Tuesday 31 January 2017

నారాయణునవైషమ్యాభావం 7-2-వ


మహనీయ గుణగరిష్ఠు లగు న మ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుం డయిన సూతుం డి ట్లనియె; నట్లు ప్రాయోపవిష్టుం డయిన పరీక్షిన్నరేంద్రుడు శుకయోగీంద్రు నవలోకించి.

ప్రతిపదార్ధము

మహనీయ = గొప్ప; గుణ = సుగుణములచే; గరిష్ఠులు = మిన్నలు; అగు = ఐన; ఆ = ఆ; ముని = మునులలో; శ్రేష్ఠుల్ = ఉత్తముల; కున్ = కు; నిఖిల = సమస్తమైన; పురాణ = పురాణములను; వ్యాఖ్యాన = వివరించెడి; వైఖరీ = వాక్శక్తి; సమేతుండు = కలిగియున్నవాడు; అయిన =ఐన; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; అట్లు = ఆ విధముగ; ప్రాయోపవిష్టుండు = ప్రాయోపవేశముననున్నవాడు {ప్రాయోపవేశము - అన్నపానాదులు విడిచిమరణమున కెదురు చూచుచుండు నిష్ఠ, ఆమరణనిరాహారదీక్ష}; అయిన = ఐనట్టి; పరీక్షిత్ =పరీక్షిత్తుయనెడి; నరేంద్రుడు = మహారాజు; శుక = శుకుడుయనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = ఇంద్రునివంటివానిని; అవలోకించి = దర్శించి.

భావము

గొప్ప గుణములు కలిగిన ఆ మునీశ్వరులతో అఖిల పురాణాలను వివరించటంలో నేర్పరి అయిన సూతమహర్షి ఇలా అన్నాడు. "ప్రాయోపవేశం చేసి ఉన్న పరీక్షిత్తు మహారాజు శుకమహర్షిని చూసి"

తెలుగుభాగవతం

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles