Wednesday 18 November 2015

కార్తీకపురాణం 13 వ అధ్యాయము

13 వ అధ్యాయము
కన్య దన ఫలము
ఓ జనక చక్రవర్తీ! కార్తీక మాసములో యింకనువిధిగా చేయవలసిన ధర్మములు చాల యున్నవి. వాటిని వివరించెదను. సావధాను డై అలకి౦పుము. కార్తీక మాసములో నదీస్నాం ముఖ్యము. దాని కంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒక వేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్ష తలు , దక్షణ తా౦బూలాది. సంభావనలతో తృప్తి పరచినాను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన యెడల యెంతటి మహా పాపములు చేసియున్నాను, అ పాపములన్నియు పోవును.ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిన నూ పై చెప్పినట్లుగా ఒక బ్రహ్మని బాలునికి ఉపనయనము చేసిన౦దు వలన వచ్చు ఫలమునకు సరితుగావు. అంత కన్న ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసములో భక్తి శ్రద్దలతో కన్య దానము చేసిన యెడల తను తరించుటయే గాక తన పితృ దేవతలను కూడా తరింప జేసినా వాడగును. ఇందులకొక యితిహాసం గలదు. చెప్పెదను. శ్రద్దగా అలకి౦పుము.
సువీర చరిత్రము
ద్వాపర యుగములో వంగ దేశములో గొప్ప పరాక్రమ వంతుడు, శూరుడు అయిన " సువిరు"డను ఒక రాజుండెను. అతనికి రుప వతియను భార్య కలదు. ఒక సారి సువిరుడు శత్రు రాజులచే ఓడింప బడిన వాడయి. భార్యతో అరణ్యమునకు పారిపోయి ధన హినుడయి నర్మదా నదీ తీరమందు పర్ణ శాలను నిర్మించుకొని కంద మూలా ఫలాదులను భక్షించుచు కాలము గడుపు చుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. అ బిడ్డను అతి గారాబముతో పెంచు చుండిరి.
క్షత్రియ వంశమందు జన్మించిన అ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయిన ప్పటికి శుక్ల పక్ష చంద్రు నివలెది నదినాభి వృద్ధి నొందుచు, అతి గారబముతో పెరుగు చుండెను, ఆమె చూచు వార లకు కనుల పండువుగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలదీ, బాలికకు నిండు యౌవన దశ వచ్చెను. ఒక దినము వాన ప్రస్థుని కుమారుడా బాలికను గాంచి అనే అంద ఛందములకు పరవశుడై అ బాలికను తన కిచ్చి పెండ్లి చేయమని అ రాజునూ కోరెను. అందులకా రాజు' ఓ ముని పుత్రా! ప్రస్తుతము నేను కడు బిద స్థితిలో నున్నాను. అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తోలుగుటకు గాను నాకు కొంత దానమిచ్చిన యెడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు'నని చెప్పగా తన చేతోలో రాగి పైసా యైన నూ లేకపోవుటచే బాలిక పై నున్న మక్కువతో అ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి, కుబేరుని మెప్పించి దన పాత్రా సంపాది౦చెను. రాజు అ పాత్రను పుచ్చుకొని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరిని అత్త వారింటికి పంపెను.అటులా ముని కుమారుడు భార్యను వెంట బెట్టుకొని వెళ్లి తల్లి దండ్రులకు నమస్కరించి అంత వరకు జరిగిన వృత్తంత మంతయు చెప్పి భార్యతో సుఖమనుభావించు చుండెను. సువిరుడు ముని కుమారుడి చ్చిన దన పాత్రను తీసుకోని స్వేచగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా వుండెను. యతుల కొంత కలం జరిగిన తర్వాత అ రోజు భార్య మణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరుల యెవరి కైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచు చుండెను.
ఒకానొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానర్ధమై వచ్చుచు దారిలో నున్న సువిరుని కలుసుకొని' ఓయీ! ని వెవ్వడవు? నీ ముఖ వర్చసు చూడ రాజ వంశము నందు జన్మించిన వాణి వలె నున్నావు. నివి యరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమి?" అని ప్రశించగా, సువిరుడు" మహానుభావా! నేను వంగ దేశమును నేలుచుండేది సువిరుడను రాజునూ. నా రాజ్యము శత్రువులాక్రమించుటచె భార్య సమేతముగా నీ యడవిలో నివసించు చున్నాను. దరిద్రము కంటె కష్ట మేదియూనూ లేదు. పుత్రా శోకము కంటె గొప్ప దుఖము లేదు. అటులనే భార్య వియోగము కంటె గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్య భ్రష్టుడని యి నందున యీ కారడవిలో నె సకుటుంబముగా బ్రతుకు చున్నాను. నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకిచ్చి, వాణి వద్ద కొంత దానము పుచ్చు కొంటిని. దానితోనే ఇంత వరకు కాలక్షేపము చేయుచున్నాను" అని చెప్పగా, ' ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మము లలోచి౦పక కన్య నమ్ముకొంటివి. కన్య విక్రయము మహా పాతకములలో నొకటి, కన్యను విక్రయిన్చున వారు' అసి పత్ర వాన' మను నరక మనుభావి౦తురు. ఆ ద్రవ్యములతో దేవముని, పితృ దేవత ప్రిత్యర్ధము యే వ్రతము చేసినాను వారు నశి౦తురు. అది యూను గాక కన్య విక్రయము చేసిన వారికీ పితృ దేవతలు పుత్ర సంతతి కలుగ కుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్ధ మగుటయే గాక అతడు మహా నరక మనుభావి౦ చును. కన్య విక్రయము జేసినా వారికీ ఎత్తి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కా ణి౦చి యే యున్నారు. కావున, రాబోయే కార్తీక మాసమున ణి రెండవ కుమార్తెను ణి శక్తి కొలదీ బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు, ధర్మభుద్ది గల వణికి కన్య దానము చేయుము. యతుల చేసిన యెడల గంగ స్నాన మొనరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందు టయే గాక, మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలిగి పోవును" అని రాజునకు హితోప దేశము చేయగా అందుక రాజు చిరు నవ్వు నవ్వి " ఓ ముని వర్యా! దేహ సుఖము కంటె దానధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండగా భార్య బిడ్డలను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జరా విడువమా౦టారా? ధమను, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణి౦ప గలరు కానీ ముక్కు మూసుకొని, నోరు మూసుకొని, బక్క చిక్కి శల్య మైయున్న వారిని లోకము గుర్తిస్తుందా? 
గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన, నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధన మేవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కానీ, కన్య దానము మాత్రము చేయను' అని నిక్కచిగా నిదివేను. ఆ మాటలకూ సన్యాసి ఆశ్చర్య పడి తన దారిన వెడలిపోయెను. మరి కొన్ని దినములకు సువిరుడు మరణించెను. వెంటనే యమ భటులు వచ్చి వానిని తీసుకొనిపోయి, యమ లోకములో అసి పత్ర వనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా భాదించిరి. సువిరుని పుర్వికుడై నా శ్రుత కీర్తి యను రాజు ధర్మ యుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గ మందు సర్వ సౌఖ్యములు అనుభవించు చుండెను. సువిరుడు చేసిన కన్య విక్రయము వలన ఆ శ్రుత కీర్తిని కూడా యమ కింకరులు పాశాములతో బంధించి స్వర్గము నుండి తీసుకోని వచ్చిరి. అంతటా శ్రుత కీర్తి " నేనెరిగున్నత వరకును ఇతరులకు ఉపకారము చేసి ధన ధర్మదులు, యజ్ఞ యాగాదు లోనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె? " నని మనమునందు కొని నిండు కొలువు దీరి యున్న యమ ధర్మ రాజు కదా కేగి , నమస్కరించి " ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు, ధరముర్తివి, భుద్ది శాలివి. ప్రాణ కోటి నంటాను సమ౦గా జూచు చుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసి యుండలేదు. నన్ను స్వర్గము లోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణ మేమి? సెలవిండు' అని ప్రాధేయ పడెను. అంత యమ ధర్మ రాజు శ్రుత కీర్తిని గాంచి' శ్రుత కీర్తి! నీవు న్యాయ మూర్తివి, ధర్మజ్ఞుడవు, ని వెతువంటి దురాచారములూ చేసి యుండలేదు. అయిన నేమి? నీ వంశియుడగు సువిరుడు తన జ్యేష్ట పుత్రికను దానమున కాశించి అమ్ముకోనెను. కన్య నమ్ముకొనే వారి పూర్వికులు యిటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారున్ను వరెంతటి పుణ్య పురుషులైనను నరకమనుభావించుట యే గాక, నిచ జన్మ లెత్త వలసి యుండును. నీవు పుణ్య త్ముడ వాణియు ధర్మతుడా వాణియు నేనేగుడును గణ, నీ కోక ఉపాయము చెప్పెదను. నీ వంశీ యుడగు సువిరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచూన్నది. నా యశిర్వా దాము వలన నీవు మనవ శరీరము దాల్చి, అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శిలవంతుడునగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాల౦కృత కన్య దానము చేయుచు, యతుల చేసిన యెడల నీవు, నీ పూర్వికులు, సువిరుడు, మీ పితృ గణములు కూడా స్వర్గ లోకమున కెగుదురు. కార్తీక మాసములో సాల కృత కన్య దమను చేసిన వాడు మహా పుణ్యాత్ముడుగాను. పుత్రిక సంతానము లేనువారు తమ ద్రవ్యముతో కన్య దానము చేసినను, లేక విది విధానముగా అబోతునకు వివాహ మొనర్చిను కన్య దన ఫలమబ్భును. కనుక, నీవు వెంటనే భూలోకమున కేగి నేను తెలిపి నటుల చేసితి వేణి ఆ ధర్మ కార్యము వలన న పితృ గణము తరిం తుర పోయి రమ్ము ' అని పలికెను.
శుర్తి కీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకోని నర్మదా తీరమున ఒక పర్ణ కుటిరములో నివసించు చున్న సువిరుని భార్యను, కుమార్తెను చూచి, సంతోష పడి, ఆమెతో యవ్వతి విషయములు వివరించి కార్తీక మాసమున సువిరుని రెండవ కుమార్తెను సాలం కృత కన్య దన వివాహము చేసెను. యతుల కన్య దానము చేయుట వలన సువిరుడు కూడా పాప విముక్తుడై స్వర్గ లోకములో నున్న పితృ దేవతలను కలసి కొనెను.
కన్య దానము వలన మహా పాపములు కూడా నాశన మగును. వివాహ విషయములో వారకి మాట సహాయము చేసినను, పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యా దానము చెయవలయునని దీక్ష భుని ఆచరించిన వాడు. విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి యుండి వుదసినత చూపు వాడు శాశ్వత నరకమున కేగును.
ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి 
త్రయోద శాద్యయము - పదమూడో రోజు పారాయణము సమాప్తము.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles