రుద్రాక్షలను తెలిసి ధరించినా తెలియక ధరించినా రుద్రాక్షల మహత్యం అనుభవం లోనికి వస్తుంది. తప్పుడు మార్గాన నడిచేవారు, సత్ప్రవర్తన లేనివారు, దురాచార మనస్కులు రుద్రాక్షలు ధరిస్తే పరివర్తన చెంది సన్మార్గులు అవుతారని భారతీయుల విశ్వాసం. స్కంద పురాణం కూడా ఇదే చెబుతుంది. రుద్రాక్షలు ధరించడానికి ముహూర్తాలు చూడనవసరం లేదు. మంచి మనస్సు తో ధరించాలనుకున్నప్పుడు దరించ వచ్చు.
పవిత్ర రుద్రాక్షలు స్త్రీ పురుషులు ఎవరైనా ధరించవచ్చు. రుద్రాక్షకు ఐదు ముఖాలు, మూడు ముఖాలు ఆరు, ఏడు ముఖాలు.... ఇలా రక రకాలుగా వుంటాయి. ఏ రుద్రాక్ష మహిమ అయినా ఒకటే... ముఖాన్ని బట్టి దాని మహిమలో అంతరాలు వుండవు.మనకు లభించే రక రకాల రుద్రాక్షలు హస్త నైపుణ్యం తో చెక్కినవే.
రుద్రాక్షలను వుంగరాలలొ ధరించకూడదు. రుద్రాక్ష మాల ధరించి సంగమించ కూడదు. బహిస్టులు ఆగిన స్త్రీలు మాత్రమె రుద్రాక్షలు ధరించాలి. ఒకరి రుద్రాక్షలు వేరొకరు ధరించరాదు.