Tuesday, 31 January 2017

అయ్యప్ప మాలలోని అంతరార్థం!


   శివకేశవుల భక్తులందరినీ ఈడేర్చవచ్చినవాడే అయ్యప్ప! `అయ్యా`అన్నా`అప్పా` అన్నా ఆదుకునేవాడే ఈ హరిహరసుతుడు. కార్తీకమాసం దగ్గరపడుతోందంటే చాలు శబరిమలను చేరేందుకు 41 రోజుల దీక్షను ధరించాలని ఉవ్విల్లూరుతుంటారు భక్తులు. కేవలం 18 మెట్లను ఎక్కి శబరిగిరీశుని చూసేందుకు పట్టే దీక్ష కాదు ఇది. భౌతిక సుఖాలను కాదనుకుని, ప్రకృతి పెట్టే పరీక్షలో నిగ్గుదేలి, స్వామి సన్నిధికి సవినయంగా చేరుకునే అరుదైన అవకాశం! మాలధారణలో ఉన్న కొన్న నియమాలు, వాటి వెనుక ఉన్న అంతరార్థం…

ప్రాతఃకాల స్నానం: ఎంత ఆలస్యంగా లేచే వీలుంటుందా అని ఆలోచిస్తాము చలికాలంలో! అలాంటిది సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని చన్నీళ్లతో తలస్నానం చేయాలని సూచిస్తోంది అయ్యప్పదీక్ష. దీనివల్ల రెండు ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి- వాతావరణం ఎలా ఉన్నా కూడా దానికి తట్టుకుని నిలబడే స్థైర్యాన్ని అలవర్చుకోవడం. రెండు- శరీరంలో ఎప్పుడూ నిర్ణీత ఉష్ణోగ్రత కొనసాగే వ్యవస్థ ఉంటుంది. రక్తప్రసరణలో తగు మార్పుల ద్వారా ఇది సాధ్యపడుతుంది. చన్నీరు ఒక్కసారిగా మీద పడగానే మనలోని రక్తప్రసరణ మందగిస్తుంది. వెంటనే ఎండ తగలగానే రక్తప్రసరణ  వేగాన్ని అందుకుంటుంది. అప్పటివరకూ మందగించిన రక్తప్రసరణ ఒక్కసారిగా వేగాన్ని అందుకోవడం వల్ల శరీరంలోని చిన్నపాటి దోషాలు పరిహరింపబడతాయి.
క్షవరము లేకపోవడం: దీక్షలో ఉన్నన్నాళ్లూ స్వాములు క్షవరానికి దూరంగా ఉంటారు. ఈ నియమం వల్ల ఒకటీ, రెండూ కాదు మూడులాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి- శరీరం పట్ల నిర్లిప్తత! శరీరాన్ని గారాబంగా చూసుకుని, దాన్ని చూసి మురిసిపోతుంటే మోహం తప్ప మరేమీ మిగలదు. మన యాత్రను కొనసాగించేందుకు అది ఒక వాహనం మాత్రమే అని గ్రహించినరోజున దాని పట్ల ఎంత శ్రద్ధ వహించాలో అంతే ప్రాముఖ్యతను ఇస్తాం. దాన్ని గుర్తుచేసేదే ఈ నియమం! రెండు- చలికాలం సూర్యోదయానికి ముందే కాలకృత్యాలను తీర్చుకుని, పల్చటి వస్త్రాలను ధరించి, కటిక నేలల మీద నిదురించే స్వాములకు చలి నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. మూడు- దీక్ష సమయంలో స్త్రీ సాంగత్యం నిషిద్ధం. ఆ విషయంలో ఎలాంటి ప్రలోభాలకూ తావులేకుండా, భౌతికమైన ఆకర్షణను తగ్గించేందుకు ఈ నియమం దోహదపడుతుంది.
నల్లని వస్త్రధారణ: తెలుపు సూర్యకిరణాలను ప్రతిఘటిస్తే, నలుపు రంగు వేడిని ఆకర్షిస్తుంది. చలికాలం కఠినమైన నియమాలను పాటించే స్వాములకు ఈ రంగు మాత్రమే కాస్త వెచ్చదనాన్ని కలిగించి అండగా నిలుస్తుంది. పైగా కాషాయంలాగానే నలుపు కూడా వైరాగ్యానికి ప్రతీక! దీక్ష కొనసాగినన్నాళ్లూ తాము స్వాములుగా ఉంటామనీ, వైరాగ్యానికి ప్రతినిధులుగా కొనసాగుతామనీ సూచించే ఈ నలుపు రంగు వస్త్రాలను అయ్యప్పలు ధరిస్తారు.

పాదరక్షలు నిషిద్ధము: ఈ రోజుల్లో పాదరక్షలు లేకుండా బయటకు అడుగుపెట్టడం అసాధ్యం. మనిషి స్థాయిని కూడా పాదరక్షలను బట్టే నిర్ణయిస్తూ ఉంటారు. కాలికి మట్టి అంటుకోకుండా పెరగడాన్ని అదృష్టజాతకంగా భావిస్తారు. `సుకుమారమైన పాదాలు`, `పాదాలు కందిపోకుండా`… లాంటి వాక్యాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ శబరిమల పర్వతాన్నే కాదు ఈ జీవితాన్ని కూడా అధిరోహించాలంటే ఒకోసారి కఠినత్వం అవసరపడుతుంది. జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేము. అన్ని కష్టాలనూ తట్టుకుని, అన్ని అడ్డంకులనూ దాటుకునేందుకు మనిషి ఎప్పుడూ సిద్ధంగా, సన్నద్ధంగా ఉండాలి. అందుకోసం కొంత కఠినత్వాన్ని కూడా అలవర్చుకోవాలి. గరుకు నేల మీద నడిచే అలవాటుని చేసుకుంటే పాదాలే చెప్పులుగా మారి రాటుతేలిపోతాయి. ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా శ్రమించే గుణానికి శిక్షణే ఈ నియమం!

మాలలోని స్వాములకు ఇంకా చాలానే నియమాలు ఉన్నాయి. మితాహారం, మత్తుపదార్థాల నిషిద్ధత, కటికనేల మీద నిదురించడం… అన్నీ కూడా వారి ఆధ్యాత్మిక పురోగతికీ, భౌతిక దృఢత్వానికీ నిర్దేశించినవే! అందుకనే ఒక్కసారి మాల వేసుకున్న భక్తులు, ఆ దీక్ష రోజులు ఎప్పుడు ముగిసిపోతాయా అని కష్టంగా రోజులను గడపరు, మళ్లీ మాలధారణ ఎప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తారు.

మహిషిని చంపినా అయ్యప్ప వృతాంతం? అయ్యప్ప చరిత్ర?

అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మద్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.

అయ్యప్ప చరితము :
హరి హర పుత్రుడైన అయ్యప్ప పందల రాజ్యాన్ని పాలించే "రాజషేఖరపాన్ద్యుడు "నకు పంపానదీ తీరాన లభిస్తాడు . సర్పం నీడన పవళించి ఉన్న అతనికి " మణికంఠుడు " అని పేరు పెట్టి విద్యా బుద్దులు నేర్పిస్తాడు .మనికంటుడు అనగా మన అయ్యప్ప స్వామి .. గురుకులంలో చదువుకునే రోజుల్లో వారి గురువు ఎడల్ అత్యంత భక్తీ శ్రద్దలతో వుండేవాడు . సాక్షాత్తు భగవంతుడైనప్పటికీ గురువు ద్వార సకల విద్యలు నేర్చుకున్నాడు . అయితే గురుదక్షిణగా గురువు కోరికపై అంధుడు , ముగావాడైన ఆయన పుత్రునికి మాట , ద్రుష్టి ప్రసాదించి తన గురుభక్తిని చాటుకున్నాడు . ప్రజలను భయభ్రాంతులకు లోను చేస్తున్న "వానరుడనే " బందిపోటు దొంగను ఓడించి అతనికి దివ్యత్వాన్ని బోధించాడు . తండ్రి అప్పజేప్పబోయిన సింహాసనాన్ని త్యజిస్తాడు
మనికంటుడు . ఆయన కోరికమేర తను బాణం వేసిన చోట ఓఆలయం నిర్మించి ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు తండ్రి .అదే శబరిమల ఆలయము . అందులో మనికంటుడు అయ్యప్పస్వామిగా అవతరిచాడు .ఎవరైతే నియమ నిష్టలతో సేవించి "పదునేట్టాంపడి " నెక్కి దర్శిస్తారోవారికి ఆయురారోగ్య ఇష్వర్యాలను పర్సాదిస్తాడు . మాటలు రాణివారికి మాటలు వచ్చే మహిమాన్వితమైన ప్రదేశమిది . చూపులేనివారికి చూపునిచ్చే కన్నుల పండువైన ప్రదేశమిది . భగవంమహిమ కలిగిన శబరిమలై లో గల దివ్య ఔషధాల వనములికా పరిమళ ప్రభావంతో కూడిన ప్రాణవాయువును పీల్చగానే ఎంతటి అనారోగ్యమైనా చక్కబడుతుంది . సంతానము , సౌభాగ్యము , ఆరోగ్యము , ఐశ్వర్యము మొదలైన కోరిన వరాలనిచ్చే స్వామి అయ్యప్ప .

అయ్యప్ప జనన కారణం?

జనన కారణము :
1.క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు
అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం దరించి
కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న
మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు.
2. భస్మాసురుడు అనే రాఖసుడు శివుని కై తపస్సు చేసి ...
తానూ ఎవరి తలపై చేసి వేస్తే వారు భస్మము అయిపోయేతట్లు
వారము పొంది ... తాను పొందిన వరకు పనిచేయునది , లేనిది పరీక్ష
నిమిత్తము శివుని తలపై నే చేయి వేయుటకు పూనుకొనగా చావు
భయము తో శివుడు పారిపోయి గురివింద గింజ లో దాక్కోనెను .
శివుని రక్షించే కార్యములో విష్ణువు 'మోహినీ ' రూపము ఎత్తి
భస్మాసుర వధ గావించెను .
ఏది ఏమైనా ... వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము,
30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా
లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల
కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ
ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో
శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప స్వామి . ఇలా
హరి హరులకు బిడ్డ పుట్టుటకు కారణముంది . మహిష ను
సంహరించాదానికే ... ఈ మహిష ఎవరు ? .

పూర్వము త్రిమూర్తుల అంశ తో జన్మించిన
దత్తాత్రేయుడు .. ఆ త్రిమూర్తుల భార్యలైన - సరస్వతి
,లక్ష్మీ , పార్వతి ల అంశతో జన్మించిన 'లీలావతి'ని పెళ్లి
చేసుకుంటాడు . లోకోద్ధారణ ముగిశాక అవతారము చాలిద్దామని
దత్తాత్రేయుల వారు అంటే ... మరికొంతకాలము ఇక్కడే
సుఖిద్దామని భార్య కోరగా , దత్తు నకు కోపము వచ్చి" మహిషి " గా
జన్మించమని శపిస్తాడు . శక్తి స్వరుపిని అయిన లీలావతి భర్తను
"మహిష " గా పుట్టుడురుగాక అని ప్రతి శాపముతో ఇద్దరు ...
రంబాసురుడు అనే రాక్షసుడు కి యక్షకి దత్తుడు
మహిషాసురుడు గాను , కరంబాసురుడు అనే రాక్షసుడుకి
లీలావతి మహిషి గాను జన్మించిరి . మహిసాసుర మర్దిని తో
(దుర్గాదేవి ) మహిసాసురుడు చనిపోగా మహిష తపమాచరించి
బ్రహ్మ వద్ద ఎన్నో వరాలు పొంది చివరికి చావు ఉండకూడదని
వారము అడుగుతుంది . పుట్టిన వానికి గిట్టక తప్పదు ... అని
ఇంకో వారము కోరుకోమంటాడు బ్రహ్మ . హరి హర సుతుని చేతిలో
తప్ప మరెవరి చేతి లో చావు లేకుండా వరము కోరిననది . హరి
హరులు వివాహమాడారు గదా .. వారికి బిడ్డ పుట్టాడనే తెలివితో
కోరుకున్నదీ వరము . తీరా అయ్యప్ప జన్మతో మహిష మరణిస్తుంది .

చిత్తరంజన్ దాస్ జన్మ దినం సందర్భంగా

💢నవంబర్ 5 న  ⚜చిత్తరంజన్ దాస్⚜ జన్మ దినం సందర్భంగా  

🌀👌స్వాతంత్ర్య సమరయోదుడు చిత్తరంజన్ దాస్ గొప్పతనం తెలియజేసే సంఘటన :🔅

స్వరాజ్యం కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న రోజులవి. ప్రతి భారతీయుడు వందేమాతర నినాదాలు చేస్తూ బ్రిటిషర్లకు గుండెదిగులయ్యాడు.

స్వదేశాభిమానంతో విదేశీవస్తు బహిష్కరణ చేశారు. అట్లా బాహ్యంగా ఆంతరంగికంగా విదేశీయతను తననుండీ దూరం చేశాడు ఓ ప్రముఖ న్యాయవాది.

అతడు ప్రఖ్యాత న్యాయవాది అయినా తెల్లవాళ్ళ న్యాయస్థానాల్లో అడుగు పెట్టనని ప్రతిజ్ఞబూనాడు.

డిసెంబర్ 1924 లో కాంగ్రెస్ మహాసభలు బెల్గాంలో జరిగాయి. ఎందఱో ప్రముఖులు ఆ సభలలో పాల్గొనటానికి వచ్చారు. ఈ ప్రసిద్ధ న్యాయవాది కూడా వచ్చాడు. అందరు  చూస్తుండగా ఇందోర్ మహారాజు కంగారుగా వచ్చి సరాసరి ఆ ప్రముఖ న్యాయవాది దగ్గరకి వెళ్ళాడు.

అందరు విభ్రమంతో చూడసాగారు.“అయ్యా! గొప్ప చిక్కొచ్చి పడింది. నా తరపున మీరే వాదించాలి. ఈ 25 లక్షల రూపాయలుంచండి. కేసు గెలిచిన తరువాత మరో 25 లక్షలు సమర్పిస్తాను” అని అర్థించాడు ఇందోర్ మహారాజు.

ఆ రోజుల్లో 50 లక్షలు నిజంగా చాలా పెద్ద మొత్తం. ఇందోర్ రాజు మీద హత్య చేయించి నట్టు ఆరోపించబడింది. కేసు వైస్రాయి ముందు విచారింప బడుతుంది కాబట్టి వాదించే న్యాయవాది బాగా ప్రజ్ఞాశాలి అయివుండాలి. అందుకే ఇందోర్ మహారాజు ఈ న్యావవాదిని ఎన్నుకున్నాడు.

మరెవరైనా అయివుంటే “మహాభాగ్యం” అని కేసు ఒప్పుకునేవారే. కానీ ఈ న్యాయవాది నిష్కర్షగా అన్నాడు “అయ్యా! క్షమించండి. ఆంగ్లన్యాయస్థానాలలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేశాను.

మళ్ళీ స్వాతంత్ర్యం వచ్చాకే నేను న్యాయస్థానాల్లోకి వసాను. ధన ప్రలోభంతో మీ కేసు ఒప్పుకుని ఆత్మవంచన చేసుకోలేను” అని జవాబిచ్చాడు.

ఆ న్యాయవాది సత్య వాక్ పరిపాలనను చూసి ముగ్ధుడైన రాజు మరో న్యాయవాదిని ఎన్నుకున్నాడు.

ఆ న్యాయవాది “దేశ బంధు” గా పేరుకెక్కిన చిత్తరంజన్ దాస్.

🔯ఈ కథలోని నీతిని మరొక్కమారు  చూద్దాం:🔯

ఏమైనా రాని ఏమైనా కానీ అన్నమాట నిలబెట్టుకోవటం నిజమైన భారతీయుని లక్షణo . 50 లక్షల రూపాయలొస్తున్నా కొంచం కూడా ప్రలోభ పడకుండా చిత్తరంజన్ గారు ఆ రూపాయలను తృణప్రాయంగా ఎంచి తమ మాటకి కట్టుబడ్డారు. అందుకే వారు దేశ బంధువైనారు.🔯

అష్టసిద్ధులంటే ఏమిటి?


భారతీయ తత్వ శాస్త్రంలో సిద్ధి అన్నమాటకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సాధకుడు యోగమార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు, ఒక స్థాయిలో అతను భౌతికమైన సూత్రాలను దాటిపోతాడని చెబుతోంది యోగం. అప్పుడు అతనికి సిద్ధించే శక్తులే ‘సిద్ధులు’. సాంఖ్యం, భాగవతం, బౌద్ధం ఈ సిద్ధులను వేర్వేరు రకాలుగా నిర్వచిస్తున్నప్పటికీ.... ప్రచారంలో ఉన్నది మాత్రం అష్టసిద్ధులే! వాటిని శ్లోక రూపంలో చెప్పుకోవాలంటే...
“అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః”

దీని బట్టి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అన్న ఎనిమిది సిద్ధులే ఆ అష్టసిద్ధులని తెలుస్తోంది. పతంజలి యోగ సూత్రాల ప్రకారం ఈ సిద్ధులు కేవలం యోగం ద్వారానే కాకుండా, ఒకోసారి జన్మతః సిద్ధించవచ్చు. మంత్రబలంతోనూ సాధించవచ్చు. ఒకోసారి దివ్యౌషుధలని స్వీకరించడం ద్వారా కూడా వీటిని పొందవచ్చు. అయితే సాధకుడు ఈ సిద్ధుల భ్రమలో పడితే, మోక్షం అనే అసలు లక్ష్యం నుంచి దూరమైపోతాడని హెచ్చరిస్తాయి పతంజలి యోగ సూత్రాలు!
అష్టసిద్ధుల గురించి ప్రస్తావన రాగానే వినాయకుడు, హనుమంతుడు గుర్తుకురాక మానరు. వీరిరువురికీ అష్టసిద్ధుల మీద పూర్తి సాధికారత ఉందనీ, వీరిన పూజించిన భక్తులకు ఆయా సిద్ధులను అతి సులభంగా అనుగ్రహించగలరనీ ఓ నమ్మకం. అందుకనే హనుమంతుని ‘అష్టసిద్ధి నవవిధికే దాతా’ అంటాడు తులసీదాసు తన హనుమాన్‌ చాలీసాలో. ఇక వినాయకుని భార్య సిద్ధి అన్నది కేవలం ఒక పేరు మాత్రమే కాదు... ఆమె అష్టసిద్ధులకు ప్రతిరూపం అన్నది ఓ విశ్లేషణ! ఇంతకీ ఈ అష్టసిద్ధుల ద్వారా సాధకులు సాధించే శక్తులు ఏమిటంటే...

అణిమి- శరీరాన్ని అతి సూక్ష్మరూపంలోకి తీసుకురాగలగడం.
మహిమ- ఎంత పెద్దగానైనా శరీరాన్ని మార్చేయగలగడం.
గరిమ- ఎంతటి బరువునైనా సాధించగలగడం.
లఘిమ- కావల్సినంత తేలికగా తన బరువును మార్చుకోవడం.
ప్రాప్తి- ఏ వస్తువు కావాలనుకున్నా దాన్ని శూన్యం నుంచి సైతం సాధించడం.
ప్రాకామ్యం- కోరుకున్నది సాధించడం.
ఈశత్వం- అష్టదిక్పాలకును శాసించగల ఆధిపత్యం.
వశిత్వం- సకల జీవరాశులను వశం చేసుకోగల అధికారం.
 

నవనిధుల్లో పుణ్యం వల్ల కలిగేవి, శాంతం వల్ల కలిగేవి, ధర్మం వల్ల కలిగేవి
పద్మనిధి, మహాపద్మనిది, నీలనిధి.
నవనిధుల్లోని ఈ మూడు నిధులే సుఖాలు.. సౌఖ్యాలు... కీర్తి... ఆరోగ్యం.. పరమానందమును తన కుటుంబ సభ్యులకి, తన రక్త సంబంధీకులకి, స్నేహితులకి ఇస్తాయి. రెండు చేతులతో దండం పెట్టాలనిపించే గౌరవాన్ని తెచ్చిపెడతాయి.

కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, వ్యధలు, నష్టాలను తెచ్చే నిధులు....
కుందనిది, శంఖనిధి, ముకుందనిది, మిశ్ర నిధి, మకరనిధి, కచ్ఛపనిధి.
అధర్మం.. అన్యాయం.. అక్రమం.. నీచం.. స్నేహంలో ద్రోహం.. నమ్మినవారిని మోసం చెయ్యటం వల్ల, అధిక వడ్డీల వల్ల వచ్చేవే పై నిధులు.  ఆ నిధులన్నీ వేశ్యల పాలు, విలాసాలపాలు,  వైద్యశాలల పాలు,  అపాత్రుని పాలు అవుతాయి.
నిలువెత్తు సంపదలున్నా అనుక్షణం వెలితి, దిగులు, నిరాశ, నిస్సహాయత, తగాదాలు, గొడవలు, కోట్లు కరిగించినా పోని దరిద్రాలు. ఆ ఆరునిధులను వదిలించు కోవటమెలా?

లవంగాలతో పది ప్రయోజనాలు

లవంగం లో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పి ని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది.
లవంగాలతో పది ప్రయోజనాలు

1. లవంగం లో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పి ని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది.

2.దగ్గుకు సహజమైనా మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.

3. ఏదైనా తిన్నది సరిగ్గా లేక వాంతులు వచ్చినప్పుడు కడుపు లో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనె ను తీసుకోవడం వల్ల ఉపశమనంగా ఉంటుంది.

4.తేనె, కొన్ని లవంగాల నూనె ను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
5. లవంగాలు ఏ వంటకంలోనైనా వేసుకోవచ్చు. వంటకాలకు మంచి సువాసన రుచినీ కూడా ఇస్తుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది.

6. తులసి, పుదీనా ,లవంగాలు ,యాలకుల మిశ్రమంతో టీ లా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది .

7. లవంగాలను పొడి చేసి నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది.

8. మనం ప్రతి రోజు తాగే టీ లో లవంగం వేసుకొని తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది

9. 10 లేక 12 లవంగాలను తీసుకొని వాటికి పసుపు ,చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తాగితే శరీరానికి మంచిది.

10. క్రమం తప్పకుండా ఆహారం లో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఎడమ వైపు నిద్ర పోవడం

       భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం ( జీర్ణం ) చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది . మెదటగా మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది . అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది . అందు వలన నిద్ర వస్తుంది . నిద్ర పోవడం మంచిది .

      ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను . ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు *వజ్రాసనం* వేయండి .
# రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు . కనీసం *2 గంటల* తర్వాత నిద్ర పోవాలి . మీరు వెంటనే నిద్ర పోవడం వలన *డయాబెటీస్* , *హార్ట్ ఎటాక్* వచ్చే ప్రమాదముంది .

*పడుకునే విధానం* :----
     ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి .
# దీనిని *వామ కుక్షి* అవస్దలో విశ్రమించటం అంటారు .
# మన శరీరంలో *సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి* అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది . ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది .
# మీరు అలసత్వానికి గురైయినపుడు , ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది . మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు .
*ప్రయోజనాలు ( Benefits )* :--

1 . గురక తగ్గి పోవును .
2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును .
3 . భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది .
4 . వీపు , మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందెదరు .
5 . శరీరంలో వున్న విషాలని , వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు  తోడ్పడుతుంది .
6 . తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును .
7 . కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి .
8 . జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును .
9 . గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును .
10 . గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి .
11 . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు .
12 . కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి .
13 . మెదడు చురుకుగా పని చేస్తుంది .
14 . పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది .
15 . ఆయుర్వేధం ప్రకారం *ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి* .

      ప్రతి ఒక్కరు వారి వారి పద్దతులలో నిద్రపోతారు . కావున వెంటనే మీరు మీ పద్ధతిని మార్చుకోవాలంటే చాలా కష్టం . కాని మీరు మీ ఆరోగ్యం కొరకు కొద్దిగా ప్రయత్నం చేస్తే  మార్పు చేసుకోవచ్చును .
      ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల , మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును .
*మీరు ఈ చిన్న మార్పుని చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి*

*గమనిక* : ----
   తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలి . కుదరకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి .
# ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు . చదువు కునేందుకు , ఏదైనా అభ్యాసానికి ఉత్తర దిశ మంచిది .

--- ఆయుర్వేధం . ...

గోమాత దేహం సఖల దేవతల నిలయం?


పూజాకార్యక్రమాలు, వ్రతాలు, యజ్ఞాల్లో ఆవు పాలునే ఎందుకు వాడుతారని తెలుసుకోవాలనుందా? అయితే ఈ కథనం చదవండి. గోవు సమస్త సృష్టిలోకి పవిత్రమైంది. సకల దేవతలకి గోమాత నివాస స్థలం.

ఆవుపాలంటే సమస్త దేవతలనూ మన శుభకార్యానికి ఆహ్వానించినట్లవుతుంది. అందుకే మన ఇళ్ళల్లో జరిగే ప్రతి శుభకార్యానికి, వేడుకలు, యజ్ఞాలకు దేవతలను ఆహ్వానించే రీతిలో ఆవు పాలను వాడుతారని పండితులు చెబుతున్నారు. గృహప్రవేశమే కాదు ప్రతి శుభకార్యములో గోపూజ భారత దేశములో సర్వసాధారణం ప్రత్యేకం. దానాల్లో గోదానం అతి పవిత్రమైనదంటారు.

“సర్వతీర్ద మయీం దేవి వేదదేవాత్మికాం శివం - సురబిం యజ్ఞాస్య జననీ మాతరం త్వానమామ్యాహం”- శ్లోకాన్ని బట్టి సర్వ తీర్ధములు గోమాతలోనే ఉన్నాయని, వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. గోమాత సర్వ శుభ రూపిణివి. యజ్ఞమునకు తల్లివంటి దానివని, ముప్పది మూడు కోట్ల దేవతలకు నిలయం గోమాతని, అందుచేతనే ఆవుపాలును శ్రేష్ఠమైందని పురోహితులు అంటున్నారు.

తాళపత్ర గ్రంధంలోని రహస్యాలు తెలుసా ?

మంగళ, శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకివ్వరు?
సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము. అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు  చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గానీ, ఇతరులకు గానీ ఆపదసమయాల్లో ఈ నిమయం పనికి రాదు. ఇలా చెయ్యటంవల్ల మరింత ధనం పోతుంది.

కార్తీకమాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనవి ఏవి?
ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్ది అన్నము. మినుములు, పెసలు, శెనగలు, ఉలవలు; కందులు ఇవన్నీ వాడరాదు. అష్టమి నాదు కొబ్బరీ, ఆదివారము ఉసిరీ తినరాదు.

చెవులు ఎందుకు కుట్టిస్తారు?
ఆడపిల్లలకు చెవులూ, ముక్కూ కుట్టించి చక్కని ఆభరణాలు ధరింప చేసి లక్ష్మీదేవిలా తలచుకొని మురిసిపోయే ఆ కార్యక్రమంలో మరో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. చెవులు కుట్టించుకుంటే కంటి చూపుశక్తి పెరుగుతుంది. ఆక్యుపంక్చర్ వైద్యవిధానం చెవికుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచి దని చెబుతోంది.

కుంకుడు, మామిడి, దానిమ్మ వంటి చెట్లను గృహాల్లో ఎందుకు పెంచకూడదు?
ఇలాంటి చెట్లు నీటి శాతాన్ని ఎక్కువగా పీలుస్తాయి. తద్వారా గృహావసరాలకి ఉపయోగపడే అనేక చెట్లు, నీరు సరిపోక పెరగవు. కొన్ని చెట్లు గృహయజమాని జాతకానికి సరిపోవు. అందుకే సర్వసమ్మతమైనవీ, గృహావసరాలకి ఉపయోగపడే చెట్లనే పెంచుకుంటారు. పై చెట్లు పెంచాలనుకుంటే మీ మీ జాతకాల ప్రకారం నక్షత్రాలూ ప్రకారం సరిచూసుకుని పెంచుకోండి.

గరుడ పురాణమును ఇంట్లో చదువవచ్చా? చదవకూడదా?
వ్యాసమహర్షి రచించిన 18 పురాణాలలో ఒకటి ఈ గరుడ పురాణము. నరకం గురించి, పాపాత్ముల శిక్షలను గురించి గర్తుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు శ్రీమహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఈ గరుడ పురాణంలో ఉన్నాయి. దీనిలో ప్రేతకల్పము ఉండటంవలన ఇంట్లో చదువవచ్చా, చదవకూడదా అన్న సందేహం చాల మందిలో ఉంది. ఈ పురాణం వ్యాస విరచితము. పురాణాల్లాగానే దీనిని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవ్వరికైనా ఈ పురాణం ఇవ్వాలంటే హంస ప్రతిమతో కానుకగా ఇవ్వాలి.

అలిగి అత్తగారింటికి, చెడిపోయి చెల్లెలింటికి వెళ్లకూడదని ఎందుకంటారు?
పూర్వం కొడుకుని సరయినదారిలో పెట్టకపోతే, సంవత్సరకాలం పాటు అత్తగారింటికి పంపేవారు. అంటే అప్పట్లో అది శిక్షతో సమానము. తన వారి మీద అలిగి అత్తగారింటికి వెళితే ఎవరైనా సరే తన ఆర్థిక స్వేచ్ఛను, సాంఘిక స్వేచ్ఛను, మానసిక ఆనందాన్ని కోల్పోతారు. అలాగే చెడిపోయి చేల్లెలింటికి వెళ్ళరాదు. ఆడపిల్ల పుట్టింటి నుంచి ప్రేమానురాగం, ధనమూ ఆశిస్తుంది. అటువంటి చెల్లిలి ఇంటికెళ్ళి ఆ మూడు ఆమె నుంచి ఆశించటం వల్ల చులకనవుతారు. కాని వాస్తవానికి చులకనయ్యేది మనమే కాదు, అత్తగారింటిలో ఉన్న చెల్లి కూడా!

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles