Showing posts with label తిరుప్పావై. Show all posts
Showing posts with label తిరుప్పావై. Show all posts

Friday, 13 January 2017

తిరుప్పావై ఇరవై తొమ్మిదవ రోజు పాశురం


    శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు ఉన్  
        పొత్తామరై యడియే పోత్తుమ్ పోరుళ్ కేళాయ్;
        పెత్తమ్మేయ్ త్తుణ్ణు జ్కులత్తిన్ పిఱన్ద నీ,
        కుత్తేవల్గెళై క్కోళ్వామల్ పోకాదు;
        ఇతైప్పఱై కోళ్వానన్దుకాణ్ గొవిన్దా:
        ఎత్తైక్కు  మేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో
        డుత్తోమే యావో మునక్కే నామాళ్ శేయ్ వోమ్,
        మత్తైనజ్కా మఞ్గళ్ మాత్తేలో రెమ్బావాయ్
   
భావం : __ ఓ స్వామీ! శ్రీకృష్ణా! నీ పాదారవింద దాసులమగు మేము మిక్కిలి వేకువనే లేచి, నీ సన్నిధికి వచ్చి, నిన్ను దర్శించి నీ సుందర తిరివడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి, ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండ వుండరాదు. ఏలన నీవు మా గోల్లకులములో జన్మించి మా కులమును , మమ్ములను ధన్యులను చేసినవాడవు , ఓ గోవిందా! పుండరీకాక్షా! మేము నీ వద్దకు 'పఱ' అను వాద్యమును పొందుటకు రాలేదు. అది ఒక నిమిత్తమే! వ్రతమూ నిమిత్తమే! మేము ఏడేడు జన్మముల వరకును మరియు యీ కాలతత్వముండు వరకును నీకు అనవార్యశేషభూతులమై నీతోడ చేరి, నీ దాస్యమును చేయుచచుండువారము కామా? మా యందు , యితరములై ఆపేక్షలేవైన యున్నచో వానిని తొలగించి మమ్ము కృపజూడుము స్వామీ! సదా నీ సేవలను మాకోసగమును అని వ్రత ఫలమును అండాళ్ తల్లి వివరించింది.

అవతారిక  :

           భగవత్ప్రాప్తిని పొందగోరేవారందరూ ఆ చరించదగిన యీ ధనుర్మాస వ్రతంలో గోపికలు భక్తీ, ప్రపత్తులే ముఖ్యమని నిరూపించారు. అజ్ఞానులైనను నిశ్చల భక్తి ప్రపత్తులతో భగవంతుని చేరవచ్చనేది నిర్వివాదంగా నిరూపించారు. ఇప్పుడీ పాశురంలో వ్రత ఫలాన్ని చెబుతున్నారు. వ్రతాన్ని ఒక నిమిత్తంగా చేసుకుని 'పఱ' అనే వాద్యాన్ని పొందాలని తాహతహలాడారు గోపికలు ఇప్పటివరకు . కాని యీ పాశురంలో 'పఱ' నిమిత్తమని __ నిజానికి శ్రీకృష్ణుని సాన్నిధ్యమూ, అతని నిరంతర సేవకే యీ ప్రయత్నమంతా అని స్పష్టం చేశారు. అండాళ్ తల్లితో కూడిన గోపికలు.

            (ధర్మవతిరాగము _ అదితాళము)
         
     ప...    నీ సన్నిధియే కావలె స్వామీ!
        నీ సంపెసేనమె మాకు పరమావధి స్వామీ!
   
    అ..ప..    నీ సేవకై వేకువజామున నిలిచి
        నీ సుందర తిరువడులకు మంగళమనగ
       
    చ..     పనుల మేపి జీవిక నడిపెడి మా  
        పశుప కులమునన్ బుట్టిన స్వామీ!
        ఈశ ! మా అంతరంగ సేవలను
        ఆశల జేయ నిరాకరింపకుమ!
        నీ సన్నిధియే కావలె స్వామీ!

    చ..    కాదుసుమా! వాద్యముకై వ్రతము      
        అదియొక నేపమగు నోచ నీ వ్రతము
        బంధము వీడక యేడేడు జన్మల
        అందరము కై౦కర్యము చేతుము
        విందువో గోవిందా! మనవిని __ మా
        యందన్య కామనలను పోగొట్టుము👏🙏

Tuesday, 10 January 2017

తిరుప్పావై ఇరవై ఏడవ రోజు పాశురం


    *     కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్డా వుందన్నై
        ప్పాడిప్పఱై కొణ్ణు యామ్ పెరు శమ్మానమ్        
        నాడుపుకళుమ్ పరిశినాల్ నన్డాక
        శూడగమే తోళ్ వళై యేతోడేశేవిప్పూ
        యామిణిహొమ్ పాడగమే యేన్ఱనైయ పల్ కలనుమ్ 
        అడైయుడుప్పోమ్ అతన్ పిన్నే పాల్ శోఱు
        మూడ, నెయ్ పెయ్ తు మళుంగైవళివారకూడి యిరుస్టు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.


భావం :     నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులౌనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడౌ ఓ గోవిందా! నిన్ను సుత్తించి నీనుండి 'పఱ' అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంత పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి. అనాటి మా రూపాలు ప్రకాశవంతంగా, తేజోమయంగా విరాజిల్లుతూ వుండాలి. దానికై మాకు కొన్ని భూషాణాలు కావాలి. ముంజేతులకు కంకణాలు కావాలి. భుజముల నాలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి. దండలకు తోడవులును __ ఇంకా ఎన్నో అభూషణములను నీవనుగ్రహించగ మేము ధరించాలి. సన్మానమొందాలి. వీటన్నింటిని ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయి మోచేతిగుండా కారుచుండగ మేమంతా నీతో కలసి చక్కగా అరిగించాలి. ఇదీ మా కోరిక . ఇట్లైన మా వ్రతము మంగలప్రదమైనట్లే!

    అవతారిక : -


స్వామిమొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతమును చేయటానికి కావలసిన పరికరాలన్నింటినీ అర్ధించారు గోపికలు . గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే! అంటే స్వామి తమతోనే వుండాలని ద్వానించేవిధంగా గోపికలు చాల చాతుర్యంతో వ్యవహరించారు. అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు. స్వామి యిదంతా విని 'మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించండి' అన్నారు గోపికలు యీ పాశురంలో ఆ ఫలాన్ని వివరిస్తున్నారు.

            (హంసద్వనిరాగము _ అదితాళము)

    ప ...     అనాశ్రిత విజయ! శుభ, గుణదామా!
        నిను సుత్తియించి ప్రాప్యము నొంది  

    అ..ప..    నిను సుత్తియించి ప్రాప్యము నొంది.
        సన్మానమంది సన్నుతి జేతుము
   
    చ..    కంకణమ్ములను భుజకీర్తులను
        కర్ణ భూషలును కర్ణ పుష్పములు
        మెరుగుటందియలు మేని తోడవులును
        పరవశత నలంకరించుకొందుము
   
    చ..     మేలిమి పలువల మేము ధరించి
        పాలు నేయి గలసిన పరమాన్నము      
        కేలోడ మనము కలసి భుజియించి
        ఇల నీ సంశ్లేషమున సుఖింతుము.

Monday, 9 January 2017

తిరుప్పావై ఇరవై ఐదో రోజు పాశురం


        ఒరుత్తి మగనాయ్ పిఱన్దు, ఓరిరవిల్
        ఒరుత్తి మగనాయ్ ఒలిత్తు వళర,
        తరిక్కిలానాగిత్తాన్ తీజ్ఞనినైన్ద
        కరుతై ప్పిళ్ళైత్తు కఞ్ఙన్ వయిత్తిల్
        నెరుప్పెన్న నిన్ఱ నెడు మాలే! యున్నై
        ఆరుత్తిత్తు వన్దోమ్; పఱై తరుతియాకిల్ యామ్పాడి
        వరుత్తముమ్ తీర్ న్దు మగిళ్ న్దేలో రెమ్బావాయ్.

భావం : ఓ కృష్ణా ! పరమ భాగ్యవతియగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగ అవతరించి, అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దుబిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రునివలె పెరుగుచుండగా. గూఢచారులవలన యీ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు అలోచించుచుండగా అతని యత్నములన్నిటిని వ్యర్ధముచేసి అతని గర్భమున   చిచ్చుపేట్టినట్లు నిల్చిన భక్తవత్సలుడవు! అట్టి నిన్ను భక్తీ పురస్సరముగా ప్రార్ధించి నీ సన్నిధికి చేరినాము. మాకు యిష్టార్దమైన 'పఱ' అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్మనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాశపడదగిన సంపదను, దానిని సార్ధిక పరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషములవలన కలిగిన సంకటమును నివారణ చేసికొని మేము సుఖింతుము . నీ విట్లు కృపచేయుటవలన మా యీ అద్వితీయమైన వ్రతము శుభమగు సంపూర్ణమగును.

    అవతారిక :----

'మంగళమగుగాక జయమంగళం! మంగళమగు గాక శ్రీ పాదములకు!' అని అండాళ్ తల్లి స్వామి ఆయా . అవతారాలలో ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణా వాత్సాల్యలకు ముగ్ధురాలై మంగళాశాసనం పాడింది. తన సఖులైన గోపికలతో వీరు పాడిన మంగళాశాసనమునకు తన్మయులైన స్వామి 'మీకేమి కావలయున 'నిన; మాకేవైన ప్రతిబంధకములున్న వానినెల్ల నీవే పోగొట్టి. మాలోని, అన్యకామనలేమైనయున్న వాటిని 'నశింపచేసి' మమ్ము అనుగ్రహించుమని గోపికలతో కూడిన అండాళ్ తల్లి యీ (పాశురంలో) అర్ధించుచున్నది.

            (బిలహరి రాగము _ ఝుంపెతాళము)
   
    ప ...    పురషార్ద మర్దింప వచ్చినారము స్వామి
        పురుషార్దమిడి మా మనోరథ మీడేర్పుమా!

    అ...ప...    వరలక్ష్మి యాశించు పరమ సంపదనేల్ల
         కీర్తించి దుఃఖమ్ము బోవ సుఖియింతుము

    చ...    దేవకికి పుత్రునిగ అవతరించిన రాత్రి
        దేవి యశోధకును వరసుతుడవై పేరుగ
        తా విన్న కంసుడట కీడు దులపగ నెంచ
        నీవె కంసుని గర్భ మగ్నివలె వ్యాపించి
        ఆ యత్నమంతము వమ్ముజేసిన స్వామి
        పురుపార్దమర్దింప వచ్చినారము స్వామి
        పురుషార్ధామిడి మా మనోరథ మీడేర్పుమా!

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles