ఆహారం తినే సమయంలో మాటల్లో పడితే ఎంత తింటున్నామో తెలియదు; మాటల వల్ల పోలమారడం జరిగి మనకు అసౌకర్యం కలగవచ్చు. ఎక్కువగా తిన్న ఆహారం శక్తిని కల్గించదు. టీవీ చూస్తూనో, న్యూస్ పేపర్ చదువుతూనో, కబుర్లు చెబుతూ తింటే ఆహారం రుచి తెలియదు. భోజనం చేసే సమయం లో ఏమైనా వాదులాటలు జరిగి ఇతరులతో గొడవలు పడితే భోజనానికి అర్ధాంతర ముగింపు జరగవచ్చు. ఇంటిలోని వారందరూ ఒక్కోసారి ఈ గొడవతో అర్ధాకలితో పడుకోవాల్సి రావచ్చు.
భోజనం మౌనం గా ఎందుకు చేయాలంటే; ప్రశాంతం గా భుజించే ఆహారమే శక్తి ని కల్గించి అమృతం గా మారుతుంది; నర నరాలకూ పుష్టి నిస్తుంది. మనం రోజుకి లక్ష రూపాయలు సంపాదించినా నాలుగు ముద్దల అన్నం కోసమే కదా!. ఇంతటి ముఖ్య అవసరాన్ని ఆదుర్దాగా ముగించడం మంచిది కాదు.