శ్రీబమ్మెరపోతనామాత్యులవారి శ్రీమదాంధ్రమహాభాగవతం
తృతీయ స్కంధం మూడవ అధ్యాయం (3వ భాగము)
సుతం మృధే ఖం వపుషా గ్రసన్తం దృష్ట్వా సునాభోన్మథితం ధరిత్ర్యా
ఆమన్త్రితస్తత్తనయాయ శేషం దత్త్వా తదన్తఃపురమావివేశ
భూమి తన కుమారుడిని, ఆకాశాన్ని ఆవరించి "నేను ఇంత బాలాడ్యున్ని" అని గర్విస్తున్న నరకున్ని సంహరించినందుకు (నరకునికి కుజ అని పేరు. కు అంటే భూమి) ఆ నరకుని కొడుకుకు రాజ్యం ఇవ్వవలసిందని యాచిస్తే, అతని కుమారునికి మిగిలి ఉన్న రాజ్యం ఇచ్చి, తన మనువడి అభ్యర్థన మేరకు అంతఃపురానికి వేంచేసిన శ్రీకృష్ణుడు అక్కడ బంధించబడి ఉన్న పదుహారువేలమందీ
తత్రాహృతాస్తా నరదేవకన్యాః కుజేన దృష్ట్వా హరిమార్తబన్ధుమ్
ఉత్థాయ సద్యో జగృహుః ప్రహర్ష వ్రీడానురాగప్రహితావలోకైః
ఆసాం ముహూర్త ఏకస్మిన్నానాగారేషు యోషితామ్
సవిధం జగృహే పాణీననురూపః స్వమాయయా
తాస్వపత్యాన్యజనయదాత్మతుల్యాని సర్వతః
ఏకైకస్యాం దశ దశ ప్రకృతేర్విబుభూషయా
సంతోషంతో సిగ్గుతో ప్రేమతో స్వామిని భర్తగా స్వీకరించారు. అంతమందినీ అన్ని రూపాలలో ఒకే సమయానికే వివాహం చేసుకున్నాడు. ప్రతీ రూపానికి తగ్గట్టుగా ఒక అనురూపాని సృష్టించుకొని వివాహం చేసుకున్నాడు. తన మాయతో పదిమంది పుత్రులని కన్నాడు
కాలమాగధశాల్వాదీననీకై రున్ధతః పురమ్
అజీఘనత్స్వయం దివ్యం స్వపుంసాం తేజ ఆదిశత్
కాలయవనుడు జరాసంధుడు వంటి రాక్షసులను వధించాడు
శమ్బరం ద్వివిదం బాణం మురం బల్వలమేవ చ
అన్యాంశ్చ దన్తవక్రాదీనవధీత్కాంశ్చ ఘాతయత్
కొందరిని చంపాడు కొందరిని చంపించాడు