Showing posts with label మహాభారతం. Show all posts
Showing posts with label మహాభారతం. Show all posts

Thursday, 27 July 2017

కర్ణుడికి దాన కర్ణుడని గదా పేరు

ఒకనాడు శ్రీకృష్ణుడు పొద్దున పొద్దున్నే కర్ణుని భవనానికి వెళ్ళాడట.

అప్పుడు కర్ణుడు అభ్యంగన స్నానానికి తయారవుతున్నాడు.

తలకు నూనె రాసుకుంటున్నాడు. కర్ణునికి ఎడమ వైపు రత్నాలు పొదిగిన బహువిలువైన గిన్నె నూనెతో వున్నది.

కృష్ణుడు వస్తూనే కర్ణా ఆ గిన్నె చాలా బాహున్నది నాకిస్తావా? అని అడిగాడు.

వెంటనే కర్ణుడు తీసుకో కృష్ణా అంటూ ఎడమ చేత్తో ఆ గిన్నె
యిచ్చాడు. కృష్ణుడు అదేమిటి కర్ణా ఎడమచేత్తో యిస్తున్నావు? కుడిచేత్తో యీయరాదా? అన్నాడు.

అందుకు కర్ణుడు
క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మావయో:
యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతి:

అర్థము:-- కృష్ణా!ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతి లోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు. లక్ష్మి
చంచల మైనది. యముడా దయలేనివాడు. మనస్సా మరు క్షణం లో ఎలా మారుతుందో తెలియదు. కనుక గిన్నె ఈ చేతినుంచు ఆ చేతికి పోయే లోపలే ఏ మార్పైనా రావచ్చు.

అందుకనే ధర్మ కార్యాన్ని ఆ క్షణమే
చెయ్యాలనే హితోక్తి ననుసరించి యిలా చేశాను.అన్నాడు.

అప్పుడు కృష్ణుడు కర్ణుని వివేచనకు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు.

అందుకు కర్ణుడు

దేహేతి వచనం కష్టం నాస్తీతి వచనం తదా
దేహీ నాస్తీతి మద్వాక్యం మా భూజ్జన్మ జన్మనీ

అర్థము:- కృష్ణా! యాచించడం ఎంత కష్టమో, లేదని చెప్పడం కూడా అంతే కష్టం.అంతే కాదు నీచం కూడా కనుక ఏ జన్మ లోనూ దేహీ(అని యాచించే) , నాస్తి(లేదు) అనే మాటలు నా నోటివెంట రాకుండు నట్లు అనుగ్రహించు. అని కోరాడు.

దీన్ని బట్టి కర్ణుడి వ్యక్తిత్వం ఎంతటి మహోన్నత మైనదో అర్థమవుతుంది.

దానం విషయం లో సదా సాత్వికమే ప్రధానం చెయ్యాలనే సంకల్పం కలుగ గానే ఆదరణ తో భగవదర్పణ బుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి.

దానం చేసి నేను చేశానని
డప్పు కొట్టుకోకూడదు.

ఏదైనా మంచి పని చెయ్యాలని అనిపించిన వెంటనే చేసెయ్యాలి ఆలస్యం విషం లాంటిది. అంటారు జ్ఞానులు.

మనము కర్ణుడి లాగా వ్యవహరించ లేకపోయినా మన శక్త్యానుసారం సత్పాత్ర దానం చేయడం అలవరుచుకోవాలి. ...

Friday, 13 January 2017

battle of Mahabharata

When Lord Krishna returned
home after the battle of Mahabharata, his wife Rukmani confronted him “How could you be party to the killing of Guru Drona and Bheeshma, who were such righteous people and had a lifetime of righteousness behind them.”

Initially Lord Krishna avoided her questions but when she did not relent, he replied “No doubt they had a lifetime of rightousness behind them but they both had committed one single sin that destroyed all their lifetime of righteousness”

Rukmani asked “And what was that sin?”

Lord Krishna replied “They were both present in the court when a lady (Draupadi) was being disrobed and being elders they had the authority to stop it but they did not. This single crime is enough to destroy all righteousness of this world”

Rukmani asked “But what about Karna?

He was known for his charity. No one went emptyhanded from his doorstep. Why did you have him killed?”

Lord Krishna said “No doubt Karna was known for his charity. He never said ‘No’ to anyone who asked him for anything. But when Abhimanyu fell after successfully fighting an army of the greatest warriors and he lay dying, he asked for water from Karna who stood nearby. There was a puddle of clean water where Karna stood but not wanting to annoy his friend Duryodhan, Karna did not give water to a dying man. In doing so his charity of a lifetime was destroyed. Later in battle, it was the same puddle of water in which the wheel of his chariot got stuck and he was killed.”

Understand that your one act of injustice can destroy your whole life of honesty.

This story is great example of Karma Theory in Path To Prosperity. So Lets create any Karma with Awareness what is righteous.

*Be Blessed Of Divine Light.*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Sunday, 18 December 2016

అర్జున విషాదయోగః 1 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)

Mahabharatam

ధృతరాష్ట్ర ఉవాచ : -

ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతా యుయుత్సవః,
మామకాః పాణ్డవాశ్చైవ
కిమకుర్వత సంజయ!

ధృతరాష్ట్రుడిట్లు పలికెను: ఓ సంజయా! నా వారలగు దుర్యోధనాదులను, పాండుపుత్రులగు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమి యగు కురుక్షేత్రమున జేరి యేమిచేసిరి?


సంజయ ఉవాచ :-

దృష్ట్వా తు పాణ్డవానీకం
వ్యూఢం దుర్యోధన స్తదా‌,
ఆచార్యముపసజ్గమ్య
రాజా వచనమబ్రవీత్‌.

ధృతరాష్ట్రునితో సంజయడిట్లు వచించెను :- అపుడు రాజైన దుర్యోధనుడు ప్యూహాకారము గాంచింపబడియున్న పాండవసేనను చూచి, తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు పలికెను.


పశ్యైతాం పాణ్డుపుత్రాణా
మాచార్య మహతీం చమూమ్‌,
వ్యూఢాం ద్రుపదపుత్రేణ
తవ శిష్యేణ ధీమతా.

ఓ గురువర్యా! బుద్ధిశాలియు, మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత ప్యూహాకారముగ రచింపబడియునట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమునుజూడుడు!


అత్రశూరా మహేష్వాసా
భీమార్జున సమా యుధి,
యుయుధానో విరాటశ్చ
ద్రుపదశ్చ మహారథః.

ధృష్ట కేతు శ్చేకితానః
కాశీరాజశ్చ వీర్యవాన్‌,
పురుజిత్కుంతి భోజశ్చ
శైబ్యశ్చ నరపుజ్గవః

యుధామన్యుశ్చ విక్రాంత
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్‌,
సౌభద్రో ద్రౌపదేయాశ్చ
సర్వ ఏవ మహారథాః

ఈ పాండవసేనయందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూర వీరులును పెక్కురు కలరు. వారెవరనిన - యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు. వీరందరును మహారథులే అయియున్నారు.


అస్మాకం తు విశిష్టా యే
తాన్నిబోధ ద్విజోత్తమ,
నాయకా మమ సైన్యస్య
సంజ్ఞార్థం తాన్‌ బ్రవీమి తే.

ఓ బ్రాహ్మణోత్తమా! ఇక మనసైన్యములో ప్రముఖులు, సేనానాయకులు ఎవరు కలరో వారలను జ్ఞాపకము కొరకు మీకు చెప్పుచున్నాను.(వినుడు)


భవాన్‌ భీష్మశ్చ కర్ణశ్చ
కృపశ్చ సమితింజయః,
అశ్వర్థామా వికర్ణశ్చ
సౌమదత్తి స్తథైవ చ

అన్యే చ బహవశ్శూరా
మదర్థే త్యక్తజీవితాః,
నానాశస్త్ర ప్రహరణా
స్సర్వే యుద్ధవిశారదాః.

మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వర్థమ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొరకు తమ తమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, అందరును యుద్ధసమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచట నున్నారు. 

Friday, 16 December 2016

భగవద్గీత - 1

అర్జున విషాదయోగః 1 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

ధృతరాష్ట్ర ఉవాచ : -


ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతా యుయుత్సవః,
మామకాః పాణ్డవాశ్చైవ
కిమకుర్వత సంజయ!


ధృతరాష్ట్రుడిట్లు పలికెను: ఓ సంజయా! నా వారలగు దుర్యోధనాదులను, పాండుపుత్రులగు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమి యగు కురుక్షేత్రమున జేరి యేమిచేసిరి?


సంజయ ఉవాచ :-


దృష్ట్వా తు పాణ్డవానీకం
వ్యూఢం దుర్యోధన స్తదా‌,
ఆచార్యముపసజ్గమ్య
రాజా వచనమబ్రవీత్‌.


ధృతరాష్ట్రునితో సంజయడిట్లు వచించెను :- అపుడు రాజైన దుర్యోధనుడు ప్యూహాకారము గాంచింపబడియున్న పాండవసేనను చూచి, తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు పలికెను.


పశ్యైతాం పాణ్డుపుత్రాణా
మాచార్య మహతీం చమూమ్‌,
వ్యూఢాం ద్రుపదపుత్రేణ
తవ శిష్యేణ ధీమతా.


ఓ గురువర్యా! బుద్ధిశాలియు, మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత ప్యూహాకారముగ రచింపబడియునట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమునుజూడుడు!


అత్రశూరా మహేష్వాసాభీమార్జున సమా యుధి,యుయుధానో విరాటశ్చద్రుపదశ్చ మహారథః.
ధృష్ట కేతు శ్చేకితానఃకాశీరాజశ్చ వీర్యవాన్‌,పురుజిత్కుంతి భోజశ్చశైబ్యశ్చ నరపుజ్గవః
యుధామన్యుశ్చ విక్రాంతఉత్తమౌజాశ్చ వీర్యవాన్‌,సౌభద్రో ద్రౌపదేయాశ్చసర్వ ఏవ మహారథాః


ఈ పాండవసేనయందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూర వీరులును పెక్కురు కలరు. వారెవరనిన - యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు. వీరందరును మహారథులే అయియున్నారు.


అస్మాకం తు విశిష్టా యే
తాన్నిబోధ ద్విజోత్తమ,
నాయకా మమ సైన్యస్య
సంజ్ఞార్థం తాన్‌ బ్రవీమి తే.


ఓ బ్రాహ్మణోత్తమా! ఇక మనసైన్యములో ప్రముఖులు, సేనానాయకులు ఎవరు కలరో వారలను జ్ఞాపకము కొరకు మీకు చెప్పుచున్నాను.(వినుడు)


భవాన్‌ భీష్మశ్చ కర్ణశ్చ
కృపశ్చ సమితింజయః,
అశ్వర్థామా వికర్ణశ్చ
సౌమదత్తి స్తథైవ చ
అన్యే చ బహవశ్శూరా
మదర్థే త్యక్తజీవితాః,
నానాశస్త్ర ప్రహరణా
స్సర్వే యుద్ధవిశారదాః.


మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వర్థమ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొరకు తమ తమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, అందరును యుద్ధసమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచట నున్నారు. 

Friday, 2 December 2016

కృష్ణనామ మహత్యం


సుగతిని కల్పించగల శక్తివంతమైన నామం కృష్ణనామం.
కృష్ణ దివ్యనామం చాలు - కష్టాలన్నీపోవడానికి.
మానవులు తెలిసి కొంత, తెలియక కొన్ని పాపాలు చేస్తూనే ఉంటారు. మరి ఈ పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎలాగంటే - కృష్ణనామంతో!
నామ్నాం ముఖ్యతరం నామ కృష్ణాఖ్యం మే పరంతప /
ప్రాయశ్చిత్త మశేషాణాం పాపానాం మోచకం పరమ్ //
కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః
జలం హిత్వా యధా పద్మం నరకాదుద్ధరామ్యహమ్ //

కృష్ణ కృష్ణా అని నిత్యం జపిస్తే చాలు, నీటిలో ఉన్నను తడి బురదా అంటని పద్మంలాగా ఆ కృష్ణనామం జపించినవారు నరకలోకబాధలు లేకుండా ఉద్ధరింపబడతారు. 

కృష్ణ కృష్ణ కృష్ణేతి స్వపన్ జాగ్రత్ వ్రజం స్తధా /
యో జల్పతి కలౌ నిత్యం కృష్ణరూపీ భవేద్ధి సః //

కృష్ణ నామాన్ని స్వప్న జాగ్రదవస్థలలో అనునిత్యం ఎవరైతే జపిస్తారో వారు స్వయంగా కృష్ణ స్వరూపాన్ని పొందుతారు.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే

ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం
నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే అను ముప్పదిరెండు అక్షరములను కలిగిన షోడశనామమంత్రమే కలియుగ దుష్టప్రభావములనుండి రక్షించును. వేదములన్నింటిని వెదికినను ఈ మహామంత్రమును మించినది మరొకటి లేదు.

భగవద్గీత శ్లోకాలు....

3 వ శ్లోకం:--

శ్రీభగవానువాచ |
లోకే‌உస్మింద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ |
ఙ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ || 

భావం:--
శ్రీ భగవానుడు పలికెను--- ఓ అనఘా ! అర్జునా ! ఈ లోకమున రెండు నిష్టలు గలవని ఇంతకుముందే చెప్పియుంటిని . వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును. 

4 వ శ్లోకం:--

న కర్మణామనారంభాన్నైష్కర్మ్యం పురుషో‌உశ్నుతే |
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి || 

భావం:--
మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగానిష్టాసిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్ఠను అతడు పొందజాలడు. 

25 వ శ్లోకం:--

అవ్యక్తో‌உయమచింత్యో‌உయమవికార్యో‌உయముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||

భావం:--
ఈ ఆత్మ అవ్యక్తమైనది. (ఇంద్రియగోచరము కానిది) అచింత్యము, (మనస్సునకు అందనిది) వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జునా ! నీవు దీనికై శోకింపతగదు. 

26 వ శ్లోకం:-

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి || 

భావం:--
ఓ అర్జునా ! ఈ ఆత్మకు జననమరణములు కలవని ఒకవేళ, నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు. 

27 వ శ్లోకం:--
జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే‌உర్థే న త్వం శోచితుమర్హసి ||

భావం:--
ఏలనన, పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు.

28 వ శ్లోకం:--

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ||

భావం:--
ఓ అర్జునా ! ప్రాణులన్నియును పుట్టుటకుముందు ఇంద్రియగోచరములు కావు. (అవ్యక్తములు) మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జననమరణల మధ్యకాలమందు మాత్రమే అవి ప్రకటితములు. (ఇంద్రియ గోచరములు) అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము.

29 వ శ్లోకం:--

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ||
భావం:--
ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని(ఈ ఆత్మను) ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమియు ఎరుగరు.

30 వ శ్లోకం:--

దేహీ నిత్యమవధ్యో‌உయం దేహే సర్వస్య భారత |
తస్మాత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ||

భావం:--
ఓ అర్జునా ! ప్రతీ దేహమునందు ఉండెడి ఈ ఆత్మా వధించుటకు వీలుకానిది. కనుక, ఏ ప్రాణిని గూర్చియైనను నీవు శోకింపదగదు.

31 వ శ్లోకం:--

స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి |
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయో‌உన్యత్క్షత్రియస్య న విద్యతే ||

భావం:--
అంతేగాక, సర్వధర్మమునుబట్టియు, నీవు భయపడనవసరము లేదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుధ్హమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యమునకు మరియొకటి ఏదియును లేదు.

32 వ శ్లోకం:--
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ |
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్ ||

భావం:--
ఓ పార్థా ! యాదృచ్చికముగా అనగా-- అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరచిన ద్వారము వంటిది.

33  వ శ్లోకం:--

అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి || 

భావం:--
ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరిపకున్నచో, నే స్వధర్మమునుండి పారిపోయినవాడవు అగుదువు. దాని వలన కీర్తిని కోల్పోవుదవు. పైగా నేవు పాపము చేసినవాడవు అగుదవు. 

34 వ శ్లోకం:--

అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే‌உవ్యయామ్ |
సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే ||   

భావం:--
లోకులెల్లరును బహుకాలము వరకును నీ అపకీర్తినిగూర్చి చిలువలు పలువలుగా చెప్పుకొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటెను బాధాకరమైనది.  

51 వ శ్లోకం:-

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ || 

భావం:--
ఏలనన, సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి, జనన మరణబంధములయ్యెదరు. అంతేగాక, వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు. 

52 వ శ్లోకం:--

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||

భావం:--
మోహమనెడి ఊబినుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన, వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగములనుండి వైరాగ్యమును పొందగలవు.

భగవద్గీత:--అథ ద్వితీయో‌உధ్యాయః 57, 58 శ్లోకాలు

57 వ శ్లోకం:--

యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్ |
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా ||
భావం:--
దేనియందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితులయందు హర్షము. ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును.

58 వ శ్లోకం:--

యదా సంహరతే చాయం కూర్మో‌உంగానీవ సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా ||

భావం:--
తాబేలు తన అంగములను అన్నివైపులనుండి లోనికి ముడుచుకొనునట్లుగా, ఇంద్రియముల (విషయాదుల) నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావించవలెను.

Wednesday, 1 June 2016

వాల్మీకి రామాయణం29వ దినము

వాల్మీకి రామాయణం
29వ దినము, బాలకాండ
ఈ వృత్తాంత్తం విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు. అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు గంగా నదిని సమీపించారు, అందరూ గంగని చూడగానె ఎంతో సంతోషించారు. అక్కడున్న మహర్షులు మొదలగువారు ఆ గంగలో తమ పితృదేవతలకి తర్పణం సమర్పించి, అగ్నిహొత్రం చేసి ఒడ్డున కూర్చొని, మిగిలిన హవిస్సుని అమృతంగా భావించి తిన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు...." కుశనాభుడికి నూరుగురు కుమార్తెలు ఉన్నారు, కాని కుమారులు లేరు. తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు, ఆ యాగం జెరుగుతుండగా కుశనాభుడి తండ్రైన కుశమహారాజు అక్కడికి వచ్చి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, గాధి అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశ పేరు నిలబెడతాడు" అన్నాడు. 
నేను ఆ గాధి యొక్క కుమారుడినే రామా అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు.
స పితా మమ కాకుత్స్థ గాధిః పరమ ధార్మికః |
కుశ వంశ ప్రసూతో అస్మి కౌశికో రఘునందన ||
అప్పుడు విశ్వామిత్రుడు..... " నేను కుశ వంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు. నా అక్క పేరు సత్యవతి, ఆమె భర్త పేరు ఋచకుడు. కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. మా అక్క కౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుంది. అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద, మా అక్కకి దెగ్గరగా ఉంటాను. ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగం చెయ్యడానికి వచ్చాను, నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను " అని  రాముడితొ చెప్పాడు.

Friday, 12 February 2016

అర్జున విషాదయోగః 4

 అర్జున విషాదయోగః 4 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)  
 అర్జున ఉవాచ :- 
దృష్ట్వేమం స్వజనం కృష్ణ!
యుయుత్సుం సముపస్థితమ్‌.
సీదంతి మమ గాత్రాణి
ముఖం చ పరిశుష్యతి,
వేపథుశ్చ శరీరే మే
రోమహర్షశ్చ జాయతే.
గాణ్డీవం స్రంసతే హస్తా
త్త్వక్చైవ పరిదహ్యతే,
న చ శక్నోమ్యవస్థాతుం
భ్రమతీవ చ మే మనః‌
 అర్జునుడు చెప్పెను. ఓ కృష్ణమూర్తి! యుద్ధము చేయుటకై ఇచట సమకూడిన ఈ బంధుజనములను జూచి నా అవయవములు పట్టుదప్పుచున్నవి; నోరెండుకొని పోవుచున్నది; శరీరమందు వణకుపుట్టుచున్నది; గగుర్పాటు గలుగుచున్నది; గాండీవము చేతినుండి జారిపోవుచున్నది; చర్మము మండుచున్నది; నిలబడుటకైనను నాకు శక్తిలేకున్నది; మనస్సు గిఱ్ఱున తిరుగుచున్నది.
********** 28,29,30
నిమిత్తాని చ పశ్యామి
విపరీతాని కేశవ!
న చ శ్రేయోనుపశ్యామి
హత్వా స్వజనమాహవే.
ఓ కృష్ణమూర్తీ! (పెక్కు) అపశకునములను సహితము చూచుచున్నాను. యుద్ధమునందు బంధువులను చంపిన వెనుక బొందబోవు లాభమెద్దియో నాకు గనుపించుటలేదు.
*************** 31
న కాజ్క్షే విజయం కృష్ణ!
న చ రాజ్యం సుఖాని చ,
కిం నో రాజ్యేన గోవింద!
కిం భోగైర్జీవితేన వా.
కృష్ణా! నేను విజయమునుగాని, రాజ్యమునుగాని, సుఖమునుగాని కోరను. రాజ్యముతోగాని, భోగములతోగాని, జీవితముతోగాని మనకేమి ప్రయోజనము?
************************ 32
యేషామర్థే కాజ్క్షితంనో
రాజ్యం భోగాస్సుఖాని చ,
త ఇమేవస్థితా యుద్ధే
ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ.
ఆచార్యాః పితరః పుత్రా
స్తథైవ చ పితామహాః,
మాతులా శ్శ్వశురాః పౌత్రా
స్స్యాలా స్సంబంధిన స్తథా.
ఎవరి నిమిత్త మీ రాజ్యమును, భోగములను, సుఖములను మనము కోరుదుమో, అట్టి గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమండ్రు, బావమరుదులు, సంబంధులు ఎల్లరునూ ప్రాణములమీద, ధనముమీద ఆశ వదలుకొని ఈ రణరంగము మీద వచ్చి నిలబడియున్నారు.
********************* 33,34
ఏతాన్న హంతుమిచ్ఛామి
ఘ్నతోపి మధుసూదన!
అపి త్రైలోక్యరాజ్యస్య
హేతోః కిం ను మహీకృతే.
ఓ కృష్ణా! నన్ను చంపువారలైనను వీరిని ముల్లోకముల రాజ్యాధిపత్యము కొరకైనను నేను చంపనిశ్చగింపను. ఇక భూలోకరాజ్యము కొరకు వేరుగ జెప్పవలెనా?.
*************************** 35
నిహత్య ధార్తరాష్ట్రాన్నః
కా ప్రీతి స్స్యాజ్జనార్దన!
పాపమేవాశ్రయేదస్మాన్‌‌
హత్వైతా నాతతాయినః.
 ఓ కృష్ణా! దుర్యోధనాదులను చంపుటచే మన కేమి సంతోషము కలుగును? దుర్మార్గులైనను వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును.
స్వస్తి. సేకరణ ..హిందూ ధర్మచక్రం. ధార్మిక సేవాప్రచారం.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles