Showing posts with label రామాయణం. Show all posts
Showing posts with label రామాయణం. Show all posts

Tuesday 7 June 2016

వాల్మీకి రామాయణం 35వ దినము

వాల్మీకి రామాయణం
35వ దినము, బాలకాండ.

అప్పుడు భగీరథుడు శివుడి కోసం కాలి బొటనువేలి మీద నిలబడి ఒక సంవత్సరం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యి, నీ కోరిక ప్రకారం నేను గంగని నా శిరస్సు మీద పడతాను అన్నాడు. అప్పుడు శంకరుడు హిమాలయాల మీద నిలబడి, రెండు చేతులు నడుము మీద పెట్టుకొని, కాళ్ళని చాపి, తన జటాజూటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు. నా ప్రవాహంలో ఈ శంకరుడిని కూడా పాతాళం దాకా తీసుకుపోతాను, ఈయన నన్నేమి పట్టగలడు అనుకుంది గంగ. అలా అనుకొని ఆకాశం నుంచి శంకరుడి జటాజూటంలోకి జారింది. అలా ఆ గంగ ఒక సంవత్సరం పాటు పడుతూనే ఉంది, కాని శంకరుడి శిరస్సు నుండి ఒక చుక్క నీరు కూడా నేల మీద పడలేదు. అలా ఆయన శిరస్సులోనే తిరుగుతూ ఉంది. భగీరథుడు శంకరుడిని ప్రార్ధించగా, ఆయన ఆ గంగని బిందుసరోవరంలో వదిలాడు. అప్పుడు ఆ గంగహ్లాదినీ, పావనీ, నళిని అని మూడు పాయలుగాతూర్పుదిక్కుకి వెళ్ళింది, సుచక్షువు, సీతా, సింధువుఅని మూడు పాయలుగా పడమరదిక్కుకి వెళ్ళింది, ఆ ఏడవ పాయ భగీరథుడి వెనకాల వెళ్ళింది. రథం మీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల పరుగులు తీస్తూ గంగ ప్రవహించింది. గంగతో పాటు మొసళ్ళు, తాబేళ్లు, చేపలు ఆ గంగలో ప్రవహించాయి. ఈ అపురూపమైన ఘట్టాన్ని చూడడానికి దేవతలంతా ఆకాశంలో నిలబడ్డారు, పాపాలు చేసిన వాళ్ళు ఆ గంగలో మునిగి తమ పాపాలు పోగొట్టుకున్నారు. కొందరు శంకరుడి పాదాల దెగ్గర ప్రవహిస్తున్న గంగ నీళ్ళు తల మీద జల్లుకొని తమ పాపాలు పోగొట్టుకున్నారు. 

అలా వెళుతున్న గంగ అక్కడే యాగం చేసుకుంటున్నజహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగనంతా మింగేశారు. భగీరథుడు వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఏమి లేదు. వెంటనే భగీరథుడు జహ్ను మహర్షి కాళ్ళ మీద పడి ప్రాధేయపడగా,  ఆయన గంగని తన చెవులలోనుంచి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవులనుంచి వచ్చింది కనుక గంగని జాహ్నవిఅని పిలిచారు. అలా భగీరథుడి వెనకాలే ప్రయాణించి పాతాళ లోకంలో ఉన్న ఆయన పితృదేవతల భస్మాల మీద నుంచి ప్రవహించింది. గంగ యొక్క ప్రవాహం తగలగానే ఆ సగరులు స్వర్గానికి వెళ్ళారు.

స్వర్గలోకంలో ప్రవహించేటప్పుడు గంగని మందాకినీ అని, భూమి మీద భాగీరథి అని, పాతాళ లోకంలో భోగవతిఅని పిలుస్తారు అని విశ్వామిత్రుడు రాముడికి గంగావతరణం గూర్చి చెప్పాడు.

వాల్మీకి రామాయణం 36వ దినము

వాల్మీకి రామాయణం
36వ దినము, బాలకాండ.

ఆ రాత్రి అక్కడే గడిపి, మరుసటి రోజున గంగని దాటివిశాల నగరాన్ని చేరుకున్నారు. అప్పుడు రాముడు ఆ విశాల నగరాన్ని గూర్చి చెప్పమంటే, విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు " పూర్వం కృత(సత్య) యుగంలో కశ్యప ప్రజాపతి ఇరువురు భార్యలైన అదితి మరియు దితిసంతానమైన దేవతలు, దైత్యులు ఎంతో సఖ్యతగా, ధార్మికంగా జీవించేవారు. అలా కొంత కాలం అయ్యాక వాళ్ళకి శాశ్వతంగా జీవించాలన్న కోరిక పుట్టింది. కాబట్టిక్షీర సాగరాన్ని మధిస్తే అందులోనుంచి అమృతంపుడుతుంది, అది తాగితే మనకి ఆకలి ఉండదు, వృద్ధాప్యం ఉండదు, కావున ఆ సాగర మధనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా అందులోంచి ముందు హాలాహలం పుట్టి అది దేవతలని, రాక్షసులని, మనుషులని, ఈ జగత్తు మొతాన్ని నాశనం చెయ్యసాగింది. అప్పుడా దేవతలంతా కలిసి శంకరుడున్న కైలాసానికి వెళ్లి ఆయనను రక్షించమని ప్రార్ధించారు. శంకరుడు బయటకి రాగా, ఇది అగ్రపూజకనుక మొదట వచ్చినదాన్ని అందరికన్నా పూజ్యనీయులైన మీరు స్వీకరించాలి అని విష్ణువు అన్నారు. అప్పుడు శంకరుడు సరే అని ఆ హాలాహలాన్ని హేలగా తాగాడు. అన్ని లోకాలని కాల్చిన ఆ హాలాహలాన్ని శంకరుడు తాగుతుండగా ఆయన శరీరంలో ఒక పొక్కు రాలేదు, కళ్ళు ఎరుపెక్కలేదు, ఆయన మెడలో ఉన్న పిల్ల పాములు కూడా అటూ ఇటూ కదలలేదు. ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. సంతోషించిన దేవతలు మళ్ళి ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పాతాళానికి జారిపోయింది. అప్పుడు దేవతలంతా అప్పటిదాకా తమతోపాటు ఆ మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని ఆ పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నారు. అప్పుడాయన కూర్మావతారందాల్చి ఆ పర్వతాన్ని తన వీపు పై పెట్టుకొని పైకి తెచ్చారు. అప్పుడు మళ్ళి చిలకడం ప్రారంభించారు. అప్పుడు అందులోంచి నురగలు వచ్చాయి, ఆ నురగల నుంచి 60 కోట్ల అప్సరసలు వచ్చారు. అంతమంది అప్సరసలకి సేవ చేసే పరిచారికలు కూడా కొన్ని కోట్లమంది వచ్చారు. 

Wednesday 1 June 2016

వాల్మీకి రామాయణం 28వ దినము

వాల్మీకి రామాయణం
28వ దినము, బాలకాండ

తరవాత ఆ కన్యలందరూ కుశనాభుడి దెగ్గరికి వెళ్లి జెరిగినది చెప్పారు. అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి, " అమ్మా! మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు, ఓర్పు వహించారు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని.

క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః చ పుత్రికాః |

క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్ ||

స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు. అమ్మా! నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు, మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు, అందం అంటె ఇది. ఓర్పె దానం, అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పె, ఓర్పుకి మించిన యజ్ఞం లేదు,  ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు, ఆ ఓర్పు వల్లనె ఈ భూమి నిలబడుతోంది " అని చెప్పాడు. 

అదే సమయంలొ చూళి అనే ఒక మహర్షికి, ఊర్మిళకుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేది. అలా చాలాకాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతొ....... నేను నీకు ఏమిచెయ్యగలను అని అడిగారు. అప్పుడామె.......నేను ఎవరికీ భార్యని కాను, కాని అపారమైన తపఃశ్శక్తి, బ్రహ్మతేజస్సు కలిగిన నీ వలన, శారీరిక సంపర్కం లేకుండా, మానసికమైన తపఃఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆ చూళి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానస పుత్రుడిని సోమదకి ప్రసాదించారు. పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు, కాపిల్యము అనే నగరంలొ ఉండేవాడు. కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జెరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటె ఒక్కొక్కరి అంగవైకల్యం పోయి, వాళ్ళు మళ్ళి పూర్వ సౌందర్యాన్ని పొందారు. అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళ ఒక్కొక్కరి చేతిని పట్టుకొని కుశనాభుడిని పొగిడింది" అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.

వాల్మీకి రామాయణం???

వాల్మీకి రామాయణం
25వ దినము, బాలకాండ.

మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడితొ....... మీరు నాకు ఇన్ని అస్త్రాలని ఉపదేశించారు, అలాగే వాటిఉపసంహారాన్ని కూడా ఉపదేశించమన్నాడు. విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహార మంత్రాలని చెప్పాక ఇంకొన్ని అస్త్రాలని కూడా ఉపదేశించాడు. అలా అన్ని అస్త్రాల ఉపదేశం అయ్యాక వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా వెళుతుండగా అక్కడొక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ఎవరిదని రాముడు అడగగా, విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " ఒకప్పుడు విరోచనుడికుమారుడైన బలి చక్రవర్తి తన ప్రరాక్రంతొ ఇంద్రుడిని నిర్బంధించాడు. అప్పుడు శ్రీమహా విష్ణువు వామన మూర్తిగా వచ్చి బలిని పాతాళానికి పంపారు. ఆ వామన మూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమం, దీనినిసిద్ధాశ్రమం అంటారు. ఇక్కడే కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు, ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా,ఉపేంద్రుడిగా పుట్టారు. నేను యాగం చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోనే " అని చెప్పి అందరూ ఆ ఆశ్రమంలోకి వెళ్లారు.

ఆ సిద్ధాశ్రమంలొ యాగం ప్రారంభించారు, ఈ యాగం 6రాత్రుళ్ళు 6 పగళ్ళు జెరుగుతుంది, కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు. 5 రోజులు యాగం చక్కగా జెరిగింది, 6 వ రోజున ఆ అగ్నిహొత్రం ఒక్కసారి భగ్గున పైకిలేచింది. వెంటనే రాముడు లక్ష్మణుడిని అప్రమత్తంగా ఉండమన్నాడు. అప్పుడే పైనుండి మారీచ సుబాహువులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహొత్రంలోకి రక్తం పోశారు. వెంటనే రాముడు మానవాస్త్రంతొ మారీచుడిని కొట్టాడు, ఆ దెబ్బకి వాడు 100 యోజనాల దూరం వెళ్లి పడ్డాడు. సుబాహువుడిని ఆగ్నేయాస్త్రం పెట్టి కొడితె, వాడు గుండెలు బద్దలై, నెత్తురు కక్కుతూ కిందపడి మరణించాడు. మిగతా రాక్షసులందరిని వాయువ్యాస్త్రంతో నిర్జించారు. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు.

మిథిలా నగరంలొ జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు, కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి, అక్కడ చూడవలసినవి రెండు ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితొ చెప్పాడు. అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు.

Tuesday 1 December 2015

రామాయణము ప్రాముఖ్యము


శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.

భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉన్నది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణము నృత్య నాటకము బాగా ప్రసిద్ధము.

24,000 శ్లోకము లతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మము ల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.

వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్వములు అంతర్గతముగా నున్న పురాణములు, కథలు, కావ్యములు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నవి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్ధన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.

కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
కావ్యం రామాయణం సీతాయాశ్చచరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యే��

Monday 30 November 2015

శ్రీరామరక్ష - సర్వజగద్రక్ష



శ్రీమద్భగవద్గీత

8 . అక్షర పర బ్రహ్మ యోగము:

ఈ అష్టమ అధ్యయ౦లో అర్జునుడు ఈ విధముగా ప్రశించెను. బ్రహ్మ మన నేది? ఆధ్యాత్మ అనగా ఏమి? అది భూత, అధి దైవములనగా ఏవి? భగవానుడు ఈ విధంగా చెప్పెను. బ్రహ్మ లోక సహితముగా సర్వ లోకములు పునర్జన్మ తో కుడినవే?. కానీ తనను తెలుసు కొని తనను పొందిన వణికి ఇక పునర్జన్మ ఉండదు. ఈ రెండు మార్గములు ఎరిగిన వాడు యోగి ఎవ్వడు మూఢ త నొందడు. కావున అర్జునా! నీవు సర్వదా యోగము నందు సుస్థి రుడ వై యుండుము అని చెప్పెను.

Wednesday 11 November 2015

నరకాసురవధ వృత్తాంతము

                                                                                                                                    నరకాసురవధ వృత్తాంతము - బలిచక్రవర్తి రాజ్యదాన వృత్తాంతము - శ్రీరాముడు రావణ సంహారానంతరము అయోధ్యకు తిరిగి చేరుకున్న వృత్తాంతములు:

విష్ణు ద్వేషి అయిన హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్రములో దాక్కున్నాడు. విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి సముద్రమున ప్రవేసించి, ఆ రాక్షసుడిని చంపి, భూమిని మరల పైకి తీసుకువచ్చాడు. ఆ సమయమున వరహా అవతారముననున్న విష్ణువు వలన భూదేవి గర్భము దాల్చింది. విష్ణ్డువు తాను త్రేతాయుగమున రామావతారమున రావణ సంహారము చేసిన పిదప నీవు శిశువును ప్రసవింపగలవని భూదేవికి తెలుపాడు.
త్రేతాయుగమున జనకునకు సీతను భూమి నుండి దొరికినపుడు,భూదేవి జనకుని వద్ద తనకొక ఉపకారము చేయవలెనని ప్రమాణము చేయించుకున్నది. ఆ ఇచ్చిన మాట ప్రకారం జనకుడు రావణ వధానంతరము జన్మించిన భూదేవి కుమరుని పెంచి, నరకుడని నామమునిచ్చి విద్యా బుద్ధులను నేర్పించాడు.నరకునకు పదహారు సంవత్సరముల వయసు వచ్చే సమయానికి అతనిని భూదేవి గంగాతీరమునకు తీసుకుని వెళ్ళి అక్కడ అతని జన్మ వృత్తాంతాన్ని చెప్పింది.విష్ణుమూర్తి ప్రత్యక్షమై శక్తి అయుధాన్ని, దివ్య రధమును అనుగ్రహించి,కామరూప దేశమును ప్రాగ్జ్యోతిష నగరము రాజధానిగా పాలించుకొనుమని చెప్పి భూదేవితోగూడి అదృశ్యమయ్యాడు.
నరకుడు ఆ రాజ్యమును చాలా కాలం పాలించాడు. ద్వాపరయుగంలో నరకునకు బాణుడను రాక్షసునితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావమున లోకానికి హాని కలిగించేవాడయ్యాడు. ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిష పురములోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్లకుండా ఆలయ తలుపులు మూయించాడు. కోపించిన వశిష్టులవారు "నీవు మదగర్వమున సజ్జనులని మితిమీరి అవమానించుతున్నావు. నీ జన్మదాత చేతనే మరణించెదవు" అని శపించారు. ఆ శాపమునకు భయపడి నరకుడు బ్రహ్మనుగూర్చి తపస్సు చేసి దేవతలు, రాక్షసులనుండి మరణములేకుండునట్లు వరమును పొందాడు. ఆ వర గర్వంతో తన కుమారులతో సేనానులతో చెలరేగి ఇంద్రాది దేవతలను జయించాడు. ఋషులను బాధించాడు. పదహారువేల రాజకన్యలను చెరపట్టాడు.
వాని బాధలను సహింపలేక ఇంద్రాది దేవతలు ద్వాపరయుగమున విష్ణు అవతారుడగు శ్రీకృష్ణుని ప్రార్ధించగా, ఆయన నరకుని సంహరింప కామరూప దేశానికి వెళ్ళాడు. ఆయనతో సత్యభామాదేవి కూడా రణరంగానికి వచ్చింది. ఘోరయుద్ధం జరిగింది. చివరకు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశినాటి రాత్రి రెండుజాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుని పీడ వదలాటంతో ఆనందపరవశులైన భూలోక వాసులు ఆ మిగిలిన రాత్రిభాగంలో, మరునాటి దినమున పండుగగా జరుపుకొన్నారు.ఆ రెండు రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ రెండు రోజులు ప్రజలు ప్రతియేటా పండుగ చేసుకొంటున్నారు.

బలిచక్రవర్తి రాజ్యదాన వృత్తాంతము:

బలిచక్రవర్తి అజేయ బలపరాక్రమాలు కలవాడు. మాహాదాత. అతడు దేవతలను జయించి తన వద్ద బందీలుగా ఉంచుకున్నాడు. ఇంద్రాదులు విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి బలి తపోఫలము ముగిసిన తరువాత అతనిని జయిస్తానని తెలిపాడు. కొంత కాలానికి అదితి గర్భాన వామనరూపంలో జన్మించాడు. ఒకనాడు బలి మహా యజ్ఞమును చేయసాగాడు. అక్కడు వామనావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు వచ్చి మూడు అడుగుల స్థలం ఇవ్వమని అడుగుతాడు. బలిచక్రవర్తి దానికి సరే అనగానే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడవ అడుగుకు స్థలం చూపమని అడుగగా, బలిచక్రవర్తిని తన తలమీద వేయాల్సిందింగా కోరతాడు. బలి దానగుణానికి సంతోషించి విష్ణుమూర్తి అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తాడు. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే వరాన్ని ప్రసాదించాడు.
శ్రీరాముడు రావణ సంహారానంతరము అయోధ్యకు తిరిగి చేరుకున్న వృత్తాంతము
పద్నాలుగేళ్ళ వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యా నగరాన్నితిరిగి చేరుకున్నరోజున తిథి అమావాస్య ! ఆ రాత్రంతా చీకటిమయంగా వుండటంతో ఆ చీకటిని పారదోలేందుకుగాను అయోధ్యా నగరవాసులు లక్షల సంఖ్యలోకాగడా దీపాలని వెలిగించి నగరాన్నిపట్ట పగలులా ప్రకాశించేలా వెలుగుల్నిచిమ్మించారు. అలా పౌరులు హర్షాతిరేకంతో ఎదురెళ్ళి శ్రీరామునికి స్వాగతం పలికిన అరేయి కాస్తా దీపావళిగా మన దేశచరిత్రలో నిలిచిపోయింది. ఆనాడు అయోధ్యానగర పౌరులు పొందిన ఆనందాన్ని ఈతరంలో మనం కూడా పంచుకుంటున్నట్లుగా ప్రతి ఏటా ఆసంతోష ఘడియల స్మరణార్థం ఈ దీపావళి పండుగని జరుపుకుంటున్నాము.


Thursday 29 October 2015

వాల్మీకి జయంతి

                        వాల్మీకి జయంతి
  మహా పుణ్య కవి , రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి కారణజన్ముడు .   వాల్మీకి జీవితం ఎంతో విలక్షణమైనదని, వాల్మీకి తన జీవిత కాలంలో పాపా , పుణ్య కర్మలను ప్రక్షాళన చేశాడు , తన రామాయణ ఇతిహాసం. మానవుడు రచించిన తొలి గ్రంథము ,  చారిత్రక పురుషుడైన రఘురాముని గురించి ఇతని సమకాలం గురించి చెప్పడమే కాకుండా కథనం  మధ్యమంగా ఆనాటి భౌగోళిక విషయాలను క్రోడీకరించాడు. సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కధ. దీనిని "సీతాయాశ్చరితం మహత్"   అని వాల్మీకి అన్నాడు. 24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము,  హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభా  వము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.
రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు)గా విభజింప బడినది. వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కధకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక విష్ణుపురాణములో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారము అని చెప్పారు. భాగవతం నవమ స్కంధములో 10, 11 అధ్యాయాలలో రాముని కధ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించిన అనేక గాధలున్నాయి. వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. రామాయణాన్ని వ్రాశాడు. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు.

చరిత్ర :

త్రేతాయుగములో గంగానదీ తీరములో నైమికారణ్యములో అనేకమంది మునులు ఆశ్రమములు నిర్మించుకొని నియమ నిష్టలతో తపస్సు చేస్తూ ఉండేవారు. మునీశ్వరులందరూ బ్రాహ్మణ కుటుంబాలకు చెందివారే. అందులో ఒక ముని పేరు ప్రచస్థాముని .. .. ఇతనికి ఒకకుమారుడు ... పేరు " రత్నాకరుడు "  ఒకరోజూ రత్నాకరుడు ఆడుకుంటూ అడవిలో దారితప్పి ఎటుపోవాలో తెలియ భయము ఏడుస్తూ ఉన్న సమయాన ఆ దారినిపోయిన ఒక వేటగాడు ... ఈ పిల్లవాడిని ఓదార్చి తనవెంట తన నివశిస్తున్న గుడెసె తీసుకు పోయి , తనకు పిల్లలు లేనందున తన కొడుకుగా పెంచుకోసాగెను. ప్రచస్ఠా ముని తన భార్యతోకూడి కుమారుని కొరకు వెదికి దొరక పోయేసరికి , ఏ క్రూరజంతువు తినిఉంటుందని భావించి పుత్రశోఖం తో వెనుదిరిగి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు.  ఇక్కడ బోయకుటుంబానికి చెందిన వేటగాడు , అతని భార్య తమ సొంత కొడుకు గానే రత్నాకరుడు ని పెంచి పెద్దచేసారు. విలువి్ద్యలో మంచి ప్రావీణ్యము , వేట లో నైపుణ్యము సంపాదించిన రత్నాకరుడు మంచి తెలివైనవాడు . తన వేట నైపుణ్యము తో ఆ అడవి లోని పక్షులకు , జంతువులకు యముడుగా తయారయ్యాడు . యవ్వనము వచ్చిన రత్నాకరునికి బోయ   తల్లిదండ్రులు వారి వంశములోని అమ్మాయిని చూసి పెళ్ళిచేసారు. కొంతకాలానికి ముగ్గురు పిల్లతో రత్నాకరుడి కుటుంబము పెద్దది కావడము వలన తన సంపాదన పెంచుకొనేనిమిత్తము  దారిదోపిడి , దొంగతనము లను వృత్తిగా తీసుకొని అవసరమైన చోట బాటసారులను చంపి ధనాన్నిదోచుకుని తన కుటుంబము హాయిగా బ్రతికేందుకు పాటుపడేవాడు .
ఒకరోజు అడవి దారిలో ఒకచోట కూర్చోని బాటసారులకోసము పొంచి ఉన్న సమయాన ఆ దారిన " నారద మహర్శి " రావడము జరిగింది. నారద ముని సర్వసాదారణ మానవరూపలో ఉన్నందున రత్నాకరుడు దోచుకునే ప్రయత్నము చేయగా ... తన దగ్గర వీణా , రుద్రాక్షలు , కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవని తెలిపినా ... వినక చంపివేయదును అని భయపెట్టసాగెను. అప్పుడు ఓ బోయవాడా ... దొంగతనము , దోపిడీలు, ఇతరులను హించించి హత్యచేయడము పాపము అని హితబోద పలికినా నమ్మలేదు . " నీవు ఇన్ని పాపకార్యములు ఎవరికోసము చేయుచున్నావని అడుగగా" ... తన కుటుంబపోషనకొరకై తెలిసిన విద్య ఇది ఒక్కటే ... పాప పుణ్యాలు నాకు తెలియవు . అప్పుడు నారదముని ఆ బోయవానికి జ్ఞానోదయము కలిగించే ఉపాయము ఆలోచించి .. " ఓ బోయవాడా నీవు చేయు ఈ పాపాలు నీ కుటుంబ సబ్యులు ఎవరైనా పంచుకుంటారేమో అడిగి తెలుగుకోమని తనతో నారదముని ఆ బోయ ఇంటికివెళ్ళి .. పాపాలు పంచుకుంటారేమో అడుగగా తల్లి దండ్రులు గాని , భార్యా బిడ్డలు గాని అందుకు సమ్మతించగపోగా ... కుటుంబపోషణ ఇంటి యజమాని బాధ్యత అని పాపమో , పుణ్యమో అది తనవరకే గాని , తీసుకున్నా వీలు పడదని , పాప పుణ్యాలు ఒకరినుంది ఇంకొరికి ఇవ్వనూలేము , తీసుకోనూలేము అని వారి నిస్సహాయతను తెలియజేసిరి.
ఆ మాటలు విన్న రత్నాకరుడు పశ్చ్యాత్తాపము చెంది , పాపవిముక్తికై ఉపాయము చెప్పమని నారదుని వేడుకొనెను . అప్పుడు నారదుడు తన నిజ రూపాన్ని బోయవానికి చూపించి భక్తి మార్గానికి " మరా మరా " అనే రెండక్షరాల మంత్రాన్ని బోధించెను . అప్పటినుంది నైమికారణ్యము లో రామ రామ రామ మంత్రము తో కొన్ని సంవత్సరాలు తపస్సు చేయగా తనచుట్టూ మట్టి పుట్టలా కప్పివేయడము జరిగింది. బయట తిరిగే బాటసారులెవరికీ తను  కనబడడము జరుగలేదు. నారద మహర్షి తనకున్న దేవతా శక్తులతో రత్నాకరుని కుటుంబానికి ధన , ధాన్య , అశ్వర్యములను ప్రసాదించెను . నారదమునికి తెలుసు ఈ రత్నాకరుడు కారణజన్ముడని .. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత నారదముని తిరిగి అదే దారిన కావాలనే వచ్చి రత్నాకరుడున్న పుట్టను తెరచి , చిక్కి బక్కై , బయటి ప్రపంచముతో సంబంధము లేని ఆ రత్నాకరుని చెవులో రామ రామ రామ అని పలుకగా కళ్ళు తెరచిన ఆ రత్నాకరుని ఆపాదమస్తం ను తన మృదువైన చేతులతో తడివి పునీతము గావించెను. " ఓ రత్నాకరా నీవు గొప్ప తపశ్సాలివి అయ్యావు . దేవుడు నిన్ను కరుణిచాడు . నీవు మళ్ళీ జన్మించావు ., ఈ పుట్తనుంది పుట్టేవు కావున నీవు  ' వాల్మీకి ' గా పిలువబడుతూ లోక కణ్యానము కోసము మంచి కావ్యాన్ని వ్రాసెదవు అని " దీవించి అదృశ్యమయ్యెను. నాటినుంది వాల్మీకి ఎంతోమంది శెస్యులతో తన జీవితాన్ని గడుపసాగెను.

వాల్మీకి వలస :

అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారత దేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం (నల్లమల అడవులు) గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలొ పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ.
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం
వాల్మీకేర్మునిసిమ్హస్య కవితావనచారిణః
శ్రుణ్వన్ రామ కధానాదం కొనయాతి పరాం గతిం 


E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles