
కార్తీకమాసం శివ-కేశవులకి ఇరువురికి అత్యంత ప్రీతికరమైనది .ఈ కార్తీక మాసంలో పరమేశ్వర కృపకై శివునికి అభిషేకంచేయడం&మహావిష్ణు ప్రీతికై దీపములు వెలిగించడం రెండూ అత్యంత ముఖ్యమైనవి. ఈ కార్తీక మాసంలోఅందరిచేత ఈ రెండు పుణ్యప్రదమైన కార్యములు చేయించాలనే సంకల్పంతో ఈరోజు మంగళవారం 29/11/2016 కార్తీక అమావాస్య.కార్తీకమాసంలో చివరి రోజు కావున గాయత్రీవేదపీఠం మరియు సాయినగర్ సాయిబాబా మందిరముల ఆధ్వర్యంలో సాయినగర్ కాలనీ రోడ్ నెం.3 పార్కులో సాయంత్రం 5 గం ల నుండి సహస్ర కలశ అభిషేకం & సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమం ఏర్పాటుచేయటమైనది. అందరూ స్వయంగా అభిషేకం చేసుకునేందుకు మరియు దీపములు వెలిగించేందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.కావున ఈఅవకాశమును వినియోగించుకొని అందరూ పాల్గొని శివుణ్ణి అభిషేకించి పరమేశ్వర కృపను దీపములను వెలిగించడం ద్వారా మహావిష్ణు కృపను పొందవలసింది గా మనవి...