మకుందమాల -
నాధేనః పురుషో్త్తమే త్రిజగతామేకాధి పే చేతసాసేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్ఠతి
యం కఞ్చత్పురుషాధమంకతిపయగ్రామేశ మల్ఫార్ధదం
సేవాయై మృగయామహేనరమహోముాఢా వరాకావయమ్
తాత్పర్యము — ముల్లోకాలకు అధిపతి యైన పురు షోత్తముని మనస్సులో ధ్యానించి నంతనే స్వస్ధానాన్నే ఇవ్వటానికి సంసిద్ధంగా ఉంటున్న సర్వాంతర్యామి యైన శ్రీమన్నారాయణుని భజింఫక మందఋద్దులు అవివేకులై అల్పుడైన దొరను వెదుక్కుంటుా వెళ్ళి అతని మెప్పును సంపాదించి అతడిచ్చే అల్ప ధనానికి ఆశఫఢి తమ జీవితాలను వ్యర్ధం చేసు కుంటారు.
మకుందమాల------
మజ్జన్మనః ఫల మిదం మధుకైటభారే
మత్ప్రార్ధనీయ మదనుగ్రహ ఏష ఏవ త్వద్భృత్యభృత్యపరిచారకభృత్యభృత్య ,
భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ ॥
తాత్పర్యము -
లోకనాధ! భాశము దైత్య సంహరక! లోకనాధ!ఈనా కోర్కె నీడేర్చుము. నన్న ను గ్రహింపుము. నీ భృత్య భృత్య పరిచారక భృత్య భృత్యునకు భృత్యుడనుగా నన్ను తలంచుము.అట్లు నీభృత్య పరంపరలో ఒకనిగానన్ను తలంచుటయే ప్రభుా నజన్మకు ఫలము.