Showing posts with label బ్లాగ్. Show all posts
Showing posts with label బ్లాగ్. Show all posts

Tuesday, 17 January 2017

శివబాబా స్మృతిలో ఉన్నారా?

శివబాబా చెప్తున్నారు - మీరు శరీరంలో ఉంటూ కూడా ఆత్మను చూడండి, ఇదే మొదటి పాఠం.

రోజంతటిలో ఆత్మికస్ధితి, ఆత్మిక దృష్టి ఎక్కువగా ఉండాలి.

బాబా సమానంగా జీరో అవ్వాలి.జీరో అంటే చిన్న రూపం.

జీరోగా అయితే హీరోగా కూడా అవుతారు.

జీరో మరియు హీరో ఈ రెండు విషయాలు స్మృతి ఉంచుకుంటే బాబా సమానంగా సర్వగుణ సంపన్నంగా అయిపోతారు.

జీరో అంటే ఏమీ ఉండకూడదు, మనలో ఏ పాత సంస్కారాలు ఉండకూడదు.

ఓం శాంతి.

శివ శుభోదయం.
🌷🌷🌷🌷🌷🌷🌷

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే…

డబ్బు మనుషుల్ని ఎంత పాడు చేస్తుందో చెప్పే అద్భుతమైన నీతి కధ తప్పకుండా చదవండి షేర్ చేయండి

ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి "ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?" అని అడిగారు. అందుకాయన... "అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది." వాళ్ళిద్దరూ భయంతో… "అంటే అక్కడ పులి ఉందా?" అని అడిగారు.

"కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది." అన్నాడాయన. "ఇంతకీ ఏమిటది?" అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. "బంగారు నాణేల గుట్ట" అన్నాడు సన్యాసి. వాళ్ళిద్దరూ సంతోషంగా "ఎక్కడ?" అని అడిగారు.

"అదిగో ఆ పొదల్లోనే" అని వేలు చూపించి తన దారిన పోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి. "ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?" అన్నాడొక మిత్రుడు.

"అతడి సంగతి వదిలేయ్. ముందుగా ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం." అన్నాడు మరో మిత్రుడు.

అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉన్నాడు. రెండోవాడు ఊర్లోకి వెళ్లాడు. ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు. "ఛ… ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు." అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.

ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడి ఆలోచన ఇలాఉంది… "వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు" అనుకున్నాడు. అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు.

అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు. "పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను." అనుకునిఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. "సన్యాసి మాటలు ఎంత నిజమో కదా" అనుకున్నాడు చివరి క్షణాల్లో.

గమనిక : రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి…. అని పెద్దల నానుడి. కాబట్టి ఆ రూపాయి విషయంలో జాగ్రత్త.

RIP అంటే అర్థం తెలుసా..? తెలియ‌క వాడుతున్నారా??

సోష‌ల్ మీడియా విస్తృత‌మ‌య్యాక‌.. తెలిసిన వ్య‌క్తి ఎవ‌రైనా చ‌నిపోయారు అని తెలియ‌గానే ఒక ఫొటో పెట్టేసి.. RIP అని పోస్ట్ చేస్తున్నాం. అస‌లు RIP అంటే అర్థం తెలుసా? RIP అంటే REST IN PEACE.. అర్థం. ప్ర‌స్తుతం మ‌న‌మంద‌రం..  RIP అని ఎందుకు రాస్తున్నామో తెలియకుండానే గుడ్డిగా అనుసరిస్తున్నాం.  క్రైస్తవం ప్రకారం మరణించాక, జడ్జిమెంట్ డే వరకు ఆత్మ నిరీక్షించాలి. ఇస్లాం ప్రకారం కూడా ఒక రోజు వరకు నిరీక్షించాలి. ఆ రోజు వరకూ ఈ ఆత్మ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని మనం ఈ RIP ద్వారా కోరుతున్నాం.

మరి సనాతన ధర్మం ప్రకారం ఆత్మ నాశనం లేనిది. ఆత్మకు అలసటే లేదు. అలాంటప్పుడు విశ్రాంతి ఎక్కడ? అలాగే మరణానంతరం జీవి పాపపుణ్యాల్ని బట్టి, తరువాతి జన్మ పొందడమో, స్వర్గ నరకాలకు వెళ్ళడమో, మోక్షానికి వెళ్ళడమో వంటి ప్రతి చర్యలుంటాయి. మోక్షం వరకూ ఇది ఒక చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. అంతేకానీ మనం ఏ రోజు గురించి నిరీక్షించాల్సిన అవసరం లేదు.

RIP అనేది పూర్తిగా పాశ్చాత్యమే కాక, మతాంతరం కూడా. మరణించిన వ్యక్తికి ముక్తి కలగాలనో, లేక స్వర్గస్తుడవ్వాలనో, శాశ్వత పుణ్య లోకాలు కలగాలనో మనం ప్రార్థించాలే తప్ప, RIP అని ప్రార్థించడం సనాతన ధర్మానికి వ్యతిరేకమని గుర్తించాలి. స్వ‌ర్గ ప్రాప్తిర‌స్తు అనుకోవాలి గాని, ఇలా రిప్ అనటం అంత..........

Friday, 13 January 2017

చైనా ఇపుడు ఆర్థిక తిరోగమనం

చైనా ఇపుడు ఆర్థిక తిరోగమనం (economical slump) లో పడింది. గ్లోబల్ ఆర్థికవేత్తల అంచనా ప్రకారం చైనా వారి                వస్తువుల ధరలు ఇక తగ్గించి... అతి తక్కువ ధరలకే అమ్మనుంది. వారి వ్యాపారాన్ని కాపాడే అతి పెద్ద మార్కెట్ ఉన్న దేశం భారత దేశమే. ప్రతి సంవత్సరం 60 లక్షల కోట్లు మన డాబు చైనాకి వెళ్తుంది. ఊహించడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షర సత్యం. అందుకే.. మనం చైనా వస్తువులు కొనకపోతే చైనా ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా దెబ్బతింటుంది. మనం మన దేశంలో తయ్యారయ్యే వస్తువులు కొనటం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇదే కనుక మనం ఎప్పటికి కొనసాగించగలిగితే.... మనం చైనాని ఆదేశించే రోజు త్వరలోనే వస్తుంది. మనమంతా చేయవలిసిన పని ఒకటే... చైనా వస్తువులు కొనకూడదు.. అలానే వాటిని అమ్మకూడదు.

* ముందుగా మీరు కొనే వస్తువు పై ఉన్న బార్ కోడ్ ని గమనించండి.

* బార్ కోడ్ లో ముందు మూడు అంకెలు ఏ దేశానికి చెందినదో తెలుపుతాయి.

* ఆ బార్ కోడ్ లో ముందు మూడు అంకెలు 690 నుండి 695 లోపు ఉంటె అవి చైనా వస్తువు అని అర్ధం.

* మీరు ఈ వస్తువులను కొంటె డబ్బులిచ్చి మరీ చైనా కి సపోర్ట్ చేస్తున్నవారవుతారు.

చైనా కంపెనీల లిస్టు:

Alcatel (subsidiary of TCL Corporation)

Amoi

BBK

Coolpad

Cubot

Gfive

Gionee

Haier

Hisense

Huawei

Konka

Lenovo (also its subsidiary Motorola Mobility)

LeEco (Letv)

Meizu

OnePlus (subsidiary of BBK)

Oppo (subsidiary of BBK)

Qihoo 360

QiKU (joint venture of Qihoo 360 and Coolpad)

Ningbo Bird

Smartisan

Technology Happy Life

Vivo (subsidiary of BBK)

Vsun

Wasam

Xiaomi

Zopo Mobile

ZTE

ZUK Mobile (subsidiary of Lenovo)

భారత కంపెనీల లిస్టు:

Celkon

iball

Intex Technologies

Karbonn Mobiles

Lava International

LYF

Micromax Informatics

Onida Electronics

Ringing Bells

Spice Digital

Videocon India

Xolo (Subsidiary of Lava International)

YU Televentures (Subsidiary of Micromax Informatics)

మనం రోజు వాట్సాప్ లో, ఫేస్ బుక్ లో అవసరం ఉన్నవి, లేనివి ఎన్నో షేర్ చేస్తాం.. ఇపుడు దేశానికి తెలియాల్సింది ఒకటుంది.. మీ వంతు భాద్యతగా అందరికి షేర్ చేయండి. తెలుగు వాళ్ళందరు దేశానికి సహాయ పడేటట్టు చేయండి..!!

అచ్చ తెలుగు తిట్లు

తెలుగు తిట్లకు ప్రత్యేకతలున్నాయి. తెలుగువారి అచ్చతెలుగు తిట్లు కొన్ని ఆగ్రహం కాక నవ్వు తెప్పుస్తుంటాయి. కొన్ని ముద్దుగా, మురిపెంగా వుంటాయి. శుంఠ, అప్రాచ్యుడు, మొద్దురాచ్చిప్ప, బఢవ, వెధవాయి, చవటాయి, సన్నాసి, వాజమ్మ, ముద్దపప్పు, బడుద్ధాయి, అవతారం, నంగనాచి, సన్నాసి,  నాలిముచ్చు, కుర్రకుంక, వెర్రిమాలోకం, చవట సన్నాసి లాంటి అచ్చ తెనుగు తిట్లు ప్రతి తెలుగింటా ప్రతిధ్వనిస్తుంటాయి.

నిజానికి అవి తిట్లు కాదు. దీవెనలే. "నేతి గారెలు వేడివేడిగా తింటాడనుకొంటే ఈ సన్నాసి ఎటు వెళ్ళడో?" అని బామ్మగారు దిగులులుపడుతుంది. మడికటుకొన్నాను. నన్ను అంటుకోకురా భడవా." అని అమ్మమ్మ ముద్దుగా కోప్పడుతుంది. "మా బడుద్ధాయి ఎంత బాగా పాడతాడో" అని తాతగారు మురిసిపోతారు. అలా!

Wednesday, 21 December 2016

మట్టి పాత్రల విశిష్టత

Matti patra pot vessels


      *వాగ్బటాచార్యులు* చెప్పిన మొదటి సూత్రం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి , వెలుతురూ తగులుతూ వుండేలా చూసుకోవలెను . మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యునికాంతి , గాలి ( పవనము ) తగలని ఆహారము తినకూడదు . అది ఆహారము కాదు విషముతో సమానము . ఈ విషము నిదానముగా పని చేస్తుంది . అంటే కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలుగా పని చేస్తుంది .

      *ప్రెషర్ కుక్కర్* లో వండే ఆహారానికి ఏ మాత్రమూ గాలి , సూర్యరశ్మి తగలదు . కావున ఇందులో వండిన ఏ ఆహారమైన విషతుల్యము . అల్యూమినియంతో ఈ ప్రెషర్ కుక్కర్ ని  తయారు చేస్తారు . అల్యూమినియం పాత్రలలో ఆహారం వండటంగానీ , నిలువ వుంచటానికి గానీ ఏ మాత్రం పనికిరాదు . ఈ పాత్రలలో వండిన ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ తింటూ వుంటే వారికి *మధు మేహం , జీర్ణ సంబంధిత , టి.బి. ఆస్తమా మరియూ కీళ్ళ సంబంధ* వ్యాధులు తప్పకుండా వస్తాయి . ఈ రోజు అందరి ఇళ్ళలోకి అల్యూమినియం వచ్ఛేసింది .

       ప్రెషర్ అనగా ఒత్తిడి అంటే మనం ప్రెషర్ కుక్కర్ లో వండే పదార్ధం ఒత్తిడికి గురై త్వరగా మెత్తబడుతుంది . కానీ ఉడుకదు. పదార్ధం ఉడకడం వేరు మెత్తబడడం వేరు .

       ఆయుర్వేదం ప్రకారం భూమిలో ఏగింజ పండడానికి ఎక్కవకాలం పడుతుందో అదేవిధంగా ఆగింజ వండడానికి ఎక్కవ సమయం తీసుకుంటుంది . గింజలోని అన్నిరకాల పోషకాలు మన శరీరంలోకి చేరాలంటే పదార్ధం వండబడాలి . మెత్తబడితే సరిపోదు . ఇది ప్రకృతి ధర్మం , ఆయుర్వేద సిద్ధాంతం .

      ప్రాచీన కాలంనుండి భారత దేశంలో దేవాలయాలలో భగవంతునికి ప్రసాదం మట్టి పాత్రలోనే వండి , మట్టి పాత్రలోనే భగవంతునికి సమర్పిస్తారు . ఎందుకంటే మట్టి పరమ పవిత్రమైనది . మన శరీరం అంతటా ఉండేది మట్టియే . మన ఆరోగ్యానికి కావలసిన 18 రకాల మైక్రోన్యూట్రియన్స్ ఈ మట్టిలో వున్నాయి . మట్టి పాత్రలో వండిన ఆహార పదార్ధాన్ని రీసెర్చ్ చేయిస్తే వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే ఈ పదార్ధాంలో ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు . ప్రెషర్ కుక్కర్ లో  వండిన పదార్ధాన్ని కూడా టేస్ట్ చేయిస్తే 7% లేక 13% న్యూట్రియన్స్ మాత్రమే ఉన్నాయి . 93% లేక 87% న్యూట్రియన్స్ దెబ్బతిన్నాయి , లోపించాయి అని తేలింది . *మట్టిపాత్ర* లో వండిన పదార్ధములో 100% న్యూట్రియన్స్ ఉన్నాయి . ఈ పదార్ధినికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది .

       మన పూర్వీకులు ఈ సంప్రదాయం ప్రకారం జీవించినంత వరకు వారికి కళ్ళజోడు రాలేదు . జీవితాంతం వరకు పళ్ళు ఊడిపోలేదు , మోకాళ్ళ నొప్పులు , డయాబెటీస్ వంటి సమస్యలు రాలేదు . జీవితాంతం మన శరీరానికి కావల్సిన న్యూట్రియన్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరిమీద ఆధారపడకుండా జీవించగలం . అదీ ఒక్క మట్టిపాత్రలో వండిన ఆహారం భుజించటం వలన మాత్రమే సాధ్యమవుతుంది . డయాబెటీస్ ఏ స్ధాయిలో ఉన్నవారికైనా ఈ పద్ధతిలో భోజనం వండి పెట్టండి. సుమారు కొన్ని నెలలోపే ఖచ్చితంగా డయాబెటీస్ రోగం నుండి విముక్తులవుతారు . ఆనందంగా జీవిస్తారు .

     మనం ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే గాలి , సూర్యరశ్మి తగిలేలాగా ఆహారం వండు కోవాలి . ఈ పద్ధతికి అత్యుత్తమైనది *మట్టి పాత్ర* .

      మనకి మట్టి పాత్రలు తయారు చేసే కుమ్మరి వాళ్ళు ఎంతో గౌరవనీయులు . అన్ని రకాల మట్టి పాత్రలకు పనికి రాదు . ఏ మట్టి పనికి వస్తుందో , ఎలాంటి మట్టిలో వంట పాత్రలు చేయవచ్చో గుర్తించి తయారు చేస్తారు . ఇంత గొప్ప సేవచేసి మనకు ఆరోగ్యాన్ని అందించుచున్నందుకు నిజంగా వారు మనకు వందనీయులు .

  *మట్టి పాత్రలోనే ఆహారం వండుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం* .

   *భారతీయ కుమ్మరికి శతకోటి వందనాలు* .
                   బై
           *శ్రీ రాజీవ్ దీక్షిత్*

క్యాన్సర్ ఒక వ్యాధి కాదు.. ??? దీనికి విరుగుడు ఏంటో తెలుసా.. ???

5762 : బట్టబయలైన రహస్యం! క్యాన్సర్ ఒక వ్యాధి కాదు..
Cancer free

 కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ నందితా డిసౌజా చెప్పిన దాని ప్రకారం క్యాన్సర్ అనే పదమే ఒక పెద్ద అబద్ధం. క్యాన్సర్ భూతం పేరు చెప్పి ప్రపంచాన్ని ఎలా బయపెడుతున్నారో అందరికి తెలిసిందే. ఈ భూతం వెనుక దాగున్న నిజాన్ని బట్టబయలు చేయడమే ఈ పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం..

మిమ్మల్ని అభ్యర్దించే ఒక విషయం ఏమిటంటే.... ఇప్పుడు మీరు తెలుసుకుంటున్న ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా మీ శత్రువులతో కూడా షేర్ చేయండి. ఇది మేము సొంతంగా రీసెర్చ్ చేసి చెబుతున్న విషయం కాకపోవచ్చు. కాని ఇందులో ఉన్న విషయాలు క్యాన్సర్ నుండి ఓ నలుగురినైనా కాపాడితే అంతే చాలు.

క్యాన్సర్ అనే దానికి నివారణ లేదని డాక్టర్స్ చెబుతారు. కానీ అది శుద్ధ అబద్ధం. క్యాన్సర్ అనేది నివారణ లేని జబ్బు కాదు... ఇది ఒక భయంకరమైన బిజినెస్ చాలా మంది అంటుంటారు.

ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది పిల్లల నుండి పెద్దల వరకు అందరికి వస్తుందని.... అందరిని భయపెడుతున్న మరియు భయపడుతున్న వాళ్ళకి అర్ధం కావాలనే ఈ పోస్ట్.

-వరల్డ్ వితౌట్ క్యాన్సర్- అనే ఒక బుక్ ఉందని, దాన్ని అన్ని భాషలలో తర్జుమా చెయ్యకుండా ఎందుకు, ఎవరు అడ్డు పడుతున్నారో చూద్దాం.

* క్యాన్సర్ అనేది B17 లోపమే గాని జబ్బు కాదు.

* ఈ లోపాన్ని అణచడానికి కీమోథెరపీ అని, సర్జరీ అని, హై డోస్ మెడిసిన్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తో మనిషిని చంపకుండా చంపేస్తున్నారు.

మీకు గుర్తుందా? గతంలో అనే అంతుపట్టని వ్యాధితో ఎంతో మంది నావికులు చచ్చిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాధికి స్కర్వీ (scurvy) అని పేరు పెట్టారు. విటమిన్ లోపం వల్ల ఎంతో మంది చనిపోయారు.

అది విటమిన్ లోపం వల్ల వచ్చిన రోగం అని చెప్పకుండా... అంతుపట్టని రోగం అని చెప్పి ప్రజల నుండి డబ్బులు దోచుకున్నారు హాస్పిటల్స్ వాళ్ళు. అది కేవలం విటమిన్ C వల్ల వచ్చిన రోగం.

క్యాన్సర్ కూడా ఇలాంటిదే... అంటే విటమిన్ లోపమే క్యాన్సర్ అని అర్ధం. క్యాన్సర్ సెల్స్ ఎక్కడో ఉండవు మన బాడీ లోనే ఉంటాయని చాల మంది డాక్టర్స్ కూడా చెపుతారు. అసలు లోపల ఉన్న క్యాన్సర్ బయటకు ఎందుకు వస్తుంది? మనం దానికి సంబంధించిన విటమిన్లు సరిగ్గా తీసుకోకపోవడం వలన.

మానవత్వం లేని మనుషుల వల్ల, కాంక్రీట్ జంగల్ లో బ్రతుకుతున్న జీవితాల వల్ల, క్యాన్సర్ అనే ఒక పదం సృష్టించి... దాన్ని బిజినెస్ చేసారు కొంతమంది డాక్టర్స్.

మనుషుల భయాన్ని ఆసరా చేసుకొని కొన్ని కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు. ఈ విషయం ఇప్పటిది కాదు... వరల్డ్ వార్ 2 తర్వాత క్యాన్సర్ అనే దాన్ని ఒక బిజినెస్ చేసి దాని ద్వారా బాగా సంపాదిస్తున్నారు. ఆ కాలంలో, ఈ కాలంలో బాగా ఖర్చు పెట్టి కూడా వీళ్ళు సాధించింది ఏంటో తెలుసా? రాకుండా చూసుకోవడమట, నివారణట. అసలు రాకుండా చెయ్యడం కాదు, అలా చేస్తే హాస్పిటల్స్ కి డబ్బులు రావు కదా.

మీకు గాని.. మీకు తెలిసిన వాళ్లకు గాని క్యాన్సర్ అని లోపం ఉంటె కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సింది ఒకటే...

ఈ రోజుల్లో ఎవరైనా స్కర్వీ (scurvy) వ్యాధితో చనిపోతున్నారా? లేదు.... ఎందుకంటే దానికి కారణం విటమిన్ C లోపం అని తెలుసుకొని ఆ లోపాన్ని సరిద్దికోవడం వల్ల.

మరి క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం కదా..! ఆ లోపాన్ని కూడా B17 తో పోగొట్టుకోవచ్చు.

క్యాన్సర్ రాకుండా చేసుకోవడం చాల సులువు!


1) 15 నుండి 20 నేరెడు కాయలు/క్రాన్బెరి/ఆపిల్ సీడ్స్.

2) ఎండు ద్రాక్ష.

3) బాదాం పప్పు.

4) బ్లాక్ మల్బెర్రి, బ్లూ మల్బెర్రి, కోరిందకాయ, స్ట్రాబెర్రి.

5) నువ్వులు, అవిసె గింజలు.

6) ఓట్స్, బార్లీ, గోధుమ బియ్యం, నల్ల గోధుమలు.

7) బీర్ ఈస్ట్, వరి, తీపి గుమ్మడికాయ. తెల్ల ఆపిల్ (పియర్ ఆపిల్)

8) నిమ్మ, ఉసిరి, చిక్కుడు, గోధుమ గడ్డి, జీడీపప్పు, పిస్తా.

పైన చెప్పినవన్నీ అధిక శాతంలో విటమిన్ B17 కలిగి ఉన్నవి.

ఈ లోపాన్ని సరిదిద్దు కోవడానికి ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి.

గోధుమ మొలకలు (Wheat Sprouts ) ఒక అద్భుతమైన క్యాన్సర్ నిరోధక మందు.

Wheat Sprouts bud is a Rich Source of Liquid Oxygen and the strongest anti-cancer matter in the name of "laetrile", and this matter is present in the fruit stone of ఆపిల్ (ఆపిల్ గింజలు). Laetrile is the extract form of vitamin B17 (Amygdalin)

అమెరికన్ మెడిసినల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏంచేస్తుందో తెలుసా, నిషేధించబడిన -LAETRILE- ప్రొడక్షన్ ని రహస్యంగా ఇంప్లీమెంట్ చేస్తుంది (ఈ మందుని మెక్సికో లో తయారుచేయించి అమెరికాలోకి రహస్యంగా తరలిస్తున్నారు)

Dr. హారొల్ద్ W.మన్నెర్ తన -డెత్ అఫ్ క్యాన్సర్- బుక్ లో క్యాన్సర్ ని -laetrile- ట్రీట్మెంట్ తో 90 శాతం వరకు నయం చేసారని వివరించారు.

క్యాన్సర్ రావడానికి ముఖ్యకారణం ఏంటో తెలిస్తే అవాక్కవుతారు, అవేంటంటే

1) వాష్ చెయ్యడానికి వాడే రసాయనాలు.

2) వాషబేసిన్ కడగడానికి ఉపయోగించే రసాయనాలు.

3) టాయిలెట్స్ శుభ్రపరచడానికి వాడే రసాయనాలు పీలచడం.

మేము వాటిని తినడం లేదు కదా అని అనవచ్చు. కానీ మీరు పీలుస్తున్నారంటే అది ఒకరకంగా తినడం లాంటిదే. మీరు మీ ప్లేట్స్ ని లిక్విడ్స్ తోనే వాష్ చేస్తున్నారు కదా? అలా ఎంత క్లీన్ చేసిన సరే.. ఆ కెమికల్స్ కొంత మీ ప్లేట్స్ లో అలానే ఉంటాయి. ఆ ప్లేట్ లోని ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ కి కెమికల్స్ అంటుకొని మీ శరీరంలోకి చేరతాయి. (పూర్వ కాలంలో ఆకులలో తినేది అందుకే కదా)

దీనికి విరుగుడు ఏంటో తెలుసా ???

మీరు వెనిగర్ తో మీ పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు.

మీరు కొన్న కూరగాయల్ని ఒక అరగంట పాటు ఉప్పు నీళ్లలో నానబెట్టండి, తరువాత మంచి నీటి తో కడగండి మరియు దానికి వెనిగర్ ని ఆడ్ చెయ్యండి. దీనివల్ల క్యాన్సర్ ను వ్యాపింపజేసే కెమికల్స్ దూరంగా ఉంటాయి.


Sunday, 18 December 2016

పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము.

Poojaitems


1. గంటలు :

దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.

2.దీప హారతి:

దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. ” స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, మా బుద్ధిని ప్రభావితం చేయి” అని.

3. ధూపం

భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది.

4. కర్పూర హారతి

వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు.

5. గంధపు సేవ

ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం.

6. పూజ

దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కాని భగవంతునికి వీటితో పనిలేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.

7 పత్రం(శరీరము)

ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.

8 పుష్పం (హృదయము)

ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.

9 ఫలం (మనస్సు)

మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.దాన్నే త్యాగం అంటారు.

10. తోయం(నీరు)

భగవంతుని అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి.

11 కొబ్బరికాయలు

హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారము. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

12. నమస్కారము

చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.

13. ప్రదక్షిణము

ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.

కార్తీక మాసం లో ఎక్కువ చలిలో కూడా చల్నీటి స్నానాలు ఎందుకు చేస్తారు..?? స్నానాలు ఎన్ని రకాలు..??

Dhyanam siva


 స్నానము అనేది శరీర శుభ్రత కోసము. అది ఏ కాలములో చేసినా ఏవిధముగా చేసినా అంతిమ ఉపయోగము మాత్రం ఆరోగ్యము కాపాడుకోవడమే.

ఉదయాన్నే దేహాన్ని శుభ్రం చేసుకోడానికి స్నానం చేస్తాం. నిజానికి శుచితో పాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న ఉష్ణశక్తి ని బయటకు పంపడం స్నానపు ప్రధాన ఉద్దేశం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి ఉష్ణశక్తి ని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి ఉష్ణశక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే శరీరం లోకి చురుకుదనం ప్రవేశిస్తుంది.

మనలో నిరంతరం ఉష్ణశక్తి ప్రవహిస్తూ, ఉష్ణశక్తి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు శరీరంలో ఉన్న ఉష్ణశక్తి ఎక్కువగా బయటకు పోతుంది. శరీరంలో ఉష్ణశక్తి కొత్తగా తయారు అవుతూ బయటకు పోతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. ఈ ప్రక్రియను "Electro-magnetic Activity” అంటారు.

భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో నదీ స్నానాలకు, సముద్ర స్నానాలకు ఎంతో ప్రాధాన్యత వుంది. కార్తీక మాసంలోను పుష్కారాల సమయంలోను నదీ స్నానాలు పవిత్రమైనవిగా భావిస్తారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో సముద్ర స్నానాలు చేస్తుంటారు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానాలు చేయకూడదనే నియమం కనిపిస్తోంది. అలాగే నదుల్లో కూడా స్నానం చేయునప్పుడు పాటించవలసిన నియమాలను కూడా శాస్త్రం చెబుతోంది.

రాత్రి ధరించిన వస్త్రాలతో నదులలో గానీ సముద్రాలలో గాని స్నానం చేయకూడదు. ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించిన తరువాతే స్నానం చేయవలసి వుంటుంది. స్నానం చేసిన తరువాత వస్త్రాలను నదిలో ఉతకడంగానీ పిండటంగాని చేయకూడదు. అలాగే స్నానం చేసే సమయంలో ఉమ్మి వేయడం వంటివి చేయకూడదు. శాస్త్రం సూచించిన ఈ నియమాలను పాటిస్తూ పవిత్ర స్నానాలు చేసినప్పుడు మాత్రమే పుణ్య ఫలాలు లభిస్తాయి. లేదంటే కొత్త పాపాలు తలకెత్తుకోవలసి వస్తుందనే విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు.

కార్తీక మాసంలో పుణ్యము కోసం స్నానాలు చేసే స్నాన విధాలు:
1. దివ్య స్నానం : ఉత్తరాయణంలో ఎండతో పాటు వాన కురుస్తున్నప్పుడు నిలిచి స్నానం ఆచరించటం.


2. ధ్యాన స్నానం : గంగ, యమున, సరస్వతి మొదలైన పుణ్య నదులను తలచుకొని ఆ జలంతో స్నానం చేయటం.

3. మంత్ర స్నానం : మంత్రాలను ఆచరించే స్నానం మృత్తికా స్నానం అంటే మంత్రాలు పఠిస్తూ పవిత్ర ప్రదేశాలనుండి తెచ్చిన మృత్తిక తో ఆచరించిన స్నానం.

4. మాన స్నానం : విభూతిని శరీరం మొత్తం పూసుకొని స్నానం చేయటం దీన్ని మహేశ్వరున్ని స్మరిస్తూ చేస్తారు.

5. వారుణ స్నానము : గోవిందా, హర హర అని దేవున్ని తలచుకొని స్నానము చేయుట .

6. కాపిల స్నానము : శరీరము పైబాగాన ఏదైనా గాయము, పుండు ఉన్నచో, బొడ్డు దిగువ భాగము పాదాలవరకు నీటితో స్నానము చేసి, బొడ్డు పై శరీరభాగాన్ని తడిగుడ్డతో తుడుచు కోవడము.

7. ఆతప స్నానము : శరీరము ఏవిధముగానైనా తడపనీయకుండా అనారోగ్యము చుట్టిముట్టి ఉన్నవారు లేదా తీవ్రమైన నీటికొరత ఉన్నప్పుడు ఎండలో గోవిందనామము ను ఉచ్చరిస్తూ కొంతసేపు ఉంటే అది ఆతప స్నానము అవుతుంది.

8. మానస స్నానము : పై స్నాన విధాలు ఏవిధంగాను సహకరించని వారు నేను స్నానము చేస్తున్నాను అని భావించి శరీరము అలా తడుపుతున్న భావనతో ఉండి కొంతసేపయ్యేక పరమేశ్వరుని స్నానము చేస్తూన్న ఓ దృశ్యాన్ని కళ్ళలో ఊహించుకొని చూడగలిగితే చాలు అది మానస స్నానము అవుతుంది.

ఇవి మనకు శాస్త్రలు తెలిపిన స్నానములు. మంచిగా స్నానము చేస్తే చర్మవ్యాధులు వచ్చే అవకాశము కూడా తక్కువే. అందరికి ఈరోజు శుభదినం కావాలని మనసారా  కోరుకొంటూ..
    

Tuesday, 6 December 2016

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అంటే ఏమిటి?

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే (స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి.)

bharathakandam

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:
1) కేతుముల వర్ష 2) హరి వర్ష 3) ఇలవ్రిత వర్ష 4) కురు వర్ష 5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష 7) కింపురుష వర్ష 8 ) భద్రస్వ వర్ష
పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.
ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.
మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.
దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !
మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.
మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?
ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

Friday, 2 December 2016

నేటి యువత.....!

నేటి యువత.....!
youth

కాలంతో పోటీ పడే వేగంతో ఒకవైపు
కాలానికి విలువివ్వని సమరితనంతో మరోవైపు
అనుకున్నది సాధించే తెగువ ఒకవైపు
లక్ష్యం లేని జీవనం మరోవైపు
కుటుంబ భాద్యతలతో సంతోషం ఒకవైపు
ఒంటరితనపు వైరాగ్యం మరోవైపు
మదిలో ఆనందం ఒకవైపు
“మధిర”లోనే ఆనందం మరోవైపు
స్నేహానికి విలువతో ఒకవైపు
నమ్మక ద్రోహం నయవంచన మరోవైపు
సాగాల్సిన పయనం పక్కన పెట్టి
మధ్యం మత్తులో మాదకద్రవ్యాల చిత్తులో
మ్రగ్గిపోతున్న యువతా మేలుకో
||సోమ సుందర్ నిమ్మరాజు ||

కార్యదీక్ష

🙏🏽🌹    *కార్యదీక్ష*   🌹🙏🏽
🍃🌺🌺🌺🙏🏽🌺🌺🌺🍃
కార్యసాధకుల విజయ రహస్యం- నిరంతర కృషి. మార్గంలో ఎదురయ్యే అడ్డంకుల్ని చూసి వారు వెనకడుగు వేయరు. వాటిని అధిగమించడానికి సమధిక ఉత్సాహంతో పనిచేస్తారు. వారు కర్మయోగులు.

జీవిని ఈశ్వరుడి వైపు నడిపించడమే యోగ లక్ష్యం. కర్మయోగులకు ముగ్గురు శత్రువులుంటారు. లోభ, మోహ, అహంకారాలే ఆ శత్రువులు. ఆ బారి నుంచి తప్పించుకుంటూ, సంయమనంతో ముందుకు సాగిన వారే లక్ష్యం చేరుకోగలరు. ఆంజనేయుడు మహా బలశాలి. సీతమ్మ జాడ తెలుసుకోవడం అనే మహత్కార్యంపై పయనమయ్యాడు. మార్గమధ్యంలో సురస అనే రాక్షసి అడ్డగించింది. అంతటి మహాబలుడూ తన శరీరాన్ని కుదింపజేసుకున్నాడు. సూక్ష్మరూపంలోకి మారడం ద్వారా, ఆ రక్కసి బారి నుంచి విముక్తుడయ్యాడు. తన లక్ష్యం సాధించడానికి ముందుకు సాగిపోయాడు.
మనిషి అనుకున్నది సాధించాలంటే, మొదట అహంకారాన్ని వీడాలి. కార్యసాధనలో పొరపాటు చేయడం ఎవరికైనా సహజం. అహంకారి తన తప్పును ఒక పట్టాన అంగీకరించడు. నిరహంకారి అవసరమైతే క్షమాపణ చెప్పడానికి వెనకాడడు. అందువల్ల అతడి గౌరవం ఇసుమంతైనా తరగదు. పైగా, అతడి నిజాయతీని అందరూ ప్రశంసిస్తారు.

కార్యసాధనకు పట్టుదల, ధైర్య స్థైర్యాలే కాదు- తగినన్ని ఉపాయాలూ అవసరమవుతాయి. అవి అపాయకరమైనవి, సమాజానికి కీడు చేసేవి కాకూడదు.

శ్రద్ధ, సద్భావనలు ఈశ్వర దర్శనానికి మార్గాలు. అందువల్ల భక్తుడు రామకృష్ణ పరమహంసలా నిత్యమూ అమ్మవారి సమక్షంలోనే ఉండగలడు. ఆ జగదంబను దర్శించగలడు. శిష్యుడు గురు కృప పొందడానికీ శ్రద్ధ అత్యవసరం. రామానంద స్వామిని గురువుగా ఎంచుకున్నాడు కబీరు. కానీ దీక్ష ఇవ్వడానికి, మంత్రోపదేశం చేయడానికి ఆయన అంగీకరించలేదు. అలా ఒక వ్యక్తికే దీక్ష ఇచ్చి శిష్యుడిగా స్వీకరిస్తే, మిగతా శిష్యులకు కోపం వస్తుందని ఆయన అభిప్రాయం. రామానందులు రోజూ గంగలో స్నానం ఆచరించేవారు. ఒకరోజు ఆయన అక్కడికి వెళ్లిన సమయంలోనే, కబీరు ఆ నది ఒడ్డున ఇసుకలో పడుకున్నాడు. గంగలో స్నానానికి దిగబోతూ పొరపాటున కబీరుపై పాదం మోపారు గురువు! వెంటనే పొరపాటు తెలుసుకున్నారు. ‘రామ రామ’ అంటూ పశ్చాత్తాపం వ్యక్తపరచారు. అనంతరం, స్నానం ఆచరించి తిరిగి వెళ్లిపోయారు.

గురువు పాద స్పర్శ పొందిన కబీరు, తనకు ఆయన దీక్ష ప్రసాదించారని పొంగిపోయాడు. పొరపాటున కాలు తగిలిందన్న పశ్చాత్తాప హృదయంతో రామానందులు పలికిన ‘రామ రామ’ అనే మాటల్ని గురువు చేసిన మంత్రోపదేశంగా భావించాడు. దాన్ని స్వీకరించి తన్మయత్వం చెందాడు భక్త కబీరు! రామానందుల శిష్యుల్లో అగ్రగణ్యుడయ్యాడు. సామాజిక అంతరాల్ని తన సంస్కార బలంతో సులభంగా అధిగమించగలిగాడు. భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడై ప్రసిద్ధి చెందాడు. ఆత్మ సంస్కారం కలిగినవారికి సామాజిక కట్టుబాట్లతో పని లేదు. వారి కార్యదీక్షకు ఏవీ ఆటంకాలు కావు, కాలేవు.

దేహ బలం, సౌందర్యం, ఆర్థిక పరిపుష్టి... ఇవన్నీ కార్యసాధనకు కొంతవరకు దోహదపడే అంశాలుగా గోచరిస్తాయి. బలహీన దేహం గలవారు, పేదరికంలో మగ్గినవారు, కురూపులు సైతం అద్భుత కార్యాలు సాధించిన ఉదంతాలు పురాణ గాథల్లో కనిపిస్తాయి. వారు అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. ఒక బాలుడికి చిన్నప్పుడే కాలు విరిగింది. అతడు దేనికీ పనికిరాడని కొందరు చిన్నచూపు చూశారు. మరికొందరు సానుభూతి కురిపించారు. ఆ చిన్నచూపును, సానుభూతిని తన మనసు నుంచి పక్కకు నెట్టాడా బాలుడు. తనకు తానే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. నిర్విరామ కృషి సాగించాడు. ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల రచయితగా వన్నెకెక్కాడు. ఆయనే హెచ్‌జీ వెల్స్‌!.
🌻       🌻

విద్యార్థుల్లో ఎందుకీ ఒత్తిళ్లు

*భావోద్వేగం.. బలవుతోన్న బాల్యం*
*విద్యార్థుల్లో ఎందుకీ ఒత్తిళ్లు*
ఆత్మహత్యల వైపు ఆలోచనలు వద్దు
*విద్యాలయాల్లో కౌన్సెలింగ్‌ అవసరం*

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: అమ్మ తిట్టిందనో.. నాన్న అరిచారనో.. చదువలేమన్న మానసిక కుంగుపాటు.. ఒత్తిడిని తట్టుకోలేమన్న భయం.. కారణమేదైనా మరణమే పరిష్కారమన్న భావనతో విద్యార్థులు భావోద్వేగానికి లోనవుతున్నారు. మార్కులు తక్కువ వచ్చాయనో... స్నేహితులు తిట్టారని అవమానాన్ని భరించలేకనో... సహ విద్యార్థుల ఎదుట ఉపాధ్యాయులు కొట్టారనో.. అడిగింది తల్లిదండ్రులు కొని ఇవ్వలేదనో.. ఇలా క్షణికావేశంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బతుకుపై విరక్తి చెంది స్వయంగా ప్రాణాలు తీసుకునే దిశగా ఆలోచనలు సాగిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. కన్నవారికి కడుపుకోతను... అయినోళ్లకు శోకాన్ని మిగిల్చుతున్నారు. తాము ఈలోకాన్ని విడిచి వెళ్లిపోతే కన్న బిడ్డలపై ఎన్నో కలలు, ఆశలు పెంచుకుంటున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటీ... అన్న కోణంలో ఓ ఐదు నిమిషాలు ఆత్మ పరిశీలన చేసుకుంటే చాలు...! సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చావే సమస్యకు పరిష్కారం కాదన్న నగ్న సత్యం బోధపడుతుంది. ప్రతి సమస్య, కష్టానికి, ఇబ్బందికి సమాధానం తప్పక లభిస్తుంది. ఏ సమస్య అయినా సరే.. సహా విద్యార్థులు, స్నేహితులు, తల్లిదండ్రులతో పంచుకుంటే మీలో తలెత్తే ఒత్తిడి, కుంగుబాటు భయపడతాయి. ఇది మానసిక వైద్యులు చెబుతున్న సత్యం. దురదృష్టవశాత్తు ఇటీవల విద్యార్థులు రకరకాల ఒత్తిళ్లతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇది ఓ సర్వే చెప్పిన నిష్టూర నిజం. విద్యార్థులు ఆలోచనలు, ప్రవర్తనను నిత్యం అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు గమనిస్తూనే ఉండాలి. వారిలో మార్పులకు అనుగుణంగా తగిన కౌన్సెలింగ్‌ ఇప్పించాల్సిన అవసరాన్ని సకాలంలో గుర్తిస్తేనే ఫలితం ఉంటుందని మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. విద్యార్థుల ఆలోచనల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల కంటే ఈలోకంలో మనల్ని ప్రేమించేవారు ఇంకెవరుంటారన్న నిజాన్ని వారు గుర్తెరగాలి. కన్నవారికి కడుపుకోతను మిగిల్చినవారమవుతామని తెలుసుకోవాలి.
తల్లిదండ్రుల పాత్ర కీలకం

ఏ విషయాన్నైనా ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడొద్దు. ఇది పిల్లల మానసిక కుంగుపాటుకు కారణం అవుతుంది. పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినపుడు ఆచితూచి మాట్లాడాలి. తొందరపాటుగా వ్యవహరించడం మంచిదికాదు. పిల్లల్ని అమితంగా ముద్దు చేసే తల్లిదండ్రులు ఏదైనా విషయంలో తప్పు చేసినప్పుడు పరుషంగా మాట్లాడొద్దు. తాము కోరుకునే అంశాల్ని నెమ్మదిగా వివరించాలి. అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఖాళీగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు పిల్లలతో గడపాలి. వారి ఆలోచనలను పంచుకోవాలి.. గౌరవించాలి. ఇబ్బందులు, కష్టాలను సావదానంగా వినాలి. కుటుంబ కలహాలను పిల్లలపై రుద్దడం సరికాదు. ఏవైనా సమస్యలు ఉంటే పిల్లలు లేనప్పుడు చర్చించుకోవడం ఉత్తమం. ఇష్టపడే వస్తువుల్ని స్నేహతులు, సన్నిహితులకు ఇవ్వడం. అందరికీ ఫోన్లు చేయడం. దినచర్య రాసే అలవాటు లేకున్నా అకస్మాత్తుగా రాయడం ప్రారంభిస్తారు. ఈ తరహా ప్రవర్తన ఉంటే కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. గంటలకొద్దీ ఒక విధంగా పడుకోవటం లేదా కూర్చోవటం. భోజనం మిగిలిన విషయాల పట్ల అనాసక్తి చూపడం. స్నేహితులతో కలవకుండా ఒంటరిగా తిరుగుతుండటం. చిన్న విషయాలకే ఎక్కువ అసహనాన్ని ప్రదర్శించటం. దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండటం.. చేస్తుంటే కౌన్సిలింగ్‌ ఇప్పించాలి.

*ఉపాధ్యాయులు ఏం చేయాలంటే..*

తరగతి గదిలో దీర్ఘంగా ఆలోచించే విద్యార్థులను మాట్లాడించేలా చూడాలి. తనకు ఇష్టమైన పాఠ్యాంశాలను చదువుతూనే.. క్లిష్టంగా భావించే వాటిని అర్థమయ్యేలా చెప్పడానికి కృషి చేయాలి.

ఎప్పుడూ మాట్లాడే విద్యార్థి ఎప్పుడైనా ముభావంగా కనిపించం. ఎవరితోనూ మాట్లాడని పిల్లలు అందరితోనూ కలివిడిగా ఉండటం.. ఇలా ఏమైనా ప్రవర్తనలో తేడా ఉంటే గమనించాలి.

ఒరేయ్‌ దరిద్రుడా... నీ కంటే వీడు మేలు.. అన్న మాటాలు అసలు మాట్లాడొద్దు. నీవు ఏదీ చదవలేంటూ కించపరిచే వ్యాఖ్యలు అసలు చేయకూడదు. ్ద సున్నిత మనస్సు కలిగిన పిల్లల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలి.

ఉన్నఫళంగా విద్యార్థుల ప్రవర్తనలో మార్పు వస్తే.. తక్షణమే తల్లిదండ్రులకు కూడా తెలియజేయాలి. మార్కులు, ర్యాంకులే ప్రమాణికంగా చదువు చెప్పడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి రోజూ విధిగా తగిన సమయాల్లో క్రీడ, ఆటలు ఉండేలా చూడాలి. మానసిక ఉల్లాసం, ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

*ఒత్తిడి.. కుంగుబాటు ప్రమాదం*

ఒత్తిడి.. కుంగుబాటు. ఈ రెండూ ప్రమాదకరం. విద్యార్థులను అనేక రూపాల్లో ఈ రెండూ వేధిస్తూ ఉంటాయి. వాటి నుంచి ఉపశమనం కలగాలంటే చదువు ఒక్కటే కాదు.. ఆటలు, క్రీడలు చాలా కీలకం. సెలవు రోజుల్లో పిల్లలను దేవాలయాలు, ఉద్యానవనాలు, పర్యాటక ప్రాంతాలు, సినిమా.. ఇలా ఏదొక చోటికి తీసుకెళితే ఆలోచనల్లో మార్పు వస్తుంది. వారంలో ఒక గంట విధిగా మానసిక సమస్యలపై అవగాహన కౌన్సెలింగ్‌ ఉంటే చాలా మంచిది. వారిలో ఉన్న భయాలు, అపోహాలు తొలగిపోతాయి. పది, ఇంటర్‌ దశల్లో అనుత్తీర్ణులయినప్పుడు, డిగ్రీ, పీజీ దశల్లో ప్రేమ విఫలమైతే ఆత్మహత్యలు చోటు చేసుకుంటుంటాయి. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు పాఠశాల విద్యను చదివే పిల్లల్లోనూ ఆత్మహత్యలు ఉండటం బాధాకరం. దీనికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే పూర్తి బాధ్యత. విద్యార్థుల చుట్టూ స్నేహితులు, పరిసరాలు, ప్రవర్తన.. ఇలా ప్రతి దాన్ని నిత్యం గమనిస్తూ.. అంచనా వేస్తూ ఉండాలి. వారిలో ప్రవర్తన మార్పు చెందితే నేరుగా తిట్టడం.. కొట్టడం చేయకూడదు. సున్నితంగా, మంచిగా వారిలో మార్పు రావడానికి కృషి చేయాలి.

- ఎండ్లూరి ప్రభాకర్‌, మానసిక వైద్యనిపుణుడు, సర్వజన ఆస్పత్రి

నవంబరు 20న: శింగనమల మండలం ఇరువెందుల గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి అనంత నగరంలో ఓ ప్రైవేట్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 19న స్వగ్రామానికి వెళ్లొచ్చాడు. 20న పాఠశాలకు వెళ్లాడు. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. అదే రోజు రాత్రి

వసతి గృహం గదిలోకి వెళ్లాడు. లోపలే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. క్షణికావేశంలో కన్నవారికి కడుపుకోతను మిగిల్చాడు.

నవంబరు 21న: చిలమత్తూరు మండలం మరువకొత్తపల్లికి చెందిన శివకుమార్‌ అక్కడి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. స్నేహితుడి చరవాణిని పోగొట్టాడన్న ఉద్దేశంతో తల్లి మందలించింది. దీనికి తీవ్ర మనస్తాపానికి గురైన ఆ విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వూరి వేసుకుని ఉసురుతీసుకొన్నాడు. తప్పు చేయడంతో తల్లి తిట్టింది. క్షణికావేశంలో ప్రాణాలను పోగొట్టుకొన్నాడు.

*నవంబరు 22న*

కణేకల్లు మండలం పూలచెర్ల గ్రామానికి చెందిన అనంతయ్య పెద్ద కూతురు వనిత కడపలో చదువుతోంది. ఇరవై రోజుల కిందట ఇంటికొచ్చింది. తాగడానికి నీళ్లు తెమ్మని తల్లి చెప్పింది. వెళ్లననటంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన వనిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles