ఓం నమః శివాయ
శ్రీ కాళహస్తీశ్వర శతకం
(ధూర్జటి విరచితo)
జలకoబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము
ల్కల శబ్దధ్వనులoచి తాoబర మలoకారoబు దీప్తుల్ మెరుoగులు
నైవేద్యము మాధురీ
మహిమగా గొల్తున్నినున్ భక్తి రంజిల దివ్యార్చన కూర్చి నేర్చిన క్రియన్
శ్రీ కాళహస్తీశ్వరా!
శంకరా!కావ్యమoదలి రసములే స్నానముగాను,పద్యములే పూలుగాను,శబ్దమువల్ల
తోచెడు అర్ధధ్వనులే భేరీవాద్యములుగాను,
అలoకారములు వస్త్రములు
గాను,కవితా సౌందర్యములే దీపములుగాను,మాధుర్య
గుణమే నైవేద్యము గాను,సమకూర్చి,నా చేతనైనట్లు భక్తితో నిన్ను కవితార్చనము చేసి సేవించెదను.