పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది. ఆసుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆడుకునేది సుశీల. ఇలాకొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. అత్త గారి ఇంట మహదైశ్వైర్యవంతులు అయ్యారు.పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా! నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒకకర్రను దోలిఛి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రను మరచి వెళ్ళిపోయాడు. ఆ కర్రను ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా కర్రను ఏక్కడో మరచి పొయాను అని చెప్పెను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి. ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకునివెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను. సరే అని తీసుకునివెళ్లి మార్గమద్యలో దాహంవేసి ఒక చేరువుగాట్టును చెప్పులు మూట పెట్టి నీరుతాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాదపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను. మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే వుందని చెప్పెను. అప్పుడు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకు వస్తుండగా సాయంసమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు. ఇంతలో ఒకబాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను. ఆ కుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు. ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్ళకు. తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతిచి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమివేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. ఆమెకూడా అలాగే నేనేమైనా చిన్నదాననా? ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్థి(రాత్రి పూట మిగిలిన అన్నం)అన్నంపెట్టి నోటిలో ఒకముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగినది తల్లిచెప్పినది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది. ఆవారం కూడా వ్రతం చేయవీలుకాలేదు. మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగా వుండమని చెప్పినది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయినది. కూతురు మాత్రమే చేసుకున్నది. నాలగవ వారం ఈసారి అయినా చాలజాగ్రత గావుండమని చెప్పి సుశీల తల్లిని ఏ పని చేయకుండా వుండమని ఒక దగ్గర కదలకుండ కూర్చోబెట్టినది. పని అయిన తరువాత అమ్మకు స్నానం చేసిరమ్మని,తొందరగా పూజచేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజచేసుకొని. ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం . అప్పుడు సుశీల తల్లిని తన కోంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లికి వెంబడి వుండి స్నానం చెయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది. అమ్మ దేవి మీరు అలా వెళ్ళిపోతున్నారు అని అడుగగా.... నీ చిన్నతనం లో నీవు బొమ్మలు తో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసినదానికి క్షమించమని ప్రార్ధించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యం అయ్యినది మహాలక్ష్మి. సరే అని మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, నిమ్మనం, మూడవ వారం అప్పాలు, పాయసము, నాల్గవ వారం పులిహొర, గారెలు, పుష్యమాసం లో మొదటి వారం లో పూర్ణపుకుడుములు వడ్డించి తల్లిచే నోము చెయించింది. కధ విని అక్షింతలు తలమీద వేసుకున్నది అప్పటినుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కధా లోపమైనను వ్రత లోపము కారాదు. భక్తి తప్పినను ఫలము తప్పదు. కావున ప్రతి వనిత ఈ వ్రతంను ఆచరిస్తే ఈ కధలో సుశీల వలె పుట్టింటికి,మెట్టినింటికి ఆ...మహాలక్ష్శీ అనుగ్రహించి అంత్యమందు విష్ణు సన్నిధికి చేరుకుందురు.
Friday, 2 December 2016
![sandhehalu - samadhanalu](http://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhzrpzxjh9PzIDNb41A74CL3lty4RfGs6sdNtokxQvydizUMnXM1TDlQgtv_tnVyec6VUFyd3ZQDf_c5oN82kbouMx4WlOwcXQvBcbbs7uh3pwd9QB8dJDjGj6uYNwHDQ/s113/IMG_20160921_084742.jpg)
Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!
Next
« Prev Post
« Prev Post
Previous
Next Post »
Next Post »
E-mail Newsletter
Sign up now to receive breaking news and to hear what's new with us.
WERE SOCIAL
Labels
- Quotes
- అయ్యప్ప
- ఆంజనేయ
- ఆరోగ్యం
- కథలు
- కార్తిక
- కృష్ణ
- క్షేత్ర మహత్యం
- చరిత్ర
- జ్యోతిష్యం
- తత్వశాస్త్రం
- తిరుప్పావై
- నది
- నవగ్రహ
- నాగేంద్రుడు
- నీతి
- నొములు - వ్రతములు
- పండుగలు
- పద్యాలు
- పాట
- పాటలు
- పుణ్యక్షేత్రం
- పురాణాలు
- పుష్యం
- పూజలు
- బుధ
- బ్లాగ్
- భక్తి
- భగవత్గితా
- భజన
- భాగవతం
- మంత్రాలు
- మహాభారతం
- మాఘ
- మార్గశీర్షం
- మోక్షమార్గం
- రామాయణం
- వార్తలు
- శని
- శివ
- శ్రావణమాసం
- సంస్కృతి
- సూక్తులు
- సూర్య
- హయగ్రీవ