రాజమాతంగి
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా"
అని ఈమె 'విషంగుణ్ణి' చంపగా లలితాదేవి ఆనందించిందని వ్యాసమహర్షి లలితా సహస్రంలో కీర్తించారు. బ్రహ్మాండ పురాణంలో ఈమె విశుక్రుణ్ణి చంపినట్లుగా కల్పభేదంతో కనబడుతోంది. ఈమె ఇంద్రనీలమణి వంటి నీలం రంగుతో ఉంటుంది. అందుకే కాళిదాసు ఈమెను "మహేంద్ర నీల ద్యుతి కోమలాంగీమ్ - మాతంగ కన్యాం మనసా స్మరామి" అని కీర్తించాడు. ఈ తల్లిని ఉపాసించిన వారిపై వీరికి ఒక గాడిద మూలంగా జ్ఞానోదయం అయి మహాతపస్వి అయ్యారు. ఇంక మూడవవారు బ్రహ్మాండ పురాణం 35వ అధ్యాయంలో చెప్పబడ్డ 'రాజమాతంగీ' అవతారానికి తాతగారైన ప్రస్తుత మహర్షి ఒకరు.
ఈ ముగ్గురూ ఒకరైనా కావచ్చు. కాకపోవచ్చు. కానీ జగదంబ అవతరించిన వంశంకల ఈ ముని నిశ్చయంగా ధన్యుడే. మతంగం అనేది ఒక గజానికి పేరు. అలాగే 'మతమ్'= సర్వ మనోనుకూలం, గచ్ఛతి = యాతి ఇతి మతంగః అన్నారు కొందరు పెద్దలు.
అనగా అవ్యక్తంగా వున్న శబ్దం వ్యక్తం అయ్యే స్థితి యొక్క ప్రయాణం అన్నమాట. మనలో 'పరా' రూపంగా ఉన్న శబ్దం పశ్యంతి, మధ్యమా స్థితుల్ని దాటి 'వైఖరీ' రూపంగా అవతరించే 'వాక్' స్వరూపం ఏది ఉందో! అదే మాతంగీ విద్య. అదే మహా వాగ్వాదినీ స్వరూపం అన్నమాట. ఇది తాత్త్వికార్థం. ఇంక కథా రూపమైన అవతరణ గూర్చి బ్రహ్మాండ పురాణం ఇలా చెబుతోంది.
మతంగోనామ తపసామేక రాశిస్తబోధనః
తస్యపుత్రస్తు మాతంగః మంత్రిణీ తస్యవైసుతా
గొప్ప తపోధనుడైన మతంగ మహర్షి కొడుకు పేరు మాతంగుడు. ఈ ముని హిమవంతుని స్నేహితుడు. హిమగిరి మీదే నిష్ఠగా తపస్సు చేస్తున్నాడు. నిజానికి మాతంగుడు తపస్సు చెయ్యడానికి ఏ కారణాలూ ఏ కోరికలూ లేవు. బ్రహ్మోపాసనతో తపోలోకాలు సాధించాలని మాత్రమే. కానీ ఒకసారి హిమవంతునితో కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు పరిహాసంగా హిమవంతుడు మాతంగునితో 'నేను నీకంటే చాలా గొప్పవాణ్ణి'. నువ్వు మహర్షి పుత్రుడివి కావచ్చుగాక. గొప్ప తపస్వి కావచ్చును గాక! నాతో నువ్వెప్పుడు సమం కావు. ఎందుకంటే? "అహం గైరీ గురురితి". నేను లోకమాత ఐన ఉమాదేవికి తండ్రిని అని గొప్పగా చెప్పుకొనేవాడు. దానితో మాతంగుడు చిన్నపోయేవాడు. హిమగిరి మాటలు వినలేక ఇంకా ఘోరంగా జగదంబకోసం తపస్సు చేశాడు. అమ్మకరుణించి ప్రత్యక్షమై "ఏం కావాలి నాయనా!"అని వరం కోరుకోమంది. అప్పుడు మాతంగుడు - "దేవి! త్వత్ స్మృతి మాత్రేణ సర్వాశ్చ మమసిద్ధయః (మః) జాతా ఏవాసిమాద్యాః"
"అమ్మా తపస్సు వల్ల నిన్ను స్మరించినంతనే నాకు అణిమాది అష్టసిద్ధులూ లభించాయి.నాకీ ప్రపంచంలో కావలసినదంటూ ఇంక ఏమీ లేదు. అయినా తల్లీ! నీ యీ సాక్షాత్కారాన్ని నేను సఫలం చేసుకోదలిచాను. నన్ను హిమవంతుడు పరిహసిస్తూ తన గొప్ప చెప్పుకొంటున్నాడు.అందుకని నేను కూడా గౌరికి తండ్రిని కావడం కోసం తపస్సు చేశాను. కనుక ఓ మంత్రిణీ దేవీ! నాకు కుమార్తెగా పుట్టు" అని కోరాడు ముని. అమ్మ సంతోషంగా ఆ వరానికి ఒప్పుకొంది. ఒక రోజు రాత్రి స్వప్నంలో తన చెవికి ధరించిన నీలం పుష్పం (కాటుక చెట్టు పువ్వు) ఆ మునికి ఇచ్చింది. ఆ ప్రభావంతో అతని పత్ని గర్భవతి అయ్యింది. ఆమె పేరు సిద్ధమతి.ఆ సిద్ధిమతీ దేవి కొంచెం నీలం రంగుతో ఉండే 'లఘు శ్యామ'ని గర్భంలో ధరించింది. పిమ్మట నవమాసాలూ నిండాక శ్యామలని ప్రసవింపగా ఆమె మాతంగునికి అపత్యం అవడం మూలంగా మాతంగిగా ప్యఖ్యాతి కెక్కింది. పిమ్మట చాలా మంది కన్యకలు పుట్టారు. వారంతా మనోజ్ఞమైన రూపం కలవారుగా అవతరించారు. వారంతా మాతంగీ దేవిని సేవించేవారు.