శకుంతలాదేవి జననం శకుంతలా దేవి
నవంబరు 4, 1929
బెంగళూరు, ఇండియా
మరణం: ఏప్రిల్ 21 2013 (వయసు 83)
బెంగళూరు, కర్ణాటక,
భారత దేశం
బెంగళూరు, కర్ణాటక,
భారత దేశం
మరణానికి కారణం గుండెపోటు
జాతీయత భారతీయురాలు
ఇతర పేర్లు మానవ గణన యంత్రం (హ్యూమన్ కంప్యూటర్)వృత్తిగణిత శాస్త్రవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త
ఇతర పేర్లు మానవ గణన యంత్రం (హ్యూమన్ కంప్యూటర్)వృత్తిగణిత శాస్త్రవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త
శకుంతలా దేవి (నవంబర్ 4, 1929 – ఏప్రిల్ 21, 2013) ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ మరియు జ్యోతిష శాస్త్రవేత్త. ఈమెను అందరూ మానవ గణన యంత్రము అని పిలుస్తారు. ఈమె ప్రపంచవ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి గణన యంత్రము కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించింది. పలు పుస్తకాలను కూడా రచించింది. ప్రపంచంలో అతి వేగంగా గణనలు చేయుటలో గిన్నిస్ వరల్డ్ రికార్డును స్వంతం చేసుకున్నది.
*జీవితం*
శకుంతలా దేవి బెంగళూరు నగరంలో కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఆలయ పూజారి అగుటకు వ్యతిరేకించి ఒక సర్కస్ కంపెనీలో చేరి తాడుతో చేసే విన్యాసములు చేయుటకు నియమింపబడ్డాడు
*ఘనతలు*
1977లో అమెరికాలో ఓ కంప్యూటర్తోశకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్ ను ఓడించేశారు. ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు. 76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నెస్ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు.ఆరేళ్ల వయసులో తొలిసారి శకుంతలా దేవిమైసూరు విశ్వవిద్యాలయంలో తన గణిత ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు.ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆమె ప్రదర్శనతో శకుంతలాదేవిని బాలమేధావిగా గుర్తించారు.గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు.1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు.
*మరణము*
తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో గుండె, మూత్రపిండాల సమస్యలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.
*రచనలు*
ఆమె ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథెబ్లిట్ లాంటి పుస్తకాలు రాశారు