Thursday 7 January 2016

కారాలంటే ఎంతో యిష్టం

మన తెలుగువాళ్ళకు 'కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి.

మొదలు పెట్టె కారం -- శ్రీకారం,
గౌరవించే కారం ----సంస్కారం, ప్రేమ లో కారం --- మమకారం 

పలకరించేకారం ----నమస్కారం, భోజనం ముందుచేసే కారం---- అభికారం, పదవి తో వచ్చే కారం ---అధికారం,

అది లేకుండా చేసే కారం------ అనధికారం, వేళాకోళం లో కారం ---- వెటకారం 
భయం తో చేసే కారం ---- హాహాకారం,

బహుమతి లో కారం --- పురస్కారం, ఎదిరించే కారం --- ధిక్కారం 
వద్దని తిప్పికొట్టే కారం-----తిరస్కారం,

లెక్కల్లో కారం --- గుణకారం, గుణింతం లో కారం -- నుడికారం 
గర్వం తో వచ్చే కారం ---- అహంకారం,

సమస్యలకు కారం ----- పరిష్కారం, 
ప్రయోగశాల లో కారం------- ఆవిష్కారం, సంధులలో కారం ---

'ఆ'కారం,సాయం లో కారం      --- సహకారం 
స్రీలకు నచ్చే కారం--- అలంకారం, మేలు చేసే కారం ----ఉపకారం,

కీడు చేసే కారం -- అపకారం 
శివునికి నచ్చే కారం ---- ఓం కారం, విష్ణువు లో కారం ----శాంతాకారం,

ఏనుగులు చేసేది --- ఘీంకారం 
మదం తో చేసే కారం --- హూంకారం, పైత్యం తో వచ్చే కారం --వికారం,

రూపం తో వచ్చే కారం --ఆకారం 
ఇంటి చుట్టూ కట్టే కారం -- ప్రాకారం, ఒప్పుకునే కారం --- అంగీకారం,

చీదరించుకునే కారం ---చీత్కారం
పగ తీర్చుకునే కారం---- ప్రతీకారం, వ్యాకరణం లో వచ్చే కారాలు 'ఆ'కారం', 'ఇ' కారం, 'ఉ' కారం.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles