Sunday 27 November 2016

శివలింగపుష్పం ( నాగ పుష్పం )




శివలింగ వృక్షం చెట్టు శాస్త్రీయ నామం కౌరౌపిటా గియానెన్సిస్. ఆంగ్ల పరిభాషలో కేనన్ బాల్ ట్రీ అందురు. ఇది దక్షిణ అమెరికాలోను, దక్షిణ భారత దేశంలోను కనిపిస్తుంది. ఈ వృక్షాన్ని నాగలింగ వృక్షమని కూడా అందురు. వీటి పుష్పాల మధ్య భాగం పడగ విప్పిన సర్పం వలె ఉంటుంది.

లక్షణాలు

శివలింగపుష్పాలు మరియు పండ్లు.

శివలింగ వృక్షం శివుడి జఠాఝూఠ ఆకృతిలో, వెండ్రుకలు విప్పారినట్లుగా ఉంటాయి. పుష్పాలు కొమ్మలకు పూయకుండా వెంట్రుకల లాంటి జడలకు పూస్తాయి. పైభాగాన నాగ పడగ కప్పి ఉన్నట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి. శివలింగపుష్పాల్ని నాగమల్లి పుష్పాలుగా, మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు. ఇవి అద్భుత సుగంధ పరిమళాలు వెదజల్లుతుంటాయి.

హిందువులు శివలింగపుష్ప రూపంలో, వృక్షరూపంలో శివుడు కొలువై ఉన్నాడని బావిస్తారు. శివలింగపుష్పాలు సర్వదేవతలకు ముఖ్యంగా శివునికి ప్రీతికరం. ఈ పుష్పాలతో శివపూజ చేయడం ప్రతి శివభక్తునికి నిజంగా ఒక వరం. శివలింగపుష్పాలతో శివపూజ చేసిన వారికి జన్మరాహిత్యాన్ని పొంది, అంత్యమున కైవల్యం పొందునని శివపురాణంలో ఉన్నది. ఏ దేవునికైనా ఈ పుష్పం సమర్పించినప్పుడు, తప్పనిసరిగా ఆ దేవతల శిరస్సుపై లేదా భుజస్కందాలలో మాత్రమే అలంకరించాలి. పాదాలదగ్గర వేయరాదు. పార్వతికి మాంగల్యంలో అలంకరించాలి.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles