Thursday 7 January 2016

సంతోషకరమైన ఆరోగ్య జీవితానికి 40 చిట్కాలు


ఆరోగ్యం
1. పుష్కలంగా నీరు త్రాగండి.
2. రాజు లాగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి, ప్రిన్సు లాగా లంచ్ తీసుకోండి, బెగ్గర్ లాగా డిన్నర్ తీసుకోండి.
3. చెట్లు మరియు మొక్కల మీద పెరిగే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి
4. 3 ఈ లతో జీవించండి --- శక్తి (Energy), ఉత్సాహం (Enthusiasm) మరియు సానుభూతి (Empathy).
5. ప్రార్థన మరియు పర్యాలోచనకోసం సమయాన్ని కేటాయించండి.
6. ఎక్కువగా ఆటలు ఆడండి.
7. మీరు గత సంవత్సరం కన్నా ఎక్కువ పుస్తకాలను చదవండి.
8. ప్రతీ రోజు కనీసం 10 నిమిషాల పాటు మౌనంగా కూర్చోండి.
9. 7 గంటల పాటు నిద్రపోండి.
వ్యక్తిత్వం:
10. ప్రతి రోజు 10-30 నిమిషాల పాటు నడవండి - - మరియు చిరునవ్వుతో నడవండి.
11. మీ జీవితాన్ని ఇతరుల జీవితాలతో సరిపోల్చకండి. వారి ప్రయాణం దేని గురించి అని ఏ అవగాహన మీకు లేదు.
12. ప్రతికూల ఆలోచనలు లేదా మీరు నియంత్రించలేని విషయాలను కలిగి ఉండొద్దు. బదులుగా అనుకూల ప్రస్తుత క్షణంలో మీ శక్తిని పెట్టుబడిగా పెట్టండి.
13. అతిగా చేయొద్దు; మీ హద్దుల్లో వుండండి.
14. మిమ్మల్ని మీరు ఎక్కువ సీరియస్ గా తీసుకోకండి; ఇంకెవ్వరూ చేయరు.
15. పుకార్ల మీద మీ విలువైన శక్తిని వృథా చేయకండి.
16. మీరు మేల్కొ న్నప్పుడు ఎక్కువ కలలు కనండి.
17. అసూయ వలన సమయం వృధా అవుతుంది. మీకు కావలసినవన్నీ మీకు ఇప్పటికే వున్నాయి.
18. గతం యొక్క సమస్యలను మరిచిపొండి. అతని/ఆమె యొక్క గత తప్పులను మీ భాగస్వామికి గుర్తు చేయవద్దు. అది మీ ప్రస్తుత ఆనందాన్ని నాశనం చేస్తుంది.
19. ఇతరులను అసహ్యించుకుంటూ సమయం వృధా చేయడానికి జీవితం చాలా చిన్నది. ఇతరులను అసహ్యించుకోకండి.
20. అది మీ ప్రస్తుతాన్ని పాడుచేయకుండా ఉండడానికి, మీ గతాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి.
21. మీ సంతోషానికి మీరు తప్ప ఇతరులు ఎవ్వరూ బాధ్యులు కారు.
22. జీవితం ఒక పాఠశాల మరియు మీరు నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నారు అని గ్రహించండి. సమస్యలు కనబడి దూరంగా వాడిపోవు ఆల్జీబ్రా తరగతి వంటి పాఠ్యాంశంలోని భాగంగా ఉంటాయి, కానీ మీరు నేర్చుకున్న పాఠాలు ఒక జీవితకాలం పాటు నిలిచిపోతాయి.
23. ఎక్కువగా చిరునవ్వు చిందించండి మరియు నవ్వండి.
24. ప్రతీ వాదనలో మీరే గెలవాలని లేదు. అనంగీకారాన్ని అంగీకరించండి.
కమ్యూనిటీ
25. తరచుగా మీ కుటుంబానికి కాల్ చేయండి.
26. ప్రతీ రోజు ఇతరులకు ఏదో ఒక మంచి చేయండి.
27. అందరినీ ప్రతీ దాని కొరకు క్షమించండి.
28. 70 పైన & 6 లోపు వయస్సు కలిగిన వారితో సమయము గడపండి.
29. కనీసం ముగ్గురు వ్యక్తులను ప్రతి రోజు నవ్వించడానికి ప్రయత్నించండి.
30. ఇతర వ్యక్తులు మీ గురించి ఏమనుకుంటున్నారనేది నీకు అనవసరం.
31. మీరు అనారోగ్యంగా వున్నప్పుడు మీ ఉద్యోగం మిమ్మల్నికాపాడదు. మీ కుటుంబము మరియు స్నేహితులు కాపాడుతారు. మీకు అందుబాటులో ఉంటారు.
జీవితం
32. సరైన పనులు చేయండి.
33. ఉపయోగం లేనిదాన్ని, బాగా లేనిదాన్ని లేక ఆనందంగా లేనిదాన్ని వదిలి వేయండి.
34. క్షమాగుణం అన్నింటినీ బాగుచేస్తుంది.
35. ఒక పరిస్థితి ఎంత మంచిదైనా లేక చెడుదైనా, అది మారుతుంది.
36. మీకు ఏవిధముగా అనిపించినా సరే, లేవండి, దుస్తులు వేసుకోండి మరియు బయటికి రండి.
37. అత్యుత్తమమైనది ఇంకా రావలసి ఉంది.
38. మీరు ఉదయం చురుకుగా మేల్కొన్నప్పుడు, దాన్ని అలాగే అంగీకరించవద్దు- జీవితాన్ని అక్కున చేర్చుకోండి.
39. మీ లోపల వుండేది ఎప్పుడూ సంతోషంగా వుంటుంది. కాబట్టి మీరు సంతోషంగా వుండండి.
చివరిదైన ముఖ్యమైనది:
40. జీవితాన్ని ఆస్వాదించండి!
-


sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles