాకుడు సముద్రములోనుంచి పైకి వచ్చి తనపై కొంతసేపు విశ్రాంతి తీసుకొని పొమ్మన్నాడు. తన ఆతిథ్యాన్ని స్వీకరించమని ప్రార్థించాడు.
మైనాకుడు సత్యగున ఆటంకము. కావున కార్య సాధకుడు మధ్యలో ఆగరాదు. రాముని కార్యము నెరవేర్చుటకు వెళుతున్నానని మైనాకుని మృదువుగా స్పృశించి, ప్రియవచనములతో స్వస్థత పరచి ఓర్పుగాను, నేర్పుతోను ఆటంకమును అధికమించి ముందుకు సాగాడు.
కొంతదూరము పోయిన తరువాత, దేవతలు పంపగా వచ్చిన సురస అను నాగాస్త్రీ హనుమంతుని అడ్డం నిలిచింది. హనుమంతుడు ముక్తిక్తితో, ఉపాయముతోను ఆమె నోటి యందు ప్రవేశించి బయటకు వచ్చెను. ఇది రజోగుణ సంబంధిత ఆటంకము. దీనిని ముక్తితో దాటెను.
మరికొంత దూరం ప్రయాణించగా ఛాయా గ్రాహియైన సింహిక అను రాక్షసస్త్రీ హనుమంతుని ఛాయను పట్టుకొని క్రిందికి లాగినది. ఇది తమోగుణ ఆటంకము. హనుమంతుడు సూక్షరూపం ధరించి, సింహికనోటిలో ప్రవేశించి ఆమె అవయవములను తన గోళ్ళతో పెకిలించి హతమార్చాడు.
కార్యసాధకుడు తనకు ఎదురైన సత్త్య, రజస్తమో ఆటంకములను ఓర్పు, నేర్పు, ముక్తి, శక్తిని ఉపయోగించి అధికమించెను.
లంకాపట్టణం చేరిన హనుమంతుడు తన స్వరూపమును చిన్నది చేసికొని సంచరించెను. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించాడు. సురస, సింహికలను అధిగమించునపుడు, లంకాపట్టణంలో సీతాన్వేషణ చేయునపుడు సూక్ష్మరూపాన్ని ధరించాడు. సముద్రము లంఘించునపుడో, అశోకవనమును ధ్వంసము చేయునపుడు, రాక్షసులతో యుద్ధము చేయునపుడు, లంకా దహనము చేయునపుడు శరీరాన్ని పెంచాడు. పరిస్థితులబట్టి ప్రవర్తించాడు.
కార్యము నేరవేరాలనేదే దేశకాల పరిస్థితులను బట్టి కార్యసాధకుడు ప్రవర్తించాలి.
“తతః శరీరం సంక్షిప్య” (సుం. 1-205)
రావణుని అంతః పురంలో వివిధ భంగిమలతో అర్థనగ్నముగాను, నగ్నముగాను ఉన్న సౌందర్యవంతులైన స్త్రీలను చూచాడు. ఎన్నోరకములైన సువాసనలతో కూడిన ఆహార పదార్థములు పరికించాడు. కాని, హనుమంతుని మనస్సు చలింపలేదు. సీతను గురించి ఆలోచన తప్ప వేరే ఆలోచన అతని మనస్సులో లేదు. మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము కలిగిన జితేంద్రియుడు హనుమంతుడు.
కార్యసాధకుని మనస్సు వికారములకు లోనుకారాడు. మనోవికారము లేనప్పుడు, ఏది చూచినను దోషములేదు. ఆ కార్యసాధకుని కార్యం మీదనే దృష్టి ఉంటుంది.
శ్లో||మనోహిహేతుః సర్వేషామిన్ద్రి యాణాం ప్రవర్తెతే
శుభాశుభస్వవ్స్థాసు తచ్చమే సువ్యవస్థంమ్ (సుం. 11-41)
ప్రలోభములకు లొంగరాదు, విషయము లందు చలింపకూడదు.
హనుమంతుడు లంకలో అన్ని ప్రదేశములను సీతకై వెదకి ఆమె కనుపించక పోవుటచే దిగులు చెంది నిరుత్సాహ పడెను. తన శ్రమ వృథా అయినదని దైన్యము నొందెను.
కార్యసాధకునికి దైన్యము పనికిరాదు. నిరుత్సాహము చెందినను, దిగులు చెందినను కార్యము సిద్ధింపదు. కార్యనిర్వాహణకు దిగులు వదలి ధైర్యము వహించాలి. సర్వకార్యములు ఆ నిర్వేదము వలననే సానుకూలమగును.
శ్లో|| అనిర్వేదః శ్రియోమూలమనిర్వేదః పరంసుఖమ్
అనిర్వేదోహిసతతం సర్వార్దేషు ప్రవర్తకః (సుం. 12-10)
శక్తివంతుడైన హనుమంతుడు వెంటనే దైన్యమును విడచి, ధైర్యము తెచ్చుకొని సీత కనిపించునంతవరకు వెదకెదనని ధృడచిత్తుడయ్యెను. మనస్సును దిటవు చేసుకొన్నాడు. బ్రతికి ఉంటేనే ఏదైనా సాధించేది. చచ్చి సాధించేది ఏమున్నది? బ్రతికి ఉంటే సీతమ్మను కనుగొని రామయ్యకు చెప్పవచ్చు. మంచి కార్యములు చేయ వచ్చునని విరక్తిని వదలి సీతాన్వేషణకు ఉపక్రమించాడు.
శ్లో|| వినాశే బహావోదోషా జీవన్ భద్రాణిపశ్యంతి
తస్మాత్ర్వాణాన్ ధరిష్వామి ధ్రువో జీవిత సంగమః (సుం. 13-47)
ఇంతవరకు హనుమంతుడు తన శక్తియుక్తులను ఉపయోగించాడు. పురుషప్రయత్నం ఎంతచేసినా కార్యసాధకుడు దైవసహాయం కూడా కోరాలి. పురుష ప్రయత్నము, దైవానుకూలత ఉన్నప్పుడే కార్యసిద్ధి కలుగుతుంది.
శ్లో|| కచ్చి త్పురుష కారంచదైవంచ ప్రతిపద్యతే (సుం. 36-19)
సీత కనబడునట్లు అనుగ్రహించుమని, హనుమంతుడికిఉ వసు, రుద్ర, ఆదిత్య, అశ్వనీదేవతలను ప్రార్థించాడు. లక్ష్మణ సహితుడైన రాముని, జనకాత్మజ సీతను, యమ, వాయువులను కార్యసిద్ధికోరకు స్మరించి అశోకవనములోనికి ప్రవేశించి దీనముగా ఉన్న సీతాన్వేషణఉ శింశుపావృక్షము మూలమున కూర్చొనియుండుట చూచినాడు. హనుమంతుని ప్రయత్నం, దైవానుకూలత వలెనే తను కనుగొనగలిగినాడు. అంతా దైవ నిర్ణయం వలన జరుగుతుంది.
శ్లో|| వసూన్ రుద్రాం స్తథాదిత్య నశ్వినౌ మరుతోపిచ
నమస్కృత్యా గమిష్యామి రక్షసాం శోకవర్ధన (సు. 13-56)
శ్లో|| నమోస్తు రామాయ స లక్ష్మణామ
దేవ్వైచ తస్త్య జనకాత్మజాయ
నమోస్తు రుద్రేంద్ర యమానితేభ్యో
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః (13-59)
సీతను చూచినా హనుమంతునికి ఈమె సీతయేనా? అను సందేహము వచ్చెను. పండితుడు కావున యుక్తి యుక్తములైన హేతువులతో ఆమె సీతయే అని నిర్థారణ చేసికొనెను. రావణుడు సీతను అపహరించి లంకకు తీసికొని వస్తున్నపుడు సీత కొన్ని ఆభరణములను తన చీరను చింపి ఆ ఉత్తరీయములో మూటగట్టి ఋష్యమూక పర్వతముపై ఉన్న వానరుల మధ్య జారవిదచినది. ఆమె వదలిన ఆభరణములు ఇప్పుడు ఆమె శరీరముపై లేవు.
రాముడు సీతవద్ద ఏ ఆభరణములు ఉన్నాయని చెప్పెనో అవన్నియు సీత శరీరముపై ఉన్నవి.
నగలను మూటగట్టి ఋష్యమూకముపై విడచినది. ఆ ఉత్తరీయము రంగు ఇప్పుడు ఈమె ధరించిన చీర రంగు ఒకటిగానే ఉన్నవి.
ఈమె రూపము రాముని రూపమునకు తగినట్లు ఉన్నది.
రావణుడు ప్రాతఃకాలమున సీతతో మాట్లాడిన విధానము గమనించిన హనుమంతుడు ఈమె సీతయే అని నిర్ణయించుకొనెను.
కార్యసాధకుడు యుక్తాయుక్తముగా, హేతుబద్ధముగా విచారించి తన కార్యము సానుకూలమయ్యేట్లు చూసుకోవాలి. కార్యసాధనకు కోపము, అహంకారము, దురభిమానము పనికి రాదు. ఇవి కలిగియున్నవారి కార్యము నెరవేరదు. తనకేమి తెలియకున్నను తెలిసిన వానివలె నటిస్తే కార్యము చెడుతుంది.
శ్లో|| ఘాత యంతి హి కార్యాణి దూతాః పండితమానినః (సుం. 30-38)
వివేకము కలిగి ఉండాలి. ఓర్పు ఉండాలి. కోపము పనికిరాదు. కోపచేసెదరు. ము వలన విచక్షణా జ్ఞానము కోల్పోయి చేయరాని పనులు చేసెదరు. తన కోపము వానన తనకే కాక తన ఆప్తులకు కూడా ఆపద సంభవిస్తుంది.
శ్లో|| వాచ్యావాచ్యం ప్రకుపితోనవిజానాతి కర్హిచిత్
నాకార్యమస్తి క్రుద్దస్య నావాచ్యం విద్యతే కృచిత్ (సుం.55-6)
రావణుని ఆజ్ఞానుసారము రాక్షస భటులు హనుమంతుని తోకకు నిప్పు అంటించారు. రావణుని మీద కోపముతో హనుమంతుడు లంకాపట్టణము దహనం చేశాడు. కోపంలో సీత లంకలో ఉన్నదన్న విషయాన్ని మరిచాడు. లంకా దహనమైన తరువాత సీత కూడా మంటలలో తగులబడినదేమో అని విచారిస్తాడు. ఆకాశ మార్గంలో సంచరిస్తున్న చారిణుల వలన సీత క్షేమంగా ఉందని తెలిసికొని సంతోషిస్తాడు. కార్య సాధకునికి నిగ్రహం కావాలి. కోపంతో తొందర పడితే కార్యము చెడిపోతుంది.
సీతాన్వేషణము చేసి తిరిగి సముద్రమును లఘించి వానరశ్రేష్ఠుల వద్దకు వచ్చి తను సీతను ఎలా కనుగొనినది వివరంగా చెప్పాడు. ఇంత కార్యము సాధించిననూ హనుమంతునిలో అహంకారము లేదు. ఈ కార్యము నా వలన జరిగినదని చెప్పలేదు. మీ ఆశీస్సుల వలన రాముని దయ వలన సీతను చూడగలిగినానని పలికాడు.
మహాత్ములు తమ శక్తి సామర్థ్యములతో కార్యము నెరవేర్చిననూ గర్వపడరు. అహంకారపూరితులు గారు. దైవసహాయము వలన జరిగినదని భావిస్తారు.
శ్లో|| రాఘవస్య ప్రభావేన భవ తాం చైవ తేజసా
సుగ్రీవస్యచ కార్యార్థం మయా సర్వమనుష్టితమ్ (సు 58-165)
సుందరకాండములో కార్యసిద్ధికి ఏమీ ఉండాలో, ఎట్లా ఉండాలో హనుమంతుని ద్వారా తెలిసికొని, దానిని ఆచరణలో ఉంచిన కార్యసిద్ధి కలుగుతుంది అనే దానిలో అంతరార్థము ఇదే.
కార్యసాధకునికి ఓర్పు, నేర్పు, శక్తియుక్తులు, ధైర్యము వినయము, వివేకము, యుక్తాయుక్త పరిజ్ఞానము ఉండాలి.
దైన్యము, కోపము, అహంకారము, దురభిమానము, గర్వము పనికిరాదు.
కేవలము మన ప్రయత్నముపైనే ఆధారపడక దైవ సహాయం కూడా అర్థించాలి. పురుష ప్రయత్నం దైవానుకూలత రెండూ ఉన్నప్పుడే కార్యసిద్ధి జరుగుతుంది. ఇది హనుమంతుని ద్వారా సుందరకాండములో చెప్పబడి యున్నది. సుందరకాండము పారాయణ చేసి విషయములను అర్థం చేసుకొని నిజజీవితంలో ఆచరిస్తే కార్యసిద్ధి కలుగుతుంది.
భక్తికి, శక్తికి, యుక్తికి హనుమంతుడే ఆదర్శము. అతని స్మరణవలన అన్నీ కార్యములు నిర్విఘ్నముగా నెరవేరుతాయి.
ఆంజనేయుడు మనం మధ్యనే ఉన్నాడు. ఎందరో భక్తులు ఆయనను పూజించి ఆయన సాక్షాత్కారాన్ని పొందగలిగారు. హనుమంతుడు మహాతత్త్వ పండితుడని ఉపనిషత్తుల సారాంశం. రామ మంత్ర రహస్యాన్ని పురాణకాలపు ఋషులందరు ఆంజనేయుని నుంచే గ్రహించారని తెలుస్తోంది. సమస్త పురాణాలలో ఆంజనేయుని ప్రస్తావన ఉంటుంది. నిరంతర రామనామ స్మరణంతో భక్తిలో మునిగిపోయే హనుమంతుడు తన భక్తులకు ఎటువంటి ఆపదలు కలుగనీయడు. కార్య సాధకుడు కాబట్టి తన భక్తుల కార్యములను నిర్విఘ్నంగా ముందుకు సాగెట్లు చూసుకుంటాడు. ఆంజనేయ భక్తులకు అపజయం అనేది లేదు.
శ్లో|| బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా
అజాడ్యం వాక్పటుత్యంచ హనుమ త్మ్సరణాద్భవేత్

జాతకంలో కుజ గ్రహ విశ్లేషణ?

జాతక చక్రంలో కుజుడు జన్మలగ్నం నుండి 2, 4, 7, 8, 12 స్థానాలలో వుంటే కుజ దోషం గా వ్యవహరిస్తారు, ఈ స్థానాలలో కుజ గ్రహ సంచారములు వుంటే సమస్యలు వస్తాయి కానీ అవి కూడా కుజ మహా దశ జరిగే సమయంలోనే వస్తాయి. ఇతర దశలలో రానేరావు, చాలా సంధర్భాలో కుజ దోషం భంగమవుతుంది కూడా. ఈ విషయం తెలియక కుజ దోషం వుందని, కుజ దోష ప్రభావంతోనే సమస్యలు వచ్చాయని. కుజ దోషం..... కుజ దోషం..... అనుకుంటూ.... చాలా మంది భయపడుతూ, మానసిక వేధనతో జాతకులు మరియు వారి తల్లిదండ్రులుండటం ఈ మధ్య కాలంలో పరిపాటి అయినది.

కుజ దోషం పలు సంధర్భాలలో భంగమవుతుంది, ఇట్టి భంగమయ్యే సంధర్భాన్ని గమనించకుండా... ఇతర గ్రహ స్థితులచే ఏర్పడిన సమస్యలను... కుజ దోష ప్రభావం చే ఏర్పడ్డాయని తలుస్తుంటారు... ప్రస్తుతం వస్తున్నాయని, భవిష్యత్ కాలంలో వస్తాయని వాపోయే వారు ఎంతో మంది. అట్టి వారందరూ ధైర్యంగా ముందుకెళ్లుటకు వారి మనసులలో ఏర్పడ్డ అపోహలు తొలగించుటకై చేసే చిన్ని ప్రయత్నమే ఇది.

కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాలలో వున్నప్పటికీ అవి కర్కాటక, సింహ రాశులలో లేక కర్కాటక సింహ లగ్నాలలో సంచారముంటే కుజ దోషం భంగమగును, మేష వృశ్చిక మకర సింహ ధనూ మీన లగ్నాలయందు, మరియు రాశుల యందు జన్మించిన జాతకులకు కూడా కుజ దోషం భంగమగును.

మిధున కన్య రాశులలో మరియు లగ్నాలలో జన్మించి జన్మ లగ్నానికి ద్వితీయ స్థానంలో కుజుడు వుంటే ఆ స్థాన దోషం భంగమగును, మకర కర్కాటక లగ్నాలలో లేక రాశులలో జన్మించి, సప్తమ స్థానాలలో కుజుడుంటే 7 వ స్థాన కుజ దోషం భంగమగును, ధనూ మీన లగ్నాలు మరియు రాశులలో జన్మించి అష్టమ స్థానాలలో కుజ గ్రహ సంచారముంటే 8 స్థాన కుజ దోషం ఉండదు, మిధున కన్య లగ్నాలు మరియు రాశులలో జన్మించి 12వ స్థానంలో కుజ దోషముంటే భంగమగును, పై విధంగా విశ్లేషిస్తే 95 శాతం జాతకులకు కుజ దోషమున్నప్పటికీ అది సంపూర్ణముగా భంగమవుతుందనే సత్యం గమనించాలి.
  
కుజ దోషముంటే కుజ మహా దశలోనే ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కుజ మహా దశ ఏయే నక్షత్రాలవారికి ఏయే వయసులో వస్తుందనేది తెలుసుకుంటే ఇంకా పూర్తిగా తెలుసుకున్న వారవుతారు, చిత్ర, ధనిష్ట మృగశిర నక్షత్ర జాతకులకు జన్మించిన తోడనే కుజ మహా దశ ప్రారంభమగును, ఏ పాదంలో జన్మించినప్పటికీ 7 సంవత్సరాల వయసు లోపలే  కుజ మహా దశ వెళ్లును. ఈ సమయంలో వివాహాలు చేయరు, కనుక చిత్ర ధనిష్ట మృగశిర నక్షత్ర జాతకులకు కుజ దోషముందనే భయాన్ని, బెంగను విడనాడండి.

రోహిణి హస్త శ్రవణ నక్షత్ర జాతకులకు జన్మ తోడనే చంద్ర మహాదశ ప్రారంభమై, ఆపై కుజ మహా దశ ప్రవేశించును, మొత్తం మీద 17 సంవత్సరాల వయసు నాటికి కుజ మహా దశ వెళ్లును, వివాహం 17 సంవత్సరాల తదుపరే చేస్తారు కనుక రోహిణి హస్త శ్రవణం జాతకులు కూడా కుజ దోషం వుందనే భయాన్ని విడనాడండి. 

ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్ర జాతకులకు కుజ దోషముండి  భంగం కాకుండా వుంటే దాని ప్రభావం కుజ మహా దశలోనే వస్తుంది, 113 సంవత్సరాలు జీవించిన తదుపరే కుజ మహా దశ వస్తుంది, ఈ జాతకులకు కుజ దోషముంటే ఇప్పుడేందుకు భయం, భయం చెందాల్సింది 113 సంవత్సరాలకు తరువాత , అది జరిగే పని కాదు.

పునర్వసు విశాఖ పూర్వాభాద్ర జాతకులు 90 సంవత్సరాలు వయసు దాటితే కుజ మహా దశ వస్తుంది, ఈ నక్షత్ర జాతకులకు కుజ దోషముంటే 90 సంవత్సరముల తర్వాత ఆలోచించాలి, ఇప్పుడు సమయం వృధా చేసుకుని కుజ దోషముందని ఆలోచించవద్దు.

పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర జాతకులకు వృద్దాప్యంలోనే కుజ దోషం వర్తిస్తుంది, అది సహజమే, కుజ దోష నివారణోపాయలు, పరిహార మార్గాలు ఎన్నో వున్నాయి వాటిని పాటిస్తూ ధైర్యంగా వుండటానికి ప్రయత్నించండి.

ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలు కుజ దోష భంగ నక్షత్రాలు, అనగా ఆశ్లేష కర్కాటక రాశి, జ్యేష్ఠ వృశ్చిక రాశి, రేవతి మీన రాశి ఈ మూడు రాశులలో జన్మించే జాతకులకు కుజ దోషమున్ననూ భంగమగునని శాస్త్ర వచనం. కనుక భయపడాల్సిన అవసరం లెనే లేదు.

అశ్వని భరణి కృత్తిక 1వ పాద జాతకులు కుజుని స్వస్థానమైన మేష రాశి లోను, మఖ పుబ్బ ఉత్తర 1 వ పాద జాతకులు కుజుని మిత్ర స్థానమైన సింహ రాశిలోను, మూల పూర్వాషాడ ఉత్తరాషాడ 1 వ పాద జాతకులు మరో మిత్ర స్థానమైన ధనూరాశిలోను జన్మిస్తారు, ఈ జాతకులకు కుజ దోషమున్నప్పటికీ కుజ స్వస్థాన  మిత్ర స్థానాలలో జన్మించినందున వారికి కుజ దోషం భంగమగునని శాస్త్ర వచనం, ఇలాంటప్పుడు ఆ నక్షత్ర జాతకులకు భయం అవసరం లేదు.

చివరగా వృషభ రాశి కృత్తిక 2,3,4 పాద జాతకులు, కన్యారాశి ఉత్తర 2,3,4 పాద జాతకులు మకర రాశి ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలలో జన్మించిన జాతకులు మాత్రమే కుజ దోష ఆలోచన చేయాలి. అయినా వీరందరికి 21 సంవత్సరాల వయసు రాగానే కుజ మహా దశ వెళ్లిపోతుంది. కావునా 22 సంవత్సరాల వయసు రాగానే వివాహం చేసుకోండి.

మొత్తం మీద కుజ దోషం గురించి బెంగపడనవసరం లేదు, ఇతర గ్రహ సంచారాలచే వచ్చే సమస్యలను కుజ దోషం వలన అనుకుని బాధపడే వారు చాల వరకు కనిపిస్తారు, పై విషయాలను గమనించి అందరూ ధైర్యంగా ఉంటారని ఆశిస్తున్నాను.
(పంచాంగ స్వీకరణ -  శ్రీనివాసగార్గేయ ఉవాచ)

__/\__సర్వేజనా సుఖినోభవంతు__/\__
ఓంప్రకాష్ విశ్వజ్ఞ - ఆస్ట్రో న్యూమరాలజిస్ట్

నవగ్రహ దోషములు- పరిహారాలు

మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉం టాయి. జ్యోతిష్యం పై నమ్మకం ఉన్నవారు సమస్యకు కారణం తెలిసిన వెంటనే సంబం ధిత గ్రహానికి పూజించి ఆ గ్రహానుగ్రహం పొంది తత్‌సంబంధమైన భాదల నుండి విము క్తి పొందుతుంటారు. జ్యోతిష్య జ్ఞానం లేనివా రు కూడా వారికి కలుగుచున్న కష్టాలకు కారణం అగు గ్రహం తెలుసుకొని ఆ గ్రహాని కి శాంతి మార్గములు చేసుకొనిన గ్రహ భాదల నుండి విముక్తి పొందుతారు.

సూర్యుడు: ఎవరి జాతకంలో అయితే రవి బల హీనంగా ఉంటా డో వారికి అనారోగ్య ము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధు లు, తండ్రి తరుపు బంధు వులతో పడకపోవు ట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపో వుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొ నేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమ స్కారం చేసుకొనుట, ఆదిత్య హృదయం పా రాయణం, గోధుమ లేదా గోధుమలతో తయా రుచేసిన ఆహారప దార్థ ములు దానం చేయు ట. తండ్రి గారిని లేదా తండ్రితో సమా నమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది.

చంద్రుడు: చంద్రుడు జాతక చక్రంలో బల హీనంగా ఉన్నప్పుడు మనస్సు నిలకడగా లే పోవుట, భయం, అనుమానం, విద్యలో అభి వృద్ధి లేకపోవుట, తల్లిగారి యొక్క ఆరో గ్యం సరిగా లేకపోవుట, స్ర్తీలతో విరోధము, మాన సిక వ్యాధులు, రాత్రులు సరిగా నిద్రపట్టకపో వుట, అధికమైన కోరికలు, శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట, బరువు తక్కు వగా ఉండుట, స్ర్తీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు కలుతున్నప్పుడు చంద్ర గ్రహ దోషంగా గుర్తించి, చంద్ర గ్రహ అను గ్రహం కొరకు మాతృ సమానమైన స్ర్తీలను గౌరవించుట, బియ్యం దానం చేయుట, పా లు, మజ్జిగ వంటివి భక్తులకు చిన్న పిల్లలకు పంపిణీ చేయడం, శివునికి ఆవుపాలతో అభిషే కం జరిపించుకొనుట, పార్వతీదేవి అష్టోత్తరం పారాయణం చేయుట మొదలగు వాటి ద్వారా చంద్ర గ్రహ అనుగ్రహానికి పాత్రులు అయి అభివృద్ధి చెందుతారు.

కుజుడు: జాతకచక్రంలో కుజు డు బలహీనంగా ఉం డడం వల్ల ధైర్యం లేక పోవుట, అన్న దమ్ము లతో సఖ్యత నశించుట, భూమికి సంబంధిం చిన వ్యవహారాల్లో నష్టాలు, కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు, పోలీసుల వల్ల వేధిం పులు అప్పులు తీరకపోవుట, ఋణదా తల నుండి ఒత్తిడి, రక్త సంబంధించిన వ్యాధులు, శృంగారంనందు ఆసక్తి లేకపోవడం, కండరా ల బలహీనత, రక్తహీనత సమస్యలను ఎదు ర్కొనే ధైర్యం లేకపోవుట మొదలగునవి కలు గుచున్నప్పుడు కుజ గ్రహ దోషముగా గుర్తిం చి కుజ గ్రహాను గ్రహం కొరకు సుబ్రహ్మ ణ్యస్వామి, ఆంజనే య స్వామి వారిని పూజిం చాలి. అలాగే హను మాన్‌ చాలీసా పారాయ ణం, కందులు దానం చేయడం, పగడం ఉంగరం ధరించడం, మంగళవారం రోజున నియమంగా ఉండడం, అన్న దమ్ములకు సహాయం చేయడం, వారి మాట లకు విలువ ఇవ్వడం, స్ర్తీలు ఎర్రని కుంకుమ, ఎరుపు రంగు గాజులు ధరించడం వలన కుజ గ్రహ పీడలు తొలిగిపోతాయి.

బుధుడు: జాతక చక్రంలో బుధుడు బలహీ నంతగా ఉన్నట్లయితే.. నరాల బలహీనత, జ్ఞా పకశక్తి లేకపోవటం, చదువులో అభివృద్ధి లేక పోవడం, నత్తిగా మాట్లాడడం, వ్యాపారాల్లో నష్టాలు, సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తెలివితేటలు లేకపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అనుమానం, తరుచూ ధననష్టం మొదలగునవి జరుగు చున్నప్పుడు బుధ గ్రహ దోషంగా గుర్తించి.. బుధ గ్రహానుగ్రహం కొరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, వేంక టేశ్వరస్వామి వారిని, విఘ్నేశ్వర స్వామి వారిని ప్రార్థించుట, వారికి సంబంధించిన క్షేత్రాలను దర్శించుట, ఆవుకు పచ్చగడ్డి, తోటకూర లాంటివి ఆహారంగా ఇచ్చుట, పెసలు దానం చేయుట, విద్యార్థు లకు పుస్తకాలను దానం చేయట వలన బుధుని యొక్క అనుగ్రహం కలుగుతుంది.

గురువు: జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుట, దైవం పై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకా లు, ని యంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బం దులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతా లు చేసి నా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేక పోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచు న్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరా యణ చేయడం, గురువుల ను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శిం చుట, శనగలు దా నం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.

శుక్రుడు: జాతకంలో శుక్రుడు బలహీనము గా ఉన్నప్పుడు స్ర్తీలకు అనారోగ్యము కలుగు ట. వాహన సౌఖ్యము లేకపోవుట. భార్యా భ ర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట. వ్యసనము ల యందు ఆసక్తి, వివాహం ఆలస్యం అగుట, కిడ్నీ వ్యాధులు, వ్యభిచారం, మత్తుపానీయాలు సేవించుట, కుటుంబంలోని స్ర్తీలకు అనారో గ్యము సరిగా లేనప్పుడు శుక్ర గ్రహ దోషము గా గుర్తించి శుక్ర గ్రహ అనుగ్రహం కొరకు లక్ష్మీ అమ్మవారిని పూజించుట, లక్ష్మీ స్తోత్ర ము పారాయణం చేయుట, బొబ్బర్లు దానం చే యుట, వివాహం కాని స్ర్తీలకు వారి వివా హం కొరకు సహకరించుట, స్ర్తీలను గౌరవిం చుట. వజ్రం ఉంగరం ధరించుట, సప్తముఖి రుద్రా క్షను ధరించుట వలన శుక్ర గ్రహ అను గ్రహము పొందవచ్చును.

శని: ఆయుష్షు కారకులు అయిన శని జాతక చక్రము నందు బలహీనముగా ఉన్నచో బద్ధ కము, అతినిద్ర దీర్థకాలిక వ్యాధులు, సరయి న ఉద్యోగము లేకపోవుట, జన సహకారం లేకపోవుట, ఎముకలు, తల్లిదండ్రులలో విరో ధములు, ఇతరుల ఆధీనములో పని చేయు ట, సేవకా వృత్తి, నీచ వృత్తులు చేపట్టుట, గౌర వం లేకపోవుట, పాడుపడిన గృహముల యందు జీవించుట, ఇతరుల ఇంట్లో జీవన ము సాగించుట, భార్య పిల్లలు అవమానిం చుట, కుటుం బమును విడిచి అజ్ఞాతముగా జీవించుట, సరయిన భోజనం కూడా లేకపో వుట మొదల గు కష్టములు కలుగును. శని గ్రహ అనుగ్ర హమునకు శివునికి అభిషేకము చేయుట. విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయుట.

శనివారము నియమము గా ఉండుట, ఆంజనేయ స్వామి వారిని ఆరా ధించుట, హనుమాన్‌ చాలిసా పారాయణం చేయుట, హనుమాన్ కు తమలపాకు పూజ చేపిస్తే మంచిది.స్వామి అయ్యప్ప మాల ధారణ చే యుట, శని గ్రహానికి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయుట. నల్ల నువ్వులు దానము చేయుట, దుప్పటి వస్తువులు దానం చేయుట, నీలము ఉంగరం గాని నాలుగు ముఖములు గల రుద్రాక్షను ధరించుట వలన శని గ్రహ అనుగ్రహం కలుగుతుంది.

రాహువు: రాహువు జాతక చక్రంలో బలహీ నముగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలా పాలు చేయుట, నీచ స్ర్తీలతో సహవాసము, కు ష్టు లాంటి వ్యాధులు, జైలు శిక్షలు అనుభవిం చుట, విద్యార్థులు విద్య మధ్యలో మానివేయు ట, పాడుపడిన గృహములలో నివసించుట, ఇంట్లో బొద్దింకలు, పందికొక్కు లు, పాములు వంటివి సంచరించుట, శుభకార్యములు వాయిదా పడుట, వాహన ప్రమాదములు జరుగుట, గృహంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాడగుట, విలువైన వస్తువులు దొంగలు ఎత్తు కొనిపోవు ట, మొదలగున వి సంభ వించు చున్నప్పుడు రాహుగ్రహ దోషముగా గుర్తించి దోష నివార ణకు కనక దుర్గ అమ్మవారిని పూజించుట, దే వి భాగవతం పారాయణం చేయుట, గోమేధి కం గాని  ఎనిమిది  ముఖములు గల రుద్రాక్ష ను గాని ధరించ వలెను. భవాని మాల ధరిం చుట, స్ర్తీలను గౌరవించుట వలన రాహు గ్రహ అనుగ్రహం కలుగును.దుర్గా సప్తశ్లోకి పఠించటం మంచిది.

కేతువు: కేతువు జాతకంలో బలహీనంగా ఉన్నపుడు మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి, ఎకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, తన లో తానే ఊహించుకొనుట, తనని తాను దేవు డు గానే దేవతగానే ఊహించుకోవడం, దేనిని చూసినా భయపడడం, ఉద్యోగమును, భార్యా పిల్లలను వదలి వేసి దేశ సంచారం చేయుట. పిచ్చి వాని వలె ప్రవర్తించుట, విచిత్ర వేషధార ణ, సంతానం కలుగకపోవుట, గర్భం వచ్చి పో వుట, చిన్న పిల్లలకు తీవ్ర అనారోగ్యం, అంటు వ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని విచి త్ర వ్యాధులకు కేతువు కారణం అగుచున్నా డు. కేతు గ్రహ అనుగ్రహం కొరకు నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయు ట. దేవాలయములు కట్టుటకు విరాళములు ఇచ్చుట. పిచ్చి ఆసుపత్రిలో రోగులకు సేవ చేయుట. అనాధ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయము కలిగించుట. వైఢూర్య ము గాని తొమ్మిది ముఖములు గల రుద్రాక్ష ధరించుట వలన కేతు గ్రహ అనుగ్రహం పొందుతారు.

ప్రతిరోజు సూర్య నమస్కారం చేసు కొని ఇష్టమైన దేవాలయమును సందర్శించినచో ఎటువంటి గ్రహ దోషములు ఉన్నను పరిహారం జరుగును.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles