Showing posts with label నీతి. Show all posts
Showing posts with label నీతి. Show all posts

Tuesday, 17 January 2017

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే…

డబ్బు మనుషుల్ని ఎంత పాడు చేస్తుందో చెప్పే అద్భుతమైన నీతి కధ తప్పకుండా చదవండి షేర్ చేయండి

ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి "ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?" అని అడిగారు. అందుకాయన... "అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది." వాళ్ళిద్దరూ భయంతో… "అంటే అక్కడ పులి ఉందా?" అని అడిగారు.

"కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది." అన్నాడాయన. "ఇంతకీ ఏమిటది?" అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. "బంగారు నాణేల గుట్ట" అన్నాడు సన్యాసి. వాళ్ళిద్దరూ సంతోషంగా "ఎక్కడ?" అని అడిగారు.

"అదిగో ఆ పొదల్లోనే" అని వేలు చూపించి తన దారిన పోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి. "ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?" అన్నాడొక మిత్రుడు.

"అతడి సంగతి వదిలేయ్. ముందుగా ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం." అన్నాడు మరో మిత్రుడు.

అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉన్నాడు. రెండోవాడు ఊర్లోకి వెళ్లాడు. ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు. "ఛ… ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు." అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.

ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడి ఆలోచన ఇలాఉంది… "వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు" అనుకున్నాడు. అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు.

అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు. "పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను." అనుకునిఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. "సన్యాసి మాటలు ఎంత నిజమో కదా" అనుకున్నాడు చివరి క్షణాల్లో.

గమనిక : రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి…. అని పెద్దల నానుడి. కాబట్టి ఆ రూపాయి విషయంలో జాగ్రత్త.

ఇంట్లో పాటించాల్సిన-పాటించకూడని ఆచారాలు

కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వ కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలా మంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి.
- కొంత మంది వేళ పాళ లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతి వేళ్ళ గోళ్ళను కొరుకుతుంటారు. చేతి గోళ్ళను తిన్నవాడు విశానమును పొందుతారు.

- రెండు చేతులతోను తలగోక కూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకొనరాదు. శిరస్సును విడిచి కేవలము కంఠ స్నానము చేయరాదు. (శిరః స్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్ఠానము చేసి కొనవచ్చునని జాబాలి వచనము).

- లేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము - ఇవి తగవు. ఊరక మట్టిని మర్థించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, ఎదుటి వాని ఉన్న దోషములను కాని, లేని దోషములను కాని వెల్లడించు వాడు, శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందుదురు.

- ప్రాకారము కల్గిన గ్రామమును గాని, ఇంటిని కాని ద్వారము గుండా ప్రవేశింపవలయునే కాని ప్రాకారము దాటి ప్రవేశింపకూడదు. రాత్రులందు చెట్ల కింద ఉండరాదు. దూరముగా ఉండవలయును.

- ఎక్కువ కాలం జీవించాలనుకునే వాడు వెంట్రుకలను, బూడిదలను, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు.

- చాలా మంది సరదా కోసం పాచికలు (జూదము) ఆడుతారు అలా ఆడటం సరికాదంటున్నారు. పాదరక్షలను చేతితో మోసికొనిపోరాదు. పక్క మీద కూర్చుని ఏమియు తినరాదు. చేతిలో భోజ్య వస్తువును పెట్టుకొని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనము మీద పెట్టుకొని ఏ వస్తువును తినరాదు.

- రాత్రి సమయంలో నువ్వులతో గూడిన ఏ వస్తువును తినకూడదు. వస్తహ్రీనుడై పడుకోకూడదు. ఎంగిలి చేతితో ఎక్కడకును వెళ్ళరాదు.

- కాళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనము చేయవలయును. దాని వలన దీర్ఘీయువు కలుగును. తడి కాళ్ళతో నిద్రకు ఉపక్రమించకూడదు.

Saturday, 14 January 2017

వాలుకుర్చీ వేదాంతం

🌹🌹వాలుకుర్చీ వేదాంతం:🌹: 🌹
తన కలిమి, ఇంద్రభోగము
తన లేమియె సర్వలోక దారిద్యంబున్
తన చావు జగత్ప్రళయము,
తన వలచినయదియె రంభ, తథ్యము సుమతీ...
లోకంలో పడక కుర్చీ మేథావులు కొందరుంటారు నిండు కుండలాంటివాళ్ళు. తొణకరు, బెణకరు. రేపు ఆ కుండే ఖాళీ అయితే, తలకిందులైపోతారు, కుండకూడా అంతే! నిండుగా ఉన్నంత సేపూ లోకం అంతా సుభిక్షం అంటుంది. కుండఖాళీ ఐతే తల్లకిందులై, గగ్గోలు పెడుతుంది. ఘటవాయిద్యం లాంటిదే ఇదంతా! చాలా మంది జీవితాలలో కనిపించే నిష్ఠుర సత్యం ఇది.
తమకు కడుపునిండుగా ఉంటే “జనం సుఖంగా ఉంటున్నారని, పంటలు బాగా పండుతున్నాయనీ అంటాడు. తనకు ఆకలి మండిపోతుంటే లోకం గొడ్డు పోయిందని, ప్రభుత్వ పాలన బాగాలేదని అందోళన చేస్తాడు. లోక దారిద్ర్యాన్ని అంచనా వేయటానికి తన భావదారిద్ర్యాన్ని ఉపయోగించా లనుకోవటమే ఇక్కడ సూత్రం.
ఇలాంటి మేథావి వర్గాన్ని పడకకుర్చీ వేదాంతులు అంటారు. ఈజీఛైర్ ఫిలసాఫర్లన్నమాట! వీళ్ళు వీధి అరుగు మీద వాలుకుర్చీలో వాలి, కూర్చుని దారినపోయే దానయ్యలతో అమెరికాను బాగు చేయటం గురించి, రష్యాను దారిలో పెట్టటం గురించి చాలా ఐడియాలు ప్రవచిస్తుంటారు. టకార ప్రయోగాలతో సమాచారాన్ని ఊదర గొడ్తుం టారు, ఆయనట...ఈవిడట... అంటూ! అదిగో ద్వారక అంటే ఇవిగో ఆలమందలు అంటారు. అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష లాంటి భావాలు వీళ్ళవలనే ప్రబలుతాయి. తర్కానికి నిలవని భావజాలాన్ని లోకం మీదకు ప్రసారం చేస్తుంటారు.
తమిళ సంగమ సాహిత్యంలో ఆకుల బట్టలు కట్టుకున్న ఒక స్త్రీ గురించి ఉంది కాబట్టి, తమిళ భాష ఆకులు కట్టుకునే రోజుల్నించి అంటే కనీసం ఏడేనిమిది వేల యేళ్ళ నుండీ వుందనే ప్రచారం ఇలాంటి వాలుకుర్చీ వేదాంతం లాంటిదే! “కనీసంలో కనీసంగా ఈ సంఖ్య చెప్తున్నాం. మా లెక్కప్రకారం కనీసం యాబైవేల యేళ్ళనుండీ తమిళం ఉంది” అన్నారు తమిళపీఠాధిపతి స్వయంగా! అప్పటికి ప్రపంచంలో ఏ భాషైనా ఉన్నదా? అనడిగాడు నా బోటి భాషాడభూతి. లేదు. అప్పటికీ భాషనేదే లేదు. తమిళం ఒక్కటే ఉంది. దానిలోంచే అన్ని భాషలూ పుట్టాయి అని ఆయన సూత్రీకరించాడు సదరు తమిళ భాషతల్పశాయి. ఇది తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావమనటం కన్నా ప్రమాదకర ధోరణి. ఇప్పుడీ విషయాన్ని నిరూపించటానికి కోట్ల రూపాయల ప్రాజెక్టులు నడుస్తున్నాయక్కడ. అక్కటా...!
సుమతీ శతకంలోని ఈ పద్యం ‘వాలుపడక సీను’ల తత్వాన్ని ఎండగడుతుంది. వీళ్ళు వీధి అరుగుదాటి లోకంలోకి రారు. వాస్తవాన్ని చూడరు. చూసినా పట్టించుకోరు. పట్టించుకున్నా నిజం చెప్పరు. ఒకవేళ చెప్పినా  అందులో అర్ధసత్యాలు, పావు నిజాలూ మాత్రమే ఉంటాయి.
“తనకు గొప్ప కలిమి ఉన్నప్పుడు, లోకం అంతా ఇంద్రభోగం అనుభవిస్తోందంటాడట. తనకు లేమి కలిగితే సర్వలోకం
లోనూ దారిద్యం తాండవిస్తోదంటాడు. తనకు చావు పరిస్థితి వస్తే, జగత్ప్రళయం వస్తోందంటాడు. అక్కడితో ఆగుతాడా...? తను వలచిందే రంభ అని అడ్డగోలుగా వాదిస్తాడు. ఇది తథ్యము సుమతీ... అంటాడు సుమతీ శతక కారుడు.
    వెనకటికి ఒక డాక్టరుగారు “నా ప్రాక్టీసులో ఇన్ని పుళ్ళు కోశాను, ఒక్కడికి కూడా నా కొచ్చినంత బాధ రాలేదు” అన్నాడట. తన బాధని లోకం బాధగా రుద్దడం, లోకం బాధ తన బాధకన్నా తక్కువేనని తూకాలు వేయటం విచిత్రం.
    న్యూరో ఫిలాసఫీ అనే వైద్యవేదాంత విభాగం ఒకటి ఉంది.  బాధపడే వ్యక్తిని చూసినప్పుడు మనం కూడా బాధ పడే తత్వాన్ని ఈ శాస్త్రంలో మిర్రర్ టచ్ సైనస్థీషియా అంటారు. అనస్థీషియా అంటే బాధ తెలీకూండా ఉండటం. సైనష్థీషియా అంటే బాధ తెలియటం. ఎదుటిమనిషికాలుకు దెబ్బతగిలినప్పుడు మనకాలు నొప్పి పెట్టకపోయినా మనసు మాత్రం అయ్యో అనుకుంటుంది.  ఇది అద్దంలో ప్రతిబింబాన్ని ముద్దాడటం లాంటిది. అందుకే మిర్రర్ టచ్ సైనస్థీషియా అన్నారు. ఇది మనసున ప్రతి ఒక్కరికీ వర్తించే అంశమే! ఇది నాడీ వేదాంతం... న్యూరో ఫిలాసఫీ!
వాలుకుర్చీ వేదాంతం ఇందుకు భిన్నమైంది. తనకు బాధ పుట్టినప్పుడు లోకం అంతా బాధలోనూ దిగుల్లోనూ కూరుకు పోయిందంటాడు. తనకు సుఖంగా ఉంటే లోకంలో కష్టాలే లేవంటాడు. తనకు ఇష్టమైనది అందరూ మెచ్చేదంటాడు. తనకు నచ్చని దాన్ని, ఎవ్వడూ ఇలాంటివి ఇష్టపడ డంటాడు. పొట్లకాయ లేదా కాకరకాయ అంటే ఇష్టత లేనివాడు “ఈ కాయలు తినే మనుషులు కూడా ఉంటారంటే ఆశ్చర్యం” అని ప్రకటిస్తాడు. “తావలచినదే రంభ” అనే ధోరణి వలన లోకానికి అపకారమే జరుగుతుంది.

Friday, 13 January 2017

వ్యాపారం విలువలు

నా వ్యాపారం నా పిల్లలకు ఇవ్వగలను. నీ ఉద్యోగం నీ పిల్లలకు ఇవ్వగలవా?
చదువు పనికిరానిది అనే ఉద్దేశం లేదు. కష్టం విలువ తెలిసి...సొంత కాళ్ళపై నిలబడిన వాడికుండే ఆత్మవిశ్వాసం వేరు. ఓ పిల్లవాడు, ఓ సాప్ట్ వేర్ కుర్రాడికి జరిగిన సంభాషణ ఓసారి వినండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ కి ఇదో దృష్టాంతం.
ఆరోజు ఎప్పటిలా నేను నా ఆఫీసు వర్క్స్ ముగించుకుని లోకల్ ట్రైన్ లో బయలు దేరాను.. నాముందు ఒక పన్నెండు సంవత్సరాల కుర్రాడు ఖాళీ గంపతో కొంచెం అలసటతో కనిపించాడు..
* నేను ఏం తమ్ముడూ!! పూర్తిగా అమ్మేసావా సమోసాలు..
* అవును సార్!
* పాపం రోజంతా కష్టపడుతున్నావ్?
* అవును సార్!! ఏంచేస్తాం.. పొట్ట కోసం తప్పదు కదా!!
* ఒక సమోసా అమ్మితే దానిలో నీ లాభం ఎంత వస్తుంది???
* ముప్పావలా వస్తుంది సార్!!
* రోజుకు ఎన్ని సమోసాలు అమ్ముతావు??
* మంచి గిరాకీ ఉన్నప్పుడు దాదాపు 3,000 – 3,500 అమ్ముతాను.. సరాసరి ఒక రోజుకు 2,000 ఖచ్చితంగా అమ్ముతాను సార్!!
* నా మెదడు ఒక్కసారిగా లెక్కలు వేయడం మొదలెట్టింది. రోజుకు 2,000 అంటే 1,500రూ.. నెలకు 45,000రూ. ఓరి దేవుడో.. నా నెల జీతం 15,000రూ మాత్రమే.. వీడు నాకంటే బెటర్ గా ఉన్నాడనుకున్నాను.
*తమ్ముడు మీరే తయారు చేస్తారా వీటిని?
* లేదన్నా మా యజమాని వేరే వారి దగ్గర కొని నాకిస్తాడు. నా పెట్టుబడేం ఉండదు.
* ఇవి కాకుండా ఏం చేస్తావు!!”
* వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అన్నా. పోయిన సంవత్సరం ఎకరం పొలం కొన్నాను… అక్క పెళ్ళి చేసాను… ఆ పొలం విలువ ఇప్పుడు పదిహేను లక్షలుంటుంది…?????????????
* నాకు మాటలు లేవు.. ఏదో అనుకుంటాం కానీ వీడి సంపాదన ముందు మనమెంత.. అనుకుని తమ్ముడు!! ఏం చదువుకున్నావు..
* మూడో తరగతి…
* ఏం నీకు చదవాలని లేదా!!!
* * * * ఆఖరి పంచ్‌ వాడిదైంది.
* సార్ నా వ్యాపారం నా పిల్లలకు ఇవ్వొచ్చు. కానీ నీ ఉద్యోగం నీ పిల్లలకు ఇవ్వలేవు కదా!!
ఇదే మా అయ్య నాక ు నేర్పిన నీతి… కానీ నాకు డబ్బు ఎలా సంపాదించాలో అర్థం అయ్యింది… ఇక నాకు చదువు అక్కరలేదు.

.....ఫార్వర్డ్ మెసేజ్......

నివృత్తి ధర్మాన్ని ఎలా సాధించాలి?

‘‘ధరతీతి ధర్మః’’, ధారణాత్‌ ధర్మః ఇత్యాహుః’’- అంటే ప్రపంచాన్ని ధరించేది (రక్షించేది) ధర్మం. వేదాలు ఈ ధర్మాన్ని నిర్ధేశించాయి. మన ప్రపంచంలో రకరకాల ధర్మాలు ఉన్నప్పుడు- వేదాలు నిర్దేశించిన ధర్మాన్ని మాత్రమే ఎందుకు పాటించాలనే అనుమానం కలగటం సహజం. మన సంప్రదాయం ప్రకారం- వేదాలు అపౌరుషేయాలు. అంటే మానవ కల్పితాలు కావు. అవి జ్ఞాన సాగరాలు. వాటిలో ఈ ప్రపంచంలోని జీవ రాశులకు కావల్సినవన్నీ ఉన్నాయి. అలాంటి వేదాలు ధర్మాన్ని- ప్రవృత్తి, నివృత్తి అని నిర్వచించాయి. ‘‘ద్వివిధోహి వేదోక్తో ధర్మః ప్రవృత్తిలక్షణో నివృత్తి లక్షణశ్చ జగతః స్థితికారణమ్‌’’ అని శ్రీశంకరులు గీతాభాష్యంలో ప్రవచిస్తారు. దీని ప్రకారం చూస్తే- ప్రవృత్తి ధర్మం అంటే ముందుకు పోవటం. నివృత్తి ధర్మం అంటే వెనకకు సవరించుకోవటం. ఈ రెండు ధర్మాలు ప్రపంచంలోని అన్ని ప్రాణులకు సహజమైనవి.

రెండు ముఖ్యమే..
ఈ ప్రకృతిలో ఈ రెండు ధర్మాలు ముఖ్యమైనవే. దీనికి సంబంధించి రెండు ముఖ్యమైన ఉదాహరణలను గమనిద్దాం. ఒక శిశువు జన్మించాడనుకుందాం. అతను పెరిగి, పెద్దవాడవుతాడు. విద్యాపారంగతుడవుతాడు. ఉద్యోగం చేసి ధనం సంపాదిస్తాడు. గృహస్తు అవుతాడు. పిల్లలు పుడతారు. అలా వంశం వృద్ధి అవుతుంది. ఇదంతా ప్రవృత్తి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అతని ఎదుగుదల ఆగిపోతుంది. అతను నెమ్మదిగా కుంచించుకుపోతూ ఉంటాడు. ఇది నివృత్తి. మొక్కలలో కూడా మనం ఇలాంటి ఉదాహరణలను గమనించవచ్చు. ఈ ఉదాహరణలో మనం మొదటి ప్రవృత్తి, ఆ తర్వాత నివృత్తిలను గమనించవచ్చు. ఇవి ఒక దానిని విడిచి మరొకటి ఉండవు. ప్రవృత్తి ప్రేమ ప్రధానమై అభ్యుదయానికి దారి చూపితే- నివృత్తి శ్రేయస్సు ప్రధానమై ముక్తికి మార్గం చూపిస్తుంది.

మనసు ధర్మాలు..
మన మనసుకు కూడా ఈ రెండు ధర్మాలు వర్తిస్తాయి. జీవితంలో ముందుకు సాగిపోవటం ప్రవృత్తి. అవరోధాలు ఎదురయినప్పుడు కొద్దిగా వెనక్కి తగ్గటం, మనను మనం రక్షించుకోవటం నివృత్తి. మనసుకు సంబంధించిన ప్రవృత్తి, నివృత్తులు చాలా కీలకమైనవి. మెలుకువలో ప్రవృత్తిలో ఉన్న మనసు, ఇంద్రియాలు- నిద్రించే ముందు నివృత్తిలోకి చేరతాయి. ముందుగా కర్మేంద్రియాలు, ఆ తర్వాత జ్ఞానేంద్రియాలు, మనసు ఇలా వివిధ విషయాల నుంచి వెనుదిరిగి ఆత్మలో కరిగిపోతాయి. ఆ తర్వాత మెలుకువలో మళ్లీ ప్రవృత్తిలోకి వస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. నివృత్తితో పాటుగా ధర్మాన్ని కూడా అలవరుచుకున్నప్పుడు మాత్రమే నిజమైన ఫలితం లభిస్తుంది. అంటే- కేవలం నిద్రపోవటం వల్ల నివృత్తి అయితే చాలదు. జ్ఞానం కూడా ఉండాలి. అప్పుడే మోక్షం లభిస్తుంది.

ధీరులెవ్వరు..
నివృత్తి ధర్మాన్ని ఎలా సాధించాలి? అనే ప్రశ్నకు శాస్త్రాలలో సమాధానముంది. నివృత్తి ధర్మాన్ని చేరుకోవటానికి మొదటి మెట్టు ఇంద్రియ స్వేచ్ఛను అరికట్టడం. ఆ తర్వాత వివిధ విషయాలలో ఉన్న దుఃఖాన్ని గుర్తిస్తూ.. వాటిని వివేకంతో విశ్లేషిస్తూ, అనవసరమైన వాటిని వదిలేయాలి. అప్పుడే మనసు నివృత్తి చెంది ఆత్మను తెలుసుకోగలుగుతుంది. ఇలాంటి మార్గం కేవలం సద్గురువుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. సద్గురువుల సాంగత్యం వల్ల ప్రవృత్తి, నివృత్తిల ధర్మ సూక్ష్మాలను గ్రహించే జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞాన సాధన వల్లే మోక్షం లభిస్తుంది.

తేడా పాఠంలో లేదు. నేర్చుకునేవాడిలో ఉంది.

ఇద్దరు అన్నాదమ్ములు.
ఒకడు తాగుబోతు. ఒకడు ప్రయోజకుడు.
తాగుబోతును నువ్వెందుకిలా అయ్యావు అని అడిగితే...
"అంతా మా నాన్న వల్లే... ఆయన తాగుబోతు. మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడూ కొట్టేవాడు. ఏదో నేరం చేసి జైలుకి వెళ్లేవాడు.... అందుకే నేనిలా తయారయ్యాను." అన్నాడు.
ప్రయోజకుడిని నువ్వెందుకిలా అయ్యావు అని అడిగితే
"అంతా మా నాన్న వల్లే... ఆయన తాగుబోతు. మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడూ కొట్టేవాడు. ఏదో నేరం చేసి జైలుకి వెళ్లేవాడు.... అమ్మని కొట్టేవాడు... ఆయన్ని చూసి నేనేం చేయకూడదో నేర్చుకున్నాను. అందుకే నేనిలా తయారయ్యాను." అన్నాడు.

ఒకే పరిస్థితి.
ఇద్దరికీ వేర్వేరు పాఠాలను నేర్పించింది.
తేడా పాఠంలో లేదు.
నేర్చుకునేవాడిలో ఉంది.

సృష్టిలో ప్రతివస్తువుకూ కూడా ఏదో ఒక ధర్మం ఉంతుంది.

💐💐💐💐💐💐💐💐💐

సృష్టిలో ప్రతివస్తువుకూ కూడా ఏదో ఒక ధర్మం ఉంతుంది. దానిని అది ఓగుట్టుకోకూడదు. అలా దాని ధర్మాన్ని అది పోగొట్టుకుంటే అదె నాశనమైనట్లే. అగ్నికి వేడి ధర్మం. వేడి లేకుంటే అది అగ్నే కాదు. అయస్కాంతానికి ఇనుము నాకర్షించడం ధర్మం. ఆ ధర్మం అది కోల్పోతే అది అయస్కాంతం కానట్లే. మనుష్యునిది మనుష్య ధర్మం. ఇలాగే పశువుది పశు ధర్మం. విశ్వమందలి గ్రహనక్షత్రాదులు కేవలం పరస్పరాకర్షణతో ఉన్నాయి. ఏ ఒక్కటి దాని ధర్మం తప్పినా మొత్తం పతనమై ప్రళయం వస్తుంది. కాబట్టి ఏవీ తమ ధర్మం తప్పకూడదు. మనమూ మన ధర్మం తప్పకూడదు.

సర్వజన సమ్మతమైనది హిందూ ధర్మం. అనేకంలో ఏకత్వాన్ని చూడగల సామర్ధ్యం దీనికే ఉంది. ఈ ఏకత్వం కనపడక అనేకత్వం కనపడితే ఆ లోపం మనదే. ధర్మమే హిందువు యొక్క ఆత్మ. దీన్ని బాగా అర్ధం చేసుకోవాలి. భారతదేశ ఆత్మ ధర్మం కాబట్టే ఈ దేశంలో ధార్మికులైన హిందువులు తినటం, త్రాగటం, శయనించటం కూడా ధర్మబధ్ధంగానే చేస్తారు. పుట్టినప్పటినుండి మరణించేదాకా, సరిగా చెప్పాలంటే పుట్టకముందు నుండి చనిపోయాక కూడా ధర్మబధ్ధులయ్యే ఉంటారు. ఈ విషయాలన్నీ అనంతర భాగాల్లో చూస్తాము. పుట్టకముందు పుంసవన, సీమంతాది ధర్మకర్మలుంటాయి. చనిపోయాక అంత్యక్రియ, శ్రాధ్ధకర్మలుంటాయి. అంటే హిందువుది పూర్తిగా ధర్మమయ జీవితం. ఆ ధర్మము తప్పితే బ్రతికినా హిందువు నిర్జీవుని లెక్క. కాబట్టి ప్రతి హిందువు ధర్మమెరిగి ఆచరించి తీరాలి.
  
ఐహిక, పారమార్ధిక ప్రయోజనాలు సాధించే ఈ ధర్మానికి నాలుగు లక్షణాలు ఉంటాయి. 1. వేద ప్రతిపాదితమై ఉండాలి. 2. సంస్కృతిలో విశదీకరింపబడి ఉండాలి. 3. పెద్దల ఆచరణలో ఉండాలి. 4. మనకు ప్రియమైనది కావాలి.. ధర్మానికి పెద్దలు చెప్పిన ధృతి క్షమాది పది లక్షణాలుండాలి. వానితోబాటు హిందూ ధర్మంలో ప్రధానాంశాలుగా దైవవిశ్వాసం, సదాచారం, శారీరక కర్మాధారమైన వర్ణధర్మం, మానసిక పరిణతి ఆధారంగా ఆశ్రమ ధర్మం, స్త్రీ స్తీత్వం, విగ్రహారాధన, యోగవిధి, బ్రహ్మ--దేవ--పితృ--భూత--మానుష పంచయజ్ఞాలు,: అన్నమయ--ప్రాణమయ==మనోమయ-విజ్ఞానమయ--ఆనందమయ-- పంచకోశ పవిత్రత: శృతి, స్మృతి, పురాణ, మంత్ర తంత్రాది విశ్వాసం, : కర్మ సిధ్ధాంత విశ్వాసాలు, నిర్గుణ, సగుణోపాసన ముక్తి విశ్వాసాలు ఇమిడి ఉన్నాయి. ఈ ధర్మం విశ్వధర్మం. దీనిని రక్షించటమంటే  విశ్వాన్నే సంరక్షించటమని అర్ధం. అలాటి ధర్మరక్షణకు మనమంతా బధ్ధులం కావాలి..
💐💐కల్యాణ్ మల్లాది💐💐

సత్సంగం అంటే ఏమిటి?1) సత్పదార్థేన సంగః   (2) సత్ శాస్త్రేణ సంగః     (3) సజ్జన సంగః అని మూడు విధాలుగా వివరించారు.

సత్పదార్థమంటే ఈ సృష్టికి ఆధారభూతమైన తత్త్వం.  అట్టి తత్త్వ స్వరూపానికి ఆద్యంతాలు లేవు.  చావు పుట్టుకలు లేవు.  వినాశం వుండదు.  కనుక ఆ పరమాత్మ తత్త్వం నిత్య సత్యమై, శాశ్వతమై శోభిల్లుతుంది.  అట్టి ఈ తత్త్వాన్ని గ్రహించాలంటే మనకు ప్రమాణం వేదశాస్త్రాలే.  వాటిని మనంతట మనమే గ్రహించలేము కనుక వాటిని బొధ పరచే ఓ సజ్జనుడు కావాలి.  వారినే గురువు అంటాం.  అట్టి గురువునే సజ్జనుడని, వేదశాస్త్రములనే సచ్చాస్త్రమని, పరమాత్మ తత్త్వాన్ని సత్పదార్థమని, వీటితో సంగాన్ని పెంచుకోడాన్నే సత్సంగమని శాస్త్రాలు పేర్కొన్నాయి.

"మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)"

మంచికథ......

ఒక సారి చాణిక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను" అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి "నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను "మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)" అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.

మొదటి జల్లెడ"నిజం" - "నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?" అని అడిగాడు.

అందుకు ఆ స్నేహితుడు "లేదు, ఎవరో అంటుండగా విన్నాను" అని అన్నాడు.
"అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట" అని చాణిక్యుడు అన్నాడు.

సరే రెండో జల్లెడ "మంచి " - " నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?" అని అడిగాడు చాణిక్యుడు,

"కాదు" అన్నాడు చాణిక్యుని స్నేహితుడు .

"అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం"అన్నాడు చాణిక్యుడు.

మూడో జల్లెడ "ఉపయోగం" - "నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? " అని చాణిక్యుడు అడిగాడు.

"లేదు" అన్నాడు ఆ మిత్రుడు.

"అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?" అని అన్నాడు చాణిక్యుడు

నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.

సర్వేజనా సుఖినోభవంతు🙏🏾🙏🏾🙏🏾

యద్భావం తద్భవతి!


ఒక సన్యాసి, దేవుడి కోసం తపస్సు చేశాడు. అతడి దీక్ష ఫలించి దేవుడు ప్రత్యక్షమై- మూడుసార్లు అతను మనసులో ఏది తలచుకుంటే అదే జరుగుతుందనే వరమిచ్చాడు. వెంటనే ఆ సన్యాసి సకల సదుపాయాలతో ఒక రాజభవనం లాంటి భవంతి కావాలనుకున్నాడు. వెంటనే భవంతి ప్రత్యక్షమయింది. అందమైన యువతితో వివాహం జరగాలి అనుకున్నాడు. అదీ జరిగింది. ఒక్కసారిగా సంప్రాప్తించిన సుఖభోగాలకు తట్టుకోలేని ఆ వ్యక్తి 'కొంపదీసి ఇవన్నీ మాయమవుతాయా!' అనుకున్నాడు. అంతే, తక్షణం ఆ సన్యాసి తన పూర్వపు స్థితికి వచ్చేశాడు.
మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయో, ఫలితాలు అలానే ఉంటాయనేది ఈ కథలోని నీతి.
ఈ భావాన్నే శ్లోకం రూపంలో 'యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాతృశి' అన్నారు వేదాంతులు.
మృతుల్ని బతికించే మృత సంజీవనితోపాటు పిచ్చిమొక్కలు, విషపుమొక్కలు కూడా నేలతల్లినుంచే ఉద్భవిస్తాయి. అలాగే మంచి ఆలోచనలతోపాటు చెడుతలంపులకూ మానసిక క్షేత్రమే కేంద్రబిందువు. మంచి ఆలోచనలు ఆచరణలో పెడితే మానవాళికి మహోపకారం. చెడు ఆలోచన కలిగించే ఫలితాలతో మానవాళికి మారణహోమం. ఒక మంచి తలంపు మనిషికి జీవం పోస్తే ఒక చెడు ఆలోచన ప్రాణం తీస్తుంది. మంచి ఆలోచనల విలువ అపారం. అది వెలకట్టలేనిది.
ఒక వూళ్ళో పాపయ్య, పోచయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరిని మించి ఇంకొకరు గొప్పవాళ్ళయిపోవాలనే దురాశతో దేవుడు ప్రత్యక్షం కావడం కోసం దీక్ష చేపట్టారు. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకొమ్మన్నాడు, ముందుగా పాపయ్యను. తన శత్రువు పోచయ్య ఏం కోరుకుంటాడో దానికి రెట్టింపు ఇమ్మన్నాడు పాపయ్య. తరవాత దేవుడు పోచయ్యకు ప్రత్యక్షమయ్యాడు. పాపయ్య కోరుకున్నదేమిటో తెలుసుకొని పోచయ్య తన కన్ను ఒకటి తీసెయ్యమన్నాడు. అలా తన శత్రువైన పాపయ్య రెండుకళ్ళు పోగొట్టాడు పోచయ్య. మనం చెడిపోయినా ఫరవాలేదు, తోటివాడు మాత్రం బాగుపడకూడదనే పాశవిక ఆలోచనలు ఎంతటి దుష్ఫలితాలు కలిగిస్తాయో ఈ కథ తెలియజేస్తుంది. 'చెరపకురా చెడేవు' అనే సామెత ఇలాగే పుట్టింది.
మనం ఇతరులకు ఏమి ఇస్తామో, అదే మనకు దక్కుతుంది. ఆనందం ఇస్తే ఆనందం, బాధ కలిగిస్తే బాధ. ఈ లోకం నుంచి ఏది కావాలని కోరుకుంటామో అదే లోకానికి ఇవ్వాలి. మనం కోరుకున్నదే మనకు దక్కుతుంది. 'యద్భావం తద్భవతి'. మనం శుభం జరగాలని మనసా వాచా కర్మణా వాంఛిస్తే అదే జరుగుతుంది. అంచేత అందరికీ మంచే జరగాలని కోరుకుందాం. సమస్త మానవాళి సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని దీవించే పవిత్ర వేదప్రవచనాన్ని మననం చేసుకుందాం.
సర్వే జనాః సుఖినోభవంతు... లోకాః సమస్తాః సుఖినో భవంతు!

Thursday, 12 January 2017

కోవెల అమ్మవారికి. కదా? ఆమెయే చూసుకుంటుంది

1945 ఫిబ్రవరిలో పరమాచార్య స్వామివారు రాణీపెట్టైలో మకాం చేస్తున్నారు. అక్కడ నివసించేవారు దాదాపుగా హైందవేతరులే అయినా కులమతాలకతీతంగా మహాస్వామివారి దర్శనానికి వచ్చేవారు. రాణీపెట్టై సమీపంలోని నావల్పూర్ ప్రజలు “కరుమారుయమ్మన్ దేవి” ఆలయం కట్టడానికి లక్షలలో నిధులు కావాలని గ్రహించి కాస్త కలత చెందారు. పరమాచార్య స్వామివారి ఆశీస్సుల కోసం వారు స్వామివారి దర్శనానికి వచ్చారు.

“మేము ఒక మంచి కార్యక్రమం చెయ్యలనుకున్నాము. దానికి కావాల్సిన నిధులు మావద్ద సమృద్ధిగా లేవు.

పరమాచార్య స్వామివారు మమ్మల్ని అనుగ్రహించాలి“ అని వేడుకున్నారు. స్వామివారు కొద్దిసేపు మౌనం వహించి, “కోవెల అమ్మవారికి. కదా? ఆమెయే చూసుకుంటుంది” అని చెప్పారు.

“మాకు ఆ నమ్మకం ఉంది కాని కావాల్సిన ధనంలో పాతికవంతు కూడా సేకరించలేకపోయాము. . . ”.

అందుకు మహాస్వామివారు “నేలపై నాలుగడుగుల ఎత్తున నిర్మాణం చెయ్యండి” అని చెప్పారు.

”మరి గోపురం, విగ్రహాలు, కుంబాభిషేకం మొదలగువాటికి ఎలా?” అని అడిగారు వారు.

”వాటన్నిటి కోసం ఒక వ్యక్తి వస్తాడులే” అన్నారు.

వారికి ఒక దేవరహస్యం అవగతమైంది. కాని “ఎప్పుడు వస్తాడు? ఎలా గుర్తుపట్టాలి?” అని పలు సందేహాలతో సంతోషంతో ప్రసాదం స్వీకరించి, అనుమానంతో, కలతతో వెళ్ళిపోయారు.

ఈ సంఘటన జరిగినది ఫిబ్రవరి 14, 1945న. మరి ఆ వ్యక్తి ఆరోజు ఎక్కడున్నాడు?

1939లో ప్రారంభమైన రెండవ ప్రపంచ యుద్ధం 1945 వరకు కొనసాగింది. అలీన సేనలు బర్మాలోని ఐరావతి నది వద్ద జపాన్ తో తలపడుతున్నాయి. జపాన్ సైన్యం తూర్పు ఒడ్డున, అలీన సేనలు పశ్చిమ ఒడ్డున పోరాడుతున్నాయి. అలీన సేనలకు ఆ ప్రాంతము, ఆ వాతావరణము అంతగా అలవాటు లేదు. నదీజలాల దగ్గర యుద్ధం చేయగల నైపుణ్యం కలిగిన వారిని ఇక్కడకు పంపవలసిందిగా అలీన సేనలకు నాయకత్వం వహిస్తున్న మేజర్ లండనుకు అత్యవసర సమాచారం పంపారు. అటువంటి యుద్ధనైపుణ్యం కలిగిన బెటాలియన్ మడగకార్.

ఆ సైనిక దళాన్ని వెంటనే ఐరావతికి పంపారు. భారత సైనికులను ఒడ్డుకు పంపి వారు నదిలోకి దిగారు. ఈ హఠాత్పరిణామాన్ని జీర్ణించుకోలేని జపాన్ సేనలు రాక్షసులుగా మారి ఒడ్డున ఉన్నవారిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారు. ఆ ఊతకోచలో కేవలం ఒక్కరే బ్రతికి బయటపడ్డారు.

”నేను ఒక్కడినే ఎందుకు బ్రతికాను దేవుడా?”

1945 మేలో జెర్మనీ ఓటమితో యుద్ధం ముగిసింది.

ఐరావతి యుద్ధంలో బ్రతికి బయటపడ్డ మేజర్ నారాయణస్వామి, సైన్యం నుండి విరమణ పొందిన తరువాత భార్య చంద్రికతో కలిసి రాణిపెట్టైలో నివాసం ఏర్పరుచుకున్నాడు. ఒకరోజు సాయింత్రం వారు నడుడుచుకుంటూ వెళ్తుండగా అనుకోకుండా అసంపూర్తిగా ఉన్న మందిరాన్ని ఆరుబయట అలా ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్న అమ్మవారిని చూశారు. “చూడు! నన్ను ఎలా వదిలేశారు. నేను అంతటి భయంకర యుద్ధం నుండి నిన్ను కాపాడితే, నాకు ఒక నీడ కల్పించవా” అని అమ్మవారు అడిగినట్టు అనిపించింది.

మహాస్వామివారి దర్శనానికి వచ్చిన ఆ భక్తులందరి ఆనందభాష్పాలతో ఆ ప్రాంగణం అంతా నిండిపోయింది. ”ఈయన మిలటరి మేజర్ నారాయణస్వామి, ఆవిడ ఈయన భార్య. ఆలయ నిర్మాణాన్ని వారు పూర్తిచేసి, కుంబాభిషేకం కూడా చెయ్యడానికి ముందుకు వచ్చారు. కొద్దిరోజుల క్రితం అచ్చం స్వామివారు చెప్పినట్టుగానే”

పరమాచార్య స్వామివారి ‘కరుణాకటాక్షం’ ఆ దంపతులపై ప్రసరించి వారిని పునీతులను చేసింది.

బ్రహ్మం గారి కాలజ్ఞాన అంశాలు

1)వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి ఔతారు. మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానం ఔతుంది.
2)రాజులు తమ ధర్మాన్ని మరచి విందులూ వినోదాలలో మునిగి ధర్మ భ్రష్టూలౌతారు.
 3)శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం ఔతారు.
 4)పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది.
  5)బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించటం వలన దేశం కల్లోలితమౌతుంది.
 6)చోళమండలం నష్టాలపాలౌతుంది.
    వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు.
  7)ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు.కొడలు మండుతాయి.
    8)జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులూ అలాగే చస్తాయి.
    9)దుర్మార్గులు రాజులౌతారు. మంచి ప్రవర్తాన కలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారు.
    10)మతకలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు.
    11)అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.
    12)నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు.
    ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు.
    13)మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు.
    14)పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువౌతాయి.
    15)ఒకరి భార్యను ఒకరు వశపరచుకుంటారు. స్త్రీ పురుషులిర్వురూ కామపీడితులౌతారు.
    16)వేంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు.
    17)ఐదువేల ఏళ్ళ తరువాత కాశీలో గంగ కనిపింకుండా మాయమై పోతుంది.
    18)చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమౌతాయి.
    19)కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది. అది చూసినవారికి కండ్లు పోతాయి.
    20)ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది.
   21)ఐదువేల ఏళ్ళ తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి ధ్ర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు.
    22)వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.
    23)కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి.
    24)తూర్పు నుండి పడమరకు ఒక యోజనము ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనపడుతుంది.
 25)ఎంతో మందిమార్బలం ఉన్నా రాజులు సర్వనాశనమైపోతారు.గ్రామాలలో చోరులు పెరిగిపోతారు.
    26)పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి.
    విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు.
    27)రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తామ చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.
    28)శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలా కూసి మాయమౌతుంది.
    29)శ్రీశైలంలో అగ్ని వర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న(నందీశ్వరుడు)రంకెలు వేస్తాడు ఖణ ఖణమని కాలు దువ్వుతాడు.
    30)సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది.
    31)విషవాయువు కొట్టినప్పుడు శివునికంట నీరు కారుతుంది.
    32)గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వానకురుస్తుంది.
    33)సూర్య్డు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు.
  34)నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది.
     35)విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది.అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది.అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి.
   36)ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి.ఆధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు.జనులు అరచి అరచి చస్తారు.
   37)కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు.
  38)బనగాన పల్లె నవాబు పాలనకూడా క్రమంగా నాశనమౌతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.
39)నేను శ్రీ వీరభోజ్యుడినై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను. కలియుగం 5000 సంవత్సరములు గడిచిన తరువాత దుష్ట శిక్షణ శిష్ట రక్షనార్ధం వస్తాను.

నేను వచ్చే ముందు సంభవించే పరిణామాలు విను.
    40)ఉప్పుకొడూరులో ఊరచెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించి పోతారు.
    41)14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం.
    44)నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు.
    45)5972 ధాతు నామ సంవత్సరాన మాఘ శుద్ధ బుధవారం రోజున పట్ట పగలే 18 పట్టణాలు దోపిడీకి గురౌతాయి.
    46)కోటిదూపాటిలో కొచ్చర్లకోటలో కోడి మాట్లా

డుతుంది. జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ము దిగమ్రింగి అబద్ధాలాడి బాకీలు ఎగకొడతారు.
    47)కోమటి కులంలో 25 గోత్రాలవారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.
    48)మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
    49)పట్ట పగలు ఆకాశంలోనుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.
    50)పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది.
    51)బనగాన పల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేపచెట్టుకు చేమంతిపూలు పూస్తాయి.
    52)గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగాన పల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు.ఆ తరువాత బనగాన పల్లెను ఇతరరాజులు స్వాధీనపరచుకుంటారు.
    53)అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది.అందువల్ల ఎందరో నష్టపోతారు.
    54)గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం ఏలుతారు.
    55)మహానంది మరుగున మహిమలు పుడతాయి.
    56)నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. మూఢులు మాత్రం నమ్ముతారు.
    56)మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగినవారు వస్తారు. వారిని చూసి నేనని భ్రమపడవద్దు. నారాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లెపెరిగి పట్టణంగా మారుతుంది.
    57)కంచి కామాక్షమ్మ కన్నులవెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు.
    58)ఆవు కడుపులోని దూడ అదేవిధంగా బయటకు కనిపిస్తుంది.
    59)పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.
    60)కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడను పేర శైవుడు జన్మించి మతభేదం లేక గుడులూ గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామ దేవతలు ఊగిసలాడతారు.
    61)కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గి పోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.
    62)ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకూ ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి.
    63)పతివ్రతలు పతితలౌతారు. వావి వరసలు పాటించకుండా ప్రవర్తిస్తారు. ఆచారాలన్నీ సమసి పోతాయి.
   
64)రాయలవారి సింహాసనం కంపిస్తుంది. కురుమ సంతతి రాజులందరినీ జయించి దక్షిణంగా బోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను తరిమి యుద్ధాలు చేసి నర్మదానదిలో కత్తులు కడిగి కాశీకి వచ్చి రాయల తల చూస్తారు. ఈ సమయంలో హస్థినాపురిలో మహామారి అనేశక్తి పుడుతుంది. రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది.
  65)శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. మందుమాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి. స్త్రీ పురుషులంతా దురాచార పరులౌతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.
    66)ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.
    67)వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గి పోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలుతాయి. బెండ్లు మునుగుతాయి. చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది.
    68)విజయనగరాన కోటలో రాయల సింహాసనం బయట పడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామంలో రాతి విగ్రహాలు ఊగిసలాడతాయి. అప్పుడు బిజ్జల రాయుని కొలువులో రాయలసింహాసనం బయట పడుతుంది.

ఇలా బ్రహ్మంగారు కడపనవాబుకు కాలజ్ఞానంబోధించి, మంత్ర దీక్ష ఇచ్చి ఆశీర్వదించాడు.
పుష్పగిరిసవరించు

    నేను కలియుగం 5,000 సంవత్సరంలో వీరభోగవసంత రాయలుగా దుష్ట శిక్షణా, శిష్టరక్షణార్ధం భూమిపై అవతరిస్తాను. మార్గశిర మాసంలో దక్షిణభాగంలో ధూమకేతువనే నక్షత్రం ఉదయించి అందరికీ కనపడుతుంది. క్రోధినామ సంవత్సరమున మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో నేను అవతరించే సమయంలో దక్షిణాన ఒక నక్షత్రం పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి.
    నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులౌతారు.
    వేదములు అంత్య జాతుల పాలౌతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్థుల పంచన చేరుతారు. విప్రులు విధవా వివాహాలు చేస్తారు. స్వవృత్తి, ధర్మాలు మాని ఇతరులకు బానిస వృత్తి చేస్తారు.
    బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంటభూములు అమ్ముకుంటారు. నేను వచ్చేసరికి వారికి తిండి గుడ్డ కరువు ఔతాయి. మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంత రాయలుగా ఉద్భవిస్తాను. నాలుగు మూరల ఖడ్గం చేత పట్టి శ్రీశైల పర్వతం మీదకు వచ్చి అక్కడి ధనం అంతా పుణ్యాత్ములైన వారికి దానం చేస్తాను.
    నేను భూమి మీదకు ఎలా వస్తానో మరొకసారి చెప్తాను వినండి. కేదారి వనంలో నిరాహారినై జపము చేస్తాను. మూడు వరాలు పొంది అక్కడి నుండి విక్రమ నామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకుని తపసు చేసి అక్కడ మహామునులను, మహర్షులను దర్శనం చేసుకుంటాను. అటు నుండి బయలుదేరి శ్రీశైలం మల్లిఖార్జునుని సేవించి దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుంటాను. మహానందిలో రెండు రోజులుండి అక్క

డి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమినాటికి నారాయణపురం చేరుకుని అక్కడ కొంతకాలం నివసిస్తాను.
    నేను తిరిగి వచ్చేసరికి జనులు ధనమధాంధులు, అజ్ఞానులై కొట్టుకు చస్తారు.
    నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి. పర్వతాలమీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగుల కొడతారు.
    కాశీదేశంలో కలహాలు చెలరేగుతాయి.
    నేను వచ్చేసరికి విధవావివాహాలు జరగటం మామూలై పోతుంది.
    వావి వరసలు లేకుండా వివాహాలు జరుగుతాయి. కుల గోత్రాలు నీతి జాతీ లేని పెళ్ళిళ్ళు జరుగుతాయి. పార్వతీ అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు.
    అరణ్యంలోనూ భూమిలోనూ ధనం ఉండేను. నేను భూమిపై పెక్కు దృష్టాంతాలు పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమిపై మంటలు పుడతాయి.
    నాలుగు సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. నూట ఇరవై తిరపతులు పాడయ్యేను.
    నా రాకకు ముందు అనేక చిత్రములు జరిగేను. శృంగేరి,పుష్పగిరి పీఠములు పంచాననం వారి పాలౌతాయి.
    ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది.
    హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి.
    అహోబిలంలో ఉక్కు స్థంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూస్తాయి.
    నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది.
    వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి సూర్యమండలం నుండి కొలువు పాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలం, తర్వాత సూర్యనంది చేరుకుంటాను.
    శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4,999 సంవత్సరాలకు కలిరూపం కొంత నాశనం ఔతుంది.
    శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ 'గణ గణ'మని గంటలమోత వినబడుతుంది.
    బ్రమరాంభ దేవాలయంలో ఒక ముసలి 7 రోజులుండి అదృశ్యం అవుతుంది. బ్రమరాంభ మెడలోని మంగళసూత్రాలు తెగి పడిపోతాయి. ఆమె కంట నీరు కారుతుంది. పాలిండ్లనుండి పాలుకారుతాయి.
    కందనూరి గోపాలుని గుడి ముందు చింతచెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయంలో రెండు పాములు తిరుగుతాయి. వాటిలో పెద్ద పాము శిఖరాన మూడు రోజులుండి అదృశ్యమౌతుంది.
    సూర్యనందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలుపూచి, కాయలుకాచి,పండ్లు పండి వెనువెంటనే మాయమౌతుంది.
    శిరువెళ్ళ నరశింహుని దుట గంగిరావిచెట్టు మొలుస్తుంది. బహుధాన్య నామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు.
    బసవన్న రంకె వేస్తాడు. తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమట పడుతుంది. కంట నీరు,పాలిండ్ల పాలూ కారుతాయి.
    శాలివాహన శకం 1541న ధూమకేతువు పుడుతుంది. 1555నాటికి వివిధ దేశాలలో జననష్టం కలుగుతుంది.
    పెమ్మసాని తిమ్మన్న వంశం నిర్వంశమయ్యేను. ఉదయగిరి, నెల్లూరు రూపు మాసి పోయేను. గండికోట, గోలకొండ, ఆదలేని, కందనూరు పట్టణాలు నశించి తురకలు పారి పోతారు. విజయపురంలాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశించేను.
    స్త్రీల కంట నెత్తురు బిందువులు రాలుతాయి. వడగండ్ల వాన కురుస్తుంది. బాణవర్షం కురుస్తుంది. బావులూ, చెరువులూ, నదుల నీరు ఇంకినా జజ్జేరు నీరు మాత్రం ఇంకిపోదు.

పంచాననంవారికి జ్ఞానబోధసవరించు

    మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకు వస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు.
    నేను వచ్చేసరికి బ్రాహ్మణులు వర్ణసంకర వృత్తులు చేస్తూ తమ వైభవం కోల్పోతారు. ఏ కులంవారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్దులూ యోగులూ జన్మించిన ఆ బ్రాహ్మణ కులం పూర్తిగా వర్ణసంకరమౌతుంది.
    ఆనాటికి ప్రజలలో దుర్బుద్ధులు అధికమౌతాయి.
    కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది.
    రాజాధిరాజులు అణిగి ఉంటారు. శూద్రులు వలాసాలను అనుభవిస్తూ రాజుల హోదాలో ఉంటారు. వారి ఇంట ధనలక్ష్మీ నాట్యమాడుతుంది. నా భక్తులైన వారికి నేనప్పుడే దర్శనమిస్తాను. కానివారి నెత్తురు భూమి మీద పారుతుంది. దుర్మార్గుల రక్తంతో భూమి తడుస్తుంది. భూభారం కొంత తగ్గుతుంది.
    చీమలుండు బెజ్జాల చోరులు దూరుతారు. స్త్రీలందరూ చెడుతలపుతో ఉంటారు. అందువలన చోరులు ప్రత్యేకంగా కనపడరు. బిలం నుండి మహానంది పర్వతం విడిచి వెళుతుంది. గడగ్ లక్ష్మీపురం, రాయచూర్, చంద్రగిరి అలిపేది, అరవరాజ్యం, వెలిగోడు, ఓరుగల్లు, గోలుకొంక్ల్డల్క్ల్క్ల్ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలననేంద్రియములు, ఆయుధాలచేత బాణముల వల్ల నశిస్తారు.

గతజన్మ వృత్తాంతంసవరించు

ఒకకరోజు సిద్ధయ్య బ్రహ్మంగారితో "స్వామీ! మీరు గతంలో త్రేతా, ద్వాపర యుగంలో కూడా జన్మించానని చెప్పారు. మీ పూర్వ జన్మ వృత్తాంతం నాకు వివరిస్తారా?" అని అడిగాడు. బదులుగా బ్రహ్మంగారు "నా గతజన్మల గురించిన వివరములు రహస్యములే అయినా, నీకు మాత్రం వివరించగలను. అని తన పూర్వ జన్మల గురించి చెప్పడం ప్రారంభించారు.

"బ్రహ్మలోకంలో నేను భైరవుడనే పేరుతో అనేక బ్రహ్మ కల్పాలు రాజ్యపాలన చేసాను. ఆ తరువాత వెండి కొండ మీదకు వెళ్ళి 54 బ్ర

హ్మ కల్పాలు రాజ్యపాలన చేశాను. అప్పుడే మూడు యోజనాల పొడవైన సింహాసనమును నిర్మించి 290 బ్రహ్మ కల్పాలు విష్ణు సేవ చేశ్శాను. నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు 'పంచవిద ముక్తి' అనే వరం ఇచ్చాడు. ఆ తరువాత సిద్ధాంత శిరోమణి ఆనందాశ్రితువు ఆశ్రమం వద్ద అన్ని విద్యలు అభ్యసించి మూడేళ్ళ తరువాత అనేక యోగశాస్త్ర విద్యలను నేర్చుకున్నాను. 12,000 గ్రంధములు పఠించి అందులోని అన్ని మర్మములు గ్రహించాను. వీటి ఫలితంగా నేను అకాలమృత్యువును జయించే శక్తిని సంపాదించాను. ఆ తరువాత నా యోగబలం వలన దివ్య శరీరం ధరించి మూడు వేల బ్రహ్మకల్పాలు చిరంజీవిగా ఉన్నాను. ఆతరువాత నా అవతారముల గురించి వివరముగా తెలుపుతున్నాను విను. మొదట అవతారమెత్తి ఆనందాశ్రితులకు శిష్యుడిగా 99,662 బ్రహ్మ కల్పాలు ఉన్నాను, మూడవ అవతారంలో 1,09,00,000 బ్రహ్మ కల్పాలు ఉన్నాను. నాల్గవ అవతారములో 1,00,01,317 కల్పాలు ఉన్నాను. అయిదో అవతారంలో 4కోట్ల పదఞాలుగు లక్షల 55 వేల బ్రహ్మకల్పాలు ఉన్నాను. ఆరవ అవతారంలో ఆరు వందల బ్రహ్మ కల్పాలు ఉన్నాను. ఏడవ అవతారంలో 27,63,03,400 బ్రహ్మ కల్పాలు జీవించాను. ఎనిమిదో అవతారంలో 22,60,000 బ్రహ్మ కల్పాలు ఉన్నాను. పదవ అవతారంలో కనిగిరిలో ఉన్నాను ఆ జన్మలో 70 లక్షల బ్రహ్మ కల్పాలు జీవించాను. ఇప్పుడు బనగాన పల్లెలో వీరప్పయాచార్యుడనై 125 సంవత్సరములు తపసు చేశాను. వీరబ్రహ్మేంద్ర స్వామిగా మొత్తం 175 సంవత్సరములు జీవించి జీవసమాధి పొందుతాను."

    నేను చనిపోయేలోగానే హరిహరరాయలు మొదలు రామరాయల వరకు చరిత్ర అంతమౌతుంది.
    ఆ తరువాతకాలంలో ఈ అఖండం మహమ్మదీయుల వశమౌతుంది.
    శ్వేతముఖులు భరతఖండాన్ని పాలిస్తారు.
    పల్నాటిసీమలో నరులు పచ్చి ఆకులు తిని జీవిస్తారు.
    మొగలాయి రాజ్యాన ఒకనది పొంగి చేలు నాశనమైన రీతిగా జనాన్ని నశింపచేస్తుంది.
    వ్యభిచార వృత్తి అంతరించి పోతుంది. ఆ వృత్తిలోని వారు వివాహం చేసుకుని కాపురం చేస్తారు.
    గురువులు ఆడంబరంగా జీవిస్తారు.
    కుటుంబంలో సఖ్యత ఉండదు. తల్లి, తండ్రి, పిల్లలు మధ్య వాత్సల్యాలు ఉండవు. ఒకరిని ఒకరు మీద ఒకరికి నమ్మకం నశిస్తుంది.
    నారాకకు ముందు నా భక్తులు వారి శక్త్యానుసారం నాధ్ర్మ పాలనకు అంకురార్పణ చేస్తారు. అని సిద్ధయ్యకు బ్రహ్మంగారు వివరించాడు.

కర్నూలు నవాబుకు జ్ఞానబోధసవరించు

    క్రోధనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీరభోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశనకరమైన గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది.
    చండిపూర్,అలంపూర్ స్థలములలో ఉత్పాతములు పుడతాయి. ఆ ప్రాంతంలో పాలెగాళ్ళు తమలో తాము కలహించుకుని చెడి భ్రష్టులై పోతారు.
    నలు దిక్కులయందు దివ్యమైన నక్షత్రాలుపుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి.
    అమావాస్య రోజున పున్నమి చంద్రుని చూసిన జనులు నశిస్తారు. నిజమని నా మహిమను తలచుకుంటారు.కార్తీక శుద్ధ ద్వాదశినాటికి విష్ణుభక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది.
    తూర్పున శిరసు పడమర తోకగా ఇరువది బారల ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన ముప్పై రోజుల వరకు అందరికి కనిపిస్తుంది. ఆకాశం ఎర్రపడుతుంది. ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్ధాలు పుడతాయి.
    ఈశ్వరమ్మని రంగరాజుకు ఇచ్చి వివాహం చేసే నాటికి నవరత్న మండపాలతో పన్నెండామడల పట్నం ఔతుంది. నా భక్తులు యావన్మంది ఇక్కడకు వచ్చి కల్యాణం చూస్తారు. అదే మీకు నిదర్శనం. ఈ కాలజ్ఞానం విని నవాబు బ్రహ్మంగారికి అనేక బహుమతులిచ్చి సత్కరించాడు.

పుత్రుడు గోవిందాచార్యులకు జ్ఞానబోధ
భార్య గోవిందమ్మకు జ్ఞానబోధసవరించు

వైశాఖ శుద్ధ దశమి అభిజిత్ లగ్నం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సమాధి కాలం నిర్ణయించాడు. ఇది విని విలపిస్తున్న గోవిందమ్మను పిలిచి "నాకు మరణం లేదు నీకు వైధవ్యంలేదు. నీవు సుమంగళిగా జీవించు. నేను సమాధినుండి వీరభోజ వసంతరాయలుగా వచ్చి నాభక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను వచ్చే వరకు ఏమేమి జరుగుతాయో నీకు జ్ఞానబోధ చేస్తాను" అని బ్రహ్మంగారు చెప్పాడు.

    బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది.
    మాహాలక్ష్మమ్మ నృత్యంచేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది.
    కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపుడక తాకుతుంది.
    కంచి కామాక్షమ్మ కంట కన్నీNiరు కారుతుంది.
    కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది.
    అచ్చమ్మ వంశం సర్వనాశనమై వారి వంశం అంతరించి పోతుంది.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles