Tuesday 16 May 2017

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం - 42 ( శ్రీ హను మంతేశ్వరం)

శ్రీ రామ చంద్రుని పట్టాషేకం తర్వాత ఆంజనేయుడు రామాజ్న తీసుకొనిగం ధ మాదన పర్వతం చేరి శ్రీ రామ మంత్ర జపం లో జీవిస్తూ ,చరి తార్ధుడు అవుతున్నాడు .రామ రావణ యుద్ధం లో తాను చాలా మంది రాక్షసులను సంహరించానని ,దాని వల్ల మహా పాతకం సంక్ర మించిందని ,దాన్ని పోగొట్టు కోవా టానికి శివున్ని సందర్శించాలని కోరిక కలిగింది . ,దాని వల్లే మనశ్శాంతి లభిస్తుందని భావించాడు .సీతా రాములకు మనస్సు లోనే నమస్కారం చేసి ,వెంటనే ఆకాశ మార్గం లో కైలాసం చేరాడు .

అక్కడ నందీశ్వరుడు అడ్డు పడి హనుమా !నీ ఆలోచన మంచిదే .కాని బ్రహ్మ హత్యా పాతకం తో శివ దర్శనం దుర్లభం .పాపాలను పోగొట్టు కొని శివ దర్శనం చెయ్యి .నర్మదా నది అఘ విదారిణి .అక్కడ కొన్ని రోజు లుండి స్నానం తో పవిత్రుడవు కమ్ము .శివుని గూర్చి తపస్సు చేస్తూ ఆయన అనుగ్రహం పొందు .అని హితవు చెప్పాడు .

ఆంజనేయుడు ఆ మాటలు విని నర్మదా నది చేరి ,దాని దక్షిణ ప్రాంతం లో ఉన్నసోమ నాద దేవాలయానికి దగ్గర లో . ప్రశాంత వాతావరణం లో ఉంటూ ,స్నానం చేస్తూ శివ ధ్యానం తో తీవ్ర తపస్సు చేశాడు .ప్రాణ వాణ్ని ,పంచాక్షరిని ఏకాగ్ర చిత్తం తోజపించాడు .మనసు ను స్వాధీనం చేసుకొన్నాడు .

పార్వతీ మనోహరుడు మెచ్చి ప్రత్యక్షమయాడు .హనుమా !నీకు పాపం అన్టు తుందా ?పాపం ఎప్పుడో పోయింది .ఎప్పుడు నువ్వు పవిత్రుడవే అన్నాడు .వెంటనే మారుతి లేచి నిలబడి నమస్కరించి పార వశ్యం తో స్తుతి చేసి ప్రీతీ కల్గించాడు .శివుడు హను మతో నీకు పాపాలు లేకున్నా ,మానవులు ఇలా ఉండాలి అని మార్గం చూపించావు .నీ తప ధ్యానాలకు చాలా సంతృప్తి చెందాను .నువ్వు సర్వ దేవాత్మకుడవు .నీ నామాన్ని స్మరిస్తూ ,జపిస్తూ,నిన్నుచూస్తూ ,అందరు సర్వదా శుభాలను పొందుతారు .హనుమ ,అంజనీ సుత ,వాయు పుత్రా ,మహా బాలా ,పింగాక్ష ,లక్ష్మణ ప్రాణ దాతా ,సీతా శోక నివర్తకా అని స్తుతిస్తూ అదృశ్య మై నాడు . వాయు సూనుడు తానూ తపస్సు చేసిన చోట అన్ని కోర్కెలు తీర్చే శివ లింగాన్ని ప్రత్ష్టించాడు ..ఒక పుష్కరిణి ఏర్పాటు చేశాడు .హను మంత వనం నిర్మించాడు .దానిలో అన్ని రకాల చెట్లు ,అన్ని రకాల పూల తీగెలు ,బహువిధ ఫల ములనిచ్చే వివిధ రకాల పండ్ల చెట్లు ఏర్పరచాడు .జింకలు ,గోరు వంకలు ,చిలకలు ,నెమళ్ళు ,కోకిలలు మొదలైన పక్షి జాతు లన్ని వచ్చి చేరాయి .నందన వనాన్ని మించిన సౌందర్యం తో ఆ వనం శోభిస్తోంది .అక్కడ ప్రశాంతత రాజ్యం చేస్తుంది .తపస్సు కు మిక్కిలి అనుకూలం గా ఉంది .ప్రకృతి శోభ కళ్ళకు ఆనందాన్ని చేకూరుస్తోంది .ఇదే హను మంతేశ్వరం .ఇక్కడ శివుడిని దర్శిస్తే సకల పాప హారం సకల మనో భీష్ట సిద్ధి కలుగు తాయి అని పరాశర మహర్షి మైత్రేయ మహర్షి వివ రించి చెప్పాడు . 

Saturday 25 February 2017

స్మృతులు


మొత్తము స్మృతులు పదునెనిమిది(18).
1. మనుస్మృతి, 2. పరాశర స్మృతి, 3. వశిష్ట స్మృతి, 4. శంఖ స్మృతి, 5. లిఖిత స్మృతి, 6. అత్రిస్మృతి, 7. విష్ణు స్మృతి, 8. హరీత స్మృతి, 9. యమ స్మృతి, 10 . అంగీరస స్మృతి, 11. ఉశన స్మృతి, 12. సంవర్తన స్మృతి, 13. బృహస్పతి స్మృతి, 14. కాత్యాయన స్మృతి, 15. దక్ష స్మృతి, 16. వ్యాస స్మృతి, 17. యజ్ఞవల్క్య స్మృతి, 18. శాతాత స్మృతి. వీటన్నిటిలో మనుస్మృతి ముఖమైనది.

వేదాంతములు-ఉపనిషత్తులు:

ఉపనిషత్తులకు మరోకపేరు వేదాంతములు. ఒకప్పుడు మహారుషులు, ఋషి పుత్రులు ఒక్కచోట చేరి ఆత్మ అంటే ఏమిటి? జీవుడంటే ఎవరు? జీవేశ్వరుల సంభందం ఏమిటి? మనం ఎచ్చట నుండి వచ్సితిమి? ఎచ్చటకు పోయెదము? అను ప్రశ్నల గురించి చర్చలు జరుపగా ఫలించిన జవాబులే ఈ ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సంఖ్య 108. ఇందులో 10 ఉపనిషత్తులు మాత్రమే ఆదిశంకరాచార్యుల కాలమున సర్వాంగీకరము పొందినట్లు తెలియుచున్నది. అవి ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకము అను దశోపనిషత్తుల మీదనే ఆచార్యులవారు భాష్యములు రచించినారని తెలియుచున్నది.
శివుని వాహనం నంది గో సంతతి
నంది లేని శివాలయం లేదు
గోక్షిరం లేనిదే శివాభిషేకం కాదు

విభూతి నిర్మాణం ఆవు పేద తోనే చెయ్యాలి
విభూతి తో శివాభిషేకం ఐశ్వర్యప్రదం
విభూతి ధారణ యిచ్చు ఆయువృద్ది
గోవు నుదుట శివుడున్నాడని శాస్త్ర వాక్యం
శివుని వాహనం నంది కైలాసానికి తీసుకుపోతే
యముని వాహనం దున్నపోతు యమలోకానికి తీసుకుపోతుంది.
శివ శివ శంకర హర హర శంకర
శివ శివ శంకర హర హర శంకర
శివ శివ శంకర హర హర శంకర.
నందుడి కోసం వెలసిన శివుడు ( మహానంది క్షేత్ర వైశిష్ట్యం)
.
శివుడు భక్తసులభుడు. భక్తితో కొలిస్తే ఇట్టే ప్రత్యక్షమై కోరిన కోర్కెలు తీరుస్తాడనికదా అందరి విశ్వాసం. అలానే మహానందిలో నందీశ్వరుడికోసం అక్కడ వెలసిన మహాశివుడి వృత్తాంతం ఆ క్షేత్ర ప్రాభవాన్ని వివరిస్తుంది.
ఒకానొక కాలంలో శిలాదమహర్షి తనకు సంతానం లేదని ఎంతో ఖేదం అనుభవించేవాడు. సృష్టిస్థితిలయలకు కారణభూతుడు, ఆధారభూతుడైన కరుణాంబోధి అపార కృపావత్సలుడైన ఆ పరమేశ్వరుడు తప్ప తనను బాధనుంచి విముక్తిచేయువారెవరూ లేరని నిశ్చయించుకొన్నాడు. వెనువెంటనే పరమేశ్వరుని ఉద్దేశించి తపస్సు ఆరంభించాడు. ఎన్నోవేల సంవత్సరాలు సంతానార్థియై పరమేశ్వరుని పట్టు వదలక ధ్యానించాడు.
అట్లా తన్ను గూర్చి తపస్సు ఆచరించే శిలాదుణ్ణి చూచిన కైలాసవాసుడు కరిగిపోయి ‘‘ఏమి నీకోరిక శిలాద!’’ అని ప్రశ్నించగా నీకు తెలియంది నాకు తెలిసింది ఏముంది...స్వామీ, నిన్ను పూజించేవారు నిన్ను మెప్పించే శక్తియుతులైన వారిని నీ ప్రసాదంగా నాకు అనుగ్రహించు. వారసులు లేరనేదుఃఖాన్ని నుంచి నన్ను కాపాడుము అని వేడుకొనే శిలాదుణ్ణి చూచి శివుడు ‘నీకోరిక ఫలించుగాక’ అని అభయం ఇచ్చాడు.
శివుని అభయంతో పరిపూర్ణానందాన్ని కోరుకొంటూ ఆనందంగా కాలం గడపసాగాడు శిలాదమహర్షి. కొన్నాళ్లకు కాలం కరుణించి శివుని వరాన్ని శిలాదుడు అందుకొన్నాడు. తన సంతానంగా పర్వతుడు, నందుడు అనే కుమారులను పొందాడు. వారు దినదినాభివృద్ధి చెందుతున్నప్పుడే శివభక్తిని వారిలో శిలాదుడు నాటించాడు.
నందుడికి ఎల్లప్పుడు శివుని ఎదురుగా ఉండాలన్న అభిలాష కలిగింది. తన తండ్రికి తన కోరికను తెలిపాడు. తండ్రి అనుమతితో శివుని గూర్చి తపస్సు ఆరంభించి ఏన్నో వేల యేండ్లు ఆ తపస్సులోనే మునిగిపోయాడు. ఆ నందుని కఠిన తపస్సుకు అచంచల భక్తివిశ్వాసాలకు మెచ్చుకున్న పార్వతీ ప్రియుడు నందుని ఎదుటకు వచ్చి కోరిక ఏమిటో తెలుపమని అడిగాడు.
రూపు కట్టిన ఆనందమే తన ఎదుట పడగా ‘స్వామీ ఎల్లప్పుడూ ఈ ఆనందమూర్తిని నేను కాంచాలన్న కోరిక మెండుగా ఉన్నది. పైగా నీ పాద ద్వయాన్ని నేను మోసే భాగ్యాన్ని నాకు కల్పించండి ’ అని నందుడు శివుని ముందు మోకరిల్లాడు. శివుడు ‘‘ఓ నందా! నీవే నా వాహనమవుదువుగాక! అంతేగాక నీవు చేసిన ఈ ఘోర తపస్సును పలుకాలాలు జనం అంతా గుర్తుపెట్టుకొనేట్లుగా ఈ తపోభూమిలోనే నేను ఆర్చామూర్తినై వెలుస్తాను. ’’ అని శివుడు అనుగ్రహించాడు.
అది విన్న నంది మహోత్సాహంతో తన తండ్రికి ఈ విషయాన్ని తెలియచేశాడు. అట్లా ఏర్పడిన స్థలమే నేడు మహానందిక్షేత్రంగా భాసిల్లుతోంది. స్వామి నిలిచిన ఆలయానికి శివగణాల్లో ఒకరైన రససిద్ధుడనే యోగిపుంగవుడు విమానగోపురాన్ని కూడా నిర్మించి ఇచ్చాడట. ఆ ఆర్చామూర్తిగా వెలసిన పరమశివుడే మహానందీశ్వరునిగా వెలుగులీనుతున్నాడు. ఇదంతా కృతయుగంనాటి సంగతి.
ఈ కలియుగంలోనూ నంది మండలాన్ని నందన రాజు అనే ఒక పురుషోత్తముడు పాలించేవాడు. ఆ రాజుకు చెందిన ఆవులల్లో ఓ ఆవు రోజు పాలివ్వకుండా ఉంటోందని ఆ ఆవును కాచే గోపకుడు గ్రహించాడు. ఎందుకీ గోవు పాలివ్వడం లేదో నని ఆ ఆవువెంటే తాను జాగ్రత్తగా తిరిగాడోరోజు. ఆ గోవు ఇంటినుంచి వెడలిన వెంటనే చక్కగా వెళ్లి వెళ్లి ఓ పుట్టదగ్గర నుంచుని ఆ పుట్టలోపలికి ధారాపాతంగా తన పొదుగునుంచి పాలను విడుస్తోంది. ఈ సంగతి చూసిన గోపకుడు ఆశ్చర్యానందాలకు లోనయి వెనుతిరిగి ఈ సంగతిని నందన మహారాజుకు ఎరుకపర్చాడు. ఆ రాజు కూడా ఆనందోత్సాహంతో ఆ వింతమేమిటో అక్కడే మహాత్ముడున్నాడో నన్న ఆతురతతో గోపబాలకుని వెంట వెళ్లాడు. వీరంతా వచ్చిన అలకిడి కి గోపు తత్తరపాటుతో పుట్టపై కాలు కదిపి బెదరుతూ పక్కకు వెళ్లిపోయింది. దీనితో రాజు మనసున కలత చెంది తాను తప్పు చేశానని వెనుతిరిగాడు. ఆ రాత్రి మహాశివుడు నందన మహారాజు కలలో కనపడి తాను ఆ పుట్టలోనే ఉన్నానని తనకు అనువైన మందిరాన్ని నిర్మించమని, అర్చనాదికాలు జరిపించమని ఆదేశించాడు. దిగ్గున లేచిన నందనుడు తనకు పట్టిన అదృష్టయోగాన్ని పలుమార్లు స్మరించుకొని తన వారితో ఈ విషయాన్నంతా చెప్పాడు. వారంతా సంతోషిస్తూ ఆ పుట్ట చెంతకు వెళ్లి అక్కడ వెలసిన స్వామివారిని దర్శించుకొని ఆనందించారు. శివాజ్ఞమేరకు నందన రాజు అక్కడ శివాలయాన్ని నిర్మించాడు. అప్పటినుంచి ఆ పుట్టరూపంలోని మహా నందీశ్వరునిగా పేరుగాంచిన పరమేశ్వరునికి అర్చనాదికాలు జరుపుతూనే ఉన్నారు. నేడు కూడా మహానంది క్షేత్రంలో నందీశ్వరుణ్ణి వివిధోపచారాలతోశివభక్తులు సేవిస్తారు.

శివునికి ప్రత్యేకించి శివలింగంగా పూజించడంలో ప్రత్యేకత ఏమిటి?


------------------------------------------------------------------

దీని గురించి శివ పురాణాదులలో, శైవాగమాలలో వివరణ ఉంది. వాటిని మాత్రమే గ్రహించాలి. కొన్ని శివేతర గ్రంథాలలో జొప్పించిన కల్పనలను గ్రహించి, హైందవ ద్వేషులు వాటిని ప్రచారం చేయడం శోచనీయం. అలాంటి అవాకులూ, చెవాకులు వల్ల విదేశీ కుతూహలశీలురు శివలింగం గురించి నీచాభిప్రాయాలని వెలిబుచ్చారు కూడా. కానీ ఆ రోజుల్లో స్వామీ వివేకానంద దానికి గట్టి సమాధానమిచ్చారు. యఙ్ఞంలో యూపస్తంభమే శివ లింగంగా భావించవచ్చు... అని చెప్పడం వారి సమాధానాలలో ఒకటి. మన శాస్త్రాల ప్రకారం శివలింగ తత్త్వమేమిటో శోధిస్తే ఆశ్చర్యకరమైన మహా విఙ్ఞానాంశాలు గోచరిస్తున్నాయి.

లీనం చేసుకునేదే లింగం: చరాచర జగతి ఎవరియందు కలిగి, పెరిగి, తిరిగి లీనమవుతుందో అదే లింగం. ఆ లీనం వల్లనే సృష్టికి శక్తి, ఉనికి, మనుగడ లభిస్తున్నాయి.

ఆ ఈశ్వరుడు ఆకారాది రహితునిగా భావిస్తూ, ఒక సంకేతంగా గ్రహిస్తే.. ఆద్యంతరహితమైన జ్యోతి స్వరూపానికి ప్రతీకయే లింగం. అందుకే జ్యోతిర్లింగం అన్నారు.

మనలోని ఐదు ఙ్ఞానేంద్రియాలూ, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు, జీవుడు.. వెరసి పన్నెండు స్థానాలలో ఒకే ఈశ్వర చైతన్యం ఉన్నది. ఆ ఈశ్వర జ్యోతియే ఆ పన్నెండు చోట్ల ఉన్నదనే ఎరుకయే .. పన్నెండు జ్యోతిర్లింగాలను మనలో దర్శించడం. అప్పుడు మన అణువణువూ శివమయమనే భావన నిలచి `శివోహ ' మనే సత్యాన్ని స్థిర పరచుకోగలం.

యోగపరంగా..దేహంలోని మూలాధారం నుండి, సహస్రారం వరకు ఉన్న సుషుమ్నా నాడిలోని శక్తి ప్రవాహం ఒక కాంతిమయ స్తంభంగా దర్శిస్తే అదే అగ్నిమయమైన శివలింగంగా గ్రహించగలం. ఇదే శ్రీ చక్రంలోని బిందు స్థానం. ఈ బిందువునే పైకి లాగినట్లు ఒక నిలువు గీత (స్తంభాకృతి)గా సాగుతుంది. అదే శివుడు ప్రథమంగా అగ్నిస్తంభాకృతి కలిగిన లింగంగా వ్యక్తమయ్యాడనే పురాణ కథలోని దర్శనం.

ఒక దీపజ్యోతిని వెలిగించితే, అది అన్ని దిక్కుల కాంతిని ప్రసరిస్తున్న లింగాకృతిగానే దర్శనమిస్తుంది. అదే ఆకారాతీతమైన చైతన్య జ్యోతిర్లింగం.


`లోకం లింగాత్మకం ఙ్ఞాత్వా అర్చయేత్ శివలింగకం' అని ఆగమం చెప్పింది. లోకమంతా లింగాత్మకమని తెలిసి శివలింగారాధన చేయాలి ' అని తాత్పర్యం. లింగ గర్భం జగత్సర్వం.. జగమంతా లింగంలోనే ఉంది. 


విచిత్రమేమిటంటే..కొద్ది ఏళ్ళ క్రితం విదేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ సమస్త విశ్వానికి సంబంధించి ఉపగ్రహాల సహాయంతో గ్రహించిన విఙ్ఞానాన్ని అనుసరించి ఒక చిత్రాన్ని ఆవిష్కరించారు. అద్భుతం..అది మన వేద విఙ్ఞానం వర్ణించినట్లు ఒక గోళా(అండా)కృతిలో ఉన్న కాంతిపుంజ మధ్యంలో సమస్త గ్రహ నక్షత్రాదులన్నీ ఇమిడి ఉన్నాయి. ఈ దృశ్యాన్ని యుగాల క్రితం తపశ్శక్తితో గ్రహించి, లింగాకృతిని సంభావించి, విశ్వచైతన్య శక్తితో వ్యక్తి చైతన్యాన్ని అనుసంధానించే ప్రక్రియను లింగార్చనగా, లింగ ధ్యానంగా ఆవిష్కరించిన మన మహర్షుల పాదాలకు నమోవాకాలు.

శివలింగం యొక్క నిజమైన అంతరార్దం :

నిర్గుణ పరతత్వ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒకటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు. ఈ సత్య విషయాలను తెలియజెప్పే తత్వస్వరూపమే "లింగం"

లింగాభిషేకములో పరమార్ధం :

పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం - భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనాలతో దైవాభిషేకం చేయాలి. జలధారాపాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం, లింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం.

ఓం నమో పరమాత్మయే నమః

శ్రీశైలం జలాశయం నుండి బయటపడ్డ సంగమేశ్వర ఆలయం!





*1980 వ సంవత్సరములో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ దశలో మునిగిన సప్త నదుల సంగమేశ్వర ఆలయం...
* 23 సంవత్సరముల తరువాత శ్రీశైల జలాశయంలో నీటి ప్రవాహం తగ్గటం వలన
: 2003 లో మొట్ట మొదటి సారిగా ఆలయంలో మహ శివరాత్రి పూజలు నిర్వహించారు..
: 2004 లో మహశివరాత్రి కి రెండవ సారి ఆలయం బయటపడినది
: 2005 సంవత్సరంలలో మూడవ సారి  మహశివరాత్రి కి సంగమేశ్వర ఆలయం బయటపడి  పరమేశ్వరుడి దర్శనభాగ్యం భక్తులకు కలిగినది...
: అలాగే 2011 న మహశివరాత్రి కి నాల్గవసారి బయటపడడం జరిగినది
: 2015 న మహశివరాత్రి కి ఐదవ సారి బయటపడడం జరిగినది
: 2016 న ఆరవ సారి మహాశివరాత్రి కి సంగమేశ్వర ఆలయం బయట పడడం వలన పరమేశ్వరుడి దర్శనభాగ్యం కలిగినది..
: 2016 ఆగష్టు 6 న ఆలయం నదిలో మునగడం...
: 2017 లో ఆలయం మహశివరాత్రి కి బయట పడడం ఏడవ సారి
 ఫిబ్రవరి 17 న శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీటిమట్టం తగ్గడంతో ఆలయంలో తోలి పూజలు నిర్వహించారు,
6 నెలల11 రోజులు నీటిలో మునగడం జరిగినది
: 191 రోజుల తరువాత సంగమేశ్వర ఆలయం మహాశివరాత్రి కి బయటపడడం విశేషంగా భావిస్తున్నారు...!

Thursday 23 February 2017

వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం???

#swetharkaganapathi
ఓం గం గణపతయే నమః’ ” వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైనది మనం మనస్సును పెట్టి స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం.మనం ఎంత పెద్ద విగ్రహం ప్రతిష్టించాము, ఎంత ఆర్భాటాలు చేశామన్నది ముఖ్యం కాదు.మనం ఎంత సేపు స్వామి మీద ధ్యాస పెట్టి నిలకడగా కూర్చున్నామన్నదే ముఖ్యం.
కూర్చుని ఏమి చేయాలి?స్వామికి సంబంధించిన ఒక శ్లోకం, మంత్రం(ఓం వినాయకాయ నమః లాంటి మంత్రాలు ఉంటాయి కదా)కాని లేదా అష్టొత్తరం కాని చదవండి.ఏది రానివారు”ఓం ” అని జపించండి. కేవలం చదవడమే కాదు, చదువుతున్నప్పుడు మనస్సు మొత్తం స్వామి మీద లగ్నం చేయండి. వేరే ఏ పని చేయకండి. మీకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి నైవేధ్యం పెట్టి స్వీకరించండి. చిన్న బెల్లం ముక్క పెట్టినా ఫర్వాలేదు.
ఇలా మీరు చేసి చూడండి. ఒక సంవత్సరకాలంలో మీలో అద్భుతమైన మార్పు కనపడుతుంది. మీరు కనుక రోజు క్రమం తప్పకుండా స్నానం చేసిన తరువాత పైన చెప్పిన విధంగా చేయగలిగితే చాలు మీరే గమనిస్తారు మీలో కలిగిన మార్పు. మీరు నమ్మనంతగా మారతారు. చేసే ప్రతి పని మీద మనసు లగ్నం చేయగలుగుతారు. విద్యార్థులు చదువు మీద ఎప్పుడు లేనంతగా శ్రద్ధ పెడతారు. ఉద్యోగులకు పనిభారం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఏదైన విషయం వినగానే గుర్తుపెట్టుకొనే శక్తి గణపతి ప్రసాదిస్తాడు.
వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం. ఎందుకంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు. అందుకే పూజలో స్వామిని ఉద్దేశించి “స్థిరొ భవ,వరదొ భవ, సుప్రసన్నొ భవ, స్థిరాసనం కురు” అని చదువుతారు. అందుకే గజాననుని ముందు, రోజు కూర్చునే ప్రయత్నం చేయండి. అద్భుతమైన విద్యాబుద్ధులను, జ్ఞానాన్ని పొందండి. మీరు ఎంత పెద్ద విగ్రహం పెట్టి పూజించమన్నది ముఖ్యం కాదు.స్వామి ముందు ఎంతసేపు కూర్చున్నామన్నది ముఖ్యం.
అందరూ రోజు కాసేపు గణపతికి కేటాయించండి. మీలో కలిగే మార్పులను గమనించండి. జీవితంలో అతి త్వరగా పైకి ఎదగండి. దీని అర్దం విద్యార్ధులు చదవడం మానివేసి, మిగితావారు తమ రోజు వారి కార్యక్రమాలు మానివేసి గణపతి ముందు కూర్చొమని మాత్రం కాదు. మీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, ప్రతి విషయం త్వరగా అర్దం అవ్వడానికి ఇది బాగా ఉపకరిస్తుంది కనుక గణపతి ఆరాధనను మీ నిత్యజీవితంలో భాగం చేసుకొండి. ఆసనం(చాప వంటివి)వేసుకోవడం మరవకండి. న్యూస్ పేపర్లు, కాగితాలు లాంటివి ఆసనంగా వేసుకోకూడదు. పిలిస్తే పలికే దైవం గణనాధుడు.
ఓం గం గణపతయే నమః

Wednesday 22 February 2017

* పుత్ర సంతానం కోసం “పుత్ర గణపతి వ్రతం”



పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు . మంచి సంతానం కోసం, సంతానం లేని వల్లూ సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలూ చెబుతున్నాయి.

చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వాళ్ళ సంతానం కలుగుతుంది అని నమ్మకం.

పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ఫాల్గుణ శుద్ధ చవితి ప్రత్యేకతగ కనిపిస్తూ వుంటుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. పుత్ర సంతానం కావాలనుకునే వాళ్లు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ‘పుత్రగణపతి వ్రతం’ ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

వారసుడు కావాలనే కోరిక … తమ తరువాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికిగాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ వుంటుంది. ఈ విషయంగా ఎక్కువకాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు, పుత్ర గణపతి వ్రతం జరుపుతుంటారు. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి … గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది .. గుమ్మానికి తోరణాలుకట్టి .. పూజామందిరాన్ని అలంకరించాలి.

ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను … పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.

పూర్వం మహారాజులు … చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్లంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించేవాళ్లు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్లు పుత్ర సంతానం కోసం ఆరాటపడే వాళ్లు. ఇందుకోసం వాళ్లు ‘ఫాల్గుణ శుద్ధ చవితి’ రోజున ‘పుత్ర గణపతి’ వ్రతాన్ని ఆచరించే వాళ్లు.

అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.

ఇక రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా … రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా ‘పుత్రగణపతి వ్రతం’ మాత్రం నాటి నుంచి నేటి వరకూ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి, పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశస్థాపన చేసి … శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.

ఇంచుమించు వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి. బుద్ధిమంతుడు … జ్ఞానవంతుడు … ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతికాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు.

ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకితభావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

Tuesday 31 January 2017

కృష్ణాష్టకం

కృష్ణాష్టకం ప్రతిరోజూ పఠించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆర్థిక వృద్ధి, వ్యాపార వృద్ధి  చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు.

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || 1 ||
ఆతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్ |
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ || 2 ||
కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననమ్ |
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్ || 3 ||
మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ || 4 ||
ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ || 5 ||

రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితమ్ |
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్ || 6 ||
గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసమ్ |
శ్రీ నికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ || 7 ||
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్ |
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ || 8 ||
కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి

నమకం విశిష్టత


నమకం, చమకం 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని "అనువాకం" అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయిదాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.
అనువాకం – 1:
తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.
అనువాకం – 2 :
ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.
అనువాకం – 3:
ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారనంకు కూడా చదువుతారు.
అనువాకం – 4:
ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:
అనువాకం – 5:
ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా - సృషి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.
అనువాకం – 6:
ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.
ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షనకు కూడా చదువుతారు.
అనువాకం – 7:
నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న ర్ద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.
అనువాకం – 8:
ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.
అనువాకం –9:
ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ స్కక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.
అనువాకం – 10:
ఈ అనువాకంలో మల్ల రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపసమించి, పినాకధారియైనా, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.
అనువాకం – 11:
ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్తి దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.

సూర్య కవచ స్తోత్రము

సూర్య కవచ స్తోత్రము (Suryakavacha Stotram)

ఘృణి: పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకమ్
ఆదిత్య లోచనే పాతు శృతీ పాతు దివాకరః
ఘ్రాణం పాతు సదా భాను: ముఖంపాతు సదారవి:
జిహ్వాం పాతు జగన్నేత్రం: కంఠంపాతు విభావసు:
స్కంధౌ గ్రహపతి భుజౌపాతు ప్రభాకరః
కరావబ్జకరః పాతు హృదయం పాతు భానుమాన్
ద్వాదశాత్మా కటింపాతు సవితాపాతు సక్ధినీ
ఊరు: పాతు సురశ్రేష్టో జానునీ పాతు భాస్కరః
జంఘేమేపాతు మార్తాండో గుల్భౌపాతు త్విషాంపతి:
పాదౌ దినమణి: పాతు మిత్రో ఖిలం వపు:
ఫలశృతి
ఆదిత్య కవచం పుణ్యం మభేద్యం వజ్రం సన్నిభం
సర్వరోగ భయాదిత్యో ముచ్యతే నాత్ర సంశయం:
సంవత్సర ముపాసిత్వా సామ్రాజ్య పదవీం లభేతే

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles