Thursday, 11 February 2016

సంపూర్ణ హనుమత్ వైభవం - 2

🌹🌻🍀 శ్రీ ఆంజనేయం 🌹🌻🍀

సంపూర్ణ హనుమత్ వైభవం - 2

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం.

రాబోయే పౌర్ణమి లోపు అని శపదం చేసాడు శ్రీహరి..పౌర్ణమి రోజు రానే వచ్చింది. గార్ధభేశ్వరుడు పౌర్ణమి రోజు నిండు వెన్నెలలో గంధమాదన పర్వతం మీద అటూ ఇటూ చక్కెర్లు కొడుతూ ఆ సాయంత్రం చల్లటి పిండివెన్నెలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పులకిత శరీరంతో ఒక పాట అందుకున్నాడు. గార్ధభేశ్వరుడు అంటే! ముఖం గాడిద, శరీరం మనిషి.. దాంతో ఆ కంఠం శృతి తప్పి ఒండ్ర పెట్టింది. ఆ గొంతు తనకే విరక్తి కలిగి అప్పటికే తన వశమైన గంధర్వ కన్యల్ని పాడమన్నాడు. అప్సరసలని ఆడమన్నాడు. వాళ్ళు అలా ఆడుతూ పడుతూ ఉంటే గార్ధభేశ్వరుడు ఒక ఆసనం మీద కూర్చుని ఆనందిస్తూ ఉన్నాడు. ఇంతలో ఎక్కడి నుండో ఒక మృదు మథురమైన స్వరం ''ఓహో.. హో ఓ ఓ'' అంటూ గందర్వుల గొంతుల్ని హేళన చేస్తున్నాయా అన్నట్లు వినబడింది. ఆ స్వరానికి గంధర్వులు అప్సరసలు సైతం విస్మయం చెంది ఎక్కడి నుండి వస్తుంది అంటూ మొత్తం తిలకించి చూసారు. గార్ధభేశ్వరుడు వీరిని ఆపి వెళ్ళమని చెప్పి ఆ స్వరంవస్తున్నవైపు వెళ్ళాడు.అలా వెళ్ళాకా ఒక ఏకాంత ప్రదేశంలో పండువెన్నెలలో చెంగు చెంగున దూకుతూ ఆటలాడుతూ పాట పాడుతున్న ఒక అపురూప సౌందర్యవతిని చూశాడు. ఉన్నదా లేదా అన్నట్లు ఉన్న నడుము. మీద వెన్నెల పడి మిలమిలా మెరుస్తున్న చెక్కిళ్ళు . అద్దాల్లా మెరుస్తున్న కాలిగోళ్ళు.. మెరుపు తీగేలాంటి శరీరం, మన్మథుడు తన వద్ద ఉన్న ౫ బాణాలు ఒకేసారి గార్థభేశ్వరుడి మీద విసిరికోట్టాడా!అన్నట్లు ఆ ముగ్ధమోహనాంగి చూసి పరవశించిపోయి దగ్గరికి వెళ్లి!ఓ కోమలాంగి! ఎవరు నీవు? ఎవరిదానావు? నీ తండ్రి ఎవరు?ఈ పండువెన్నెలలో ఒంటరిగా సంచరిస్తున్నావుఎందుకు? అనగా చిరునవ్వు నవ్వి వయ్యారంగా నడుస్తూ ముందుకి వెళ్ళింది. గార్ధభేశ్వరుడు కూడా ఆమె వెనుకే వెళ్లి సుందరి! సుందరి అంత అశ్రద్ధ ఏల? ఒక్క క్షణం ఆగు. నేనునీ దాసుడిని. నువ్వు ఏదడిగితే అది చేస్తాను. నీ దాసుడిని. దేవి దేవి ఆగు. అని వెంటపడ్డాడు. ఆ కోమలాంగి కొంచం దూరం అలా వెళ్లి ఒక చోట నిలబడగా, గార్ధభేశ్వరుడు వచ్చి దేవి నేను నీకు నచ్చలేదా?ఒక పాట పాడమంటావా అని స్వరం ఎత్తాడు. అంటే ఆ దెబ్బకి చుట్టూ ప్రక్కల చెట్ల మీద ఉన్న పక్షులు, పొదలలో దాగిఉన్న మృగాలు, పుట్టల్లో ఉన్న పాములు, ఇలా అన్ని జంతువులు ఆ గొంతుక విని పారిపోయాయి.అప్పుడు ఆ కోమలాంగి ఆహా! ఏమి స్వరం! ఎంత మధురంగా ఉంది. అద్భుతంగా పాడావు. ఇలాంటి మథురమైన కంఠం ఎప్పుడు ఎక్కడా వినలేదు. ఆ అందం. అందానికి తగ్గ కంఠం అబ్బో మధురం అని పొగిడేసరికి గార్ధభేశ్వరుడు ఉబితబ్బిబ్బై! నిజామా దేవి! అంత మధురంగా ఉందా! నిజంగా అంత అందంగా ఉన్నానా! ఇంతవరకు ప్రతి స్త్రీ కూడా నన్ను చూసి భయపడి మూర్చపోయింది. కొందరు పారిపోయారు. బ్రహ్మదేవుడు నిన్ను నాకోసమే పుట్టించాడు. అందుకే నేను నీకు నచ్చాను. నాస్వరం విని ఇంద్రాది దేవతలు సైతం భయపడి పారిపోయరే కాని ఎవ్వరూ నీలా పొగడలేదు. ఐతే నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఏదడిగితే అది చేస్తాను. నీకోసంప్రాణం అయినా ఇచ్చేస్తాను దేవి. కాని నన్ను కాదనకు. నీదాసుడిని దేవి అంటూ కాళ్ళ వెళ్ళా పడి బ్రతిమలాడాడు. దేవి నీ నామదేయం ఏమిటి చెప్పు..ఆ కోమలాంగి నవ్వి. నా నామధేయం మాయ. ఆహా మాయ! ఎంత బావుంది పేరు. ఎక్కడి దానవు? నేను ఎక్కడైనా ఉంటాను.(ఇక్కడ శ్రీహరి చెప్పకనే చెప్పాడు. నేను మోహిని రూపంలో ఉన్న మాయని, సర్వంతర్యమిని అని అయినా అర్థంకాలేదు. పూర్వం శ్రీహరి పాలకడలి చిలికిన సమయంలో విషం పుట్టినప్పుడు ఆ విషాన్ని శివుడు కంఠంలో నిలిపి లోకాలని కాపాడి కైలసానికి వెళ్ళిపోయాడు. తరువాత అమృతం పుడితే దానిని పంచడం కోసం విష్ణువు మోహినీ రూపం ధరించి అమృతాన్ని పంచిపెట్టాడు. కథ మొత్తం వద్దులే కాని విష్ణువు మోహినీ రూపం ధరించినప్పుడు శివుడు అక్కడ లేడు. ఒకసారి విష్ణువు శివుడు కలిసినప్పుడు శివుడు విష్ణువుని ''నువ్వు మోహినీ రూపం ధరించి నప్పుడు నేను చూడలేదు. కాని దేవతలందరూ నిన్ను ఆరూపంలో చూసి మోహంలో పడిపోయారని విన్నాను. నాకు కూడా ఆరూపం చూడాలని కోరికగా ఉంది అనగా విష్ణువు చిరునవ్వు నవ్వి అక్కడ మాయమయ్యాడు. శివపార్వతుల ఎదురుగా అందమైన ఉద్యానవనం ఎక్కడో మథురమైన స్వరం ఆ స్వరం విని శివుడు విష్ణుమాయలో పడి ప్రక్కనే పార్వతీదేవి ఉన్న సంగతి మర్చిపోయి పిలుస్తున్నా పట్టించుకోకుండాఆ ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. మోహినీ రూపం చూసి వెంటపడ్డాడు. ఇక్కడ చాలా కథ నడిచింది. చివరికి మోహినిని పట్టుకోగానే శివుడికి రేతఃస్కలనం జరిగింది. దీనివలన బంగారం వెండి పాదరసం పుట్టాయి. అందుకే ఈ మూడిటిని నెల మీద పెట్టకూడదు అంటారు. ఈ మూడు రుద్రవీర్యం. భూమి భరించలేదు. అంతటి శివుడే విష్ణుమాయలో పడిపోతే ఈ గార్థభేశ్వరుడు ఎంత?)దేవీ నన్ను విడిచి పోకు పోకు అని బ్రతిమలాడాడు. అప్పుడు మాయ మోహిని ''నువ్వంటే నాకు ఇష్టమే కాని నాకుకొన్ని కట్టుబాట్లు ఉన్నాయి అనగా ఏంటో చెప్పు దేవి అన్నాడు. ఐతే విను. నన్ను చేసుకునేవాడు మహావీరుడై ఉండాలి. మృత్యుంజయుడై ఉండాలి. చావు ఉండకూడదు. ముల్లోకాలను జయించే వాడై ఉండాలి అని చెప్పగా ఓస్ అంతేనా! నేను మహావీరుడిని. ముల్లోకాలలో ఉన్న సురసిద్ద సాధ్య యక్ష రాక్షస గంధర్వులని, పన్నగాలని, మానవుల్ని అహ సమస్త ప్రాణుల్ని గెలిచిన వీరుడిని. ఇక ఆ శివుడు ఇచ్చిన వరం వలన మృత్యుంజయుడిని.కాబట్టిదేవి నువ్వు కోరుకునే వాడిని నేనే. పెళ్లి చేసుకుందాం అన్నాడు. నువ్వు చెప్పింది అంతా నమ్మశక్యంగానే ఉంది కాని మరణంలేదు అంటేనే నమ్మకం కలగడంలేదు. సృష్టిలో ప్రతిజీవి నశించిపోవలసిందేకదా! అలాంటప్పుడు నువ్వెలా మృత్యుంజయుడివి అవుతావు.నాకు నమ్మకంలేదు. అంది మాయ. దేవి!అది దేవరహస్యం ఎవ్వరికీ చెప్పకూడదు. అన్నాడు. ఐతే నువ్వు దాచుకో. నేను వెళుతున్నా.. దేవి దేవి పోకు పోకు. సరే కొంచం చెబుతాను నువ్వు నమ్మాలి కనుక. నా మరణ రహస్యం నాకు శివుడికి తప్ప అన్యులకి ఎవ్వరికీ తెలియదు. చెప్పకూడదు. శివుడు నాకు వరం ఇచ్చాడు కనుక ఎవరికీ చెప్పడు. నేను నా మరణరహస్యం తెలిసితెలిసి ఎవ్వరికీ చెప్పను కదా! కనుక నాకు మరణం లేదు. దేవి ఇప్పటికైనా అంగీకారమేనా! అంగీకారమే కాని ఇది ఎలా నమ్మేది? అయినా ఎందుకు లే నేను వెళ్తున్నా.. నాకు మరణంలేని పతి కావాలి. వెతుక్కుంటాను అని అలా ముందుకి వెళ్ళాడు. (ఇక్కడ ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతాయి. నిజం బయట పెట్టించడానికి దాదాపు4 పేజీల పాటు వాదనలు జరిగాయి). చివరికి చేసేదిలేక విపరీతమైన విష్ణుమాయా మొహం చేత వివసుడై సరే దేవి నిన్ను నమ్ముతున్నాను కనుక నీకు కాబట్టి చెబుతున్నాను. విను..నేను సురాపానం(కల్లు)బాగా త్రాగి మత్తులో పడిఉన్నప్పుడు, వృకోధరం (తోడేలు) నరుడు కలిసిన రూపంతో అంటే నరవృకోధర రూపంలో నన్ను సంహరించి ఎముకలుతప్ప ఏమి మిగలకుండా తింటేనే నాకు మరణం సంభవిస్తుంది. అలాకాక కేవలం నన్ను చంపి వదిలేస్తే తిరిగి బ్రతుకుతాను. ఇది నా మరణ రహస్యం. కనుక అర్థమైందా అలాంటి ఆకారం ఉన్న జంతువూ కానీ మనిషి కాని ఈ భూలోక భువర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోక, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకాలలో ఎక్కడాలేదు. కనుక నువ్వు భయపడాల్సింది ఏమిలేదు. సరేనా! అంటే! అప్పుడు మాయ చిరుమందహాసం చేసి వయ్యారంగా సిగ్గుపడుతూ ఒప్పుకుంటున్నాను. ఈ శుభసందర్భంలో సురాపానం చేద్దాం పదా! అని తీసుకెళ్ళితనమాయ చేత సురని పీపాలు పీపాలు సృష్టించి గార్థభేశ్వరుడు చేత విపరీతంగా త్రాగించేస్తుంది. దేవి దేవి అనేవాడు కాస్త దే............వీ........ అనడం మొదలుపెట్టాడు. కళ్ళు తెరవలేకపోతున్నాడు. కాలు కదల్చలేక పోతున్నాడు. మత్తెక్కి ఉన్నాడు. అప్పుడు విష్ణువు తన మాయమోహినీ రూపాన్ని వదిలి నరవృకోదర రూపం దాల్చి గార్థభేశ్వరుడిని సంహరించి ఎముకలు తప్ప ఏమి మిగలకుండా తినేసి ఎముకల పోగు అక్కడ పడేస్తాడు.దేవతలు దుందుభులు మ్రోగించారు. అప్సరసలు ఆడారు. గంధర్వులు పాడారు. కొందరు పుష్పవృష్టి కురిపించారు.లోక కంఠకుడు నశించాడని విష్ణువుని కీర్తించారు. శివుడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం దాసుడిని అవుతానని వరం ఇచ్చాడు.ఇది జరిగిన కొన్నాళ్ళకి నారదుడు 10000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు చెడగొట్టడానికి ఇంద్రుడు అనేకరకాలుగా ప్రయత్నించాడు కాని నారదుడు చలించలేదు. ఆ తపస్సుకి విష్ణువు మెచ్చుకొని ''ప్రత్యక్షమై నారద!నీతపస్సు ఈ సృష్టిలో నువ్వు తప్ప ఇంకెవ్వరు చేయరు. చెయ్యలేరు. రంభ ఊర్వసి మేనక లాంటి ఎందఱో అప్సరసలు వచ్చి నీ ముందు ఆడినా, మన్మథుడు నీలో కోరికలు పుట్టించాలని అతని దగ్గర ఉన్న 5 బాణాలు సంధించి నీమీద ప్రయోగించినా చలించలేదంటే నారద మెచ్చుకున్నాను.నీకు మాయని గెలిచే అవకాశం ఇస్తున్నాను. అని చెప్పి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు.నారదుడు ఇక్కడే పెద్ద పొరబాటు చేశాడు. మాయని గెలిచే అవకాశం ఇస్తున్నాను అంటే మాయని జయించావు అన్నాడని అనుకున్నాడు. దీంతో విష్ణుమాయ నారదుడిని పట్టుకుంది. (కొంచం అహంకరించామంటే మనల్ని వెంటనే విష్ణుమాయ పట్టుకుంటుంది. ఇది పట్టుకున్నవారే ప్రస్తుతం ఎక్కువమంది ఉన్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనేవారందరూ వాళ్ళే. చీటికీమాటికీ క్రోధం, ముందు వెనుక ఆలోచించకుండా తిట్టేయడం, దైవ దూషణ, అపనిందలు వేయడం, ఇతరులని మోసగించడం, తాను సుఖపడడం కోసం ఎంతకైనా తెగించడం, తనని తాను పొగుడుకోవడం, పరనింద, చేబుతుపోతే పెద్ద లిస్టు ఉంది.తరువాత చెప్పుకుందాం.)

🌹🌻🍀జై బోలో రామ భక్త హనుమాన్ కీ 🌹🌻🍀
🌹🌻🍀జై బోలో రామ భక్త హనుమాన్ కీ 🌹🌻🍀
🌹🌻🍀జై బోలో రామ భక్త హనుమాన్ కీ 🌹🌻🍀..

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles