🔔 మాఘ మాసము 🔔
🔔 మాఘ మాసం ఎప్పుడొస్తుందో....మౌన రాగాలెన్నినాళ్లో అని పెళ్లీడుకొచ్చిన ఓ కన్నెపిల్ల పాడిన పాట మన అందరికీ తెలిసిందే.
🔔 ఒక్క పెళ్లి కావలసిన వారే కాదు యావత్ హైందవ జనం ఎంతో భక్తి భావంతో మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతటి పవిత్ర మాఘ మాసం విశేషాలు ఏంటో చదవండి మరి.
🔔"మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి.
ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు ........ "దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్యధ్య , మాఘ పాప వినాశనం!" అని శ్లోకం చదివి , స్నానం చేసిన తరువాత.... "సవిత్రే ప్రసవిత్రేచ ! పరంధామజలేమమ ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!" అని చదవాలి. సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి. ఇలా మాఘ మాసం అంతా చేయాలి. వీటిని మాఘ స్నానాలు అంటారు.
🔔ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. ఈ నెలలో సూర్యుడు కుంభ రాశిలో ఉంటాడు . కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు.ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది.ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట.
🔔 మాఘ శుద్ధ తదియ రోజున గౌరీ దేవిని అర్చించి బెల్లం, ఉప్పు దానం చేస్తే ఎంతటి కష్టాల నుండి అయినా విముక్తి లభిస్తుంది
🔔 మాఘ శుద్ధ చవితి రోజున గణపతిని పూజించాలి. ఈ రోజును డుండి గణపతి వ్రతం చేయాలి.బెల్లం తెల్లనువ్వులు కలిపి లడ్డూలు చేసి నైవేద్యం పెట్టి పంచాలి. డుండి గణపతి వ్రతం కోసం ఈ లింక్ చూడండి. https://www.youtube.com/watch?v=feweMgLZBv0
🔔 "మాఘ శుద్ద పంచమి"ని శ్రీ పంచమి అంటారు.ఇది గొప్ప ముహూర్తంగా జోతిష శాస్త్రం చెబుతుంది. ఈ పంచమి నాడే "సరస్వతీదేవి" జన్మించిందట. ముక్కోటి దేవతలు ఈ రోజున సరస్వతిని పూజిస్తారు . ఈనాడు "రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి. అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది.
🔔ఇక మాఘ శుద్ద సప్తమి ఇదే "సూర్య సప్తమి"అని కూడా పిలువబడుతుంది. ఇదే రథసప్తమి సుర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.ఈ రోజున సూర్యుడు పుట్టిన రోజుగా వేదం చెబుతుంది . ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు.
🔔''నమస్కార ప్రియ:సూర్య: '' అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.
🔔 సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే "శమంతకమణి" ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. '' ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ '' అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి.
🔔 రథసప్తమి నాటి స్నానం '' సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్‌క్షణాత్'' అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట.
🔔 భీష్మాష్టమి "మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!" శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్చంద మరణం ఆయనకి వరం. ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు.
🔔 భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే.ఈ విధంగా మాఘమాసమంతా "శివరాత్రి"వరకూ అన్నీ పర్వదినాలే.
🔔 ప్రతి విశేషం కోసం మరింత సమాచారం ముందు తెలుసుకుందాం . ....🔔
🔔ఇది హిందూ ధర్మచక్రం సేకరణ.