Showing posts with label క్షేత్ర మహత్యం. Show all posts
Showing posts with label క్షేత్ర మహత్యం. Show all posts

Saturday 14 January 2017

పాలకుర్తి

రోజుకో దేవాలయం: శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి వారి దేవాలయం, పాలకుర్తి, జనగామ జిల్లా.

పాలకుర్తి, తెలంగాణ రాష్ట్రములోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం నుండి 50 కిలోమీటర్ల దూరం లో , వరంగల్ - హైదరాబాద్ రహదారిపై స్టేషను ఘనపురం నుండి 23 కి.మీ.దూరం లో ఉన్నది. ఊరికి దగ్గరలో ఉన్న చిన్న కొండపై సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉన్నది. ప్రముఖ శైవ క్షేత్రం. శివారాధకులకు,వీరశైవులకు దర్శనీయ క్షేత్రం. ప్రాచీన కాలానికి చెందిన సోమేశ్వరాలయం, లక్ష్మీనర్సింహాలయాలు ఉన్నాయి.శివ కేశవులిద్దరూ పక్కపక్కనే ఉన్న రెండు పర్వత గుహల్లో సహజసిద్ధంగా వెలిశారు.ఈ రెండు గుహలను కలుపుతూ ప్రకృతిసిద్ధంగా ఏర్పడ్డ ప్రదక్షిణా మార్గం ఉన్నది.ప్రతియేటా మహాశివరాత్రి నుండి అయిదు రోజులపాటు ఇక్కడ పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.యాత్రికుల వసతికి గదులు,మంచినీటి సౌకయం ఉన్నది. ప్రముఖ కవి పాల్కురికి సోమనాథుడు పుట్టిన ఊరు. సోమనాథుడు క్రీ.శ. 1190 లో విష్ణురామిదేవుడు శ్రియాదేవి దంపతులకు జన్మించాడు.సోమేశ్వరుని భక్తుడై ఆ స్వామిమీద సోమనాథ స్తవం రాశాడు. జాను తెలుగు కవిత్వానికి,ద్విపద ఛందస్సుకు ప్రాచుర్యాన్ని చేకూర్చాడు. వీర శైవ మతావలంబకుడు. తెలుగు, కన్నడ భాషలలో రచనలు చేశాడు. తెలుగులో ఆనాటి సాంప్రదాయానికి భిన్నంగా దేశి భాషలో ఆయన రచనలు చేసారు..వరంగల్లు జిల్లా పాలకుర్తి శివకేశవులు ఇరువురు స్వయంభువు లుగా ఒకే కొండపై  వెలసిన దివ్యక్షేత్రం. దట్టమైన చెట్ల మధ్య కొండ పై భాగాన రెండు గుహలు. ఒక గుహలో సోమేశ్వరుడు, ప్రక్కనే వేరొక గుహలో లక్ష్మీనరసింహుడు కొలువు తీరి  కొలిచిన భక్తులకు కొంగు బంగారమై నీరాజనాలందుకుంటున్నారు.     క్షేత్ర మహత్మ్యం :---ఈ కొండరాళ్లకు ,చెట్లకొమ్మలకు పదుల కొద్ది తేనెపట్టు లుంటాయి. శుభ్రత పాటించకుండా ఆలయానికి కొస్తే తేనెటీగలు శిక్షణ భటులుగా వారిని వెంబడించి స్నానంచేసేవరకు వారిని వదలవట. స్వామికి మొక్కులు మొక్కి, ఆపదలు తీరిన తరువాత మర్చిపోతే స్వామి వారికి వెంటనే గుర్తు చేస్తుంటారట శ్రీ సోమేశ్మవర స్వామి వారి దివ్యరూపం
     
                       ఎత్తైన కొండ రెండు గా చీలి, ప్రదక్షిణ మార్గానికి దారి ఏర్పడటం చూపరులకు ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.ఒక భక్తురాలి కోరిక మేరకు కొండ రెండుగా చీలి ప్రదక్షిణ మార్ ఏర్పడినట్లు భక్తులు చెప్పుకుంటారు. అది సహజసిద్ధంగా ఏర్పడినా ఒక సహజ ప్రకృతి రమణీయ ప్రదేశంగా గుర్తించ దగ్గది.  కొండపై నున్న  శిఖరదర్శనం చేసుకోవడానికి పెద్దపెద్ద రాళ్ళ మథ్యనుండి పైకి మెట్ల మార్గం ఉంది.
గండదీపం. :--  ఇక్కడే గండదీపం మిద్దె ఉంటుంది. ఈ మార్గం ద్వారా భక్తులు పైకి వచ్చి గండదీపం వెలిగించి  తమ మొక్కులను తీర్చుకుంటారు. కొంచె బరువైన శరీరం కలిగిన వాళ్ళు, చీకటికి భయపడేవారు, ఆథునికంగా నిర్మించిన వేరే మెట్ల దారి ద్వారా పైకి చేరుకొని గండదీపం వెలిగించుకుంటారు.
   క్షేత్ర ప్రాథాన్యం :- ఈ మెట్ల మార్గం శ్రీ స్వామి రెండు గుహలకు  కొంచెం దక్షిణంగా ఉంటుంది. ఈ మెట్ల మార్గానికి ఆనుకొని కొండ లోపలికి క సొరంగ మార్గం ఉంది. దీనిని నేలబొయ్యారం ని పిలుస్తారు. ఇప్పుడు దీనిని మూసివేశారు. చిత్రంలో చూడవచ్చు. ఇది జన సంచారం పెరిగే మొన్న మొన్నటి కాలం వరకు మహర్షులు తపస్సుకు, యజ్ఞ యాగాదులకు ఎంచుకున్న ఏకాంత పుణ్య రహస్య స్థలంగా భావించబడుతోంది.  ఇప్పటికీ ఈ కొండలో నుండి రాత్రి వేళల్లో ఓంకారం వినిపించడం, శివలింగానికి నాగుపాము ప్రదక్షిణలు జరపడం విశేషంగా భక్తులు చెపుతుంటారు.
   చాలాకాలం క్రితం  నేలబొయ్యారం లోని విశేషం తెలుసుకుందామని భావించిన అర్చకులు, కొందరు గ్రామ పెద్దలు కలిసి సొరంగం లోకి కొంతదూరం ప్రయాణం చేసి, ఇరుకైన, గాలి రాని, గబ్బిలాల వాసనతో నిండిన దారిలో ముందుకు సాగ లేక వెనక్కి వచ్చేశారని స్థలపురాణం చెపుతోంది.                                                                                                                                             ఈ గుహకు ప్రక్కనుంచి  పై నున్న  వీరాంజనేయస్వామి  ఆలయానికి మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు కూడ నిలువుగా పెద్ద కొండ రాళ్ళమథ్య నుంచి సాగిపోతాయి. ఈ ఆంజనేయుని దర్శనానికి వేకువజామునే సుదూర ప్రాంతాలనుండిభక్తులు వచ్చి ఉప్పురాశి గా పోసి ,దాని పై  ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించి, ప్రదక్షిణలు చేస్తారు.   ఎటువంటి భూత , ప్రేత,పిశాచాది బాధలున్నా తొలగిపోతాయని, సంతానం లేనివారు సంతానం పొందుతారని  భక్తుల నమ్మకం.
రెండుగా చీలి ప్రదక్షిణ మార్గాన్నిచ్చిన కొండ
పాలేరు>పాలకురికి>పాలకుర్తి   :--. వేల సంవత్సరాల చరిత్ర గల  ఈ కొండ గుహల నుండి పాల లాంటి నీరు ప్రవహించేదట. ఆ నీరు చెరువులో కలసి పాలేరు గా ప్రవహించి, గోదావరి లో కలుస్తుంది.  అందువలన  పాలేరు కు జన్మనిచ్చిన ఈ మహాక్షేత్రమే పాలకుర్తి గా ప్రసిద్ధిపొందింది. పాలకురికి గ్రామమే క్రమంగా పాలకుర్తి అయ్యింది. దీనినే పండితులు” క్షీరగిరి “అని కూడ పిలుస్తారు.
శ్రీ సోమేశ్వర, లక్ష్మీనరసింహ దర్శనం.:---    ఎత్తైన కొండ మీద రెండు ద్వారాలు గల ఒకే గుహలో దక్షిణంగా సోమేశ్వర స్వామి, దానిలో నుండి  స్వామికి ఎడమవైపుకు ఉన్న మార్గం ద్వారా నరసింహుని గుహలోనికి దారి ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తరస్థానం లో కూర్చొని సోమేశ్వరుని చూస్తున్నట్లుగా ఉంటుంది.
  శ్రీ సోమేశ్వరుడు గుహలోపలికి ఎత్తైన తిన్నె పై స్వచ్ఛధవళ కాంతులనీనుతూ సుమారు అడుగున్నర ప్రమాణం లో పానమట్టం పై వెలసి, భక్తులకు దర్శన మిస్తున్నాడు.ఆర్జితసేవ లో భక్తులకు స్వయంగా స్వామికి అభిషేకం చేసే అవకాశం ఉంది.
శ్రీ నరసింహుడు లక్ష్మీ సమేతుడై  ఎత్తైన తిన్నెపై సుమారు మూడడుగుల విగ్రహం లో కొలువు తీరి చిరునవ్వులు చిందిస్తుంటాడు. ఆర్తత్రాణ పరాయణుడు ఆశ్రిత జనరక్షకుడు నై భక్తమందారుడు గా భక్త జనుల పూజలనందుకుంటున్నాడు. మానసిక రోగాలు,శారీరక బాథలు శ్రీ స్వామిని దర్శిస్తే నశిస్తాయని భక్తులనమ్మకం.  అందుకేనేమో.! స్వామిని దర్శించిన ప్రతి భక్తుని,అర్చకులవారు,  స్వామి పాదాల చెంత నున్న చిన్న బెత్తాన్ని తీసుకొని, భక్తుని వీపు పై నెమ్మదిగా తాటించడం ఈ ఆలయం లో కన్పిస్తుంది.
     ఈ ఆలయానికి ముఖమండపము, లోపలికి వెడితే గుహ లో తిన్నెపై స్వామి దర్శనము తప్పితే అంత్రాలయము ,గర్భాలయము వంటివి వేరు గా కన్పించవు. ఆ స్వామి దర్శనమే భక్తులకు పరమానందాన్ని కల్గిస్తోంది.
                          ఈ పుణ్యభూమి లోనే 12 వ శతాబ్దానికి  చెందిన వీరశైవ కావ్య నిర్మాణ థౌరేయుడు, బసవ పురాణ కావ్యకర్త,  మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు జన్మించాడు. శ్రీ విష్ణురామిదేవుడు, శ్రియా దేవమ్మ దంపతులకు  శ్రీ సోమేశ్వర స్వామి వరప్రసాదం గా ఆమహానుభావుడు జన్మించాడు. అందుకే తల్లిదండ్రులు ఆయనకు  సోమనాథుడని పేరు పెట్టుకున్నారు. శ్రీ సోమనాథుడు ఈ సోమేశ్వరుని  స్తుతిస్తూ “సోమనాథుని స్వవాలు” వ్రాశాడని చెపుతారు.             అనుభవసారము,బసవపురాణము,పండితారాథ్యచరిత్ర, చతుర్వేద సారము  మొదలైన అనేక గ్రంథాలను, ఎన్నో లఘుకృతులను సోమనాథుడు రచించాడు. ఈ గ్రామం లో సోమనాథుని స్మృతి చిహ్నం గా నిర్మించిన శివాలయం ఉంది.               శ్రీ  ఆంథ్ర  మహాభాగవత మందార మకరందాన్ని తెలుగు వారి కందించిన భక్తకవి పోతన నివాస గ్రామం బమ్మెర ఈ పాలకురికి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సహజ పండితుడైన పోతనామాత్యుడు  ఈ సోమేశ్వరుని, లక్ష్మీ నర సింహు ని దర్శనానికి వచ్చి వెడుతుండే వాడనడానికి గ్రంథాల్లో  ఆథారాలున్నాయని స్థలపురాణం లో వ్రాశారు.
            వాల్మీకి మహర్షి  కూడ పాలకుర్తి కి ఐదు కిలోమీటర్ల దూరం లోగల వల్మిడి(వాల్మీకి పురం) లో గల కొండల్లో నివసించే వాడని ప్రతీతి.
              ఇక్కడికొచ్చే భక్తులు మెట్టు మెట్టుకు పూజలు చేస్తారు. కొబ్బరికాయలు కొట్టడం, గండదీపాలు వెలిగించడం, అన్నదానం, తలనీలాలుసమర్పించడం,కోడెలను కట్టివేయడం వంటి మొక్కులు తీర్చుకుంటారు. పెళ్లి కాని వారు మొక్కుకొని పెళ్లయిన తర్వాత స్వామి వారి కళ్యాణం చేయిస్తారు. స్వామివారికి పల్లకీ సేవ ప్రత్యేకం.
         సంతానం లేని వారు మొదట కొబ్బరి కాయలు కడతారు. సంతానం కలిగాక తొట్టెలు కట్టి డోలారోహణ చేస్తారు. తొట్టెలు కడితే బంగారు,వెండి, కర్ర ఇల్లు చేయించి  శ్రీ స్వామి వారికి సమర్పిస్తారు.అనారోగ్యం తో బాధపడేవారు  అవయవాలను వెండితో చేయించి  తెచ్చి సమర్పించడం  కూడ ఈ ఆలయం లో కన్పిస్తుంది.

ఉత్సవాలు : --- మహాశివరాత్రి కి శ్రీ సోమేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి,జాతర కు  రాష్ట్రం నలుమూలలనుండే కాక కర్నాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలనుండి కూడ లక్షలాది గా భక్తులు  తరలివస్తారు.ఉత్సవాలలో భాగం గా యజ్ఞ యాగాదులతో పాటు,  దివ్యరథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.కొండచుట్టు ప్రభలు కట్టిన ఎడ్లబండ్లు పరుగులు తీస్తాయి. చివరి రోజున అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది.
                శ్రావణ మాసం లో శత చండీ హవనం, రుద్రహవనం,లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనలు జరుగుతాయి. కార్తీక దీపోత్సవం, మార్గశిర మాసం లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మార్గళి ప్రాత: కాలార్చనలు,నైవేద్యాలు, ప్రసాదవినియోగం ఉంటాయి. శ్రీ సోమనాథ మహాకవి శివైక్యం పొందిన    ఫాల్గుణ మాసం లో ప్రత్యేక ఉత్సవాలుంటాయి. ప్రతి మాస శివరాత్రికి  శ్రీ  స్వామివారి కళ్యాణం నిర్వహించ  బడుతుంది.
         శివ కేశవ అభేదానికి ప్రతీకగా కన్పించే ఈ ఆలయం లో  శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయం లో శైవాచార్యులే (శివారాథకులు) అర్చకులు గా ఉండటం నిజంగా అభినందించ దగ్గ విషయం.
         జిల్లా కేంద్రమైన జనగామ కు 10 కి .మీ. దూరం లో ఈ పాలకుర్తి పుణ్యక్షేత్రం ఉంది.   కొండపైకి చక్కని ఘాటురోడ్డు సౌకర్యం ఉంది. యాత్రీకులకు కనీస వసతులు ఉన్నాయి. హైద్రాబాద్ , హన్మకొండ. వరంగల్, ష్టేషన్ ఘనాపూర్, జనగామ, తొర్రూరుల నుండి రవాణా సౌకర్యాలున్నాయి.
                      ఒక్కసారైనా తప్పక చూడవలసిన ప్రాచీన దివ్యక్షేత్రం పాలకుర్తి.

యాదగిరిగుట్ట/యాదాద్రి

ఈరోజు రోజుకో దేవాలయం ఆర్టికల్
యాదగిరిగుట్ట/యాదాద్రి

శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయము యాదాద్రి జిల్లలోని యాదగిరిగుట్ట మండలములో మండల కేంద్రము సమీపములో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయము. ఇది తెలంగాణ లోని ప్రముఖ ఆలయాలలో ఒకటి.

స్థల పురాణం:
ఆలయ ముఖ ద్వారం:
ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరి భక్తుడు. ఈయన ఆంజనేయస్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదుగానీ, ఆయన ఎపరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆయన పనుపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్ధించి, భక్తులకు ఏవిధమైన బాధలూ కలుగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే వుండిపొమ్మని కోరగా ఆ సుదర్శనము అనతికాలములోనే అక్కడ వెలయబోవుచున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ వుంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడుట.

తర్వాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించాడు. ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండక్రిందవున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా వున్నాడు.
ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కథ. ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదుట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై వుండమని కోరాడుట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై వుండటం లోక విరుధ్ధమని అక్కడికి సమీపంలో వున్న యాదగిరిలో ల క్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్ధం కొలువు తీరుతానని బయల్దేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయనవెంట ప్రహ్లాదుడూ, సకల దేవతలూ వచ్చి ఆయనతోపాటు ఇక్కడ కొలువుతీరి స్వామిని సేవిస్తూ వచ్చారుట.

రాక్షస సంహారంచేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడుట. ఆ ఆకాశ గంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం వుంది. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృ దేవతలు తరిస్తారు.

చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానంచేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.
మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ ముఖద్వారం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం

యాదాద్రి జిల్లాలొ ప్రముఖ మైన దివ్య క్షేత్రం: యాదగిరి గుట్టకు సంబందించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో వున్నది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడ అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి “ఏంకావాలో కోరుకో” మంటే యాదర్షి స్వామి వారికి “శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూఫాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా వున్నాడు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులువినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.

యాదగిరి గుట్టకు ప్రవేశ ద్వారము:
మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రము నందు రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయములు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము. కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము.

మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నందు వెలసి తరువాత కొత్త లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళేవారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నవి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా కలదు. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా కలదు. ఈ ఆలయగర్భగుడి నందు స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము కలదు. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు. రాయ్ గిరి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు హైద్రాబాదు, వరంగల్, నల్గొండల నుండి చాలా బస్సులు కలవు పాత నరసింహస్వామి ఆలయము యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రము నందు రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయములు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము.
కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము.

కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు వెలసి తరువాత కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళినారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నవి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా కలదు. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా కలదు. ఈ ఆలయగర్భగుడి నందు స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము కలదు. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు.

హైదరాబాదు-ఖాజీపేట్ రైలు మార్గంలో రాయగిర్ స్టేషనుకు సుమారు 7కి.మీ. దూరంలో వుంది. స్టేషను నుండి బస్సులు, టాంగాబండ్లు చాలా వున్నాయి. ఇది యాదగిరికొండ మీద నున్న శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రము.
తెలంగాణ లో ఒక ప్రధానమైన యాత్రాస్ధలం. ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 315 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకోవచ్చు. కాని కొండమీదికి నేరుగా బస్సులు కూడా ఉన్నాయి. తిరుమల - తిరుపతి, శ్రీశైలంలలో మాదిరిగా కొండమీద అనేక సత్రాలున్నాయి. ఇక్కడి విశేషము ఏమంటే కొండమీద పుష్కరిణిలో స్నానంచేసి, నియమంగా ఒక మండలం రోజులు స్వామికి ప్రదక్షిణలు చేస్తే సర్వబాధలు తొలగి ప్రశాంతతను పొందగలరని గట్టి నమ్మకం. స్వామివారు 16 రోజులకు స్వప్న సాక్షాత్కారంలో దీక్షా పరులయిన భక్తుల సమస్యలకు పరిష్కారం సూచించునని కూడ చెప్పుకుంటారు.

స్వామివారి బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ తదియ నుండి ప్రారంభమై ద్వాదశి వరకు కోలాహలంగా జరుగుతాయి.

చూడదగినవి:
శివాలయము, సంస్కృత కళాశాల, అద్దాల మంటపం, పాంచరాత్ర పద్ధతిని అర్చనాదుల్లో శిక్షణ యిచ్చే పాఠశాలలు ముఖ్యములు.

Friday 13 January 2017

రామేశ్వరం

భగవంతుడిని పూజించుటకు మూడు లక్షణములుండవలెను..
1. మూర్తి,
2. స్థలము,
3. తీర్థము..
అవి మూడు ఈ క్షేత్రములో ఉండుట ఈ క్షేత్ర ప్రత్యేకత...
మన దేశ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి...
జ్యోతిర్లిగ శ్లోకాలలో సేతు బంధేతు రామేశ్వరం అనే పాదం ఈ క్షేత్రానికి సంబంధించినదే...
ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామేశ్వరలింగం ఏడవది... రామేశ్వరం తమిళనాడు లోని రామనాథ పురం జిల్లాలో పంబన్ అనే దీవిలో ఉంది...
రామేశ్వరం నాలుగు ప్రక్కలా సముద్రమే ఉంటుంది...
పంబన్ అనే అతి పొడవైన బ్రిడ్జి ద్వారా మాత్రమే మనము రామేశ్వరాన్ని చేరవలసి ఉంటుంది...
రామేశ్వరం దీవి లో ధనుష్కోటి అనే ప్రదేశం నుండి శ్రీలంక లోని మల్లైతీవు అనే  ప్రదేశానికి కేవలం 18 నాటికల్ మైళ్ళ దూరంలో ౩౦ కి.మీ. దూరంలో ఉంటుంది...
రామేశ్వరాన్ని దర్శించిన తర్వాతే కాశీ యాత్ర ఫలం సిద్ధిస్తుంది...
అందుకే రామేశ్వరం కూడా కాశీ తో పాటుగా రామేశ్వరాన్ని చేరడం వలన ఈ క్షేత్రం చార్ ధామ్ యాత్రలో ఒక భాగంగా మారుతుంది... శ్రీరాముడు లంకను చేరడానికి నిర్మించిన వారధి ఇక్కడి నుండే మొదలవుతుంది... లంకలోని రావణుడు శివ భక్తుడు... అందుకే ఈ క్షేత్రం శివ కేశవుల మధ్య వారధిగా అనుకోవచ్చు... 
రామునిచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు కనుక రామేశ్వరమయింది...

ఇక్కడి శివుడిని రామేశ్వరుడని, రామలింగమని, రామనాథుడని అంటారు...

క్షేత్ర చరిత్ర:
లంకాధిపతి యైన రావణుడు సీతను చెరబట్టి లంకయందు ఉంచగా.. ఆమెను రక్షించుటకై శ్రీరాముడు రామేశ్వరము నుండి లంకకు బయలు దేరి వేళ్ళినట్లు చరిత్ర చెబుతుంది...రావణుని చంపి రామేశ్వరానికి తిరిగి వచ్చి రావణుని సంహరించడం వలన ఏర్పడిన బ్రహ్మహత్యాపాపము దాని దోష నివారణచేయమని ఈశ్వరుని ప్రార్థించారు... దానికై ఒక శివలింగాన్ని ప్రతిష్ఠింప సంకల్పించారు.. .. అందుకే తగిన లింగాన్వేషణకై హనుమంతుని కైలాస పర్వతానికి పంపుతారు... హనుమ ఆ అన్వేషణలో ఎంతకూ తిరిగి రావడం లేదు... ఈలోగా ఆలస్యమవుతుందని సీతమ్మ వారు ఇసుకతో లింగాన్ని(సైకత లింగం) చేసి ప్రతిష్ఠించారు.... 
ఈ లోగా హనుమంతుల వారు లింగాన్ని తీసుకువస్తారు.....తిరిగి వచ్చిన హనుమంతులు తన లింగాన్ని ప్రతిష్ఠించకముందే ప్రతిష్ఠింప బడిన ఆ లింగాన్ని చూసి ఆగ్రహో దగ్రుడై తన తోకతో దాన్ని పెకిలించ ప్రయత్నంచేస్తాడు.... కానీ ఆ లింగం సీతమ్మవారి హస్త మహత్యంతో తయారు చేయబడినది కాబట్టి బయటకు రాలేదు... ...రాముల వారు హనుమంతుని బుజ్జగించి ఆ లింగాన్ని కూడా ఒక దగ్గర ప్రతిష్ఠించి..హనుమా దీనినే విశ్వ లింగమని పిలుస్తారు... మొదట నీవు ప్రతిష్ఠించిన లింగానికి పూజ జరిగిన తర్వాతే నేను ప్రతిష్టించిన లింగాన్ని దర్శించుకుంటారని శ్రీ రాముల వారు మాట ఇచ్చారట... ఇప్పటికీ ఈ విధంగానే మనము దర్శించుకుంటున్నాము...హనుమ ప్రతిష్ఠించిన లింగాన్ని విశ్వ లింగమని... సీతమ్మవారు ప్రతిష్ఠించిన లింగాన్ని రామ లింగమని పిలిస్తారు...
(ఈ కథ మహర్షి వాల్మీకి రచించినదానిలో కనపడదు...
తులసీదాసుని రామ చరిత మానస్ లో ఉంటుంది)

శీయాత్ర రామేశ్వరం చూసిన తరువాతకాని పూర్తికాదని విశ్వసిస్తున్నారు. కాశీ గంగా తీర్థం తీసుకు వచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపినట్లైతే కాశీయాత్ర పూర్తి ఔతుందని దేశంలోని సకల తీర్ధములు చూసిన ఫలం దక్కుతుందని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇక్కడ ప్రధానదైవం అయిన శివుని రామేశ్వరుడు అంటారు. ఈశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. గర్భాలయాన్ని 10వ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి అయిన పరాక్రమబాహు చేత నిర్మించబడింది. భారతీయ నిర్మాణకళా వైభవాన్ని చాటిచెప్పే కట్టడాలలో ఒకటి అయిన ఈ ఆలయ లోపలి నడవ (నడిచేదారి) దేశంలో అతిపెద్దదని సగర్వంగా చెప్పుకుంటున్నారు. 12వ శతాబ్దం నుండి ఈ ఆలయనిర్మాణం వివిధ రాజుల చేత నిర్మించబడినది... ద్రవిడ శిల్ప కళా రీతిలో ఈ దేవాలయాల శిల్ప కళ ఉంటుంది... ద్వీపం యొక్క సముద్ర తీరాన మూడు మండపములు... చాలా అందమైన స్థంభములతో, వాటిపైన చెక్కబడిన అత్యద్భుత శిల్పములతో వరుసలుగా విరాజిల్లుతున్నాయి... 
దేవాలయము 865అ. పొడవు, 657 అ. వెడల్పు ఉన్నది  పై కప్పు 49 అ.ల పొడవుగల రాతి దూలములతో మోయబడుచున్నది... దైవ సన్నిధి పాలిష్ చేయబడినగ్రానైట్ రాయితో కట్ట బడినది... దేవాలయపు ప్రక్కన మూడు మండపములు మొత్తము 4,000  అ.ల పొడవున ఉండడం ప్రపంచంలోని అద్భుతముల్లలో ఇది ఒకటిగా ఎంచబడుతున్నది... 
మండపం ఇరువైపులా ఐదు అ.ల ఎత్తుగ వేదికలు, దానిపై 25 అ.ల ఎత్తు గల రాతి స్థంభములు గలవు... 
దేవాలయ మండపం 1200 బలిష్టమయిన స్థంభములచే బరువు భరింపబడుతున్నవి...దేవాలయ తూర్పు గోపురం 130 అ.లు , పచిమ గోపురం 80 అడుగులు ఎత్తు ఉన్నవి.... మధ్య మధ్యలో ఇరవైరెండు పవిత్ర తీర్థాలలో స్నాన మాచరిస్తూ సాగుతుంది పయనం...  అవన్నీ చాలా అధ్బుతమైన బావులు... ఇక్కడి అన్ని బావులలో స్నానమాచరిస్తే అన్ని దోషాలు, పూర్వజన్మ పాపాలు తొలగి ముక్తి లభిస్తుందని నమ్మకం...ఒక విశేషమేమంటే.. ఏ రెండు బావులలోని నీరు ఒకే రుచి కలిగి ఉండవు...
( దైవ మాయ కాక వేరేదేముంది...).. 

కారిడార్ లో మనం నడిచే టప్పుడు ప్రక్కన పైన చాలా వర్ణ చిత్రాలు చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి   ఒకసారి మణి దర్శనానికి వెళ్ళి అగ్ని తీర్ధంలో సముద్ర స్నానం చేసి మరల రెండవ సారి మూల విరాట్ దర్శనం చేసుకునేటపుడు మాత్రమే ఇరవైరెండు తీర్థాలలో స్నానమాచరించాము...
ఒకే సారి వీటన్నిటినీ చేయలేము.. ఉదయం ఆరు వరకు మూలవిరాట్ దర్శనం ఉండదు...
అందువల్ల తప్పని సరిగా రెండు సార్లు దర్శనం చేసుకోవాల్సిందే...
అన్ని తీర్థాలలో స్నానమాచరించి... పొడిబట్టలతోనే (అంటే తప్పని సరిగా దుస్తులు మార్చుకోవాలి ... తడి దుస్తులతో దర్శనం చేసుకోరాదు) దర్శనం చేసుకోవలసి ఉంటుంది... (ఈ బావులలో స్నానం దగ్గరుండి చేయిస్తామని బ్రోకర్లు అడుగడుగునా ప్రత్యక్షమవుతారు వారి వలలో పడకండి...ధర్మ దర్శన వరుసలో నే వెళ్ళండి).. కాశీ నుండి తెచ్చిన గంగా జలాన్ని స్వామి వారికి  అభిషేకించ వచ్చు .... స్వామి వారి దర్శన మయిన తర్వాత అమ్మవారు పర్వతవర్ధిని దర్శనం ఉంటుంది.. పార్వతిదేవి మండపం లో అష్టలక్ష్ములు కొలవైన విగ్రహాలు చాలా అధ్బుతంగా ఉంటాయి... చూడండి... రామేశ్వరంలో ఉదయం 6:00 లోపు మణి దర్శనం అనే ఒక విశేష దర్శనం ఉంటుంది... ఇది ఒక స్ఫటిక లింగం దర్శనం... లింగం వెనుక దీపం ఉన్న స్థితిలో ... (మూలవిరాట్టుకు ముందు భాగంలో ఉంటుంది).... దర్శనం చేసుకుంటాం.. ఇది చాలా అధ్బుతంగా ఉంటుంది... ఈ మణి శ్రీ మహావిష్ణువు తల్పమైన ఆదిశేషుడి నాగమణి అని అంటుంటారు.... రామేశ్వరం గుడి దీవికి తూర్పు అభిముఖంగా బీచ్ దిశలో ఉంటుంది..

పూజలు: ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తెరచేఉండును...
రాత్రి పది గంటల వరకు తెరచేఉండును...
1. పళ్ళెరై దీపారాధన- ఉ. 5:00
2. స్ఫటిక లింగారాధన - ఉ. 5:10
3. తవనంతాళ్ దీపారాధన- ఉ.5:45
4. విళాపూజ - ఉ. 7:00
5. కళాశాంతి పూజ- ఉ. 10:00
6. ఉచ్చికాల పూజ - మ. 12:00
7. శయరక్ష పూజ- సా. 6:00
8.అర్థ జాము పూజ- రా. 9:00
9. పళ్ళెరై పూజ - రా 9:30
గుడిలో దర్శనమైన తర్వాత మేము చుట్టుప్రక్కల చూడదగిన ప్రదేశాలు ధనుష్కోటి .... ధనుస్సు + కోటి... శ్రీరాముల వారు తమ ధనుస్సు యొక్క మొన(కోటి) ని ఇక్కడ తాకించి సేతువు ను కట్టడం ప్రారంభించారట....ఇక్కడ రాముల వారి సేతువు యొక్క ప్రారంభ స్థానం ఉంది.. 
ఇక్కడి కి దగ్గరలోనే ధనుష్కోటి బీచ్ కూడా ఉంటుంది... అది చాలా ప్రమాదకరమయిన బీచ్... ఇక్కడి అలలు అర్ధం కావు... పాజిటివ్ కరెంట్స్ ఉంటాయి.. అందుకే అలలు మనను సముద్రంలోకి లాగేసే అవకాశాలు ఎక్కువ.... ఈ బీచ్ కు టూరిజం వారి అనుమతి ఉండదు.. అందుకే ఆ వైపు వెళ్ళకపోతేనే మంచిది.. ఈ ధనుష్కోటి వెళ్ళే మార్గంలో రెండు వైపులా సముద్రమే ఉంటుంది... బీచ్ లు చాలా క్లీన్ గా పరిశుభ్రంగా ఉన్నాయి.... ఎక్కడా నీచు వాసన అనేది తగులదు... చాలా అధ్బుతమైన ప్రయాణం.. ఇది బంగాళాఖాతం-హిందూ మహా సముద్రం లో కలిసే స్థలం....ఇక్కడ స్నానం చేస్తే మంచిదంటారు.

గంధమాధన పర్వతం: 
ఇది ఒక కొండ ప్రదేశం ఇక్కడి నుండి చూస్తే మొత్తం రామేశ్వరం... నాలుగు ప్రక్కలా సముద్రం చాలా క్లియర్ గా కనపడింది... హనుమంతుల వారు సీతమ్మ జాడల గురించి రాముల వారి కి వివరించింది ఇక్కడే... ఇక్కడ రాముల వారి పాద ముద్రలు మనం చూడవచ్చు...

కోదండ రామార్ టెంపుల్: 
రావణుడి తమ్ముడు విభీషణుడు రాముల వారికి లొంగిపోయింది ఇక్కడే ...
దానికి జ్ఞాపకార్థంగా ఇక్కడి గుడిలో సీతా,రామ,లక్ష్మణ,హనుమంతుల విగ్రహాలకు జతగా విభీషణుడి విగ్రహం కూడా మనకు కనపడుతుంది...
మన దేశంలో వేరే ఏ ప్రదేశంలోనూ విభీషణుడి గుడి మనకు కనిపించక పోవచ్చు.. రాముల వారు విభీషణుడి పట్టాభిషేకం చేసింది ఇక్కడే.... 

శ్రీరామ తీర్దము
ఇది శ్రీరాముల వారు స్నాన మాచరించిన తీర్థం... మేము ఇక్కడ రామ సేతువుని నిర్మించడానికి ఉపయోగించిన రాయిని చూడవచ్చు..  కానీ ఇక్కడ దానిని ముట్టుకునివ్వరు... ఆ రాయి సాక్షాత్ శ్రీరాములవారు పాదం మోపిన/మోసిన రాయి మరి...

లక్ష్మణ తీర్ధం:
ఇది లక్ష్మణుల వారు స్నానమాచరించిన తీర్థం...

పంచముఖ ఆంజనేయస్వామి తీర్థం:
ఇక్కడకూడా సేతుబంధన రాళ్ళు ఉంటాయి  ... ఇక్కడ కూడా ముట్టు కోనివ్వలేదు వారు... 

అగ్ని తీర్ధం....
ఈ తీర్థంలోనే సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేసారట... 

రాముల వారు వారధి కట్టే దానికి సముద్రుడు మొదట సహకరించలేదట..
అందుకే రాముల వారు సముద్రుని మీదకు బాణం వేయాలని సంకల్పించిన తరుణంలో సముద్రుడు మనిషి రూపు దాల్చి స్వామి మీకు సహకరిస్తాను శాంతించండి అని శాంతింపచేస్తారట.. అందుకే ఇక్కడ సముద్రం చాలా ప్రశాంతంగా చాలా తక్కువఎత్తు ఉన్న అలలు వీలైనంతవరకు అలలు లేకుండా ఉంటుంది...

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles