⚓...కాళేశ్వరం..కరీంనగర్ జిల్లా...⚓
⚓...ముక్తేశ్వర ఆలయం...⚓
🍁..శ్లోకం !! యవాధిక కుతోహేతో కాశ్యా
కాళేశ్వరో భవెతే !!
⚓ ... కాశీ కన్నా ఒక గోధుమ గింజంత ఎక్కువట మహిమలో ఈ క్షేత్రం... ఈ గుడి ఎంతో ప్రాచీనమైనది... స్కాంద పురాణంలో ఒక ఖండం... "కాళేశ్వర ఖండం" ఈ క్షేత్రం గురించి వర్ణిస్తుంది పై విదంగా...!
⚓ ...ఇక్కడ ఆలయంలో ప్రసిద్ద గాంచింది "ముక్తేశ్వరాలయం" గర్భగుడిలో రెండు శివలింగాలుండటం ఇక్కడి ప్రదాన ప్రత్యేకత... దర్శించిన భక్తులందరకీ... ముక్తేశ్వర స్వామి ముక్తి నిస్తుండటంతో యముడికి పని లేకుండా పోయిందట... ఆయన శివుడితో మొర పెట్టుకోగా... తన ప్రక్క యమున్ని కూడా లింగాకారంలో నిల్చొమన్నాడటా... తనను అర్చించి యమున్ని అర్చించకుండా వెళ్లేవారికి ముక్తి దొరకదని... అట్టివారిని యముడు నరకానికి తీసుకొని పోవచ్చని శివుడు చెప్పాడటా... అందువల్ల ఈ గుడిలో ఒక లింగం "ముక్తేశ్వర స్వామిది" రెండవది "కాళేశ్వర స్వామిది" ( కాలుడు అంటే యముడు )వున్నాడు... భక్తులు రెంటినీ అర్చించుకోవాలి...!
⚓ ...ముక్తేశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత వుంది... లింగంలో రెండు రంధ్రాలున్నాయి... ఈ రంధ్రాలలో నీరు పోసి అభిషేకం చేస్తే... ఆ నీరు అక్కడకి మైలు దూరానికి ఫైగా వున్న గోదావరీ ప్రాణహీత సంగమ స్థలంలో కలుస్తుందని చెబుతారు...!
⚓ ...బ్రహ్మకి ఎక్కడా గుడి వుండదు... కానీ ఇక్కడ బ్రహ్మ గుడి వుంది... ఇంకా సరస్వతి ఆలయం ... రామాలయం... ఆది ముక్తేశ్వర ఆలయం ఉన్నాయి... ఇక్కడ పూజలు చేసిన భక్తుల కోర్కెలు తప్పకుండా నెరవేర్చుట ఇక్కడి ప్రత్యేకత... వివాహం జరుగుట... మరియు సంతానం కలుగుట కొరకు... కాల సర్పదోష పూజ... నవగ్రహ పూజ... మహాన్యాస రుద్రాభిషేకములు ప్రత్యేకంగా జరుపబడును...!
⚓ ...గోదావరి నదిలో ఉపనది అయిన ప్రాణహిత కలిసే చోట... ఈ "కాళేశ్వర క్షేత్రం" ఉంది... కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం చుట్టూ చిక్కని అడవి పెరిగి... మనోహరమైన ప్రకృతి దృశ్యాలు దారి పొడవునా కన్పిస్తాయి...!
⚓ ...చరిత్ర :- ఇక్కడ శిల్ప రీతులపై బౌద్ద జైన శిల్ప రీతుల ప్రభావం కన్పిస్తుంది... వెంగి రాజయిన విష్ణువర్ధనుడు కాళేశ్వర రాజ్యాన్నీ జయించినట్లు ఆదారాలున్నాయి ఆయన దండేత్తే నాటికి... కాళేశ్వరం ఒక పెద్ద పట్టణంగా విరసిల్లుతూ ఉండేదట... 26 కోనేరులు నగరంలో ఉండేవట... ప్రోలరాజు ఇక్కడ బంగారంతొ తులాభారం తూగి... ఆ బంగారాన్నీ స్వామికి అర్పించాడట...!
⚓...!! ఓం నమ శివాయ !!...⚓
Author: sandhehalu - samadhanalu