Showing posts with label భక్తి. Show all posts
Showing posts with label భక్తి. Show all posts

Tuesday 17 January 2017

గర్వమే పతనానికి నాంది

ఎంతటి గొప్ప వారికైనా సరే వారు సురులు కావచ్చు అసురులు కావచ్చు. ఒక పర్యాయం గర్వం ఆవహించింది అంటే అది నెత్తిమీద నుంచి దిగేదాకా నెత్తిమీదే కళ్ళుంటాయి అంటే అతిశయోక్తి కాదు. సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఈ విషయం నుండి మినహాయింపు లేదు.
అనేక కల్పములయందు సృష్టి రచించి చతుర్ముఖునికి తాను ఒక్కడినే ఈ సృష్టి రచించుచున్నానని, తాను నిర్విరామంగా పనిచేయచున్నానని, తనకంటే ఎవరూ కూడా అధికులు లేరని, నిరంతర శ్రమజీవిన నే భావం పెరిగి పెరిగి వటవృక్షం అయింది. స్థితికారుడయిన విష్ణుమూర్తికి నాసాళమునకు అంటిన గర్వం దించేదాకా విశ్రాంతి యుండదు. ఒక వెయ్యి చతుర్వ్యుగాలు కాలం గడిస్తే బ్రహ్మకు పగలు మరొక వెయ్యి చతుర్వ్యుగాలు గడిస్తే రాత్రి. అటువంటిది బ్రహ్మకు తన జీవితకాలం పూర్తవాలి అంటే ఎన్నో వేల యుగాలు గడవాలి. అది బ్రహ్మ గర్వానికి కారణం. బ్రహ్మ యొక్క గర్వమును అణచదలచినటువంటి విష్ణుమూర్తి బ్రహ్మదేవుని తన వెంట తీసుకొని ఈ మాట ఆ మాట చెబుతూ వాహ్యాళికి బయలుదేరాడు. కొంతదూరం పోగానే బ్రహ్మదేవునికి తాను ఇప్పటివరకు చూడని ఒక ఋషిపుంగవుడు తారసపడినాడు. ఆ మహాశయుడిని తాను సృజియించినట్లు బ్రహ్మకు గుర్తులేదు. బ్రహ్మదేవుడు ఋషి వద్దకు వెళ్లి, అయ్యా! ఎంత ఆలోచించినను తమరు గుర్తుకు వచ్చుటలేదు అనగానే ఋషి పుంగవుడు విష్ణుమూర్తిని చూచి చివుక్కున లేచి నమస్కరించి బ్రహ్మతో ఇలా మాట్లాడాడు. అయ్యా నేను రోమశుడను. అందరూ రోమశ మహర్షి అంటారు. నాకు తపము ఆచరించుట మాత్రమే వచ్చు. బ్రహ్మకు నూరేళ్ళ ఆయుర్దాయం పూర్తయిన పిదప నా శరీరమునందలి ఒక రోమము దానంతట అదే ఊడిపడిపోతుంది. ఆ విధంగా నా శరీరంలోని రోమాలు అన్ని రాలిపోయిన పిదప మోక్షము ప్రసాదిస్తాను అని శ్రీమన్నారాయణుడుచెప్పాడు. నాకు అంతే తెలుసు అన్నాడు. బ్రహ్మ ప్రక్కనే వున్న శ్రీమన్నారాయణుడు అవునని చిరునవ్వుతో చూచాడు. రోమశ మహర్షి సమాధానమునకు బ్రహ్మ నివ్వెరబోయాడు.
తరువాత బ్రహ్మ విష్ణువులు మరికొంత దూరం పోగానే వంకరలు తిరిగిన శరీరంతో మరొక మహర్షి కనిపించెను. మహావిష్ణువు కనబడగానే ఆ మహర్షి లేచి నిలబడి నమస్కరించాడు. బ్రహ్మదేవుడు ఆ యనతో అయ్యా, తమరు ఎవరని ప్రశ్నించాడు. అయ్యా నన్ను అష్టావక్రుడు అంటారు. నా శరీరమునందు అష్టవంకరలు ఉన్నవి. ఆ వంకరలు పోగానే మోక్షము ప్రసాదిస్తాను అని విష్ణుమూర్తి వరమిచ్చాడు. ఆ అష్టవంకరలు ఎలా బాగుపడతాయి అని బ్రహ్మ ప్రశ్నించగా అష్టావక్ర మహర్షి ఇలా బదులు చెప్పాడు. రోమశ మహాముని లాంటివారు ఒకరి తరువాత మరొకరుగా ఎనిమిది మంది ముక్తిపొందిన తరువాత నాలో ఉన్న ఒక వంకర మాయమవుతుంది. ఈ విధంగా నా అష్టవంకరలు తొలగగానే మోక్షం వస్తుందనిచెప్పాడని అన్నాడు.
అప్పటివరకు తనను మించినవారు లేరు అని భావిస్తూవున్న బ్రహ్మకు జ్ఞానోదయం అయింది. ఇప్పటివరకు చరాచర జగతిని సృష్టించేది నేనే అని గర్వపడుతూ ఉండేవాడు. విష్ణుమూర్తితో తండ్రీ నా కళ్లు తెరిపించినందుకు కృతజ్ఞుడను. నేను ఈ సృష్టికి సృష్టికర్త కావచ్చు కాని బ్రహ్మను సృష్టించినది మీరే అనే జ్ఞానం మరచినందుకు క్షమించండని అడిగాడు.
అపుడు విష్ణుమూర్తి ఇలా సెలవిచ్చాడు. నాయనా! రోమశ మహర్షి, అష్టావక్ర మహర్షివంటివారు ఎందరో ఉన్నారు. నిరంతర భగవన్నామ స్మరణ చేస్తూ హనుమంతుడు, మార్కండేయుడు చిరంజీవులుగానే ఉండిపోయినారు. మనం చేసే పని బాధ్యతాయుతంగా చేయాలి. నేను చేస్తున్నాను గదా అని గర్వపడరాదు. ఆ గర్వమే మన పతనాన్ని శాసిస్తుందని చెప్పాడు.

అంగారకుడి సింధూర ప్రియుడు

సింధూర ప్రియుడు :-

హిందూ సాంప్రదాయాలలో సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పార్వతీ దేవికి ప్రతీకగా సింధూరాన్ని భావిస్తారు. హిందూ ఆస్ట్రాలజీ ప్రకారం మేష రాశి స్థానం నుదిటిపైన ఉంటుంది. మేష రాశి అధిపతి అంగారకుడు. అంగారకుడి రంగు ఎరుపు. అందుకే ఈ రంగుని శుభప్రదంగా భావిస్తారు. సౌభాగ్యానికి, అదృష్టానికి ప్రతీకగా ఎరుపు రంగును భావిస్తారు. అందువల్ల ఎరుపు రంగు అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు.

పూర్వం శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒక రోజు సీతమ్మ తలస్నానం చేసి, నుదుటన తిలకం దిద్ది, పాపిటన ‘సింధూరం’ పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళుతున్న సమయంలో, అప్పటి వరకూ శ్రీరాముని సేవకై వేచి ఉన్న ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు.

ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా, సీతాదేవి హనుమంతునితో‘మేము విశ్రాంతి మందిరానికి వెళుతున్నాము, నీవు రాకూడదు, వెళ్ళు హానుమా…తరువాత రావచ్చు’ అనెను. రాములవారు కూడా ‘సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమా..ఇప్పుడు రావద్దు..’అనెను. అంతట ఆంజనేయుడు ‘రామా! మిమ్ములను సేవించనిదే నాకు కునుకు పట్టదు కదా…మీరును సీతమ్మ చెప్పినట్లే పలికెదరేమి? మీరు స్త్రీ దాసులై పోతిరేమి రామ”అనగా, రాములవారు హనుమంతునితో‘నేను వివాహ సమయమున ఆమె పాపిట చిటికెడు సింధూరం పెట్టితిని. అందుకు కారణంగా ఆమెకు దాసుడనైతిని’ అని తెలిపాడు.

హనుమంతుడు ఆశ్చర్యంతో ‘అమ్మా! మీ నుదుట తిలకముంది కదా!పాపిటన సింధూరం దేనికి’ అని అడిగాడు. అప్పుడు సీతాదేవి‘నాయనా హనుమా! స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించానని’ చెబుతుంది.
వెంటనే హనుమంతుడు అయోధ్యా నగరంలోని అంగడి నందు సింధూరంను తీసుకొని దాని నంతటిని నువ్వుల నూనెతో పలుచగా చేసుకొని తన తలాతోకా అనుకోకుండా పాదాది శిర: పర్యంతము ఎక్కడను సందులేకుండా సింధూరం రాసుకొని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళాడు.

హనుమంతుని రూపం చూసి అక్కడి వారంతా ముసిముసినవ్వులు నవ్వుతుండగా, శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమను చేరదీసి ‘హనుమా! ఇదేమిటి‘ అని అడగగా, హనుమంతుడు ‘మీరు చిటికెడు సింధూరమును సీతమ్మవారికి అలంకరించుట చేతనే ామెకు వశపడితిరి కదా, చిటికెడు సింధూరంతోనే మీకు సౌభాగ్యం కలిగితే, మరి నేను శరీరం మొత్తం సింధూరం అలంకరించుకున్నాను. మరి మీరు నాకు వశపడేదరా లేదా ప్రభూ! మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కాదా” అని ఆనందంతో, సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు.

హనుమ పలుకులు విన్న శ్రీరాముడు, తన సభలోని వారందరూ వినేలా ‘ఆంజనేయా! నీవంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు. నీవు ధరించిన ఈ సింధూరాన్ని తిలకంగా ధరించిన వారికి, మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతే కాక నీవు సీతాన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు, నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తీ శ్రద్ధలతో నుదుట ఈ సింధూరం ధరిస్తారో, వారికి ఆయురారోగ్యములు, సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి’అని వరదానం చేశాడు. భక్త జనుల అభీష్టములు తీర్చేవాడు ఆంజనేయస్వామి. అందుకే ఆనాటి నుండి సింధూర ప్రియుడు అయినాడు.

ఇంట్లో పాటించాల్సిన-పాటించకూడని ఆచారాలు

కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వ కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలా మంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి.
- కొంత మంది వేళ పాళ లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతి వేళ్ళ గోళ్ళను కొరుకుతుంటారు. చేతి గోళ్ళను తిన్నవాడు విశానమును పొందుతారు.

- రెండు చేతులతోను తలగోక కూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకొనరాదు. శిరస్సును విడిచి కేవలము కంఠ స్నానము చేయరాదు. (శిరః స్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్ఠానము చేసి కొనవచ్చునని జాబాలి వచనము).

- లేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము - ఇవి తగవు. ఊరక మట్టిని మర్థించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, ఎదుటి వాని ఉన్న దోషములను కాని, లేని దోషములను కాని వెల్లడించు వాడు, శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందుదురు.

- ప్రాకారము కల్గిన గ్రామమును గాని, ఇంటిని కాని ద్వారము గుండా ప్రవేశింపవలయునే కాని ప్రాకారము దాటి ప్రవేశింపకూడదు. రాత్రులందు చెట్ల కింద ఉండరాదు. దూరముగా ఉండవలయును.

- ఎక్కువ కాలం జీవించాలనుకునే వాడు వెంట్రుకలను, బూడిదలను, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు.

- చాలా మంది సరదా కోసం పాచికలు (జూదము) ఆడుతారు అలా ఆడటం సరికాదంటున్నారు. పాదరక్షలను చేతితో మోసికొనిపోరాదు. పక్క మీద కూర్చుని ఏమియు తినరాదు. చేతిలో భోజ్య వస్తువును పెట్టుకొని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనము మీద పెట్టుకొని ఏ వస్తువును తినరాదు.

- రాత్రి సమయంలో నువ్వులతో గూడిన ఏ వస్తువును తినకూడదు. వస్తహ్రీనుడై పడుకోకూడదు. ఎంగిలి చేతితో ఎక్కడకును వెళ్ళరాదు.

- కాళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనము చేయవలయును. దాని వలన దీర్ఘీయువు కలుగును. తడి కాళ్ళతో నిద్రకు ఉపక్రమించకూడదు.

ద్రాక్షారామ చుట్టుపక్కల అనేక శివాలయాలు

ద్రాక్షారామ చుట్టుపక్కల అనేక శివాలయాలు దేవీమందిరాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే.
ఆ ఆలయాలన్నిటిని ఆకాశమార్గాన చూస్తే అన్ని కలిపి ఒక పద్మాకారం లో వుంటాయి. ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాల మందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు.
విశేషమేమిటంటే, ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలు లో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది
గ్రహదోష నివారణ కోసం  అభిషేకాలు చేయ దలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము,  లేదా జన్మనక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట .

మేషరాశి నుండి మీనరాశి వరకు అదే క్రమంలో ఆరాధించ వలసిన ఆలయాల సమాచారం.
మేష రాశి
మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాసగంగావరంలో వుంది. 

అశ్విని నక్షత్రం
పాదం ----------స్థలం --------   దేవీ దేవతల నామాలు

మొదటి---------బ్రహ్మపురి-------శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి
రెండవ ------- - ఉట్రుమిల్లి -------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భీమశంకర స్వామి
మూడవ------    కుయ్యూరు    శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ    దుగ్గుదూరు   శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

భరణి నక్షత్రం
మొదటి------కోలంక---------శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ-------ఎంజారం-------శ్రీ ఉమా సమేత కృపేశ్వర స్వామి
మూడవ------పల్లిపాలెం------శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
నాలుగవ------ఉప్పంగళ-------శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి

కృత్తికా నక్షత్రం
మొదటి-------నేలపల్లి---------శ్రీ మీనాక్షి దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి.

వృషభ రాశి
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున వృషభ రాశికి సంబంధించిన ఆలయం విలాసగంగావరం లో ఉన్నది.

కృత్తికా నక్షత్రం
రెండవ------అదంపల్లి------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
మూడవ-----వట్రపూడి------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ-----ఉండూరు------శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి

రోహిణీ
మొదటి-----తనుమల్ల--------శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
రెండవ-------కాజులూరు-------శ్రీ అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
మూడవ------ఐతపూడి--------శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
నాలుగవ -----  చీల    ---------శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

మృగశిర
మొదటి--------తాళ్ళరేవు------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.
రెండవ---------గురజానపల్లి------శ్రీ ఓం శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి

మిధున రాశి.
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్యమున మిధున రాశికి సంబంధించిన ఆలయం హసనాబాద్ లో ఉన్నది.
మృగశిర
మూడవ-------- అంద్రగ్గి-------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ--------జగన్నాధగిరి------ శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి

ఆరుద్ర
మొదటి-------పనుమళ్ళ------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ--------గొల్లపాలెం------శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి
మూడవ----వేములవాడ-----శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి
నాలుగవ------కూరాడ----------శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి

పునర్వసు
మొదటి-------గొర్రిపూడి (భీమలింగపాడు)----శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి
రెండవ--------కరప----------శ్రీ పార్వతవర్ధి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
మూడవ------ఆరట్లకట్ల------ శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లీశ్వర స్వామి
  
కర్కాటక రాశి

ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.

పునర్వసు
నాలుగవ------యెనమాడల--------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

పుష్యమి
మొదటి--------కాపవరం-------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
రెండవ---------సిరిపురం-------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
మూడవ-------వేలంగి----------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి
నాలుగవ--------ఓడూరు--------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి

ఆశ్లేష
మొదటి-------- దోమాడ--------శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి
రెండవ---------పెదపూడి-------శ్రీ శ్యామలాంబా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ-------గండ్రాడు--------శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ-------మామిడాడ-------శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీశ్రీ భీమేశ్వర స్వామి

సింహ రాశి
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున సింహ రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.

మఖ నక్షత్రం
మొదటి------నరసరావుపేట------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
రెండవ--------మెల్లూరు------------శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
మూడవ------అరికిరేవుల----------శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
నాలుగవ------కొత్తూరు------------శ్రీ పార్వతీ సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి

పుబ్బ నక్షత్రం
మొదటి--------చింతపల్లి---------శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
రెండవ---------వెదురుపాక------శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
మూడవ--------తొస్సిపూడి-------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ గోరేశ్వర స్వామి
నాలుగవ--------పొలమూరు-----ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

ఉత్తర నక్షత్రం
మొదటి----------పందలపాక--------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

కన్యా రాశి
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి వాయవ్యమున కన్యా రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం యూరుపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారికి అంకితం చేయబడ్డది.

ఉత్తర నక్షత్రం
రెండవ---------చోడవరం---------శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్త్తేశ్వర స్వామి
మూడవ-----నదురుబాడు--------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ------పసలపూడి---------శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ రాజరాజేశ్వరుడు

హస్త
మొదటి------సోమేశ్వరం--------శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ-------పడపర్తి------------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరుడు
మూడవ------పులగుర్త-----------శ్రీ పార్వతీసమేత శ్రీ వీరేశ్వర స్వామి
నాలుగవ------మాచవరం-------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

చిత్త నక్షత్రం
మొదటి-------కొప్పవరం--------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
రెండవ--------అర్థమూరు-------శ్రీ పార్వతీ సమేతశ్రీ అగస్తేశ్వర స్వామి

తుల రాశి
ద్రాక్షారామానికి పడమరగా  వున్న ఆదివారపుపేట లో తులారాశికి సంబంధించిన ఆలయం ఉన్నది.

చిత్త నక్షత్రం
మూడవ-------చల్లూరు------------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
నాలుగవ-------కాలేరు--------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

స్వాతి నక్షత్రం
మొదటి--------మారేడుబాక---శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
రెండవ---------మండపేట------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి
మూడవ-------గుమ్మిలూరు----శ్రీ ఉమాసమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
నాలుగవ------వెంటూరు-------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

విశాఖ నక్షత్రం
మొదటి-----దూళ్ళ-------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
రెండవ------నర్సిపూడి----శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి
మూడవ-----నవాబుపేట----శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి

వృశ్చిక రాశి
ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపుపేట లో వృశ్చికరాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరునికి అంకితం.

విశాఖ నక్షత్రం
నాలుగవ-------కూర్మపురం------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

అనూరాధా నక్షత్రం
మొదటి------పనికేరు--------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి
రెండవ-------చింతలూరు-----శ్రీ పార్వతీ సమేత శ్రీ పృధ్వీశ్వర స్వామి
మూడవ-----పినపల్ల---------శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
నాలుగవ-----పెదపల్ల-------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

జ్యేష్టా నక్షత్రం
మొదటి------వడ్లమూరు------శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
రెండవ--------నల్లూరు---------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ------వెదురుమూడి---శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ----- తేకి--------------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామి

ధనుస్సు రాశి
ధనుస్సు రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి నైఋతి లోఉన్నది.  నేలపర్తిపాడులోని శ్రీ అన్నపూర్నాసమేత కాశివిశ్వేశ్వర స్వామికి అంకితం

మూల నక్షత్రం
మొదటి---------యెండగండి-------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ----------పామర్రు-----------శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ--------అముజూరు--------శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ--------పానంగిపల్లి--------శ్రీ లలితాంబికా సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామి

పూర్వాషాఢ
మొదటి---------అంగర-----------శ్రీ పార్వతీ సమేత శ్రీ కనకలింగేశ్వర స్వామి
రెండవ---------కోరుమిళ్ళ--------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ-------కుళ్ళ-------------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ-------వాకతిప్ప--------శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి

ఉత్తరాషాఢ
మొదటి-------తాతపూడి---------శ్రీ పార్వతీసమేత శ్రీ మల్లేశ్వర స్వామి

మకర రాశి
మకర రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది.  కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.

ఉత్తరాషాడ నక్షత్రం
రెండవ---------మచర--------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
మూడవ-------సత్యవాడ------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ-------సుందరపల్లి----శ్రీ ఉమాసమేత శ్రీ సోమేశ్వర స్వామి

శ్రవణ నక్షత్రం 
మొదటి-------వానపల్లి-------శ్రీ ఉమాసమేత శ్రీ వైద్యనాధీశ్వర స్వామి
రెండవ--------మాదిపల్లి (మాడుపల్లి)---  శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి
మూడవ------వాడపాలెం-------శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ వీరేశ్వర స్వామి
నాలుగవ------ వీరపల్లిపాలెం----శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

ధనిష్ట
మొదటి--------వెల్వలపల్లి-------శ్రీ మహిషాసురమర్ధనీ సమేత శ్రీ రాజరాజనరేంద్ర స్వామి
రెండవ---------అయినవెల్లి-------శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

కుంభ రాశి
కుంభ రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం లోఉన్నది.  కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.

ధనిష్ట
మూడవ-------మసకపల్లి------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి
నాలుగవ-------కుందూరు------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

శతభష
మొదటి--------కోటిపల్లి---------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ--------కోటిపల్లి--------  శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామి
మూడవ------తొట్టరమూడి-----శ్రీ భ్రమరాంబా సమేత శ్రీమూల్లేశ్వర స్వామి
నాలుగవ------పాతకోట--------శ్రీ లోపాముద్రా సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

పూర్వాభాద్ర
మొదటి--------ముక్తేశ్వరం-----శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి
రెండవ---------శాసనపల్లి లంక----శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశ్రీ చౌడేశ్వర స్వామి
మూడవ--------తానెలంక-----------శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి

మీన రాశి
మీనరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది.  కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈఆలయం.

పూర్వాభాద్ర
నాలుగవ---------ఎర్రపోతవరం------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి

ఉత్తరాభాద్ర
మొదటి-------డంగేరు-----------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ------- కుడుపూరు------- శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
మూడవ------గుడిగళ్ళ---------శ్రీ ఉమాదేవీ సమేత శ్రీ మార్కండేయ స్వామి
నాలుగవ-----శివల-----------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ త్రిపురాంతక స్వామి

రేవతి
మొదటి----భట్లపాలిక-------శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
రెండవ-----కాపులపాలెం----శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి
మూడవ---- పేకేరు-----------శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
నాలుగవ---- బాలాంత్రం------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles