Tuesday 31 January 2017

16 విషయాలు మీకు ఎవరూ చెప్పరు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి


1. సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడరాదు?
ప్రభాతవేళ, సూర్యాస్తమయవేళ, మిట్టమధ్యాహ్న సమయమున రవిని సూటిగా చూడరాదు. అలాగే సూర్య మరియు చంద్రగ్రహణ సమయాల్లోనూ చూడరాదు. అట్టి సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవశరీర నిర్మాణానికి కీడును కలిగిస్తాయి.

2. శ్రీకృష్ణపరమాత్ముడు నెమలి ఫించాన్ని తలపై ఎందుకు ధరిస్తాడు?

సకల చరాచర సృష్టిలో సంభోగం చెయ్యని ఏకైక ప్రాణి నెమలి మాత్రమే. శ్రీకృష్ణునికి 16,000 వేలమంది గోపికలు. అన్ని వేలమంది గోపికలతో శ్రీకృష్ణుడు సరస సల్లాపాలు మాత్రమే ఆడాడు. అల్లరి చేసి గెలిచేవాడు. ఆ విషయాన్ని తెలియచేయటానికే శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరిస్తాడు. శ్రీకృష్ణుడు ఒట్టి అల్లరి కృష్ణుడు మాత్రమే.

3. మాతృ, పితృ, ఆచార్య, దైవ ఋషి రుణాలంటే?

పశుపక్ష్యాదుల్లా పుట్టగానే, కాళ్ళు రాగానే బైటికి తరిమెయ్యరు. తల్లీ, తండ్రి ఇద్దరూ జీవితకాలం సంపాదించిన ధనాన్ని పోగు చేసి ఇచ్చి, పెళ్లి కూడా చేసి ధర్మ, అర్థాలతో సుఖించే పరిస్థితులని సృష్టిస్తారు. ప్రేమతో పెంచుతారు. తల్లీ, తండ్రీ రుణం, ఎంత సేవచేసినా తీరదు. చేయాల్సిందల్లా ముసలితనంలో వారిని బిడ్డల్లా చూసుకోవటమే.
మల మూత్రాలు కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో తల్లి ఋణం తీర్చుకోవాలి. తాను సంపాదనతో నిస్వార్ధముతో పెంచి పెద్ద చేసిన తండ్రి ఋణం తీర్చుకోవాలి. లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, నేర్పినందుకు గురు ఋణాన్ని, మనకి బుద్ధినీ, కర్మనీ ఇస్తున్న దైవ ఋణాన్ని భక్తి ద్వారా ధర్మ మార్గం ద్వారా, సకల శాస్త్రాలనూ, ధర్మాలనూ గ్రంథాల ద్వారా మనకు అందచేసినందుకు ఋషి రుణాన్ని తీర్చుకోవాలి.తిరిగి తాను వివాహం ద్వారా అన్ని రుణాలన్నీ తీర్చి, తిరిగి తాను ఋణ పడటమే మానవ జన్మ.

4. హారతి వల్ల లాభము ఏమిటి?

గృహములోను, పూజాగదిలోనే కాదు, గుడిలోనూ, శుభకార్యాలప్పుడూ….పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను, క్రొత్త పెళ్లికూతురు గృహములోకి ప్రవేశించేటప్పుడూ హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. శుభాకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులూ, అంటువ్యాధులూ ప్రబల కుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించినశిస్తుందో, అలాగే మనం తెలిసీ సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం.

5.చిన్న పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు?

చినారుల పుట్టిన రోజు పండగ వేడుకలలో అలాగే అనేక శుభ కార్యాల్లో పాల్గొన్న పెద్దలకీ, పిల్లలకీ విభిన్నపద్ధతులలో దిష్టి తీస్తూ ఉంటారు. పిల్లలూ, పెద్దలూ ఘనవిజయాలు సాధించినప్పుడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు అతిగా నీరసించి డీలాపడినప్పుడు దిష్టి తీస్తారు. అలాగే పిల్లలకి పసుపూ, సున్నం కలిపినా అన్నంతో దిష్టి తీస్తుంటారు. బయటజనుల దృష్టిదోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే చిన్నపిల్లవాడు కలవరింతలు లేకుండా నిద్రపోవటమూ, నిద్రలో ఉలిక్కిపడుతూ లేవటం వంటి అవలక్షణాలు లేకుండా ఉంటాడు.

చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చూ అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల చుట్టూ అంతా చేరటంవల్ల చిన్నపిల్లలూ లేదా పెద్దలూ కోంత అస్వస్థతకు గురిఅవుతారు. అందుకే వివాహవేడుకలలోను, పుట్టిన రోజువేడుకలలోను విధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్ర నీళ్ళలో దిష్టి తీస్తారు. ఎర్రరంగు పదేపదే చూడటం వల్ల అనేక రోగాలు సమసిపోతాయి. మనసుకి ప్రశాంతతతోపాటు ధైర్య గుణంవస్తుంది.

6. ఎలాంటివేళల్లో భోజనాన్ని తినకూడదు?

గ్రహణం సమయమున అనగా సూర్యగ్రహాణానికి 12 గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహాణానికి 9 గంటల ముందుగా ఎటువంటి పదార్థాన్ని ఆహారంగా తీసుకోకూడదు.

7. ‘ఏడు’ సంఖ్య మంచిదా కాదా?

తిరుమల తిరుపతిలో కొండలు 7. ప్రత్యక్షదైవం సూర్య భగవానుడి నుంచి వచ్చే కిరణాలు 7, పాతాళం  మొదలైన క్రింది లోకాలు 7, భువర్లోకమ మొదలైన ఊర్ధ్వభాగంపై లోకాలు 7. అలాగే ద్వీపాలు 7. పెళ్ళిలో వధూవరులు ఇద్దరూ కలిసి వేసే అడుగులు 7. అగ్ని దేవుని నాలుకలు 7. బ్రహ్మోత్సవాలు జరిగేది 7వ నెలలో. సప్తస్వరాలు కూడా ఏడే. 7 సంఖ్యమంచిది కాదని కొందరి మూఢనమ్మకము. 7 కూడా మంచిదే. భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మనకోసమే. దాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనకి లభిస్తుంది.

8. దేవునికి దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి?

దీపారాధనకు ఆవునెయ్యి ఉత్తమము. మంచి నూనె మధ్యమము. ఇప్ప నూనె అధమము. ఆవు నెయ్యితో వెలిగించిన దీపము యొక్క ఫలితము అనంతము. అష్టైశ్వరాలూ, అష్టభోగాలు సిద్ధిస్తాయి. వెండి లేదా పంచలోహాలతోనూ, మట్టితో చేసిన దీపాలు అత్యుత్తమము. వేరుశెనగ నూనెతో దీపారాధన చేయరాదు. శ్రీమహాలక్ష్మికి ఆవునెయ్యి దీపమూ, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము చాలా ఇష్టము.

9. లక్ష్మీదేవి తామర పువ్వులోనూ, ఇరుప్రక్కలా ఏనుగులతోనూ ఎందుకు ఉంటుంది?

సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం. ఇక ఇరుప్రక్కలా వున్న ఏనుగులకు అర్థం ఏమిటంటే శ్రీమహాలక్ష్మీ ధనబలము గజబలమంతటిదని అర్థం చేసుకోమని పరమార్థం.

10. తిరుమల తిరుపతిలో పూలబావి ప్రత్యేకత ఏమిటి?

అద్దాల మంటపానికి ఉత్తరం దిక్కున ఉండి ఈ పూలబావి. స్వామి వారికి సమర్పించిన తులసీ, పూలదండలు, పువ్వులు ఎవ్వరికి ఇవ్వకుండా ఈ పూలబావిలోనే పడేస్తారు.

ఆపదవచ్చినప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య సొరంగ మార్గం ద్వారానే ఆ వెంకటేశ్వరస్వామిని శరణువేడాడు. స్వామి వారు ఆ ఆపద సమయంలో ఏకాంతంగా ఉన్నారు. తొండమానుడ్ని చూసి శ్రీమహాలక్ష్మీ సిగ్గుతో శ్రీమహా విష్ణువు వక్షస్థలంలో చేరింది. అదే సమయంలో భూదేవి తొండమానుడు కట్టించిన పూలబావిలోకి వెళ్ళి రహస్యంగా దాక్కుందని పురాణాల గాధ.

11. ఉత్తరం దిక్కున తలపెట్టి ఎందుకు నిద్రించరాదు?

మన భూమిలో గురుత్వాకర్షణశక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనమూ అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న ఆ శక్తి యొక్క తరంగాలు మన మెదడులో దాగి వున్న శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి. దానివలన అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పువస్తుంది. మెదడులో లోపాలు తల ఎత్తుతాయి. అలా కాకుండా తూర్పు పడమరల వైపు నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉంది మెరుగు పడుతుంది. రక్త ప్రసరణసరిగా జరిగి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది.

12. స్త్రీ తన కన్నా వయసు ఎక్కువ ఉన్న మగవారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి?

తన కన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంభోగం వలన పురుషునికి శక్తి తగ్గిపోతుందనేది అసత్యం. పురుషునికి ఆయుక్షీణం. స్త్రీకి సిగ్గు ఎక్కువ. కనుక ప్రేమతోలాలించి, బుజ్జగించాలంటే తనకన్నా చిన్నదవ్వాలి. స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు. కనుక సంసారాన్ని మోయలేదు. కష్టపడలేదు. పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబం యొక్క భారం స్త్రీ మీదే పడుతుంది. మగవాడిదే కుటుంబ భారమని చెప్పటానికే అనాదిగా ఈ ఆచారం. అందువల్లే భార్యకంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది మన పెద్దలు నియమం పెట్టారు.

13. పూజలో కొబ్బరికాయ క్రుళ్ళితే మంచిదా? కాదా?

పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదు. అపచారం అంతకన్నా కాదు తెలిసి చేసిన పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదేకాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్నితీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి.

14.విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగాంతమేనా?

శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. ధూమశకటాలు నడుస్తాయని, ముఖానికి రంగేసుకున్న వారు దేశనాయకులవుతారనీ, భర్తలేని స్త్రీ రాజ్యమేలుతుందనీ, త్రాగే మంచినీళ్ళు కొనుక్కుంటారనీ…ఆయన చెప్పిన వన్నీ జరిగాయి.  విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగం అంతమయిపోయినట్టే. అంత ఎత్తున కృష్ణమ్మ ఎగిస్తే ఇక భూమి మీద ఏం మిగులుతుంది?

15. కార్తీకమాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనవి ఏవి?

ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్ది అన్నము. మినుములు, పెసలు, శెనగలు, ఉలవలు; కందులు ఇవన్నీ వాడరాదు. అష్టమి నాదు కొబ్బరీ, ఆదివారము ఉసిరీ తినరాదు.

16. మంగళ, శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకివ్వరు?

సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము. అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గానీ, ఇతరులకు గానీ ఆపదసమయాల్లో ఈ నిమయం పనికి రాదు. ఇలా చెయ్యటంవల్ల మరింత ధనం పోతుంది.

ఇంటి దైవాన్ని మరచిపోతే?

ఒక భక్తుడు కంచి మఠంలోనికి ప్రవేశిస్తూ, తూలుతూ తడబడతూ క్రింద పడిపోబోయాడు. అతని అవస్థ చూసి అక్కడ ఉన్న వారు పట్టుకున్నారు. అయినా అతను నోట్లో నుండి రక్తం కక్కుకున్నాడు. అక్కడున్నవారు భయపడిపోయారు. అక్కడ రేగిన కలకలం పరమాచార్య స్వామి వారి చెవులను చేరింది.

వారు ఒక పరిచారికుని వంక చూసి “ఎందుకు అంత అలజడి అక్కడ?” అని అడిగారు.

మఠం మేనేజరు మహాస్వామి వారితో “ఎవరో భక్తుడు రక్తం కక్కుకున్నాడు” అని చెప్పాడు.

మహాస్వామి వారు మేనేజరుతో “అతనిదేవూరు? ఇప్పుడు ఎక్కడినుండి వస్తున్నాడు” కనుక్కోమన్నారు.

ఆ భక్తుడు తిరుచ్చి దగ్గర్లోని ఒక పల్లెటూరినుండి వచ్చాడు. చిదంబరంలోని నటరాజ స్వామి వారిని దర్శించుకుని కాంచీపురానికి వచ్చాడు. మహాస్వామి వారు ఆ పెద్దమనిషిని దగ్గర్లోని డాక్టరు దగ్గరకు తీసుకువెళ్ళమని చెప్పారు. రక్తం కక్కున్నాడు అని విన్న వెంటనే డాక్టరుగారు హెమొరేజ్ (రక్తస్రావం) వాల్ల ఇలా జరిగి ఉండొచ్చు అనుకున్నారు. హాస్పిటల్ లో చేర్పించమని సలహా ఇచ్చారు.

ఈ విషయాన్ని మహాస్వామి వారికి చేరవేసారు.

”ఇది హెమొరేజ్ కాదు. మీ నాన్నమ్మను అడిగితే అది వేడి చేయడం వల్ల అలా జరిగింది అని చెబుతారు. ఇంకొందరు దృష్టిదోషం వల్ల అలా జరిగింది అని చెబుతారు. నాకు తెలిసి ఈ పెద్దమనిషి వారి ఇంటి దైవం తిరువాచూర్ మదుర కాళి అమ్మన్. ఇప్పుడు వీరికి కాని వీళ్ల ఇంట్లో వాళ్ళకి ఇంటి దైవం విషయం గుర్తులేదు. కాని ఇప్పుడు వీరు అమ్మవారిని భక్తితో కొలవడం లేదు. కంచి కాళికాదేవికి పూజ చేసి ఇతనికి ప్రసాదం ఇవ్వండి. ఇతను చిదబరంలోని థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చాడు. అది తప్పు కదా? అంతే కాకుండా కాళి దేవి వారి ఇంటి ఆరాధ్యదైవం. మరి అటువంటప్పుడు కాళి దేవిని భక్తితో కొలవాలి కదా? సరే”

“అతనికి ఆరోగ్యం బాగుపడిన వెంటనే చిదంబరం వెళ్ళి థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోవాలి. వైద్యులు చెప్పినట్టు ఇతను అధిక రక్త పోటుతో బాధపడుతున్నాడు. అందుకే రక్తం కక్కున్నాడు. కావున అతని తిండిలో సాధ్యమైనంతవరకు ఉప్పు తగ్గించాలి.” ఇలా మహాస్వామి వారు చాలా సూచనలు చేసారు.

కాంచీపురం కాళి అమ్మవారి దేవస్థానం నుండి కుంకుమ తెచ్చి ఆ పెద్దమనిషి నుదుటిపైన రాసారు. అతన్ని శ్రీమఠం లోని హాల్లో పడుకోబెట్టారు. పరమాచార్య స్వామి వారు చెప్పినట్టు తరచుగా అతనికి చల్లటి నీటిని కొంచం కొంచం తాగడానికి ఇచ్చారు. రాత్రి అతను హాయిగా నిద్రపోయాడు. మరుసటి ఉదయం అతను మామూలుగా సంభాషించాడు. రాత్రి విశ్రాంతి వల్ల అతను కొంచం ఉత్సాహంగా కనపడ్డాడు. ఆయన మహాస్వామి వారి వద్ద ప్రసాదం తీసుకుని మేనేజరు గారికి ధన్యవాదాలు తెలిపి వెళ్ళిపోయాడు.

ఇంటికి వెళ్ళిన తరువాత తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని అతను మేనేజరు గారికి ఉత్తరం రాసాడు. ఇంకా

“నేను ఇక ఎప్పుడూ మా ఇంటి దైవాన్ని మరచిపోను. కాని నాకు ఈనాటికి అర్థం కాని విషయం ఏంటంటే మహాస్వామి వారికి ఎలా తెలుసు నేను చిదంబరంలో థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోలేదని?” అది మనకి కూడా అంతుచిక్కని విషయం.

మన ఇంటి దైవం తరతరాలుగా మన చేత పూజింపబడుతూ మనల్ని రక్షిస్తున్న దైవం. కొత్త కొత్త దేవుళ్ళ మోజులో పడి ఇంటి దైవాన్ని ఎన్నటికి మరువరాదు. తల్లితండ్రులు కూడబెట్టిన ఆస్తులు కావాలి. కాని వారు అర్చించిన దైవం మాత్రం వద్దా?.

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కార్తీక సిరి "ఉసిరి"

కార్తీక మాసంలో చలి పెరుగుతుంది. అపుడు  కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవ కాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ తగుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదే! ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మిక.బావుల్లో ఉసిరి విత్తనాకు పోస్తారు. దీనివల్ల ఆనీరు శుధ్ధి అవుతుందని పూర్వుల నమ్మిక.

కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజనం చేస్తారు.ఈ విధంగా పూర్వం స్నేహితులు బంధువులు కలిసి వేద పండితులను సర్కరించడం ,పూజాదికాలు చేయడం వల్ల పరస్పర స్నేహ భావన, బంధుభావన , రోజువారీ పనినుండీ కాస్తంత సేదతీరడం జరిగేవి.

కార్తికమాసం వచ్చిందంటే చాలు... వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడుందా అని అన్వేషిస్తుంటారంతా. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరిచెట్టు కింద ఒక్కపూటయినా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయినా వెంట తీసుకెళ్లి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తికంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఉసిరిచెట్టులో కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగానూ కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృతబిందువులు పొరబాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. ఇది సకల మానవాళినీ రక్షిస్తుందనీ విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది చరకసంహిత. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు. అంతటి మహత్తరమైనదిగా భావించే ఆ చెట్టు ఫలం మరెంతటి ఉత్తమోత్తమమైనదో వేరే చెప్పాలా? అందుకే ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం.

ఉసిరిని సంస్కృతంలో ఆమ్లాకి లేదా ధాత్రీఫలం అనీ పిలుస్తారు. ఏదో ఆపిల్ మాదిరిగానో అరటిపండులానో ఉసిరి గబగబా కొరికి తినేసేదేం కాదు. ఎందుకంటే పులుపు దాని ఇంటిపేరు. కానీ ఆ పులుపే ఈ పండుకున్న బలం. కమలారసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్-సి 20 రెట్లు ఎక్కువ. అలాగని ప్రొటీన్లు లేవనుకునేరు... ఆపిల్‌లోకన్నా మూడురెట్లు ఎక్కువ. ఇతర పండ్లలోకన్నా యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీన్ని సర్వదోషహర అనీ పిలుస్తారు. శీతకాలం నుంచి వేసవివరకూ వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాదిపొడవునా వాడతారు. కొందరు పంచదారపాకంలో మురబ్బా రూపంలో నిల్వచేసుకుని తింటారు. నిల్వపచ్చడి రూపంలో వాడుకున్నా ఉసిరి అద్భుత ఔషధమే.

అయితే ఉసిరిలో మనకు తెలిసి రెండు రకాలున్నాయి. ఒకటి పుల్లని రాచ ఉసిరి, మరొకటి చేదూ తీపీ వగరూ ఘాటూ పులుపూ కలగలిసినట్లుండే ఉసిరి. రాచ ఉసిరిని కేవలం తినడానికో పులిహోరకో మాత్రమే వాడతాం. ఈ ఉసిరి పొడిని దుస్తుల అద్దకాల్లోనూ ఎక్కువగా వాడతారు. కానీ ఉసిరిలో పండేకాదు, వేరు నుంచి చిగురు వరకూ ప్రతీదీ ఔషధమే.

ఉసిరితో తయారు చేసిన మాత్రలు వాత, పిత్త, కఫ రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి.  ఉసిరిని నిత్యం వంటల్లో లేదా ఉదయాన్నే తిన్నా మనకు మంచి శక్తి, ఆరోగ్యం వస్తుందనడంలో ఎంత మాత్రం అతిశ యోక్తి కాదు. ఉప్పు లో ఎండ బెట్టిన ఉసిరిని నిల్వచేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్ప రిస్తూవుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది, ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. ప్రతి ఇంటిలో  ఉసిరిని పెంచితే ఆగాలికే ఆరోగ్యం లభిస్తుందని శాస్త్రజ్ఞులమాట. . భార తీయ వాస్తుశాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇంటి పెరటిలో గనుక ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటి వాస్తుదోషాలు ఏవైనా ఉంటే  హరిస్తుందని జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం చెప్తున్నాయి.

ఉసిరి కంటిచూపును మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. జ్వరం వచ్చి పచ్చెం పెట్టే సమయం లో నూ, బాలింతకూ పచ్చం పెట్టేప్పుడూ పాత చింతకాయ పచ్చడితోపాటుగా ఉసిరి కూడా ఎండు మిర్చితో ,ఇంగు వ వేసి చేసి పెడతారు. రక్త శుధ్ధికి ఇది మంచి మందుగా పని చేస్తుంది.

ఆదిశంకరులవారు ఆశువుగా చెప్పిన  కనక ధారా స్తవం  మనకు ప్రతిరోజూ చదవ దగ్గ స్తోత్రరాజం.శంకరులు బాల బ్రహ్మ చారిగా ఏడెనిమిదేళ్ళ వయస్సులో భిక్షకోసం ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిల్చి ' మాతా బిక్షం దేహి 'అని  కేకవేయగా ఆపేద బ్రాహ్మణి రెండో వస్త్రం సైతం లేక చీర ఆరేవరకూ ధరించిన చిన్న వస్త్రంతో బయ టకు రాలేక తన ఇంట ఉన్న ఒకేఒక ఎండిన ఉసిరికాయను తన లేమికి చింతి స్తూ ఆబ్రహ్మచారి జోలెలో తన పూరి పాక తలుపు చాటు నుంచీ విసిరివేస్తుంది. శంకరులు ఆమె దారిద్యాన్ని గ్రహించి, అంత లేమిలోనూ తనకున్న ఒకే ఒక ఉసిరికాయను త్యాగ భావంతో తనకు దానం చేసినందుకు సంతసించి ' కనక ధారాస్తవం ' ఆశువుగా చదువుతారు. వెంటనే లక్ష్మి కరుణీంచి ఆమె ఇంట బంగారు ఉసిరి కాయలవాన కురిపిస్తుంది. ఇల్లు నిండిపోతుంది. త్యాగానికి ఋజువు , ఆభావనను గ్రహించి కరుణించిన శంక రులవారి మనస్సూ ఈ కధ ద్వారా మనకు తెలుస్తాయి. అదే కనక ధారా స్తవం 'గా భక్తులు ప్రతిరోజూ చదివి సంపదలు పొందుతారు.

శ్రీ విజయగణపతి దేవస్థానం ఖమ్మం

🚩శ్రీ విజయగణపతి దేవస్థానం ఖమ్మం 🚩

జాతకం లేని వారికి శాంతులు

1)జాతకం లేని వారికి శాంతులు అంటే పుట్టిన సమయం లేని వారికి. ఐతే జాతకం ఉన్న వాళ్ళుకూడా చేసుకోవచ్చును. ఆదిత్య హృదయం: ఇది సూర్యునికి సంభందించినది. ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేసించినాడు. దీనిని రోజూ ప్రాతః సమయమున పటించుట వలన ఆయురారోగ్యాలను, అష్ట ఐ స్వర్యాలను పొందుతారు. మరియూ మనిషిలో దాగిఉన్న కామ,క్రోధాది అంతః శత్రువులను నాశనం చేస్తుంది.పాపాలను నాశనం చేస్తుంది. చింతల నుండి, దుఃఖముల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి నిత్యం జపిస్తే విజయం తప్పక లభిస్తుంది. ఇది పటించిన పిదపనే రాముడు, రావణుని పై విజయం సాదించాడు.గోధుమలతో చేసిన పదార్ధములు,క్యారెట్,రాగి చెంబులో వాటర్ త్రాగటం వలన కూడ సూర్య గ్రహా దోషాలు తొలుగుతాయి.
2)రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం: జీవితంలో మనకు ఎదురైనా అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే "రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం" నలుబై ఒక రోజులు పారాయణ చేస్తూ ,నవగ్రహాలకు రోజూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి. చివరి రోజు కందులు,యెర్ర గుడ్డ,ధనము దక్షిణగా పెట్టి,కుజునకు మీపేరు మీద అష్టోత్తరం చేఇంచండి. మీ అప్పులు తప్పక తీరు తాయి.
3) మీకు వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తూ, అప్పులు వసూలుకాకుండా ఉండటం జరుగుతోందా? ఐతే మీరు "విష్ణు సహస్ర నామ స్తోత్రం" నలుబై ఒక్క రోజులు పారాయణ చెయ్యండి. సాయంత్రం వేళ రోజూ చేస్తే ఇంకా మంచిది. చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్లి గోత్ర నామాలతో స్వామికి అష్టోత్తరం చేఇంచండి. మీ భాదలు తగ్గి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.
4) మీకు వివాహమై ఎంతో కాలమైనా సంతానము లేదా? ఐతే మీరు ఒకసారి కాళహస్తి వెళ్లి రాహు,కేతు,కుజ గ్రహాలకు "సర్ప దోష నివారణ పూజ" చేయిన్చండి. తర్వాత ఎక్కడైనా నాగ ప్రతిష్ట చేఇంచండి. కర్నాటక రాష్ట్రంలో నున్న విదురాస్వద్ధలో చేఇస్తే ఇంకా మంచిది. (లేదా)" సంతాన గోపాలకృష్ణ వ్రతం" నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంటిలో చెయ్యండి. వీలుంటే రెండు శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది. తప్పక సంతానం కలుగుతుంది.
5)వివాహం ఆలస్య మవుతోందా? ఐతే మీరు "రుక్మిణి కల్యాణం" పారాయణ చెయ్యండి. (లేదా) నలుభై ఒక్క రోజులు ,రోజుకి నలుభై ఒక్క ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి, చివరి రోజు నవగ్రహాలకు పూజ చెయ్యండి.ఐతే నవగ్రహాలకు తిరిగే మొదటిరోజు మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి. తప్పక వివాహము జరుగుతుంది.
6)ధనమునకు ఇబ్బంది పడుతున్నారా? ఐతే ధన కారకుడైన సాయి బాబా పారాయణ నలుభై ఒక్క రోజులు చేస్తూ, ప్రతిరోజూ సాయిబాబా మందిరమునకు వెళ్లి, ఆలయమును శుబ్రపరుస్తూ(అంటే భక్తులు పారవేసిన టెంకాయ చిప్పలు,అరటి తొక్కలు,ప్రసాదం తిన్న ఆకులు) బాబాని దర్శించుకోవాలి. నలుభై ఒకటవ రోజు బూంది ఒకకిలో పావుకిలో బాబాకి నైవేద్యం పెట్టి, పేదలకు పంచండి. మీ ఇబ్బందులు తగ్గిపోతాయి.
7)డబ్బు ఇబ్బందులకు ఇంకొక శాంతి ప్రక్రియ: ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున శివునకు "ఏకన్యాస రుద్రాభిషేకం" చెయ్యండి. అలాగా ఎనిమిది మాస శివరాత్రులు శివునకు రుద్రాభిషేకాలు చేఇంచండి. మీ ధన ఇబ్బందులు తప్పక తొలిగి పోతాయి.
8)ధనము బాగా సంపాదించాలి అనుకున్న నిత్యమూ "శ్రీ సూక్తము" పారాయణ చేయవలెను.
9)హనుమాన్ చాలీసా : హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు క్షణంలో నెరవేరుతవి. అటువంటి కల్పవృక్షం దరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం "హనుమాన్ చాలీసా". ఈ హనుమాన్ చాలీసాను సాక్షాత్తు పరమేశ్వరుని ఆదేశానుసారం శ్రీ గోస్వామి తులసీదాసు గారు రచించిరి. ఈ హనుమాన్ చాలీసాను దినమునకు పదకొండు పర్యాయములు చొప్పున మండలం(నలుభై రోజులు) పారాయణం చేసిన సర్వ కార్యసిద్ధి కలుగును. ఒకే ఆసనమున కూర్చుని నూట ఎనిమిది పర్యాయములు పటించిన విశేష కార్యసిద్ధి కలుగును. నిత్యమూ మూడు వేళలా ఒక పర్యాయము చదివిన వారి యోగక్షేమములు భక్త రక్షకుడగు శ్రీ హనుమంతుడు తాను స్వయంగా చూచుకొనును.
✍కొదమసింహం భరద్వాజ్✍

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles