Friday, 18 December 2015

అంతఃకరణం

అంతఃకరణం

పంచ మహాభూతముల ప్రత్యేక  సత్వా౦శముల మొదటి అర్ధ భాగాల నుంచి  జ్ఞానేంద్రియాలు  ఏర్పడు తుంటే, రెండవ అర్ధభాగాలైన  సత్వాంశాలైదూ కలసి అంతఃకరణం ఏర్పడుతుంది. ఆలోచనా పద్ధతులను చిత్త వృత్తులంటారు. అంతః కరణమనేది మనలో ఒక సూక్ష్మ పరికరం. దీన్ని విశాల దృక్పధంలో మనస్సు అని వాడుతుంటాం. వేదాంతంలో మనస్సు, బుద్ది, చిత్తం, అహంకారం అనే నాలుగూ కలసి అంతఃకరణమని చెబుతారు. సందర్భాన్ని బట్టి మనస్సే మనస్సు, బుధ్ధి, అహంకారమని చెబుతారు. అంతఃకరణం అన్నపుడు చిత్తం కూడ చెప్పబడుతోంది. పతంజలి యోగ సూత్రాలలో అంతఃకరణమంటే చిత్తమనే అర్ధం.

జ్ఞానేంద్రియాలు బయట ప్రపంచం నుంచి తెచ్చే విషయాలను, మనస్సు గ్రహిస్తుంది. అపుడనేక సందేహాలు,ప్రశ్నలు కలిగి ఉంటుంది. కాని, ఇదే నిర్ణయాలూ తీసుకోలేదు. అదే విధంగా, తన యజమాని నుండి జారీ చేయబడ్డ ఆజ్ఞలను కర్మేంద్రియాల ద్వారా పనులను చేయిస్తుంది. అంటే ఒక పర్వేక్షణ చేసేదిగా పని చేస్తుంటుంది. అది మాత్రం నిర్ణయాలు తీసుకోదు.

మనస్సు తెచ్చిన విషయాలను బుధ్ధి ముందు ఉంచుతుంది. అప్పుడు బుధ్ధి; మనస్సు తెచ్చిన విషయాలను విశ్లేషించి, ఒక నిర్ణయానికి వస్తుంది. అందుకే నిశ్చయాత్మక మైన పని బుద్ధిదని అంటాం.

ఆలోచనా పరంపరలు చిత్తము  అనే దానిలో పుట్టి, తిరిగి దాన్లోనే లయమవుతూ ఉంటాయి. మన ఆలోచనలు, అభిప్రాయాలు, ఆదర్శాలు, ఉద్రేకాలు, ప్రతిబింబాలూ, భయమూ, సుఖ, దుఖముల వల్ల కలిగే అనుభూతులూ  దీన్లో సూక్ష్మంగా  పొందుపరచబడి ఉంటాయి. అంటే ఒక స్టోర్ హౌస్ లాగన్న మాట. మనం కావలసినపుడు వీటిని జ్ఞాపకం తెచ్చుకో గలుగుతాం. మనలను ఎవరైనా గాయపరచినపుడు అంటే hurt అయినప్పుడు  దానంతట అదే, మన ప్రమేయంలేకుండా  చిత్తం నుండి ఈ భావాలు చెలరేగుతాయి.

అహంకారమనేది, చిత్తంనుంచి వచ్చే ఆలోచనలకు, భావనలకు ఒక రంగును దిద్ద, నేను/ నాది అనే రూపకల్పన చేసి, ఆయా విషయాలకు ఇష్టాయిష్టాలను కలుగజేసి, సుఖదుఃఖాలను పొందుతుంటుంది. అహంకారం శరీరంతో గుర్తింపు గల్గి ఉండటం వల్ల, ఆలోచనా మాత్రంగా ఉన్నదానికి; వేర్పాటు వాదం ఏర్పడి సుఖదుఖాలకు లోనవుతుంది. అలవాటు ప్రకారం ఏర్పడే ఆలోచనలకు, చిత్తంనుంచి అహంకారమనే రంగుతో  ఆ ఆలోచనలు మనస్సుకు చేరతాయి. నేను /నాది అనే అసత్యమైన గుర్తింపు వల్ల (ఇదే అజ్ఞానమంటే), బుద్ది ఈపొర/ తెరచే కప్పబడి, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటాం. మనం ఈ బుద్ధిని కప్పిన పొరను సాధనతో వేరుచేస్తే, బుద్ది సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. అలా స్వచ్చంగా ఉండే బుద్ది మిగిలిన వాటిని అనగా మనసు, చిత్తము, అహంకారములను సరిగా నియంత్రించ గల్గుతుంది. అంటే అహంకారమే అజ్ఞానాన్ని కలుగ జేసి, వాస్తవానికి దూరంగా ఉంచుతుంది.🌹🙏🌹

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles