గాయత్రిమంత్రం అన్ని వేదమంత్రాల సారం, శక్తిరూపం. గాయత్రి మంత్రజపం చేయ్యనిదే మరే మంత్రము కూడా ఫలించదు. గాయత్రిమంత్రము ఈ జననమరణాల చక్రభ్రమణం నుండి మనలను దాటించగలిగే మహా శక్తివంతమైన సాధనం. గాయత్రీ జపాన్ని అందరూ ఒక వ్రతంగా తీసుకోవాలి. ఆ నిప్పు మనలో వున్నన్నాళ్ళు చెడు ఆలోచనలు, చెడు తలంపులు మన దరికి రావు.
గాయత్రి జపం, మరియు అర్ఘ్యం ఈ రెండూను సంధ్యావందనంలో అతి ముఖ్యమైన కర్మలు. మిగిలినవన్నీ కూడాను వాటికి అంగాల వంటివి. అనారోగ్యంతోకానీ, నీరసంగా వున్నవాడు కానీ కనీసం అర్ఘ్యం విడిచి 10 మార్లు గాయత్రి జపం చెయ్యాలి. ఇది కేవలం అనారోగ్యవంతులకు మాత్రమె. ఆరోగ్యంగా వున్నవారు తప్పక పూర్తి సంధ్యావందనం చెయ్యవలసిందే. మహాభారత యుద్ధంలో నీరు దొరక్క భీష్ముడు మృత్తికతో అర్ఘ్యం విడిచాడు. కానీ ఇటువంటివి కొన్ని ప్రత్యేక పరిస్థుతులకు మాత్రమె.
ఇంట్లో వున్న ఒక రోగి చాలా అనారోగ్యంతో బాధపడుతుంటే సంధ్య వార్చిన నీటిని అతడిచే తాగించాలి. గాయత్రిజపం మన స్థూల సూక్ష్మ దేహాలకు మందు వంటిది. ఒక మనిషి జీవించినంత కాలము సంధ్యావందనం చెయ్యాలి. గాయత్రి తల్లివంటిది. దైవం ఎన్నో రూపాలలో మనకోసం అవతరిస్తుంది. మనకోసం మన బాగు కోసం మనకు అందేవిధంగా సాధన చెయ్యగలిగే అతి సులభమైన మంత్రం గాయత్రి, వేదమాత. గాయత్రి మంత్రం జపం వలన ప్రముఖంగా కలిగే లాభం “చిత్తశుద్ధి”. మనకు చిత్తభ్రాంతి వలన ఎన్నో చికకులోస్తున్నాయి. వాటిని నియంత్రించగలిగే శక్తి మన సాధనలోనే వుంది.
మనకు ఒంట్లో బాగాలేనప్పుడు మన పని మన బంధువులకో లేక మిత్రులకో చెప్పి చేయించుకుంటాం. అటువంటప్పుడు మన తరపున వారు గాయత్రీ మంత్రం జపం చెయ్యవచ్చును.
మనమందరమూ నిత్యాగ్నిహోత్రంలా ఈ గాయత్రి జప యజ్ఞాన్ని కొనసాగించాలి. దీనివలన లబ్ది పొందేది మనమే. ఈ వేదజ్యోతిని మరింత ప్రకాశింప చేద్దాం. టూకీగా చెప్పాలంటే మనకు కలిగే లాభాలు
౧. చిత్తశుద్ధి
౨. మానసిక ప్రశాంతత
౩. స్వీనియంత్రణ
౪. దృష్టి కేంద్రీకరణం
5. శారీక, మానసిక పరిశుభ్రత
6. ఆహ్లాద వాతావరణము
7. క్రమశిక్షణ
8. మన పూర్వులతో అనుసంధానం, వారి దీవెనలు
9. ప్రాణాయామం
10. ఆధ్యాత్మిక పరిపక్వత
11. ఓజస్సును తేజస్సుగా మార్చుకోగల శక్తి
12. acupressure ద్వారా ఆరోగ్యం
13. మందేహుల నియంత్రణ ద్వారా మనకున్న మండబుద్ధిని పారద్రోలడం
ఇంకా మరెన్నో ఉపయోగాలున్నాయి సంధ్యావందనం ఆచరించడం ద్వారా.
2. నేను బ్రాహ్మనేతర వాడను. నాకు సంధ్యావందనం చెయ్యమని ఎవరూ చెప్పలేదే?
శాస్త్రం శూద్రునికి మాత్రమె మినహాయింపు ఇచ్చింది. చాతుర్వర్ణాలలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అందరూ కూడా సంధ్యావందనం చెయ్యాలి. కేవలం మగవారు మాత్రమె చెయ్యాలి. వారు చేసిన మంత్రఫలం వారి వారి ఆడవారికి సగం చేరుతుంది. ఈ మూడు వర్ణాలు చేసిన మంత్రజప ఫలితం మొత్తం అన్ని జాతుల వారికీ చేరతాయి. గాయత్రి చెయ్యగలిగే వారు మిగిలిన వర్ణాలకు, ఆడవారికి ట్రస్టీలన్నట్లు. వారు చెయ్యకపోతే వీరందరికీ ద్రోహం చేసినవారువుతున్నారు. కావున అధికారం ఉన్న వాళ్ళందరూ తప్పక సంధ్యావందనం చెయ్యాలని జగద్గురువుల ఆదేశం.
(సశేషం )
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!