Showing posts with label నొములు - వ్రతములు. Show all posts
Showing posts with label నొములు - వ్రతములు. Show all posts

Wednesday 22 February 2017

* పుత్ర సంతానం కోసం “పుత్ర గణపతి వ్రతం”



పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు . మంచి సంతానం కోసం, సంతానం లేని వల్లూ సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలూ చెబుతున్నాయి.

చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వాళ్ళ సంతానం కలుగుతుంది అని నమ్మకం.

పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ఫాల్గుణ శుద్ధ చవితి ప్రత్యేకతగ కనిపిస్తూ వుంటుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. పుత్ర సంతానం కావాలనుకునే వాళ్లు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ‘పుత్రగణపతి వ్రతం’ ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

వారసుడు కావాలనే కోరిక … తమ తరువాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికిగాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ వుంటుంది. ఈ విషయంగా ఎక్కువకాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు, పుత్ర గణపతి వ్రతం జరుపుతుంటారు. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి … గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది .. గుమ్మానికి తోరణాలుకట్టి .. పూజామందిరాన్ని అలంకరించాలి.

ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను … పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.

పూర్వం మహారాజులు … చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్లంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించేవాళ్లు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్లు పుత్ర సంతానం కోసం ఆరాటపడే వాళ్లు. ఇందుకోసం వాళ్లు ‘ఫాల్గుణ శుద్ధ చవితి’ రోజున ‘పుత్ర గణపతి’ వ్రతాన్ని ఆచరించే వాళ్లు.

అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.

ఇక రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా … రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా ‘పుత్రగణపతి వ్రతం’ మాత్రం నాటి నుంచి నేటి వరకూ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి, పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశస్థాపన చేసి … శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.

ఇంచుమించు వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి. బుద్ధిమంతుడు … జ్ఞానవంతుడు … ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతికాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు.

ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకితభావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

Saturday 31 December 2016

మంగళసూత్రం’వెనుక దాగి ఉన్న శాస్త్రీయమైన కారణాలు.



హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోబాటూ వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం.
వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.
" మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! "


భారతదేశంలో వివాహం వెనుక ఎంతో శాస్త్రీయత ఉంది. ఇద్దరు వ్యక్తులకు వివాహం చేసేటప్పుడు చూసేది కేవలం రెండు కుటుంబాలు, రెండు దేహాల కలయిక కానే కాదు, అంతర్గతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య గాఢమైన శక్తి సంబంధిత అనుకూలత ఉండాలన్నదే వారి ఉద్దేశం. అప్పుడే వివాహాన్ని నిశ్చయించే వారు. చాలా సార్లు అసలు వివాహం చేసుకోబోతున్న ఇరువురు ఒకరినొకరు పెళ్లి రోజు దాకా చూసుకునే సందర్భం కూడా ఉండేది కాదు. అయినా అది అంత ముఖ్యం కాదు, ఎందుకంటే వారి మధ్య సయోధ్యను కుదిర్చిన వారు, ఆ జంట కంటే ఆ విషయం బాగా తెలిసిన వారు. వధూవరుల వివాహ సమయానికి మంగళసూత్రాన్ని సిద్ధం చేసేవారు.
 

‘మంగళ సూత్రం' అనగా పవిత్రమైన సూత్రం'(దారం). ఈ పవిత్రమైన సూత్రాన్ని తయారుచేయటం విస్తృతమైన శాస్త్రం. కొన్ని వడికిన నూలు దారాలను తీసుకొని, పసుపు కుంకుమలు రాసి ఒక పద్దతిలో శక్తిమంతం చేస్తారు. ఒకసారి ముడి వేస్తే ఈ జీవితానికే కాక ఆపైన కూడా నిలిచి ఉండేలా మంగళ సూత్రం తయారుచేసే వారు. ఆ ఇద్దరిని కలిపి ముడి వేసుందుకు వారు వినియోగించిన విధానాలు కేవలం భౌతిక, మానసిక స్థాయిలోనే కాక వారి నాడులు కూడా కలిపి ముడి వేయటం వల్ల అదే జంట అనేక జీవితాల పర్యంతం అలా కలిసి ఉంటుంది.
 
భౌతికమైన, మానసిక, భావావేశ స్థాయిల్లో చేసేది ఏదైనా మరణంతో పూర్తి అయి పోతుంది. కానీ శక్తి స్థాయిలో చేసేది శాశ్వతంగా మిగులుతుంది. ఎంతో గాఢంగా, మన అవగాహనకు అందని విధంగా ఎలా ముడి వేయాలో తెలిసిన వారిచే ముడి వేయటం వల్ల ఆ బంధం గురించి పునరాలోచన చేసే ప్రశ్నే లేదు. ఇదే క్రతువు ఈనాడూ జరుగుతున్నా ఏమీ తెలియని వారిచేత జరుపుతున్నారు. వివాహం వెనుక ఉన్న శాస్త్రీయతను కోల్పోవటం వల్ల అది నిరర్ధకం. ఈ రోజుల్లో మనుషులు ప్రేమ గురించి మాట్లాడేటపుడు, వారు కేవలం భావోద్వేగపరంగానే మాట్లాడుతున్నారు. భావోద్వేగాలు నేడొకటి చెపితే రేపొకటి చెప్తాయి. నేడు మనం జీవిస్తున్న సంస్కృతిలో ఒకే జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసి ఉండక్కరల్లేని పరిస్థితి వచ్చింది.
 

వివాహం అంటే స్వార్థజీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షలు చెబుతారు. ఆధ్మాత్మిక, సాంఘీక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా, చనువుగా, ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వచించారు. జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువ కాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పట్టిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్ధేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. ఈ ప్రమాణాలను త్రికరణ శుద్దిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది. ఆ సంబంధం నిండునూరేళ్ళు పవిత్రంగా పచ్చగా ఉంటుంది.
 
వివాహ తంతులో మాంగల్య ధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాలి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతో బాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి. ఇవి కులం, వంశానుసారం పలురూపాల్లో ఉంటాయి. మానవులకు మనువాడం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. పెళ్లికోసం సమకూర్చుకున్న, ఇవచ్చిపుచ్చుకున్న ఇతర వస్తువులు, ఆభరణాలు అన్నీ రూపాంతరం చెందినా చివరి వరకూ వెంట ఉండేది తాళిబొట్టు మాత్రమే. 🙏🌺🙏

Friday 30 December 2016

పుష్య మాసం


చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్ప బడింది. ఈ మాసం లో రైతులకి పంట చేతికి వచ్చే కాలం కావున ధాన్య లక్ష్మి, ధన లక్ష్మి రూపం లో లక్ష్మీ దేవి ని విష్ణు మూర్తి సమేతం గా పూజిస్తారు.

ఈ మాసం లో గృహ ప్రవేశాలు, పెళ్ళిళ్ళు, శంఖు స్థాపనలు వంటి శుభకార్యాలు చేయడానికి వీలులేనప్పటికీ సాధారణ పూజలు, పెద్దలని స్మరించుకొని చేసే అన్ని పుణ్య కార్యాలకి విశేష మాసం గా చెప్పవచ్చు. పుష్య మాసానికి అధిపతి అయిన శని మరియు నక్షత్రాదిపతి అయిన గురువు ని పూజించడం వలన విశేష ఫలితం లభిస్తుంది.. పుష్యమాసం లో శని గ్రహానికి అమావాస్య రోజున తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నివృత్తి జరుగుతుంది. వీటి తో పాటుగా వస్త్ర దానం, తిల దానం, అన్న దానం చేయడం వలన శని యొక్క దోషాలు తొలగి శుభఫలితాలు పొందవచ్చు. పుష్య పౌర్ణమి రోజున నది స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగుతాయి . ఈ రోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికం గా ఉంటుంది అని చెప్పబడింది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేది పుష్య మాసం లోనే ఉత్తరాయణ పుణ్య కాలం ప్రవేశించేది ఈ మాసం లోనే. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశి లో ప్రవేశించడమే మకర సంక్రాంతి.

Thursday 29 December 2016

రుక్మిణీ కళ్యాణం



భాగవతంలో దశమస్కంధము ఆయువుపట్టు. ఈ దశమ స్కంధమును పూర్వోత్తర భాగాములని మరల రెండుగా విభజించారు. పూర్వభాగమును రుక్మిణీకళ్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందు వలన, చూసినందు వలన, వినినందు వలన, చదివినందు వలన కలిగే ఫలితం చెప్పడానికి మాటలు చాలవు. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడయిన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణీకళ్యాణ ఘట్టమును ప్రారంభం చేస్తూ పోతనగారు

వినుము విదర్భదేశమున వీరుఁడు కుండినభర్త భీష్మకుం
డను నొక దొడ్డరాజు గలఁ; డాతని కేవురు పుత్రు లగ్రజుం
డనయుఁడు రుక్మినాఁ బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలై
మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై.

విదర్భ దేశమును భీష్మకుడు అనే దొడ్డ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు అయిదుగురు కుమారులు. వాళ్ళ పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. వీరికి చిట్టచివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి.అయిదుగురి చెల్లెలయిన రుక్మిణి పెరిగి పెద్దది అవుతోంది.

పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబు లందు;గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;
రమణీయ మందిరారామ దేశంబులఁ బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు; సదమల మణిమయ సౌధభాగంబుల లీలతో భర్మడోలికల నూఁగుబాలికలతోడఁ జెలరేగి బంతు లాడ శారికా కీర పంక్తికిఁ జదువుఁ జెప్పు బర్హి సంఘములకు మురిపములు గరపు మదమరాళంబులకుఁ జూపు మందగతులు. ఆతల్లి చిన్నప్పటినుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది. రుక్మిణీ దేవి అంతఃపురము నుండి ఎప్పుడూ డోలు, సన్నాయి వినబడుతూనే ఉండేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్నెపిల్ల సువాసిని అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపుకుంకుమలు నిలబడతాయి. ఆవిడ గుజ్జనగూళ్ళను ఒండించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతూ ఉండేది. ఆడవాలు చేసే పనులు పరమ సౌకుమార్యంతో ఉంటాయి. ఆవిడ లతలకు, తీగలకు చక్కగా పందిరి వేసేది. ఎప్పుడూ ఊయలలు ఊగుతూ ఉండేది చిలుకలకు పలుకులు నేర్పుతుండేది. హంసలకు నడకలు నేర్పేది. ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

Thursday 22 December 2016

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం
దీక్ష 41 రోజులే ఎందుకుచేయాలి. క్రిందచదవండి.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Ayyapa

గణపతి ప్రార్ధన


శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మయే !!

అయ్యప్ప స్వామి వారి ప్రార్ధన

అఖిల భువన దీపం భక్త చిత్తాజ్జ సూర్యం
సుర గణ ముని సేవ్యం తత్త్వ మస్యాది లక్ష్యం !
హరి హర సుత మీశం తారక బ్రహ్మ రూపం

శబరి గిరి నివాసం భావయే భూత నాదమ్ !!

|| అరిషడ్వర్గాల అంతానికే అయ్యప్పస్వామి దీక్ష ||
మానవ జన్మకి పరమార్థం మోక్షాన్ని పొందడమే - అందువలన ఆధ్యాత్మిక సాధనలో అనుక్షణం అడ్డు తగిలే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్యర్యాలనే అరిషడ్వర్గాలని అధిగమించడం కోసమే అయ్యప్ప దీక్షను వహించాల్సి వుంది.

"జీవానాం నరజన్మ దుర్లభం" - సకల చరాచర జీవరాశులన్నిటికన్నా మానవుడే శ్రేష్టుడు గనుక, ఋషి అంతటి వాడవ్వల్సిన మనిషి మసై, బూడిదై పోకూడదని, ఈ జన్మలోనే ముక్తిని పొంది "మానవుడు తన జన్మను చరితార్థం చేసుకోవాలనే" ఉద్దేశంతో 41 రోజులు దీక్షను ఆచరించి, ఆ దీక్షలో పొందిన ఆధ్యాత్మిక ఆనంద, అనుభవాలను మానవుడు తన జీవితకాలమంతా పొంది తద్వారా మోక్షాన్ని పొంది తరించాలన్నదే భగవంతుని ఆంతర్యం.

ఈ దీక్షా కాలంలో కఠిన బ్రహ్మచర్యాన్ని, శీతలోదకస్నానం(చన్నీటి స్నానం), భూతలశయనం, ఏకభుక్తం, స్వయంపాకం వంటి పలు నియమాలు పాటిస్తారు. ఇంద్రియ నిగ్రహం కోసం 41 రోజులు దీక్ష తీసుకుని స్వామి వారి దర్శనానికి వెళ్ళడంలో మనిషిని శారీరకంగా, మానసికంగా, దృఢంగా, క్రమశిక్షణలో ఉండేందుకు ఈ అయ్యప్ప దీక్ష ఎంతో ఉపకరిస్తుంది. శరీరంలో ఉన్న సమస్త కల్మషాలను దూరం చేసి శరీరాన్ని తేలిక పరిచే ఆరోగ్య నిధానం అయ్యప్ప దీక్షా విధానం.

భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు నియమనిష్ఠలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో, స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు జామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసి మాల, నుదుట విబూది గంధం బొట్టు ధరిస్తారు. దినచర్యలో అధిక భాగం పూజ, భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటిక నేల మీద పడుకుంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలను ఆచరిస్తారు.

కుల మత భేదాలకు అతీతంగా, జాతి, భాషల వ్యత్యాసం లేకుండా శాంతిప్రియులై, నియమ నిబంధనలతో కూడిన జీవన విధానముతో, నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ, సేవలు చేయుచూ జీవన శైలిని సుగమనము చేసుకోవటమే అయ్యప్ప దీక్షలోని ప్రాశస్త్యం. మానవుని మానసిక ప్రవృత్తులను, ఇంద్రియ వికారములను, భవధారలను, భగవంతుని వైపునకు మరల్చి నిత్యానందమును అతి సహజముగా సిద్ధింపజేయుటే అయ్యప్ప దీక్షలోని విశిష్టత.

Wednesday 21 December 2016

చాలామందికి ఈ సందేహం వుంది



కొందరు లలితా సహస్రనామ పారాయణ ప్రతి నిత్యం చేస్తుంటారు.  కొందరు రెండు పూటలా చేస్తారు

కొందరు ప్రత్యేక దినాలలో…ఇలా రకరకాలుగా…

ఈ మధ్య లలితా సహస్రనామ పారాయణ చేసేవారి సంఖ్య ఎక్కువైందనే చెప్పొచ్చు.

వీరిలో కొందరికి మామూలుగా నిత్యం మహా నైవేద్యం పెట్టే అలవాటు వుంటుంది.

ఇలాంటివారికి ఏ సమస్యాలేదు.కొందరికి ఇంట్లో మడిగాగానీ, నిష్టగాగానీ చెయ్యటం కుదరదు.

ఒక్కొక్కళ్లకి ఒక్కో రకం ఇబ్బంది.ఇలాంటివారికి లలితా సహస్రనామం పారాయణ చేసినప్పుడు అనేక అనుమానాలు.

మహా నైవేద్యం పెట్టలేక పోయామే..అసలు అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి..ఏదో ఇవాళ ఒక పండు పెట్టేశాను.

సరిగ్గా చేశానో లేదో…ఇలా గుంజాటన పడతారు. అందరికీ మహా నైవేద్యం పెట్టటం అన్నివేళలా కుదరకపోవచ్చు.నిత్యం పారాయణ చేసేవారు తొందరగా అయ్యేది ఏదైనా చేసి పెట్టవచ్చు.అమ్మవారిని హరిద్రాన్నైక రసికా అని కీర్తిస్తాం.పెసర పప్పు వేసిన పులగం నైవేద్యం పెట్టవచ్చు.అదీ కుదరకపోతే కర్జూర పండు నైవేద్యం పెడితే మహా నైవేద్యం పెట్టినట్లేట.ఒక్కొక్కసారి అవి కూడా వీలు పడకపోవచ్చు..సమయానికి దొరకక, తెచ్చినవి అయిపోయి వగైరా ఏ కారణ వల్లనైనా.అప్పుడు వీలయితే ఆవుపాలలో, లేదా ఇంట్లో వుండే పాలల్లో తేనె కలిపి నైవేద్యం పెట్టవచ్చు.అందుబాటులో వున్న ఏ పండయినా నైవేద్యం పెట్టవచ్చు.అమ్మవారికి కావలసినది భక్తికానీ ఏమి పెట్టాము అన్నది కాదు.మనం నిండు మనసుతో భక్తిగా ఏదైనా సమర్పించవచ్చు.

కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు వుంటాయి.చంద్ర దోష పరిహారార్ధం కొందరు పౌర్ణమినాడు చంద్రుని లలితా పరమేశ్వరి రూపంలో పూజించి, ఆరుబయట చంద్ర కిరణాలు పడే చోట పూజ చేసి పాలు, బెల్లంతో చేసిన పరవాణ్ణం నైవేద్యం పెట్టి అందరికీ పెట్టి వారు తింటారు.అలాగే నవరాత్రులలో అమ్మవారిని పూజించేవారు మినప గారెలు తప్పనిసరిగా నైవేద్యం పెడతారు.శుక్రవారం నియమంగా పారాయణ చేసేవారు అమ్మ గుడాన్నప్రీత మానస కనుకబెల్లం వేసిన పరనాణ్ణం నైవేద్యం పెడతారు.

నిత్యపారాయణకి వీలయితే ఏమైనా చెయ్యవచ్చు.. వీలుకానప్పుడు భక్తిగా ఏది సమర్పించినా పరవాలేదు

నైవేద్య విశిష్టత, పద్ధతి ఎలాగో మీకు తెలుసా?

Offerings to god


మనం రోజూ తినే తిండి అనేక సంక్లిష్ట దశాభేదాల్ని దాటుకొని అంతిమంగా మన నోట్లోకొచ్చిపడుతున్నది. ఆ యావత్తు దశాభేదాల్లోను మనిషి చేసే కృషికి అడుగడుగునా సహకరిస్తున్న భగవంతుని లీలా విశేషం ఉంది. ఆ లీలావిశేషమే లేకపోతే మనం దున్నినా విత్తలేం ... విత్తినా మొక్కలు రావు ... వచ్చినా ధాన్యం పండదు ... పండినా దాన్ని ఇంటికి తెచ్చుకోలేం ... తెచ్చుకున్నా తినలేం ... ఇలా అడుగడుగునా మనం అత్యంత ప్రాథమికమైన తిండి అవసరాల కోసం భగవంతుని కృప మీద ఆధారపడి ఉన్నాం. అందుకే ఆ ఆహారద్రవ్యాల్ని ఆహారరూపంలోకి మార్చుకోగలిగిన తరువాత భగవంతుణ్ణి విధివిధానంగా పూజించి వండినవాటిని భగవంతుడి సన్నిధిలో పెట్టి "హే భగవాన్ ! ఇది నీ దయామృతవర్షం. మమ్మల్ని బతికించడం కోసమే నువ్వు దీన్ని సృష్టించావు. నీ ప్రసాదం కావడం చేత ఇది పరమ పవిత్రమైనది." అని కృతజ్ఞతలు చెప్పుకొని దాన్ని భుజించడం ఉత్తమం. ఈ విధమైన స్తోత్రం చేత ఆయన మిక్కిలి సంతోషిస్తాడు. వారికి ఈ జన్మలోనే కాక రాబోయే జన్మల్లో కూడా ఆహారాదులకు లోపం లేకుండా చూసుకుంటాడు. వారి వంశంలో కూడా ఏ విధమైన లోటూ ఉండదు.

ఈ విధమైన హృదయపూర్వక భగవన్నివేదనకి హిందూధర్మంలో నైవేద్య సమర్పణ అని పేరు. నైవేద్య సమర్పణలో కొన్ని సంప్రదాయాలున్నాయి. ముఖ్యంగా
ఇంట్లో నైవేద్యంగా సమర్పించబడే ఆహారపదార్థాలు శాకాహారమైనా కావచ్చు. మాంసాహారమైనా కావచ్చు. మొత్తం మీద మనం తినేదే పెట్టాలి. శాకాహారమే అయి ఉండాలనే నియమమేమీ లేదు. అయితే కొందరు మాంసాహారాన్ని ఎందుకు వద్దంటారంటే,  మాంసాహారాన్ని సమర్పించేవారు సాధారణంగా అబ్రాహ్మణులై ఉంటారు. మనం భగవంతుడికి ఏది సమర్పిస్తే అదే మనకి వచ్చే జన్మలో వందరెట్లుగా సంప్రాప్తమౌతుంది. కనుక వారు వచ్చే జన్మలో కూడా మాంసాహార కుటుంబాలలోనే జన్మించాల్సి వస్తుంది. అతిమాంసాహార వ్యసనం వల్ల మరుజన్మలో జాతకంలో సర్పదోషాలు ప్రవేశిస్తాయి. ఆధ్యాత్మిక పురోగతికి అదొక పెద్ద ఆటంకమని పూర్వీకులు భావించారు. కాని భవిష్యపురాణాది గ్రంథాల్లో చెప్పిన ప్రకారం ... కలియుగంలో బ్రాహ్మణుల్లో కంటే అబ్రాహ్మణుల్లోనే ఎక్కువమంది ఆధ్యాత్మిక మహాపురుషులు జన్మిస్తారు. కాబట్టి యుగధర్మాన్ని బట్టి అదొక లోపంగా భావించనక్కరలేదు.

ద్రవ్యశుద్ధి చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏ విధమైన ధనంతో ఆ ఆహారాన్ని సిద్ధం చేశారు? అది అక్రమార్జితమా? సక్రమార్జితమా? హింసార్జితమా? అహింసార్జితమా? ద్రవ్యశుద్ధి లోపించిన నైవేద్యాల్ని భగవంతుడు తిరస్కరిస్తాడు. అలాగే తమకి మధుమేహం ఉంది గదా అని దేవుడికి తీపిలేని వంటలూ, లేదా తమకి రక్తపోటు ఉంది గదా అని ఆయనకి ఉప్పువెయ్యని వంటలూ నైవేద్యంగా సమర్పిస్తూంటారు. అది అవాంఛనీయం. ఇందాక చెప్పిన సూత్రం ప్రకారం మనం దేన్ని సమర్పిస్తామో దాన్నే ఆయన వందరెట్లుగా మనకి తిరిగి యిస్తాడు కాబట్టి అవే మధుమేహం, రక్తపోటూ మనకి మరుజన్మలో కూడా సంప్రాప్తిస్తాయి. దేవుడికి ఏది పెట్టినా, ఎంత పెట్టినా ఫర్వాలేదనే అపోహలో చాలామంది హిందువులు బతుకుతున్నారు. అందుచేత ఏదైనా దైవకార్యం వచ్చినప్పుడు వారు వంటకాల్లో తగినన్ని సంబారాలు వెయ్యకుండా మానవమాత్రుడెవడూ నోట్లో వేసుకోలేని విధంగా పదార్థాలు వండి వాటినే ఇంట్లోను, దేవాలయాల్లోను సమర్పిస్తున్నారు. దేవుడికి ఏం పెడతామనేది, ఎంత పెట్టాలనేది మన స్థితిగతుల్ని బట్టి నిర్ణయమైపోయే ఉంటుంది.

హైదరాబాదు బోనాల్లో అమ్మవారు పూనినప్పుడు "నీకేం కావాలి తల్లీ ?" అని భక్తులడిగారు. "నాకీ మధ్య మాంసం పెట్టడం మానేశారేంట్రా?" అనడిగారు అమ్మవారు. "జీవాల్ని బలివ్వడం మీద ప్రభుత్వం నిషేధం విధించింది తల్లీ ! శాకాహారంతో తృప్తిచెంది మమ్మల్ని కాపాడవమ్మా !" అని వేడుకున్నారు భక్తులు. అమ్మవారు శాంతించి "సరే ! అలాగే కానివ్వండ్రా" అన్నారు.
"శ్రియా దేయమ్, హ్రియా దేయమ్, భియా దేయమ్, సంవిదా దేయమ్" అన్నారు వేదఋషులు. అంటే కలిగినంతలో పెట్టాలి. ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమోననే జాగ్రత్తతో పెట్టాలి. భయభక్తులతో పెట్టాలి. ఆలోచించి పెట్టాలి అని అర్థం.

భగవంతుడు బాల్యప్రియుడు. అమ్మవారికి ఎనిమిదేండ్ల పిల్లగా దర్శనమివ్వడం అభిమతమైనట్లే అయ్యవారికి ఆరేళ్ళ పిల్లగాడుగా దర్శనమివ్వడం మిక్కిలి ఇష్టం. అందువల్ల ఒక చిన్నపిల్లవాణ్ణి ఎలా ముద్దుచేసి, బతిమాలి, వెంటపడి అన్నం తినిపిస్తామో అలాగే, అంతటి తత్పరతతోనే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదు. అవి వ్యాపారనిమిత్తం అనేక రకాలైన అశౌచాలకి గురై ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను అవి పనికిరావు. నిలవ ఉన్నవీ, పులిసిపోయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు. అయితే సంతోషీమాత తప్ప మిగతా అందరు దేవతల విషయంలోను కొత్తపెరుగుకు మినహాయింపు ఉంది. గ్రామదేవతలకైతే చద్దెన్నం మహాప్రీతికరం. తమ సొంత యింట్లోను, తమ సొంత ఆఫీసులోను నైవేద్యాన్ని తాము (గృహిణి, గృహస్థుడు/ యజమానుడు, యజమానురాలు) స్వయంగా కానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు కానీ సమర్పించాలి. ఇతరులు పనికిరారు. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరి. హారతి ఇచ్చాకనే నైవేద్యం సమర్పించాలి.

నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతాస్తోత్రం చదవాలి. ఏ దేవుడికైనా, దేవతకైనా పనికొచ్చే సర్వదేవతోపయోగి

 శ్లోకం :


శ్లో|| బ్రహ్మార్పణమ్ బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యమ్ బ్రహ్మకర్మసమాధినా ||
విష్ణుమూర్తికీ, ఆయన అవతారాలకూ అయితే ...
శ్లో|| పత్రమ్ పుష్పమ్ ఫలం తోయం యస్తే భక్త్యా ప్రయచ్ఛతి |
తద్భవాన్ భక్త్యుపహృతమ్ అశ్నాతి ప్రయతాత్మనః ||
శ్లో|| యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్ |
యత్ తపస్యామి గోవింద తత్కరోమి త్వదర్పణమ్ ||
శ్లో|| కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలమ్ పరస్మై
నారాయణేతి సమర్పయామి ||
ఏ కులస్థులైనా సరే, ఏ దేవీదేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు ...
ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి | అమృతమస్తు | అమృతోపస్తరణమసి స్వాహా |
అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి. తరువాత--
ఓమ్ ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ సాహా | ఓమ్ ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | ఓమ్ బ్రహ్మణే స్వాహా |
అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి/ దేవతకు చూపించాలి.
మధ్యేమధ్యే పానీయం సమర్పయామి
అని నైవేద్యం మీద మళ్లీ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి.
నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి.

దేవుడికి దిష్టి తగలకుండా ఆ కాసేపు గది తలుపు మూసెయ్యాలి. లేకపోతే భోజనప్రియత్వం గలవారు ఆ ఆహారపదార్థాల వంక కుతూహలంగా, సాభిప్రాయంగా చూసినప్పుడు వాటిల్లో రంధ్రాలేర్పడడం, రంగుమారడం జరుగుతుంది. ఆ మార్పుల్ని యోగులు మాత్రమే తెలుసుకోగలరు. ఒకటి-రెండు నిమిషాల తరువాత లోపలికకి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాల్ని బయటికి తీసుకురావాలి.

Sunday 18 December 2016

అర్జున విషాదయోగః 1 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)

Mahabharatam

ధృతరాష్ట్ర ఉవాచ : -

ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతా యుయుత్సవః,
మామకాః పాణ్డవాశ్చైవ
కిమకుర్వత సంజయ!

ధృతరాష్ట్రుడిట్లు పలికెను: ఓ సంజయా! నా వారలగు దుర్యోధనాదులను, పాండుపుత్రులగు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమి యగు కురుక్షేత్రమున జేరి యేమిచేసిరి?


సంజయ ఉవాచ :-

దృష్ట్వా తు పాణ్డవానీకం
వ్యూఢం దుర్యోధన స్తదా‌,
ఆచార్యముపసజ్గమ్య
రాజా వచనమబ్రవీత్‌.

ధృతరాష్ట్రునితో సంజయడిట్లు వచించెను :- అపుడు రాజైన దుర్యోధనుడు ప్యూహాకారము గాంచింపబడియున్న పాండవసేనను చూచి, తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు పలికెను.


పశ్యైతాం పాణ్డుపుత్రాణా
మాచార్య మహతీం చమూమ్‌,
వ్యూఢాం ద్రుపదపుత్రేణ
తవ శిష్యేణ ధీమతా.

ఓ గురువర్యా! బుద్ధిశాలియు, మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత ప్యూహాకారముగ రచింపబడియునట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమునుజూడుడు!


అత్రశూరా మహేష్వాసా
భీమార్జున సమా యుధి,
యుయుధానో విరాటశ్చ
ద్రుపదశ్చ మహారథః.

ధృష్ట కేతు శ్చేకితానః
కాశీరాజశ్చ వీర్యవాన్‌,
పురుజిత్కుంతి భోజశ్చ
శైబ్యశ్చ నరపుజ్గవః

యుధామన్యుశ్చ విక్రాంత
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్‌,
సౌభద్రో ద్రౌపదేయాశ్చ
సర్వ ఏవ మహారథాః

ఈ పాండవసేనయందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూర వీరులును పెక్కురు కలరు. వారెవరనిన - యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు. వీరందరును మహారథులే అయియున్నారు.


అస్మాకం తు విశిష్టా యే
తాన్నిబోధ ద్విజోత్తమ,
నాయకా మమ సైన్యస్య
సంజ్ఞార్థం తాన్‌ బ్రవీమి తే.

ఓ బ్రాహ్మణోత్తమా! ఇక మనసైన్యములో ప్రముఖులు, సేనానాయకులు ఎవరు కలరో వారలను జ్ఞాపకము కొరకు మీకు చెప్పుచున్నాను.(వినుడు)


భవాన్‌ భీష్మశ్చ కర్ణశ్చ
కృపశ్చ సమితింజయః,
అశ్వర్థామా వికర్ణశ్చ
సౌమదత్తి స్తథైవ చ

అన్యే చ బహవశ్శూరా
మదర్థే త్యక్తజీవితాః,
నానాశస్త్ర ప్రహరణా
స్సర్వే యుద్ధవిశారదాః.

మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వర్థమ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొరకు తమ తమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, అందరును యుద్ధసమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచట నున్నారు. 

త్రిమూర్తులు ,Trimurtulu



Brahmavishnumaheshwara

ఈ జగత్తంతా మాయకు అధీనమై ఉంటుంది. అందువల్లనే సంసారం సాగరమని తెలిసినా అందులోనే పడి కొట్టుకుంటూ మోక్షం కోసం ఎవరూ ప్రయత్నించరు. ఈ విషయంలో త్రిమూర్తులు కూడా అతీతులు కారు అని అంటుంది దేవీ భాగవతం ఆరోస్కంధం. అయితే కొద్దిగా మనసుపెట్టి ఆలోచిస్తే, మరికొంత కృషి చేస్తే మాయకు లోబడకుండా ఉండే ఉపాయం వివరిస్తోంది. మాయశక్తి మహిమ సామాన్యమైంది కాదు. ఎలాంటి వారైనా దానికి లొంగి పోవాల్సిందే. హిందూమతము సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు

* బ్రహ్మ - సృష్టికర్త
* విష్ణువు - సృష్టి పాలకుదు
* మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు

ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కధలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి. కాని ప్రధానమైన నమ్మకాలుగా క్రిందివాటిని చెప్పవచ్చును.


* బ్రహ్మ: సృష్టి కర్త. బ్రహ్మ ఉండేది సత్యలోకం. ఆసనం పద్మం. బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి. బ్రహ్మకు పత్ని సరస్వతి చదువుల దేవత. విష్ణువు నాభి లోని పద్మంనుండి బ్రహ్మ జనించాడు గనుక బ్రహ్మకు విష్ణువు జనకుడు.



* విష్ణువు: సృష్టి పాలకుడు. అంటే సృష్టిని నడిపించేవాడు. నివాసం వైకుంఠం. శయనించేది పాలకడలిలో ఆదిశేషునిపైన. పయనించేది గరుత్మంతునిపైన. సంపదల దేవతయైన లక్ష్మీదేవి విష్ణువునకు భార్య. ఆయన ఆయుధములు అయిదు. నారాయణుడు, వాసుదేవుడు వంటి ఎన్నో నామములు. వీటిలో వేయి ప్రధాన నామములు విష్ణు సహస్రనామ స్తోత్రముగా ప్రసిద్ధము. విష్ణువు యుగయుగాన అవతారాలెత్తి లోకంలో ధర్మం నిలుపుతాడు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వేంకటేశ్వరస్వామి ఇవి ప్రజలు ఎక్కువగా ఆరాధించే అవతారాలు.



* శివుడు: కాలాంతములో సృష్టిని అంతము చేస్తాడు (పునఃసృష్టికి అనుకూలంగా). ఉండేది కైలాసం. వాహనం నంది. త్రినేత్రుడు. తలపై గంగ. మెడలో సర్పము. చర్మాంబరధారి. భక్తసులభుడు. శివుని ఇల్లాలు పార్వతి జగజ్జనని. ఈశ్వరుడు, శంకరుడు, మహాదేవుడు, గంగాధరుడు, నీలకంఠుడు ఇవి ఈయన కొన్ని పేర్లు. వీరంతా ఒకే పరబ్రహ్మముయొక్క వివిధ స్వరూపములనికూడా పలుచోట్ల ప్రస్తావింపబడింది.


విశేషాలు


* ఒక పురాణ కధ ప్రకారం బ్రహ్మకు ఒక శాపం కలిగింది. కనుక బ్రహ్మను పూజించడం అరుదు. కాని త్రిమూర్తులను కలిపి పూజిస్తే దోషం లేదంటారు.
* ఇలా చేసే పూజలలో త్రిమూర్తి వ్రతం ముఖ్యమైనది.

పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము.

Poojaitems


1. గంటలు :

దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.

2.దీప హారతి:

దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. ” స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, మా బుద్ధిని ప్రభావితం చేయి” అని.

3. ధూపం

భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది.

4. కర్పూర హారతి

వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు.

5. గంధపు సేవ

ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం.

6. పూజ

దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కాని భగవంతునికి వీటితో పనిలేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.

7 పత్రం(శరీరము)

ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.

8 పుష్పం (హృదయము)

ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.

9 ఫలం (మనస్సు)

మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.దాన్నే త్యాగం అంటారు.

10. తోయం(నీరు)

భగవంతుని అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి.

11 కొబ్బరికాయలు

హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారము. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

12. నమస్కారము

చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.

13. ప్రదక్షిణము

ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.

Friday 16 December 2016

కనక వర్షం కురిపించే కనకధారా స్తోత్రం

kanakadara lakhsmi
ఇది జగద్గురువులు ఆదిశంకరాచార్యులు 
చేసిన లక్ష్మీ స్తోత్రం.
దీనిని నిత్యం చదివితే ఐశ్వర్యం 
లభిస్తుందని ఫలశృతి.
శ్రీ శంకరాచార్యులవారు తన బాల్యంలో, భిక్షకు వెళ్ళినప్పుడు ఒకరోజు ఒక బీదరాలైన స్త్రీ ఇంటికి వెళ్ళగా అక్కడ స్వామికి భిక్ష ఇవ్వడానికి ఆమె గ్గర ఏమీ లేకపోవడం వల్ల తన దగ్గర ఉన్న ఒక్క ఉసిరికాయని తెచ్చి, శంకరాచార్యుల వారికి భిక్షగా వేసింది. ఆమె భక్తికి, శ్రద్దలు చూసిన శంకరాచార్యులు, ఆమె దారిద్యం తొలగడానికి లక్ష్మీ దేవిని స్తుతించారు.
ఆ స్తోత్రానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ బీదరాలి ఇంటిలో కనక దారని కురిపించింది.
ఆ స్తోత్రమే ఈ కనకధారా స్తోత్రం ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించేవారికి, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది .

శ్రీ కనకధారా స్తోత్రమ్

1.వన్దే వన్దారుమన్దార—మిన్దిరాన్దకందలమ్
అమన్దానందసన్దోహ—బన్ధురం సింధురాననమ్.
2.అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయన్తీ—భృంగాఙ్గనేవ ముకుళాభరణం తమాలమ్
అంగీకృతాఖిలభూతి రపాఙ్గలీలా—మాంగల్యాదా స్తుమమ మఙ్గళదేవతాయాః.
3.ముగ్దా ముహు ర్విదధతీ వదనే మురారేః—ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా—సా మే శ్రియం దిశతు సాగరసమ్భవాయాః.
4.విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్ష—మానన్దహేతు రధికం మురవిద్విషో పి
ఈష న్ని షీదతు మయిక్షణ మీక్షణార్థం—మిన్దివరోదరసహోదర మిన్ధిరాయాః.
5.ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకున్ద—మానన్దకన్ద మనిమేష మనఙ్గతన్త్రమ్
ఆకేకరస్థితకనీనికపద్మనేత్రం—భూత్యై భవే న్మమ భుజఙ్గశయాఙ్గనాయాః.
6.కాలామ్బుదాళిలలితోరసి కైటభారే—ర్ధారాధరే స్ఫురతి యా తటిదజ్గ నేవ
మాతు స్సమస్తజగతాం మహనీయమూర్తి—ర్భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః.
7.బాహ్యాన్తరే మురజితః శ్రితకౌస్తుభే యా—హారావళీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతో పి కటాక్షమాలా—కల్యాణ మావహతు మే కమలాలయాయాః.
8.ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావత్—మాఙ్గల్యభాజి మధుసలాథిని మన్మథేన
మ య్యాపతే త్తదిహ మన్థర మీక్షణార్థం—మన్దాలసం చ మకరాలయకన్యకాయా.
9.దద్యాద్ధయానుపవనో ద్రవిణాంబుధారా—మస్మిన్నకిఞ్చనవిహఙ్గశిశౌ విషణ్ణే
దుష్కర్మఘర్మ మపనియ చిరాయ దూరం—నారాయణ ప్రణయినీనయనామ్బువహః.
10.ఇష్టా విశిష్టమతయో పియయాదయార్ధ్ర—దృష్టా స్త్రివిష్టపపదం సులభం లభన్తే
దృష్టిః ప్రహృష్టకమలోదరదీప్తి రిష్టాం—పుష్టిం కృషిష్ట మమ పుష్కరవిష్టరాయాః.
11.గీర్దేవతేతి గరుడధ్వజసుందరరీతి—శాకంభరీతి శశిశేఖరవల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితా యా—తస్యై నమ స్త్రిభువనైకగురో స్తరుణ్యై.
12.శ్రుత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై—రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై
శక్యై నమోస్తు శతపత్రనికేతనాయై—పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై.
13.నమోస్తు నాళీకనిభాననాయై—నమోస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై
నమోస్తు సోమామృతసోదరాయై—నమోస్తు నారాయణ వల్లభాయై.
14.నమోస్తు హే మామ్బుజపీఠికాయై—నమోస్తు భూమణ్డలనాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై—నమోస్తు శార్ ఙ్గాయుధ వల్లభాయై.
15.నమోస్తు దేవ్యై భృగునందనాయై—నమోస్తు విష్ణో రురసిస్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై—నమోస్తు దామోదర వల్లభాయై.
16.నమోస్తు కాన్త్యై కమలేక్షణాయై—నమోస్తుభూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై—నమోస్తు నందాత్మజ వల్లభాయై.
17.సంపత్కరాణి సకలేంద్రియ నందనాని—సామ్రాజ్య దాననిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితాహరణోద్యతాని—మా మేవ మాత రనిశం కలయంతుమాన్యే.
18.యత్కటాక్ష సముపాసన విధిః—సేవకన్య సకలార్థ సంపదః
సన్తనోతి వచనాంగమానసై—స్త్వాం మురారి హృదయేశ్వరీం భజే.
19.సరసిజనయనే! సరోజహస్తే!—ధవళతమాంశుక గంధమాల్యశోభే!
భగవతి! హరివల్లభే! మనోజ్ఞే!—త్రిభువనభూతికరి! ప్రసీదమహ్యమ్.
20.దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట—స్రగ్వాహినీ విమలచారు జలప్లుతాంగీం
ప్రాతర్నమామి జగతాం జననీ మశేష—లోకాధినాథ గృహిణీ మమృతాబ్థిపుత్రీమ్.
21.కమలే కమలాక్షవల్లభే త్వం—కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మామకించనానాం—ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయాః.
22.బిల్వాటవీమధ్య లసత్సరోజే—సహస్ర పత్రే సుఖ సన్నివిష్టాం
అష్టాపదామ్భోరుహ పాణి పద్మాం—సువర్ణ వర్ణాం ప్రణమామి లక్ష్మీ0మ్.
23.కమలాసన పాణినాలలాటే—లిఖితా మక్షరపంక్తి మస్య జంతోః
పరిమార్జయమాత రంఘ్రిణా తే—ధనికద్వార నివాస దుఃఖదోగ్ద్రీమ్.
24.అంభోరుహం జన్మగృహం భవత్యాః—వక్షస్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే—లీలాగృహం మే హృదయారవిందమ్.
25.స్తువన్తి యే స్తుతిభి రమూభిరన్వహం—త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికాం గురుతర భాగ్యభాజినో—భవంతి తే భువి బుధభావితాశయాః.
సువర్ణధారా స్తోత్రం య—చ్ఛంకరాచార్య నిర్మితమ్
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం—స కుబేరసమో భవేత్.
ఇతి శ్రీ మచ్చంకర భగవత్కృతమ్ కనకధారా స్తోత్రం


తిరుప్పావై ప్రవచనం 02 వ రోజు

తిరుప్పావై ప్రవచనం


02 వ రోజు - భగవంతుని రెండో స్థానం వ్యూహం(పాల్కడలి)
 ఆండాళ్ తిరువడిగలే శరణం

వ్రతనియమాలు
పాశురము

వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
మనిషి బాగుపడటానికి ఎన్నో మార్గాలు,  శాస్త్రాలలో  ఆవి కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తి యోగమని ఇలా ఎన్నో చెప్పబడి ఉన్నాయి. భగవంతుడే ఒక మార్గమని తీసుకుంటే వారు మర్గశీర్షంలో పయనిస్తున్నారు అని అంటారు. అలాంటి మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు. తల్లి అండలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపచేస్తాడు పరమాత్మ, కాని అలా జరగటానికి మన అంగీకారం కావాలి. మనలోని జ్ఞానం ద్వారా మనం నీవాడను నేను అని ఆయనకు చెప్పాలి.  మరి అలాంటి మార్గంలో  పయనించటానికి మనం ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి తెలియజేసింది ఈ ధనుర్మాస వ్రతంలో.  ఏమి చేయాలో ఏమి అవసరం లేదో చెబుతోంది ఈ పాటలో.

భగవంతుణ్ణి భగవన్మయుడని, పరమాత్మ అని, గోవింద అని ఇలా ఎన్నో పేర్లతో చెబుతారు. మనకు కనిపించే వివిద రూపాల్లో ఉంటాడు కాబట్టి భగవన్మయుడని అంటారు. "అణు:" అతి చిన్నరూపం నుండి "బృహత్:" అతి పెద్ద స్వరూపంగా ఉంటాడు కాబట్టి పరమాత్మనే అని అంటారు. "శబ్ద సహ" అతి సామన్యుడు పిలిస్తే అందుతాడు, "శబ్దాతిగ" చతుర్ముఖ బ్రహ్మకూడా కీర్తించ చేతకానివాడు, అందుకే ఆయనను గోవింద అని అంటారు.  మరి జగత్తు మొత్తం పరమాత్మ శరీరం కదా! మరి ఇక్కడ తగినవి- తగనివి అంటూ ఉంటాయా!!

ప్రకృతి స్వభావాన్ని బట్టి, ఆయా గుణాలను బట్టి సత్వం,రజస్సు మరియూ తమస్సు అనే గుణాలు ఉంటాయని గమనించాలి. సత్వం  జ్ఞానాన్ని, రజస్సు కోపాన్ని, తమస్సు అజ్ఞానాన్ని,బద్దకాన్ని ఇస్తాయి. మరి శరీరం ఈ పంచబూతాలతో తయారైనదే కదా, కాబట్టి ప్రకృతిలో ఉండే ఈ గుణాలు మనలో కూడా ఉంటాయి. కాని ఏదో ఒక గుణం పైన ఉండి నడిపిస్తుంది. సత్వం పెరిగితే మంచిది. ఇలా చెప్పటానికి మన చేతిలోని చూపుడు వేలును మనతో  పోలుస్తారు, బ్రోటన వేలును పరమాత్మతో పోలుస్తారు. ఇక తమస్సు,రజస్సు, సత్వ గుణాలను మిగతామూడు వెల్లతోపోల్చుతారు. ఈ మూడు గుణాలతో కలిసి ఉన్న చూపుడు వేలుని బ్రోటనవేలి తో కలిపే దాన్ని జ్ఞాన ముద్ర అంటారు. చిటికెన వేలు సత్వం కొద్దిగానే ఉంటుంది, రజస్సు-తమస్సు ఎక్కువగా ఉంటాయి. మరి బాగు పడటానికి సత్వం కావాలి, కొన్ని నియమాల్ని పాటించాలి.  నియమాలు మరి ప్రకృతిలోని గుణాలకోసమే కాక, మనల్ని ఆదర్షంగా తీసుకొనేవారు బాగు పడటానికి కూడా మనం పాటించాల్సి వస్తుంది. ఈ కృత్యా- అకృత్య వియోచనాలను మన ఆండాళ్ తల్లి ఈ పాటలో తెలియజేస్తుంది.

"వైయత్తు వాళ్ వీర్గాళ్!"  ఈ భుమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది. ఈ భూమి తామస గుణమిచ్చేది, ఇక్కడ ఉండగా సాత్వికగుణం కలగటం కుంపెటలో తామరపువ్వు పూసినట్లు అంటారు. చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతునితో చెప్పుతుంది ఈ విషయం రామాయణంలో. రావణ వధ అనంతరం సీతను తీసుకుపోవటానికి వచ్చిన హనుమ సీతాదేవితో, నివ్వు ఆజ్ఞ యివ్వు నిన్ను పీడించే ఈ రాక్షసమూకను ఒక్కసారి పని పడతాని అంటాడు, దానికి సీత ఇది వారి తప్పు కాదయా, వారు రావణుని అండలో ఉన్నారు, ఈ భూమిమీద ఉండగా తప్పు చేయడం సహజమేకదా, చివరికి చూసిరమ్మని చెబితే కాల్చివెల్లలేదా నీవు. దానికి హనుమ మరి నేనంటే ఏమో, కాని శ్రీరామ చందృడు కూడా తప్పు చేసినాడా అమ్మ అని అడిగాడు. సూర్పణక వచ్చినప్పుడు ఆమెతో రాముడి ప్రవర్తన మరి తప్పేగా, నేను ఏక పత్నివ్రతుడను అనిమాత్రం చెప్పక, తన తమ్ముడికేసి ఎందుకు చూపించాడు. ఇవ్వన్నీ కదా ఇన్ని అపచారాలకు దారి తీసింది అని హనుమంతుడితో చెప్పుతుంది.

"నాముం నం పావైక్కు" ఒకరిని కష్టపెట్టే వ్రతం కాదు, లోకుల వ్రతాలు వారి వారి సుఖాలకోసం చేస్తే ఈ వ్రతం లోకం అందరికోసం చేసేది. "శెయ్యుం కిరిశైగళ్ కేళీరో" మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి, " పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి"  పాల కడలిలోని సుకుమారం గా పవళించి ఉన్న వైకుఠనాథుని పాదాలను పాడదాం. ఆయనను మించినవారు ఇంకెవరూలేరు కాబట్టి "పరమన్" అని అంటారు.   ఎందుకంటే  మనల్ని కాపాడటానికి తాను మొదటగా పాదం వేసినది పాల్కడలిలోనేకదా! ఆయన పాదాలలో శంఖ, రథాంగ, కల్పక, ద్వజా, అరవింద, వజ్రా, అంకుష ఇత్యాదులు గుర్తులుగా  చేసుకొని ఉన్న ఆపాదాన్ని పాడుదాం. ఎలాగైతే శిశువు తల్లి స్తన్యాన్ని గుర్తిస్తాడో, భక్తుడు భగవంతుని పాదాలను గుర్తించగలిగి ఉండాలి. సుకుమారమైన నిద్ర అంటే లోక రక్షణకోసం తానుచేసే సాత్విక-యోగనిద్ర.  మనకోసం ఇంకా ఎమి చేస్తె బాగుపడతాం అని ఏర్పాటు చేసుకొన్న స్థానం పాల్కడలి.

వ్యుహం-పాల్కడలి


నిన్నటి నాడు నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇన్ని గుణాలు కల్గి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం, ఒక భూమి మీద నివసిస్తునాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేసారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్నవిత్తనం నుండి ఒకపెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఎర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది.

ఇవన్ని ఏవి లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్నరూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు, కర్మభారాలు మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరినేను వీళ్ళకు ఉపకారం చేయకుంటే ఎలా! కర్మతోలగాలంటే దేహం కావాలి, దేహం ఉండే నేల కావాలి, దాన్ని భోగ స్థానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావలి వాటినే భోగ్య ఉపకరణములు అంటారు.  ఇన్నింటిని తయారు చేనినవాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకొన్న స్థానాన్నే వ్యూహం అంటారు.

అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ద,ప్రత్ర్యుమ్న, సంకర్షన అనే నాలుగు పేర్లతో ఉంటాడు. సృష్టి, స్థితి, లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు, ఆ స్థానాన్నే పాల్కడలి అని కూడా అంటారు.

ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం. అక్కడ వాసుదేవ అనేరూపంతో సర్వం తన ఆదీనంలో పెట్టుకుంటాడు. అందులోంచి ఒక రూపం తీస్తాడు దానికి సంకర్షణ అని పేరు, ఇది ప్రళయం చేయటానికి శివునిలో తానుండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు, దానికి అనిరుద్ద అని పేరు సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు,   మరొక రూపం తీస్తాడు, దానికి ప్రత్యుమ్న అని పేరు సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇది ఇందృనిలో ఉండి చేస్తాడు.  అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు, ఆదిశేశువు పైన ఆయన ఉంటాడు. ఆర్తితో పిలిచేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.  ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడినుండి లోకరక్షణకై అవతారాలను పంపిస్తుంటాడు. అన్ని అవతారాలకు మూల స్థానం పాల్కడలియే. ఆయా అవతారల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతాడు. అందుకే అవతారాలను విభవములు అంటారు.

 ఆయన పాదలను పాడుదాం. కడుపు నిండి పోతుంది-  ఇక "నెయ్యుణ్ణోం పాలుణ్ణోమ్" నెయ్యి వద్దు పాలు వద్దు. "నాట్కాలే నీరాడి" తెల తెల వారు జామున లేచి స్నానం చేద్దాం.  "మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్" కాటుక,పూలు ధరించం, ఏవి విలాసాలో అవి వదిలేస్తాం. "శెయ్యాదన శెయ్యోమ్" మాపూర్వులు చెయ్యనివి ఏమి చెయ్యం - ప్రాచీణ ఆచారాలు మానెయ్యం " తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్" పుళ్ళవిరుపు మాటలు మాట్లాడం. "ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి" చాతనైనంత వరకు ధాన ధర్మం చేస్తాం. "ఉయ్యుమాఱెణ్ణి ఉగంద్" ఇవన్ని ఆనందంతో చేస్తాం.

 శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం

Thursday 15 December 2016

తిరుప్పావై మొదటిరోజు పాశురం


తిరుప్పావై

1.    పాశురము :


    *మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
    నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
    శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్
    కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
    ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్
    కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్
    నారాయణనే నమక్కే పఱై దరువాన్
    పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !

భావము : సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.


        తిరుప్పావైగీతమాలిక


    అవతారిక:

వ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము - మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.

    1వ మాలిక

        (రేగుప్తి రాగము -ఆదితాళము)

ప..    శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!
    భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!

అ.ప..    మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!
    మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!

1. చ..    ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని
    యశోదమ్మ యొడి యాడెడు - ఆ  బాల సింహుని
    నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని
    నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి

2. ఛ.    ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము
    పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము
    లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము
    మనసు పడిన వారెల్లరు - మార్గళి నీ రాడరండి.

Tuesday 6 December 2016

స్కందోత్పత్తి గర్భవతులు విన్నా, చదివినా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు

kumara


స్కందోత్పత్తి

1. తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా! సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్!! 2. తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్! ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః!! 3. యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా! తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా!! 4. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా! సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమా గతిః!! 5. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః! సాంత్వయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్!! 6. శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్సంతు పత్నిషు! తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః!! 7. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్త్రం హుతాశనః! జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్!! 8. జ్యేష్టా శైలేంద్ర దుహితా మానయిష్యతి తత్సుతమ్! ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః!! 9. తచ్చ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన! ప్రణిపత్య సురా స్సర్వే పితామహమపూజయన్!! ౧౦. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితమ్! అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః!! ౧౧. దేవకార్యమిదం దేవా సంవిధత్స్వ హుతాశన! శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ!! 12. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః! గర్భం ధారయ వై దేవి దేవతానాం ఇదం ప్రియమ్!! ౧౩. తస్యతద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్! దృష్ట్వా తన్మహిమానం శ సమంతాదవకీర్యత!! ౧౪. సమంతతస్తదా దేవీం అభ్యషించత పావకః! సర్వస్రోతా౦సి పూర్ణాని గంగాయా రఘునందన!! ౧౫. తమువాచ తతో గంగా సర్వ దేవా పురోహితం! అశక్తా ధారణే దేవా తవ తేజస్సముద్ధతం! దాహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథిత చేతనా!! ౧౬. అథాబ్రవీదిదం గంగం సర్వదేవ హుతాశనః! ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యతామ్!! ౧౭. శ్రుత్వా త్వగ్నివచో గంగా తమ్ గర్భమతి భాస్వరం! ఉత్ససర్జ మహాతేజః స్రోతోభ్యో హాయ్ తదానఘ!! ౧౮. యదస్యా నిర్గతం తస్మాత్ తప్తజాంబూనదప్రభం!! ౧౯. కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం! తామ్రం కార్ష్ణాయసం చైవ తైక్ష్ణ్యాదేవాభ్యజాయత!! ౨౦. మలం తస్యా భవత్ తత్ర త్రపుసీసకమేవ చ! తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత!! ౨౧. నిక్షిప్తమాత్రే గర్భే టు తేజోభిరభిరంజితం! సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణమభవద్వనమ్!! ౨౨. జాత రూపమితి ఖ్యాతం తదాప్రభ్రుతి రాఘవ! సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం! తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం!! ౨౩. త౦ కుమారం తతో జాతం సేంద్రా స్సహమరుద్గణాః! క్షీరసంభావనార్థాయ కృత్తికా స్సమయోజయన్!! ౨౪. తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం! దదుః పుత్త్రోయ మస్మాకం సర్వాసామితినిశ్చితాః!! ౨౫. తతస్తు దేవతా స్సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్! పుత్త్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయః!! ౨౬. తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే! స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలమ్!! ౨౭. స్కంద ఇత్యబ్రువన్ దేవాః స్కన్నం గర్భపరిస్రవాత్! కార్తికేయ౦ మహాభాగం కాకుత్స్థ జ్వలనోపమమ్!! ౨౮. ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికా నామనుత్తమమ్! షన్ణా౦ షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః!! ౨౯. గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తాదా! అజయత్ స్వేన వీర్యేణ దైత్యసైన్యగణాన్ విభుః!! ౩౦. సురసేనాగణపతిం తతస్తమతులద్యుతిం! అభ్యషించన్ సురగణాః సమేత్యాగ్ని పురోగమాః!! 31. ఏష తే రామ గంగాయా విస్తరోభిహితో మయా! కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ!! ౩౨. భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః! ఆయుష్మాన్ పుత్త్ర పౌత్త్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్!! ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్త త్రి౦శస్సర్గః!!

*** గర్భవతులు విన్నా, చదివినా  కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు.  ***

Friday 2 December 2016

పోలి స్వర్గం నోము

స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి. పురాతనకాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోన్న ఈ నోము, ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ, జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ... ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ వుంటుంది.

ఇక కథలోకి వెళితే ... ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్లు. ఆ అయిదుగు కోడళ్లలో చివరిది ... చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పూవులు కోయడం ... పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకూ దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది. పూవులు కోయడానికి ... పూజలు చేయడానికి ... అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త.సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా వుంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహా భక్తురాలిననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనకచేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున వుంచి, మిగతా కోడళ్ళను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది.ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి, ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్లింది. పోలి ఏ మాత్రం బాధపడకుండా, బావి దగ్గరే స్నానం చేసి ... పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి వున్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది.ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త, తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది. 

ఆ వెంటనే మిగతా కోడళ్లు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్లు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్లిపోయింది.అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు ... కార్తీక అమావాస్య వరకూ ప్రతి నిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయతీగా వస్తోంది. ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది.

విధి రాతని ఎవ్వరు తప్పించలేరు కదా అది జగం ఎరిగిన సత్యం? మరి అలాంటప్పుడు పూజలు ఎందుకు?

బ్రహ్మ రాసేటప్పుడే ఒక విషయం చెప్పాడు అదేమిటి అంటే బ్రహ్మ రాసిన బ్రహ్మ తప్పించలేదు కాని ఆ మనిషి తన పాప కర్మలవల్ల,దేవుడి జాపం వల్ల,అఖండమైన పుణ్యకార్యాల వల్ల తన రాతని మార్చుకునే శక్తీ బ్రహ్మ మనకు ఇస్తాడు
lord brahma

ఇదేలగా సాధ్యం

పూర్వం విదుముకుడు అనే రాజు ఉండేవాడు అతను చాల మంచి రాజు అయితే అయనకి 50 ఏళ్ళకి మృత్యు గండం ఉందని జ్యోతిష్కులు మహా పండితులు చెప్తారు,అయితే అయన గురువు ఉపదేశం వల్ల మృత్యుంజయ మంత్రం తెలుసుకుని జపించగా పైగా అతను ప్రజలకు చేసిన పుణ్యకార్యాల వల్ల అపమృత్యు దోషం పోయి ఆయుషు మంతుడు అవుతాడు.

ఎలాగా మనం బ్రహ్మ రాతని మనం మార్చగలం?

గుడిలో అర్చనలు,ప్రదక్షిణాలు,వ్రతాలూ నిత్యం ఇష్టదైవాన్ని జపించడం పురాణాలూ వినడం
బ్రహ్మ రాసిన రాత ఆపదలు తొలగించాలంటే లోకానికి శక్తిని ఇచ్చేది ఆదిపరాశక్తి జగన్మాతా అయితే ఆపదలు వస్తే ఆవిడా పాదాలను స్మరిస్తే ఆవిడా మన కష్టాలను తీర్చి  ఆపదలు దరికి రానీయకుండా చేస్తుంది

కార్యదీక్ష

🙏🏽🌹    *కార్యదీక్ష*   🌹🙏🏽
🍃🌺🌺🌺🙏🏽🌺🌺🌺🍃
కార్యసాధకుల విజయ రహస్యం- నిరంతర కృషి. మార్గంలో ఎదురయ్యే అడ్డంకుల్ని చూసి వారు వెనకడుగు వేయరు. వాటిని అధిగమించడానికి సమధిక ఉత్సాహంతో పనిచేస్తారు. వారు కర్మయోగులు.

జీవిని ఈశ్వరుడి వైపు నడిపించడమే యోగ లక్ష్యం. కర్మయోగులకు ముగ్గురు శత్రువులుంటారు. లోభ, మోహ, అహంకారాలే ఆ శత్రువులు. ఆ బారి నుంచి తప్పించుకుంటూ, సంయమనంతో ముందుకు సాగిన వారే లక్ష్యం చేరుకోగలరు. ఆంజనేయుడు మహా బలశాలి. సీతమ్మ జాడ తెలుసుకోవడం అనే మహత్కార్యంపై పయనమయ్యాడు. మార్గమధ్యంలో సురస అనే రాక్షసి అడ్డగించింది. అంతటి మహాబలుడూ తన శరీరాన్ని కుదింపజేసుకున్నాడు. సూక్ష్మరూపంలోకి మారడం ద్వారా, ఆ రక్కసి బారి నుంచి విముక్తుడయ్యాడు. తన లక్ష్యం సాధించడానికి ముందుకు సాగిపోయాడు.
మనిషి అనుకున్నది సాధించాలంటే, మొదట అహంకారాన్ని వీడాలి. కార్యసాధనలో పొరపాటు చేయడం ఎవరికైనా సహజం. అహంకారి తన తప్పును ఒక పట్టాన అంగీకరించడు. నిరహంకారి అవసరమైతే క్షమాపణ చెప్పడానికి వెనకాడడు. అందువల్ల అతడి గౌరవం ఇసుమంతైనా తరగదు. పైగా, అతడి నిజాయతీని అందరూ ప్రశంసిస్తారు.

కార్యసాధనకు పట్టుదల, ధైర్య స్థైర్యాలే కాదు- తగినన్ని ఉపాయాలూ అవసరమవుతాయి. అవి అపాయకరమైనవి, సమాజానికి కీడు చేసేవి కాకూడదు.

శ్రద్ధ, సద్భావనలు ఈశ్వర దర్శనానికి మార్గాలు. అందువల్ల భక్తుడు రామకృష్ణ పరమహంసలా నిత్యమూ అమ్మవారి సమక్షంలోనే ఉండగలడు. ఆ జగదంబను దర్శించగలడు. శిష్యుడు గురు కృప పొందడానికీ శ్రద్ధ అత్యవసరం. రామానంద స్వామిని గురువుగా ఎంచుకున్నాడు కబీరు. కానీ దీక్ష ఇవ్వడానికి, మంత్రోపదేశం చేయడానికి ఆయన అంగీకరించలేదు. అలా ఒక వ్యక్తికే దీక్ష ఇచ్చి శిష్యుడిగా స్వీకరిస్తే, మిగతా శిష్యులకు కోపం వస్తుందని ఆయన అభిప్రాయం. రామానందులు రోజూ గంగలో స్నానం ఆచరించేవారు. ఒకరోజు ఆయన అక్కడికి వెళ్లిన సమయంలోనే, కబీరు ఆ నది ఒడ్డున ఇసుకలో పడుకున్నాడు. గంగలో స్నానానికి దిగబోతూ పొరపాటున కబీరుపై పాదం మోపారు గురువు! వెంటనే పొరపాటు తెలుసుకున్నారు. ‘రామ రామ’ అంటూ పశ్చాత్తాపం వ్యక్తపరచారు. అనంతరం, స్నానం ఆచరించి తిరిగి వెళ్లిపోయారు.

గురువు పాద స్పర్శ పొందిన కబీరు, తనకు ఆయన దీక్ష ప్రసాదించారని పొంగిపోయాడు. పొరపాటున కాలు తగిలిందన్న పశ్చాత్తాప హృదయంతో రామానందులు పలికిన ‘రామ రామ’ అనే మాటల్ని గురువు చేసిన మంత్రోపదేశంగా భావించాడు. దాన్ని స్వీకరించి తన్మయత్వం చెందాడు భక్త కబీరు! రామానందుల శిష్యుల్లో అగ్రగణ్యుడయ్యాడు. సామాజిక అంతరాల్ని తన సంస్కార బలంతో సులభంగా అధిగమించగలిగాడు. భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడై ప్రసిద్ధి చెందాడు. ఆత్మ సంస్కారం కలిగినవారికి సామాజిక కట్టుబాట్లతో పని లేదు. వారి కార్యదీక్షకు ఏవీ ఆటంకాలు కావు, కాలేవు.

దేహ బలం, సౌందర్యం, ఆర్థిక పరిపుష్టి... ఇవన్నీ కార్యసాధనకు కొంతవరకు దోహదపడే అంశాలుగా గోచరిస్తాయి. బలహీన దేహం గలవారు, పేదరికంలో మగ్గినవారు, కురూపులు సైతం అద్భుత కార్యాలు సాధించిన ఉదంతాలు పురాణ గాథల్లో కనిపిస్తాయి. వారు అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. ఒక బాలుడికి చిన్నప్పుడే కాలు విరిగింది. అతడు దేనికీ పనికిరాడని కొందరు చిన్నచూపు చూశారు. మరికొందరు సానుభూతి కురిపించారు. ఆ చిన్నచూపును, సానుభూతిని తన మనసు నుంచి పక్కకు నెట్టాడా బాలుడు. తనకు తానే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. నిర్విరామ కృషి సాగించాడు. ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల రచయితగా వన్నెకెక్కాడు. ఆయనే హెచ్‌జీ వెల్స్‌!.
🌻       🌻

ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి???

ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి? తిధి వ్రతములు చేయటం వలన లభించే ఫలితాలు ఏమిటి?

ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది. అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి.



తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది.



పాడ్యమి : అధిదేవత – అగ్ని. వ్రత ఫలం – సత్ఫల ప్రాప్తి.
విదియ : అధిదేవత – అశ్విని దేవతలు. వ్రత ఫలం – ఆరోగ్య వృద్ది.
తదియ : అధిదేవత – గౌరీ దేవి. వ్రత ఫలం – సుమంగళీ అనుగ్రహం.
చవితి: అధిదేవత – వినాయకుడు. వ్రత ఫలం – కష్టములు తొలగిపోవుట.
పంచమి: అధిదేవత – నాగ దేవత. వ్రత ఫలం – వివాహము, వంశ వృద్ది.
షష్టి : అధిదేవత – సుబ్రహ్మణ్య స్వామి. వ్రత ఫలం – పుత్ర ప్రాప్తి.
సప్తమి: అధిదేవత – సూర్య భగవానుడు. వ్రత ఫలం – ఆయురారోగ్య వృద్ది.
అష్టమి: అధిదేవత – అష్టమాత్రుకలు. వ్రత ఫలం – దుర్గతి నాశనము.
నవమి: అధిదేవత – దుర్గాదేవి. వ్రత ఫలం – సంపద ప్రాప్తిస్తుంది.
దశమి: అధిదేవత – ఇంద్రాది దశ దిక్పాలకులు. వ్రత ఫలం – పాపాలు నశిస్తాయి.
ఏకాదశి: అధిదేవత – కుబేరుడు. వ్రత ఫలం – ఐశ్వర్యము ప్రాప్తించును.
ద్వాదశి: అధిదేవత – విష్ణువు. వ్రత ఫలం – పుణ్య ఫల ప్రాప్తించును.
త్రయోదశి: అధిదేవత – ధర్ముడు. వ్రత ఫలం – మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.
చతుర్దశి: అధిదేవత – రుద్ర. వ్రత ఫలం – మ్రుత్యున్జయము, శుభప్రదం.
అమావాస్య: అధిదేవతలు – పితృదేవతలు. వ్రత ఫలం – సంతాన సౌఖ్యం.
పౌర్ణమి: అధిదేవత – చంద్రుడు. వ్రత ఫలం – ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.

మార్గశిర మాస విశిష్ఠ తిథులు - పండుగలు

మార్గశిరమాసం - శుక్లపక్షం : 
పాడ్యమి : గంగాసాన్నం
విదియ :                  
తదియ : ఉమామహేశ్వర వ్రతం, అనంత తృతీయ వ్రతం
చవితి :  వరద చతుర్థి, నక్త చతుర్థి – వినాయకపూజ
పంచమి : ‘నాగపంచమి’ నాగపూజ ( స్మృతి కౌస్తుభం ) ‘శ్రీ పంచమి వ్రతం’ ( చతుర్వర్గ చింతామణి)
షష్ఠి :  సుబ్బారాయుడి  షష్ఠి, స్కందషష్ఠి, చంపాషష్ఠి, ప్రవార షష్ఠి వ్రతాలు – సుబ్రహ్మణ్య పూజ, రైతుల పండుగ
సప్తమి : మిత్ర సప్తమి  "ఆదిత్య ఆరాధన" ( నీలమత పురాణం )
అష్టమి : కాలాష్టమీ వ్రతం 
నవమి :         
దశమి :          
ఏకాదశి : ముక్కోటి ఏకాదశి, మోక్షదైకాదశి, సౌఖ్యదాఏకాదశి, గీతాజయంతి – ఏకాదశీ ( ఉపవాస) వ్రతం కృష్ణ పూజ, భగవద్గీతా పారాయణ
ద్వాదశి :  ద్వాదశీ పారణ, తీర్థదినం, అఖండ ద్వాదశాదిత్య వ్రతం
త్రయోదశి :  హనుమద్ వ్రతం, అనంగ (మన్మధ) త్రయోదశీ వ్రతం 
చతుర్దశి :  చాంద్రాయణ వ్రతం ఆరంభ తిథి - రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి గౌరీదేవిని ఆరాధించాలి 
పూర్ణిమ :  కోరల పున్నమి, దత్త జయంతి - చంద్రఆరాధన, దత్త చరిత్ర పారాయణం, సాయి సత్చరిత్ర పారాయణం. 
మార్గశిర మాసం - కృష్ణపక్షం :
పాడ్యమి :  శిలావ్యాప్తి వ్రతం 
విదియ :
తదియ :                  
చవితి :   సంకష్ట హర చతుర్థి 
పంచమి :        
షష్ఠి :            
సప్తమి :  ఫలసప్తమీ వ్రతం
అష్టమి : అనఘాష్టమీ వ్రతం, కాలభైరవాష్టమి/ – కాలభైరవపూజ  
నవమి : రూపనవమి వ్రతం   
దశమి :          
ఏకాదశి : సఫల ఏకాదశీ వ్రతం, వైతరణీ వ్రతం, ధనద వ్రతం
ద్వాదశి :  మల్లి ద్వాదశి వ్రతం, కృష్ణ ద్వాదశీ వ్రతం
త్రయోదశి : యమత్రయోదశి వ్రతం, మాస శివరాత్రి
చతుర్దశి :        
అమావాస్య : వకుళామావాస్య, అమావాస్య వ్రతం -ఆవు పాలతో పరమాన్నం వండి దేవునికి నివేదనచేయడం సర్వ శుభస్కరం 

మాసానాం మార్గశిర్షోహం అంటే ఎమిటి???

Related image
మృగశిర నక్షత్రం కలసి పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించేనెల మార్గశీర్ష మాసం. “మాసానాం మార్గశీర్షోహం” అని కృష్ణుడు స్వయంగా చెప్పాడు. కనుక మార్గశిర మాసం విష్ణుదేవుని రూపం. భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తీకంలో శివుని, మార్గాశిరంలో విష్ణువును, పుష్యమాసంలో సూర్య భగవానుని ఇలా అయిదు మాసాలలో అయిదు దేవతా స్వరూపాలను అర్చిస్తూ పంచాయతన పూజా విధానాన్ని సుష్టు పరచారు. సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం. అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం, సంధ్యావందన జప ధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్నితేజము కూడా మన మనస్సును, బుద్ధిని ప్రచోదనం చేస్తాయి. అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారు ఝామున నిద్రలేచి స్నానం చేయడం ఆచారమైంది. నందవ్రజంలోని గోపికలు పరమేశ్వరుడైన విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణునిలో అద్వైత స్థితిని పొందగోరి మార్గశిర మాసంలో వ్రతం ఆచరించారు.
ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి, పోలిని జ్ఞాపకం తెచ్చుకుని నదులలో దీపాన్ని విడిచిపెట్టాలి.  
ఈ మాసంలో విష్ణువును 'కేశవ' నామంతో అర్చిస్తాం. 

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles