Wednesday 18 November 2015

కార్తీకపురాణం 16 వ అధ్యాయము

16 వ అధ్యాయము
స్తంభ దీ పప్రశంసవశిష్టుడు చెబుతున్నాడు-
"ఓ రాజా! కార్తిక మాసము దామోద రునికి అత్యంత  ప్రీతికర మైన మాసము. ఆ మాసముందు స్నా, దాన , వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక  మాసమందు తనకు శక్తి వున్నా దానము చేయరో , అట్టి వారు రౌర వాది నరక బాధ లు పొందుదురు. ఈ నెలది నములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆవిధ ముగానే నెలరో జులలో ఏ ఒక్క  రొజూ  విడువకుండ, తులసి కోట వద్ద గాని - భగవంతుని సన్నిధ నిగాని దీ పారాద న చేసిన యెడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ద పౌర్ణమి రోజున నది స్నాన మాచరించి, భగవంతుని సన్నీధ యందు దూ పదీ ప నైవే ద్యములతో దక్షి ణ తంబులాదులు, నారి కేళ ఫలదానము జేసిన యెడల - చిర కాలమునుండి సంతతిలేనివారికి పుత్రా సంతానము కలుగును.
సంతానము వున్న వారు చేసిన చో సంతాన నష్టము జరుగదు . పుట్టిన బిడ్డలు చిరంజీవులై యు౦దురు. ఈ మాసములో ద్వజ స్తంభ మునందు ఆకాశ దీ పమునుంచిన వారు వైకుంఠ మున సకల భోగములు అనుభ వింతురు. కార్తీక మాసమంతయు  ఆకాశ దీ పముగాని, స్తంభ దీ పాము గాని వుంచి నమస్కరించిన స్త్రీ  పురుషులకు  స క లైశర్యములు కలిగి , వారి జీవితము ఆనంద దాయకమగును . ఆకాశ దీపము పెట్టు వారు శాలిదాన్యంగాని, నువ్వులుగాని ప్రమిద అడుగును పోసి దీ పముంచ వలమును. దీ పము పెట్ట డానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టు నివారును, లేక దీ పం పెట్టువారి పరిహసమడు వారును చుంచు జన్మ  మెత్తుదురు ఇందులకొక కథ కలదు చెప్పెదను  వినుము.
దీ ప స్టంభ ము విప్రుడ గుట  
ఋషులలో అగ్ర గణ్యుడ న పేరొంది న మంతగ మహాముని ఒక చోట అశ్రమాన్నిఏర్పర రచుకొని, దానికి  దగ్గరలో నొక విష్ణు మంది రాన్నికూడా నిర్మించుకొని, నిత్యమూ పూజలు చేయుచుండెను. కార్తీక  మాసములో ఆ యా శ్రమము చుట్టు ప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము అలయద్వారాల పై ది  పాములు వెలిగించి, కడు భక్తీ తో శ్రీ హరిని పూజించి వెళ్ల చుండెడి వారు ఒక నాడు ఆ మునులలో ఒక వృద్దడు తక్కిన మునులని జూచి " ఓ సిద్దు లారా! కార్తిక సములో హరి హరాదుల ప్రితికోరకు స్తంభ దీ పము నుంచిన చో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంద ని మన కందరకూ తెలిసిన విషేయమె కదా!
రేపు
కార్తీక శుద్ధ  పౌర్ణమి . హరి హరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్త౦భుపాతి,
దాని పై దీ పమును పెట్టుదము. కావున మన మందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభ ము తోడ్కుని వత్త ము, రండు " అని పలుక గా అందరు పర మానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి. దానిపై శాలి ధాన్యముంచి ఆవును నేతితి నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీ పము వెలిగించిరి . పిమ్మట వారందరూ కూర్చోండి పురాణ పరనము చెయుచుండ గా ఫళ ఫళ మును శబ్ద ము వినిపించి, అటుచూడ గా వారు పాతిన స్తంభ ము ముక్క లై పడి, దీ పము ఆరి పోయి చెల్లచెదురై పడి యుండెను . ఆ దృశ్య ము చూచి  వారందరు ఆశ్చర్యము తో నిలబడి యుండిరి. అంత లో ఆ స్తంభ మునుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వార తనిని జూచి " ఓయీ నీ వేవడవు? నీవీ స్తంభ మునుండి యేలా వచ్చితి :?  నీ వృతంత మేమి" అని ప్రశించిరి. అంత, ఆ పురుషుడు వారందరకు నమస్కరించి " పుణ్యాత్ములారా! నేను క్రిందటి జన్మమందు  బ్రహ్మణుడను . ఒక జమిందారుడను. నా పేరు ధన లో భుడు. నాకు చాలా యై శ్వర్య  ముండుటచే మదాంధుడ నై న్యాయాన్యాయా విచక్షేణలు లేక ప్రవర్తించితిని. దుర్భు ద్దు లలవడుటచే వేద ములు చదువక శ్రీ హరి ని పూజింపక, దాన ధర్మాలు చేయక మెలగి తిని. నేను నా పరి వారముతో కూర్తుండి యున్న సమయమున నే విప్రుడ యినా వచ్చినన్ను ఆశ్ర యించిన ను ఆత నిచె  నా కళ్ళు కడిగించి, ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకో మని చెప్పి, నానా దుర్భా షలాడి పంపుచుండే వాడ ను. నేను వున్నా తాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడ ని చెప్పడి వాడ ను. స్త్రీ లను , పసిపిల్ల లను హిన ముగా చూ చుచుండడి వాడెను. అందరును నా చేష్టలకు భయపడు వారే కాని, నన్నే వరును మంద లింపలేక పోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులేక పోయెడి ది.దాన ధర్మములు మెట్టి వో నాకు తెలియవు. ఇంత దుర్మార్గడ వై, పాప్తి నై అవ సాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభ వించి, లక్ష జన్మలముందు కుక్క నై, పది వేల జన్మలు కాకి నై, ఐదు వేల జన్మలు తొండ నై, ఐదు వేల జన్మలు పెడ పురుగు నై, తర్వాత వృక్ష  జన్మ మెత్తి కి కారణ్య ముందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొన లేక పోతిని. ఇన్నాళ్ళు మీ దయ వలన స్తంభముగా నున్న నేను నారా రూప మెత్తి జన్మాంతర జ్ఞానీ నైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని. నన్ను మన్ని౦పు " డ ని వేడుకొనెను.
ఆ మాట లాలకించిన, మునులందరు నమితా శ్చర్య మొంది " ఆహా! కార్తీక మాస మహిమ మంత గొప్పది అది యునుగాక, కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళూ, స్త౦భ ములు కూడా మన కండ్ల యెదుట ముక్తి నొందు చున్నవి.    విటన్ని౦టి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీప ముంచిన మునుజునకు వైకుంట ప్రాప్తి తప్పక సిద్ధించును. అందులననే యీ స్త౦భమునకు ముక్తి కలిగిన" దాని మునులు అనుకోను చుండగా, ఆ పురుషుడా మాట లాలకించి" ముని పుంగవులారా! నాకు ముక్తి కలుగు మార్గమే దైనా గలదా? ఈ జగంబున నెల్లరుకు నెటుల కర్మ బంధము కలుగును? అది నశి౦చు టెట్లు? నా యీ సంశయము బాపు"డని ప్రార్ధించెను. అక్కడ వున్న మునిశ్వరుల౦ దరును తమలో నోకడగు అంగీర సమునితో " స్వామి! మీరే అతని   సంశయమును తీర్చ గల సమర్ధులు గాన, వివరించు"డని కోరిరి. అంత నా౦గీర సుడిట్లు చెప్పు చున్నాడు.

ఇట్లు స్కాంద పురాణా ౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి
షోడ శా ధ్యాయము - పద హరో రోజు పారాయణము సమాప్తం.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles