ఏక శ్లోక 'సుందరకాండ' - నిత్య పారాయణ కోసం
హనుమజ్జయంతి (సందర్భంగా)
మిత్రులందరికీ "హనుమజ్జయంతి" ఆధ్యాత్మిక సభక్తి శుభాకాంక్షలతో
వైశాఖ బహుళ దశమి - హనుమజ్జయంతి (31 మే, మంగళవారం)...
ఏక శ్లోక 'సుందరకాండ'
(నిత్య పారాయణ శ్లోకము)
ధృత్యా సాగర లంఘనం హనుమతో,
లంకామదోత్సారణం
తత్రా శోకవనే చ మార్గణ, మథ
శ్రీ జానకీ దర్శనమ్,
రామక్షేమ నివేదనం, వనతరుం
ప్రద్వంసనం, సంయుగే
రక్ష స్సంహననం, పురీ ప్రదహనం,
రామాయణే సుందరమ్.
ఓం తత్సత్.
భావము:
ఆంజనేయుడు సముద్రము దాటుట, లంకానగర వీరుల గర్వమును
అణచుట, అశోకవనములో సీతకై వెదకుట, జానకీదేవిని దర్శించి,
శ్రీరాముని క్షేమమును ఆమెకు వినిపించుట, అశోకవనములోని
వృక్షాలను పాడుచేయుట, రాక్షసులను చంపి లంకను తగులబెట్టి
వచ్చుట, ఈ విషయములతో రామాయణములోని సుందరకాండ చాలా
ప్రసిద్ధి చెందినది.
ప్రతీదినము 108 సార్లు పారాయణము చేసి, అరటిపండు నివేదన చెయ్యాలి.
శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ!
రామదాస ప్రసన్నం భజేహం! భజేహం! భజేహం!
శ్రీ హనుమజ్జయంతి పర్వదినోత్సవం సందర్భంగా - మిత్రులందరికీ ఆధ్యాత్మిక శుభాకాంక్షలను అందిస్తున్నాము.
కొంపెల్ల శర్మ, తెలుగురధం. Kompella Sarma.