Showing posts with label క్షేత్ర మహత్యం. Show all posts
Showing posts with label క్షేత్ర మహత్యం. Show all posts

Saturday, 25 February 2017

శ్రీశైలం జలాశయం నుండి బయటపడ్డ సంగమేశ్వర ఆలయం!

*1980 వ సంవత్సరములో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ దశలో మునిగిన సప్త నదుల సంగమేశ్వర ఆలయం...
* 23 సంవత్సరముల తరువాత శ్రీశైల జలాశయంలో నీటి ప్రవాహం తగ్గటం వలన
: 2003 లో మొట్ట మొదటి సారిగా ఆలయంలో మహ శివరాత్రి పూజలు నిర్వహించారు..
: 2004 లో మహశివరాత్రి కి రెండవ సారి ఆలయం బయటపడినది
: 2005 సంవత్సరంలలో మూడవ సారి  మహశివరాత్రి కి సంగమేశ్వర ఆలయం బయటపడి  పరమేశ్వరుడి దర్శనభాగ్యం భక్తులకు కలిగినది...
: అలాగే 2011 న మహశివరాత్రి కి నాల్గవసారి బయటపడడం జరిగినది
: 2015 న మహశివరాత్రి కి ఐదవ సారి బయటపడడం జరిగినది
: 2016 న ఆరవ సారి మహాశివరాత్రి కి సంగమేశ్వర ఆలయం బయట పడడం వలన పరమేశ్వరుడి దర్శనభాగ్యం కలిగినది..
: 2016 ఆగష్టు 6 న ఆలయం నదిలో మునగడం...
: 2017 లో ఆలయం మహశివరాత్రి కి బయట పడడం ఏడవ సారి
 ఫిబ్రవరి 17 న శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీటిమట్టం తగ్గడంతో ఆలయంలో తోలి పూజలు నిర్వహించారు,
6 నెలల11 రోజులు నీటిలో మునగడం జరిగినది
: 191 రోజుల తరువాత సంగమేశ్వర ఆలయం మహాశివరాత్రి కి బయటపడడం విశేషంగా భావిస్తున్నారు...!

Wednesday, 18 January 2017

శనివారం అంటే శ్రీనివాసునకు ఎందుకిష్టం

శనివారం అంటే శ్రీనివాసునకు ఎందుకిష్టం...

దివ్యక్షేత్రం వాడపల్లి
1.* శ్రీనివాసుడు వెంకటాద్రికి తరలివచ్చిన రోజు.....శనివారం
2.* ఓంకారం ప్రభవించిన రోజు...............శనివారం
3.* శ్రీ స్వామి వారు శ్రీనివాసుని అవతారం లో ఉద్భవించిన రోజు...శనివారం
4.* సకల జనులకు శని పీడలు తొలగించే రోజు.....శనివారం
5.* శ్రీ మహా లక్ష్మిని వక్షస్థలాన నిలిపిన రోజు....శనివారం
6.* శ్రీనివాసుని భక్తీ శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారి జోలికి రానని శనీశ్వరుడు వాగ్దానం చేసిన రోజు...శనివారం
7.* పద్మావతి శ్రీనివాసుల కల్యాణం జరిగిన రోజు ...... శనివారం
8.* శ్రీ వారిని ఆభరణాలతో అలంకరించే రోజు....శనివారం
9.* స్వామి వారిని ఏడుకొండలపై మొదటిగా భక్తులు గుర్తించిన రోజ....శనివారం . "ఏపని చేసినా సుస్తిరతలు చేకూర్చే రోజు కాబత్ట్ శనివా రాముననకు శనివారం నకు స్థిరవారమని పేరు"
దివ్య చరిత వాడనిమల్లి".....చరిత్ర
ఒకసారి సనకసనందనాది మహర్షులందరూ వైకుంఠం లోని శ్రీమన్నారాయణుని దర్శించుకుని ఆయనను అనేకవిధములుగా స్తుతించిన తరువాత తాము వచ్చిన పనిని తెలిపారు.కలియుగం లో ధర్మం ఒంటిపాదం లో నడుస్తోంది ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యత నిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వశులై అధర్మ జీవితం గడుపుచున్నారు ఉపేక్షిస్తే అధర్మం మిగిలిన యుగాలకు కూదా ప్రాప్తిస్తుంది.
కనుక ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని ఋషులు మహావిష్ణువును ప్ర్రార్ధించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈవిధంగా చెప్పెను. అధర్మం ప్రబలినప్పుడు స్వయముగా యుగ యుగమందున అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించితిని కాని కలియుగం లో పాపభూయిష్టము యెక్కువ అయిఉంది కొద్ది మాత్రమే పుణ్యాన్వితమ్ కావున కలియుగం లో అర్చా స్వరూపుడనై భూలోకమున లక్ష్మీ క్రీడా స్తానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరమున నౌక వలె దరిచేర్చునది అగు గౌతమీ తీరమున నౌకపురమును (వాడపల్లి) పురమందు వెలయుదును. లక్ష్మీ సహితంగా ఒక చందన పేటికలో గౌతమీ ప్రవాహ మార్గం లో నౌకపురి (వాడపల్లి) చేరుకుంటాను.
ఈ వృత్తాంతం అంతా తెలిసిన నారదుడుపురజనులకు తెలియ పరుస్తాడు. కొంత కాలానికి నౌకపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించింది తీరా వడ్డుకు తీసుకువద్దామని వెళ్ళినంతలో అదృశ్యమై పోవడం ప్రారంభించింది.ఒక రోజు గ్రామం లోని వృద్ధ బ్రాహ్మణులకు కలలొ కనిపించి కలికల్మషం వల్ల జ్ఞానం లోపించి మీరు నన్ను కనుగొనలేక పోతున్నారు.కనుక పురజనులందరూ వేకువనే గౌతమీ స్నానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భం లోకి వెళితే కృష్ణ గరుడ వాలిన చోట నేనున్న చందన పేటిక దొరుకుతుందని చెబుతాడు.
పురజనులు స్వామి ఆదేశాన్ని పాటించి నౌకలో నది గర్భంలోనికి వెళ్ళగా చందన పేటిక లభిస్తుంది.దానిని ఒడ్డుకు తీసుకువచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంఖు,చక్ర,గదలతో ఒప్పుతున్న స్వామీ దివ్యమంగళ విగ్రహం కనిపించింది. అంతలో అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేశాడు.గతంలో ఋషులు వైకుంఠమునకు వెళ్లి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూపవలసినదిగా విష్ణువును ప్రార్ధించడం ,విష్ణువు నౌకపురిలో అర్చావతారంగా వెలుస్తానని చెప్పడం మొదలైన విషయాలు నారదుడు పురజనులకు చెబుతాడు.
తరువాత మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయం కట్టింప జేసినాడు."వేం"అంటే పాపాలను "కట" అంటే పోగొట్టే వాడు కనుక స్వామికి "వేంకటేశ్వరుడు"అని నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్టింప చేసినాడు.వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్ళకు ఆకట్టుకుని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది.భారతదేశం లో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో "వాడపల్లి" ఒకటి వాడపల్లి తీర్ధం అనగా వాడవాడలా ఉత్సవమే.
ఆబాలగోపాలానికీ ఆనందమే.ప్రతీఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామీ వారి తీర్ధం ,కల్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవ ,కల్యాణోత్సవ కార్యక్రమములను కన్నుల పండుగగా భక్తీ ప్రపత్తులతో తిలకిస్తారు. ఏటా కళ్యాణంతో పాటు నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తుంటారు.
ఏడు శనివారముల వెంకన్న దర్శనం -ఏడేడు జన్మల పుణ్యఫలం....
స్వయంభూ క్షేత్రమైన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామీ వారిని వరుసగా " 7 " సనివారములు దర్శించినచొ భక్తుల కోర్కెలు తప్పక నెరవేరును.ప్రారంభించే మొదటి సనివారం ధ్వజస్థంభం వద్ద నిలబడి మీ మనస్సులోని కోరికను స్వామీ వారికి నివేదించుకొని " 7 " సార్లు ప్రదక్షిణము చేసి స్వామీ వారిని దర్శించు కోవలెను .స్త్రీల విషయంలో ఏదైనా ఒక శనివారం అవాంతరం కలిగినచో మరొక శనివారం అదనంగా చేసినచో " 7 " సనివారముల ఫలితము కలుగును. " 7 " శనివారములు దర్శనాలు పూర్తి అయిన పిదప స్వామీ వారి ఆలయంలో అన్నదానమునకు బియ్యం,పప్పులు,నూనెలు,ఏదైనా గాని భక్తుని స్తోమతను బట్టి 7 కుంచాలు లేదా 7 కేజీలు లేదా 7 గుప్పెళ్ళు గాని సమర్పించు కొనవచ్చును.

Tuesday, 17 January 2017

త్రయంబకేశ్వర క్షేత్రం

మన  పుణ్య క్షేత్రాలు::::

త్రయంబకేశ్వర క్షేత్రం

గోదావరి తల్లి అడుగుల సవ్వడితో, త్రయంబకేశ్వరుని దివ్య చరణాలతో పునీతమైన పరమ పునీతధామం త్రయంబకేశ్వరం. ఈ అపురూప ఆధ్యాత్మిక క్షేత్రం ఎన్నో అందాలకు, మరెన్నో విశిష్ట ఆలయాలకు నెలవు. ఆధ్యాత్మిక మాసమైన కార్తీకంలో ఈ క్షేత్ర దర్శనం జీవుల‌కు మోక్షదాయకం.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన  త్రయంబకేశ్వర లింగానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీనిని త్రయంబకం అంటారు. వీరితో పాటుగా సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి కూడా ఇక్క‌డ కొలువై ఉందని ప్రశస్తి. అలాగే 33 కోట్ల దేవతలు కొలువై ఉన్నారని నమ్మకం.
స్థల పురాణం::
కొన్ని యుగాల‌కు పూర్వం ఈ ప్రదేశం అంతా  రుషులు, సాధువుల‌కు నివాస ప్రాంతంగా ఉండేది. సప్తరుషులలో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం కరవుకాటకాలతో అల్లాడింది.. ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఓ సరస్సును సృష్టించారు. అహల్యతో పాటు మిగిలిన రుషి ప‌త్నులు  ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు. కానీ వారిలో గౌతమ మహర్షిపట్ల, అహల్య పట్ల  అసూయా ద్వేషాలు పెరిగి, తమ భర్తలను కూడా అలాంటి సరస్సులను నిర్మించమని వారు పోరు పెట్టారు. అప్పుడు రుషులందరు కలిసి గణేశుడి గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏమి కావాలి అని అడగగా, వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చేయమంటారు. అది పాపం అని చెప్పినా వారు వినకుండా, అదే వరం కావాలని పట్టుపడతారు. దాంతో ఏమి చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు.

ఒకనాడు పంట చేలో మేస్తున్న గోవును దర్భపుల్లతో అదిలించగా, అది గాయపడి మరణిస్తుంది. ఇదే అదునుగా భావించిన రుషులందరూ  గో హత్య మహాపాపమని ఈ ప్రదేశంలో గంగను పారేట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు. దాంతో గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు, బ్రహ్మ, విష్ణు, ఆదిపరాశక్తిలతో కలిసి ప్రత్యక్షమవుతాడు.

ఏం వరం కావాలని అడగగా గంగను విడుదల చేయమని కోరుతారు. అప్పుడు శివుడు తన జటను విసరగా అది వెళ్లి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా, గంగా నది అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందకి వస్తుంది.  దానినే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తున్నారు.

ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానవట్టం లోపల మూడు లింగాకారాలలో ఉంటారు. అందువలనే దీనిని త్రయంబకం అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా, అత్యంత ప్రాముఖ్యాన్ని పొందిన   ఈ మహా లింగం త్రయంబకం.

ఆలయ విశిష్టత: సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. మొదటగా నందీశ్వరున్ని దర్శించుకున్న అనంతరం దేవదేవుణ్ని దర్శించుకుంటాం. భక్తులకు ముందుగా ఆ నందీశ్వరుడి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో  ఓ కోనేరు ఉంటుంది. అది ఎప్పుడూ  గోదావరి న‌దీ జలాలతో నిండి ఉంటుంది. గుడి ప్రాంగణం   విశాల‌మైంది. గుడి మొత్తాన్ని  నల్లరాతితో నిర్మించారు. ఆలయ ప్రాకారంలో చిన్న చిన్న శివలింగాలు, చిన్న చిన్న ఆలయాలు అమర్చి ఉంటాయి. గుడి ప్రాకారాలను చాలా ఎత్తులో నిర్మించడం జరిగింది. గుడిలోని కలశాలను బంగారంతో నిర్మించారు. అప్పట్లోనే ఈ కలశాలను నిర్మించడానికి 16 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు, వీటన్నింటిని కూడా 16వ శతాబ్దంలోనే నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.

దర్శనం: సోమనాథ, మహాకాళేశ్వర జ్యోతిర్లింగాల తర్వాత అంతటి విశిష్టత , అంతటి పెద్ద లింగం కూడా ఇదేనని తెలుస్తోంది. ఇది స్వయంభూ జ్యోతిర్లింగం. గర్భగుడి లోపల మూడు లింగాలు కలిపి ఒకే పానవట్టంలో ఉంటాయి. ఈ మూడు లింగాలను కూడా త్రిమూర్తులకు ప్రతీకలుగా భావిస్తారు. పానవట్టం లోపల నుంచి  ఎప్పుడూ జలం వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది  ఇప్ప‌టికీ
అంతు చిక్కని  విష‌య‌మే . ఆ జలం నిత్యం శివలింగాన్ని అభిషేకం చేస్తుంది. అయితే గర్భగుడిలోనికి అంద‌రికీ అనుమతి లేకపోవడంతో 5 మీటర్ల దూరం నుంచే స్వామి వార్ల దర్శన భాగ్యం కల్పిస్తారు.

పాండవులు నిర్మించిన కోనేరు
పాండవులు ఇక్కడ ఒక కోనేటిని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ కోనేరు ఎప్పుడు కూడా గోదావరి జలాలతో నిండి ఉంటుంది. ఆ కోనేట్లోకి నేరుగా బ్రహ్మగిరి పర్వత శ్రేణుల నుంచి వచ్చే నీరు ప్రవహిస్తుంది  అని చెబుతారు. ఈ కోనేట్లో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. కుంభమేళా నిర్వహించే సమయంలో సాధువులు, హిమాల‌యాల నుంచి వచ్చే రుషులు, అఘోరాలు ఈ కోనేటిలో స్నానాలు ఆచరిస్తారు.  ఈ కోనేరు   చుట్టూ అనేక లింగాలూ, వివిధ దేవతా మూర్తుల  విగ్ర‌హాలూ కొలువై ఉంటాయి.

కుంభమేళా
పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి మూడు కూడా ఒకేసారి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ సింహస్థ కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళా సమయంలో కోనేటిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని ప్రశస్థి.

ఎలా చేరుకోవాలి
* మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి త్రయంబకం చేరుకోవచ్చు.
* షిర్డి వెళ్లే యాత్రికులు తీర్థయాత్రలో భాగంగా వెళ్లవచ్చు.
* దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నాసిక్‌కు రోడ్డు, రైలు మార్గాలున్నాయి.
* ఔరంగాబాద్‌ విమానాశ్రయం నుంచి లేదా ముంబయి విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి నాసిక్‌కు వెళ్లవచ్చు.

శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతీ

"శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతీ"

అదిగదిగో శ్రీశైలము
భక్తుల ముక్తి రసాలము
శివదేవుని స్థిరవిలాసము
భూలోకాన కైలాసము...

గిరిమల్లిక చిరునవ్వుల పువ్వుల
పూజించే పరమేశ్వరుడు
భ్రమరాంభిక పలువిధముల పదముల
సేవించే శివశంకరుడు
చల్లగ భక్తుల నెల్లర బ్రోవగ
మల్లీశ్వరుడై వెలసిన చోటు...

నీలకంఠ నాతలపై నిలచీ
కలియుగమును కాపాడుమని
శైలనాయకుడు శివశివ శివ యని
చిరకాలము తా వేడెనని
భక్త సులభుడా ఫాలలోచనుడు
భ్రమరా విభుడై భాసిలెనట యిట...

పాపనాశనము శాపమోచనము
శ్రీశైలేశుని దరిశనము
సౌఖ్యప్రదము,సర్వత్ర శుభదము
గిరిమల్లేశారాధనము
నిరతపావనము నిత్యమోహవము
మల్లికార్జునుని మంత్రధ్యానము..

కరుమారుయమ్మన్ దేవి ఆలయం

1945 ఫిబ్రవరిలో పరమాచార్య స్వామివారు రాణీపెట్టైలో మకాం చేస్తున్నారు. అక్కడ నివసించేవారు దాదాపుగా హైందవేతరులే అయినా కులమతాలకతీతంగా మహాస్వామివారి దర్శనానికి వచ్చేవారు. రాణీపెట్టై సమీపంలోని నావల్పూర్ ప్రజలు “కరుమారుయమ్మన్ దేవి” ఆలయం కట్టడానికి లక్షలలో నిధులు కావాలని గ్రహించి కాస్త కలత చెందారు. పరమాచార్య స్వామివారి ఆశీస్సుల కోసం వారు స్వామివారి దర్శనానికి వచ్చారు.

“మేము ఒక మంచి కార్యక్రమం చెయ్యలనుకున్నాము. దానికి కావాల్సిన నిధులు మావద్ద సమృద్ధిగా లేవు.

పరమాచార్య స్వామివారు మమ్మల్ని అనుగ్రహించాలి“ అని వేడుకున్నారు. స్వామివారు కొద్దిసేపు మౌనం వహించి, “కోవెల అమ్మవారికి. కదా? ఆమెయే చూసుకుంటుంది” అని చెప్పారు.

“మాకు ఆ నమ్మకం ఉంది కాని కావాల్సిన ధనంలో పాతికవంతు కూడా సేకరించలేకపోయాము. . . ”.

అందుకు మహాస్వామివారు “నేలపై నాలుగడుగుల ఎత్తున నిర్మాణం చెయ్యండి” అని చెప్పారు.

”మరి గోపురం, విగ్రహాలు, కుంబాభిషేకం మొదలగువాటికి ఎలా?” అని అడిగారు వారు.

”వాటన్నిటి కోసం ఒక వ్యక్తి వస్తాడులే” అన్నారు.

వారికి ఒక దేవరహస్యం అవగతమైంది. కాని “ఎప్పుడు వస్తాడు? ఎలా గుర్తుపట్టాలి?” అని పలు సందేహాలతో సంతోషంతో ప్రసాదం స్వీకరించి, అనుమానంతో, కలతతో వెళ్ళిపోయారు.

ఈ సంఘటన జరిగినది ఫిబ్రవరి 14, 1945న. మరి ఆ వ్యక్తి ఆరోజు ఎక్కడున్నాడు?

1939లో ప్రారంభమైన రెండవ ప్రపంచ యుద్ధం 1945 వరకు కొనసాగింది. అలీన సేనలు బర్మాలోని ఐరావతి నది వద్ద జపాన్ తో తలపడుతున్నాయి. జపాన్ సైన్యం తూర్పు ఒడ్డున, అలీన సేనలు పశ్చిమ ఒడ్డున పోరాడుతున్నాయి. అలీన సేనలకు ఆ ప్రాంతము, ఆ వాతావరణము అంతగా అలవాటు లేదు. నదీజలాల దగ్గర యుద్ధం చేయగల నైపుణ్యం కలిగిన వారిని ఇక్కడకు పంపవలసిందిగా అలీన సేనలకు నాయకత్వం వహిస్తున్న మేజర్ లండనుకు అత్యవసర సమాచారం పంపారు. అటువంటి యుద్ధనైపుణ్యం కలిగిన బెటాలియన్ మడగకార్.

ఆ సైనిక దళాన్ని వెంటనే ఐరావతికి పంపారు. భారత సైనికులను ఒడ్డుకు పంపి వారు నదిలోకి దిగారు. ఈ హఠాత్పరిణామాన్ని జీర్ణించుకోలేని జపాన్ సేనలు రాక్షసులుగా మారి ఒడ్డున ఉన్నవారిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారు. ఆ ఊతకోచలో కేవలం ఒక్కరే బ్రతికి బయటపడ్డారు.

”నేను ఒక్కడినే ఎందుకు బ్రతికాను దేవుడా?”

1945 మేలో జెర్మనీ ఓటమితో యుద్ధం ముగిసింది.

ఐరావతి యుద్ధంలో బ్రతికి బయటపడ్డ మేజర్ నారాయణస్వామి, సైన్యం నుండి విరమణ పొందిన తరువాత భార్య చంద్రికతో కలిసి రాణిపెట్టైలో నివాసం ఏర్పరుచుకున్నాడు. ఒకరోజు సాయింత్రం వారు నడుడుచుకుంటూ వెళ్తుండగా అనుకోకుండా అసంపూర్తిగా ఉన్న మందిరాన్ని ఆరుబయట అలా ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్న అమ్మవారిని చూశారు. “చూడు! నన్ను ఎలా వదిలేశారు. నేను అంతటి భయంకర యుద్ధం నుండి నిన్ను కాపాడితే, నాకు ఒక నీడ కల్పించవా” అని అమ్మవారు అడిగినట్టు అనిపించింది.

మహాస్వామివారి దర్శనానికి వచ్చిన ఆ భక్తులందరి ఆనందభాష్పాలతో ఆ ప్రాంగణం అంతా నిండిపోయింది. ”ఈయన మిలటరి మేజర్ నారాయణస్వామి, ఆవిడ ఈయన భార్య. ఆలయ నిర్మాణాన్ని వారు పూర్తిచేసి, కుంబాభిషేకం కూడా చెయ్యడానికి ముందుకు వచ్చారు. కొద్దిరోజుల క్రితం అచ్చం స్వామివారు చెప్పినట్టుగానే”

పరమాచార్య స్వామివారి ‘కరుణాకటాక్షం’ ఆ దంపతులపై ప్రసరించి వారిని పునీతులను చేసింది.

శ్రీరంగం

అధ్భుతమైన వైష్ణవ దివ్యక్షేత్రం.
ఒక్క సారైనాఈజన్మలోనే దర్సించవలసిన కలియుగ వైకుంఠం.
శ్రీమహావిష్ణువు స్వయంవ్యక్తమైన ఎనిమిది క్షేత్రాల్లో శ్రీరంగం మొట్టమొదటిది. 108 ప్రధాన విష్ణు దేవాలయాల్లో (దివ్యదేశాలు) అన్నిటికంటే మొట్టమొదటిదిగా, అత్యంత ప్రధానమైనదిగా ఇది పరిగణన పొందుతోంది. తిరువరంగ తిరుపతి, పెరియకోయిల్, భూలోక వైకుంఠం, భోగమండపంగా కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. వైష్ణవ పరిభాషలో ‘కోయిల్’ లేదా కోవెల అనే పదం సూచించేది ఈ ఆలయాన్ని మాత్రమే. ఈ ఆలయం బృహత్పరిమాణంలో ఉంటుంది. ఆలయ ప్రాంగణం 156 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనికి ఏడు ప్రాకారాలు లేదా ప్రహరీలు ఉన్నాయి. ఈ ప్రహరీలు దృఢమైన, భారీ బురుజులున్న గోడలతో ఏర్పాటయ్యాయి, అవి గర్భగుడి చుట్టూ ఆవరించి ఉన్నాయి. అన్ని ప్రాకారాల్లో ఉన్న 21 బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులకెవరికైనా ఓ విశిష్టమైన దృష్టిని అందిస్తాయి. జంటనదులైన కావేరి, కోలెరూన్ లేదా కొల్లిదంల ద్వారా రూపుదిద్దుకున్న ఓ చిన్న ద్వీపంలో ఈ ఆలయం నెలకొని ఉంది.

శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం ఓ గొప్ప సామ్రాజ్యానికి చెందిన చారిత్రక గత వైభవాన్నీ, వేలాది సంవత్సరాలనాటి ఓ నాగరికతనూ చాటి చెబుతుంది. పల్లవరాజుల పాలన మతపరమైన ఓ గట్టి పునాది ఏర్పరడానికి ప్రతీకగా నిలుస్తోంది, ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో, ప్రత్యేకించి కర్ణాట ప్రాంతంలో ఆర్య సంస్థల వృద్ధికి ఈ సామ్రాజ్యం గొప్ప ప్రోత్సాహం ఇచ్చినట్టు కనిపిస్తుంది. కోరమండల్ తీరాన్నీ, తూర్పు దక్కన్ ప్రాంతంలోని ప్రధాన భూభాగాన్నీ మూడు వందల ఏళ్ళకు పైగా పరిపాలించిన చోళ వంశం ఆ ప్రాంతాల్లో ఓ పురోగామి హిందూ సంస్కృతి వర్థిల్లేందుకు దోహదపడ్డారు.

చోళులు 13వ శతాబ్దంలో మధురైకి చెందిన పాండ్యుల చేతిలో, మైసూరుకు చెందిన హోయసల రాజుల చేతిలో ఓడిపోయారు. శ్రీరంగంలో ఆలయ నిర్మాణంపై హోయసలులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు కానీ, అవి శాసనాలూ, భవనాల వరకూ మాత్రమే పరిమితమైపోయాయి. హోయసలులను 14వ శతాబ్దం మొదటి భాగంలో పాండ్యులు ఓడించారు. ఆ తర్వాత, దక్కన్ పీఠభూమి మీద మహమ్మదీయులు తరచూ దాడులు చేసినప్పటికీ, 1336లో విజయనగరంలో ఏర్పడిన హిందూ సామ్రాజ్యం నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సామ్రాజ్యం తన స్వతంత్ర ప్రతిపత్తిని 1565 వరకూ కొనసాగించుకోగలిగింది.

అదే సమయంలో యూరోపియన్లు దక్షిణ భారతదేశంలో కాలుపెట్టారు. పదహారో శతాబ్దంలో అనేకమంది విదేశీ పర్యాటకులూ, వ్యాపారులూ ఈ మార్గాల్లోంచీ ప్రయాణాలు సాగించారు, కానీ విజయనగర సామ్రాజ్యం తమ వ్యాపారాలకోసం సమకూర్చిన మార్గాలమీద తప్పితే పోషక భూభాగాలమీద వారికి ఆసక్తి చాలా తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో, 1600లో ఆంగ్లేయుల ఈస్టిండియా కంపెనీ, 1664లో ఫ్రెంచి కంపెనీలు వెలిశాయి.

1680లో, ఔరంగజేబు రాజు (1658-1707) పశ్చిమ దక్కన్ ప్రాంతంలో దండయాత్రకు దిగేడు. సుదీర్ఘమైన ఆక్రమణలూ, భారీ ప్రాణనష్టం తరువాత, బీజాపూర్, గోల్కొండ కోటలు అతని ఆధీనంలోకి వచ్చాయి, అతని మరణం వరకూ ఈ దండయాత్రలు కొనసాగుతూనేవున్నాయి.

అయితే, యూరప్‌లో, ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం ఆంగ్లేయులూ, ఫ్రెంచివారి మధ్య పరస్పర పోరాటానికి దారి తీసింది. మద్రాస్‌ను డూప్లెక్స్ (1746లో) ఆక్రమించాడు, రెండేళ్ళ తదర్వాత దాన్ని తిరిగి ఆంగ్లేయులకు ఇచ్చేశారు. 1752లో ఫ్రెంచివారు బలవంతంగా లొంగిపోవాల్సి వచ్చింది, 1754లో డూప్లెక్స్ తో సంబంధం లేదని వదిలించుకున్నారు, అతన్ని వెనక్కి పిలిపించారు.

1760లో, లల్లీ-టోలెండల్ నాయకత్వంలో ఫ్రెంచివారు చేసిన మరో ప్రయత్నం విఫలమయింది, 1763లో ఫ్రెంచివారి వాణిజ్య స్థావరాన్ని కూల్చేశారు. అప్పటినుంచీ, ఇంగ్లీష్ కంపెనీ క్రమంగా మొత్తం భారత భూభాగమంతటినీ స్వాధీనం చేసుకుంది. ఫ్రెంచివారు విజయానికి చేరువగా వచ్చినప్పటికీ, ఆ తర్వాత వెల్లస్లీ నాయకత్వంలోని ఆంగ్లేయుల చేతిలో 1798లో వారు ఓడిపోయారు. మైసూరును ముట్టడించిన వెల్లస్లీ 1799లో శ్రీరంగపట్నాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత మొత్తం దక్షిణ భారతదేశమంతా ఇంగ్లండ్ ఆధిపత్యం కిందికి వచ్చింది. కర్నాటక ప్రాంతం కూడా అది మిగిలిఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ ప్రత్యక్ష పరిపాలన కిందికి చేరింది.

నిర్మాణం

శ్రీరంగం ఆలయం భారతదేశపు దక్షిణపు కొనలో కావేరీ నది రెండు బాహువుల మధ్యా ఏర్పడిన ఓ ద్వీపం మీద 10 డిగ్రీల 52’ఎన్, 78 డిగ్రీల 42’ఇ వద్ద నెలకొని ఉంది. ఆ ఆలయం సుమారు 6,31,000 చదరపు మీటర్ల (156 ఎకరాల) విశాలమైన ప్రదేశంలో విస్తరించి ఉంది. ఈ ఆలయానికి గర్భగుడి చుట్టూ ఏడు ఏకకేంద్రక దీర్ఘచతురస్రాకార ప్రాకారాలు ఉన్నాయి. ఏడు ప్రాకారాలున్న దేవాలయం భారతదేశంలో శ్రీరంగం ఒక్కటే, ఇది పవిత్రమైన సంకేతాన్ని స్ఫురింపజేసే సంఖ్య, ఇవి ఏడు యోగ కేంద్రాలనీ లేదా మధ్యభాగంలో ఆత్మ నిలిచి ఉండే మానవ శరీరాన్ని రూపొందించే ఏడు మూలకాలను సూచిస్తుందనీ ఈనాటి వైష్ణవం విశ్వసిస్తోంది.

ఏడవ ప్రాకారం గోపురాలు అసంపూర్తిగా మిగిలిపోయేయి. వాటిని రాజగోపురం అంటారు. అవి పూర్తయినట్టయితే, వాటి ఎత్తు కనీసం 50 మీటర్లు ఉండవచ్చునని వాటి భారీ పునాదుల కొలతలు రుజువు చేస్తున్నాయి.
ఆరవ ప్రాకారం

ఆరవ ప్రాకారానికి నాలుగు గోపురాలున్నాయి; తూర్పు గోపురం పదమూడవ శతాబ్దం నాటి ఆనవాళ్ళతో కూడిన శాసనాల పరిమాణం రీత్యా అన్ని విధాలా అత్యంత ఘనమైనది, ఊరేగింపు వాహనాల్ని ఈ ప్రహరీలో ఉంచుతారు.
అయిదవ ప్రాకారం

అయిదవ ప్రాకారాన్ని చోళుల శైలిలో నిర్మించిన మనవాళ్ళ మమునిగళ్ ఆలయం ఉంది.
నాలుగవ ప్రాకారం

నాలుగవ ప్రాకారంలోని దక్షిణ భాగంలో ఉన్న వేణుగోపాల కృష్ణన్ ఆలయంలో హిందూయేతరులుకూడా ప్రార్థనలు చేసుకోవచ్చు, జితెర్ (వీణ) వాయిస్తున్న లేదా చిలుకలతో ఉన్న లేదా అద్దాల్లో చూసుకుంటూ తమ ముస్తాబులకు తుదిమెరుగులు (తిలకాలు) దిద్దుకుంటున్న యువతుల అత్యంత సుందరమైన శిల్పాలతో అలంకరించి ఉన్న ఈ ప్రహరీ బయటి గోడలు చూపరులకు అద్భుతమైన ఆహ్లాదం ఇస్తాయి. ఈ ఆలయానికి వేలాడుతున్నట్టుగా వుండే పైకప్పు మీదికి ఎక్కి పరికిస్తే శ్రీరంగం ఆలయాన్ని మొత్తం స్థాయిలో వీక్షించవచ్చు. ఈ ప్రహరీలో అత్యంత ఆసక్తికరమైన వస్తువులతో ఓ ప్రదర్శనశాల కూడా ఉంది. ఈ ప్రహరీలోని తూర్పు ఆవరణలోకి హిందూయేతరుల్ని కూడా అనుమతిస్తారు, అది వెల్లై గోపురం అంటే శ్వేత గోపురంతో వ్యాపించి ఉంది. దక్షిణాన ప్రసిద్ధమైన శేషరాయర్ మండపం ఉంది. ఆ మండపానికి ఎదురుగా వెయ్యి స్తంభాల మందిరాన్ని చూడవచ్చు, దీనిలోనే దేవ, దేవతా విగ్రహాలున్నాయి. డిసెంబర్, జనవరి నెలలో జరిగే ఏకాదశి మహోత్సవాల సమయంలో ఆళ్వారుల్నీ, ఆచార్యులనీ బయటికి తీసుకొస్తారు.

మూడవ ప్రాకారం

మూడో ప్రాకారంలో కార్తీక గోపురం ఉంది, అది గరుడ మండపానికి దారితీస్తుంది, 14 వరుసలతో ఉన్న ఈ మండపం ఆలయంలోనే అత్యంత అందమైనది. పశ్చిమ భాగంలో వంటసాలలు, బియ్యం నిల్వచేసే గదులు ఉన్నాయి. ఈ విభాగం తూర్పు భాగంలో పవిత్రమైన కొలను (చంద్రపుష్కరిణి) ఉంది. ఇది తూర్పు, పశ్చిమాల్లో వృత్తాకారపు మెట్ల వరుసలతో అలరారుతోంది. తూర్పు విభాగంలో అనేక ప్రత్యేక పూజామందిరాలు, మండపాలు ఉన్నాయి.
రెండవ ప్రాకారం

రెండో ప్రహరీని చేరుకోవడానికి తప్పనిసరిగా దక్షిణ ఆర్యభట్టల్ మీదుగా వెళ్ళాలి. మిగినవాటితో పోలిస్తే చాలా ఇరుగ్గా ఉండే ఈ మొత్తం రెండో ప్రహరీలో, పూర్తి వెలుతురు ఉన్నప్పుడే సందర్శకులు వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది దాదాపుగా కూలిపోయిన మండపాల శ్రేణితో ఉంటుంది. ఈశాన్య మూలలో దేవుడి వంటశాల ప్రాంగణం ఉంటుంది; అక్కడ పాలనూ, భక్తులకు పంపిణీ చేసే అన్న ప్రసాదాలనూ ఉంచుతారు.
మొదటి ప్రాకారం

సందర్శకులు మొదటి ప్రాకారానికి చేరుకుంటారు, ఇది కూడా రెండోదానిలాగే ఉంటుంది, ఇక్కడ దీని దక్షిణ భాగానికి ఒకే ఒక ద్వారం ఉంటుంది; నచికేతన్ గోపురం, చెరోవైపునా శంఖనిధి, పద్మనిధి అని పిలిచే బొమ్మలూ, శంఖం, పద్మం ఉంటాయి, ఇవన్నీ విష్ణుమూర్తి చిహ్నాలు. ఇవి నైరుతిలో నిల్వచేసే గదులకు అమర్చి ఉంటాయి. గర్భగుడి నుంచి బయటికి తీసుకువస్తున్నప్పుడు స్వామివారి విగ్రహాన్ని ప్రతిఫలింపజేయడానికి మూలల్లో భారీ అద్దాలు బిగించి ఉంటాయి. వాయవ్య మూలలో వ్యక్తుల చిత్రపటాలతో అలంకరించిన పైకప్పుతో యాగశాల, తొండమాన్ మండపం ఉంటాయి. తూర్పు భాగంలో రెండు మండపాలు- అర్జున మండపం, కిళి మండపం ఉన్నాయి.

గోపురం,
నిర్మాణం

శ్రీరంగం ఆలయం భారతదేశపు దక్షిణపు కొనలో కావేరీ నది రెండు బాహువుల మధ్యా ఏర్పడిన ఓ ద్వీపం మీద 10 డిగ్రీల 52’ఎన్, 78 డిగ్రీల 42’ఇ వద్ద నెలకొని ఉంది. ఆ ఆలయం సుమారు 6,31,000 చదరపు మీటర్ల (156 ఎకరాల) విశాలమైన ప్రదేశంలో విస్తరించి ఉంది. ఈ ఆలయానికి గర్భగుడి చుట్టూ ఏడు ఏకకేంద్రక దీర్ఘచతురస్రాకార ప్రాకారాలు ఉన్నాయి. ఏడు ప్రాకారాలున్న దేవాలయం భారతదేశంలో శ్రీరంగం ఒక్కటే, ఇది పవిత్రమైన సంకేతాన్ని స్ఫురింపజేసే సంఖ్య, ఇవి ఏడు యోగ కేంద్రాలనీ లేదా మధ్యభాగంలో ఆత్మ నిలిచి ఉండే మానవ శరీరాన్ని రూపొందించే ఏడు మూలకాలను సూచిస్తుందనీ ఈనాటి విష్ణవం విశ్వసిస్తోంది.
ఏడవ ప్రాకారం

ఏడవ ప్రాకారం గోపురాలు అసంపూర్తిగా మిగిలిపోయేయి. వాటిని రాజగోపురం అంటారు. అవి పూర్తయినట్టయితే, వాటి ఎత్తు కనీసం 50 మీటర్లు ఉండవచ్చునని వాటి భారీ పునాదుల కొలతలు రుజువు చేస్తున్నాయి..
ఆరవ ప్రాకారం

ఆరవ ప్రాకారానికి నాలుగు గోపురాలున్నాయి; తూర్పు గోపురం పదమూడవ శతాబ్దం నాటి ఆనవాళ్ళతో కూడిన శాసనాల పరిమాణం రీత్యా అన్ని విధాలా అత్యంత ఘనమైనది, ఊరేగింపు వాహనాల్ని ఈ ప్రహరీలో ఉంచుతారు.
అయిదవ ప్రాకారం

అయిదవ ప్రాకారాన్ని చోళుల శైలిలో నిర్మించిన మనవాళ్ళ మమునిగళ్ ఆలయం ఉంది.
నాలుగవ ప్రాకారం

నాలుగవ ప్రాకారంలోని దక్షిణ భాగంలో ఉన్న వేణుగోపాల కృష్ణన్ ఆలయంలో హిందూయేతరులుకూడా ప్రార్థనలు చేసుకోవచ్చు, జితెర్ (వీణ) వాయిస్తున్న లేదా చిలుకలతో ఉన్న లేదా అద్దాల్లో చూసుకుంటూ తమ ముస్తాబులకు తుదిమెరుగులు (తిలకాలు) దిద్దుకుంటున్న యువతుల అత్యంత సుందరమైన శిల్పాలతో అలంకరించి ఉన్న ఈ ప్రహరీ బయటి గోడలు చూపరులకు అద్భుతమైన ఆహ్లాదం ఇస్తాయి. ఈ ఆలయానికి వేలాడుతున్నట్టుగా వుండే పైకప్పు మీదికి ఎక్కి పరికిస్తే శ్రీరంగం ఆలయాన్ని మొత్తం స్థాయిలో వీక్షించవచ్చు. ఈ ప్రహరీలో అత్యంత ఆసక్తికరమైన వస్తువులతో ఓ ప్రదర్శనశాల కూడా ఉంది. ఈ ప్రహరీలోని తూర్పు ఆవరణలోకి హిందూయేతరుల్ని కూడా అనుమతిస్తారు, అది వెల్లై గోపురం అంటే శ్వేత గోపురంతో వ్యాపించి ఉంది. దక్షిణాన ప్రసిద్ధమైన శేషరాయర్ మండపం ఉంది. ఆ మండపానికి ఎదురుగా వెయ్యి స్తంభాల మందిరాన్ని చూడవచ్చు, దీనిలోనే దేవ, దేవతా విగ్రహాలున్నాయి. డిసెంబర్, జనవరి నెలలో జరిగే ఏకాదశి మహోత్సవాల సమయంలో ఆళ్వారుల్నీ, ఆచార్యులనీ బయటికి తీసుకొస్తారు.
మూడవ ప్రాకారం

మూడో ప్రాకారంలో కార్తీక గోపురం ఉంది, అది గరుడ మండపానికి దారితీస్తుంది, 14 వరుసలతో ఉన్న ఈ మండపం ఆలయంలోనే అత్యంత అందమైనది. పశ్చిమ భాగంలో వంటసాలలు, బియ్యం నిల్వచేసే గదులు ఉన్నాయి. ఈ విభాగం తూర్పు భాగంలో పవిత్రమైన కొలను (చంద్రపుష్కరిణి) ఉంది. ఇది తూర్పు, పశ్చిమాల్లో వృత్తాకారపు మెట్ల వరుసలతో అలరారుతోంది. తూర్పు విభాగంలో అనేక ప్రత్యేక పూజామందిరాలు, మండపాలు ఉన్నాయి.
రెండవ ప్రాకారం

రెండో ప్రహరీని చేరుకోవడానికి తప్పనిసరిగా దక్షిణ ఆర్యభట్టల్ మీదుగా వెళ్ళాలి. మిగినవాటితో పోలిస్తే చాలా ఇరుగ్గా ఉండే ఈ మొత్తం రెండో ప్రహరీలో, పూర్తి వెలుతురు ఉన్నప్పుడే సందర్శకులు వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది దాదాపుగా కూలిపోయిన మండపాల శ్రేణితో ఉంటుంది. ఈశాన్య మూలలో దేవుడి వంటశాల ప్రాంగణం ఉంటుంది; అక్కడ పాలనూ, భక్తులకు పంపిణీ చేసే అన్న ప్రసాదాలనూ ఉంచుతారు.
మొదటి ప్రాకారం

సందర్శకులు మొదటి ప్రాకారానికి చేరుకుంటారు, ఇది కూడా రెండోదానిలాగే ఉంటుంది, ఇక్కడ దీని దక్షిణ భాగానికి ఒకే ఒక ద్వారం ఉంటుంది; నచికేతన్ గోపురం, చెరోవైపునా శంఖనిధి, పద్మనిధి అని పిలిచే బొమ్మలూ, శంఖం, పద్మం ఉంటాయి, ఇవన్నీ విష్ణుమూర్తి చిహ్నాలు. ఇవి నైరుతిలో నిల్వచేసే గదులకు అమర్చి ఉంటాయి. గర్భగుడి నుంచి బయటికి తీసుకువస్తున్నప్పుడు స్వామివారి విగ్రహాన్ని ప్రతిఫలింపజేయడానికి మూలల్లో భారీ అద్దాలు బిగించి ఉంటాయి. వాయవ్య మూలలో వ్యక్తుల చిత్రపటాలతో అలంకరించిన పైకప్పుతో యాగశాల, తొండమాన్ మండపం ఉంటాయి. తూర్పు భాగంలో రెండు మండపాలు- అర్జున మండపం, కిళి మండపం ఉన్నాయి.

దేవతామూర్తులు
శ్రీరంగం ఆలయంలో సన్నిధులు

అధిదేవుడైన రంగనాథ స్వామి సన్నిధితో పాటుగా, ఆలయ సమూదాయంలో అనేక ఇతర సన్నిధులూ, 53 ఉప-సన్నిధులూ కూడా ఉన్నాయి.

ఆలయంలో ఉన్న ఇతర సన్నిధులు:

తాయారు సన్నిధి§
చక్రధ్వజ్వర్ సన్నిది
ఉడయవర్ (రామానుజార్ సన్నిధి)
గరుడాళ్వార్ సన్నిధి
ధన్వంతరి సన్నిధి
హయగ్రీవార్ సన్నిధి
తమిళనాడులోని తిరుచినాపల్లి (తిరుచ్చి) ( Trichy - Tiruchirappalli )కి10 కిమీ దూరం లో ఉంది . తిరుచినాపల్లి ఎక్కడుంది అనేగా చెన్నై నుంచి 330 కిమీ దూరం . శ్రీరంగం లో రైల్వేస్టేషన్ ఉంది . IRCTC కోడ్ SRGM .
తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగంకు ప్రతీ పదినిమిషాలకు ఒక బస్సు వెళుతుంది. దూరం 9 కి.మీ. 15 నిమిషాల్లో చేరుకోవచ్చు.
తిరుచిరాపల్లిలో రైల్వేస్టేషన్‌, ఎయిర్‌పోర్టు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి శ్రీరంగంకు 15 కి.మీదూరం ఉంటుంది. శ్రీరంగంలోనూ రైల్వేస్టేషన్‌ ఉంది. స్టేషన్‌కు అరకిలోమీటరు దూరంలో ఆలయం ఉంటుంది.
రైలులో వెళ్లాలనుకుంటే హైదరాబాద్‌ నుంచి ముందుగా చెన్నై చేరుకోవాలి. అక్కడి నుంచి తిరుచిరాపల్లి వరకు మరో రైలులో చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సులో, క్యాబ్‌లో శ్రీరంగం చేరుకోవచ్చు.
విశాఖపట్టణం నుంచి విజయవాడ మీదుగా చెన్నై చేరుకుని అక్కడి నుంచి తిరుచిరాపల్లి చేరుకోవచ్చు.
హైదరాబాద్‌ నుంచి చెన్నై దూరం 770 కి.మీ. స్లీపర్‌క్లాస్‌ చార్జీ రూ.395. ప్రయాణ సమయం 15 గంటలు.
విశాఖపట్టణం నుంచి చెన్నై దూరం 781కి.మీ స్లీపర్‌క్లా్‌సచార్జీ రూ. 425.ప్రయాణ సమయం 15 గంటలు.
చెన్నై నుంచి తిరుచిరాపల్లి దూరం 350 కి.మీ స్లీపర్‌క్లాస్‌ చార్జీ రూ.215.ప్రయాణ సమయం 5.30 గంటలు.
హైదరాబాద్‌ నుంచి చెన్నై మీదుగా తిరుచిరాపల్లికి విమానసర్వీసులున్నాయి. ప్రయాణ సమయం 3 గంటల 40నిమిషాలు. చెన్నైలో ఆగుతుంది కాబట్టి సమయంలో మార్పులుంటాయి. ప్రయాణ
చార్జీలురూ.9300 లనుంచి మొదలవుతాయి.
విశాఖపట్టణం నుంచి వెళ్లాలనుకుంటే రూ. 13000ల నుంచి చార్జీలు మొదలవుతాయి.
దర్శనవేళలు
సాధారణ దర్శనం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.15 వరకు తిరిగి సాయంత్రం 6 నుంచి 6.45 వరకు పూజ జరుగుతుంది.ఈసమయంలో దర్శనానికి అనుమతించరు. ఉదయం 6గంటల నుంచి 7.15 వరకు విశ్వరూప సేవ ఉంటుంది. ఈ సేవలో పాల్గొనాలనుకుంటే రూ.50టిక్కెట్‌కొనుగోలు చేయాలి. శీఘ్రదర్శనం కావాలనుకుంటే 250 టిక్కెట్‌ కొనుగోలు చేయాలి.

వసతి
వసతి సౌకర్యాలకు ఇబ్బంది లేదు. దేవాలయ వసతి గృహాలున్నాయి. ప్రైవేటు హోటల్స్‌, లాడ్జీలు ఉన్నాయి. దేవాలయం ప్రధాన ప్రవేశ ద్వారంకు సమీపంలోనే హోటల్స్‌ ఉన్నాయి. వసతి, భోజనంకు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. కావాలనుకుంటే దర్శనం చేసుకుని తిరిగి తిరుచిరాపల్లి వెళ్లి స్టే చేయవచ్చు. అక్కడ ఐదు నక్షత్రాల హోటల్స్‌ నుంచి సాధారణ లాడ్జీల వరకు అన్ని అందుబాటులో ఉన్నాయి.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles