Showing posts with label ఆరోగ్యం. Show all posts
Showing posts with label ఆరోగ్యం. Show all posts

Thursday 27 July 2017

ఔషధ గుణాల సంజీవని "పంచామృతం"



ఆలయాల్లో దేవుడికి నైవేధ్యంగా పెట్టే "పంచామృతం" ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. చక్కెర లేదా పటికబెల్లం, పాలు, పెరుగు, నెయ్యి, తేనెలను కలిపి పంచామృతంగా చేస్తారన్న సంగతి తెలిసిందే. స్వచ్ఛమైన ఆవుపాలు, తియ్యటి పెరుగు, పరిశుభ్రమైన నెయ్యి, సహజసిద్ధమైన తేనె, పటిక బెల్లంతో తయారైన ఈ పంచామృతం ఔషధ గుణాల సంజీవని అంటే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.

ముఖ్యంగా పంచామృతంలో వాడే ఆవుపాలు తల్లిపాలతో సమానమైనట్టివి, శ్రేష్టమైనవి కూడా. ఈ పాలు త్వరగా జీర్ణం అవటమే గాకుండా, శరీరానికి అవసరమైన కాల్షియంను పుష్కళంగా అందిస్తాయి. కాల్షియం ఎముకల పెరుగుదలకు బాగా ఉపకరిస్తుంది. అంతేగాకుండా ఈ పాలను ఎక్కువగా తాగటంవల్ల ఒబేసిటీతో బాధపడుతున్నవారు బరువు తగ్గుతారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఇక పాలలోని విటమిన్ ఏ అంధత్వం రాకుండా అడ్డుకుంటుంది.

తియ్యటి పెరుగులో ఔషధ విలువలు మెండుగా ఉన్నాయి. త్వరగా జీర్ణమయ్యే పెరుగు, ఉష్ణతత్వం ఉన్నవారికి అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఇక జీర్ణ సంబంధమైన వ్యాధులను నయం చేయటంలో పెరుగు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. జుట్టు సంరక్షణలోనూ పెరుగు ప్రభావం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఉదయంపూట తియ్యటి పెరుగును తినటం ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది.

పరిశుభ్రమైన నెయ్యి మేధో శక్తిని పెంచటంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఆయుర్వేద వైద్య ప్రకారం నెయ్యితో కూడిన, నెయ్యితో వేయించిన ఆహార పదార్థాలను భుజించటంవల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే పిల్లలు తినే ఆహారంలో ప్రతిరోజూ నెయ్యి ఉండేలా చూసుకోవాలి. చర్మ సౌందర్యంలోనూ నెయ్యి పాత్ర ఎక్కువేననీ ఆయుర్వేదం చెబుతోంది. నెయ్యివల్ల ముఖం కాంతివంతమవుతుందనీ, విటమిన్ ఏ మెండుగా లభిస్తుందని ఆయుర్వేదం వివరిస్తోంది. అయితే పరిమితంగానే వాడాలి..

సహజసిద్ధమైన తేనెను కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవులు పోషకాహారంగా స్వీకరిస్తున్నారు. సూక్ష్మజీవులతో పోరాడటంలో తేనె అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎలాంటి ఇన్‌ఫెక్షన్లను దరిచేరనీయని తేనె, జీర్ణకోశానికి చాలా మేలు చేస్తుంది. అంతేగాకుండా ఖనిజాలు ఎక్కువ స్థాయిలో లభించే తేనె, చర్మ సంరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఆరోగ్యానికి అన్నిరకాలుగా మేలుచేసే తేనెను ఆహారంలో భాగంగా తీసుకోవటం ఉత్తమం.

ఇక చివరిగా చక్కెర శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. పటికబెల్లం స్త్రీలకు ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా గర్భాశయంలోని చెడు రక్తం వల్ల స్త్రీలకు ఎన్నో బాధలు కలుగుతుంటాయి. అలాంటప్పుడు తినే సోంపుని మెత్తగా పొడిచేసి పటిక బెల్లం కలిపి ఉదయం సాయంత్రం వేడి పాలతో కలిపి తాగితే ఉపయోగం ఉంటుంది. పటికబెల్లంను చక్కెరకు బదులుగా పంచామృతంలోనూ వాడవచ్చు. కాబట్టి ఇన్నిరకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడే పై ఐదు పదార్థాలతో తయారైన పంచామృతం ఔషధ గుణాల సంజీవని.

Wednesday 26 July 2017

అన్నం గురించి ఓ ఉపాఖ్యానం వుంది.

అన్నం వండేవారు ఏ మనస్సుతో, ఏ భావంతో వండుతారో, దాని ప్రభావం ఆ అన్నం మీద , దాన్ని తినేవారి మీద కూడా ఉంటుంది. అందుకనే దేవుడికి నైవేద్యం వంట చేసేవారు కనీసం దాని రుచిని ఆఘ్రాణించను కూడా ఆఘ్రానించరు. అలా మనసా, వాచా, కర్మణా కూడా తయారైన నైవెద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల దాన్ని దేవుడు ఆరగించటంవల్లే నైవేద్యానికి అంత రుచి వస్తుంది.

వంట చేసేవారు కోపంగా, విసుగ్గా వంట చేస్తే, ఆ వంటకాలకు సరైన రుచి రాకపోగా, దాన్ని భుజించిన వారి మనస్సు కూడా కోపతాపాలకు నిలయమవుతుంది. అందుకే వంట చేసేటప్పుడు ఆ వంట చేసేవారు మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా వంటచేస్తే, దానికి రుచితోపాటు ఆ వంట తిన్నవారి మనస్సులు సంతోషంగా వుంటాయన్నది పూర్వూకుల విశ్వాసం.

లోకంలో మానవులు దాత, అదాత అని రెండు రకాలుగా వుంటారు. ఇతరులకు అన్నం దానం చేసి తాను తినేవాడు దాత. ఇతరులకు దానం చేయకుండా విషపూరితమైన అన్నాన్ని తినేవాడు అదాత. దాతకు కాలంతరాన అన్నం లభిస్తుంది. అదాతకు కాలాంతరాన అన్నం లభించకపోగా, అగ్ని నశింపచేస్తాడని తైత్తిరీయబ్రాహ్మణం వివరిస్తుంది.

ఇతరులకు అన్నం పెట్టకుండా తానే తింటే, ఆ అన్నం విషంతో సమానం. దాత, అదాత ఇద్దరూ అన్నసంపాదనకు ప్రయత్నిస్తారు. కాని దాత ఇతరులకు దానం చేయడం కోసం అన్నం సంపాదిస్తాడు. అది ఉత్కృష్టమైనది. అదాత తాను తినడంకోసమే సంపాదిస్తాడు. అతను పాపాత్ముడు అని శ్రుతి పేర్కొంటోంది.

అన్నం దేవతే కాకుండా మృత్యురూపమైంది కూడా. మనం తినే అన్నాని బట్టే మనకు రోగాలు, ముసలితనం లభిస్తాయి. అన్నమే సంతానోత్పత్తికి కారణమని కూడా చెపుతుంది ఆయుర్వేదం. కాబట్టి ఇంత మహిమగల అన్నం ఇతరులకు పెట్టకుండా తాను మాత్రమే తినేవాడు ఒక రకంగా విషాన్ని భుజిస్తున్నట్టే.

యజ్ఞయాగాది క్రతువుల్లొ అగ్నికి ఆహుతి చేసే అన్నం 'మేఘం' అవుతుంది. అన్నమే మేఘం. సూర్యుడు తన కిరణాలచే భూమిమీదున్న నీటిని స్వీకరించి ఔషధులను, అన్నాన్ని సృష్టిస్తున్నాడు. ఆ అన్నంతోనే ప్రాణులన్నీ జీవిస్తున్నాయి. శరీరం బలాన్ని సంపాదిస్తుంది. ఆ బలంతోనే తపస్సు చేయగలుగుతున్నారు.

పరిశుద్ధమైన , ఏకాగ్రమైన మనస్సుగలవారికి తపస్సు సత్ఫలితాలనిస్తుంది. ముందు మేధస్సు, తర్వాత శాంతి, జ్ఞానం, విజ్ఞానం, ఆనందం, పరమానందం లభిస్తాయి.

కాబట్టే ఇన్నింటినీ సమకూర్చే అన్నదానం వల్ల సర్వ వస్తువులనూ దానం చేసిన ఫలితం వస్తుంది.

Tuesday 17 January 2017

భోజన విధి


1.భోజనానికి ముందుగా చతురస్రమండలం చేయాలి.
2.తూర్పు, దక్షిణ,పడమర ముఖంగా కూర్చుని తినాలి.
3.మోదుగ,అరటి,పనస,మేడి ఆకులలో భోజనం ఉత్తమం
4.ఎడమవైపుగా కొస ఉండాలి.
5 . ఆకును నీటితో కడిగి మండలంపై ఉంచి వడ్డన చేయాలి.
6.ఎదురుకుండా కూరలు తరువాత మధ్యలో అన్నం,కుడివైపు పాయసం,పప్పు ఎడమవైపు పిండివంటలు చారు లేక పులుసు , చివర పెరుగు కలిపిన లవణం వడ్డన చేయాలి.
అన్ని వడ్డన అయ్యాక నెయ్యి వడ్డన చేయాలి.
7.ఆజ్య అభిఘారం లేకుండా అన్నము తినరాదు.
8.'త్రిసుపర్ణం' గాని 'అహంవైశ్వానరో భూత్వా '
మొదలగునవి పఠించవలయును.
9 చేతిలో నీరు గ్రహించి గాయత్రీ మంత్రముచే అన్నము పరిషేచన చేయవలెను.
10.తర్జనీ మధ్యమ అంగుష్ఠములచేత ఎదుటభాగం నుండి ఓం ప్రాణా...స్వాహా అని ఆహుతి గ్రహించవలేను
11.మధ్యమ,అనామిక,అంగుష్ఠములచేత దక్షిణభాగం నుండి ఓం అపానా...స్వాహా అని
12.కనిష్ఠ, అనామిక అంగుష్ఠములచేత
పడమర భాగం నుండి ఓంవ్యాన..స్వాహాఅని
13.కనిష్ఠికా తర్జనీ అంగుష్ఠములచేత ఉత్తరభాగం నుండి ఓం ఉదానా.. స్వాహా అని
15 అన్ని వేళ్ళు కలిపి మధ్యభాగం నుండి ఓం సమానా...స్వాహా అని ప్రాణాహుతులు దంతములకు తగలకుండా ఇవ్వవలయును.
16.ఉదయం రాత్రిపూట మాత్రమే భోజనము గృహస్తు చేయవలెను.
17 . మౌనంగా భోజనం చేయవలెను.
18.భోజనకాలమందు మంచినీరు కుడిభాగమందు ఉంచవలెను.
19.భోజనకాలమందు జలపాత్రను కుడిచేతి మణికట్టుపై ఉంచి ఎడమ చేతితో పట్టుకొని త్రాగవలయును.
20.భోజనం చేయుచూ పాదములు ముట్టుకొనరాదు.
21.చిరిగిన ఆకులో తినరాదు.
22.చెప్పులతోను?,మంచాలపైన, చండాలురు చూస్తూ ఉండగా భోజనం చేయరాదు.
23.భోజనం అయిన పిదప చేతిని కడుగుకొని
నీరు పుక్కిలించి పాదప్రక్షాళన చేయవలెను.
24.భోజనమునకు ముందు వెనుక ఆచమనం చేయవలయును.

Saturday 14 January 2017

చద్ది అన్న౦ గురించి ఒకసారి గుర్తు చేసుకోండి

చద్ది అన్న౦ గురించి ఒకసారి గుర్తు చేసుకోండి ఈసడి౦చక౦డి తెలివి తేటలు, జ్ఞాపకశక్తీ పెరుగుతాయి.

పిల్లలకు చద్ది అన్న౦ పెట్టట౦ మానేశాక ఈ తర౦ పిల్లలు బల౦గా ఎదుగుతున్నారని ఎవరైనా అనుకొ౦టూ వు౦టే వాళ్ళు పెద్ద భ్రమలో ఉన్నట్టే లెక్క. చద్దన్న౦ అనగానే ముఖ౦ అదోలా పెట్టేసేది ముఖ్య౦గా మన పెద్దావాళ్ళే. కొత్తతర౦ నాగరీకులైన తల్లిద౦డ్రులకు చద్దన్న౦ అ౦టే, కూలి నాలి చేసుకొనేవాళ్ళు తినేదనే
ఒక ఆభిజాత్య౦తో కూడిన అపనమ్మక౦ బల౦గా ఉ౦ది. తెలుగు నిఘ౦టువుల్లో కూడా చల్ది అన్న౦ అ౦టే పర్యుషితాన్న౦ (stale food) – రాత్రి మిగిల్చి ఉదయాన్నే తినే పాచిన అన్న౦ అనే అర్థమే ఇచ్చారు. ఈ అర్థ౦ రాసిన నిఘ౦టు కర్తలు కూడా ఇప్పుడు మన౦ చెప్పుకున్న నాగరీకుల కోవకు చె౦దిన వారే! రె౦డిడ్లీ సా౦బారు తిని కడుపుని౦పుకొ౦టున్నా౦ అనే భ్రమలో జీవిస్తున్నఈ తరాన్ని ఏ అన్న౦ రక్షి౦చగలదు….?
వీళ్ళకి అన్న౦ అ౦టేనే నామోషీ! పొద్దున్నపూట టిఫిన్లు, మధ్యాన్న౦ పూట పలావులూ, బిరియానీలు, రాత్రిపూట నాన్లో. పొరోటీలూ తప్ప అన్న్౦ధ్యాస లేకు౦డా జీవిస్తున్నారు. అన్న౦ తినే వాళ్ళ౦టే వీళ్ళలో చాలామ౦దికి చిన్నచూపు. తాగుబోతులకు మ౦దుకొట్టని అమాయకపు జీవుల౦టే పాసె౦జరు క్లాసు గాళ్ళని ఒక అభిప్రాయ౦ ఉన్నట్టే అన్నాన్ని ద్వేషి౦చే ఈ కొత్తతర౦ ధనిక వర్గానికి కూడా చద్దన్న౦ తినే వాళ్ళ౦టే అలా౦టి చిన్న చూపే ఉ౦ది.

గోపాల కృష్ణుని చుట్టూ పద్మంలో రేకుల లాగ కూర్చుని గోపబాలురు చద్దన్న౦ తిన్నారని పోతన గారు వర్ణి౦చాడు. ఆ చద్దన్న౦ ఎలా౦టిద౦టే, “మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద / డాపలి చేత మొనయ నునిచి./చెల రేగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు / వ్రేళ్ళ సందులను దా వెలయ నిఱికి…” ఇ౦ట్లో నానా అల్లరీ చేసి తెచ్చుకున్న ఊరుగాయ ముక్కల్ని వేళ్ళతో పట్టుకొని మీగడ పెరుగు వేసి మేళవి౦చిన చల్ది ముద్దలో న౦జుకొ౦టూ తిన్నారనే అన్నారు పోతన గారు. దీన్నిబట్టి చల్ది అ౦టే పెరుగన్నమేనని స్పష్టమౌతో౦ది. ఇక్కడ చలిది అనేది ‘చల్ల’కు స౦బ౦ధి౦చినదనేగాని, పాచిపోయి౦దని కాదు. చలి బోన౦ లేక చల్ది బోన౦ అ౦టే పెరుగన్నమే!

గ్రామ దేవతలకూ, అలాగే, దసరా నవరాత్రులలో అమ్మవారికీ చద్ది నివేదన పెట్టే అలవాటు ఇప్పటికీ కొనసాగుతో౦ది. చద్ది నివేదన అ౦టే, పెరుగు అన్నాన్ని నైవేద్య౦ పెట్టట౦. ఇది శా౦తిని ఆశిస్తూ చేసే నివేదన. గ్రామ అదేవతలు ఉగ్ర దేవతలు అ౦దుకని గ్రామ దేవతలకు ఉగ్రత్వ౦ శా౦తి౦చట౦ కోస౦ చద్ది నివేదన పెడతారు. దధ్యోదన౦ అ౦టే పెరుగన్న౦లో మిరియాలు, అల్ల౦, మిర్చి వగైరా కలిపి తాలి౦పు పెట్టి తయారు చేసినది. దద్ధోజనానికీ పెరుగన్నానికీ తేడా, ఈ తాలి౦పు దట్టి౦చట౦లో ఉ౦ది.

చల్ల అనే పద౦ అత్య౦త ప్రాచీన౦ మనకి. పూర్వ ద్రావిడ పద౦ ‘సల్’, పూర్వ తెలుగు భాషలో ‘చల్ల్’ గానూ, పూర్వ దక్షిణ ద్రావిడ భాషలో ‘అల్-అయ్’ గానూ మారినట్టు ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘ౦టువులో పేర్కొన్నారు. పూర్వ ద్రావిడ ‘సల్’ లో౦చి వచ్చిన చల్ల (మజ్జిగ-Buttermilk), పూర్వద్రావిడ ‘చల్’ లొ౦చి ఏర్పడిన చల్ల (చల్లనైన-cold, cold morning ) వేర్వేరు అర్థాల్లో వాడుకలోకి వచ్చాయి. ఈ తేడాని గమని౦చాలి.

చలి ప౦దిరి, చలివ౦దిరి, చలివ౦ద్రి, చలివె౦దర, చలివే౦ద్రము, చలివే౦దల, చలివే౦ద్ర… ఈ పదాలన్ని౦టికీ త్రాగటానికి నీళ్ళు అ౦ది౦చే ప౦దిరి అనే అర్థాన్నే మన నిఘ౦టువులు ఇచ్చాయి. కానీ, మజ్జిగ ఇచ్చి దప్పిక తీర్చట౦ మన పూర్వాచార౦. ఒకప్పుడు చలివే౦ద్రాలు చల్లనిచ్చిన కే౦ద్రాలే కాబట్టి, ఆ పేరు వచ్చి ఉ౦డాలి.

“అయ్యా! మీరు చల్దివణ్న౦ తి౦చారా…?” అనే ప్రశ్న వినగానే కన్యాశుల్క౦లో బుచ్చమ్మ ఎవరికైనా గుర్తుకు వస్తు౦ది. చల్దివణ్ణ౦ అ౦టే, పెరుగన్న౦! ఇ౦ట్లో పెద్దవాళ్ళు కూడా అనుష్ఠానాలు చేసుకున్నాక ఉదయ౦ పూట ఉపాహార౦గా హాయిగా చల్ది తినేవారు. స్టీలు కంచాలు. స్టీలు క్యారేజీలు వచ్చాక చద్దన్న౦ స్థాన౦లో రె౦డిడ్లీ బక్కెట్ సా౦బారు టిఫిన్లు, కాఫీ, టీలు ఆక్రమి౦చాయి.

యోగరత్నాకర౦ అనే వైద్య గ్ర౦థ౦లో అతి వేడిగా పొగలు గక్కుతున్న అన్న౦ బలాన్ని హరిస్తు౦దనీ ఎ౦డిపోయిన అన్న౦ అజీర్తిని కలిగిస్తు౦దనీ, అతిగా ఉడికినదీ, అతిగా వేగినదీ, నల్లగా మాడినదీ అపకార౦ చేస్తాయనీ, సరిగా ఉడకనిది జీర్ణకోశానికి హాని కలిగిస్తు౦దనీ, అతి ద్రవ౦గా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకొ౦టే దగ్గు జలుబు, ఆయాస౦ వస్తాయనీ, దేహ కా౦తిని, బలాన్ని హరిస్తాయని మలబద్ధత కలిగిస్తాయనీ ఉ౦ది. వీటికి భిన్న౦గా, చల్ది అ౦టే, మజ్జిగ అన్న౦ అమీబియాసిస్(గ్రహణీ వ్యాధి), పేగుపూత, కామెర్లు, మొలలు, వాతవ్యాధు లన్ని౦టినీ తగ్గి౦చగలిగేదిగా ఉ౦టు౦దనీ, బలకర౦ అనీ. రక్తాన్ని, జీర్ణ శక్తినీ పె౦చుతు౦దనీ ఈ గ్ర౦థ౦ పేర్కొ౦టో౦ది. బియ్యాన్ని వేయి౦చి వ౦డితే, జ్వర౦తో సహా అన్ని వ్యాధుల్లోనూ పెట్టదగినదిగా ఉ౦టు౦దని కూడా అ౦దులో ఉ౦ది. ఈ చల్లన్నాన్ని మూడు రకాలుగా చేసుకోవచ్చు.

1. ఆ పూట వ౦డిన అన్న౦లో మజ్జిగ పోసుకొని తినవచ్చు.
2. రాత్రి వ౦డిన అన్నాన్ని తెల్లవార్లూ మజ్జిగలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు.
3. రాత్ర్రి వ౦డిన అన్నాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అది మునిగే వరకూ పాలు పోసి, నాలుగు మజ్జిగ చుక్కలు వేస్తే, తెల్లవారేసరికి ఆ అన్న౦ మొత్త౦ తోడుకొని పెరుగులాగా అవుతు౦ది. ఈ తోడన్న౦ లేదా పెరుగన్నానికి తాలి౦పు పెట్టుకోవట౦, ఉల్లి ముక్కలు, టొమాటో, కేరట్ లా౦టివి కలుపుకోవట౦ చేయవచ్చు.
అన్న౦ కూడా పెరుగులాగా తోడుకు౦టో౦ది కాబట్టి, ఈ తోడన్న౦ తి౦టే, లాక్టో బాసిల్లై అనే ఉపయోగకారక సూక్ష్మజీవుల ప్రయోజన౦ ఎక్కువ కలుగుతు౦ది…! అయితే, మజ్జిగలో నానబెట్టినది దానికన్నా చాలా తేలికగా అరిగేదిగా ఉ౦టు౦ది. అప్పటికప్పుడు అన్న౦లో మజ్జిగ కలుపుకున్న దానికన్నా రాత్ర౦తా మజ్జిగలో నానిన అన్న౦లో సుగుణాలు ఎక్కువగా ఉ౦టాయి.
ధనియాలూ, జీలకర్ర, శొ౦ఠి ఈ మూడి౦టినీ సమాన౦గా తీసుకొని మెత్తగా ద౦చి, తగిన౦త ఉప్పు కలుపుకొని ఒక సీసాలో భద్ర పరచుకో౦డి. ఒకటి లేక రె౦డు చె౦చాల పొడిని తీసుకొని తోడన్న౦ లేదా చల్లన్న౦ న౦జుకొని తి౦టే, దోషాలు లేకు౦డా ఉ౦టాయి.

ఎదిగే పిల్లలకు ఇది గొప్ప పౌష్టికాహార౦. బక్క చిక్కి పోతున్నవారు తోడన్నాన్ని . స్థూలకాయులు చల్లలో నానిన అన్నాన్ని తినడ౦ మ౦చిది. రక్త పుష్టికి ఇ౦తకన్నా మెరుగైన ఆహార పదార్థ౦లేదు. రాత్రి బాగా ప్రొద్దుపోయిన తర్వాత తోడేసి, ప్రొద్దున్నే సాధ్యమైన౦త పె౦దరాళే తినాలి. ప్రొద్దెక్కేకొద్దీ పులిసి కొత్త సమస్యలు తెచ్చిపెడుతు౦ది.

చద్ది కథ ఇది! చద్దన్న౦ అని ఈసడి౦చక౦డి. అలా ఈసడి౦చట౦ మన అమాయకత్వానికి మాత్రమే సఒకేత౦ అని గమని౦చాలి. ఏమాత్ర౦ పోషక విలువలు లేని టిఫిన్లు పెట్టి పిల్లలను బలహీనులుగా పె౦చక౦డి. చద్ది పెట్ట౦డి. బల స౦పన్నులౌతారు, శారీరిక౦గానూ, మానసిక౦గా కూడా! తెలివి తేటలు, జ్ఞాపకశక్తీ పెరుగుతాయి.

Friday 13 January 2017

తులసి మొక్క ప్రాధాన్యత

భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం.

అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? తులసి ప్రత్యేకత ఏమిటి?

మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.

మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి.

కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.

తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైనవాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు.

అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.

తులసిలో విద్యుఛ్చక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది.

తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు.

తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.

తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.

ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది.

తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోదక శక్తి పెరిగిందట.

అంటే మన తులసమ్మ మనకు ఆయుషు పోసిందన్నమాట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.

తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు.

అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.

నల్గోండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తోంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాపితిని తగ్గిస్తాయని ఈ మధ్యే దృవీకరించారు.

మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం.

తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు, దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో, దాన్ని తులసి అంటారని అర్దం.

తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతారు .

సంప్రదాయం ప్రకారం గా భోజన విధానం…!

సంప్రదాయం ప్రకారం గా భోజన విధానం…!
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

1. భోజన సమయం లో చేయకూడనివి
భగవంతుడిని ఉపాసించే సమయంలో కాళ్ళూ చేతులూ కడుక్కుని, పరిశుద్ద వస్త్రాన్ని కట్టుకుని, సావధాన చిత్తంతో వ్యవహరించినట్లుగానే, భోజనం చేసే సమయంలో కూడా అంత శుచిగానూ, శాంతం గానూ వ్యవహరించాలని మన శాస్త్రాలు నిర్దేశించాయి.  అవి చెప్పిన భోజన నియమాల ప్రకారం తలమీద కప్పుకుని, లేదా టోపీ పెట్టుకుని, పాగా చుట్టుకుని భుజించ కూడదు.  కుర్చీ మీద కూచుని భుజించకూడదు.  భుజించే సమయంలో చెప్పులు, బూట్లు వేసుకుని ఉండకూడదు.  తోలు మీద కుర్చుని గానీ, బెల్ట్ పెట్టుకుని గానీ, బెల్ట్ వాచీని చేతిలో ధరించి కానీ భుజించ కూడదు.

పగిలి పోయిన పళ్ళాల్లో భుజించ కూడదు.
కలసి భోజనం చేయాల్సిన సందర్భాలలో ఇతరులు తనకోసం నిరీక్షించేలా చేయకూడదు.

కలసి భోజనం చేస్తున్నపుడు ముందస్తుగానే ముగించి, ఇతరుల భోజన విధానాన్ని ఆబగా చూడరాదు.
ఏక వస్త్రంతో భుజించరాదని అంటుంది దేవల స్మృతి.
ఇంట్లో భోజనం చేసేటప్పుడు అందరి చూపులూ పడేట్లుగా భుజించ కూడదు.  తలుపులు వేసుకోవాలి.  కనీసం పరదాలు వేసుకోవాలి. దృష్టి దోషం ఎంతటి వారిని అయినా కుంగదీస్తుంది.

బజార్లలో అమ్మే ఆహార పదార్థాలను కొని తినకూడదు.  వాటిపై ఆకలిగొన్న మనుషులు, పశువులు మొదలైన వాటి దృష్టి పడి ఉండవచ్చు.  పడవలో, భుజించ రాదనీ ఆపస్తంబ మహర్షి రాశారు.

అలాగే చాప మీద కూచుని కూడా భుజించ కూడదు.  అరచేతిలో ఆహారం పెట్టుకుని, వేళ్ళన్నీ తెరచి ఉంచి, ఉఫ్, ఉఫ్ అని ఊదుకుంటూ ఎన్నడూ తినరాదని బ్రహ్మ పురాణం పేర్కొంది.

చెరకు, క్యారట్, పండ్లు మొదలైన ఏ పదార్థమైనా సరే పండ్లతో కొరికి, బయటకు తీసి తిరిగి తినరాదు.

ఆవు నెయ్యితో తడప కుండా ఆహారాన్ని తినకూడదు.
విక్రయాన్నం తినకూడదని శంకలిఖిత స్మృతి శాసించింది. 

నేడు హోటళ్ళలో తినేవన్నీ విక్రయాన్నాల కిందకే వస్తాయి.  ఒకసారి వండిన దాన్ని, కొంతసేపటి తర్వాత తిరిగి వేడి చేసి, వడ్డించడం లాంటివి ఈ హోటళ్ళలో పరిపాటి.

భుజించేటప్పుడు కామ క్రోధాదులు, హింసా వైరాల వంటి వాటికి మనసులో చోటుండ కూడదు.

మునకాయ 300 వ్యాధులకు సింపుల్ మెడిసిన్ ఇది



☘ మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే.
అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.
అసలు 4, 5వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది.

☘ ఆయుర్వేదంలో 300లకుపైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. అందుకే దీనిని సాంప్రదాయకైన మందుగానూ చెబుతుంటారు మన పెద్దలు.

☘ మునగాకులో ఉన్న అద్భుతమైన అద్భుతమైన ఔషద గుణాలు.

☘ మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.

☘ క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ Aని పదిరెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు.

☘ కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును వాడతారు.

☘ పాల నుంచి లభించే క్యాల్షియం 17రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది.

☘ పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు.

☘ అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు.

☘ మహిళలు రోజుకి 7గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే 13.5శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది.

☘ ఐదు రకాల క్యాన్సర్లకు అద్భుత ఔషదం మునగాకు. లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఉందని తాజా పరిశోధనల్లో
తేలింది.

☘ యాంటీ ట్యూమర్ గానూ ఆకు వ్యవహరిస్తుంది.

☘ థైరాయిడ్ ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.

☘ మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుందట.

☘ అద్భుతమైన ఔషద సంజీవని మన మునగాకు ☘

☘ మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి.

☘ మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు.

☘ అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి.

☘ వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలను ఒక్కసారి పరిశీలిద్దాం ☘

☘ నీరు – 75.9 శాతం.

☘ పిండి పదార్థాలు – 13.4 గ్రాములు.

☘ ఫ్యాట్స్ – 17 గ్రాములు.

☘ మాంసకృత్తులు – 6.7 గ్రాములు

☘ కాల్షియం – 440 మిల్లీ గ్రాములు.

☘ పాస్పరస్ – 70 మిల్లీ గ్రాములు.

☘ ఐరన్ – 7 మిల్లీ గ్రాములు.

☘ ‘సి’ విటమిన్ – 200 మిల్లీ గ్రాములు.

☘ ఖనిజ లవణాలు – 2.3 శాతం.

☘ పీచు పదార్థం – 0.9 మిల్లీ గ్రాములు.

☘ ఎనర్జీ – 97 కేలరీలు.

☘ ఔషధ విలువలు అద్భుతం ☘

☘ ప్రారంభ దశలో వున్న కీళ్ళ నొప్పులకు మునగాకు దివ్య ఔషధం. మునగాకును నూరి కట్టుకడితే తగ్గిపోతాయి.

☘ మునగాకును నూరి లేపనంగా రాయడం, కట్టు కట్టడం ద్వారా చర్మరోగాలు, వ్రణాలు నివారణ అవుతాయి.

☘ మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యము, రేచీకటి తొలగిపోతాయి.

☘ మునగ ఆకులలో అమినో ఆమ్లాలు వుంటాయి. అందువల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం.

☘ మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిసి ప్రతిరోజూ సేవిస్తే గుండె, కాలయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి.

☘ మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది.

☘ మునగాకుతో మరికొన్ని ఉపయోగాలు ☘

☘ మునగాకుల రసాన్ని పాలలో కలసి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు.

☘ పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి.

☘ గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.

☘ మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి.

☘ మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటివారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ వుంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది.

☘ మరి ఇన్ని మంచి లక్షణాలున్న మునగాకును నిర్లక్ష్యం చేయడం తగునా?

☘🌿🌿☘🌿🌿☘🌿🌿☘

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles