1. ఇచ్చే వస్తువ కంటే కూడా ఆవస్తువును ఇచ్చే విధానమే దాత గుణానికి అద్దం పడుతుంది.
2. ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్ధకమైనది.
3. ఇతరుల తప్పులను ఎత్తిచూపే ముందు మీసొంత తప్పులను గురించి తెలుసుకోండి.
4. ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్ధహేతువులు.
5. ఇతరుల పట్ల స్నేహంగా ఉండండి. అప్పుడే స్నేహితులు మీ చుట్టూ చేరుతారు.
6. ఇతరుల సహకారం తీసుకోండి. ఎవరిపై పూర్తిగా ఆధారపడకండి.
7. ఇతరులకు మీరిచ్చే సలహాలను పాటించటమే అతి ఉత్తమంగా, జీవితంలో విజయాన్ని సాధించే ఉత్తమ మార్గం అవుతుంది.
8. ఇతరులకు హాని చేసే ముందే క్రోధం నీకు హాని కలిగిస్తుంది.
9. ఇతరులతో పంచుకున్నప్పుడూ తరగకుండా పెరిగేది ప్రేమ ఒక్కటే - రికార్డా హక్.
10. ఇతరులను అర్థం చేసుకున్న వాడు జ్ఞాని, తనను తాను అర్ధం చేసుకున్న వాడు వివేకి.
11. ఇతరులను చూసి మనం అసూయపడుతున్నామంటే, వారికన్నా మనం తక్కువని మనమే ఒప్పుకొని బాధపడుతున్నామని అర్ధం.
12. ఇతరులను జయించాలనుకోకు. నిన్ను నీవు జయించు. అప్పుడు ప్రపంచం నీచే జయింపబడుతుంది.
13. ఇతరులపై ఆధారపడకుండా మీమీద మీరే ఆధారపడండి.
14. ఇతరులు నడచిన బాటలో నడిచేవడు తనకాలి జాడలను వదలలేడు.
15. ఇతురుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు.
16. ఇతురుల సంక్షేమంలో ఆనందాన్ని పొందేవాడు మనుషుల చేత ఎన్నుకోబడిన విశిష్ట వ్యక్తి అవుతాడు.
17. ఇనప్పెట్టెలోని డబ్బుకంటే బజారులోని మిత్రుడు చాలా విలువైనవాడు.
18. ఈ పని తర్వాత ఏం చెయ్యాలని ఆలోచించకూడదు. ఆచరిస్తూ ఉంటే ఒకదాని వెంట మరొకటి అవే వస్తూ ఉంటాయి.
19. ఈ ప్రపంచం బాధపడేవారికి దుఃఖదాయకమైతే ఆలోచనాపరులకు సుఖదాయకం అవుతుంది.
20. ఈ రోజు చేయగల పనిని రేపటికి వాయిదా వేయవద్దు.
21. ఈ రోజు దొరికే గుడ్డుకంటే రేపు దొరికే కోడి మంచిది.
22. ఈరోజు నీవు చేస్తున్నదే రేపు నీకు రక్షణను ఇస్తుంది.
23. ఉజ్వల భవిష్యత్తు పై అచంచల విశ్వాసమే ఆస్తికత్వం.
24. ఉత్తమ గ్రంధాల సేకరణే ఒక నిజమైన విశ్వవిద్యాలయం.
25. ఉత్తమ మానవుని యొక్క లక్షణం నీతి గడించి, నియమంగా జీవించటమే .
26. ఉత్తమమైన పుస్తకాలను మొదట చదవండి. లేకపోతే అవి చదివే అవకాశమే దొరక్కపోవచ్చు.
27. ఉత్సాహం క్రియాశీలతలను వెయ్యి రెట్లు పెంచుతుంది.
28. ఉత్సాహం లేనిదే ఏగొప్ప పనిని సాధించలేము.
29. ఉత్సాహశీలికి ఎప్పుడూ విరామం అనేది ఉండదు.
30. ఉదార బుద్దితో చేయబడిన పని ఎప్పటికీ నశించదు.
31. ఉద్రేకాలకు లొంగినవాడు అందరినీ మించిన బానిస.
32. ఉన్నత భావాలు తోడుగా ఉన్నవారికి ఒంటరితనమంటూ లేదు.
33. ఉపదేశం తరువాత మీరు చేసేదే మీ మతం.
34. ఉపదేశం తేలిక. ఆచరణ అతి కష్టం.
35. ఉపదేశం పూర్తి అయిన తరువాత మీ ప్రవర్తనను సూచించేదే మీ మతం.
36. ఉపదేశాలకు మించి ధారాళంగా ఇవ్వబడేది వేరొకటి లేదు.
37. ఊరికే దొరికిన పుస్తకాన్ని సాధారణంగా చదవరు. డబ్బు పెట్టికొంటే తప్పకుండా చదువుతారు - శామ్యూల్ జాన్సన్.
38. ఎంత పంచుకుంటే అంత పొందగలం.
39. ఎక్కడైతే నిస్వార్ధత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది.
40. ఎక్కడైనా భయపడే వ్యక్తి ఎక్కడా సురక్షితంగా ఉండలేడు.
41. ఎక్కువగా నమ్మడం వల్ల మోసపోవచ్చు, కానీ నమ్మకమే ఉంచకుండా బతకడం దుర్భరం.
42. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పనికి తమ చేతనైనంత సహాయం చేసే వారే గొప్పవారు.
43. ఎదుటి వారిని సంతోషింపజేయడంలోనే సంతోషం ఉంది.
44. ఎదురైన కష్టం ఎంత గొప్పదైతే దాన్ని అధిగమించడం వల్ల వచ్చే ఘనత అంత ఎక్కువ.
45. ఎన్నడూ నిరాశ చెందనివాడే నిజమైన సాహసి.
46. ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు. మీ జీవితానికి ఎంత ప్రాణం పోశారన్నదే ముఖ్యం.
47. ఎప్పుడు చిరునవ్వు నవ్వుతుంటే భగవంతునికి సన్నిహితముగా ఉంటావు.
48. ఎప్పుడూ క్రొత్తనే కోరుకుంటుంది మానవత.
49. ఎప్పుడూ జయమే సాధించే ఎదురులేని అస్త్రం ప్రేమ.
50. ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరిచేత గౌరవింపబడుతారు.