Thursday, 27 July 2017
రావణ లంక దొరికింది..!
Tuesday, 17 January 2017
హనుమత్కల్యాణం
ధర్మ సందేహాలు సమాధానాలు
రామాయణంలో హనుమంతుని కల్యాణం విషయం లేదు కదా !
సువర్చలా వృత్తాంతం ఎక్కడిది అని కొందరు
ప్రశ్నిస్తారు .... సమాధాన మేమిటంటే ....
హనుమంతుని చరిత్ర. అంతా రామాయణంలో
లేదు కథకు అవసరమైన. మేరకే వాల్మీకి
స్వీకరించాడు అన్నీ యుగాలలోనూ చిరంజీవిగా
ఉన్న. హనుమంతుని సంపూర్ణ. చరిత్ర కేవలం
త్రేతాయుగానికి చెందిన. రామాయణం లో ఉండే
అవకాశం లేదు అలాగే హనుమంతుడు బ్రహ్మచారి
అంటారు , ఈ. వివాహం ఎలా జరిగిందనేది
మరో ధర్మసందేహం బ్రహ్మచర్యం నాలుగు
రకాలు , గాయత్రం బ్రహ్మం ప్రజాపత్యం .
బృహన్ అని వాటికి పేర్లు , భార్యతో నియమ
పూర్వక. జీవితం గడిపేవారిని ప్రజాపత్య. బ్రహ్మ --
చారులంటారు , బ్రహ్మచర్య. నియమాలను సరిగా
అర్ధం చేసుకోగలగాలి , హనుమంతుడు
భవిష్యద్ర్బహ్మ. , ఆయన. బ్రహ్మస్తానం పొందినవాడు
సువర్చలాదేవి సరస్వతి స్థానం పొందుతుంది ,
దేవతల. భార్యలంటే అర్ధం వారి శక్తులే బ్రహ్మచర్య
నిష్టాగరిష్టునికి ఉండే శక్తి వర్చస్సు , సువర్చస్సు
ఆమెయే సువర్చలా దేవి ..
కళ్యాణ. వైభోగం
సువర్చలాపతిష్షష్ఠః అన్నారు హనుమంతునికి
నవావతారాలు ఉన్నాయి , వాటిలో ఆరోది
సువర్చలాంజనేయ. అవతారం , సువర్చలా హనుమత్
ద్వాదశక్షరీ మంత్రం మ౦త్రశాస్ర్త౦లో ఉ౦ది.
ధ్వజదత్త , కపిలాది భక్తి ఉపాసకులకు సువర్చలాహనుమత్ సాక్షాత్కార౦ జరిగి౦ది.దేశ౦ నలుమూలలా మాత్రమే కాకు౦డా విదేశాలలో కూడా సువర్చలా౦జనేయ విగ్రహాలున్నాయి. బ౦దరు
పరాసుపేటలో శివాజీగురువు సమర్ధ రామదాసు
స్వామి 16వ శతాబ్దిలో ప్రతిష్ఠించినది సువర్చలా౦-
జనేయ. ఆలయమే . అనేక హనుమాదాలయాలలో
వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో కల్యాణాలు నిర్వహించడ౦,
సువర్చలా౦జనేయుల ఉత్సవమూర్తులను సిద్ధ౦
చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. హనుమ-
దుపాసకులు ఎ౦దరో హనుమత్కల్యాణ౦ నిర్వహిస్తూ
ఉ౦టారు. మార్గశిర శుద్ధ త్రయోదశినాటి హనుమద్ర్వత
సమయంలో సువర్చలా౦జనేయ కలశాలను ఉ౦చి
పూజిస్తారు. సువర్చలా హనుమత్ గాయత్రి మ౦త్ర౦
జపి౦చడ౦ వల్ల వివాహం అయిన వారెందరో ఉన్నారు.
గృహస్ధులైన వారికి సువర్చలా౦జనేయ సేవ సకల
శ్రేయేభివృద్ధులనూ కలిగిస్తుంది.
మళ్ళీ కలుద్దాం సెలవు
హనుమత్కల్యాణం విషయాలు , 2 వ. భాగములో
Friday, 13 January 2017
రావణుడు చనిపోయేటప్పుడు లక్ష్మణుడి చెవిలో చెప్పిన రహస్యాలు
రావణుడు చనిపోయేటప్పుడు లక్ష్మణుడి చెవిలో చెప్పిన రహస్యాలు ఇవే …తప్పకుండా తెలుసుకోవాలి..ఇలా చెబుతాడు. బ్రాహ్మనులలోని పండితుడైన రావణుడి దగ్గరకు వెళ్లి, ఎవరికీ తెలియని నాలుగు మంచి విషయాలు తెలుసుకోమని చెబుతాడు. అప్పుడు రావణుడు ఏమి చెప్పాడంటే…
.మన రధసారధితో , కాపలావాడితో, వంట వాడితో నీ తమ్ముడితో ఎప్పుడు స్నేహంగానే మెలగాలి. వాళ్ళతో గాని శతృత్వం పెట్టుకుంటే, వారు ఎప్పుడైనా , ఎటునుంచి అయినా మనకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలు తియ్యడానికి కూడా వెనకాడరు.
.ఎప్పుడూ విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎల్లప్పుడూ నువ్వే గెలుస్తావని అనుకోకు.
.నీతో ఉంటూ నిన్ను విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకోవచ్చు. నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు..నీ శత్రువు చిన్నవాడు, తక్కువ వాడు అని తక్కువ అంచనా వెయ్యవద్దు. ఎవరి వెనుక ఎంత భలం ఉందొ ఎవరికి తెలుసు. నేను హనుమంతుడిని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను.
.దేవుడుని ప్రేమించవచ్చు లేదా ద్వేషించ వచ్చు కాని ఏదైనా కూడా అపారమైన దృడ నిశ్చయంతో ఉండాలి.
.రాజుకు యుద్ధం లో గెలవాలని కోరిక ఉండాలి కాని ఎప్పటికీ అత్యాశాపరుడై ఉండకూడదు.
.ఇతరులుకు, సైన్యానికి అవకాశం ఇచ్చి, రాజు అలసిపోకుండా పోరాడతేనే విజయం సొంతం అవుతుంది.
ఈ మాటలు చెబుతూ ప్రాణాలు వదిలేస్తాడు రావణుడు. ఆయన చెప్పిన మాటలు మన జీవితానికి కూడా వర్తిస్తాయి. ఎంతో విలువైనవి రావణుడు ఆ సమయంలో చెబుతాడని, అవి లోకానికి ఉపయోగపడతాయనే రాముడు లక్ష్మనుడిని వెళ్లి తెలుసుకోమని ఉంటాడు. ఇప్పుడు మనం తెలుసుకుని నలుగురికి తెలియజేద్దాం.
Thursday, 12 January 2017
రావణాసురుడిని ఓడించిన మాంధాత.
రామాయణంలో రాముడి చేత సంహరించబడిన రావణుడు.. అంతకుముందే మరొకరి చేతిలో ఓడిపోయాడు. అతడి పేరే మాంధాత. ఇతడు యవనాశ్వుని కుమారుడు. భ్రుగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించినందువల్ల యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు. చిన్నతనం నుంచే సాహసాలు చేయడం, యుద్ధాల్లో చేసే పోరాటాలను నేర్చుకునేవాడు. ఇతను ఎంతటి బలవంతుడటంటే.. 12వ ఏటలోనే రాజ్యాభిషిక్తుడవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు.. అతనిని ఓడించాలని నిర్ణయించుకుంటాడు. తనకంటే మించిన బలవంతుడు మరొకరు లేరని నిరూపించడం కోసం మాంధాతో యుద్ధానికి దిగేందుకు రావణుడు సన్నద్ధమవుతాడు.
రావణుడు అనుకున్నట్లుగానే అతనితో యుద్ధానికి దిగుతాడు. మాంధాత, ఇతనికి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతుంది. మాంధాతను ఎలాగైనా ఓడించాలనే కసితో తాను ముందుగానే ఏర్పరుచుకున్న పథకాలను ప్రయత్నించసాగాడు కానీ.. అతని బలం ముందు అవి ఏమాత్రం పనిచేయవు. ఎన్నిరకాలుగా ప్రయత్నించిన రావణుడు అతనిని ఓడించలేకపోయాడు. అయినప్పటికీ ఓటమిని అంగీకరించకుండానే అతనితో అలాగే పోరాడుతాడు. చివరికి మాంధాత చేతిలో రావణుడు ఓడిపోతాడు. అప్పుడు అతని బలమెంతో తెలుసుకున్న రావణుడు.. తనని ఓడించడం కష్టమని తెలుసుకుంటాడు. అయితే.. ఇంతలోనే బ్రహ్మ, ఇంద్రుడు జోక్యంచేసుకుని... మంధాత, రావణునికీ మధ్య సంధి కుదుర్చుతారు. దాంతో ఇద్దరూ ఒక్కటవుతారు. చివరికి రావణుడు తిరిగి లంకకు చేరుకుంటాడు.🙏🌺🙏
Sunday, 18 December 2016
శివధనుస్సు
రాముడు అవతారపురుషుడు అని అందరికీ తెలిసినదే కదా! ఆయన ఏమి చేసినా ఒక మానవుడు ఎలా బ్రతకాలి తద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి అని చెప్పడానికే చేశాడు. ఆయన ప్రతీ కదలికకీ అంతరార్థం, పరమార్థం ఉన్నాయి. అలానే శివధనుస్సు విషయానికి వస్తే…..
అకార ఉకార మకారములు ప్రణవము, ప్రణవం
ధనుహు, శరోహ్యాత్మ, బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే
అప్రమత్తేన వేధ్ధవ్యం శరవత్ తన్మయో భవేత్
అన్నారు.
అంటే…. అ, ఉ, మ కలిస్తేనే ప్రణవ నాదమయిన ఓం కారం వస్తుంది. ధనుస్సు (ప్రణవం) అంటే ఈ ఓంకారం అనమాట. శరము (బాణము) అంటే ఆత్మ. బాణముతో ధనుస్సును ఎక్కుపెట్టినప్పుడు కనిపించే లక్ష్యమే బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అనగా పరబ్రహ్మ లేదా పరమాత్మ. బాణాన్ని ఎప్పుడూ అప్రమత్తంగా, చిత్త శుద్ధితో కొడితేనే లయమయ్యి లక్ష్యాన్ని చేరుతుంది. ఇది ధనుస్సు యొక్క అంతరార్థం.
ఇక్కడ శివధనుస్సు ఆవిర్భావం గురించి మరికొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఈ శివధనుస్సును శివుడు త్రిపురాసురుని సంహరించడం కోసం సృష్టించాడు అన్నది అందరికీ తెలిసినదే! ఈ త్రిపురాసురుడు ఒక జీవుడుని ప్రతిబింబిస్తాడు అని అంతరార్థం ఉంది. అదెలా అంటే, త్రిపురాసురుడు పాలించే మూడు పురములు అయినటువంటి కంచు, వెండి, బంగారములు వరుసగా జీవి యొక్క స్థూల (విశ్వ), సూక్ష్మ (తైజస), కారణ (ప్రాజ్ఞ) శరీరములను ప్రతిబింబిస్తాయి.
స్థూల శరీరం అంటే బాహ్యముగా ఈ విశ్వానికి కనిపించే శరీరం. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు విశ్వుడు అంటారు. ఈ దేహానికి కంచులాగా విలువ లేదు.
సూక్ష్మ శరీరం అంటే కలలో ఉన్నప్పుడు మనకి కనిపించే శరీరం. అది కేవలం ఆలోచన తప్ప అక్కడ ఒక కాయం అన్నది ప్రస్ఫుటముగా ఉండదు. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు తైజసుడు అంటారు. ఈ శరీరం వెండిలాంటిది.
కారణ శరీరం అంటే నేను, నాది అనుకునేది లోపల ఏదయితే ఉందో అది. దీనినే అంతరాత్మ అంటారు. ఇది ఒక రూపం కోసం మాత్రమే పై రెండు రకాల శరీరాల మీద ఆధారపడుతుంది. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రాజ్ఞుడు అంటారు. ఇది బంగారంలా చాలా విలువయినది.
శివుడు ప్రణవమనే ధనస్సుతో, ఈ మూడు పురములు అనబడే మూడు రకాల శరీరాలని ఒకేసారి ఛేదించాడు. అప్పుడే త్రిపురాసురుడు అనబడే ఈ జీవుని సంహారం జరిగి మరు జన్మ ఉండదు.
ఈ మూడే కాక, మహాకారణ శరీరం అని ఒకటి ఉంది. అది అందరూ గాఢ నిద్రలో అనుభవించే స్థితి. దీనినే తులీయావస్థ అంటారు. ఈ స్థితిని మనం గుర్తించ గలిగి ఆ పరమాత్మలో లయం అవటాన్నే మోక్షం అంటారు. జీవుడిని ఆ మోక్షానికి చేరువ చేసేదే ఓం కారం అయిన ధనుస్సు.
శివుడు ఈ శివధనుస్సుని త్రిపురాసుర సంహారానంతరం దేవరాతుడు అనబడే జనకుని వంశ పూర్వీకునికి ఇవ్వగా ఆ నాటి నుండి వారి వద్ద పూజలందుకుంటూ ఉంది. దీనినే శ్రీరాముడు స్వయంవరంలో విరిచి అప్పుడు సీతమ్మ చేయి అందుకుంటాడు. అనగా గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టే ముందు దీనిని విరిచాడు కదా! ఒక మగవాడికి ధర్మార్థ కామ మోక్షాలు పొందడానికి అనువయిన, ఉత్తమమయినది ఈ గృహస్థాశ్రమం. ఇందాకా చెప్పుకున్నట్టు ధనుస్సు అంటే ప్రణవ నాదమయిన ఓంకారం కనుక దానిని విరవటం అంటే ఓం కారాన్ని విడగొట్టడం. అలా విడగొడితే వచ్చేవి మళ్ళీ అ, ఉ, మ. వీటిల్లో
అ – అంటే బ్రహ్మం లేదా పరబ్రహ్మం అంటే పరమాత్మ అయిన శివుడు
ఉ – అంటే అమ్మవారు సాక్షాత్తు శివుని అర్థ భాగం
మ – అంటే జీవుడు అంటే నేను అనే మగవాడు
ఏ మగవాడయినా పరమాత్మలో చేరడానికి కావలసిన మాధ్యమం అర్థభాగమయిన, అర్థాంగి అయిన భార్య. మనకున్న ధర్మార్థకామ మోక్షాలలో….
ధర్మం – ధర్మానికి ప్రతిరూపం భార్య ఆవిడ లేకపోతే ఏ పూజలకీ, యాగాలకీ, జపాలకీ, తపస్సులకీ జీవుడు పనికిరాడు.
అర్థం – మగవానికి సంతాన ఉత్పత్తి కోసం భార్య కావాలి.
కామం – తనకు కావలసిన కోర్కెలు తీర్చుకోవడానికి భార్య కావాలి.
ఇలా ఎప్పుడయితే, ఏ మగవాడయితే ధర్మాన్నీ, అర్థాన్నీ పాటిస్తూ, ఈ రెండూ చెడకుండా కామాన్ని అనుభవిస్తాడో అతనే మోక్షాన్ని పొందే అర్హత సంపాదిస్తాడు.
రాముడు వీటన్నిటినీ ఆలంబిస్తూ ధనుస్సుని విరిచి తను ఈ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే అర్హతని పొందాడు. కనుకనే అతను సీతకి తగినవాడు, అన్నిటినీ జయించినవాడు కనుక అందరూ సంతోషిస్తారు.
శివ ధనుస్సు లాగానే విష్ణు ధనుస్సు కూడా ఉంది. అది పరశురాముని వద్ద ఉంటుంది. ఎప్పుడయితే రాముడు శివ ధనుస్సుని విరిచి సీతని పరిణయమాడతాడో, అప్పుడు అది తెలిసిన పరశురాముడు ఈ విష్ణుధనుస్సుని, ఆయన శక్తిని కూడా రామునికి ఇచ్చేసి హరిహరులని ఏకం చేస్తాడు.🙏🌺🙏
Tuesday, 7 June 2016
వాల్మీకి రామాయణం 31వ దినము
వాల్మీకి రామాయణం
31వ దినము, బాలకాండ
వాళ్ళు చెప్పినదానికి శంకరుడు సరే అన్నాడు, కాని ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది, ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు, దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు.....
యత్ తేజః క్షుభితం హి అద్య తద్ ధరా ధారయిష్యతి |
మీ తేజస్సుని భూమి భరిస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకి వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. కావున.....
అపత్యం స్వేషు దారేషు న ఉత్పదయితుం అర్హథ |
అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ||
ఏవం ఉక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీం అపి |
అవనే న ఏక రూపా త్వం బహు భార్యా భవిష్యసి ||
న చ పుత్ర కృతాం ప్రీతిం మత్ క్రోధ కలుషీకృతా |
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్ఛతీ ||
మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికీ మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి, ఇకనుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది, ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు, భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు.
వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు.
వాల్మీకి రామాయణం 32వ దినము
వాల్మీకి రామాయణం
32వ దినము, బాలకాండ.
శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. అదే సమయంలోతారకాసురుడు అనే రాక్షసుడు, తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలీక బ్రహ్మగారి దెగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి, హిమవంతుడు - మనోరమల కుమార్తెలైన గంగా - పార్వతులకి తేడా లేదు, కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే, పార్వతీదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడా దేవతలు గంగమ్మ దెగ్గరికి వెళ్ళి, దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దెగ్గరనుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగ సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది. ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమి చెయ్యమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది.
అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం, వెండిపుట్టాయి, ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము,సీసము పుట్టాయి, ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి,ఇనుము పుట్టాయి, మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్ని పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారు పొదలుగా, శరవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా, పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు( కృత్తికల పుత్రుడు ) అని పిలవాలి, అలా అయితే పాలు పడతాము అన్నారు. దేవతలు సరే అన్నారు.
తతః తు దేవతాః సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్ |
పుత్రః త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః ||
ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు, ఏక కాలంలో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి, అగ్నిసంభవహా అని నామాలు. అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యము స్ఖలనమైతే పుట్టినవాడు కనుక, స్కందుడు అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక, అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రణవార్ధాన్ని వివరించాడు కనుకస్వామిమలై అన్నారు" అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.
వాల్మీకి రామాయణం 33వ దినము
వాల్మీకి రామాయణం
33వ దినము, బాలకాండ.
గంగ అసలు భూమి మీదకి ఎందుకొచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగరుడుపరిపాలించేవాడు, ఆయనకి కేశిని, సుమతి అని ఇద్దరు భార్యలు. సుమతి గరుక్మంతుడి సోదరి. తనకి కుమారులు కలగడం కోసం తన ఇద్దరు పత్నులతో కలిసి హిమాలయాలలో ఉన్న భృగు స్రవణాన్ని చేరుకొని 100సంవత్సరాలు తపస్సు చేశాడు సగరుడు. ఆ భృగు స్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి, నీకున్న ఇద్దరు భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు, రెండవ భార్యకి 60,000 మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడు. ఇది విన్న కేశిని, సుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగు మహర్షిని అడుగగా, ఆయన మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అని అన్నారు. పెద్ద భార్య అయిన కేశిని తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి అని అడిగింది, నాకు మహొత్సాహము కలిగిన 60,000 మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది. ఆయన సరే అన్నారు.
కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనే వాడు పుట్టాడు, రెండవ భార్యకి ఒక సొరకాయ పుట్టింది, ఆ సొరకాయ కిందపడి పగిలి అందులోంచి 60,000 మంది చిన్న చిన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళని నేతి కుండలలో పెట్టి పెంచారు, వాళ్ళందరిని కలిపి సగరులు అన్నారు. పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రొజూ రాజ్యంలోని కొంతమంది పిల్లలని సరయు నదిలోకి తీసుకెళ్ళి, నీళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణం అయ్యేవాడు. కొంతకాలానికి రాజుకి విషయం తెలిసి.....
ఏవం పాప సమాచారః సజ్జన ప్రతిబాధకః ||
పౌరాణాం అహితే యుక్తః పిత్రా నిర్వాసితః పురాత్ ||
తప్పు చేసినవాడు కొడుకైనా సరే, అతనివల్ల ప్రజలకి కీడు జెరుగుతుంది కనుక శిక్షించాలి అని అనుకున్నాడు. ఆ అసమంజసుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ అసమంజసుడి కొడుకైన అంశుమంతుడిని తన దెగ్గర పెట్టుకున్నాడు ఆ సగర చక్రవర్తి. అలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేథ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ గుర్రం వెనకాల వెళుతున్న అంశుమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు. అప్పుడా సగరుడు తన 60,000 మంది కొడుకులని పిలిచి, ఈ భూమి 60,000 యోజనాలు ఉంటుంది, కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి, భూమి మొత్తాన్ని వెతకండని చెప్పి పంపాడు. వజ్రాల్లాంటి తమ గొళ్ళతో ఆ సగరులు భూమినంతా తవ్వడం ప్రారంభించారు. ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దెగ్గరికి వెళ్లి................దేవా! సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి, ఏమి చెయ్యమంటారు అని అడిగారు. అప్పుడు బ్రహ్మ దేవుడు..........మీరెవరు కంగారు పడమాకండి, ఈ భూమంతా శ్రీమహా విష్ణువుది, కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు, ప్రస్తుతం ఆయనపాతాళ లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పారు.
వాల్మీకి రామునికి 16 సుగుణాలు ఉన్నాయి అన్నాడు. అవి ఏమేమిటి?
రామాయణం భారత దేశం ప్రపంచానికి అందించిన ఒక మహత్తర కావ్యం.
రామాయణం భారత దేశం ప్రపంచానికి అందించిన ఒక మహత్తర కావ్యం. ఇది ఒక కావ్యమే కాదు, భారతీయుల జీవన విధానం. భారత దేశం లో ఊహ తెలిసిన చిన్నపిల్లవాడి కి కూడా రామాయణం అంటే రాముడి కథ అని తెలుసు. ఇది అంతగా భారతీయుల జీవితంతో పెనవేసుకుపోయింది.
ఎవరైనా ఒక మంచి వ్యక్తి గురించి చెప్పాలంటే " అయన సాక్షాత్తు రామచంద్రుడే" అంటాం. ఒక మంచి కొడుకు గురించి చెప్పాలంటే " రాముడిలాంటి అబ్బాయండి " అంటాం. ఇంక ఒక మంచి భర్త గురించి చెప్పాలి అంటే రాముడిని మించిన పోలిక లేనే లేదు. మరి రాముడు ఇంత గొప్పవాడు అవడానికి రామునిలో ఉన్న లక్షణాలు ఏమిటి? వాల్మీకి చెప్పిన విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకొందాం.
వాల్మీకి రామునికి 16 సుగుణాలు ఉన్నాయి అన్నాడు. అవి ఏమేమిటి? 1. గుణవంతుడు. 2. వీరుడు 3. ధర్మజ్ఞుడు. 4. కృతజ్ఞుడు 5. సత్య వాక్య పరిపాలకుడు 6. ధ్రుఢవ్రతుదు 7. ఉత్తమ చరిత్ర కలవాడు 8. సర్వ భూతముల హితము కోరేవాడు 9. విద్వాంసుడు 10. సమర్ధుడు 11. ప్రియవర్తనుడు 12. ఆత్మవంతుడు `13. జితక్రోధుడు 14. ద్యుతిమంతుడు 15. అసూయ లేనివాడు 16. ఈ సృష్టిలో ఎవరి కోపాన్ని చూసి దేవతలు కూడా భయపడతారో అటువంటి వాడు.
ఈ పదహారు లక్షణాలు ఒక మనిషిలో ఉండడం ఏ కాలం లో నైనా అరుదు. ఇన్ని మంచి గుణాలు కలవాడు కాబట్టే రాముడు మర్యాదా పురుషోత్తముడు అయ్యాడు. ఒక మంచి కొడుకు, ఒక మంచి భర్త, ఒక మంచి అన్న, ఒక మంచి పాలకుడు అయ్యాడు. రాముని గురించి చెప్పే ఏ పదమూ కూడా సామాన్యమైనది కాదు. ప్రతి శబ్దమూ విసేషమైనదే. "రామ" పదం హిందువుల రోమ రోమానా నాటుకొని వుంది. ఏ చిన్న కష్టం వచ్చినా' "అయ్యో రామ " అనే మాట మన నోట్లోంచి వస్తుంది. అలసిన వేళల కూడా "శ్రీరామ చంద్ర" అని స్మరిస్తాము. అంతగా మనం రాముణ్ణి మన సొంతం చేసుకున్నాం.
వాల్మీకి రామాయణం 34వ దినము
వాల్మీకి రామాయణం
34వ దినము, బాలకాండ.
కాపిలం రూపం ఆస్థాయ ధారయత్య అనిశం ధరాం |
తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజా ||
ఆ సగరులకి ఎంత తవ్వినా అశ్వం కనబడకపోయేసరికి వాళ్ళు సగరుడికి వద్దకు వెళ్ళి జెరిగినది చెప్పారు. నాకు గుర్రం తప్పకుండా కావాలి, మీరు పాతాళం దాక తవ్వెయ్యండని చెప్పి వాళ్ళని మళ్ళి పంపాడు. ఆ సగరులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతున్న వాళ్ళకి, ఈ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశా గజం అనే ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకి వెళ్ళగా, వాళ్ళకి మహా పద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది, అలాగే పడమర దిక్కున సౌమనసం అనే ఏనుగు, ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగుకి ప్రదక్షిణ చేశారు. నాలుగు దిక్కులలో గుర్రం ఎక్కడా కనపడలేదు. ఈ సారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వగా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలొ సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు. ఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉంది. కాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగాలించాడని ఆ సగరులు భావించి ఆయనని కొట్టడానికి పరుగుతీసారు. వెంటనే ఆ కపిల మహర్షి ఒక 'హుం'కారం చేసేసరికి ఈ 60,000 మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు.
ఎంతకాలమైన సగరులు రాకపోయేసరికి, ఆ సగరుడు అంశుమంతుడిని పిలిచి వెతకమన్నాడు. అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడు. వాళ్ళకి ఉత్తర క్రియలు జెరగలేదు కనుక నీళ్ళు తీసుకువద్దామని బయలుదేరగా, ఆ సగరుల మేనమామ అయిన గరుక్మంతుడు ప్రత్యక్షమై, ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ ఇచ్చినా నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు, వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగా జలాలతో తర్పణ ఇవ్వాలి. కాబట్టి గంగని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. సరే అని ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్ళి యాగం పూర్తి చేశారు. తన కుమారులు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగరుడు చాలా బాధ పడ్డాడు. తరవాత ఆయన ఒక 30,000 వేల సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడు, ఆయన తరవాత అంశుమంతుడు రాజయ్యాడు, ఆయన 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అలా తపస్సులోనే శరీరం వదిలేశాడు. ఆయన తరవాత వచ్చిన దిలీపుడు 30,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు కాని గంగని తీసుకురాలేకపోయాడు. దిలీపుడి తరవాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకి అప్పజెప్పి, గోకర్ణ క్షేత్రంలో 1000 సంవత్సరాలు తపస్సు చేయగా, ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనం ఇచ్చాడు. అప్పుడు భగీరథుడు " నాకు కుమారులు లేరు, కాబట్టి మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివ్వు అన్నాడు, అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీదకి పంపించు" అన్నాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు " నీ మొదటి కోరికని నేను తీరుస్తాను, కాని గంగని భూమి మీదకి వదిలితే, దాన్ని పట్టగలిగేవాడు ఎవడూ లేడు, కేవలం శివుడు తప్ప. కావున నీవు శివుని గూర్చి తపస్సు చెయ్యి, ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతాను" అని అన్నాడు.
E-mail Newsletter
Sign up now to receive breaking news and to hear what's new with us.
WERE SOCIAL
Labels
- Quotes
- అయ్యప్ప
- ఆంజనేయ
- ఆరోగ్యం
- కథలు
- కార్తిక
- కృష్ణ
- క్షేత్ర మహత్యం
- చరిత్ర
- జ్యోతిష్యం
- తత్వశాస్త్రం
- తిరుప్పావై
- నది
- నవగ్రహ
- నాగేంద్రుడు
- నీతి
- నొములు - వ్రతములు
- పండుగలు
- పద్యాలు
- పాట
- పాటలు
- పుణ్యక్షేత్రం
- పురాణాలు
- పుష్యం
- పూజలు
- బుధ
- బ్లాగ్
- భక్తి
- భగవత్గితా
- భజన
- భాగవతం
- మంత్రాలు
- మహాభారతం
- మాఘ
- మార్గశీర్షం
- మోక్షమార్గం
- రామాయణం
- వార్తలు
- శని
- శివ
- శ్రావణమాసం
- సంస్కృతి
- సూక్తులు
- సూర్య
- హయగ్రీవ