Tuesday 31 January 2017

అరటి ఆకులో భోజనం చేస్తే …… 4 ప్రాణాంతక వ్యాధులు దూరం

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి పురాతన కాలం నుండి ఉన్నఆచారం.
మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోవడానికి
తగిన కారణాలు చాలా ఉన్నాయి.
శత్రువయినా సరే ఆకలితో ఉన్నవాడికిఅన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది.
అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు,
ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది.
అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి
అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు,
మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు.
వేడి వేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర
ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి అద్భుతమయిన
రుచితో పాటు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది.

ఈ ఆకులో అన్ని రకములయిన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని
తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి.
ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం.
ఇది కాన్సరు (మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్ మరియు బ్లాడర్),
పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధి

తులసి పూజ ప్రాముఖ్యత ?


భారత దేశంలో  ఎక్కువ మంది పూజించే మొక్క తులసి. ప్రతి హిందువు ఇంట్లో ఖచ్చితంగా తులసి కోట ఉంటుంది..తులసీ మాత చుట్టూ ప్రదక్షణలు చేస్తే మహిళలు తాము కోరుకున్నవన్నీ నెరవేరుతాయని అంటారు. అంతే కాదు తులసి ఆకు, గింజలు అద్భుతమైన ఔషదాలు కూడా పని చేస్తుంటాయి. పూర్వ కాలం నుంచి తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసితో అల్లిన మాల అంటే అందరు దేవుళ్లకి మహా ఇష్టం. దైవారాధనకు ప్రాధాన్యం ఇచ్చే ప్రతి ఇంటి ఆవరణలోనూ తులసి మొక్క వుంటుంది. తులసీ పూజ చేస్తే ఆ కుటుంబానికి సిరిసంపదలకు ఎలాంటి లోటువుండదని పండితులు అంటున్నారు. తులసి మొక్క ప్రత్యేకంగా ఏ ఇంట్లో పూజించబడునో ఆ ఇంట సర్వసంపదలు కలుగును.

తులసి మొక్క లేని ఇంట్లో సమస్త సమస్యలు ఏర్పడును.రోజు ఒక తులసిదళం నమిలిమింగితే సమస్తరోగాలకు నివారణ కలుగును.తులసి మొక్కలపై నుండి వచ్చే గాలి పీల్చిన చాలా ఆరోగ్యప్రదం.లక్ష్మీదేవికి ప్రతిరూపమే తులసి.విష్ణుమూర్తికి ప్రీతికరమైనది.అందుకే ఆమెకు హరిప్రియ అనే మరోపేరు కూడా ఉంది.సత్యభామ నిలువెత్తు బంగారం ఉంచినా తూగని ఆ విష్ణువు రూపుడైన ఆ శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి సమర్పించిన ఒకే ఒక్క తులసీదళానికి వశుడయ్యాడు.

అంతే కాదు హనుమంతుడు సీతమ్మ తల్లికోసం లంకలోకి ప్రవేశించినప్పుడు అక్కడి ఆవరణలో తులసి మొక్కను చూసి ఆ గృహిణి గురించిన అంచనా వేస్తాడు. చాలా దేవాలయాల్లో తులసి నీరే తీర్ధంగా ఇస్తారు.ప్రతి రోజు నీళ్ళుపోసి, భక్త్, శ్రద్ధలతో తులసిమాతను ఆరాధిస్తే ఇంట్లో లక్ష్మీకళ తాండవించి, సకలసంతోషాలను మనకు ప్రసాదిస్తుంది.

కన్నె తులసి నోము ?


       పూర్వము ఒకానొక ఊరిలో ఒక చిన్నది వుండేది.  ఆమెకు సవతి తల్లి పోరు ఎక్కువగా వుండేది.  అది భరించలేక ఆ చిన్నది తన అమ్మమ్మ గారి ఇంటికి వేల్లిపోయినది.  సవతి తల్లి ఆ పిల్లను తీసుకు రమ్మని భర్తను వేదించేది.  అందకు అతడు అంగీకరించలేదు.  ఒకనాడు సవతి తల్లి తన భర్తతో ఆ పిల్లను తీసుకు రమ్మని ఎంతగానో పట్టు పట్టింది.  అప్పుడు ఆమె భర్త నువ్వే వెళ్లి తీసుకొని రమ్మన్నాడు.  చేసేది లేక సవతి తల్లి ఆ చిన్న దాని తాతగారించికి వెళ్ళింది.  పిల్లను పంపించమని అడిగింది.  వారు అంగీకరించలేదు.  వారితో జగదమాది ఆఖరికి ఎలాగైతేనేం వాళ్ళను ఒప్పించి ఆ చిన్న దానిని తన వెంట ఇంటికి తీసుక వచ్చింది. 

              ఒక రోజున ఆ చిన్నది తన సవతి తల్లి తులసి పూజ చేయడం చూసింది.  తనకు కూడా ఆసక్తి కలిగి ఇంట గల అరిసెలు తెచ్చి నైవేద్యం పెట్టి తులసి దేవిని పూజించింది.  ఆమె భక్తికి మెచ్చి తులసి దేవి సాక్షాత్కరించి ఓ చిన్నదానా!  గత జన్మలో నువ్వు కన్నె తులసి నోము నోచి ఉల్లంఘించి నందువల్ల  నీకు తల్లి పోయి సవతి తల్లి కలిగింది.  కనుక నువ్వు కన్నె తులసి నోము నోచుకోమన్నది.  ఆ తులసీ దేవి చెప్పిన ప్రకారం ఆ చిన్నది కన్నె తులసి నోమును భక్తి శ్రద్దలతో నోచి సంవత్సరాంతమున ఉద్యాపన చేసుకున్నది.  నాటి నుండి ఆ సవతి తల్లి ఆమె పట్ల ప్రేమానురాగాలు కలిగి ఎంతో ఆదరణతో చూసుకునేది. 

ఉద్యాపన:  తులసమ్మకు పదమూడు జతల అరిసెలు నైవేద్యము పెట్టి పూజచేయ్యాలి.  ఒక కన్యకు తలంటు నీళ్ళు పోసి పరికిణి, రవిక ఇచ్చి అరిసెలు వాయనమివ్వాలి.

ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం?

#ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం.
'ఉప' అంటే 'దగ్గరగా'.,, 'వాసం' అంటే 'నివసించడం' అని అర్ధం.
పర్వదినాలలో ఉపవాసం ఉండటమంటే భగవంతునికి దగ్గరగా నివసించడం అని అర్థం.

ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు పూర్తిగా లగ్నం చేయాలి, ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని భగవన్నామ స్మరణ చేస్తూ గడపాలి.
నిష్కామంగా ఉపవాస దీక్షను చేయగలిగితే భగవంతుడు మన కోరికలను అడగకుండానే నేరవేరుస్తాడు.
శరీరానికి అలసట కలిగితేనే మనసు స్థిరపడుతుంది. మనస్సు స్థిరపడి నిగ్రహాన్ని పొందితేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం పొందినప్పుడే ఓ మనిషి తనని తాను తెలుసుకుంటాడు. తనని తాను తెలుసుకోవడమంటేనే దైవం గురించి తెలుసుకోవడమన్నమాట. దైవం గురించి తెలుసుకున్నాడు సాక్షాత్తు దేవుడితో సమానం. ఆ విధంగా దేవునికి సన్నిహితంగా,దగ్గరగా నివసింపచేసేదే "ఉపవాసం" అంటే.

ఇంద్రియనిగ్రహం కలిగి ఉండడం, మితాహారాన్ని భుజించడం – ఈ రెండూ ఉపవాస దీక్షకు చాలా అవసరం. ఇష్టపూర్వకంగా, ఎవరి బలవంతం మీదనో కాక స్వతంత్రంగా ఉపవాసం ఉండడం వల్ల మనకు తెలియకుండానే మన మనస్సు, శరీరం ఓ క్రమశిక్షణకు అలవాటు పడతాయి. ఉపవాస దీక్షను అనుసరించదలచిన వారికి దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఉపవాస దీక్ష చేస్తున్న రోజును ఎంతో పవిత్రమైన దినంగా భావించాలి. సాంసారిక, రాజకీయాది బాహ్య వ్యాపారాలన్నిటినీ వీలైనంత మేరకు మనసా, వాచా, కర్మణా త్యజించాలి. కేవలం ఆధ్యాత్మిక చింతనతో పొద్దు పుచ్చాలి.
ఉపవాస వ్రతాన్ని అనుసరిస్తున్న రోజున వీలైతే మౌనం పాటించడం ఉత్తమం. అది వీలు కుదరకపోతే, కనీసం మితంగా మాట్లాడాలి. ముఖ్యంగా మనోవైకల్యాలు రాకుండా నిగ్రహించుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఇష్టదైవాన్ని ప్రార్థించడం, జపం చేయడం. మౌనవ్రతం పాటించడం, భజనలు పాడుకుంటూ రాత్రిపూట జాగారం చేయడంలాంటివి అనుసరించాలి.

సర్వసాధారణంగా ఉపవాసమంటే, వండినఆహారపదార్థాలను తినకూడదు. పాలు, పండ్ల లాంటి వండని ఆహారపదార్థాలు కొద్దిగా తీసుకోవచ్చు. కొంతమంది పచ్చి గంగైనా ముట్టకుండా, ఉపవాసం ఉంటారు. తట్టుకోగల శక్తి ఉంటే అలా ఏమీ తినకుండా, తాగకుండా కూడా ఉపవసించవచ్చు.

ఉపవాస దీక్ష రోజున వయసు,ఆరోగ్య రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకుని పండ్లను పాలను స్వీకరిస్తూ పూర్తిగా దైవ చింతనలోనే దీక్షా సమయాన్ని గడపాలి.

అయితే, వృద్ధులు, శారీరకంగా బలహీనులు, రోగులు, చిన్న పిల్లలు ఉపవాసం చేయాల్సిన పనిలేదు.

ముసలి వారికి,బ్రహ్మచారులకు, చిన్నపిల్లలకు ఉపవాస దోషం లేదు.

thanks for the Reading

గుడిలో షడగోప్యం తలమీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది?


దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, షడగోప్యం తప్పక తీసుకోవాలి. చాలమంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినపనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి, షడగోప్యం పెట్టించుకుంటారు.

షడగోప్యం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వింపించనంతగా కొరికను తలుచుకోవాలి.
అంటే మీ కోరికే షడగోప్యము. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.

సహజంగా చిల్లర లేకపోవటం వల్ల, షడగోప్యమును వక్కోసారి వదిలేస్తుంటాము. ప్రక్కగా వచ్చేస్తాము. అలా చెయ్యొద్దు.
పూజారి చేత షడగోప్య

ము పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. షడగోప్యమును రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలుంటాయి.
షడగోప్యమును తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది. తద్వార శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. షడగోప్యమును శఠగోపనం అని కూడా అంటారు.

రోజుకో పద్యం: -632(౬౩౨)

వందేమాతరం

రోజుకో పద్యం: -632(౬౩౨)

పరుల సొమ్ము చూచి పాటిక బెల్ల మటంచు
మ్రింగ వలదు దాని దొంగిలించి
కఱ్ఱు కాల్చి వాత కాలమే పెట్టును
విశ్వ శాంతి కోరి విను మనీషి.

భావం:

ఓ మనీషి విశ్వ శాంతికొరకు ఇది వినుము. ఇతరుల సొమ్మును పటికబెల్లముగా భావించి దొంగతనముగా దానిని మ్రింగుట తప్పు సుమా!. భగవంతుని వరకు అఖ్కరలేదు, కాలమే కఱ్ఱకాల్చి వాతపెట్టగలదు.

=============================

It is wrong to steal and enjoy other’s possessions and property treating it as sugarcandy. God himself does not need to descend onto the earth to punish such mischief.  At appropriate time, he will be castigated so that right lessons are learnt the hard way.

-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167) & Kiran.

పురాణము అనగా ?

“పురా ఆసక్తి” -పూర్వ విషయములను సృశించునది,

“పురా పినవమ్” -ప్రాచీన విషయములు చెప్పుచున్నను ఎప్పటి కప్పుడు క్రొత్తగా కనబడునది,

“పురావిశాయాన్ నయతీతి పురాణమ్” -పూర్వ సంప్రదాయములైన ధర్మాదివిషయములను మన కందించునది అని పురాణమునకు నిర్వచనములు.

“ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృహంయేత్” -ఇతిహాస పురాణముల ద్వారా వేదధర్మములను వ్యాప్తి చేయవలెను అని ఆర్యోక్తి. కావున ఆ మహాకార్యము జరిగినపుడే పురాణముల ఉనికియు, పఠణశ్రవణములును సార్థకమగును.

“స్వర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ,
వంశాను చరితంచేతి పురాణం పంచలక్షణమ్”

ఆదిసృష్టి, బ్రహ్మవలన తరువాత జరిగిన సృష్టి, రాజ, ఋషి వంశములు, స్వాయంభువాది చతుర్దశ మన్వంతరములు, ఈ మనువులనుండి వ్యాపించిన వంశములలో ప్రసిద్ధుల చరిత్రములు అను ఐదు లక్షణములు గలది పురాణము.

శ్రుతి స్మృతులలోని ధర్మములను మిత్ర సమ్మితముగా బోధించుచుండును. పురాణము లనగా భారతీయ విజ్ఞాన సర్వస్వములు. “న హి విజ్ఞాన సర్వస్వం పురాణా ద్వేదసమ్మితాత్” అని పెద్దల వాక్కు.

భక్తిభావన లేకుండ పురాణ కథలు వినుటవలన ప్రయోజనము లేదు, గాడిద గంధపుచెక్కలు మోసినట్లు పురాణశ్రవణము నిరర్థకమగును.

16 విషయాలు మీకు ఎవరూ చెప్పరు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి


1. సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడరాదు?
ప్రభాతవేళ, సూర్యాస్తమయవేళ, మిట్టమధ్యాహ్న సమయమున రవిని సూటిగా చూడరాదు. అలాగే సూర్య మరియు చంద్రగ్రహణ సమయాల్లోనూ చూడరాదు. అట్టి సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవశరీర నిర్మాణానికి కీడును కలిగిస్తాయి.

2. శ్రీకృష్ణపరమాత్ముడు నెమలి ఫించాన్ని తలపై ఎందుకు ధరిస్తాడు?

సకల చరాచర సృష్టిలో సంభోగం చెయ్యని ఏకైక ప్రాణి నెమలి మాత్రమే. శ్రీకృష్ణునికి 16,000 వేలమంది గోపికలు. అన్ని వేలమంది గోపికలతో శ్రీకృష్ణుడు సరస సల్లాపాలు మాత్రమే ఆడాడు. అల్లరి చేసి గెలిచేవాడు. ఆ విషయాన్ని తెలియచేయటానికే శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరిస్తాడు. శ్రీకృష్ణుడు ఒట్టి అల్లరి కృష్ణుడు మాత్రమే.

3. మాతృ, పితృ, ఆచార్య, దైవ ఋషి రుణాలంటే?

పశుపక్ష్యాదుల్లా పుట్టగానే, కాళ్ళు రాగానే బైటికి తరిమెయ్యరు. తల్లీ, తండ్రి ఇద్దరూ జీవితకాలం సంపాదించిన ధనాన్ని పోగు చేసి ఇచ్చి, పెళ్లి కూడా చేసి ధర్మ, అర్థాలతో సుఖించే పరిస్థితులని సృష్టిస్తారు. ప్రేమతో పెంచుతారు. తల్లీ, తండ్రీ రుణం, ఎంత సేవచేసినా తీరదు. చేయాల్సిందల్లా ముసలితనంలో వారిని బిడ్డల్లా చూసుకోవటమే.
మల మూత్రాలు కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో తల్లి ఋణం తీర్చుకోవాలి. తాను సంపాదనతో నిస్వార్ధముతో పెంచి పెద్ద చేసిన తండ్రి ఋణం తీర్చుకోవాలి. లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, నేర్పినందుకు గురు ఋణాన్ని, మనకి బుద్ధినీ, కర్మనీ ఇస్తున్న దైవ ఋణాన్ని భక్తి ద్వారా ధర్మ మార్గం ద్వారా, సకల శాస్త్రాలనూ, ధర్మాలనూ గ్రంథాల ద్వారా మనకు అందచేసినందుకు ఋషి రుణాన్ని తీర్చుకోవాలి.తిరిగి తాను వివాహం ద్వారా అన్ని రుణాలన్నీ తీర్చి, తిరిగి తాను ఋణ పడటమే మానవ జన్మ.

4. హారతి వల్ల లాభము ఏమిటి?

గృహములోను, పూజాగదిలోనే కాదు, గుడిలోనూ, శుభకార్యాలప్పుడూ….పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను, క్రొత్త పెళ్లికూతురు గృహములోకి ప్రవేశించేటప్పుడూ హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. శుభాకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులూ, అంటువ్యాధులూ ప్రబల కుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించినశిస్తుందో, అలాగే మనం తెలిసీ సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం.

5.చిన్న పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు?

చినారుల పుట్టిన రోజు పండగ వేడుకలలో అలాగే అనేక శుభ కార్యాల్లో పాల్గొన్న పెద్దలకీ, పిల్లలకీ విభిన్నపద్ధతులలో దిష్టి తీస్తూ ఉంటారు. పిల్లలూ, పెద్దలూ ఘనవిజయాలు సాధించినప్పుడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు అతిగా నీరసించి డీలాపడినప్పుడు దిష్టి తీస్తారు. అలాగే పిల్లలకి పసుపూ, సున్నం కలిపినా అన్నంతో దిష్టి తీస్తుంటారు. బయటజనుల దృష్టిదోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే చిన్నపిల్లవాడు కలవరింతలు లేకుండా నిద్రపోవటమూ, నిద్రలో ఉలిక్కిపడుతూ లేవటం వంటి అవలక్షణాలు లేకుండా ఉంటాడు.

చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చూ అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల చుట్టూ అంతా చేరటంవల్ల చిన్నపిల్లలూ లేదా పెద్దలూ కోంత అస్వస్థతకు గురిఅవుతారు. అందుకే వివాహవేడుకలలోను, పుట్టిన రోజువేడుకలలోను విధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్ర నీళ్ళలో దిష్టి తీస్తారు. ఎర్రరంగు పదేపదే చూడటం వల్ల అనేక రోగాలు సమసిపోతాయి. మనసుకి ప్రశాంతతతోపాటు ధైర్య గుణంవస్తుంది.

6. ఎలాంటివేళల్లో భోజనాన్ని తినకూడదు?

గ్రహణం సమయమున అనగా సూర్యగ్రహాణానికి 12 గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహాణానికి 9 గంటల ముందుగా ఎటువంటి పదార్థాన్ని ఆహారంగా తీసుకోకూడదు.

7. ‘ఏడు’ సంఖ్య మంచిదా కాదా?

తిరుమల తిరుపతిలో కొండలు 7. ప్రత్యక్షదైవం సూర్య భగవానుడి నుంచి వచ్చే కిరణాలు 7, పాతాళం  మొదలైన క్రింది లోకాలు 7, భువర్లోకమ మొదలైన ఊర్ధ్వభాగంపై లోకాలు 7. అలాగే ద్వీపాలు 7. పెళ్ళిలో వధూవరులు ఇద్దరూ కలిసి వేసే అడుగులు 7. అగ్ని దేవుని నాలుకలు 7. బ్రహ్మోత్సవాలు జరిగేది 7వ నెలలో. సప్తస్వరాలు కూడా ఏడే. 7 సంఖ్యమంచిది కాదని కొందరి మూఢనమ్మకము. 7 కూడా మంచిదే. భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మనకోసమే. దాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనకి లభిస్తుంది.

8. దేవునికి దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి?

దీపారాధనకు ఆవునెయ్యి ఉత్తమము. మంచి నూనె మధ్యమము. ఇప్ప నూనె అధమము. ఆవు నెయ్యితో వెలిగించిన దీపము యొక్క ఫలితము అనంతము. అష్టైశ్వరాలూ, అష్టభోగాలు సిద్ధిస్తాయి. వెండి లేదా పంచలోహాలతోనూ, మట్టితో చేసిన దీపాలు అత్యుత్తమము. వేరుశెనగ నూనెతో దీపారాధన చేయరాదు. శ్రీమహాలక్ష్మికి ఆవునెయ్యి దీపమూ, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము చాలా ఇష్టము.

9. లక్ష్మీదేవి తామర పువ్వులోనూ, ఇరుప్రక్కలా ఏనుగులతోనూ ఎందుకు ఉంటుంది?

సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం. ఇక ఇరుప్రక్కలా వున్న ఏనుగులకు అర్థం ఏమిటంటే శ్రీమహాలక్ష్మీ ధనబలము గజబలమంతటిదని అర్థం చేసుకోమని పరమార్థం.

10. తిరుమల తిరుపతిలో పూలబావి ప్రత్యేకత ఏమిటి?

అద్దాల మంటపానికి ఉత్తరం దిక్కున ఉండి ఈ పూలబావి. స్వామి వారికి సమర్పించిన తులసీ, పూలదండలు, పువ్వులు ఎవ్వరికి ఇవ్వకుండా ఈ పూలబావిలోనే పడేస్తారు.

ఆపదవచ్చినప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య సొరంగ మార్గం ద్వారానే ఆ వెంకటేశ్వరస్వామిని శరణువేడాడు. స్వామి వారు ఆ ఆపద సమయంలో ఏకాంతంగా ఉన్నారు. తొండమానుడ్ని చూసి శ్రీమహాలక్ష్మీ సిగ్గుతో శ్రీమహా విష్ణువు వక్షస్థలంలో చేరింది. అదే సమయంలో భూదేవి తొండమానుడు కట్టించిన పూలబావిలోకి వెళ్ళి రహస్యంగా దాక్కుందని పురాణాల గాధ.

11. ఉత్తరం దిక్కున తలపెట్టి ఎందుకు నిద్రించరాదు?

మన భూమిలో గురుత్వాకర్షణశక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనమూ అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న ఆ శక్తి యొక్క తరంగాలు మన మెదడులో దాగి వున్న శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి. దానివలన అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పువస్తుంది. మెదడులో లోపాలు తల ఎత్తుతాయి. అలా కాకుండా తూర్పు పడమరల వైపు నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉంది మెరుగు పడుతుంది. రక్త ప్రసరణసరిగా జరిగి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది.

12. స్త్రీ తన కన్నా వయసు ఎక్కువ ఉన్న మగవారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి?

తన కన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంభోగం వలన పురుషునికి శక్తి తగ్గిపోతుందనేది అసత్యం. పురుషునికి ఆయుక్షీణం. స్త్రీకి సిగ్గు ఎక్కువ. కనుక ప్రేమతోలాలించి, బుజ్జగించాలంటే తనకన్నా చిన్నదవ్వాలి. స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు. కనుక సంసారాన్ని మోయలేదు. కష్టపడలేదు. పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబం యొక్క భారం స్త్రీ మీదే పడుతుంది. మగవాడిదే కుటుంబ భారమని చెప్పటానికే అనాదిగా ఈ ఆచారం. అందువల్లే భార్యకంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది మన పెద్దలు నియమం పెట్టారు.

13. పూజలో కొబ్బరికాయ క్రుళ్ళితే మంచిదా? కాదా?

పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదు. అపచారం అంతకన్నా కాదు తెలిసి చేసిన పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదేకాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్నితీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి.

14.విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగాంతమేనా?

శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. ధూమశకటాలు నడుస్తాయని, ముఖానికి రంగేసుకున్న వారు దేశనాయకులవుతారనీ, భర్తలేని స్త్రీ రాజ్యమేలుతుందనీ, త్రాగే మంచినీళ్ళు కొనుక్కుంటారనీ…ఆయన చెప్పిన వన్నీ జరిగాయి.  విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగం అంతమయిపోయినట్టే. అంత ఎత్తున కృష్ణమ్మ ఎగిస్తే ఇక భూమి మీద ఏం మిగులుతుంది?

15. కార్తీకమాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనవి ఏవి?

ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్ది అన్నము. మినుములు, పెసలు, శెనగలు, ఉలవలు; కందులు ఇవన్నీ వాడరాదు. అష్టమి నాదు కొబ్బరీ, ఆదివారము ఉసిరీ తినరాదు.

16. మంగళ, శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకివ్వరు?

సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము. అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గానీ, ఇతరులకు గానీ ఆపదసమయాల్లో ఈ నిమయం పనికి రాదు. ఇలా చెయ్యటంవల్ల మరింత ధనం పోతుంది.

ఇంటి దైవాన్ని మరచిపోతే?

ఒక భక్తుడు కంచి మఠంలోనికి ప్రవేశిస్తూ, తూలుతూ తడబడతూ క్రింద పడిపోబోయాడు. అతని అవస్థ చూసి అక్కడ ఉన్న వారు పట్టుకున్నారు. అయినా అతను నోట్లో నుండి రక్తం కక్కుకున్నాడు. అక్కడున్నవారు భయపడిపోయారు. అక్కడ రేగిన కలకలం పరమాచార్య స్వామి వారి చెవులను చేరింది.

వారు ఒక పరిచారికుని వంక చూసి “ఎందుకు అంత అలజడి అక్కడ?” అని అడిగారు.

మఠం మేనేజరు మహాస్వామి వారితో “ఎవరో భక్తుడు రక్తం కక్కుకున్నాడు” అని చెప్పాడు.

మహాస్వామి వారు మేనేజరుతో “అతనిదేవూరు? ఇప్పుడు ఎక్కడినుండి వస్తున్నాడు” కనుక్కోమన్నారు.

ఆ భక్తుడు తిరుచ్చి దగ్గర్లోని ఒక పల్లెటూరినుండి వచ్చాడు. చిదంబరంలోని నటరాజ స్వామి వారిని దర్శించుకుని కాంచీపురానికి వచ్చాడు. మహాస్వామి వారు ఆ పెద్దమనిషిని దగ్గర్లోని డాక్టరు దగ్గరకు తీసుకువెళ్ళమని చెప్పారు. రక్తం కక్కున్నాడు అని విన్న వెంటనే డాక్టరుగారు హెమొరేజ్ (రక్తస్రావం) వాల్ల ఇలా జరిగి ఉండొచ్చు అనుకున్నారు. హాస్పిటల్ లో చేర్పించమని సలహా ఇచ్చారు.

ఈ విషయాన్ని మహాస్వామి వారికి చేరవేసారు.

”ఇది హెమొరేజ్ కాదు. మీ నాన్నమ్మను అడిగితే అది వేడి చేయడం వల్ల అలా జరిగింది అని చెబుతారు. ఇంకొందరు దృష్టిదోషం వల్ల అలా జరిగింది అని చెబుతారు. నాకు తెలిసి ఈ పెద్దమనిషి వారి ఇంటి దైవం తిరువాచూర్ మదుర కాళి అమ్మన్. ఇప్పుడు వీరికి కాని వీళ్ల ఇంట్లో వాళ్ళకి ఇంటి దైవం విషయం గుర్తులేదు. కాని ఇప్పుడు వీరు అమ్మవారిని భక్తితో కొలవడం లేదు. కంచి కాళికాదేవికి పూజ చేసి ఇతనికి ప్రసాదం ఇవ్వండి. ఇతను చిదబరంలోని థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చాడు. అది తప్పు కదా? అంతే కాకుండా కాళి దేవి వారి ఇంటి ఆరాధ్యదైవం. మరి అటువంటప్పుడు కాళి దేవిని భక్తితో కొలవాలి కదా? సరే”

“అతనికి ఆరోగ్యం బాగుపడిన వెంటనే చిదంబరం వెళ్ళి థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోవాలి. వైద్యులు చెప్పినట్టు ఇతను అధిక రక్త పోటుతో బాధపడుతున్నాడు. అందుకే రక్తం కక్కున్నాడు. కావున అతని తిండిలో సాధ్యమైనంతవరకు ఉప్పు తగ్గించాలి.” ఇలా మహాస్వామి వారు చాలా సూచనలు చేసారు.

కాంచీపురం కాళి అమ్మవారి దేవస్థానం నుండి కుంకుమ తెచ్చి ఆ పెద్దమనిషి నుదుటిపైన రాసారు. అతన్ని శ్రీమఠం లోని హాల్లో పడుకోబెట్టారు. పరమాచార్య స్వామి వారు చెప్పినట్టు తరచుగా అతనికి చల్లటి నీటిని కొంచం కొంచం తాగడానికి ఇచ్చారు. రాత్రి అతను హాయిగా నిద్రపోయాడు. మరుసటి ఉదయం అతను మామూలుగా సంభాషించాడు. రాత్రి విశ్రాంతి వల్ల అతను కొంచం ఉత్సాహంగా కనపడ్డాడు. ఆయన మహాస్వామి వారి వద్ద ప్రసాదం తీసుకుని మేనేజరు గారికి ధన్యవాదాలు తెలిపి వెళ్ళిపోయాడు.

ఇంటికి వెళ్ళిన తరువాత తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని అతను మేనేజరు గారికి ఉత్తరం రాసాడు. ఇంకా

“నేను ఇక ఎప్పుడూ మా ఇంటి దైవాన్ని మరచిపోను. కాని నాకు ఈనాటికి అర్థం కాని విషయం ఏంటంటే మహాస్వామి వారికి ఎలా తెలుసు నేను చిదంబరంలో థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోలేదని?” అది మనకి కూడా అంతుచిక్కని విషయం.

మన ఇంటి దైవం తరతరాలుగా మన చేత పూజింపబడుతూ మనల్ని రక్షిస్తున్న దైవం. కొత్త కొత్త దేవుళ్ళ మోజులో పడి ఇంటి దైవాన్ని ఎన్నటికి మరువరాదు. తల్లితండ్రులు కూడబెట్టిన ఆస్తులు కావాలి. కాని వారు అర్చించిన దైవం మాత్రం వద్దా?.

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles