Thursday 19 November 2015

కార్తీకపురాణం 30 వ అధ్యాయము

30 వ అధ్యాయము
కార్తిక వ్రాత మహిమ్నా ఫల శ్రుతి నైమిశారణ్య ఆశ్రమములో శౌని కాది మహా మునుల కందరకు సుత మహా ముని తెలియ జేసిన విశ్నుమహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయి నోళ్ళ కొని యాడిరి. శౌని కాది మునులకుక్ ఇంకను సంశయములు తిరనందున, సుతుని గాంచి" ఓ ముని తిలకమా! కలియుగ మందు ప్రజలు అరి షడ్వర్గ ములకు దాసులై, అత్యాచార పరులై జీవి౦ చు చు సంసార సాగరము తరింప లేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణో పాయమే దైన కలదా?ధర్మము లన్నిటిలో మోక్ష సాధనా కుప కరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలో నూ ముక్తి నొంసంగు వుత్తమ దైవ మెవరు?మానవుని అవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్య ఫల మిచ్చు కార్య మేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించు చున్న మానవులకు సులభముగా మోక్షము పొంద గలవు పాయమేమి? హరి నమ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశాయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియ జేయు" మని కోరిరి. అంత సుతుడా ప్రశ్న నాలకించి" ఓ మును లారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకోనవలసినవి. కలియుగ మందలి మానవులు మంద బుద్దులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువు లోనర్చిన పుణ్యము, దాన ధర్మ ఫలము చే కూరును. కార్తీక వ్రతము శ్రీ మన్నారాణునకు ప్రీతీ కరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటె ఘనమై నదని శ్రీ హరి వర్ణించి యున్నాడు. ఆ వ్రాత మహిమ వర్ణించుట నాకు శక్తి చాలదు. అంతియే కాదు, సృష్టి కర్త యగు ఆ బ్రహ్మ దేవునికి కూడా శత్య ము గాదు. అయినను సుక్ష్మ ముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించ వలసిన పద్దతులను జెప్పు చున్నాను. శ్రద్దగా అలకింపుడు. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులా రాశి యందున్న ప్పుడు శ్రీ హరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పని సరిగ నది స్నానము చేయ వలెను. దేవాలయానికి వెళ్లి హరి హరదులను పూజింప వలెను. తన కున్న దానితో కొంచమైనా దీప దానం చెయ వలయును .
ఈ నెల రోజులు విధవ వండిన పదార్థ ములు తిన కూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని, శివాలయమున గాని ఆవు నేతిలో దీపారాధన చెయ వలెను. ప్రతి దినము సాయంకాలము పురాణ పటణము చెయ వలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అను భవింతురు. సూర్యుడు తుల రాశి యందున్న నెల రోజులు యీ విధముగా ఆచరించు వారు జీవన్ము క్తు లగుదురు. ఇట్లు ఆచరించు టకు శక్తి వుండి కూడా ఆచరించక గాని, లేక, ఆచరించు వారలను జూచి యె గ తాళి చేసిన గాని, వారికి ధన సహాయము చేయు వారికి అడ్డు పడిన వారును ఇహ మందు అనేక కష్టముల పాల గుటయే గాక వారి జన్మాంత ర మందు నరకములో పడి యమ కింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతియే గాక అట్టి వారు నూరు జన్మల వలకు ఛ౦ డా లాది హీన జన్మ లెత్తుదురు. కార్తీక మాసములో కావేరి, నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమీ నదిలో గాని స్నాన మాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిన వారు యిహమందు సర్వసుఖములను అనుభ వించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసములకన్నా కార్తీక మాసము వుత్త మెత్త మ మైనది. అధికఫలదాయక యైనది. హరి హరాదులకు ప్రితికర మైనది. కనుక కార్తీక మాసవ్రతము వలన జన్మజన్మలను౦డి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మ లేక, వైకుంఠ మందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రత మాచరించ వలెన నెది కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యేవగింపు అసహ్యము కలుగును. కాన, ప్రతిమానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యకాలమును చెతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారలు కార్తీక శుద్ద పౌర్ణ మినాడు అయినను తమ శక్తీ కొలది వ్రత మాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజన మిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు, చేసిన చొ యెప్పటి కినీ తరగని పుణ్యము లభించును. ఈ నెలరోజులు ధనవంతుడైన ను బీదవాడైన ను మరెవ్వరైన ను సరే సదా హరి నామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్ధ ములను సేవిస్తూ, దాన ధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోక మబ్బును. ఈ కథ ను చదివిన వారికి ని శ్రీ మన్నారాయుణుడు సక లైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగ చేయును.
ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మాహత్య మందలి 
త్రింశో ధ్యాయము - ముప్పదవ అఖిరి రోజు పారాయణము సమాప్తము 
ఓం సర్వేషాం స్వస్తి ర్భ వతు ఓం సర్వేషాం శాంతి ర్భ వతు 
ఓం సర్వేషాం పూర్ణ౦ భవతు ఓం శ్శాంతి శ్శాంతి::||

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles