జంధ్యం ధరించే సంప్రాదాయం వెనుక ఆంతర్యమేమిటి...
సాధారణంగా మన హిందు సాంప్రదాయంలో కొంత మంది జంధ్యం ధరించే ఆచారమున్నది. ముఖ్యంగా హిందుమతంలో బాలుర వేదభ్యాసం ప్రారంభించే ముందు చేసే ప్రక్రియ 'ఉపనయనం'దీనినే ఒడుగు, జంధ్యం అని పిలుస్తుంటారు. బాల్య దశ నుండి బ్రహ్మచారిగా మారే సమయంలో 'ఉపనయనం' చేస్తారు. ఇది ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. నియమాలను పాటించని బాలురు'ఉపనయనం' చేసిన తర్వాత ఎంతో నిష్టతో నియమాలను పాటించవలసి ఉంటుంది. ఉపనయనం జరిగి యజ్జోపవీత ధారణ చేస్తేనే 'వేదాలను' అభ్యసించడం మరియు పితృ సంస్కారాలు చేసే అధికారం వస్తుందని 'మనుధర్మం' చెబుతుంది. యజ్ఝోపవీతంను వాడకలో జందెం, జంధ్యము లేదా జందియం అని అంటారు. తల్లి గర్భంతో కూడి -బ్రాహ్మణులకు 8వ ఏట, క్షత్రియులకు 11ఏట, వైశ్యులకు 12వ ఏట ఉపనయంన చేయాలని వేదాలు చెబుతున్నాయి. ఇంతకీ జంధ్యం ఎందుకు ధరిస్తారనేగా మీ ఆలోచన? ఉపనయం జరిగిన వ్యక్తిలో మానసికంగా మరియు శారీరకంగా బలం చేకూరుతుంది . సూర్యుని పూచించిన పుణ్యఫలం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు. సూర్యదేవునికి నమస్కరించే సమయంలో సన్ గాడ్ (సవిత)గాయత్రి మంత్రం చదివి ఉపనయంన చేస్తారు. ఉపనయనం వల్ల ఇంటర్నల్ గాను ఎక్సటర్నల్ గాను స్వచ్చంగా ఉంటారని నమ్ముతారు . అంతే కాదు, జంధ్యం ధరించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారని, అన్నింట్లో ముందుంటారని భావిస్తారు.
జంద్యం ధరించిన తర్వాత ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో, ధరించే ముందు తయారీకి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు. యజ్జోపవీతం ఒక 'బ్రాహ్మన కన్య ' చేత 'భమిడి ప్రత్తి ' తో వడకించిన తర్వాత 'బ్రాహ్మణుడి' చేత మెలికలు వేయిస్తారు. . జంద్యం పొడవు సుమారుగా సాధారణ వక్తి ఎత్తుకు సమానంగా ఆరు అడుగులు (చేతి నాలుగు వ్రేళ్ల వెడల్పుకి ఇరవైనాలుగు రెట్టు ) ఉంటుంది. నాలుగు వేళ్ళు మనిషి యొక్క జాగరణ, నిస్వపన, స్వప్న మరియు బ్రహ్మ(తురీయ) స్థితులలు అనే నాలుగు ఆ్మ స్థితులను తెలియజేస్తాయట. జంద్యానికికుండే మూడు పోగులు ఒక ముడు (బ్మహ్మ గ్రంధి)చేత కట్టబడి ఉంటాయి. ఈమూడు పోగులు బుషి బుణం, పితృ బుణం మరియు దేవ బుణాలను గుర్తు చేస్తాయి. మూడు పోగులను కలిపి వేయపబడిన బ్రహ్మ గ్రంథి త్రిమూర్తులు ఏకమై ఉన్నారు, అనే విషయాన్ని తెలియజేస్తాయి. అంతే కాదు, మూడు పోగులు అంటే కేవలం మనకు ఉండే రెండు నేత్రాలతో పాటు మూడవది అయినటువంటి 'జ్ఝాన నేత్రం' కూడా ఉండాలని అర్ధం. శుభకార్యాలలో మరియు మామూలు సమయంలో 'యజ్ఝోపవీతాన్ని' ఎడమ భుజం మీద నుండి వ్రేలాడుతూ కుడి వైపు నడము చేరేటట్టు వేసుకుంటారు. అశుభ కర్మలప్పుడు 'కుడి భుజం మీదుగా ఎడమవైపు నడుమును తగిలేటట్లు ' వేసుకుంటారు. మలమూత్ర సమయంలో మెడలో దండ లాగ ఉండటట్లు వేసుకుంటారు. ఏడాదికి ఒకసారి శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఝోపవీతధారణ ధరించే సమయంలో క్రింది శ్లోకాలని చదువుతారు. 'యజ్ఝోపవీతం పరమం, పవిత్రం ప్రజాయితే: యత్సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఝోపవితం బలమస్తు తేజ:' మరియు జంధ్యం తీసివేసే సమయంలో క్రింది శ్లోకాన్ని జపిస్తారు. 'ఉపవీతం ఛిన్న తంతుం జీర్ణం కశ్మలదూషితం విసృజామి యశోబ్రహ్మవర్భో దీర్ఘాయురస్తుమే' ఉపనయనం యొక్క అతి ముఖ్యమైన ప్రాధాన్యత ఏంటంటే...బ్రహ్మోపదేశం చేసిన తర్వాత, పిల్లవాడు భిక్ష మొదట తల్లి నుంచి తీసుకోవాలి, పిమ్మట తండ్రి బ్రహ్మోపదేశం చేస్తాడు, తర్వాత తల్లి వద్ద 'మూడు గుప్పెళ్ళు' బిక్ష స్వీకరించి, పూజ్య గురువు వద్ద విద్య నేర్చుకుంటూ తన మూడవ నేత్రంతో ఆత్మజ్ఝానాన్ని పొందవలెను . ఉపనయనం, జందెం, జంద్యం లేదా జందియం గురించి పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో జంద్యాల పూర్ణిమ గురించి సవివరంగా వర్ణించాడు.